రేపు సీఎం చంద్రబాబు రాక | CM Chandrababu arrival tomorrow | Sakshi
Sakshi News home page

రేపు సీఎం చంద్రబాబు రాక

Published Sun, Oct 12 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

రేపు సీఎం చంద్రబాబు రాక

రేపు సీఎం చంద్రబాబు రాక

సాక్షి, కర్నూలు: ఒక రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన (సోమవారం) జిల్లాకు రానున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొంటారు. హుస్సేనాపురం, పసుపులలో నిర్వహించే గ్రామసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు శనివారం ఎస్పీ ఆకె రవికృష్ణ, జేసీ కన్నబాబు, జెడ్పీ సీఈవో జయరామిరెడ్డి, డీపీవో శోభాస్వరూపరాణి వేదిక, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు.

 పర్యటన ఇలా.. సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 8.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 9.45 గంటలకు ఓర్వకల్లు మండలంలోని హుస్సేనాపురం చేరుకుంటారు. 10 గంటలకు వెటర్నిటి హెల్త్ క్యాంపు, 10.10 గంటలకు హెల్త్ చెకప్ క్యాంపులను సందర్శిస్తారు. అనంతరం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 1.45 గంటలకు హుస్సేనాపురం నుంచి బయల్దేరి 2.15 గంటలకు బనగానపల్లె నియోజకవర్గంలోని పసుపుల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును, వెటర్నిటి హెల్త్ చెకప్ క్యాంపులను సందర్శించడంతోపాటు వారితో ముఖాముఖి మాట్లాడుతారు. 2.45 గంటల నుంచి 4.45 గంటల వరకు ‘జన్మభూమి’ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement