మఠం నిర్వాహకుడిపై టీడీపీ వర్గీయుల దాడి | TDP members attack the administrator of the math | Sakshi
Sakshi News home page

మఠం నిర్వాహకుడిపై టీడీపీ వర్గీయుల దాడి

Published Sun, Nov 24 2024 5:27 AM | Last Updated on Sun, Nov 24 2024 5:27 AM

TDP members attack the administrator of the math

రోడ్డు ఆక్రమణను ప్రశ్నిస్తే తలపగులగొట్టారు 

రాడ్లతో కొట్టిన టీడీపీ నేత ఊకా విజయ్‌కుమార్‌ అనుచరులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కూటమి ప్రభు­త్వం వచ్చినప్పటి నుంచి రెచ్చి­పోయి ప్రవర్తి­స్తున్న తెలుగుదేశం నేతలు దాడులు, దౌర్జన్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నదీతీరంలో మఠం ఏర్పాటు­చేసు­కుని జీవిస్తున్న స్వామిపై దాడి­చేశా­రు. దారి ఆక్రమిస్తుండటాన్ని ప్రశ్నించినందుకు రాడ్డుతో తలప­గు­లగొట్టారు. తిరు­పతి జిల్లా చంద్రగిరి మండలంలో శనివా­రం ఏపీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా­స్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్, టీడీపీ నాయకుడు ఊకా విజయ్‌కుమార్‌ అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 

బాధితుడు మహేంద్రస్వామి తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లికి చెందిన మహేంద్రస్వామి స్వర్ణముఖినది ఒడ్డున నిజరూపమఠం ఏర్పాటు చేసుకున్నారు. మఠం పక్కన నది వెంబడి ఉన్న దారిని శనివారం విజయ్‌కుమార్‌ అనుచరులు ఆక్రమించుకుని యంత్రాలతో పనులు చేపట్టారు. 

ఈ ఆక్ర­మణను మహేంద్రస్వామి ప్రశ్నించారు. తమ నాయకుడు ఊకా విజయ్‌­కుమార్‌ చెబితేనే పనులు చేస్తున్నామని, అడగడానికి నువ్వు ఎవడివి అంటూ వారు దురు­సుగా చెప్పారు. వెంటనే వెళ్లిపొమ్మని హెచ్చ­రించారు. మహేంద్రస్వామి వెళ్లకపోవడంతో రాడ్లతో దాడిచేసి తలపగులగొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి మహేంద్రస్వామిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన తలకు కుట్లువేశారు. 

టీడీపీ వస్తే దాడులు చేస్తున్నారు 
తెలుగుదేశం అ«ధికారంలోకి వస్తే తనపై ఆ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని మహేంద్రస్వామి ఆవేదనతో చెప్పారు. గతంలోను ఊకా విజయ్‌కుమార్‌ పలుమార్లు తనపై దాడిచేసినట్లు తెలిపారు. గతంలో తన పళ్లు రాలగొట్టారని, పలుమార్లు రుయా ఆస్పత్రికి వెళ్లి ఎంఎల్‌సీ చేసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని చెప్పారు. 

న్యాయం చేయకపోతే తాను మరణించినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఈ కబ్జాలు, దౌర్జన్యాలు జరగలేదని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ అవి పెరిగాయని చెప్పారు. ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లి న్యాయం చేయాలని కోర­తానని తెలిపారు. తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement