హామీల పేరుతో చంద్రబాబు మోసం
వంగర : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. మండలంలోని ఎం.సీతారాంపురం, వంగర, సంగాం గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఇటీవల మృతిచెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వంగరలో విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ పేరు తో రైతులు, డ్వాక్రాసంఘాల మహిళలతో టీడీపీ ఆట లాడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పక్షపాతినని నిరూపించుకునేందుకు చంద్రబాబు చేసిన తొలి సంతకానికి విలువేలేకుండా పోయిందన్నారు. రైతులకిచ్చిన హామీలకు ఒక్క దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కట్టుబడి ఎటువంటి పరిమితులు లేకుండా అప్పట్లో రుణ మాఫీ చేశారని గుర్తు చేశారు.
రైతులకు 20 శాతం రుణమాఫీ మొత్తాన్ని తొలిదశలో చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికే రూపొందిం చిన జాబితా తప్పుల తడకగా ఉందని, అర్హులైన రైతుల పేర్లు గల్లంతయ్యాయని ఆవేదన చెందారు. మాఫీ పేరుతో మహిళలు నుంచి నెలనెలా వడ్డీని బ్యాంకులు రాబట్టుకుంటున్నాయని, దీని వల్ల వారంతా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నా రు. అలాగే ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల పింఛన్లు తొల గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల రుణా ల మంజూరులో టీడీపీ పాలకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
రైతులు, డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్త లు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, మజ్జి వెంకటనాయుడు, ఉదయాన మురళీకృష్ణ, కర్రి గోవిందరావు, కాంబోతుల సింహా చలం, కాంబోతుల భగవతి, పార్టీ రేగిడి కన్వీనర్ రెడ్డి నర్సింగరావు, కనగల సత్యంనాయు డు, పి.పార్వతి, కె.పారినాయుడు, ఏనుగుతల వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.