Chief Chandrababu Naidu
-
సదస్సు నిర్వహించే అర్హత ఎక్కడిది?
రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎంపై పలువురు మహిళా నేతల మండిపాటు సాక్షి, అమరావతి: ‘మహిళల హక్కులను ఏమాత్రం కాపాడలేని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహించే అర్హత, హక్కు ఏమాత్రం లేదని మహిళా సంఘాలు గొంతెత్తాయి. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత–సవాళ్లు’అనే అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, ప్రభుత్వ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు తప్పుడు వాగ్దానం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర రాజధానిలో నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు మాత్రం డ్వాక్రా గ్రూపు సభ్యులకు ప్రాతినిథ్యం లేకుండా చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలపై శుక్రవారం నుండి మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సమావేశంలో చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేంలో మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య మాట్లాడుతూ మహిళలు సంఘటితం కావాలన్నారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో రాష్ట్రానికి చెందిన మహిళా నేతలకు ప్రాతినిథ్యం కల్పించకపోవడం దురదృష్టకరమని చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నా చర్యలేవని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమనీ మహిళాలోకానికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎఫ్డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అక్కినేని వనజ డిమాండు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పి.శ్రీలక్ష్మి మాట్లాడుతూ డ్వాక్వా రుణమాఫీ పేరుచెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు తర్వాత అమలు చేయకుండా మహిళల్ని మోసం చేశారన్నారు. ఇతర మహిళా నేతలు కూడా తమ ప్రసంగాల్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
అసమ్మతి సెగ...అధినేత పొగ
- గంటా తీరుపై సీఎం అసంతృప్తి - సర్వే ఫలితాలే సంకేతం - పెరుగుతున్న వైఫల్యాల చిట్టా - మంత్రి శిబిరంలో మొదలైన గుబులు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు చాపకిందకునీళ్లు వస్తున్నాయా!?... ఇన్నాళ్లు జిల్లాలో వైరివర్గాల పోరుతోనే సతమతమవుతున్న ఆయనపై అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నారా!?... టీడీపీలో తాజా పరిణామాలు అవుననే సంకేతమిస్తున్నాయి. ఇంటా బయటా ఆయన రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్వహించినట్లుగా చెబుతున్న సర్వేలో గంటాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయన్న సమాచారం టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘గంటా పని అయిపోయిం ది’అని నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించారని టీడీపీవర్గాలు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో మంత్రివర్గ పునర్వ్వస్థీకరణ ఉండొచ్చనే సంకేతాల నేపథ్యంలో తాజా పరిణామాలు గంటా వర్గంలో గుబులు మొదలైంది. ఇంటా బయటా గడ్డు పరిస్థితి: జిల్లాలో మంత్రి అయ్యన్నవర్గంతో గంటాకస నిత్య కలహమే. అయ్యన్న వర్గానికి బాలకృష్ణ, సీఎం కుమారుడు లోకేష్ మద్దతు ఉందన్న ప్రచారం గంటాను కలవరపరుస్తోంది. మరోవైపు గంటా వ్యవహార శైలిపట్ల సీఎం చంద్రబాబు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. కీలకమైన వ్యవహారాల్లో గంటా స్వతంత్రంగా వ్యవహరించడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. తెలంగాణా ప్రభుత్వంతో వివాదాలను రాష్ట్రానికి అనుకూలంగా పరిష్కరించడంలో గంటా తగిన చొరవ చూపించలేదన్న ముద్ర పడింది. ఉన్నత విద్యామండలి, ఎంసెట్, తాజాగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం... ఇలా విద్యా శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ రాష్ట్రం మాట చెల్లుబాటు కావడం లేదు. శాఖపై గంటా పట్టుసాధించలేకపోయారని సీఎం భావిస్తున్నారు. మరోవైపు కౌన్సెలింగ్‌తో నిమిత్తం లేకుండా నేరుగా ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఉపాధ్యాయసంఘాలు ఆందోళన చేశాయి. చివరికి సీఎం జోక్యం చేసుకుని కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాలకు చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై కూడా గంటా సత్వరం స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ అంశంలో గంటా వ్యవహారాల శైలిపై అయ్యన్నవర్గం నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేసింది. ఇలా ఒక్కోక్క అంశం గంటాకు వ్యతిరేకంగా పరిణమిస్తూ వచ్చింది. సర్వే చంద్రబాబు సంకేతమా!? : సర్వే ఫలితాలు గంటా వర్గంలో గుబులు పుట్టిస్తున్నాయి. రైతు-డ్వాక్రా రుణమాఫి, పింఛన్లు తదితర ప్రభుత్వ కార్యక్రమాలపై నిర్వహించిన సర్వే ఫలితాలను సీఎం విజయవాడలో ప్రకటించారు. వాటిలో భీమిలి నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని సీఎం పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. సర్వే అన్నదే లేదని... కేవలం గంటాను తప్పించేందుకు దీన్నో అవకాశంగా సీఎం తెరపైకి తెచ్చారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటా పని అయిపోయిందని జిల్లాలో ఆయన వైరివర్గం విసృ్తతంగా ప్రచారం చేస్తోంది. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా కొందరితో మాట్లాడుతూ ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
సరస్వతీ ‘సీమ’
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలు ఏర్పాటుచేసి సరస్వతీసీమగా మార్చుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ఐటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇటీవల బడ్జెట్లో విద్యకు అధిక మొత్తాన్ని కేటాయించామని చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో జిల్లాలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాత్రమే ఉండేదని గుర్తుచేశారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి వెంకయ్యనాయుడుతో స్నేహసంబంధాలు ఉన్నాయన్నారు. మోడీ నాయకత్వంలో వెంకయ్యనాయుడు, స్మృతిఇరానీ సహకారంతో కేంద్రంనుంచి అధికంగా నిధులు సమకూర్చుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగువాళ్లు చాలా మేధావులని అభివర్ణించారు. విదేశాల్లోను ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి హాలిడే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ దేశస్థాయిలో విద్యాభివృద్ధికి దోహదపడతారని తెలిపారు. అయితే కాంగ్రెస్‌వాళ్లు ఆమెకు కనీసం డిగ్రీలు లేవని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. డిగ్రీల కన్నా మేధస్సు ముఖ్యమని, ఆ మేధస్సు ఆమెకుందని కొనియాడారు. స్మృతీ ఇరానీ మాట్లాడుతూ రాష్ట్రవిభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామన్నారు. త్వరలో అనంతపురంలో కేంద్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ర్టమంత్రులు బొజ్జల, కామినేని, నారాయణ, శ్రీనివాసరావు, ఎంపీలు వరప్రసాద్, సీఎం రమేష్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
విజయసాయిరెడ్డి రేపు తణుకు రాక
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను, మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకు.. సీఎం చంద్రబాబు నయవంచన స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో తణుకులో నిర్వహించ తలపెట్టిన దీక్షకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. స్వచ్ఛందంగా లక్షలాది మంది జనం తరలిరానున్న ఈ దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఈ నెల 19న సోమవారం తణుకు రానున్నారు. దీక్షఏర్పాట్లను పరిశీలించడంతో పాటు దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరి స్తారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు హాజరువుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని శనివారం తెలిపారు. దీక్ష ఏర్పాట్లపై చర్చించేందుకు సోమవారం తణుకులో నిర్వహించే సన్నాహక సమావేశానికి జిల్లాలోని పార్టీ నేతలు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గాల కన్వీనర్లు తణుకు రావాలని నాని ఈ సందర్భంగా కోరారు. -
అన్నీ అబద్ధాలే
సీఎం ప్రసంగంపై రైతుల మండిపాటు వ్యవసాయ రుణాల మాఫీపై శాసనసభలో అబద్ధాలు చెప్పిన సీఎం చంద్రబాబు రూ.50వేలలోపు పంటరుణాలను ఒకేసారి మాఫీ చేశామని, ఆ రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయలేదని చెప్పిన బాబు 2007లో ఉన్న ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ధరల ఆధారంగానే రుణ మాఫీ చిన్న, సన్నకారు రైతులను నిలువునా ముంచిన ముఖ్యమంత్రి తిరుపతి: శాసనసభలో సోమవారం నిర్వహించిన చర్చలో రుణమాఫీపై సీఎం చంద్రబాబు చెప్పిన వివరాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో తనను మించిన వారు లేరని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారని మండిపడు తున్నారు. అంతర్గత సమావేశాల్లోనైనా బహిరంగసభలోనైనా.. చివరకు శాసనసభలోనైనా పబ్లిగ్గా పచ్చి అబద్ధాలు చెప్పడంలో తానే మేటి అని మరోసారి ఆయన చాటి చెప్పారని నిప్పులు కక్కుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒక్క సంతకంతో వ్యవసాయ రుణాలను మాఫీ చేసి.. రైతులకు ఉపశమనం కల్పిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ.. అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీ అమలును నీరుగార్చుతూ వచ్చారు. ఒక్కో కుటుంబానికి గరి ష్టంగా రూ.1.5 లక్షల పంట రుణం మాఫీ చేస్తానని పేర్కొన్నారు. ఐదు విడతల్లో రుణాన్ని మాఫీ చేస్తానని సెలవి చ్చారు. రూ.50 వేలలోపు రుణాలను ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’తో నిమిత్తం లేకుండా ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ మేరకే రుణమాఫీ మార్గదర్శకాలను రూపొందించి.. లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని బ్యాంకర్లను ఆదేశిం చారు. జిల్లాలో 8,70,321 మంది రైతులు డిసెంబర్ 31, 2013 నాటికి రూ.11,180.25 కోట్ల వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, బ్యాంకు ఖాతా నంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి.. ఆ రైతులందరూ మాఫీకి అర్హులుగా తేల్చిన బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ.. ప్రభుత్వం తొలి విడత 3,06,544, రెండో విడత 1,42,229 మొత్తం 4,53,773 మంది రైతులకే మాఫీ వర్తింపజేసింది. తక్కిన 4,16,548 మంది రైతులకు మొండిచేయి చూపింది. రూ.11,180.25 కోట్లకుగానూ రూ.600 కోట్ల మేర మాత్రమే మాఫీ చేసినట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఎండగట్టిన విపక్ష నేత.. రుణ మాఫీలో రైతులకు చేసిన అన్యాయంపై వైఎస్సార్సీపీ శాసనసభలో సోమవారం చర్చకు పట్టుబట్టింది. ఈ చర్చలో రైతులకు చేసిన అన్యాయాన్ని ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. భేషరతుగా రుణ మాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు.. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేసి పొట్టకొట్టారు. ఒకే విడత ఆ రైతులకు రుణ మాఫీ చేయలేదు. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు వ్యవహరిస్తోన్న చంద్రబాబుకు రైతులు తగిన రీతిలో బుద్ధిచెబుతారు. అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు ఒకేసారి రుణ మాఫీ వర్తింపజేశామని.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేయలేదని పబ్లిగ్గా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయలేదని.. అన్యాయం చేసిన రైతు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. చట్టసభ సాక్షిగా అబద్ధాలా..? రుణ మాఫీపై సీఎం చంద్రబాబు శాసనసభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని బ్యాంకర్లు.. ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 2013-14లో ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎకరంలో చెరకు పంటకు రూ.50 వేలు, వరి పంటకు రూ.24 వేలు, వేరుశనగ పంటకు రూ.12 వేలు రుణం ఇచ్చేలా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను రూపొందించారు. పంట రుణాలు ఇచ్చేటపుడు బ్యాంకర్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే రుణాలు ఇస్తారు. బంగారు ఆభరణాలను తనఖా పెట్టినప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పాటించాలన్న నిబంధన లేదు. ప్రభుత్వం రుణ మాఫీ చేసేటపుడు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేసింది. అదీ 2007లో అమల్లో ఉన్న ధరలను వర్తింపజేయడం గమనార్హం. 2007లో చెరకు పంటకు ఎకరానికి రూ.28 వేలు, వరి పంటకు రూ.17 వేలు, వేరుశనగ పంటకు రూ.ఎనిమిది వేలు స్కేల్ ఫైనాన్స్‌గా ఉండేది. రుణ మాఫీలో అవే ధరలను వర్తింపజేసి చిన్న, సన్నకారు రైతులను సైతం ముంచేశారు. పలమనేరు మండలం కన్నమాకులపల్లెకు చెందిన వెంకటాచలం అనే సన్న కారు రైతు ఉదంతమే అందుకు తార్కాణం. వెంకటచాలం ఒక్క రైతుకే కాదు.. లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం ఇదే రీతిలో మాఫీ పేరుతో నిలువునా మోసం చేసింది. శాసనసభలో రుణ మాఫీపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల పాలిట శాపంగా మారిన బాబు సీఎం చంద్రబాబు నాయుడు రైతుల పాలిట శాపంగా మారారు. బ్యాంకుల్లో రుణాలు తోసేస్తామని చెప్పారు. ఆచరణలో మాత్రం శూన్యం. బ్యాంకర్లు మాత్రం రుణాలు చెల్లించాలని చెబుతున్నారు. బ్యాంకులో రూ.50 వేల రుణం తీసుకున్నాను. రుణమాఫీపై బ్యాంకు అధికారులను అడిగాను. ఇప్పుడు కాదు తర్వాత చూస్తామంటున్నారు. ప్రస్తుతానికి తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టమని చెబుతున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్యే శరణ్యం. -నాగరాజు, గట్టు గ్రామం, పుత్తూరు మండలం పలమనేరు మండలం మొరం పంచాయతీ పరిధిలోని కన్నమాకులపల్లెకు చెందిన ఎస్.వెంకటాచలం (ఖాతా నంబర్ 24187 978) రెండెకరాల సన్నకారు రైతు. కొలసమాసనపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో పట్టాదారు పాసుపుస్తకం తనఖా పెట్టి ఫిబ్రవరి 11, 2013న రూ.49 వేలు పంట రుణం గా పొందాడు. వెంకటాచలం ఆధార్‌కార్డు నంబర్ 282870625380. ఇప్పుడు వడ్డీతో సహా ఆయన అప్పు రూ.53,955.09కు చేరుకుంది. సీఎం చంద్రబాబు సోమవారం శాసనసభలో చెప్పిన ప్రకారం వెంకటాచలం రుణం ఒకేసారి మాఫీ కావాలి. కానీ.. ఆ రైతుకు కేవలం రూ.30,831.48 మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ధ్రువపత్రం ఇచ్చారు. తొలి విడతగా 2014-15లో రూ.6,166.30ను రుణ మాఫీ కింద జమా చేస్తున్నట్లు ఆ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. రూ.50వేలలోపు రుణం తీసుకున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయనట్లు సోమవారం శాసనసభలో సీఎం పేర్కొన్నారు. కానీ.. ఆ రైతుకు 2007లో ఉన్న స్కేల్ ఆఫ్ పైనాన్స్ను వర్తింపజేసినట్లు అదే ధ్రువపత్రంలో ఉంది. 2013-14లో చెరకు పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన మేరకు ఎకరానికి రూ.40 నుంచి రూ.50 వేలకు రుణం ఇవ్వవచ్చు. ఆ మేరకు వెంకటాచలానికి బ్యాంకు రూ.49 వేలను రుణంగా ఇచ్చింది. కానీ.. రూ.21 వేలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా అధికంగా రుణం ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. వ్యవసాయ రుణాల మాఫీపై సీఎం చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదని చెప్పడానికి ఇదో తార్కాణం. సోమవారం శాసనసభలో రుణమాఫీపై నిర్వహించిన చర్చలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. -
హామీల పేరుతో చంద్రబాబు మోసం
వంగర : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. మండలంలోని ఎం.సీతారాంపురం, వంగర, సంగాం గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఇటీవల మృతిచెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వంగరలో విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ పేరు తో రైతులు, డ్వాక్రాసంఘాల మహిళలతో టీడీపీ ఆట లాడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పక్షపాతినని నిరూపించుకునేందుకు చంద్రబాబు చేసిన తొలి సంతకానికి విలువేలేకుండా పోయిందన్నారు. రైతులకిచ్చిన హామీలకు ఒక్క దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కట్టుబడి ఎటువంటి పరిమితులు లేకుండా అప్పట్లో రుణ మాఫీ చేశారని గుర్తు చేశారు. రైతులకు 20 శాతం రుణమాఫీ మొత్తాన్ని తొలిదశలో చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికే రూపొందిం చిన జాబితా తప్పుల తడకగా ఉందని, అర్హులైన రైతుల పేర్లు గల్లంతయ్యాయని ఆవేదన చెందారు. మాఫీ పేరుతో మహిళలు నుంచి నెలనెలా వడ్డీని బ్యాంకులు రాబట్టుకుంటున్నాయని, దీని వల్ల వారంతా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నా రు. అలాగే ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల పింఛన్లు తొల గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల రుణా ల మంజూరులో టీడీపీ పాలకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్త లు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, మజ్జి వెంకటనాయుడు, ఉదయాన మురళీకృష్ణ, కర్రి గోవిందరావు, కాంబోతుల సింహా చలం, కాంబోతుల భగవతి, పార్టీ రేగిడి కన్వీనర్ రెడ్డి నర్సింగరావు, కనగల సత్యంనాయు డు, పి.పార్వతి, కె.పారినాయుడు, ఏనుగుతల వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఊసరవెల్లి
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇందుకూరుపేట: ఊసరవెల్లి రంగులు మార్చిన తరహాలో సీఎం చంద్రబాబు మాటలు మార్చే నేర్పరి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల మండల అధ్యక్షుల నిమాయక ప్రక్రియను జగదేవిపేటలోని పిడూరు సునీల్‌రెడ్డి నివాసంలో శనివారం నిర్వహించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని, అది కూడా ఒక్కో ఇంటికి రూ.1.5 లక్ష మాత్రమేనని పేర్కొనడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చాక ఆయన డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ రైతుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు బ్యాంకుల నుంచి పొందిన స్వల్ప, దీర్ఘకాలిక, ప్రాసెసింగ్ తదితర రుణాలన్నీ వ్యవసాయ రుణాల కిందకే వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా తెలివైన వ్యక్తినని, సీఈఓనని ప్రచారం చేసుకునే చంద్రబాబుకు వ్యవసాయ రుణాలకు, పంట రుణాలకు తేడా తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. రుణాలు కట్టవద్దని, తాకట్టుపెట్టిన నగలు, డాక్యుమెంట్లు ఇంటికి వస్తాయని ఆయన చెప్పిన మాటలు నమ్మి రైతులు నిలువున మోసపోయారన్నారు. వడ్డీల భారం పడటమే కాక పంటలు నష్టపోయిన పలువురు బీమా సౌకర్యం సైతం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశౠరు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఇప్పుడు ఆర్థిక సమస్యలంటూ వాటిని నెరవేర్చకుండా అందరినీ వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు కూడా నాటకాలాడుతున్నారన్నారు. నెల్లూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ హాజరైతే లాఠీలతో కొట్టించి బయటకు నెట్టించేసిన ఓ ఇన్స్పెక్టర్ వాడరాని భాష వాడారన్నారు. ఆయన చరిత్ర అంతా సేకరించి ఉన్నతాధికాారులకు నివేదించానన్నారు. కొడవలూరు ఎంపీడీఓ కూడా అలాగే ఉన్నారన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.15 లక్షల నుంచి నుంచి రూ.20 లక్షల వరకు అవినీతి జరిగిందన్నారు. అధికారుల్లో 60 శాతం మంది నిజాయితీగా వ్యవహరిస్తుండగా 40 శాతం మంది పచ్చా చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారికి వైఎస్సార్సీపీ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి విజయ్‌కుమార్, మండల అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసన్నశ్రావణ్కుమార్, గూడూరు ప్రభాకర్‌రెడ్డి, కొళ్లపూడి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
ప్రజలను మభ్యపెట్టేందుకే
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఎన్నికల ముందు లేనిపోని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అందలం ఎక్కిన సీఎం చంద్రబాబు నాయుడు ఇకపై కూడా జనాన్ని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారని ఎమ్మెలే ్య ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇందుకు సింగపూర్ పర్యటన ఓ నిదర్శనమని పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబులో మార్పు వచ్చిందని నమ్మి ప్రజలు గెలిపించారని చెప్పిన ఎమ్మెల్యే ఎస్వీ ఆయనలో మార్పు అనేది కొత్త సీసాలో పాత సారాలాంటిదని ఎద్దేవా చేశారు. కర్నూలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగపూరులో వారికే పరిశ్రమలు తక్కువగా ఉన్నాయని, అలాంటప్పుడు అక్కడ నుంచి 20 మంది పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పడం ప్రజలను నమ్మించేందుకు సీఎం చేస్తున్న ఓ ప్రయత్నమని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రుణాల మాఫీ హామీని నెరవేర్చడంలో బాబు అనేక షరతులు విధిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన రాజశేఖర్‌గౌడ్‌ను టీడీపీ వైపు తిప్పుకుని అప్పట్లో జెడ్పీఛైర్మన్ పదవిని కాజేశారని గుర్తు చేసిన ఆయన కల్తీకల్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఆ సీట్లో ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. -
నేడు రైల్వేకోడూరుకు సీఎం చంద్రబాబు
-
నేడు రైల్వేకోడూరుకు సీఎం చంద్రబాబు
సాక్షి, కడప : రాష్ర్ట ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం జిల్లా పర్యటనకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిననంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ జిల్లాకు రావడం ఇదే ప్రథమం. అందుకు సంబంధించి బాబు తన పర్యటనలో అధికారికంగా పలు కార్యక్రమాలకు బాబు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైల్వేకోడూరు పరిధిలోని ఓబనపల్లెలో శుక్రవారం సాయంత్రం ఏర్పాట్లను మంత్రి రావెల కిషోర్బాబుతోపాటు జిల్లా కలెక్టర్ కేవీ రమణ, ఇతర అధికారులు పరిశీలించారు. రైల్వేకోడూరు పరిధిలోని ఓబనపల్లె జన్మభూమి-మా ఊరు గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. శనివారం ముందుగా ఉదయం 12 గంటల ప్రాంతంలో ఓబనపల్లెలో మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం బడిపిలుస్తోంది కార్యక్రమంలో కూడా బాబు పాల్గొననున్నారు. అలాగే పశు వైద్య శిబిరం, హెల్త్ క్యాంపు, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను పరిశీలించనున్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు సంబంధించిన స్త్రీ శక్తి భవనంతోపాటు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులతో బాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. బాబు పర్యటనకు భారీ బందోబస్తు సీఎం శనివారం రైల్వేకోడూరుకు వస్తున్న సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాజంపేట డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నియమించారు. నలుగురు అదనపు ఎస్పీలు, పది మంది డీఎస్పీలు, 22 మంది సీఐలు, 62 మంది ఎస్ఐలు, 99 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 508 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 55 మంది మహిళా కానిస్టేబుళ్లు, 64 మంది హోం గార్డులతోపాటు తొమ్మిది సెక్షన్ల స్పెషల్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. సీఎం పర్యటన సాగేదిలా.... సీఎం చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి బయలుదేరి 11.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని 12.00 గంటలకు కోడూరు సమీపంలోని ఓబనపల్లెకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యకక్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్త్రీ శక్తి భవనానికి కూడా ప్రారంభించనున్నారు. 4.40గంటలకు హెలికాఫ్టర్‌లో రేణిగుంటకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదు వెళతారు. -
బాబు ప్రకటిస్తే రుణాలు రెన్యువల్‌కు సిద్ధమే..
సొసైటీ అధ్యక్షుల స్పష్టీకరణ.. కొరిటెపాడు(గుంటూరు): ఎన్నికల్లో రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నామని, రుణాలు రెన్యువల్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రకటనచేస్తే అలా చేయడానికి సిద్ధమేనని కొన్ని పీఏసీఎస్‌ల అధ్యక్షులు సవాల్ చేశారు. నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయంలో బుధవా రం పీఏసీఎస్‌ల అధ్యక్షులతో సమావేశం జరిగింది. తొలుత చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీకి ప్రయత్నాలు చేస్తోందని, ఈలోగా రైతులు అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని సూచించారు. దీనికి పలు సొసైటీల అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయపూడి సొసైటీ అధ్యక్షుడు మల్లెల హరీంద్రనాథ్ చౌదరి మాట్లాడుతూ లక్ష రూపాయలకు రూ.15 వేల మేర వడ్డీ భారం పడుతుందని, పాత రుణాలు కట్టకపోతే కొత్త రుణాలు ఇవ్వటం లేదన్నారు. ఇదంతా ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ పుణ్యమేనని మండిపడ్డారు. రైతులు తీసుకున్న రుణాలను వడ్డీతో కలిపి రెన్యువల్ చేయటం మంచి పద్ధతి కాదన్నారు. రుణమాఫీ చేయలేకపోతున్నామని, రుణాలను రెన్యువల్ చేసుకోవాలని చంద్రబాబుతో ప్రకటన ఇప్పిం చాలని డిమాండ్ చేశారు. చైర్మన్ ముమ్మనేని స్పందిస్తూ తొలి విడత కొంతమొత్తం చెల్లించి మిగిలిన మొత్తానికి బాండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి చెల్లించిన రుణాలపై ఎలాంటి వడ్డీ ఉండదని, ఏప్రిల్ 1 నుంచి ఏడు శాతం, సెప్టెంబర్ ఒకటి నుంచి 11.75 శాతం వడ్డీ పడుతుందని వివరించారు. తర్వాత 13 శాతం వడ్డీ పడే అవకాశం ఉన్నందున వడ్డీ చెల్లించి రైతులు కొత్త రుణాలు పొందేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తొలి విడతగా జమచేసే మొత్తాన్ని రైతులకు అందిస్తామన్నారు. బ్యాంక్ వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి, సీఈవో మురళికృష్ణ, గుంటూరు డివిజన్లోని సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
రైతు ద్రోహి సీఎం చంద్రబాబు
కూడేరు: ఎన్నికల ముందు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మబలికి, అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు ద్రోహి అని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కాటమయ్య ధ్వజమెత్తారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ నాయకులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు వెలుపలకు రాకుండా గేట్లు వేసి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కాటమయ్య మాట్లాతూ వరుస కరువులతో జిల్లాలో రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక రైతులు బతుకుతెరవుకోసం వలస బాట పట్టారన్నారు. వర్షాభావం వల్ల గడ్డి కొరత ఏర్పడి పశువులు అల్లాడుతున్నాయన్నారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న మూగజీవాలను తక్కువ ధరకు విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారన్నారు.అయినా ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వడంలేదని మండిపడ్డారు. గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి పశుసంపదను కాపాడాలన్నారు. రైతు సాధికారత సంస్థ ద్వారా రైతులకు రుణమాఫీ చేస్తానని సీఎం చెబుతున్నారని, అసలు ఆ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో స్పష్టం చేయడం లేదన్నారు. రైతు, డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ వసంతలతకు అందజేశారు. కార్యాక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశులు, తాలుకా కార్యదర్శి గోపాల్, మండల కార్యదర్శి రమణ, నాయకులు సంగప్ప, మల్లిఖార్జున, శ్రీరాములు, రమణప్ప,ఖాశీం పీరా, పార్వతి ప్రసాద్ పాల్గొన్నారు. -
రేపు సీఎం చంద్రబాబు రాక
సాక్షి, కర్నూలు: ఒక రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన (సోమవారం) జిల్లాకు రానున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొంటారు. హుస్సేనాపురం, పసుపులలో నిర్వహించే గ్రామసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు శనివారం ఎస్పీ ఆకె రవికృష్ణ, జేసీ కన్నబాబు, జెడ్పీ సీఈవో జయరామిరెడ్డి, డీపీవో శోభాస్వరూపరాణి వేదిక, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటన ఇలా.. సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 8.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 9.45 గంటలకు ఓర్వకల్లు మండలంలోని హుస్సేనాపురం చేరుకుంటారు. 10 గంటలకు వెటర్నిటి హెల్త్ క్యాంపు, 10.10 గంటలకు హెల్త్ చెకప్ క్యాంపులను సందర్శిస్తారు. అనంతరం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హుస్సేనాపురం నుంచి బయల్దేరి 2.15 గంటలకు బనగానపల్లె నియోజకవర్గంలోని పసుపుల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును, వెటర్నిటి హెల్త్ చెకప్ క్యాంపులను సందర్శించడంతోపాటు వారితో ముఖాముఖి మాట్లాడుతారు. 2.45 గంటల నుంచి 4.45 గంటల వరకు ‘జన్మభూమి’ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తారు.