mislead
-
వికీపీడియాకు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెబ్సైట్లో కచ్చితత్వం లేని కూడిన సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. కాగా ఇటీవలే వికీపీడియాపై న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ సంస్థ పరువుకు భంగం కలిగించే విధంగా వికీపీడియా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టులో రూ. 2 కోట్ల పరువునష్టం దావా వేసింది. దీనిపై కోర్టు కూడా వికీపీడియాకి చీవాట్లు పెట్టింది. ‘కోర్టు ధిక్కార నోటీసులు’ కూడా జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారత్ తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని తెలిపింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
బోరిస్ కావాలనే తప్పుదోవ పట్టించారు
లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పార్లమెంట్‌ను ఉద్దేశపూర్వకంగా పదేపదే తప్పుదోవ పట్టించారని పార్లమెంటరీ కమిటీ ఆరోపించింది. ప్రధానిగా ఉండగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికార నివాసంలో జరిగిన విందుల గురించి తనకు తెలియదనడంపై ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ సమయంలో జరిగిన విందులనే పార్టీ గేట్ కుంభకోణంగా పేర్కొంటున్నారు. ‘సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించిన జాన్సన్ తీవ్రమైన ధిక్కారానికి పాల్పడ్డారని భావిస్తున్నాం. ఈ ధిక్కారం మరింత తీవ్రమైంది’అని పార్లమెంట్ హక్కుల కమిటీ పేర్కొంది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ జాన్సన్ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జాన్సన్ చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు ఆయన్ను 90 రోజుల పాటు బహిష్కరించాలని సూచించింది. రాజీనామా చేసినందున..మాజీ సభ్యులకిచ్చే పాస్‌ను జాన్సన్‌కు ఇవ్వొద్దని పేర్కొంది. -
తప్పుదోవ పట్టిస్తున్న ఈ-కామర్స్ ఉత్పత్తులు
తరచుగా పునరావృతమయ్యే సామెత - పరిశుభ్రతే దైవం. ఇది వ్యక్తిగత పరిశుభ్రత సారాంశం.. ఆవశ్యకతను తెలుపుతుంది. అంతేకాదు, శుభ్రంగా ఉండటమనేది భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటుంది. తొలుత, ప్రజలు అందంగా కనబడేందుకు ఈ ఆధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు లేని వేళ సహజ సిద్ధమైన ఉత్పత్తులు వాడుతుండేవారు. అయితే, శాస్త్రీయ ఆవిష్కరణల కారణంగా విస్తృతశ్రేణిలో అత్యాధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. తల్లులు, శిశువుల ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో తమదైన వాటాను ఆక్రమించుకుంటున్నాయి. వృద్ధి చెందుతున్న ఆదాయం, స్థిరమైన జీవితంతో ప్రజలు ఇప్పుడు ఈ తరహా వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అవి సహజసిద్ధంగా మరియు ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేరొందిన కంపెనీలు అయిన హిమాలయ, డాబర్, ఇమామీ మరియు ఈ విభాగంలో ఇతర ఆయుర్వేద కంపెనీలు ఉన్నప్పటికీ, స్థిరంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్అదే తరహా వృద్ధి అవకాశాలను నూతన కంపెనీలకు కూడా అందిస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన నూతన ఈకామర్స్బ్రాండ్స్, తమ తల్లులు, పిల్లల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యంత సహజమైనవని వాదిస్తుండటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే, తమకు అత్యంత ప్రజాదరణ తీసుకువచ్చిన ఈ వాదనలలోని ఆధీకృత ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే చాలా వరకూ ఉత్పత్తులలో లేబులింగ్ మరియు ధృవీకరణలలో పారదర్శకత అనేది లోపించింది. బహుశా, తమ ఉత్పత్తులను మార్కెట్చేయడం, తమ వినియోగదారుల సంఖ్యను వృద్ధి చేసుకోవడం మరియు అమ్మకాలను రెట్టింపు చేసుకోవడానికి నూతన తరపు కంపెనీలు తమ ఉత్పత్తులను సహజసిద్ధమైనవని తప్పుగా పేర్కొంటున్నాయి. తమ ఉత్పత్తులలో రసాయనాలు ఉన్నప్పటికీ అవి శాస్త్రీయంగా హానికారకం కాదని నిరూపితం కాలేదు. వాటినే వారు సహజసిద్ధమని వెల్లడిస్తున్నారు. కానీ రసాయనాలతో కూడిన ఓ ఉత్పత్తి సహజసిద్ధమైనది ఎందుకు అవుతుంది ? దీనికి సరైన నియంత్రణ వ్యవస్థ మరియు ధృవీకరణ ప్రక్రియ లేకపోవడం కూడా కారణమే అని డాక్టర్శర్మ అన్నారు. వినియోగదారు స్నేహ మాట్లాడుతూ.. 'ఇప్పుడు మార్కెట్లో ఎన్నో బేబీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిలోని కొన్ని పదార్థాలు హానికారకమైనవి. కానీ బాధ పడే అంశం ఏమిటంటే, చాలామంది ప్రజలకు ఈ ఉత్పత్తులు చేసే హాని గురించి తెలియకపోవడం మరియు ఆ ప్రకటనలను చూసి చాలామంది వాటిని వినియోగిస్తుంటారు. బేబీ ఉత్పత్తులను వినియోగించడమన్నది వ్యక్తిగత ఎంపిక. నేను మా పిల్లలకు టాల్కమ్ పౌడర్రాయను. ఎందుకంటే చిన్నారుల చర్మానికి టాల్క్ మంచిది కాదు. చిన్నారుల చర్మం మృదువైనది. అందువల్ల ఉత్పత్తుల ఎంపికలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి చర్మంపై ర్యాషెస్వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఉత్పత్తులు ఖచ్చితంగా అతి తక్కువ రసాయనాలు మాత్రమే కలిగి ఉండాలి. సాధారణంగా ప్రజలు ఆ ఉత్పత్తుల యొక్క ఆధీకృతను పరిశీలించరు. లేబుల్స్చూసి వాటిని కొంటుంటారు. కానీ ఎన్నో సార్లు ఈ తరహా ఉత్పత్తులు మీ పాపాయి చర్మంపై హానికారక ప్రభావం చూపవచ్చు. అందువల్ల, ప్రతి వినియోగదారుడూ ఈ ఉత్పత్తులు సహజసిద్ధమైనవా లేదా అని పరిశీలించడంతో పాటుగా కొనేందుకు ముందు వాటిని పరిశీలించాలి’ అని అన్నారు. మార్కెట్లో ఇప్పుడు ఈ తరహా ఈ- కామర్స్ కంపెనీలు విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కూడా తమ ఉత్పత్తులు సహజసిద్ధమైనవని వెల్లడిస్తున్నాయి. ఉత్పత్తి మార్కెట్లో ప్రతి కంపెనీకీ ఎదిగేందుకు హక్కు ఉంది. కానీ తప్పుడు వాదనలు వాంఛనీయం కాదు. ప్రకటనలు, ప్యాకేజింగ్మరియు లేబులింగ్వంటివి వినియోగదారులకు ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించేందుకు మరియు ఉత్పత్తి సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినవి. అందువల్ల వారు సమాచారయుక్త ప్రాధాన్యతలను అందించాల్సి ఉంది. అయితే, దురుద్దేశ్యంతో చేసే లేబులింగ్‌ను ఖచ్చితంగా నివారించాలి. అంతేకాదు, వినియోగదారులు సమాచారంతో కూడిన కొనుగోలుదారుడు కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల, మనమంతా కూడా ఓ ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు పలు కోణాల్లో దానిని పరిశీలించాల్సి ఉంది. ప్రకటనలు, లేబులింగ్‌పై ఆధారపడి వాటిని కొనకూడదు. ఈ ఉత్పత్తులలోని వ్యత్యాసాలు మనకు అంటే వినియోగదారులకు హానికలిగిస్తాయి. -
చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం
న్యూఢిల్లీ: చట్ట స్ఫూర్తిని ఉల్లంఘించొద్దని పరిశ్రమకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హితవు పలికారు. రౌండ్ ట్రిప్పింగ్ (ఒకరి నుంచి ఒకరు చేతులు మార్చుకోవడాన్ని) వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ‘‘ఏ తప్పూ చేయని వారికి ఎటువంటి సమస్య ఉండదని నేను భరోసా ఇస్తున్నాను. కానీ, అదే సమయంలో తప్పుడు పనుల్లో పాల్గొనే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. దేశ సంస్కృతి, మైండ్‌సెట్‌ను మార్చేస్తాం’’ అని పీయూష్ గోయల్ సీఐఐ సభ్యులతో సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు. న్యాయవాదులు, అంతర్జాతీయంగా నాలుగు అతిపెద్ద ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థలు (పీడబ్ల్యూసీ, డెలాయిట్, కేపీఎంజీ, ఈఅండ్‌వై) ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. భారత చట్ట స్ఫూర్తికి విరుద్ధమైన సలహాలు ఇవ్వొద్దని పరోక్షంగా హెచ్చరించారు. బహుళ బ్రాండ్ల ఉత్పత్తుల రిటైల్ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) చట్టాన్ని కంపెనీలు గౌరవించాలని, లొసుగుల ద్వారా దీన్నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దని హితవు పలికారు. చట్టానికి అనుగుణంగా... ‘‘మల్టీ బ్రాండ్ రిటైల్‌లో 51 శాతం వరకు ఎఫ్‌డీఐని అనుమతించే విధానం అమల్లో ఉంది. దీనికి కట్టుబడి ఉన్నాం. ప్రతీ ఒక్కరూ దీన్ని అనుసరించాలి, గౌరవించాలి. చట్టానికి అనుగుణంగా ఉన్నంత వరకు సమస్య ఏమీ ఉండదు’’ అని మంత్రి పేర్కొన్నారు. చట్టానికి అనుగుణంగా నడచుకోండి. రౌండ్ ట్రిప్పింగ్‌ను చట్టం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. మీలో ఎవరైనా అది చేసుంటే అంగీకరించి ప్రక్షాళన చేసుకుని, ఆ అధ్యాయానికి ముగింపు పలకండి’’ అని మంత్రి సూచించారు. దొడ్డిదారిన వచ్చిన వారు బయటపడే మార్గం కోసం కామా, పుల్‌స్టాప్‌లను వెతకొద్దన్నారు. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై గోయల్ స్పందిస్తూ... చట్టంలో కొన్ని నిబంధనలు భారంగా ఉన్నాయని, వాటిని సభ్యదేశాల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎగుమతిదారులకు విదేశీ మారక రుణాలు ఎగుమతిదారులకు విదేశీ మారక రూపంలో రుణాలను సమకూర్చే విషయంలో బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఖజానాపై పెద్దగా భారం పడకుండా, ఖరీదైన రుణ సమస్యను పరిష్కరించే మార్గాలున్నాయని చెప్పారు. వాణిజ్యానికి సంబంధించి ఏ అంశానికైనా సబ్సిడీలన్నవి పరిష్కారం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా విదేశీ కరెన్సీ రుణాలు సమకూర్చనున్నామని, బ్యాంకులతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఈ విషయం లో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రాల పన్నులను ఎగుమతిదారులకు తిరిగి చెల్లించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 50 బిలియన్ డాలర్ల ఎగుమతులకు అవకాశాలున్నాయని వాణిజ్య శాఖ మదింపు వేసినట్టు చెప్పారు. -
గాడితప్పిన విద్యా వ్యవస్థ
–విద్యా సంవత్సం ముగుస్తున్నా పిల్లలకు అందని యూనిఫాం – కంప్యూటర్లున్నా బోధించేవారు లేరు – పిల్లలున్న చోట టీచర్లు లేరు – టీచర్లు ఉన్న చోట పిల్లలు లేరు కదిరి : సర్కారు బడి అనగానే అక్కడ పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఉంటారన్నది అక్షర సత్యం. అలాంటి పిల్లలు చదివే చోట మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా జిల్లా విద్యా వ్యవస్థ నడుస్తోంది. విద్యాసంవత్సం ముగింపు దశకు వస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాం అందజేయలేదు. 100 మంది పిల్లలున్న చోట ఇద్దరు, 20 మంది ఉన్న చోట నలుగురు ఉపాధ్యాయులున్నారు. ఈ పరిస్థితి జిల్లాలో చాలా చోట్ల ఉంది. సాంకేతిక విద్య పేరుతో అన్ని పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేసినా... బోధించేందుకు ఫ్యాకల్టీలు లేరు. జిల్లాలో 3,164 ప్రాథమిక, 957 ప్రాథమికోన్నత, 676 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటన్నింటిలో 14,402 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. ఏ పాఠశాలను పరిశీలించినా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా సమస్యలు తిష్ట వేశాయి. విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకూ ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సమస్యలు ఇలా.. ూ ఈ విద్యాసంవత్సరం మార్చితో ముగియనుంది. కానీ ఇప్పటి దాకా పిల్లలకు యూనిఫాం సరఫరా చేయలేదు. దీంతో చిరిగిన దుస్తులతోనే హాజరవుతున్నారు. - జిల్లా వ్యాప్తంగా 80 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. కొన్ని పాఠశాలల్లో ఉన్నా.. నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో పిల్లలే కాకుండా మహిళా టీచర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. -చాలా పాఠశాలలకు అటెండర్లు లేరు. స్వీపర్లు అసలే లేరు. ఈ రెండు పనులూ విద్యార్థులతోనే కానిచ్చేస్తూ పాఠశాల స్థాయిలోనే బాలకార్మికులుగా మార్చేస్తున్నారు. -ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నప్పటికీ వాటిని పిల్లలకు తెలియజెప్పేందుకు బోధకులు లేరు. వాటి రక్షణకు నైట్ వాచ్మ్యాన్లు కూడా లేరు. -చాలా పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. - జిల్లా వ్యాప్తంగా చాలా మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేరు. దీంతో ఆయా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడే ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన రెండింటికీ న్యాయం చేయలేక పోతున్నారు. - ఉపాధ్యాయులకు విద్యాసంవత్సం మధ్యలో టీఏఆర్‌సీ, ఆర్‌ఎంఎస్‌ఏ లాంటి శిక్షణా తరగతులు నిర్వహించడం వలన సింగిల్ టీచర్ ఉన్న చోట బడులు మూతబడుతున్నాయి. దీంతో రెగ్యులర్ సిలబస్ పూర్తి చేయలేక పోతున్నారు. - ఉపాధ్యాయులకు న్యాయబద్దంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన రెండు డీఏలు, పది నెలల అరియర్స్, సర్వీస్ రూల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. హెల్త్ కార్డులున్నా వాటితో టీచర్లకు నగదు రహిత వైద్యం అందడం లేదు. -
అదుపుతప్పిన శాంతిభద్రతలు
– ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల సమీపంలోనే హత్యలు – డీజీపీ సొంత జిల్లాలో ప్రశ్నార్థమైన లా అండ్ ఆర్డర్ – జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిర్లిప్తత – ఎస్పీ రాజశేఖర్‌బాబు బాధ్యతలు తీసుకుని నేటితో రెండేళ్లు పూర్తి (సాక్షి ప్రతినిధి, అనంతపురం) : 2015 మార్చి 31 : తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో సింగిల్‌విండో అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నేత విజయభాస్కర్‌రెడ్డిని సొసైటీ కార్యాలయంలోనే టీడీపీ నేతలు హత్య చేశారు. –2015 ఏప్రిల్ 29 : రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ మాజీ మండల కన్వీనర్ ప్రసాదరెడ్డిని హæత్య చేశారు. –2016 జూలై 21 : అనంతపురం నాలుగో పట్టణ æపోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో గోపీనాయక్, వెంకటేశ్‌నాయక్‌లను హతమార్చారు. ఈ మూడు సంఘటనలే కాదు...టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ‘అనంత’లో తరచూ ఎక్కడో ఒకచోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ 8 హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీలో చురుకైన నేతలు, కార్యకర్తలను తుదముట్టడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తద్వారా జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరిచి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందేలా ఇప్పటి నుంచే ‘అరాచక ప్రణాళిక’ను రచించారు. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సున్నిత ప్రాంతాలను గుర్తించి శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు పరిశీలకులు విమర్శిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ వైఖరితో ప్రతిపక్షపార్టీ శ్రేణులతో పాటు సామాన్యప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ మృదు స్వభావమే కొంప ముంచుతోందా? ఎస్పీ రాజశేఖర్‌బాబుకు మృదుస్వభావిగా పేరుంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన కిందనున్న కొందరు కీలక పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చాలా సర్కిళ్లలో సీఐలు, ఎస్ఐలను ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినవారినే నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి/ఎమ్మెల్యే అండ ఉంటే చాలని, ఎవ్వరు అడ్డొచ్చినా తన ‘సీటు’ పదిలమనే ధీమాతో కొందరు సీఐలు, ఎస్ఐలు పనిచేస్తున్నారు. ఉన్నతాధికారులను సైతం బైపాస్ చేసి వెళుతున్నారు. పేకాట, మట్కా, క్రికెట్‌బెట్టింగ్‌లు జరుగుతున్నా కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇంకొంతమంది స్టేషన్లలో స్థలవివాదాలతో పాటు పంచాయితీలు చేస్తున్నారు. ఎస్పీ దృష్టికి వచ్చిన ఘటనలపై ఆయన తక్షణ చర్యలు తీసుకుంటున్నా.. దృష్టికి రానివి మాత్రం చాలానే ఉన్నాయి. ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతుభరోసా యాత్రలో పామిడి సీఐ నరేంద్రరెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్థాయి టీడీపీ నేతలు రోడ్డుపై ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలిసి ప్రతిపక్షనేత కాన్వాయ్‌ని ముందుకు వెళ్లకుండా నరేంద్రరెడ్డి అడ్డుపడ్డారు. ‘గ్రామస్థాయి లీడర్లు ఆందోళన చేస్తే వారిని అదుపు చేయకుండా.. ప్రతిపక్షనేత కాన్వాయ్‌ను ఆపడమేంటని’ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తే...‘గ్రామస్థాయి అయినా, మండలస్థాయి అయినా వారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నవారికి, లేనివారికి తేడా ఇలాగే ఉంటుంది’ అంటూ అధికార పార్టీకి తాము అనుకూలంగా వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు రెండేళ్లుగా పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవడానికి. ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మారతాయి. కానీ పోలీసుల పనితీరును ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారు. మొత్తం మీద ఎస్పీ రెండేళ్లలో కొన్ని వినూత్న, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మంచిపేరు తెచ్చుకున్నా, శాంతిభద్రతల పరిరక్షణలో మాత్రం వెనుకబడ్డారనే భావన ప్రజల్లో నెలకొంది. -
బంగారానికి మెరుగు పేరుతో మోసం
ఖమ్మం : బంగారానికి మెరుగు పెడతామని ఓ వృద్ధురాలిని ఇద్దరు దుండగులు మోసగించారు. 1.80లక్షల రూపాయల విలువైన నగలను చోరీ చేశారు. ఖమ్మం వన్ టౌన్ రైటర్ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం... బ్రాహ్మణ బజార్లో నివసిస్తున్న న్యాయవాది శేషాద్రి శిరోమణి ఇంటికి బుధవారం సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి, బంగారానికి మెరుగు పెడతామని చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో ఆ న్యాయవాది తల్లి సీతమ్మ ఒక్కరే ఉన్నారు. వారిని నమ్మిన ఆ వృద్ధురాలు... తన బంగారపు గాజులను మెరుగు పెట్టేందుకని వారికి ఇచ్చింది. వారు వాటిని తీసుకుని, మెరుగు పెట్టినట్టుగా నటించారు. ఆ తరువాత పొయ్యిపై గిన్నెలో నీటిని మరిగించి వాటిని అందులో వేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ నీటి నుంచి నగలను తీసుకోవచ్చని చెప్పి, మెరుగు పెట్టినందుకు డబ్బులు తీసుకుని వెళ్లిపోయూరు. వారు వెళ్లిన కొద్దిసేపటి తరువాత ఆ గిన్నెలో బంగారపు గాజులు కనిపించలేదు. వాటిని ఆ ఇద్దరు యువకులే కాజేశారని గ్రహించిన ఆమె లబోదిబోమంటూ తన కూమారుడికి సమాచారమిచ్చింది. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కొన్ని రోజుల క్రితం పోలీస్ శాఖ విశ్రాంత ఉద్యోగి(రిటైర్డ్ సీఐ)ని ఇలాగే మోసగించి లక్షల రూపాయల విలువైన బంగారపు నగలు చోరీ చేశారు. -
ప్రజలను మభ్యపెట్టేందుకే
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఎన్నికల ముందు లేనిపోని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అందలం ఎక్కిన సీఎం చంద్రబాబు నాయుడు ఇకపై కూడా జనాన్ని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారని ఎమ్మెలే ్య ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇందుకు సింగపూర్ పర్యటన ఓ నిదర్శనమని పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబులో మార్పు వచ్చిందని నమ్మి ప్రజలు గెలిపించారని చెప్పిన ఎమ్మెల్యే ఎస్వీ ఆయనలో మార్పు అనేది కొత్త సీసాలో పాత సారాలాంటిదని ఎద్దేవా చేశారు. కర్నూలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగపూరులో వారికే పరిశ్రమలు తక్కువగా ఉన్నాయని, అలాంటప్పుడు అక్కడ నుంచి 20 మంది పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పడం ప్రజలను నమ్మించేందుకు సీఎం చేస్తున్న ఓ ప్రయత్నమని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రుణాల మాఫీ హామీని నెరవేర్చడంలో బాబు అనేక షరతులు విధిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన రాజశేఖర్‌గౌడ్‌ను టీడీపీ వైపు తిప్పుకుని అప్పట్లో జెడ్పీఛైర్మన్ పదవిని కాజేశారని గుర్తు చేసిన ఆయన కల్తీకల్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఆ సీట్లో ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. -
ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం!
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలక పాత్ర ఉంటుంది. ప్రజాసమస్యలను శాసనసభలో గొంతెత్తి చాటేది ప్రతిపక్షమే. అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేసేది ప్రతిపక్షమే. అటువంటి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం ఈరోజు ఏపి శాసనసభలో అధికార టిడిపి పక్షసభ్యులు చేశారు. శాంతి భద్రతల అంశంపై జరిగే చర్చను పక్కదోవ పట్టించారు. తాము అధికారపక్షమనే విషయం కూడా మరచి తమ ఇష్టంవచ్చిన రీతిలో మాట్లాడారు. వ్యవహరించారు. దాదాపు 18 సార్లు అన్‌పార్లమెంటరీ పదాలు వాడారు. దాంతో సభలో గందరగోళం పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సభను పలుసార్లు వాయిదా వేయవలసి వచ్చింది. వాస్తవానికి ఈరోజు బడ్జెట్‌పై మాట్లాడాల్సి ఉండగా, శాంతిభద్రతల అంశంపై చర్చను కొనసాగించి వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిష్కరించవలసిన అనేక సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగి సభాసమయం వృధా చేశారు. అధికార పార్టీ ఎన్నికల హామీల అమలు అంశం చర్చకు వస్తే ప్రభుత్వం ఇరుకున పడుతుందనే భయంతో ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తూ సభను స్తంభింపజేశారు. సభను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచారన్న భావన వ్యక్తమవుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజులలో జరిగిన 11 హత్యలపై చర్చజరపాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి కోరారు. ఆ హత్యలకు సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వకుండా అధికార పక్ష సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, జగన్మోహన రెడ్డికి గాని సంబంధంలేని గతంలో ఎప్పుడో జరిగిన హత్యలు గురించి ప్రస్తావించి వ్యక్తిగత విమర్శలకు దిగారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు. హత్యలపై సభలో చర్చ కోసం ప్రతిపక్షం పట్టుబడుతున్న సందర్భంలోనే గుంటూరుజిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఇద్దరిని హత్య చేశారు. అనంతపురం జిల్లా శింగనమలలో మరొకరిని హత్య చేశారు. 3 నెలల కాలంలో మొత్తం 14 హత్యలు జరిగినట్లు జగన్ సభకు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా అధికార పక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సభలో వైఎస్ జగన్మోహన రెడ్డి ఆరోపించారు. అసత్య ఆరోపణలతో తమపై ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. అధికార పార్టీ వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్ సిపి వాకౌట్ చేసింది. శాసన సభలో ఎమ్మెల్యే లేక ప్రతిపక్షనేత వాకౌట్ చేస్తున్నప్పుడు వారికి మైకు ఇస్తారు. కాని దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ప్రతిపక్ష నేతకు మైకు కూడా ఇవ్వలేదు. - శిసూర్య