ఎన్నికల ముందు లేనిపోని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అందలం ఎక్కిన సీఎం చంద్రబాబు నాయుడు ఇకపై కూడా జనాన్ని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారని....
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఎన్నికల ముందు లేనిపోని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అందలం ఎక్కిన సీఎం చంద్రబాబు నాయుడు ఇకపై కూడా జనాన్ని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారని ఎమ్మెలే ్య ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇందుకు సింగపూర్ పర్యటన ఓ నిదర్శనమని పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబులో మార్పు వచ్చిందని నమ్మి ప్రజలు గెలిపించారని చెప్పిన ఎమ్మెల్యే ఎస్వీ ఆయనలో మార్పు అనేది కొత్త సీసాలో పాత సారాలాంటిదని ఎద్దేవా చేశారు.
కర్నూలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగపూరులో వారికే పరిశ్రమలు తక్కువగా ఉన్నాయని, అలాంటప్పుడు అక్కడ నుంచి 20 మంది పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పడం ప్రజలను నమ్మించేందుకు సీఎం చేస్తున్న ఓ ప్రయత్నమని ఆరోపించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన రుణాల మాఫీ హామీని నెరవేర్చడంలో బాబు అనేక షరతులు విధిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన రాజశేఖర్‌గౌడ్‌ను టీడీపీ వైపు తిప్పుకుని అప్పట్లో జెడ్పీఛైర్మన్ పదవిని కాజేశారని గుర్తు చేసిన ఆయన కల్తీకల్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఆ సీట్లో ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు.