విజయసాయిరెడ్డి రేపు తణుకు రాక | YSR Congress Party Vijay Sai Reddy tour in Eluru | Sakshi
Sakshi News home page

విజయసాయిరెడ్డి రేపు తణుకు రాక

Published Sun, Jan 18 2015 3:28 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

విజయసాయిరెడ్డి  రేపు తణుకు రాక - Sakshi

విజయసాయిరెడ్డి రేపు తణుకు రాక

సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను, మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకు.. సీఎం చంద్రబాబు నయవంచన స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో తణుకులో నిర్వహించ తలపెట్టిన దీక్షకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. స్వచ్ఛందంగా లక్షలాది మంది జనం తరలిరానున్న ఈ దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఈ నెల 19న సోమవారం తణుకు రానున్నారు. దీక్షఏర్పాట్లను పరిశీలించడంతో పాటు దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరి స్తారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు హాజరువుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని శనివారం తెలిపారు. దీక్ష  ఏర్పాట్లపై చర్చించేందుకు సోమవారం తణుకులో నిర్వహించే సన్నాహక సమావేశానికి జిల్లాలోని పార్టీ నేతలు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గాల కన్వీనర్లు తణుకు రావాలని నాని ఈ సందర్భంగా కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement