Public health
-
ప్రమాదంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు దొరక్క రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే ఇన్సులిన్ కొరత.. గ్యాస్ బిళ్లలకు కటకట.. అరకొరగానే రక్తహీనత చికిత్సలో వినియోగించే ఐరన్ సుక్రోజ్.. కనీసం దగ్గు సిరప్లు కూడా ఆస్పత్రుల్లో లభించడంలేదు. గతంలో షుగర్ రోగులకు ఇంటి దగ్గర కూడా ఇన్సులిన్ వేసుకోవడానికి నెలకు 3, 4 వెయిల్స్ ఇచ్చేవారు. నాలుగైదు నెలలుగా ఇన్సులిన్ వెయిల్స్ ఇంటికి ఇవ్వడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీమోఫీలియా చికిత్సలో వాడే అన్ని రకాల ఇంజెక్షన్లు రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో దొరకడంలేదు. ఇలా.. అన్ని రకాల మందుల కొరత పేద రోగులను వేధిస్తోంది. మందులు బయట కొనుక్కోండంటూ రోగులకు వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. ఇది రోగులపై భారాన్ని మోపుతోంది.సరఫరా ‘గుండు సున్నా’రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్య శాఖ మందులు సరఫరా చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో నాలుగు క్వార్టర్లుగా మందులు సరఫరా అవుతాయి. తొలి మూడు క్వార్టర్లకే మందులు సరిగా సరఫరా కాలేదు. ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టినప్పటికీ కొన్ని రకాల మందులు, సర్జికల్స్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రాలేదు. ఇక నాలుగో క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) మొదలై నెల రోజులైనా ఈ మూడు నెలలకు రావాల్సిన మందులు రాలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. గతేడాది డిసెంబర్‌కి పూర్తయిన మూడు క్వార్టర్లకు ప్రధానమైన 100 రకాల మందులు కూడా అందుబాటులో లేవు. మందులు లక్షల సంఖ్యలో అవసరమని ఆస్పత్రుల నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్ పెట్టారు. రాజధానికి చేరువలోని ఆస్పత్రుల్లోనూ అవస్థలేరాజధానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు, విజయవాడ జీజీహెచ్‌లను కూడా మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గడిచిన మూడు క్వార్టర్లలో ఈ ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టిన 100 రకాల మందులు సరిగా సరఫరా కాలేదు. గుండె వైఫల్యానికి అందించే చికిత్సలో వినియోగించే ఇవాబ్రడిన్ హైడ్రోక్లోరైడ్ 5 ఎంజీ మాత్రలు 25 వేలు కావాలని గుంటూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్క మాత్ర కూడా రాలేదు. బ్యాక్టీరియా చికిత్సల్లో వాడే అమోక్సిలిన్, క్లావులనేట్ యాసిడ్ మందు 50 వేలు, మూర్ఛ, కొన్ని రకాల శస్త్ర చికిత్సలకు వినియోగించే లారాజెపామ్ ఇంజెక్షన్లు వెయ్యి కావాలని కోరినా ఇవ్వలేదు. విజయవాడ జీజీహెచ్‌లో కిడ్నీ, గుండె, జనరల్ మెడిసిన్ వంటి పలు విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం జీజీహెచ్ అధికారులు ఫ్యాక్టర్–8 ఇంజెక్షన్ వెయిల్స్ 50, మైగ్రేన్ మాత్రలు ఫ్లూనరిన్ 13 వేలు, తేలికపాటి నొప్పుల నుంచి విముక్తి కోసం వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్లు 21 వేలకు డిమాండ్ పెట్టినా ఒక్కటీ పంపలేదు. సాధారణ జ్వరం, ఆర్థరైటిస్, గౌట్, తల, కండరాల నొప్పి నిగవారణకు వినియోగించే నాప్రొక్సెన్ 500 ఎంజీ మాత్రలు 30వేలు, తీవ్రమైన నొప్పుల కోసం స్వల్ప కాలిక విముక్తికి వాడే ట్రమాడోల్ హెచ్‌సీఎల్ 100 ఎంజీ ఇంజెక్షన్లు 8 వేలు అవసరమైన నెల్లూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్కటీ సరఫరా చేయలేదు. ఇటీవల విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు బయట నుంచి మందులు కొనుగోలు చేసి తెచ్చుకోవాలని రోగులకు రాసిచ్చిన చీటీలు దగ్గు సిరప్లకూ కటకటేప్రీవెంటివ్ కేర్‌లో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్లనూ మందుల కొరత వేధిస్తోంది. వీటిలో కనీసం దగ్గు సిరప్‌లకు కూడా కటకటగా ఉంటోందని కొందరు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇన్సులిన్, గ్యాస్, నొప్పులు, థైరాయిడ్, యాంటిబయోటిక్స్ అందుబాటులో లేవు. గుండె, న్యూరో వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వాడాల్సిన మందులు సైతం పూర్తి స్థాయిలో ఉండటంలేదు. స్కిన్ అలర్జీ, గాయాలకు వాడే ఆయింట్మెంట్ల కొరతా తీవ్రంగానే ఉంది.సూపరింటెండెంట్లు లేఖ రాసినా..డ్రగ్ స్టోర్స్‌లో అన్ని రకాల మందులు లేకపోవడం, కొరత కారణంగా వైద్య సేవల్లో ఇబ్బందులపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు సూపరింటెండెంట్లు తెలిపారు. ప్రధాన మందుల కోసం ఇండెంట్ పెట్టినా ఒక్క మందు, ఇంజెక్షన్ కూడా సరఫరా అవలేదని, దీంతో స్థానికంగా కొనాల్సివస్తోందని వెల్లడించారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటంఏపీఎంఎస్ఐడీసీ నుంచి సరఫరా అవ్వని మందులు, అత్యవసర మందుల సరఫరాకు గత ప్రభుత్వంలో ఓ సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేశారు. ఈ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇక తిరుపతికి చెందిన జన్–ఔషధి మందుల సరఫరా సంస్థతో ఓ మంత్రి డీల్ కుదుర్చుకుని, ఆ సంస్థ ద్వారానే బోధనాస్పత్రులకు మందులు సరఫరా అయ్యేలా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఉత్తర్వులు ఇప్పించారు. జన్–ఔషధికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మెలిక పెట్టారు. అయితే ఆస్పత్రులకు పెద్దమొత్తంలో అవసరమయ్యే జన్–ఔషధి మందులను వేగంగా సరఫరా చేయలేమని సరఫరాదారులు చేతులెత్తేస్తున్నారు. ఇది ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని పలువురు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరోగ్య సేవలకు టానిక్ ఇస్తారా..?
ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించడంతోపాటు కేటాయింపులను గణనీయంగా పెంచాలని ఈ రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ప్రభుత్వరంగంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతోపాటు, ప్రైవేటు రంగంలో ఆస్పత్రులకు సైతం పలు రకాల ప్రయోజనాలతో ప్రోత్సాహం అందించాలన్న సూచనలు వస్తున్నాయి. వైద్య సేవలు, పరికరాలు, ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. మరోవైపు 11 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ జీడీపీలో 30–35 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈ రంగం సైతం విధానపరమైన మద్దతు చర్యలను ఆశిస్తోంది. అంచనాలు–డిమాండ్లు.. → 2024–25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,171 కోట్లు కేటాయించారు. అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు మరింత మందికి అందుబాటులోకి రావాలంటే జీడీపీలో కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలి. → ఒకరికి వినియోగించిన లేదా పునరి్వనియోగానికి అనుకూలంగా మార్చిన (రిఫర్బిష్డ్) వైద్య పరికరాల విషయంలో తగిన నియంత్రపరమైన విధానాల తీసుకురావడం ద్వారా.. ఈ పరికరాలు సమాజంలో వైద్య సదుపాయాలు అంతగా అందని వర్గాలకు చేరువ చేయొచ్చు. → వ్యాధి నివారణ ముందస్తు ఆరోగ్య చికిత్సలు, టెస్ట్‌లకు పన్నుల ప్రయోజనాలు కల్పించాలి. వైద్య, ఆరోగ్య సేవలు, జీవనశైలి వ్యాధులు(మధుమేహం, స్థూలకాయం తదితర) ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలి. → గత బడ్జెట్లలో టెలీ మెడిసిన్‌కు మద్దతు లభించింది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)ను సైతం కేంద్రం ప్రవేశపెట్టింది. 2025 బడ్జెట్లోనూ హెల్త్ యాప్‌లు, ఏఐ ఆధారి డయాగ్నోస్టిక్స్ టూల్స్ తదితర డిజిటల్ హెల్త్ సేవల విస్తరణ దిశగా చర్యలు ఉంటాయని అంచనా. → ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) బలోపేతం చేసే దిశగా చర్యలు అవసరం. → ఫార్మాస్యూటిక్సల్, వైద్య పరికరాల కోసం దేశం మొత్తానికి ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. → పరిశోధన, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి పరిశోధనా ప్రోత్సాహకాలు ప్రస్తుతం ఇనిస్టిట్యూషన్లు, విద్యా కేంద్రాలకే వెళుతున్నాయి.→ క్లినికల్, డిస్కవరీ రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థలకు (సీఆర్వోలు) నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలకు రుణ విస్తృతి అవసరం→ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎఎస్ఎంఈలు) కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. కనుక ఈ రంగంలోని కారి్మకులకు డిజిటల్ నైపుణ్యాల కల్పన, ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను అందించాలి. → ఎఎస్ఎంఈలకు నిధుల లభ్యత పెద్ద సమస్యగా ఉంది. అత్యవసర క్రెడిట్ గ్యారంటీ సహా పలు రకాల పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో లోపం నెలకొంది. దీంతో టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలకు రుణాల లభ్యత కష్టంగానే ఉంది. ఏఐ ఆధారిత రుణ దరఖాస్తుల మదింపు, రిస్క్ ప్రొఫైలింగ్‌తో రుణ లభ్యతను విస్తృతం చేయొచ్చు. → తయారీ విస్తరణకు, తక్కువ వడ్డీరేట్లపై రుణాలు అందించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ‘డయేరియాతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. 11మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంలలో మంచి ఆస్పత్రులు ఉన్నా బాధితులకు స్థానిక పాఠశాలలోని బెంచీల మీద చికిత్స అందించడం దారుణం.నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. లిక్కర్, ఇసుక స్కాముల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. గత మార్చి నుంచి దాదాపు రూ.1,800 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. సీహెచ్సీలలో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలను నిర్వీర్యం చేశారు.ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు. ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్థం చేశారు. స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. -
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు: వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని ప్రజారోగ్యం మీద చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఇందుకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదని మండిపడ్డారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని, అయినా సరే స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమని అన్నారు.నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్ జగన్. లిక్కర్, ఇసుక స్కామ్‌లో నిండా మునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారని విమర్శించారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయని, బాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని, దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారని దుయ్యబట్టారు.చదవండి: ప్రజలు ‘సూపర్‌సిక్స్’ కోసం చూస్తున్నారు: బొత్స‘ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్‌క్లినిక్స్, పీహెచ్‌సీలను నిర్వీర్యంచేశారు. ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 19, 2024 -
ప్రజారోగ్యానికి ఉరితాడు.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి సీఎం చంద్రబాబు సర్కారు ఉరితాడు బిగిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందంటూ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ‘ఇప్పటికే స్పెషలిస్టు వైద్యులు సహా సిబ్బంది నియామకాలను నిలిపివేసి జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నీరుగారుస్తున్నారు. ప్రజలు వైద్యం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తెస్తున్నారు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ మంగళవారం ట్వీట్ చేశారు. ‘ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి మరో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం’ అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ట్వీట్లో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...విప్లవాత్మక సంస్కరణలతో పటిష్టం చేశాం..వైఎస్సార్సీపీ హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు పలు విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం. దీంట్లో భాగంగా విలేజ్–వార్డు క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, మండలానికి 2 పీహెచ్‌సీలు, 108, 104 సర్వీసులు గణనీయంగా పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 ప్రొసీజర్లు, కోలుకునే సమయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య ఆసరా, ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టాం. రూ.16,880 కోట్లతో ఆస్పత్రుల్లో నాడు–నేడు, కొత్త మెడికల్ కాలేజీల పనులు చేపట్టాం. ఇవన్నీ చివరిదశకు వచ్చాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున మొత్తం 17 కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.8,480 కోట్లతో శ్రీకారం చుట్టాం.ఇది మీ వైఫల్యం కాదా? పటిష్ట ప్రణాళిక వల్ల 2023–24లో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది. ఈ క్రమంలో 2024–25 విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కొత్త కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అన్ని వసతులున్నా మీ వైఖరి కారణంగా వీటికి గ్రహణం పట్టింది చంద్రబాబూ..! కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్నా మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారు. ఇది మీ వైఫల్యంకాదా? ఫలితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండాపోయాయి. దీంతోపాటు కొత్త కాలేజీల్లో మెడికల్ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్ కోటాలో భర్తీచేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశారు. ప్రైవేట్ జపంతో సామాన్యుల నెత్తిన భారం..మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేసి సామాన్యుల నెత్తిన భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారు. పీపీపీపీ మోడల్ అంటూ ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటు వల్ల నడుపుతున్న వ్యవస్థలా ప్రజారోగ్య రంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోలేని పరిస్థితి తెస్తున్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండి. ప్రైవేటు సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగం ఉన్నప్పుడే రేట్లు అదుపులో ఉంటాయి. వెంటనే స్పందించి ఈ సంవత్సరం ఆ 5 కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేం శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మును కూడా విడుదల చేసి ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మిగిలిన అన్నీ పూర్తిచేసే దిశగా అడుగులు వేయండి. మీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందున ఆ పలుకుబడిని వాడుకుని ఆ ఐదు మెడికల్ కాలేజీలకు వెంటనే అనుమతులు సాధించాలి. -
ప్రజారోగ్యానికి చంద్రబాబు సర్కార్ ఉరితాడు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీలో ప్రజారోగ్య రంగానికి చంద్రబాబు సర్కార్ ఉరితాడు బిగుస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఎక్స్(ట్విటర్) వేదికగా నిలదీశారు.‘‘ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరుగారుస్తున్నారు. తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి ఇంకో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.’’వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. దీంట్లో భాగంగా విలేజ్-వార్డు క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, మండలానికి 2 పీహెచ్‌సీలు, 108,104 సర్వీసులు గణనీయంగా పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 చికిత్సలు, చికిత్స కాలంలో కోలుకునేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య ఆసరా, ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టాం. ఆస్పత్రుల్లో నాడు-నేడు, కొత్త మెడికల్ కాలేజీలకోసం రూ.16,880 కోట్లతో పనులు చేపట్టాం. ఇవన్నీ చివరిదశకు వచ్చాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని రూ.8,480 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టాం.’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘పటిష్టమైన ప్రణాళిక వల్ల 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరంలో మరో ఐదు చోట్ల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. అన్ని వసతులూ ఉన్నా, చంద్రబాబూ… మీ వైఖరి కారణంగా వీటికి గ్రహణం పట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్నా మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారు. ఇది మీ వైఫల్యంకాదా? ఫలితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండాపోయాయి. దీంతోపాటు కొత్తకాలేజీల్లో మెడికల్ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్‌కోటాలో భర్తీచేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశారు.’’ వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.‘‘మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేసి, సామాన్యుల నెత్తిన భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారు. పీపీపీపీ మోడల్ అంటూ ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటువల్ల నడుపుతున్న వ్యవస్థలా ప్రజారోగ్యరంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోలేని పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండి. ప్రైవేటు సంస్థలకు పోటీగా ప్రభుత్వరంగం ఉన్నప్పుడే, ఆ పోటీ కారణంగా రేట్లు అదుపులో ఉంటాయి. వెంటనే స్పందించి ఈ సంవత్సరం ఆ 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. మేం శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మును కూడా విడుదలచేస్తూ ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మిగిలిన అన్నీ పూర్తిచేసేదిశగా అడుగులు వేయండి. మీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఆ పలుకుబడిని వాడుకుని ఆ ఐదు కాలేజీలకు వెంటనే అనుమతులు తీసుకురావాలని కోరుతున్నాను.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.. @ncbn గారూ… రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోంది. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోంది. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 27, 2024 -
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
ఇది మూణ్ణాళ్ళ కథ కాదు!
ప్రజల ఆరోగ్యం విషయంలోనూ పాలకులకు న్యాయస్థానాలు గడువు విధించాల్సి రావడం విచిత్రమే. అయితే, ఇప్పటికే అదే పనిలో ప్రభుత్వముంటే, త్వరితగతిన పనులు జరగడానికి ఈ గడువు విధింపు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. శానిటరీ న్యాప్కిన్ల పంపిణీపై దృష్టి పెడుతూ, జాతీయ స్థాయిలో ‘వాంఛనీయ’ ఋతుస్రావ కాల ఆరోగ్య విధానాన్ని 4 వారాల్లో ఖరారు చేయాలంటూ సుప్రీమ్ కోర్ట్ గత సోమవారం అన్నమాట అలాంటిదే. ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సగటున ఎంతమంది ఆడపిల్లలకు ఎన్ని మరుగుదొడ్లు ఉండాలన్న దానిపైనా జాతీయ స్థాయిలో ఒక మోడల్‌ను నిర్ణయించాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది.దాదాపు 37.5 కోట్ల మంది ఋతుస్రావ వయసువారున్న దేశంలో... 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో... దేశ ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశం మహిళా లోకానికి కొంత ఊరట. ఋతుస్రావ ఆరోగ్య ప్రాధాన్యాన్ని కోర్ట్ గుర్తించడం, ప్రస్తావించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఆ పని చేసింది. పట్టని ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. ఏడు నెలల క్రితం ఏప్రిల్‌లో కూడా ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో స్పందిస్తూ, ఋతుకాలపు ఆరోగ్యంపై ఏకరూప జాతీయ విధాన రూపకల్పనకు కేంద్రాన్ని సుప్రీమ్ ఆదేశించింది. తాజాగా, కోర్ట్‌లో ప్రభుత్వ వకీలు పేర్కొన్నట్టు జాతీయ విధానం ముసాయిదాను కేంద్రం ఇటీవలే ఆన్లైన్లో పెట్టింది. సామాన్య ప్రజల మొదలు నిపుణుల దాకా అందరి అభిప్రాయాలు కోరింది. తద్వారా ఋతుస్రావం పట్ల తరతరాలుగా మన దేశంలో నెలకొన్న అనేక అపోహలనూ, సవాళ్ళనూ నిర్వీర్యం చేయాలన్నది ప్రయత్నం. అర్ధంతరంగా బడి చదువు మానేయడం సహా అనేక సమస్యలకు కారణమవుతున్న ఈ ఆరోగ్య అంశం పట్ల దృష్టి పెట్టడానికి స్వతంత్ర దేశంలో ఏడున్నర దశాబ్దాలు పట్టింది. అలాగని అసలేమీ జరగలేదనలేం. కొన్నేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఋతుస్రావ కాల ఆరోగ్యం, పరిశుభ్రత (ఎంహెచ్‌హెచ్) పట్ల దృష్టి పెరుగుతోంది. భారత్‌లో సైతం ప్రజారోగ్య చర్చల్లో ఈ అంశాన్ని భాగం చేశారు. ‘జాతీయ ఆరోగ్య మిషన్ 2011’లో గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికల్లో ఋతుస్రావ కాలపు ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో దీన్ని చేర్చారు. కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ సైతం 2015లోనే పాఠశాలలకు మార్గ దర్శకాలు జారీచేసింది. దాని ఫలితాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల్లో కొంత కనిపించాయి. పీరియడ్స్ వేళ ఆరోగ్యకర మైన పద్ధతులను పాటించడమనేది మునుపటి సర్వేతో పోలిస్తే, అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో 15 నుంచి 24 ఏళ్ళ వయసు యువతుల్లో 20 శాతం పెరిగింది. ఇది కొంత సంతోషకరం. పైగా, ఐరాస పేర్కొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంహెచ్‌హెచ్ కూడా ఒకటనేది గమనార్హం. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో ‘స్వేచ్ఛ’, కేరళలో ‘షీ ప్యాడ్’, రాజస్థాన్‌లో ‘ఉడాన్’ ఇలా రకరకాల పేర్లతో వివిధ రాష్ట్రాలు కౌమార బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తున్నాయి. దీర్ఘకాలిక వినియోగ నిమిత్తం కేరళ, కర్ణాటకలు న్యాప్కిన్లకు బదులు ఋతుస్రావ కప్స్ అందిస్తున్నాయి. అయితే, సమాజంలోని దురభిప్రాయాలను పొగొట్టడమనే సవాలు మిగిలే ఉంది. పన్నెండేళ్ళ సోదరి దుస్తుల మీద ఉన్న తొలి ఋతుస్రావ రక్తపు మరకలను చూసిన ఓ అన్నయ్య ఆమెను అనుమానించి, కొట్టి చంపిన ఘటన ఆ మధ్య మహారాష్ట్రలో జరిగింది. ఆడవారికే కాక, మగవారికి సైతం పీరియడ్స్ పట్ల అవగాహన పెంచాలంటున్నది అందుకే. ‘ఆ 3 రోజులు’ ఆడవారిని ప్రాథమిక వసతులైనా లేని గుడిసెల్లో విడిగా ఉంచే మహారాష్ట్ర తరహా అమానుష పద్ధతుల్ని మాన్పించడం లక్ష్యం కావాలి. ఋతుక్రమం అపవిత్రత కాదనీ, శారీరక జీవప్రక్రియనీ గుర్తెరిగేలా చేయాలి. తగిన ఎంహెచ్‌హెచ్ వసతులు లేకపోవడంతో ఏటా మన దేశంలో 2.3 కోట్ల మందికి పైగా బాలికలు అర్ధంతరంగా బడి చదువులు మానేస్తున్నట్టు సర్వేల మాట. సరిగ్గా చదువుకోని వారు ఋతుస్రావ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారన్నది దాని పర్యవసానం. అంటే, ఇది ఒక విషవలయం. దీన్ని ఛేదించాలి. బడిలో వసతులు పెంచడంతో పాటు జాతీయ విధానం ద్వారా ఆరోగ్యంలో, సామాజిక అనాచారాలను మాన్పించడంలో టీచర్లు కీలక పాత్ర పోషించేలా తగిన శిక్షణనివ్వాలి. విధానాల నిర్ణయం, కార్యక్రమాల రూపకల్పనలో తరచూ ఓ పొరపాటు చేస్తుంటారు. యువతుల మీదే దృష్టి పెట్టి, ఋతుక్రమం ఆగిపోయిన లక్షలాది మహిళల ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. అది మారాలి. మెనోపాజ్ అనంతర ఆరోగ్యం, అపోహల నివృత్తిపైనా చైతన్యం తేవాలి. ఆరోగ్య కార్యకర్తలకు అందుకు తగ్గ శిక్షణనివ్వాలి. ప్యాడ్ల పంపిణీతో బాధ్యత ముగిసిందను కోకుండా సంక్లిష్ట సామాజిక అంశాలపై జనచైతన్యం ప్రధానాంశం కావాలి. ఇన్నేళ్ళకు ఒక జాతీయ విధానం తేవడం విప్లవాత్మకమే కానీ దానితో పని సగమే అయినట్టు! గ్రామప్రాంతాల్లోనూ అందరికీ అందుబాటు ధరలో న్యాప్కిన్లుండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, నీటి వసతి బడిలో భాగం కావాలి. ఆరోగ్యం, ఆచారం లాంటి అంశాల్లో తరతరాలుగా సమాజంలో నెలకొన్న అభిప్రాయాలను పోగొట్టడం సులభం కాకపోవచ్చు. కానీ, అందుకు ప్రయత్నించకపోతే నేరం, ఘోరం. ఋతుస్రావ ఆరోగ్యంపై చైతన్యం తేవడంలో భారత్ మరింత ముందడుగు వేసేందుకు సత్వర జాతీయ విధానం తోడ్పడితే మేలు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సైతం ఏళ్ళు పూళ్ళు తీసుకొని, మరో అయిదేళ్ళ తర్వాత అమలు అంటున్న పాలక వర్గాలు ఆకాశంలో సగమనే ఆడవారి తాలూకు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వెంటనే పట్టించుకుంటే అదే పదివేలు. -
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
ఏపీలోని యూపీహెచ్‌సీల్లో ప్రజారోగ్య సౌకర్యాలకు కేంద్రం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్‌సీల్లో) రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల పట్ల కేంద్రం ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల్లో నాణ్యతా ప్రమాణాల్ని స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం గుంటూరులోని ఇందిరానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి(యూపీహెచ్సీ)ఎన్ క్యూఎఎస్ ప్రోగ్రాం కింద 96.2 శాతం స్కోర్ ఇస్తూ నాణ్యతా ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. అన్ని రకాలుగా ఆయా వైద్య విభాగాలు సంతృప్తికరమైన వైద్య సేవలందిస్తూ నాణ్యతా ప్రమాణాల్ని పాటించినందుకుగాను అభినందించింది. గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్‌సీల్లో కల్పించిన నాణ్యమైన వైద్య సేవలకుగాను కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ స్కోర్‌ను సాధించి రాష్ట్రంలోనే మొట్టమొదటి యూపీహెచ్‌సీగా గుర్తింపు పొందింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబును అభినందిస్తూ లేఖ రాశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో దాదాపు 100 పట్టణ ఆరోగ్య కేంద్రాలు కేంద్రం గుర్తింపును సాధించేందుకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందాలు మే నెల 19,20 తేదీలలో గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ యూపీహెచ్సిని సందర్శించి అక్కడి అన్ని విభాగాల పనితీరును పరిశీలించాయి. చదవండి: మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు: సీఎం జగన్ ఇందిరా నగర్ యూపీహెచ్‌సీలో మొత్తం 12 వైద్య విభాగాల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు గాను 96.2 శాతం స్కోరును సాధించాయని విశాల్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. యూపిహెచ్ సీల్లో వైద్య సేవల్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకుని రాష్ట్ర నాణ్యతా ప్రమాణాల నియంత్రణా విభాగానికి అందజేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలు తీరును పరిశీలించాక నివేదికలను ఎన్హెచ్ఎస్ఆర్సీ ధ్రువీకరణ విభాగానికి అందచేయాల్సి ఉంటుందని లేఖలో వివరించారు. -
మరపురాని మహానేత
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల మూడు నెలల కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. ఆయన మరణించి 13 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు అడుగులు వేస్తున్నారు. జనం కోసం ఎందాకైనా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. మండుటెండలో 1,475 కి.మీల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కా>ంగ్రెస్‌కు ప్రాణం పోశారు. 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థం చేసుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వైఎస్సార్.. అధికారంలోకి వచ్చాక కన్నీళ్లు తుడిచారు. ఐదేళ్లు సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించి.. 2009 ఎన్నికల సందర్భంగా గెలుపోటములకు తనదే బాధ్యత అని నిబ్బరంగా ప్రకటించారు. ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం ఆ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజారోగ్యానికి ఆరోగ్యశ్రీతో భరోసా 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. ఈ సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. రైతును రాజు చేసిన మారాజు సీఎంగా ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు. వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించి పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని తప్పించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. మద్దతు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. పేదరికానికి విద్యతో విరుగుడు పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్సార్ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని దృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు. ఫీజుల పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు సైతం ఉన్నత చదువులను అభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. వైఎస్సార్ బాటలో పలు రాష్ట్రాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం దేశాన్ని కూడా తాకినా, ఉమ్మడి రాష్ట్రంపై పడకుండా వైఎస్సార్ నివారించగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేపట్టి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చారు. ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. ఇది జంట నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేందుకు దోహదం చేసింది. -
ముందస్తు గుర్తింపుతో గుండె ముప్పునకు చెక్.. వారిలో 63% మందికి 3 నాళాలు బ్లాక్?
సాక్షి, హైదరాబాద్: బయో ఆసియా సదస్సు–2023 రెండోరోజు కార్య క్రమాల్లో భాగంగా శనివారం జరిగిన ముఖా ముఖి సంభాషణలో దిగ్గజ సంస్థ యాపిల్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతరెడ్డి పాల్గొన్నారు. ప్రజారోగ్యం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం అనే అంశాలపై చర్చించారు. ఆరోగ్య సమాజం కోసం యాపిల్ చేస్తున్న కృషిని డాక్టర్ సుంబుల్ దేశాయ్ వివరించగా అపోలో హాస్పిటల్స్ ద్వారా వైద్య సేవలందిస్తున్న తీరు ను, భవిష్యత్ కార్యాచరణను డాక్టర్ సంగీతారెడ్డి ప్రస్తావించారు. అవి వారి మాటల్లోనే.. సంగీత: లింగ సమానత్వం, సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రపంచంలో మేటిగా ఉంది. కానీ ప్రస్తుత సవాళ్లలో ప్రజారోగ్య పరిరక్షణ అతిపెద్దది. దీనికి పరిష్కారాలను చూపుతున్నప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీ ప్రస్థానాన్ని ఒక ప్రాంతంలో ప్రారంభించి మరో చోటకు మారారు. మిమ్మల్ని ఉత్తేజపర్చిందేమిటి? సుంబుల్: ఏ పని చేసినా అర్థవంతంగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా జీవించాలనే అంశానికి యాపిల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మా ణాన్ని కాంక్షిస్తున్న యాపిల్ లక్ష్యం ఆ సంస్థ ఉద్యోగిగా నన్ను ఎంతో ఉత్తేజపరుస్తోంది. సంగీత: విజ్ఞానాన్ని పంచుకోవడానికి సాంకేతికత ఇప్పుడు కేంద్రంగా ఉందంటారా? సుంబుల్: అవును. నేను దాని గురించి మిమ్మల్ని అడగబోతున్నాను. అపోలో ద్వారా వైద్యసేవలందిస్తున్న మీరు ఆరోగ్యకర జీవన అంశాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? సంగీత: గుండెపోటు అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్‌గా మారుతోంది. దీని ముందస్తు హెచ్చరిక లక్షణాల గురించిన విశ్లేషణలను ప్రజల చేతుల్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. రెండు వారాల క్రితం మేము క్లినికల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్‌ను ప్రారంభించాం. ఇది దేశంలోని వైద్యులకు ఉచితంగా విడుదల చేయాలని భావిస్తున్నాం. మీరు మహిళల ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు? సుంబుల్: మా ప్రాధాన్యతలో కీలకమైన అంశం మహిళల ఆరోగ్యం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక చాప్టర్‌ను తెరిచాం. మహిళల కోసం సైకిల్ ట్రాకింగ్‌ను ప్రవేశపెట్టాం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరతను అధిగమించేందుకు మీరు ఏం ఆలోచిస్తున్నారు? సంగీత: కృత్రిమ మేధను మరింత విస్తృతం చేస్తున్నాం. దీంతో ఆరోగ్య సంరక్షణ రంగానికి కొంత వెసులుబాటు కలుగుతోంది. కానీ నిపుణుల కొరతను అధిగమించేందుకు యుద్ధప్రాతిపదిక చర్యలు అవసరం. సుంబుల్: జీ–20 స్టాండ్ పాయింట్... మహిళలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? సంగీత: ఆరోగ్య సంరక్షణలో, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం నిజంగా తగ్గింది. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణలో మహిళలు 60 శాతం ఉన్నారు. మహిళలకు అవకాశాలు అపారమవుతున్నాయి. నాయకత్వం శారీరక బలంతో కాదు.. మానసిక పరాక్రమంతో సాధ్యమవుతుంది. సంగీత: అపోలోను 40 ఏళ్ల క్రితం ప్రారంభించాం. అత్యాధునిక ఆరోగ్య సేవలను ప్రజలకు వేగంగా అందించాలనే లక్ష్యంతో అడుగులు వేశాం. కానీ ఇప్పటికీ ముందస్తు వ్యాధి నిర్ధారణ సవాలుగానే ఉంది. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందినప్పటికీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేశంలోని కార్డియాక్ పేషంట్లలో 63 శాతం మందిలో గుండెలో మూడు నాళాలు మూసుకుపోయాయి. మొదటి నాళం మూసుకున్నప్పుడే విషయాన్ని గుర్తిస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగుల్లో 73 శాతం మంది మూడో దశ, నాలుగో దశలోనే వ్యాధి బయటపడుతోంది. వారిని మొదటి దశలోనే గుర్తించగలిగితే చరిత్రను తిరగరాయొచ్చు. వాటి గుర్తింపునకు కృత్రిమ మేధ (ఏఐ) మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాలి. దీనిపై యాపిల్ ఏవిధంగా ఆలోచిస్తోంది? సుంబుల్: ప్రజారోగ్యానికి యాపిల్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా ఆరోగ్య అంశాల కోసం యాప్‌లు తీసుకొచ్చాం. గుండె స్పందన, నడక తదితరాల కోసం ప్రత్యేక ఫీచర్లు అందించాం. ఇంకా ఎన్నో రకాలను ఆవిష్కరిస్తున్నాం. దీంతోపాటు మహిళల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాం. -
జగన్ పాలనలో ప్రజారోగ్యానికి పెద్దపీట
గుంటూరు మెడికల్: సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యా«దికి చికిత్స అందించేందుకు దేశంలోనే అత్యుత్తమ వైద్య విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో త్రీడీ డిజిటల్ మామోగ్రఫీ వైద్య పరికరాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. అమృతలూరుకు చెందిన గడ్డిపాటి కస్తూరిదేవి, రామ్మోహనరావు, శివరామకృష్ణబాబు, నాట్కో ట్రస్ట్–హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో రూ.కోటి విలువైన ఈ త్రీడీ డిజిటల్ మామోగ్రఫీ వైద్య పరికరాన్ని జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు అందించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదికి 50 వేల నుంచి 60 వేల వరకు కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ఆస్పత్రులను అత్యాధునిక క్యాన్సర్ కేర్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు వైద్యులు, సిబ్బందికి శిక్షణ, సాంకేతిక సహకారం కోసం విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రభుత్వాస్పత్రుల్లో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కడప, కర్నూలులో రూ.120కోట్లతో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానాన్ని ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మోసం చేయడం మాత్రమే తెలుసునని, వైద్య, ఆరోగ్య రంగానికి ఏమీ చేయని ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు షేక్ ముస్తఫా, మద్దాలి గిరి, ఉండవల్లి శ్రీదేవి, నాట్కో ట్రస్ట్ సీఈవో కేవీఎస్ స్వాతి, వైస్ చైర్మన్ సదాశివరావు, కో–ఆర్డినేటర్ యడ్లపాటి అశోక్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, డీఎంఈ వినోద్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి, డీఎంహెచ్‌వో డాక్టర్ సుమయ ఖాన్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. -
ఫాస్ట్‌ఫుడ్.. హెల్త్బ్యాడ్! తెల్లగా మారితే.. ఆరెంజ్ కలర్ వేసి మరీ.. వామ్మో!
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పద్నాలుగేళ్ల బాలుడు రాకేశ్ ఏడాదిగా అత్యధిక రోజులు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో తింటున్నాడు. పొట్టలో విపరీతమైన నొప్పి రావడంతో వైద్యుని వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడిందని ఫాస్ట్‌ఫుడ్ మానేయాలని సూచించాడు. గంభీరావుపేటకు చెందిన ఓ రైతు పది హేను రోజుల క్రితం పని నిమిత్తం సిరిసిల్లకు వచ్చి మధ్యాహ్నం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో నోటికి రుచికరమైన పదార్థాలు ఆరగించాడు. సాయంత్రం ఇంటికెళ్లేసరికి వాంతులు, విరేచనాలు కావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. దీనికి కారణం వెతకగా..ఫాస్ట్‌ఫుడ్‌గా తేల్చారు. సాక్షి, సిరిసిల్లటౌన్: జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. నాణ్యత లేని పదార్థాలతో చేస్తున్న వంటలు ప్రజలను ఆస్పత్రుల పాలుచేస్తుంది. జంక్‌ఫుడ్‌గా పిలిచే ఫాస్ట్‌ఫుడ్ అలవాటుగా చేసుకుంటే ప్రాణాల మీదికొచ్చే అవకాశం ఉన్నా జనాలు పట్టించుకోవడం లేదు. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతున్నా నియంత్రించాల్సిన అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా జిల్లాలో ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న నాసిరకం, నిబంధనలు పాటించకుండా తయారు చేసే ఫాస్ట్‌ఫుడ్‌పై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. రూ.కోట్లలో వ్యాపారం ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ ఒకప్పుడు నగరాల్లోనే ఉండేది. ఇప్పుడది ప్రతీ పల్లెకు విస్తరించింది. చిన్నపాటి గ్రామంలో సైతం ఫాస్ట్‌ఫుడ్‌ను జనాలు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని పాడుచేసేదే అయినా అధిక లాభాలు వస్తుండడంతో వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, ప్రధాన పల్లెలు, హైవేపై ఉండే గ్రామాల్లో సైతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 పైగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో రోజుకు తక్కువలో తక్కువగా రూ.10లక్షల వరకు దందా సాగుతోంది. నెలకు రూ.3కోట్లలో ఫాస్ట్‌ఫుడ్ దందా జరుగుతుంది. నిబంధనలు బేఖాతర్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నూనెలు వినియోగించాల్సి ఉండగా.. ఎక్కువ ఫాస్ట్సెంటర్లలో నాసిరకం వాడుతున్నట్లు సమాచారం. నాణ్యమైనవి, బ్రాండెడ్ వాడాలంటే.. ఖరీదు కాబట్టి.. తక్కువ రేటుకు దొరికే పదార్థాలు, నూనెలు వాడుతున్నారు. రుచి కోసం ఆహారంలో నిశేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నాణ్యమైనవి వాడుతున్నామని ఫాస్ట్‌సెంటర్ నిర్వాహకులు చెబుతున్నా..ఏళ్ల తరబడిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహణపై తనిఖీలు చేపట్టే అధికారం ఉన్న శాఖలు ‘మామూలు’గా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవీ ప్రభావాలు.. చికెన్ ఫ్రైడ్‌రైస్ చేసేటప్పుడు తెల్లగా మారిన చికెన్‌ను ఆరెంజ్ రంగు వేసి కనిపించకుండా చేస్తారు. ఈ కలర్ ప్రభావం ఒకసారి మన చేతికి అంటితే వారం రోజుల వరకు రంగు పోదు. సోయాసాస్ రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు లేదా కొన్ని రోజులుగా కాగిన నూనెను వాడుతున్నట్లు సమాచారం. ఖరీదు తక్కువ..ఆరోగ్యాన్ని దెబ్బతీసే పామాయిల్ వాడుతున్నట్లు తెలుస్తుంది. ఫ్రైస్ వంటి వంటకాలకు చేతికి దొరికిన పిండిని కలిపేస్తున్నారు. దానిలో పురుగులు ఉంటున్నాయి. టమాట సాస్ ఎక్కువ మోతాదులో ఒకేసారి కొని పెడతారు. కొన్ని సందర్భాలలో పాడైన వాటిని పడేయకుండా వాడతారు. చిల్లీసాస్ వాసన చూస్తే వాంతులు రావడం ఖాయంగా ఉంటోంది. దీని వాడకంతో డబ్బులు బాగానే సంపాదిస్తారు. కానీ ఆరోగ్యంపై పట్టింపు ఉండకుండా దందా సాగిస్తారు. నిబంధనలు పాటించకుంటే కేసులు ప్రజా ఆరోగ్యం దెబ్బతీసే పదార్థాలు వాడొద్దు. వంటశాలలు, హోటల్స్ పరిశుభ్రంగా ఉంచాలి. కస్టమర్లకు తాగునీరు ఇవ్వాలి. మాంసాహారం, సూప్‌లు నిలువ ఉంచినవి వాడొద్దు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, హోటల్స్ నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం. – వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ (చదవండి: గోదావరిఖని.. ఇక పర్యాటక గని!) -
ఆర్ఎంపీలు అబార్షన్లు, ప్రసవాలు చేస్తే ఊరుకోం.. క్రిమినల్ కేసులు తప్పవు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు తప్పుడు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు, కొన్ని రకాల సర్జరీలు చేస్తూ కొందరు ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేగాకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికంగా క్లినిక్‌లు పెట్టుకుని ఎలాంటి రిజిస్టర్ సర్టిఫికెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న కేంద్రాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్యం వరకు పరిమితమయ్యే వారిని వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, బుధవారం కొందరు ఆర్ఎంపీ సంఘాల నేతలు శ్రీనివాసరావును కలిసి తమపై అనవసరంగా దాడులు జరపవద్దని కోరారు. ఆస్పత్రులపై కొనసాగుతున్న దాడులు... రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు కొనసాగుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,058 ఆస్పత్రులను, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన 103 ఆస్పత్రులను సీజ్ చేశారు. 633 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 75 ఆస్పత్రులకు జరిమానాలు విధించారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా.. అత్య«ధికంగా రంగారెడ్డి జిల్లాలో 325, కరీంనగర్ జిల్లాలో 293, హైదరాబాద్‌లో 202, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 144, వికారాబాద్‌లో 109 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం తనిఖీలు జరగలేదు. కాగా, చిన్న చిన్న లోపాలున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవద్దని, వారికి 15 రోజులపాటు సమయమిచ్చి తదనంతరం సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. -
అమెరికాలో మంకీపాక్స్ కలకలం... అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు
న్యూయార్క్: అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. ఈ మేరకు అమెరికాలోని న్యూయార్క్ నగరం మంకీపాక్స్ వ్యాప్తికి కేంద్రంగా ఉందని, దాదాపు లక్ష మందికి పైగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్(డీఓహెచ్ఎంహెచ్) కమిషనర్ అశ్విన్ వాసన్ ప్రజారోగ్య దృష్ట్యా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు త్వరితగతిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ఎమర్జెన్సీ తక్షణమై అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో డీఓహెచ్ఎంహెచ్ న్యూయర్క్ సిటీ హెల్త్ కోడ్ కింద అత్యవసర ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వ్యాధిని నియంత్రణలోకి తెచ్చేలే సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అదీగాక గతవారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మంకీపాక్స్ వ్యాప్తి అంతర్జాతీయ పరంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. అంతేకాదు ఇది ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కలిగిస్తుందో లేదో అంచనా వేయడం కోసం గత నెలలోనే ఘెబ్రేయేసస్ అత్యవసర కమిటీని సమావేశ పరిచారు. ఆ సమయంలోనే సుమారు 47 దేశాల్లో దాదాపు 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. అప్పటి నుంచి పెరుగుతూనే వచ్చిందని, ప్రస్తుతం ఇది కాస్త 75 దేశాలకు వ్యాపించి సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. -
World Food Safety Day: సంపాదనే ముఖ్యం.. అందుకోసం ఏమైనా కల్తీ చేస్తారు
డబ్బు సంపాదనే వారికి ముఖ్యం. అందుకోసం ఆహారంలో ఏమైనా కల్తీ చేస్తారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఏ మాత్రం చలించరు. కస్టమర్లను మళ్లీ మళ్లీ రప్పించుకోవడమే లక్ష్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ప్రమాదకర రంగులు, పదార్థాలను కలిపేందుకే తెగబడుతున్నారు. అధికారులకు సైతం ఈ విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేడు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలుజిల్లాలో చిన్నా పెద్దా హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు, చాట్, నూడల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 9 వేలకు పైగా ఉంటాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 1500 దాకా హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి 2006 చట్టం మేరకు లైసెన్స్ తీసుకుని, ఆ శాఖ నిబంధనల ప్రకారం ఆహారం తయారు చేయాలి. ఈ శాఖలోని అధికారులు ఏడాదికి 350 శ్యాంపిల్స్ సేకరించాల్సి ఉన్నా నామమాత్రంగా పనిచేస్తున్నారు. నెలకు ఐదు నుంచి ఆరు శ్యాంపిల్స్ తీసి చేతులు దులుపుకుంటున్నారు. గత మూడు నెలలుగా జిల్లాల పునర్విభజన పేరుతో ఒక్క శ్యాంపిల్ కూడా తీయలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారని, కోర్టు డ్యూటీల ఉన్నాయని పేర్కొంటూ తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేకరించి ప్రయోగశాలకు పంపిన శ్యాంపిల్స్ రెండు, మూడు నెలలకు గానీ నివేదికలు రావడం లేదు. దీంతో ఏ ఒక్కరిపైనా వీరు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు హోటల్, రెస్టారెంట్, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ జిల్లాలో ఇలా అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు నూటికి పాతిక శాతానికి మించి ఉండటం లేదు. ఉత్పత్తి కేంద్రాలైతే ఏడాదికి రూ.3వేలు, విక్రయ కేంద్రాలు రూ.2వేలు, తోపుడు బండ్లు రూ.100లు చెల్లించి అనుమతులు పొందాల్సి ఉన్నా ఆ పనిచేయడం లేదు. కొన్ని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా అధిక శాతం హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్డుసైడు హోటళ్లలో పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా రంగులు, టేస్టీ సాల్ట్ వాడకం జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అనుమతిలేని రంగులను, టేస్టీసాల్ట్ (అజినోమోటో)ను వాడుతున్నారు. వాస్తవంగా ఆహార పదార్థాల్లో వాడే రంగు(బుష్‌పౌడర్)ను ఒక కిలోకు 0.001మి.గ్రా వాడాలి. పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న దురుద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా కలుపుతున్నారు. దీంతో పాటు మెటాలిక్ ఎల్లోను సైతం వాడుతున్నారు. వీటిని తిన్న వారికి క్యాన్సర్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు లేరు. చదవండి: (Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు) అలాగే ప్రమాదకర అజినోమోటో(టేస్టీసాల్ట్)ను రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటిని తిన్న వారు క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలతో పాటు సంతానలేమి సమస్యలు, సెక్స్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల అధికారులు కృష్ణానగర్, పార్కురోడ్డు, సెంట్రల్ప్లాజా సమీపాల్లోని పలు దుకాణాలు, హోటల్లలో దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసినా వ్యాపారుల్లో మార్పు రాలేదు. హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు ఇవీ నిబంధనలు ►వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథారిటీఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు. నేరం రుజువైతే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారు. ►ఆహార పదార్థాలను తనిఖీ చేసేటప్పుడు నాలు గు భాగాలుగా విభజిస్తారు. అన్ సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్, మిస్లీడింగ్ విభాగాల కింద అధికారులు శ్యాంపిల్స్ సేకరిస్తారు. ►వ్యాపార ప్రకటనల్లో సూచించినట్లుగా ఆహారంలో ప్రమాణాలు లేకపోతే దానిని మిస్లీడింగ్ గా పరిగణిస్తారు. ►ఆహార పదార్థాల రంగు కోసం ప్రకృతి సిద్ధమైన రంగులు వాడాలి. రసాయనాలు కలిపిన రంగులు వాడకూడదు. ►ఆహార పదార్థాల తయారీకి టేస్టింగ్ సాల్ట్స్ వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి. ►అలాగే అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లలో లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. వంటగదిలో డ్రైనేజీ వసతి బాగుండాలి. అనుమతులు తప్పనిసరి తినుబండారాల వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ సి.క్యాంపులోని తమ కార్యాలయంలో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టప్రకారం అనుమతి ఉన్న రంగులు, పదార్థాలనే ఆహార పదార్థాల్లో వాడాలి. రుచి కోసం చాలా మంది టేస్టీసాల్ట్ వాడుతున్నారని ఫిర్యాదులున్నాయి. ఇది చట్టరీత్యానేరం. ఇకపై జిల్లా లో ముమ్మర దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాము. –శేఖర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఉమ్మడి కర్నూలు జిల్లా కలర్స్‌తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆహార పదార్థాల్లో రంగు, రుచి కోసం వాడే కలర్స్(బుష్‌పౌడర్ ) వల్ల పాంక్రియాస్, లివర్, పిత్తాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కొన్నిచోట్ల టేస్టీ సాల్ట్‌లో పందిమాసంతో తయారు చేసిన పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో పాటు అజినోమోటో సాల్ట్‌ను వాడటంతో జీర్ణాశయ, సంతానలేమి, సెక్స్ సమస్యలు వస్తాయి. కాబట్టి బయటి ఆహార పదార్థాల వినియోగంలో ప్రజలు తగు జాగ్రత్త వహించాలి. –డాక్టర్ పి. అబ్దుల్ సమద్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు -
ఒక్కరోజే 2,387 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 79,567 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,387 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.74 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 4,559 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 7.39 లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్కరోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు 4,097 మంది మృతిచెందారు. ప్రస్తుతం 30,931 క్రియాశీలక కేసులున్నాయి. వాటిలో 2,761 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 758 మంది ఐసీయూలో.. 1,169 మంది ఆక్సిజన్‌పై ఉన్నారు. మిగి లిన వారు ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రజారోగ్య సంచా లకుడు శ్రీనివాసరావు తెలిపారు. కాగా, 15–17 ఏళ్ల వయసు వారి రెండో డోస్ వ్యాక్సినేషన్ జరుగు తోంది. ఇప్పటివరకు 1,16,383 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేశారు. -
ఒక్కరోజే 2,484 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఆదివారం 65,263 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,484 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.61 లక్షలకు చేరుకుంది. తాజాగా 4,207 మంది కోలుకోగా, మొత్తంగా 7.18 లక్షలమంది రికవరీ అయ్యారు. ఆదివారం కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు 4,086 మంది బలయ్యారు. ప్రస్తుతం 38,723 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిలో 3,214 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 843 మంది ఐసీయూలో, 1,319 మంది ఆక్సిజన్, సాధారణ పడకలపై 1,052 ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. -
ఒక్క రోజే 3,877 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. శుక్రవారం రాష్ట్రంలో 1.01 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,877 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.54 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 2,981 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తంగా 7.10 లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్కరోజులో కరోనాతో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు 4,083 మంది కరోనాతో మృతిచెందారు. ఇక ప్రస్తుతం 40,414 క్రియాశీలక కరోనా కేసులుండగా.. వాటిల్లో 3,341 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 840 మంది ఐసీయూలో, 1,408 మంది ఆక్సిజన్‌పై ఉన్నారు. మిగిలిన వారు ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. -
మన మధ్యనే ఒమిక్రాన్.. రాబోయే నాలుగు వారాలు కీలకం
♦రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో 4 రెట్లకు పైగా పెరుగుదల ఉంది. పాజిటివిటీ కూడా 1 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ♦రాష్ట్రంలో ఒమిక్రాన్‌తో ఎవరూ చనిపోలేదు. ఇప్పటివరకు గుర్తించిన ఒమిక్రాన్ బాధితుల్లో 99 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ♦కేసుల సంఖ్య పెరుగుతున్నా.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మాత్రం ఉత్పన్నం కావడంలేదు. ఆసుపత్రిలో చేరే అవసరం ఉండడం లేదు. ఆక్సిజన్ అవసరం, ఐసీయూలో చేరికలు లేకపోవడం సానుకూల అంశాలు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని, రాబోయే రోజుల్లో 90 శాతం కేసులు అవే ఉంటాయని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చ రించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో కూడా 60–70 శాతం ఒమిక్రాన్ కేసులేనని తెలిపారు. అయితే ఇప్పటికీ డెల్టా వేరియంట్ కేసులు వస్తున్నాయని చెప్పారు. దేశంలో థర్డ్‌వేవ్ ఉధృతి ప్రారంభమైందని గురువారం విలేకరులతో మాట్లాడుతూ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో లాక్డౌన్ విధించే అవకాశం లేదని చెప్పారు. ఫిబ్రవరి రెండో వారానికి తగ్గుదల ‘వచ్చే నాలుగు వారాల్లో అంటే దాదాపు ఈ నెల చివరికి కేసులు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి రెండో వారం ముగిసేసరికి క్రమేణా తగ్గిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి వచ్చే నాలుగు వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ థర్డ్‌వేవ్‌లో మరణాల శాతం దాదాపుగా సున్నానే. ప్రాణాలు పోయే పరిస్థితి లేదని గ్రహించాలి. అయితే అప్రమత్తతతో మెలగాలి..’ అని శ్రీనివాసరావు సూచించారు. లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రిలో చేరాలి ‘కేసుల సంఖ్యలో దేశవ్యాప్తంగా 2 నుంచి 6 రెట్ల పెరుగుదల కనిపిస్తోంది. 95 శాతం మంది బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కేవలం 5 రోజుల్లోనే కోలుకుంటున్నారు. సాధారణ లక్షణాలున్నవారు కూడా భయంతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇలా అనవసరంగా చేరడం వల్ల అవసరమైన వారికి ఇబ్బందులు ఎదుర వుతాయి. కానీ లక్షణాలు తీవ్రమై ఆయాసం వస్తుంటే మాత్రం వెంటనే ఆసుపత్రిలో చేరాలి. రక్తంలో ఆక్సిజన్ శాతం 93 కంటే తక్కువగా ఉన్నా ఆసుపత్రిలో చేరాలి. కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం గరిష్ట ఐసోలేషన్ ఏడు రోజులే..’ అని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్పత్రులపై చర్యలు ‘రోగులను అనవసరంగా చేర్చుకోవద్దు. అవ సరమైన వారిని మాత్రమే చేర్చుకోవాలని ప్రైవే టు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని ఆసుపత్రులు, కొందరు వైద్యులు ఖరీదైన మం దులను వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి చికిత్స అందించాలి. మోనోక్లోనల్ యాంటీబాడీస్, టోసిలిజుమాబ్ వంటివి అనారోగ్య తీవ్రతను బట్టి అందించాలి. రోగులపై అనవసర భారాన్ని మోపొద్దు. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం. ప్రజలు సొంత వైద్యాలు చేసుకోవడం కూడా మానుకోవాలి. లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలితే వైద్యుడితో చికిత్స పొందాలి..’ అని సూచించారు. పిల్లల కోసం 10 వేల పడకలు ‘మొత్తం పడకల్లో 2.3 శాతంలో మాత్రమే రోగులున్నారు. ఎక్కడ కూడా ఆసుపత్రిలో చేరి కలు పెరగలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని పాజిటివ్ కేసులను వేరియంట్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నాం. పిల్లల కోసం ప్రత్యేకంగా 10 వేల పడకలను సిద్ధం చేశాం. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ నెల 10వ తేదీ నుంచి ముందస్తు నివారణ డోసు ఇస్తున్నాం..’ అని శ్రీనివాస రావు తెలిపారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు ‘వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశాం. వచ్చే 4 వారాల పాటు ఎవరూ సెలవులు తీసుకోవద్దు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. గుం పుల్లో తిరగడానికి సరైన సమయం కాదు. పం డుగలు, వేడుకలు కుటుంబసభ్యుల మధ్య జరు పుకోవాలి. సెలవుల్లో బయటకు వెళ్లినప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాలి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు.. వచ్చే 4 వారాలు అన్ని రకాల కార్య క్రమాలు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తు న్నాం. రాబోయే రోజుల్లో మొత్తం కేసుల్లో ఒక శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చినా.. ఆసుపత్రులపై భారం పడే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉం డాలంటే, ముందునుంచే అప్రమత్తత అ వసరం. ఈనెల 26 నాటికి టీకా రెండో డోసు కూ డా 100 శాతానికి చేరుకోవాలని వైద్యశాఖ మంత్రి ఆదే శాలిచ్చారు. పాఠశాలలు, కళాశాలలున్న చోటుకే వెళ్లి 15–18 ఏళ్ల వారికి టీకాలు అందించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఇప్పటివరకు తీసుకోని వారు టీకా తీసుకోండి..’ అని విజ్ఞప్తి చేశారు. అన్ని ఆస్పత్రుల్లో జ్వర క్లినిక్‌లు ‘రాష్ట్రంలో ఎన్నివేల కేసులొచ్చినా తట్టుకునే సా మర్థ్యముంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జ్వర క్లినిక్‌లను ప్రారంభించాం. లక్షణాలున్నవారు అక్కడ పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే స్వల్ప లక్షణాలున్నవారికి హోం ఐసో లేషన్ కిట్లను అందజేస్తాం. మొత్తం పాజిటివిటీ 10% కంటే ఎక్కువైనా, ఆసుపత్రిలో చేరికలు 5% పెరిగినా ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ఆదేశాలనే అమలు చేస్తున్నాం..’ అని చెప్పారు. సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ ‘మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. వైద్య బృందాలను కూడా నియమించాం. కరోనా కేసులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం. జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారికి అక్కడికక్కడే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తాం. ఎవరికైనా లక్షణాలుంటే హోం ఐసోలేషన్‌కు వెళ్లమని సూచిస్తాం. వైరస్ ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయగలిగాం. బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే వారిని చాలావరకు స్క్రీనింగ్ చేయాలన్న నియమం పెట్టుకున్నాం. సంక్రాంతికి వెళ్లి వచ్చే వారికి తప్పనిసరిగా సరిహద్దుల వద్ద పరీక్షలు చేస్తాం. కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవారు హైవేలు, ఇతర రహదారుల ద్వారా కాకుండా చిన్నపాటి దారుల ద్వారా ప్రవేశిస్తారు. అటువంటి చోట్ల కూడా స్క్రీనింగ్ ప్రక్రియ చేపడతాం..’ అని శ్రీనివాసరావు చెప్పారు. -
Telangana: కొత్తగా 189 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 36,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 189 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,376కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,995కి చేరిందని తెలిపారు. -
AP: హైరిస్క్ ప్రెగ్నెన్సీలు.. ఉండవిక
సాక్షి, అమరావతి: మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పండంటి బిడ్డతో ఇంటికి తిరిగి వచ్చేవరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికాహారం, మంచి వైద్యం ఇందులో ప్రధానమైనవి. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత, ఇతర సమస్యలు వస్తాయి. అటువంటి సమయాల్లో తల్లీ, బిడ్డకు ప్రమాదమేర్పడుతుంది. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి, గర్భిణికి మంచి వైద్యం అందించడానికి ప్రభత్వం పలు చర్యలు చేపట్టింది. అందులోనూ ప్రసవ సమయంలో తల్లుల మరణాలకు ప్రధాన కారణమైన హైరిస్క్ (ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు) ప్రెగ్నెన్సీలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 9వ తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. గర్భం దాల్చిన మూడు నెలల లోపు ఒకసారి, ఆరు నెలల లోపు మరోసారి వారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి, బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా వైద్యం అందిస్తున్నారు. 7వ నెల దాటాక కూడా హైరిస్క్ ప్రెగ్నెన్సీ అని తేలిన వారికి ఎంసీపీ (మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్) కార్డులో రెడ్ స్టిక్కర్ వేస్తారు. వీరు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగానే అక్కడి వైద్యులు, సిబ్బంది తక్షణమే స్పందించాలి. ప్రత్యేక వైద్యం అందించాలి. ఇలాంటి గర్భిణుల కోసం ఒక ఏఎన్ఎం లేదా ఆశా వర్కర్‌ను కేటాయిస్తారు. గర్భిణులకు ప్రసవం అయ్యేవరకూ వెంట ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించడం వీరి బాధ్యత. ప్రధానమంత్రి మాతృత్వ స్వాస్థ్య అభియాన్ కార్యక్రమం కింద ఏపీలో విజయవంతంగా ఈ సేవలు అందిస్తున్నారు. 13.47 శాతం హైరిస్క్ ప్రెగ్నెన్సీలు రాష్ట్రంలో గత ఆరు నెలల్లో 3,56,979 మంది గర్భిణులను గుర్తించగా, వారిలో 57,124 మంది హైరిస్క్ గర్భిణులే. అంటే 13.47 శాతం. పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. గతంలో 19 శాతంపైనే ఉండేవి. ప్రభుత్వ చర్యలతో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఆరు నెలల్లో టీనేజీ ప్రెగ్నెన్సీ (18 ఏళ్ల నిండకుండా గర్భం దాల్చిన వారు) 2,222 మంది ఉన్నారు. ఎక్కువగా విశాఖ జిల్లాలో 333 టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. రక్తహీనతే ప్రధాన కారణం హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు పలు కారణాలు ఉంటాయి. రక్తహీనత, 35 ఏళ్ల తర్వాత (ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ) గర్భం దాల్చడం, పద్దెనిమిదేళ్ల కంటే ముందే గర్భం దాల్చడం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ తదితర కారణాలతో కాన్పు కష్టమవుతుంది. వీటిలో రక్తహీనత ప్రధాన కారణంగా గుర్తించారు. గర్భిణు ల్లోని రక్తంలో హిమోగ్లోబిన్ కనీసం 12 గ్రాములు (డెసిలీటర్కు) ఉండాలి. అయితే, హైరిస్క్ గర్భిణుల్లో 11,437 మందికి హిమోగ్లోబిన్ 7 గ్రాములు, అంతకంటే తక్కువగా ఉన్నట్టు తేలింది. రక్తహీనతే మాతృ మరణాలకు అతిపెద్ద సమస్య. దీనికోసం ఐరన్ ఫోలిక్ మాత్రలు ఇవ్వడం, క్రమం తప్పకుండా యాంటినేటల్ చెకప్(గర్భస్థ పరీక్షలు) చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హైరిస్క్ ఉంటే పీహెచ్సీ కాకుండా పెద్దాసుపత్రికి హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే వారిని పీహెచ్సీలో కాకుండా సీహెచ్‌సీ, జిల్లా, ఏరియా ఆస్పత్రులకు అనుసంధానం చేస్తున్నాం. వీళ్ల వివరాలు 104, 108 వాహనాలకు ఇస్తాం. అత్యవసరమైతే వారు వెళ్లి గర్భిణిని ఆస్పత్రికి తీసుకురావాలి. ఏఎన్ఎం ఒకరిని అటాచ్ చేస్తాం. హైరిస్క్ ప్రెగ్నెన్సీపై అవగాహన పెరిగింది. ఎక్కువ మంది పరీక్షలకు వస్తున్నారు. దీనివల్ల మాతృమరణాలు తగ్గించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే ఉచితంగా వైద్యపరీక్షలు అందుతాయి. –డా.గీతాప్రసాది, సంచాలకులు,ప్రజారోగ్యశాఖ గడిచిన ఆరుమాసాల్లో ఇలా.. -
డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం!
లండన్: ఆల్ఫా వేరియంట్ సోకిన వారితో పోలిస్తే డెల్టా వేరియంట్ కరోనా సోకినవారు ఆస్పత్రి పాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికమని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్ఈ) అధ్యయనం హెచ్చరించింది. పీహెచ్ఈ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టాయి. అధ్యయన వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. ఆయా వేరియంట్లో ఆస్పత్రి పాలయ్యే ముప్పుపై ఇలాంటి అధ్యయనం జరపడం ఇదే తొలిసారి. గత మార్చి నుంచి మే వరకు ఇంగ్లాండ్‌లో కరోనా సోకిన 43,338 మందిని అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. వీరిలో 75 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా సోకిన రోగులు తీవ్ర లక్షణాలతో ఇబ్బంది పడతారని గతంలో వెల్లడైన అంశాలను తాజా అధ్యయనం మరోమారు నిర్ధారించింది. టీకా తీసుకోని వారిలో డెల్టా వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపుతోందని పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోనివారు వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారని, అన్ని వేరియంట్ల నుంచి టీకా మంచి రక్షణ ఇస్తుందని వివరించారు. టీకా తీసుకోనివారు, పాక్షికంగా టీకా తీసుకున్నవారే ఎక్కువ శాతం ఆసుపత్రిలో చేరుతున్నట్లు పీహెచ్ఈకి చెందిన డాక్టర్ గవిన్ డబ్రెరా తెలిపారు. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని ప్రజలను కోరారు. -
జగన్ ‘ప్రజావైద్యం’లో కాస్ట్రో స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన సిబ్బంది ఏపీలో భారీ స్థాయిలో తలపెట్టిన టీకాల ఉద్యమంవల్ల ఒకే ఒక్కరోజున పదమూడున్నర లక్షల మందికి వ్యాక్సినేషన్ అందడం దేశంలోనే రికార్డుగా నమోదయింది. జగన్ ప్రభుత్వం హాస్పిటల్స్ సౌకర్యాలను, దేశంలో లభించని ఆక్సిజనేటర్స్ను దేశంలో ఏ రాష్ట్రంకన్నా కూడా ముందుగానే సేకరించి ఆసుపత్రులను బలోపేతం చేయడానికి పూనుకుంది. ‘వైరస్లు వస్తాయి, పోతాయి, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలన్న’ శాస్త్రీయ దృక్పథాన్ని దేశంలోనే తొలిసారిగా వ్యాప్తిలోకి తెచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దాని సీఎం వైఎస్ జగన్. ‘రత్నపరీక్ష’ నవరత్నాల ఆవిష్కరణతోనే ప్రారంభమయింది. ఇప్పుడు నడుస్తున్నది నేలవిడవని పటిష్టమైన సాముగరిడీలు! ‘‘అమెరికా లాంటి సామ్రాజ్యవాద, పెట్టు బడిదారీ దేశాలు క్యూబా లాంటి చిన్న దేశా లపై సాగించిన యుద్ధాలు, పచ్చి దోపిడీ ఫలితంగా అనేక త్యాగాలతో జాతీయ పునర్నిర్మాణం అవసరమైంది. ఫలితంగా క్యూబా విప్లవం అనివార్యమై, దేశ ప్రజా బాహుళ్యం జీవితంలో జీవన విధానాల్లో పరి వర్తన కోసం విప్లవాత్మక చట్టాలు అనివార్యమయ్యాయి. ఈ చట్టాలు మా ప్రజాబాహుళ్యంలో సోషలిస్టు చైతన్య దీప్తిని కల్గించడానికి దోహదం చేశాయి. ఈ చైతన్యం వల్లనే ఆదిలో నిరక్షరాస్యులుగా, అర్ధ నిరక్షరాస్యులుగా బతుకులీడుస్తున్న ప్రజలు తమ బిడ్డలకు చదవను, రాయను నేర్పించగల్గారు. ప్రజావైద్య రక్షణ విధానానికి అంకురార్పణ చేశారు... ఏ దేశ ప్రజలూ బలవంతంగా విప్లవకారులు కాజాలరు. ఎందుకంటే, ఆరోగ్యకరమైన సమాజ పరివర్తన విధిగా కోరుకునే సామాజిక శక్తులు ప్రజా బాహుళ్యాన్ని అణచివేయాలని కోరుకోరు’’! - క్యూబా విప్లవనేత ఫిడెల్ కాస్ట్రో ‘‘కోవిడ్–19 ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన సిబ్బంది ఏపీలో భారీ స్థాయిలో తలపెట్టిన టీకాల ఉద్యమం వల్ల ఒకే ఒక్క రోజున పద మూడున్నర లక్షల మందికి వ్యాక్సినేషన్ అందడం దేశంలోనే ఒక రికార్డుగా నమోదయింది. ఇది గ్రామ సచివాలయాల, వార్డుల, జిల్లాల స్థాయిలో గత రెండేళ్లకు పైగా స్థానిక వలంటీర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న నిరంతర సేవాతత్పరత వల్లనే సాధ్యమైంది’’. - పత్రికా వార్తలు (21.6.2021) ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రతిపక్షాల ‘కోణంగి’ చేష్టలను, ప్రకృతి వైపరీత్యాలను, సరికొత్తగా ప్రపంచాన్ని ఊగించి, శాసించ సాహసిస్తు మహమ్మారి కోవిడ్–19ని గత రెండేళ్లలోనూ అనేక సాహస నిర్ణయా లతో వైఎస్సార్సీపీ అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదు ర్కొంటూ వస్తోంది. గత ప్రభుత్వం (టీడీపీ) రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక వనరులను దోచుకుని, లక్షల కోట్ల రూపాయల అఫ్పులతో ముంచే యగా ఖజానా ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం గత రెండేళ్లకుపైగా హుందాగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నెట్టుకుంటూ వస్తోంది. పైగా, గత రెండేళ్లలో అనేక సామాజిక, విద్యా, వైద్య, రైతు, వ్యవసాయ కార్మిక జనాభా మౌలిక అవసరాలను తీర్చడంలో భాగంగా నవరత్నాల ప్రణాళికను అక్షర సత్యంగా ఆచ రణలో పెట్టడానికి సీఎం జగన్ సాహసించి అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చట్టప్రకారమే ప్రత్యేక ప్రతిపత్తిని హామీ పడి వేలు విడిచిన కాంగ్రెస్ పాలకులు, వారు విడిచిపోతూ వదిలి వెళ్లిన పాద రక్షలు తొడుక్కుంటూ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తికి పార్లమెంట్ సాక్షిగా నిండుపేరోలగంలో ‘మేం చూసుకుంటాంగదా’ అంటూ ఆపద్ధర్మంగా ప్రకటించి బట్టలు దులిపేసుకున్న బీజేపీ నాయకత్వం– చెప్పిన మాటలన్నీ నీటిమూటలయ్యాయి. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో చేస్తున్నదీ, ఆడుతున్నదీ పచ్చి నాటకం! బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగిస్తే తప్ప– ఆ ‘ప్రత్యేక ప్రతి పత్తి’కి రాష్ట్ర ప్రజలు అర్హులు కారేమో! అవకాశం ఉన్నమేరకు పరిమిత మార్గమధ్యనే ముందుగానే వ్యూహాత్మకంగా నిర్దిష్టమైన ప్రణాళికా కేటాయింపులకు తెలివిగా ‘ప్లాన్’ చేసుకొని, ఆ ప్రకారంగా కేటాయింపులలోనే ప్రజాబాహుళ్యా నికి ముఖ్యంగా అణ గారిపోయిన దళిత, పేద, మధ్యతరగతి ప్రజా బాహుళ్య ప్రయోజనాలను సాధ్యమైనంతవరకు నెరవేర్చడానికి ‘నవ రత్నాలకే కాదు, వాటి పరిధిని దాటి కూడా ఎన్ని రంగాలకో ప్రయో జన పథకాలను విస్తరించి అమలులోకి తెస్తున్నారు. ఒకటా రెండా– వ్యవసాయ, సహకార, పశుపోషణ, మత్స్య సంపద, పౌర సరఫ రాలు, గ్రామ, వార్డు సచివాలయాల, గ్రామీణ వలంటీర్ల ఉపాధి, పేదలకు గృహ నిర్మాణాలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం, పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థల, ఆర్టీసీ, గిరిజన సంక్షేమ, నైపుణ్యం(స్కిల్), విద్యుచ్ఛక్తి, జలవనరుల అభివృద్ధి, ‘కోవిడ్’ తొలగే దాకా అవసరమైన తాత్కాలిక సిబ్బంది వగైరా నియామకాల దాకా– జగన్ ఆలోచన, ఆచరణ విస్తరించి శరవేగాన, ‘ఈ మార్పులు నిజమా’ అని ఆశ్చర్యగొలిపేలా అమలులోకి వస్తున్నాయి. బహుశా ఈ పెక్కు మార్పులకు ముఖ్యంగా ఆరోగ్య రంగంలో జగన్‌ను పురిగొల్పింది క్యూబన్ అధినేత ఫిడెల్ కాస్ట్రో అని నా విశ్వాసం. స్వయంగా వైద్యుడు, ప్రజా సమస్యలపై స్పందించగలిగిన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి ఉత్సాహ, ప్రోత్సాహాలు కారణమై ఉంటాయి. క్యూబన్ సామాజిక విప్లవంపైన, కాస్ట్రో విప్లవాత్మక సంస్కరణలపైన స్పందిస్తూ మరె వరో కాదు, క్యూబా శత్రువైన అమెరికాకు ఆరోగ్య సమాచార సాంకే తిక వ్యవస్థ జాతీయ సమన్వయకర్త డాక్టర్ డేవిడ్ బ్లుమెంతాల్ ఇలా అన్నాడు: ‘‘క్యూబా ప్రజారోగ్య వైద్య వ్యవస్థ ప్రజల ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధ, రక్షణ విషయంలో క్యూబా విజయాలకు సరిపోలిన ఉదాహరణలు అతి తక్కువ. క్యూబాలో చంటి పిల్లల మరణాల సంఖ్య ప్రతి వెయ్యిమంది పిల్లలకు 37.3 నుంచి 4.3కి పడిపోయింది. అమెరికాలో చంటిపిల్లల మరణాల సంఖ్య 5.8 కన్నా క్యూబా సంఖ్య తక్కువ. ఇక 1970 నుంచి 2016 మధ్య అమెరికా పౌరుని జీవన ప్రమాణం 79.8 సంవత్సరాలయితే, క్యూబాలో 70.04 నుంచి 78.7 సంవత్సరాల దాకా ఉంది’’. ఇక అన్నింటికన్నా, మూడు స్థాయిల్లో అంచెలవారీగా అమలులో క్యూబా ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఉంది. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకు రేయింబవళ్లు సేవలందించడానికి ఒక డాక్టర్, ఒక నర్సు నివసిస్తూ, స్థానిక ప్రజలలో ప్రతి ఒక్క సభ్యుడి ‘ఆరోగ్య వివరాలతో కూడిన పటాన్ని (మ్యాప్) ఉంచుతారు. ఇక రెండోదశలో స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రులలో ద్వితీయ స్థాయి సేవలు అందించే సిబ్బంది ఉంటారు. ఇక మూడోస్థాయిలో అందించే సర్వీసుల్లో 12 సంస్థలుంటాయి. ఇవి మెడికల్, టీచింగ్, రీసెర్చి సేవలు అందించడంతోపాటు అధునాతన సర్వీసులు, స్పెషలైజ్డ్ సర్వీసులు నిర్వహిస్తుంటాయి. చివరికి కోవిడ్–19 వైరస్ నుంచి పౌరుల రక్షణ కోసం అంత చిన్న దేశమైనా (సుమారు 13 కోట్లు జనాభా) 5 రకాల వ్యాక్సిన్లను మూడు దశల పరీక్షలు జయ ప్రదంగా నిర్వహించుకుని సిద్ధంగా ఉంది. ఇప్పుడు క్యూబా, చైనాలు కలిసి కోవిడ్ వైరస్ నిర్మూలనకు, దాని రూపాంతరాల నిర్మూలనకు తగిన వ్యాక్సిన్‌ను రూపొంది స్తున్నాయని సీనియర్ జర్నలిస్టు డాక్టర్ రాము సూరావజ్జుల వెల్లడిం చారు. ఒకవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య వ్యవస్థను ప్రతి ఒక్కరూ బలోపేతం చేయాలని సంబంధిత సామాజిక చర్యలను పటిష్టం చేయాలనీ మొత్తుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రకటన (20.6.21) వెలువడకముందే జగన్ ప్రభుత్వం హాస్పిటల్స్ సౌకర్యా లను, దేశంలో లభించని ఆక్సిజనేటర్స్ను దేశంలో ఏ రాష్ట్రం కన్నా కూడా ముందుగానే సెక్యూర్ చేసి ఆసుపత్రులను బలోపేతం చేయడానికి పూనుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే– చివరికి కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్ చర్యలు మార్గదర్శకం అయ్యాయంటే ఆశ్చర్య పోనక్కరలేదు. ‘వైరస్లు వస్తాయి, పోతాయి, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలన్న’ వైజ్ఞానిక శాస్త్రీయ దృక్పథాన్ని దేశం లోని రాష్ట్రాలలో మొదటిసారిగా వ్యాప్తిలోకి తెచ్చిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్, దాని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. ‘రత్నపరీక్ష నవ రత్నాల ఆవిష్కరణతోనే ప్రారంభమయింది. ఇప్పుడు నడుస్తున్నది నేలవిడవని పటిష్టమైన సాముగరిడీలు! అయినా సంస్కరణవాద ప్రభుత్వాలు నిలదొక్కుకోవాలన్న సమసమాజ వ్యవస్థ అండదండలు అనివార్యమని గుర్తించాలి!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రజారోగ్యానికి పందిరి కట్టాలి
ఏడాది కాలంగా మీడియా కోడై కూస్తున్న... వైద్యపరమైన ఒక మాటేదైనా ఉందంటే, అది ‘ప్రజారోగ్యం’! దేశంలో ప్రజారోగ్యాన్ని వరుస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ఫలితం ఎంత ఘోరమో కరోనా మనకు విడమర్చింది. ఇప్పుడదే మాటను, పాలకులు ఎజెండాలోకి తీసుకునేలా చేసింది. కోవిడ్ బారినపడి లెక్కకు మిక్కిలి జనాలు మృత్యు వాతపడుతుంటే, వైద్యం కోసం లక్షల రూపాయలు ప్రయివేటు ఆస్పత్రులకు చెల్లించాల్సి వస్తే... జబ్బొచ్చిన వాళ్లే కాదు, ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ప్రతి కుటుంబం జడుసుకుంది. అవి తలచుకొని, ‘ఏమో! పొరపాటున మన ఇంట్లోనే ఎవరికైనా కరోనా వస్తే?’ అని గగుర్పాటు చెందింది. పేద, అల్ప, మధ్యాదాయ వర్గాలే కాకుండా ఉన్నత మధ్యతరగతి కుటుంబాలు కూడా కరోనా చికిత్స ఖర్చులు భరించలేక అల్లాడు తున్నాయి. ఆస్తులు అమ్మి అంతంత చెల్లించినా, కడకు ఇంటి పెద్దదిక్కు దక్కక బావురు మన్న కుటుంబాలెన్నో! పెద్ద వయసువారే కాక కోవిడ్ రెండో అలకొట్టి చిన్న, మధ్య వయస్కులూ పిట్టల్లా రాలిపోతున్నారు. దేశంలో ఒక దశ, 24 రోజుల స్వల్పకాలంలో లక్షమందిని కోల్పోయాం. ‘సకాలంలో వైద్యం దొరికి ఉంటే’, ‘ముందుగానే ప్రాణాంతక జబ్బులు లేకుండా ఉండుంటే’, ‘ఈ పాటికే రెండు డోసుల టీకామందు పడి ఉంటే...!’ ఇలా ప్రతికూల అంశాల్ని తలచుకొని వగచిన కుటుంబాలెన్నెన్నో! గ్రామీణ భారతంలో వైద్యం మృగ్యం! ప్రతిచిన్న అవసరానికి పట్టణాలకు, నగ రాలకు పరుగెత్తాల్సిన స్థితి తెచ్చిపెట్టాం. ‘గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేవద్ద’ని ఉగ్గుపాల నాడే నేర్పిన సంస్కృతి, పాలకుల తప్పుడు ప్రాధాన్యతలతో పెడదారి పట్టింది. స్వతంత్రం వచ్చాక దశాబ్దాలు గడచినా వైద్యారోగ్యానికి తగిన బడ్జెట్ కేటాయించక, ముందస్తు ప్రణాళికలు లేక ప్రజా రోగ్యం కుంటుబడింది. వైద్యాన్ని ఫక్తు వ్యాపారం చేసి, కోట్లు గడిస్తున్న కార్పొరేట్ వైద్య రంగం ఇష్టారాజ్యమైంది. ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసి, మనకొక ఏడాది సమయం ఇచ్చినా... తగినంత ఆక్సిజన్ సమకూర్చుకోలేని, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితి! ‘ఆపరేషన్ సముద్ర సేతు–2’ పేరిట, భారత నౌకా దళానికి చెందిన ఏడు యుద్ధనౌకల్ని, ప్రపంచ పటంలో ఇసుక రేణువంత ఉండే చిన్న దేశాలకు పంపి ఆక్సిజన్ తెప్పించుకున్న దుస్థితి మనది! కరోనా కష్టకాలంలో ఎదురైన పరిస్థితులు ప్రభుత్వాలపై వైద్యారోగ్యపరమైన ఒత్తిడి పెంచు తున్నాయి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఒక గుణపాఠంగా నేర్పుతోంది కరోనా! దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నవతరం యువనాయకులు చొరవ తీసుకొని ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేసే చర్యలు కరోనా రాక ముందే చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకో ఉదాహరణ! మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఇప్పుడిప్పుడే కదలిక మొదలైంది. ఇదొక మంచి పరిణామం! తెలంగాణ ప్రతి జిల్లా కేంద్రంలోనూ విస్తృత స్థాయిలో ప్రభుత్వ వైద్య పరీక్షా (డయాగ్నోస్టిక్) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 19 జిల్లా కేంద్రాల్లో బుధవారమే ప్రారంభమ య్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పౌరులందరి ఆరోగ్యనివేదికలు (హెల్త్ ప్రొఫైల్స్) రూపొందించాలనీ నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభిస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలో క్యాన్సర్ కేంద్రం, రక్తనిధి, ఎముకల–నరాల ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలి... ఇలా పలు కీలక నిర్ణయాలే తీసుకు న్నారు. వచ్చే రెండేళ్లలో పదివేల కోట్ల రూపాయలు ఇందుకు వెచ్చించాలనేది సంకల్పం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం ఏపీలో 10,032 వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లు, ప్రతి క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్ అర్హతలు కలిగిన ఒక మాధ్యమిక ఆరోగ్య ప్రధాత, ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్యకేంద్రా(పీహెచ్సీ)ల ఏర్పాటు వంటివన్నీ ప్రగతిశీల చర్యలే! మండలానికి ఒక 104, ఒక 108 అంబులెన్స్ కల్పించడం, 104 వాహనంలో ప్రతి పల్లెకూ నెలకోసారి వెళ్లి 14 రకాల నిర్ధారణ పరీక్షలు జరిపి, దీర్ఘకాలిక జబ్బులకు మందులిస్తున్నారు. బాధితుల ఆరోగ్య నివేదిక రూపొందించి, దాన్ని పీహెచ్‌సీలకు అనుసంధానపరిచారు. ‘క్యూఆర్’ కోడ్ ఉండే హెల్త్‌కార్డ్‌లో పొందుపరుస్తూ, రోగులకు ‘ప్రత్యేక వైద్యసేవ’ల కోసం ప్రతి బోధనాసుపత్రిలో ఇ–సంజీవని హబ్స్‌ని అందుబాటు లోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఏపీలో ఇప్పటివరకు 11.80 లక్షల మందికి సేవలందించడం దేశంలోనే రికార్డు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, ఐటీడీఏ ప్రాంతాల్లో 5 స్పెషాలిటీ ఆస్పత్రులు, 3 ప్రాంతాల్లో పిల్లల ఆస్పత్రులు అదనంగా రానున్నాయి. ఏ జబ్బొచ్చినా పేదలకు భరోసా ఇచ్చేలా 2,436 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ జబ్బులనూ ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రైవేటు వైద్యమాఫియా నుంచి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మహారోగాల నుంచి బిడ్డల్ని కాపాడుకున్నట్టే! ఎందు కంటే, స్వార్థంతో వైద్యాన్ని అంగడి సరుకు చేసి, ఆర్థికంగా బలోపేతమైన వ్యవస్థ ప్రైవేటు వైద్య రంగం. అంగబలం, అర్థబలంతో ఊడలు నేలలోకి దిగిన మర్రి చందమే! ఎంతకైనా తెగించగలదు. ప్రజారోగ్య వ్యవస్థలు ఇదివరకు లేనివి కావు! వాటిని నిర్వీర్యం చేసి, శకాలపై బంగళాలుగా ఎదిగిన విషసంస్కృతి కార్పొరేట్ వైద్య వ్యవస్థది. జనహితంలో ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేస్తున్న ప్రభుత్వాలు తమ నిఘా, నిర్వహణ యంత్రాంగంతో నిరంతరం కాపెట్టుకొని ఉండాలి. ప్రజారోగ్య వ్యవస్థని, తద్వారా ప్రజారోగ్యాన్ని, అంతిమంగా ప్రజల్ని కాపాడుకోవాలి. -
ప్రజారోగ్య విధ్వంసం... కారకులెవరు?
మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకే అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడటమే సులభమని భావిస్తూ వచ్చారు. ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కుదించాలని పిలుపునిచ్చే వారిదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూ పోయింది. ప్రజారోగ్య మౌలిక వ్యవస్థలో మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు రోగులు తమ మడతమంచాలను తామే తెచ్చుకున్నారని, అనేకమంది నేలపై బెడ్ షీట్లు వేసుకుని పడుకున్నారని ఒక జాతీయ పత్రిక నివేదించింది. ఇక పాట్నాలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఆసుపత్రుల్లో చేరాలంటేనే ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవడానికే వీరు ప్రాధాన్యమిస్తున్నారని, దేవుడు కరుణించకపోతే ఇంటిలోనే చావాలని కోరుకుంటున్నారని ఒక ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది. ఈ రెండు వార్తా నివేదికలు మన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంత దిగజారిపోయిందో తేల్చి చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎంత తీవ్రంగా చొచ్చుకుపోయింది అనే వాస్తవాన్ని ఈ రెండు వార్తా కథనాలు స్పష్టం చేశాయి. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంతగా మట్టిగొట్టుకుపోయింది అనే విషయం అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చి ఉంటే ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాపేక్షంగా సులభతరమై ఉండేది. దేశంలో ఎంత దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయో చెప్పడానికి పంజాబ్‌లోని అబోహర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో 68 గ్రామాలకు కలిపి ఒకే ఒక ఆసుపత్రి ఉన్న వైనాన్ని గుర్తించాలి. ఈ ఆసుపత్రిలోనూ ఒక్కటంటే ఒక్క ఆక్సిజన్ పడక లేదు. దేశంలోని ఇతర గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి, పట్టణ ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విరుచుకుపడటానికి ముందుగా, ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ దాదాపుగా కుప్పగూలిపోయిన స్థితిలో ఉంది. కానీ ఈ పరిస్థితి మనపై పెద్దగా ప్రభావితం చూపదు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేశాం. గ్రామీణ కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం మొత్తంగా దారిద్య్ర రేఖ దిగువకు పడిపోతుందని అనేక అధ్యయనాలు మనకు చూపించాయి. వైద్య బిల్లులు చెల్లించాలంటే వీరు తరచుగా రుణాలు తీసుకోవలసి ఉంటుంది. దీంతో వారు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. వైద్య చికిత్స కోసం గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 74 శాతం మంది ప్రైవేట్ రంగంపైనే ఆధారపడుతున్నారు. దీంతో ప్రజారోగ్య సంరక్షణ పేదలకు అందుబాటులో లేకుండా పోయింది. కోవిడ్–19 మహమ్మారి విరుచుకుపడటంతో నగరాల్లోని ఆసుపత్రులలో ఆక్సిజన్, ఔషధాలు, పడకలు నిండుకున్నాయి. దీంతో రోగుల బంధువులు, స్నేహితులు సహాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన నగరాల్లోనూ ప్రజారోగ్య సంరక్షణ కుప్పగూలిపోవడానికి సిద్ధంగా ఉందని కాస్త ఆలస్యంగానైనా సరే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవు. రోగులను వారి బంధువులు ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి ప్రవేశం కోసం తీసుకెళుతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఇది నగర మధ్యతరగతిని తీవ్రంగా కంపింపజేస్తోంది. విషాదమేమిటంటే నగరాల్లోని చాలా కుటుంబాలు తమ ప్రియతములను ఇప్పటికో కోల్పోయాయి. మీ ఫేస్బుక్ టైమ్‌లైన్‌ని కాస్త తెరిచి చూడండి, ప్రాణాంతక మహమ్మారి బారిన పడి కన్నుమూసిన వారి బంధువులు, స్నేహితులు నివాళి పలుకుతున్న దృశ్యాలు విస్తృతంగా మీకు కనిపిస్తాయి. సకాలంలో ఆసుపత్రిలో ప్రవేశం దొరికి వైద్య సహాయం అంది ఉంటే అనేకమంది ప్రాణాలు నిలిచేవని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టే కరోనా సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఇంతగా పెరగడానికి ఆరోగ్య మౌలిక వసతులు తగినంత లేకపోవడమే కారణమని అర్థమవుతోంది. కానీ మనం ఒక విషయంలో స్పష్టతతో ఉండాలి. మనం వ్యవస్థను తప్పుపట్టే ముందు.. ప్రజారోగ్య వ్యవస్థను ప్రైవేటీకరిస్తున్నప్పుడు మనందరం మూగ ప్రేక్షకుల్లా నిలబడి చూస్తుండిపోవడం వాస్తవం కాదా? బడ్జెట్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై ప్రభుత్వ పెట్టుబడులపై తీవ్రంగా కోత విధించేవైపుగా ప్రభుత్వ విధానం కొట్టుకుపోతున్నప్పుడు జాతీయ స్రవంతి ఆర్థికవేత్తలను, మీడియాను ప్రశ్నించడంలో మనం విఫలం కాలేదా? మారిన ప్రభుత్వ విధానం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే ఆలోచన మన మనస్సుల్లో ఉంది కాబట్టే నిమ్మళంగా ఉండిపోయాం. మన చుట్టూ మృత్యుదేవత తాండవిస్తున్న దృశ్యాలైనా మనలను మేల్కొల్పుతాయా అంటే హామీ ఇవ్వలేను. కానీ ట్విట్టర్లో ఎవరో ప్రభుత్వ ఆసుపత్రులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని నివేదించారు కూడా. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజారోగ్య వ్యవస్థతో ప్రభుత్వం ఎలా చెలగాటమాడుతూ వచ్చిందో ఇది తేల్చి చెప్పింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ సైతం జిల్లా ఆసుపత్రులను ప్రైవేటీకరించాలని, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాలోకి వీటిని తీసుకురావాలని సూచించింది. దేశంలోని అగ్రశ్రేణి ఆసుపత్రులు వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఎంతమంది విధాన నిర్ణేతలు, మీడియా వ్యక్తులు, కార్పొరేట్ బడా సంస్థలు అభినందనలు తెలియజేశాయో మర్చిపోవద్దు. పైగా ద్రవ్యలోటును పరిమితుల్లో పెట్టడానికి సామాజిక రంగంపై పెడుతున్న పెట్టుబడులపై కోత విధించాలని కొందరు సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలు కూడా సెలవిచ్చారని మనం మర్చిపోరాదు. నిజానికి, పార్లమెంటులో జరిగిన ప్రతి బడ్జెట్ సమావేశమూ ద్రవ్యలోటుపైనే కన్నేసి ఉంచిందని మర్చిపోకూడదు. గత సంవత్సరం అంటే 2020లో నీతి ఆయోగ్ మళ్లీ 250 పేజీల విధాన పత్రంతో ముందుకొచ్చింది. కొత్తగా నెలకొల్పనున్న లేదా ఇప్పటికే కొనసాగుతున్న ప్రైవేట్ వైద్య కళాశాలలను పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా జిల్లా ఆసుపత్రులతో అనుసంధానం చేసే పథకాలను తీసుకురావాలని ఈ పత్రం పేర్కొంది. విదేశాల్లోని ఉత్తమ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆరోగ్య మౌలికవసతుల రంగాన్ని ఎలా ప్రైవేటీకరించాలో తెలిపే మార్గదర్శినిని కూడా నీతి ఆయోగ్ పేర్కొంది. పైగా, కొద్దిమంది ఆరోగ్య కార్యకర్తలు మినహా దేశంలోని ప్రతి ఒక్కరూ వీటిపట్ల కూడా మౌనం వహించారు. ఇదే నిజమైన సమస్య. మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకో అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి వీరు ఏమాత్రం ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడమే సులభమని వీరు భావిస్తూ వచ్చారు. కానీ ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైనదిగా రేటింగ్ ఉంటున్న బ్రిటన్ లోని పబ్లిక్ సెక్టర్ నేషనల్ హెల్త్ సర్వీస్‌పై వీరు ఎందుకు చూపు సారించరు అని నాకు ఆశ్చర్యమేస్తుంది. ఏదేమైనప్పటికీ ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కోసిపడేయాలని పిలుపునిచ్చే ఆర్థిక వేత్తలదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూనే పోయింది. ప్రజారోగ్యానికి డబ్బు తక్కువగా ఉన్నట్లయితే, ఆరోగ్య మౌలిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకుపోగలం? అంతర్జాతీయ సంస్థలు చెప్పిందానికల్లా గుడ్డిగా తలూపుకుంటూ పోదామా? క్రెడిట్ రేటింగ్ సంస్థల ఆదేశాలను మనమెందుకు పాటించాలి? విషాదకరమేమంటే ద్రవ్యలోటును తగ్గించడం అనే మందునే మన కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ పోతున్నాయి. మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ప్రాణాంతక సెకండ్ వేవ్ మనల్ని పునరాలోచనలో పడవేస్తుందని, మన ఆర్థిక విధానాలపై విధాన నిర్ణేతలు పునరాలోచించి ఆత్మనిర్భర్ భారత్ సవాళ్లను ఎదుర్కోగలరని ఆశిద్దాం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
టీకా ధరల విధానాన్ని పునఃసమీక్షించండి
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ధరల విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విధానం ప్రజారోగ్యం అనే హక్కుకు నష్టదాయకంగా మారే పరిస్థితి కనిపిస్తోందని ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అత్యవసరాల సరఫరా, సేవలపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. ఉత్పత్తిదారులు ఒకే రకమైన టీకాకు రెండు వేర్వేరు ధరలను సూచించారని కోర్టు గుర్తుచేసింది. కేంద్ర ప్రభుత్వానికి తక్కువ ధరకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తామని ప్రతిపాదించారని వెల్లడించింది. వివక్ష మంచి పరిణామం కాదు 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా అందజేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారని, ధరల్లో వ్యత్యాసం వల్ల వారికి టీకా అందకపోయే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సామాజికంగా వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల ప్రజలకు అధిక ధరకు టీకా కొనుక్కునే స్థోమత ఉండదని గుర్తుచేసింది. ధరల్లో వ్యత్యాసం అనేది అంతిమంగా అసమానతకు దారి తీస్తుందని తేల్చిచెప్పింది. అర్హులకు టీకా అందడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, ఆయా ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ప్రజలకు ఉచితంగా లేదా రాయితీతో కరోనా టీకా ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చని సూచించింది. కేంద్ర ప్రభుత్వం 45 ఏళ్ల వయసు దాటిన వారికి ఇప్పటికే ఉచితంగా టీకా అందజేస్తోందని గుర్తుచేసింది. వ్యాక్సినేషన్ విషయంలో వేర్వేరు వర్గాల మధ్య వివక్ష చూపడం మంచి పరిణామం కాదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. జీవించే హక్కు(ప్రజారోగ్య హక్కు), వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకునే హక్కు అందరికీ ఉందని స్పష్టం చేసింది. ఈ హక్కుకు భంగం కలుగనివ్వరాదని పేర్కొంది. ఆర్టికల్ 14(చట్టం ముందు అందరూ సమానమే), ఆర్టికల్ 21 పరీక్షకు నిలిచేలా కరోనా టీకా ధరల విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ నిల్వల జాబితా రూపొందించండి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రాణ వాయువు నిల్వల జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి రూపొందించాలని సుప్రీంకోర్టు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ ఉపయోగించుకొనేలా చూడాలని పేర్కొంది. నిల్వలు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని వికేంద్రీకరించాలని, తద్వారా అవసరమైన ప్రాంతాలకు వేగంగా సరఫరా చేసేందుకు వీలుంటుందని వెల్లడించింది. అనూహ్యమైన పరిణామాలు ఉత్పన్నమైనప్పటికీ ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి విఘాతం కలుగరాదని స్పష్టం చేసింది. రానున్న నాలుగు రోజుల్లో అత్యవసర ఆక్సిజన్ నిల్వలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్డౌన్ విధించే అవకాశాన్ని పరిశీలించండి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్డౌన్ విధించే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. లాక్డౌన్ విధించాలని నిర్ణయిస్తే ముందుగానే తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఈ మేరకు 64 పేజీల ఆర్డర్‌ను న్యాయస్థానం తన వెబ్సైట్లో పొందుపర్చింది. కరోనా బాధితులకు 4.68 లక్షల పడకలు దేశంలో కరోనా వైరస్ బారినపడిన వారి కోసం 2,084 ఆసుపత్రుల్లో 4.68 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ఒక అఫిడవిట్ సమర్పించింది. ఈఎస్ఐసీ, రక్షణ, రైల్వేశాఖ, పారామిలటరీ దళాలు, ఉక్కు శాఖ పరిధిలో ఉన్న ఆసుపత్రులను కోవిడ్–19 ఆసుపత్రులుగా మార్చినట్లు వెల్లడించింది. 3,816 రైల్వే కోచ్‌లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చామని గుర్తుచేసింది. -
2021–22లో ఆర్థిక వ్యవస్థ ‘వి’ షేప్ జోరు..
‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు.. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భరిస్తున్న ఆహార సబ్సిడీ బిల్లును తగ్గించుకోక తప్పని పరిస్థితి. పీడీఎస్ రేట్లను పెంచాల్సిందే. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించడం ద్వారా.. ఆరోగ్యం, వైద్యం కోసం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. కరోనాతో చతికిలపడిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలంగా పురోగతి సాధిస్తుంది. 2021–22లో 11 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి’’ అంటూ 2020–21 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంటు ముందుంచారు. ఏటా బడ్జెట్‌కు ముందు విడుదల చేసే ఆర్థిక సర్వే ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంటుంది. న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020–21లో జీడీపీ మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వీ షేప్ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని పేర్కొంది. కరోనా నివారణ వ్యాక్సిన్ల కార్యక్రమం ఇందుకు చేదోడుగా నిలుస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. జీడీపీ చివరిగా 1979–80 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. వ్యవసాయ రంగం ఒక్కటీ ఆశాకిరణంగా కనిపిస్తోందంటూ.. సేవలు, తయారీ, నిర్మాణరంగాలు లాక్డౌన్లతో ఎక్కువగా ప్రభావితమైనట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. సంస్కరణలు, నియంత్రణల సరళీకరణ, మౌలిక రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగానికి ఊతమివ్వడం, వ్యాక్సిన్లతో విచక్షణారహిత వినియోగం పుంజుకోవడం, తక్కువ వడ్డీ రేట్లతో రుణాల లభ్యత పెరగడం వంటివి వృద్ధికి దోహదపడతాయని అంచనా వేసింది. 17 ఏళ్ల తర్వాత కరెంటు ఖాతా మిగులును చూపించబోతున్నట్టు తెలిపింది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ ద్రవ్యపరమైన చర్యలు చిన్నగానే ఉన్నాయి. కానీ, ఆర్థిక రికవరీకి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. దీంతో భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ద్రవ్యపరమైన ప్రోత్సాహక చర్యలను ప్రకటించేందుకు వెసులుబాటు ఉంది’’ అని సర్వే పేర్కొంది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. సాగు.. సంస్కరణల బాట వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉందని.. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ‘‘వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగాన్ని చూడాల్సిన అవసరం ఉంది’’ అని విశదీకరించింది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ వ్యవసాయ రంగం తన బలాన్ని చాటుకుంటుందని పేర్కొంది. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనాతో నేలచూపులు చూసిన వేళ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయని తెలిపింది. రుణ, మార్కెట్ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగిందని వివరించింది. దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదంటూ.. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉందని పేర్కొంది. ‘‘నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. హైబ్రిడ్, ఇతర మెరుగుపరిచిన విత్తనాల వాడకం, భిన్నమైన వంగడాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విత్తన పరీక్షా కేంద్రాలను పెంచడం వంటివి తక్కువ ఉత్పాదకత ఆందోళనలను తగ్గిస్తుంది’’ అంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సాగు రంగం విషయమై సర్వే తన విస్తృతాభిప్రాయాలను తెలియజేసింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తూ.. గ్రామస్థాయి కొనుగోళ్ల కేంద్రాలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి, ఏపీఎమ్‌సీ మార్కెట్లకు బయట విక్రయించుకునే అవకాశం, గోదాముల నవీకరణ, రైల్వే రవాణా సదుపాయాల అభివృద్ధి అవసరమని తెలియజేసింది. ఈ చర్యలు ఉత్పత్తి అనంతరం నష్టాలను తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కూడా సాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది. మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయని సూచిస్తూ.. ఇందుకోసం గ్రామీణ వ్యవసాయ పాఠశాలల ఏర్పాటును ప్రస్తావించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి. కొత్త చట్టాలతో రైతులకు స్వేచ్ఛ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో బలంగా సమర్థించుకుంది. నూతన తరహా మార్కెట్ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయని పేర్కొంది. దేశంలో చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దీర్ఘకాలంలో మెరుగుపరుస్తాయని తెలిపింది. మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించినట్టు వివరించింది. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలపై తన వాదనను సమర్థించుకుంది. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీల (ఏపీఎమ్‌సీ) విషయంలో సంస్కరణల అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కిచెప్పింది. మౌలిక రంగానికి ప్రాముఖ్యత.. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైనదిగా పేర్కొంది. అన్‌లాక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగాలు వృద్ధి దిశగా పయనిస్తున్నాయంటూ, రోడ్ల నిర్మాణం తిరిగి కరోనా ముందు నాటి వేగాన్ని సంతరించుకుంటుందని అంచనా వేసింది. సంక్షోభానంతర సంవత్సరంలో (2021–22) క్రమబద్ధమైన చర్యల ద్వారా ఆర్థిక రికవరీకి వీలు కల్పించాలని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి దీర్ఘకాలిక వృద్ధి క్రమంలోకి కుదురుకునేలా చూడాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. 2020–25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేదిగా అభివర్ణించింది. ఇన్ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు.. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసినట్టు తెలియజేసింది. ‘రేషన్’ రేట్లను పెంచాల్సిందే ఆహార సబ్సిడీ నిర్వహించలేని స్థితికి చేరిందంటూ స బ్సిడీలను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఉందంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం పెంచాలంటూ సూచించింది. రేషన్ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. పీడీఎస్ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020–21 బడ్జెట్లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించడం గమనార్హం. ప్రజారోగ్యానికి పెద్దపీట.. ప్రజారోగ్యం కోసం జీడీపీలో కేటాయింపులను ఒక శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలంటూ ఆర్థిక సర్వే ముఖ్యమైన సూచన చేసింది. దీనివల్ల ప్రజలు తమ జేబుల నుంచి చేసే ఖర్చును తగ్గించడం సాధ్యపడుతుందని తెలిపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాలు పెరిగితే.. అది ప్రస్తుతమున్న ఖర్చులు 65 శాతం నుంచి 30 శాతానికి తగ్గేందుకు తోడ్పడుతుందని వివరించింది. లాక్డౌన్ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడిందని సర్వే పేర్కొంది. సంక్షోభాలను తట్టుకునేవిధంగా ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సర్వే సూచించింది. గ్రామీణ విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల జోరు గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020–21లో 61 శాతానికి పెరిగినట్టు ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చని సూచించింది. ‘‘డేటా నెట్వర్క్, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, స్మార్ట్ఫోన్ల సేవలకు ప్రాధాన్యం పెరిగింది. డిస్టెన్స్ లెర్నింగ్, గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసే అవకాశం ఇందుకు కారణం’’ అని సర్వే తెలిపింది. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను ఇందులో ప్రస్తావించింది. దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది వృద్ధి రుణ స్థిరత్వానికి దారితీస్తుంది. ఒకవేళ భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2023–2029 మధ్య 3.8% కనిష్ట రేటు నమోదైనా కానీ, దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది. భారత్ తప్పకుండా వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో మరింత మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం సాధ్యపడుతుంది. వృద్ధి 85% పేదరికాన్ని తగ్గించగలదు. జీడీపీలో ప్రజారోగ్యంపై ఖర్చును 2.5%కి పెంచితే.. అది ఒక సాధారణ కుటుంబం ఆరోగ్యం కోసం చేసే ఖర్చును 65% నుంచి 35%కి తగ్గిస్తుంది. – కేవీ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వంద సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే సంక్షోభంగా ఆర్థిక సర్వే అభివర్ణించింది. ► ప్రభుత్వ వినియోగం, ఎగుమతులు వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020–21 ద్వితీయార్ధంలో ఎగుమతులు 5.8% తగ్గొచ్చు. దిగుమతులు సైతం 11.3 శాతం తగ్గొచ్చు. ► 2020–21లో కరెంటు ఖాతాలో 2% మిగులు. ► రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదు. ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ► 2014–15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018–19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020–21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా రోజువారీ 22 కిలోమీటర్లకు పడిపోయింది. అన్‌లాక్‌తో తిరిగి ఇది పుంజుకోనుంది. ► కరోనా మహమ్మారి సవాళ్లలోనూ భారత ఏవియేషన్ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదని నిరూపించింది. ► 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. ► రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ► కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రకటించగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంతరించుకున్న వెంటనే వీటిని ఉపసంహరించుకోవడంతోపాటు, ఆస్తుల నాణ్యత మదింపు చేపట్టాలి. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఇప్పటికీ స్వర్గధామం. 2020 నవంబర్‌లో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 9.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్‌పీఐలను ఆకర్షించింది భారత్ ఒక్కటే. ► భారత కంపెనీలు 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.92,000 కోట్లను సమీకరించాయి. ఇది అంతక్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం అధికం. ► 9–12 తరగతుల విద్యార్థులకు దశల వారీగా వొకేషనల్ కోర్సులు. ► సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020–21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ► కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం... ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్–జేఏవై)ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, అమలు చేయని రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి, శిశు, చిన్నారుల మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతోంది. ► పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని పటిష్టం చేయాలి. ఇందుకోసం స్వతంత్ర వ్యవస్థ. ► ఐటీ–బీపీఎమ్ రంగం 2019–20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ ఎంతో వేగాన్ని సంతరించుకుంది. డేటా వ్యయం తగ్గి మరింత అందుబాటులోకి వచ్చింది. నెలవారీ సగటున ఒక చందాదారు వైర్లెస్ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది. ► ద్రవ్యోల్బణం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా చూసేందుకు ఆహారోత్పత్తులకు ఉన్న వెయిటేజీలో మార్పులు చేయాలి. కోవిడ్–19 మహమ్మారిపరమైన గడ్డుకాలం గట్టెక్కామని, ఎకానమీ తిరిగి వేగంగా కోలుకుంటుందన్న ఆశాభావం సర్వేలో వ్యక్తమైంది. టీకాల లభ్యత, సేవల రంగం రికవరీ వంటి అంశాలు వృద్ధికి మరింతగా ఊతమివ్వగలవు. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఎకానమీ ప్రస్తుత అవసరాలకు తోడ్పడే పలు కీలక అంశాలను సర్వేలో పొందుపర్చారు. రాబోయే బడ్జెట్లోనూ ఇవి ప్రతిఫలించగలవని ఆశిస్తున్నాం. మరిన్ని రంగాలు పటిష్టమైన వృద్ధి బాట పట్టాలంటే 2021 ఆసాంతం ప్రభుత్వం నుంచి నిరంతరం సహాయ, సహకారాలు అవసరం. – ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్, ఫిక్కీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలతో సర్వే ఆశావహ దృక్పథంతో రూపొందింది. కోవిడ్–19 వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు పూర్తిగా నిర్మూలించగలిగితే 2021–22లో మరింత అధిక స్థాయిలోనూ వృద్ధి సాధించగలిగే అవకాశం ఉంది. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం పట్టాలు పంపిణీ జరుగుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీలన్నింటిలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి ఇల్లు నిర్మాణ పనులు మొదలు పెట్టే సమయానికి.. అక్కడ ఇళ్ల సంఖ్య ఆధారంగా అవసరమైన మేరకు బోర్ల తవ్వకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోరు తవ్విన చోట నీటిని నిల్వ ఉంచడానికి వీలుగా పెద్ద పెద్ద నీటి తొట్టెలు లేదా ప్లాస్టిక్ ట్యాంక్‌లను ఏర్పాటు చేయబోతోంది. ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులు కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలలో లే అవుట్లు వేసి, 30.76 లక్షల కుటుంబాలకు మహిళల పేరిట ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించే ప్రక్రియను కూడా శుక్రవారం సీఎం జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 15 నాటికి పూర్తి ► లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీలో నీటి వసతిని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపిక చేసిన దాదాపు 8,000 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పనకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.920 కోట్లు నీటి వసతి కోసం ప్రభుత్వం వెచ్చించనుంది. ► గృహ నిర్మాణ శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఇళ్ల స్థలాల వివరాలను సేకరించి.. ఎన్ని బోర్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అంచనాలు తయారు చేసే పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు ఆర్డబ్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ► మొదటి దశకు ఎంపిక చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మార్చి 15 నాటికి నీటి వసతి కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి మొదటి వారం కల్లా జిల్లాల వారీగా ఏయే కాలనీలలో ఎన్ని బోర్లు అవసరం అన్న దానిపై అంచనాలు సిద్ధం అవుతాయని ఆర్డబ్ల్యూఎస్ సీఈ సంజీవరెడ్డి చెప్పారు. పట్టణ కాలనీల్లో పబ్లిక్ హెల్త్.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేపడుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు మార్చి 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిర్ధేశించుకున్న కాలనీలన్నింటికి నీటి వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. – ఆర్.వి.కృష్ణారెడ్డి, ఈఎన్సీ, ఆర్డబ్ల్యూఎస్ పట్టణాల్లోని కాలనీల్లో నీటి వసతికి రూ.279 కోట్లు వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా కోసం తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన కాలనీల్లో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. బోర్లు వేయడంతో పాటు నీటి సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.279 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఈమేరకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. – చంద్రయ్య, ఈఎన్సీ, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం -
కోవిడ్–19పై శక్తివంచనలేకుండా పోరు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని కోవిడ్–19 ప్రభావం నుంచి తప్పించడానికి తగిన చర్యలను నిరంతరం తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్ డెవలప్మెంట్ కమిటీ ప్లీనరీ 102వ సమావేశాన్ని ఉద్దేశించి శుక్రవారం ఆమె మాట్లాడారు. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతానికి సమానమైన ఉద్దీపన ప్యాకేజ్సహా, కార్మిక రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తున్నట్ల వివరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... కరోనా వైరస్ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పేదరికం నిర్మూలనకు పలు సంవత్సరాలుగా జరుగుతున్న కృషి తాజా పరిస్థితుల్లో నీరుగారిపోయే వాతావరణం నెలకొంది. మహమ్మారి ప్రభావం సామాజిక, ఆర్థిక రంగాలపై పడకుండా తగిన చర్యలు అన్నింటినీ భారత్ ప్రభుత్వం తీసుకుంటోంది. నాబార్డ్ ద్వారా రీఫైనాన్షింగ్ మద్దతు మార్గంలో గ్రామీణ రంగానికి అండగా నిలవడం జరుగుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులను పెంచడం జరిగింది. ప్రత్యేకించి ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి తగిన కృషి జరుగుతోంది. మహమ్మారి నిర్మూలనకు ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. ఈ దిశలో తనవంతు సహకారం, అనుభవ పాఠాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంటుంది. 80 సంవత్సరాల్లో ఎన్నడూలేని విపత్కర పరిస్థితి: ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ కాగా కరోనా మహమ్మారి ప్రతికూలతల నేపథ్యంలో ప్రపంచం గత 80 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడ్డాయి. రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వార్షిక సమావేశం శుక్రవారం ముగిసింది. అనంతరం విడుదలైన ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘‘కోవిడ్–19 వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగింది. అసమానతలు తీవ్రమయ్యాయి. దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ సమస్య తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రపంచదేశాలన్నీ ఒకతాటిపైకి రావాలి. పరస్పర సహకారంతోనే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది’’ అని ప్రకటన పేర్కొంది. ఇదిలావుండగా, జూన్ 2021 నాటికి కరోనా వైరస్ పోరులో భాగంగా 160 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించడానికి ప్రపంచబ్యాంక్ తగిన కృషి జరపాలని బ్యాంక్ స్టీరింగ్ కమిటీ శుక్రవారం విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు అదనపు అత్యవసర నిధి, రుణ సౌలభ్యతలను కలిగించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల సహాయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ కూడా కరోనా పోరు విషయంలో తన చర్యలను మరింత ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
ప్రజారోగ్యం, సంక్షేమంపై దృష్టి పెట్టాలి
వాషింగ్టన్: కోవిడ్–19 మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్ తక్షణం ప్రజారోగ్యం, పేద ప్రజల కనీస అవసరాలను తీర్చడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్రిస్టాలినా జార్జియేవా పేర్కొన్నారు. అలాగే లఘు, చిన్న మధ్య తరహా ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఆయా సంస్థలను వ్యాపార పరంగా కుప్పకూలకుండా చూడవచ్చని పేర్కొన్నారు. ఆయా చర్యలతో దీర్ఘకాలంలో దేశాన్ని వృద్ధి బాటలో విజయవంతంగా నడిపించవచ్చని విశ్లేషించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సదస్సు నేపథ్యంలో ఎండీ మీడియాను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రపంచదేశాలన్నీ ఆరోగ్య రంగంపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి గట్టెక్కితే ఎన్నో అవరోధానాలు అధిగమించవచ్చు. అనిశ్చితి, అసంపూర్తి ఆర్థిక రికవరీ పరిస్థితుల నుంచీ బయటపడవచ్చు. ► కోవిడ్–19... ప్రపంచ మానవాళికి ఒక సంక్షోభం. భారత్‌సహా పలు దేశాల్లో మృతుల సంఖ్య తీవ్రంగా ఉంటోంది. ► సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి భారత్ తన శక్తిసామర్థ్యాల మేరకు కృషి చేస్తోంది. ప్రత్యక్ష్య ద్రవ్య పరమైన చర్యలు లేకపోయినా, ఉద్దీపనలతో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి కృషి చేస్తోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న కొన్ని దేశాల ఉద్దీపనలతో పోల్చితే ఇది తక్కువే. గణనీయమైన ఉద్దీపనలను అందించడంలో భారత్ ఆర్థిక వ్యవస్థకు పరిమితులు ఉన్నాయి. 2020లో 10.3 శాతం క్షీణిస్తుందని అంచనావేసిన ఐఎంఎఫ్, అయితే 2021లో దేశం 8.8 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని ఇప్పటికే విశ్లేషించింది. తద్వారా తిరిగి వేగంగా వృద్ధి చెందుతున్న హోదాను దక్కించుకుంటుందని పేర్కొంది. ► కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డానికి ప్రపంచదేశాలు తగిన పటిష్ట ఆర్థిక చర్యలను తీసుకోవాలి. అయితే ఇలాంటి పటిష్ట ఆర్థిక మూల స్తంభాలను కష్టాలు రావడానికి ముందే నిర్మించుకోవాలి. ఇది మనకు కరోనా తాజాగా నేర్పిన పాఠం. ‘బ్రెట్టన్ వుడ్స్’ తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రపంచం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచం కొత్తగా ‘బ్రెట్టన్ వుడ్స్ సమావేశం’ నాటి స్థితిగతులను ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్ ఎండీ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భవిష్యత్ ఘర్షణల నివారణ, పరస్పర ఆర్థిక సహకారం లక్ష్యంగా పటిష్టమైన ప్రపంచస్థాయి సంస్థలు, ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు 1944లో అమెరికా, న్యూ హ్యాంప్‌షైర్, కారోల్లోని బ్రెట్టన్ వుడ్స్ ప్రాంతంలో మిత్రపక్ష దేశాలు జరిపిన సమా వేశం అదే ప్రాంతం పేరుతో ప్రసిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా నిలబెట్టడానికి పటిష్ట చర్యలు అవసరమని పేర్కొంటూ, ‘‘ప్రస్తుతం మనం బ్రెట్టన్ వుడ్స్ తరహా పరిస్థితిన ఎదుర్కొంటున్నాం. మహమ్మారి లక్షలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4.4 శాతం క్షీణతలోకి జారే పరిస్థితి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 11 ట్రిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తి నష్టపోతున్నామన్న అంచనా ఉంది. దశాబ్ద కాలాల్లో మొట్టమొదటిసారి లక్షలాదిమంది పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. మానవాళికి తీవ్ర సంక్షోభ పరిస్థితి ఇది. ఇప్పుడు మన ముందు రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి కరోనాతో పోరాటం. రెండు అత్యుత్తమైన రేపటిరోజును నేడు నిర్మించుకోవడం. ఈ దిశలో వృద్ధి, ఉపాధి కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల జరగాలి. ఇందుకు పటిష్ట ఆర్థిక విధానాలు, సంస్థలు అవసరం. ప్రపంచ దేశల పరస్పర సహకారం ఇక్కడ ఎంతో కీలకం’’ అని సదస్సును ఉద్దేశించి ఐఎంఎఫ్ ఎండీ అన్నారు. ‘వీ’ నమూనా వృద్ధి కనిపిస్తోంది: నిర్మలా సీతారామన్ ఇదిలావుండగా, ఐఎంఎఫ్ మంత్రిత్వస్థాయి కమిటీ అయిన అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సంఘం (ఐఎంఎఫ్సీ) వీడియోకాన్ఫరెన్స్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడారు. భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి పలు విభాగాల్లో ‘వీ’ (ఠి) నమూనా వృద్ధి కనబడుతోందని ఈ సందర్భంగా వివరించారు. దేశ ఆర్థిక పురోగతికి భారత్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఐఎంఎఫ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. -
తప్పుదోవ పట్టిస్తున్న ఈ-కామర్స్ ఉత్పత్తులు
తరచుగా పునరావృతమయ్యే సామెత - పరిశుభ్రతే దైవం. ఇది వ్యక్తిగత పరిశుభ్రత సారాంశం.. ఆవశ్యకతను తెలుపుతుంది. అంతేకాదు, శుభ్రంగా ఉండటమనేది భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటుంది. తొలుత, ప్రజలు అందంగా కనబడేందుకు ఈ ఆధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు లేని వేళ సహజ సిద్ధమైన ఉత్పత్తులు వాడుతుండేవారు. అయితే, శాస్త్రీయ ఆవిష్కరణల కారణంగా విస్తృతశ్రేణిలో అత్యాధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. తల్లులు, శిశువుల ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో తమదైన వాటాను ఆక్రమించుకుంటున్నాయి. వృద్ధి చెందుతున్న ఆదాయం, స్థిరమైన జీవితంతో ప్రజలు ఇప్పుడు ఈ తరహా వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అవి సహజసిద్ధంగా మరియు ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేరొందిన కంపెనీలు అయిన హిమాలయ, డాబర్, ఇమామీ మరియు ఈ విభాగంలో ఇతర ఆయుర్వేద కంపెనీలు ఉన్నప్పటికీ, స్థిరంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్అదే తరహా వృద్ధి అవకాశాలను నూతన కంపెనీలకు కూడా అందిస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన నూతన ఈకామర్స్బ్రాండ్స్, తమ తల్లులు, పిల్లల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యంత సహజమైనవని వాదిస్తుండటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే, తమకు అత్యంత ప్రజాదరణ తీసుకువచ్చిన ఈ వాదనలలోని ఆధీకృత ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే చాలా వరకూ ఉత్పత్తులలో లేబులింగ్ మరియు ధృవీకరణలలో పారదర్శకత అనేది లోపించింది. బహుశా, తమ ఉత్పత్తులను మార్కెట్చేయడం, తమ వినియోగదారుల సంఖ్యను వృద్ధి చేసుకోవడం మరియు అమ్మకాలను రెట్టింపు చేసుకోవడానికి నూతన తరపు కంపెనీలు తమ ఉత్పత్తులను సహజసిద్ధమైనవని తప్పుగా పేర్కొంటున్నాయి. తమ ఉత్పత్తులలో రసాయనాలు ఉన్నప్పటికీ అవి శాస్త్రీయంగా హానికారకం కాదని నిరూపితం కాలేదు. వాటినే వారు సహజసిద్ధమని వెల్లడిస్తున్నారు. కానీ రసాయనాలతో కూడిన ఓ ఉత్పత్తి సహజసిద్ధమైనది ఎందుకు అవుతుంది ? దీనికి సరైన నియంత్రణ వ్యవస్థ మరియు ధృవీకరణ ప్రక్రియ లేకపోవడం కూడా కారణమే అని డాక్టర్శర్మ అన్నారు. వినియోగదారు స్నేహ మాట్లాడుతూ.. 'ఇప్పుడు మార్కెట్లో ఎన్నో బేబీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిలోని కొన్ని పదార్థాలు హానికారకమైనవి. కానీ బాధ పడే అంశం ఏమిటంటే, చాలామంది ప్రజలకు ఈ ఉత్పత్తులు చేసే హాని గురించి తెలియకపోవడం మరియు ఆ ప్రకటనలను చూసి చాలామంది వాటిని వినియోగిస్తుంటారు. బేబీ ఉత్పత్తులను వినియోగించడమన్నది వ్యక్తిగత ఎంపిక. నేను మా పిల్లలకు టాల్కమ్ పౌడర్రాయను. ఎందుకంటే చిన్నారుల చర్మానికి టాల్క్ మంచిది కాదు. చిన్నారుల చర్మం మృదువైనది. అందువల్ల ఉత్పత్తుల ఎంపికలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి చర్మంపై ర్యాషెస్వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఉత్పత్తులు ఖచ్చితంగా అతి తక్కువ రసాయనాలు మాత్రమే కలిగి ఉండాలి. సాధారణంగా ప్రజలు ఆ ఉత్పత్తుల యొక్క ఆధీకృతను పరిశీలించరు. లేబుల్స్చూసి వాటిని కొంటుంటారు. కానీ ఎన్నో సార్లు ఈ తరహా ఉత్పత్తులు మీ పాపాయి చర్మంపై హానికారక ప్రభావం చూపవచ్చు. అందువల్ల, ప్రతి వినియోగదారుడూ ఈ ఉత్పత్తులు సహజసిద్ధమైనవా లేదా అని పరిశీలించడంతో పాటుగా కొనేందుకు ముందు వాటిని పరిశీలించాలి’ అని అన్నారు. మార్కెట్లో ఇప్పుడు ఈ తరహా ఈ- కామర్స్ కంపెనీలు విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కూడా తమ ఉత్పత్తులు సహజసిద్ధమైనవని వెల్లడిస్తున్నాయి. ఉత్పత్తి మార్కెట్లో ప్రతి కంపెనీకీ ఎదిగేందుకు హక్కు ఉంది. కానీ తప్పుడు వాదనలు వాంఛనీయం కాదు. ప్రకటనలు, ప్యాకేజింగ్మరియు లేబులింగ్వంటివి వినియోగదారులకు ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించేందుకు మరియు ఉత్పత్తి సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినవి. అందువల్ల వారు సమాచారయుక్త ప్రాధాన్యతలను అందించాల్సి ఉంది. అయితే, దురుద్దేశ్యంతో చేసే లేబులింగ్‌ను ఖచ్చితంగా నివారించాలి. అంతేకాదు, వినియోగదారులు సమాచారంతో కూడిన కొనుగోలుదారుడు కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల, మనమంతా కూడా ఓ ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు పలు కోణాల్లో దానిని పరిశీలించాల్సి ఉంది. ప్రకటనలు, లేబులింగ్‌పై ఆధారపడి వాటిని కొనకూడదు. ఈ ఉత్పత్తులలోని వ్యత్యాసాలు మనకు అంటే వినియోగదారులకు హానికలిగిస్తాయి. -
తెలంగాణ : కరోనా బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ కోవిడ్-19కు సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేసింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 2057 మందికి కరోనా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అందులో 702 మంది కరోనా అనుమానితుల్లో 662 మందికి హోమ్ ఐసోలేషన్ అవసరమని వైద్యులు సూచించారు. కాగా 40 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 21 మందికి నెగిటివ్ అని తేలగా, ఒకరికి మాత్రం కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. కాగా 18 మందికి సంబంధించిన రక్త నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు 5 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలింది. కరోనా సోకిన ఐదుగురు దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చినవారున్నారు. వీరిలో ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ కాగా, మిగతా నలుగురు మాత్రం గాంధీలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. -
ప్రజారోగ్యం సవాళ్లను అధిగమించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం విషయంలో దేశం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లను అధిగమించాలంటే వ్యవసాయ, పోషకాహార శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. దేశం ఆర్థికంగా ఎదుగుతోన్న ఈ తరుణంలోనూ కొంతమంది పోషకాహార లోపాలు, సూక్ష్మ పోషకాల లేమి, ఊబకాయం వంటి అధిక పోషణ సమస్యలు కలిగి ఉండటం బాధాకరమన్నారు. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఎన్ఐఎన్ విశేష సేవలు అందించిందన్నారు. జనాభా పెరుగుదల, మారుతు న్న జీవనశైలుల నేపథ్యంలో అందరికీ పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు వరి సాగు స్థానంలో ఇతర పోషకాలు అందించే పంటలపై పరిశోధనలు ఎక్కువ చేయాలన్నారు. జీవనశైలి మార్పుల వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఉచిత రుణమాఫీపై అభ్యతరం.. రైతులను ఆదుకునే పేరుతో కొన్ని ప్రభుత్వాలు ఉచిత రుణమాఫీలు ప్రకటిస్తుండటంపై ఉపరాష్ట్రపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉచిత పథకాలు రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించినా శాశ్వత పరిష్కారం మాత్రం కాదని తెలిపారు. సుస్థిర అభివృద్ధి కోసం దీర్ఘకాల పరిష్కారాలు అవసరమని, మరీ ముఖ్యంగా ఆహార రంగంలో ఈ అవసరం ఎక్కువగా ఉందన్నారు. ఆరోగ్యకరమైన భోజనంలో ఎలాంటి ఆహారం ఉండాలన్న అంశంపై ఎన్ఐఎన్ సిద్ధం చేసిన సమాచారాన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. కార్యక్రమంలో భారత వైద్య పరిశోధన సమాఖ్య డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత పాల్గొన్నారు. -
వారానికి రెండు రోజులు మద్యానికి దూరంగా..
లండన్ : అతిగా మద్యం సేవించే వారు ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు, మద్యానికి బానిసలు కాకుండా ఉండేందుకు వారానికి రెండు రోజులు లిక్కర్ హాలిడే పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రిటన్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు అతిగా మద్యం సేవిస్తున్నారని, ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.వారంలో రెండు రోజులు మద్యం తీసుకోకుండా లక్ష్యంగా నిర్ధేశించుకోవాలని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ మద్యపాన ప్రియులను కోరింది. రోజూ రాత్రి డిన్నర్‌తో పాటు ఓ గ్లాస్ వైన్ తీసుకునే వారిలో మూడింట రెండు వంతుల మంది మద్యం ముట్టకుండా ఉండటం పొగతాగడం వదిలివేయడం కన్నా కష్టమని భావిస్తున్నట్టు దాదాపు 9000 మందిపై నిర్వహించిన పోల్‌లో వెల్లడైంది. మద్యంతో కాలేయ వ్యాధులతో పాటు హైబీపీ, గుండె జబ్బులు, పలు క్యాన్సర్లు వచ్చే ముప్పు అధికమని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డంకన్ సెల్బీ హెచ్చరించారు. మద్యపానంతో త్వరగా స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ప్రతివారంలో కనీసం రెండు, మూడు రోజులు మద్యం ముట్టకుండా టార్గెట్‌గా పెట్టుకుంటే మద్యం తక్కువగా తీసుకున్న ఫలితంగా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు. వారానికి వరుసగా రెండు రోజులు మద్యానికి విరామం ఇస్తే కాలేయ వ్యాధులతో పాటు తీవ్ర అనారోగ్యాల ముప్పును తప్పించుకోవచ్చని పలు అథ్యయనాలు సూచిస్తున్నాయి. నిత్యం మద్యపాన సేవించడం ద్వారా కేలరీలు అధికమై ఒబెసిటీకి దారితీయడంతో పాటు టైప్ టూ మధుమేహం బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ప్రజావైద్యంపై నమ్మకం పెరిగింది
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్స్ పథకం అమలు, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుప ర్చడం వల్ల ప్రజల్లో ప్రజావైద్యంపై నమ్మకం పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. మాతాశిశు రక్షణలో అమ్మ ఒడి (102) సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఏర్పాటు చేసిన 200 అదనపు వాహనాలను, పట్టణాల్లో అత్యవసర వైద్యసేవలు అందించే 50 బైకు అంబులెన్స్‌లను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటించేందుకు ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా గొప్పదేం కాదు
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా. అత్యంత బలమైన ఆర్ధికవ్యవస్ధ కలిగిన అమెరికా.. గొప్ప దేశం కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రజారోగ్యం(వ్యాధుల నిర్మూలన) విషయంలో అమెరికా 28వ స్ధానంలో ఉందని లాన్సెట్ లో ప్రచురితమైన పరిశోధనలో తేలింది. అమెరికా యూఎన్ సూచనలను ఆచరణలో పెట్టడంలో విఫలం చెందడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఓ వైపు అగ్రరాజ్యం ప్రజల ఆరోగ్య విషయంలో వెనుకబడిపోగా.. యూఎన్ సలహాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఐలాండ్, స్వీడన్, సింగపూర్ దేశాలు టాప్ లో నిలిచాయి. పేదరికం, శుభ్రమైన నీరు, విద్య, సామాజిక అసమానతలు, నూతన పద్ధతుల అవలంబనల ఆధారంగా లాన్సెట్ ఈ పరిశోధన చేసింది. 124 దేశాల్లో దాదాపు 1,870మంది పరిశోధకులు ఏడాదిన్నరకాలం పాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేసి ఈ వివరాలు రూపొందించింది. తాగునీరు, పరిశుభ్రత, పిల్లల వికాసం తదితర అంశాల్లో యూఎస్ మంచి మార్కులు సంపాదించింది. వైయలెన్స్, సహజ వైపరీత్యాలు, హెచ్ఐవీ, ఆత్మహత్యలు, ఆల్కహాల్ లు యూఎస్ ను ర్యాంకింగ్ స్ధానాల్లో కిందకు దిగజార్చాయి. మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే పబ్లిక్ హెల్త్ పై అమెరికా అంతగా దృష్టిసారించడం లేదని తేలింది. యూఎన్ సూచనలతో సాధించిన దేశాల్లో కొన్ని - టిమోర్ లెస్టే అనే చిన్న దేశం కొన్ని సంవత్సరాల యుద్ధంలోనే గడిపింది. 2000సంవత్సరం తర్వాత ప్రజారోగ్య వ్యవస్ధను పునరుద్ధరించుకుంది. - 1990లో ప్రజారోగ్య వ్యవస్ధ పనితీరును మార్చుకున్న తజకిస్ధాన్ ప్రస్తుతం మలేరియాపై సంపూర్ణ విజయం దిశగా సాగుతోంది. - ప్రపంచంలోనే అత్యధిక ఆరోగ్య ఇన్సూరెన్స్ పాలసీలను ప్రజలకు కొలంబియా అందించింది. క్యాన్స్రర్ లాంటి అతిపెద్ద జబ్బులకు కూడా ఇన్సూరెన్స్ ద్వారా చికిత్సను అందిస్తోంది - రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టం చేసిన తైవాన్.. యాక్సిడెంట్ల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. - టొబాకో పదార్ధాల వినియోగానికి వ్యతిరేకంగా పాలసీలను తెచ్చిన ఐలాండ్ ర్యాంకుల జాబితాలో ముందంజలో ఉంది. -
ప్రజారోగ్యం కోసం
స్వయంగా దోమల మందు పిచికారీ చేసిన ఎమ్మెల్యే చిర్ల పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై వినూత్న నిరసన ఆలమూరు : ప్రభుత్వం జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణను సక్రమంగా చేపట్టలేక పోతే వైఎస్సార్ సీపీ ఆ బాధ్యత చేపట్టి ప్రజలను అంటువ్యాధుల నుంచి రక్షిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలం పినపళ్లలో శుక్రవారం నిర్వహించిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పారిశుద్ధ్య పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు. ఇలాంటి దుస్థితి వల్లే జిల్లావ్యాప్తంగా డెంగీ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వినూత్నరీతిలో ఎత్తిచూపాలని సంకల్పించారు. గ్రామంలోని రైతుల నుంచి స్ప్రేయర్లు, క్రిమి సంహారక మందులు తెప్పించి, మాస్క్‌ను ధరించి గ్రామంలోని పలు వీధుల్లో స్వయంగా పిచికారీ చేశారు. పార్టీ శ్రేణులు బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే.., అంటు వ్యాధుల వ్యాప్తిపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే పార్టీ శ్రేణులతో కలిసి పారిశుద్ధ్యం మెరుగుదల పనులు చేశామని జగ్గిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో అంటు వ్యాధుల నివారణకు, డెంగీ కేసులు నియంత్రణకు చర్యలు తీసుకోకుంటే పార్టీ తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పార్టీ నాయకులు కర్రి నాగిరెడ్డి, గొల్లపల్లి డేవిడ్‌రాజు, చల్లా ప్రభాకరరావు, యనమదల నాగేశ్వరరావు, మార్గని గంగాధరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, తమ్మన శ్రీనివాసు, దొమ్మేటి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా క్యాట్ ఫిష్ అమ్మకాలు
కౌడిపల్లి : ప్రజారోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపే నిషేధిత క్యాట్ ఫిష్ (మార్పులు)ను జోరుగా అమ్ముతున్నారు. కౌడిపల్లిలో గురువారం జరిగిన అంగడిలో మంజీర నది పరివాహక ప్రాంతం జోగిపేట, కొల్చారం, పాపన్నపేట ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి విక్రయించారు. అత్యంత కుళ్లిపోయిన జీవరాసుల కళేబరాలను సైతం తిని జీర్ణించుకునే శక్తి క్యాట్‌ఫిష్‌లకు ఉంటుంది. దీంతో వాటిలోని విష పదార్థాలు అలాగే ఉండటం వల్ల వాటిని తిన్నటువంటి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో వ్యాధుల బారిన పడతారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. కౌడిపల్లి అంగడిలో నాలుగైదు వారాలుగా ఒకరిద్దరుగా వచ్చిన వ్యాపారులు అమ్మకాలు నిర్వహించారు. కాగా గురువారం మాత్రం ఏకంగా ఏడుగురు వ్యాపారులు సంచుల్లో క్వింటాళ్లకొద్ది క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి అంగడిలో అమ్మారు. ఒక్కో చేప సుమారు 3 నుండి 5 కిలోల వరకు ఉండగా రూ. 200 నుండి 300 వందలకు గుత్త లెక్కన అమ్మకాలు చేపట్టారు. ఈ చేపల వల్ల కలిగే దుష్పభ్రావాల గురించి తెలియని ప్రజలు వీటిని కొనుగోలు చేశారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పలువురు చెబుతున్నారు. కాగా క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న గ్రామానికి చెందిన యువజన సంఘం సభ్యులు దుర్గేష్, సుధాకర్, కిషోర్‌గౌడ్‌లు తాము పోలీస్, రెవెన్యూ అధికారు ఆ చేపలపై కొనసాగుతున్న నిషేధం అధికారులు పట్టించుకోవడం లేదని యువజన సంఘాల ఆరోపణలకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చేపల వ్యాపారులు కౌడిపల్లితోపాటు నర్సాపూర్, పోత¯ŒSషెట్టిపల్లి, జోగిపేట, రంగంపేట తదితర అంగళ్లలో క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు సమాచారం. -
క్యారీబ్యాగ్స్‌పై నిషేధం
విజయవాడ సెంట్రల్ : పర్యావరణం దృష్ట్యా నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను నిషేధించినట్లు కమిషనర్ జి.వీరపాండియన్ చెప్పారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయన్నారు. షాపుల యజమానులు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజారోగ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నగరంలో పశువులు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్లపై కనిపించే పశువుల్ని బందిలిదొడ్డికి తరలిస్తామని హెచ్చరించారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
పుట్టపర్తి అర్బన్: ప్రజల ఆరోగ్యాన్ని అధికారులు విస్మరించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న పాడుబడిన బావుల్లో నీళ్లు నిల్వ ఉండి విషం చిమ్ముతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎటువంటి పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోవడంతో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. వర్షాకాలంలో వాన నీటితో నిండిన పాడుబావులు చెత్తాచెదారంతో కుళ్లి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా అటవీ గ్రామాలైన సాతార్లపల్లి, దిగువచెర్లోపల్లి, వెంగళమ్మచెరువు, వెంకటగారిపల్లి కాలనీలలో పాడుబడిన బావులతో పాటు గతంలో తాగునీళ్లు అందించిన చేదబావులు సైతం చెత్తాచెదారం నిండి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దీంతో అనారోగ్యాలతో ఒళ్లు గుల్లవుతోందని ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీరు–చెట్టు కార్యక్రమంలో చెరువుల్లోని మట్టి తోలి పలు బావులు, గుంతలను మూసివేసింది. దీంతో ఆయా స్థలాలు అందుబాటులోకి వచ్చాయి. పాడుబడిన బావులతో అనారోగ్యమే గాక చిన్న పిల్లలకు ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల మధ్య ఉండడంతో ఆడుకుంటూ వెళ్లి ఎక్కడ పడిపోతారోనన్న ఆందోళన కూడా ప్రజల్లో నెలకొని ఉంది. ఇటీవల దిగువచెర్లోపల్లి గ్రామంలో రోడ్డు పక్కనే పాడుబావి ఉండడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడి దెబ్బతింది. అదృష్టవశాత్తు డ్రైవర్ తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు స్పందించి గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న పాడుబడిన బావులను గుర్తించి మట్టితో మూసి వేయాలని గ్రామీణులు కోరుతున్నారు. గ్రామస్తులు ముందుకు రావాలి పాడుబడిన బావులు, నిరుపయోగంగా ఉన్న గుంతలు గ్రామాల్లో ఉంటే గ్రామస్తులు రాత పూర్వకంగా ఇస్తే పూడ్చి వేయడానికి చర్యలు తీసుకుంటాం. చాలా గ్రామాల్లో అటువంటివి ప్రమాదకరంగా ఉన్నాయి. – జమునాబాయి, ఇరిగేషన్ జేఈ -
యూజీడీ... ట్రాజెడీ
– ప్రమాదకరంగా మ్యాన్‌హోళ్లు – నిధుల విడుదలకు ఆసక్తి చూపని ప్రభుత్వం – పట్టించుకోని పబ్లిక్ హెల్త్ అధికారులు – అవస్థలు పడుతున్న జనం కడప కార్పొరేషన్: కడప నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా మారాయి.యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనుల్లో ఏర్పడిన లోపాలు, అసంపూర్తి నిర్మాణాల వల్ల నగర వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. యూజీడీ పథకం డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)లో పగులగొట్టిన రోడ్లను మరమ్మతులు చేసేందుకు వ్యయం కనబరచకపోవడంతో ఈ పథకం తీవ్ర విమర్శలపాలైంది. అధికారుల పర్యవేక్షణ లేక చాలా చోట్ల పైపులకు మధ్య కనెక్షన్లు లేవు. ఈ నేపథ్యంలో ప్రజలు అక్కడక్కడా యూజీడీకి ఇండ్లనుంచి కనెక్షన్లు ఇచ్చుకోవడంతో పనులు అసంపూర్తిగా ఉన్నచోట ఆ మురికినీరంతా మ్యాన్‌హోల్స్ ద్వారా ఉప్పొంగి రహదారులపైకి వస్తోంది. రూ.108 కోట్లకు పరిపాలనా అనుమతులు వచ్చినా... రూ.72 కోట్లతో యూజీడీ పనులు మొదలుపెట్టినప్పటికీ ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం మొత్తం రూ.108 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఈమేరకు ఇంకా రూ.36 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే అన్ని నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. 1,2 జోన్లలో ఎస్టీపీ, ట్రంప్మైన్స్ నిర్మాణం, 19 కీ.మీల మేర రోడ్లను పునరుద్ధరించడానికి పబ్లిక్ హెల్త్ అధికారులు రూ.29.20కోట్లతో అంచనాలు పంపారు. అలాగే 3,4జోన్లలో 9.56 కీ.మీలు ఉన్న అంతరాలు(గ్యాప్స్)ను సరిదిద్దడానికి రూ.4.80 కోట్లతో అంచనాలు రూపొందించారు. వీటికి కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ పబ్లిక్ హెల్త్ ఎస్ఈ అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. కొత్త ఏజెన్సీ వచ్చేదెప్పుడు... ఇక్కట్లు తీరేదెప్పుడు..? భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలో కడపను 4 జోన్లుగా విభజించారు. మొత్తం 312కీ.మీల మేర యూజీడీ పనులు చేయాలని నిర్ణయించగా ప్రస్తుతం 286కీ.మీలు పూర్తి అయ్యింది. ఇందులో 3,4 జోన్లలో యూజీడీ పనులు దాదాపు పూర్తి అయి 16 ఎకరాలలో మురుగునీటి శుద్ది కేంద్రం (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)కూడా పూర్తయ్యింది. 1,2 జోన్లలో పనులు జరిగినా అక్కడ ఎస్టీపీకి స్థల సేకరణ సమస్య రావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బుగ్గవంక చివర గూడూరు గ్రామపొలంలో 2.47ఎకరాలలో ఎస్టీపీ నిర్మాణానికి స్థలసేకరణ పూర్తయింది. ఈ ఫైల్ ఆర్డీఓ వద్ద ఈ పెండింగులో ఉన్నట్లు తెలిసింది. యూజీడీ పనులు నిర్వహించి ఐదేళ్లు పూర్తి కావడంతో పనులు చేసిన సంస్థను పబ్లిక్ హెల్త్ అధికారులు టెర్మినేట్ చేశారు. ప్రస్తుతం పనుల నిర్వహణకు పబ్లిక్ హెల్త్ అధికారుల వద్ద ఏ ఏజెన్సీ లేదు. మ్యాన్‌హోళ్లపై వేయడానికి మూతలుగానీ, వేయడానికి సిబ్బందిగానీ వారి వద్ద లేనట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పబ్లిక్ హెల్త్ అధికారులు పంపిన అంచానాలకు అనుమతులు వచ్చి కొత్త ఏజెన్సీని నియమిస్తే తప్పా నగరవాసులకు ఈ అవస్థలు తప్పేట్లు కనిపించడం లేదు. – కడపలో నాలుగు జోన్లు కలిపి 11,450 మ్యాన్‌హోళ్లు, 13,350 ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించాల్సి ఉండగా 10,195 మ్యాన్‌హోళ్లు, 12,495 ఇన్స్పెక్షన్ ఛాంబర్లు పూర్తి అయ్యాయి. కాగా సిమెంటు మూతలు నాణ్యత సరిగా లేక 40 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. మరికొన్నింటిపై మూతలే లేకపోవడంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆర్టీసీరీజనల్ మేనేజర్ కార్యాలయం సమీపంలో మ్యాన్‌హోళ్లు దెబ్బతిని ఏడాదిపైనే అయ్యింది. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం తటాకాన్ని తలపించే రీతిలో ఉంటుంది. వాననీటిని బయటికి పంపేందుకు ఇక్కడి మ్యాన్‌హోళ్లను తెరవడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో మ్యాన్‌హోల్ తెరిచి ఉందనే విషయం తెలియక వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. – ఎన్జీఓ కాలనీలోని రత్న సభాపతి వీధిలో ఇటీవల సిమెంటు రోడ్డు నిర్మించారు. కానీ యూజీడీ ఇన్స్పెక్షన్ ఛాంబర్లను మాత్రం అలాగే వదిలేయడంతో అవి ప్రమాదకరంగా ఉన్నాయి. ఓంశాంతినగర్‌లో ఇటీవల నగరపాలక అధికారులు వేసిన పైపులు నెలరోజులైనా కాకమునుపే పగిలిపోయి బొరియలు ఏర్పడ్డాయి. ఇక్కడ పలు మ్యాన్హోళ్లనుంచి మురికినీరు ఉబికి వస్తోంది. నగర శివార్లలోని ఆర్టీసీ కాలనీ వెనుక ఉన్న బహుజన నగర్లో ఇదే పరిస్థితి. రెండు నెలల్లో పూర్తి చేస్తాం : పబ్లిక్ హెల్త్ ఈఈ భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి తాము పంపిన ప్రతిపాదనలకు ఎస్ఈ అభ్యంతరాలు లేవనెత్తగా వాటిని నివృత్తి చేశామని పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివనాగేంద్ర తెలిపారు. అనుమతులు రాగానే పనులు మొదలుపెట్టి అన్ని గ్యాప్స్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇందుకు రెండు నెలలు సమయం పట్టవచ్చని తెలపారు. -
గొంతెండుతోంది
మున్సిపాలిటీల్లో తాగునీటికి కటకట డేంజర్ జోన్లో 44 పట్టణాలు సాక్షి, హైదరాబాద్: మనకూ లాతూర్ పరిస్థితి రాబోతోందా..? గుక్కెడు నీటి కోసం రైలు ద్వారా నీళ్లు తెప్పించుకోవాల్సిన దుస్థితి ముంచుకురానుందా..? క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూస్తుంటే ఆ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేద నిపిస్తోంది. ఒకటికాదు రెండు కాదు.. రాష్ట్రంలో 44 పట్టణాలు, వందల సంఖ్యలో గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నాయి. మరో నెలన్నర తర్వాత ఈ పట్టణాలకు నీటి సరఫరా పూర్తిగా బంద్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. నీటి వనరులు ఎక్కడికక్కడ అడుగంటిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తనుంది. పట్టణ నీటి సరఫరా స్థితిగతులపై రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తాజాగా రూపొం దించిన నివేదిక ఈ మేరకు స్పష్టంచేసింది. గ్రేటర్ హైదరాబాద్ మినహాయిస్తే రాష్ట్రంలో 67 నగరాలు, పట్టణాలుండగా... అందులో 44 పట్టణాలు డేంజర్ జోన్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మిగతా చోట్ల కూడా అరకొరగానే నీటి వనరులున్నాయి. ఈ 44 పట్టణాలకు అతికష్టంగా మరో 45 రోజులు, ఆ లోపు మాత్రమే నీటిసరఫరా కొనసాగించే పరిస్థితి ఉందని నివేదిక పేర్కొంది. అతికష్టంగా ఏప్రిల్ నెల గడిచిపోయినా మే నెలలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీటి గండాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. వేసవిపై రెండేళ్ల కరువు ప్రభావం వరుసగా రెండేళ్లపాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దాని ప్రభావం ఈ వేసవిపై తీవ్రంగా పడింది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు తడారిపోయి ఎడారులను తలపిస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, దిగువ మానేరు, నిజాంసాగర్ జలాశయాల అడుగున ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలూ భానుడి భగభగలకు వేగంగా ఆవిరైపోతున్నాయి. ఎస్సారెస్పీ, సింగూరు, మంజీర, జూరాల, రామన్‌పాడు జలాశయాలు ఎండిపోవడంతో వీటిపై ఆధారపడిన పట్టణాలు, పల్లెలకు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో బోరుబావులు, ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలే దిక్కు: రాష్ట్రంలో ఇప్పటికే అనేక పట్టణాలు తాగునీటికి అల్లాడుతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి చేరుకోవడంతో బోర్లు కూడా ఎండిపోతున్నాయి. డేంజర్ జోన్లో ఉన్న 44 పట్టణాలకు భూగర్భ జలాలే దిక్కు. అయితే భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోతుండడంతో చేతి పంపులు, బోర్లు ఎండిపోతున్నాయి. 67 పురపాలికల్లో 4,853 పవర్ బోర్లు ఉండగా, 608 బోర్లు ఇప్పటికే ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బోరుబావుల లోతు పెంచాలని, కొత్త బోర్ల తవ్వకాలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించిం ది. అవసరమైతే ప్రైవేటు బోరు బావులను అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేయాలంది. అయితే పురపాలికల వద్ద ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లకు కావాల్సిన నిధుల్లేవు. విపత్తుల నివారణ నిధి కింద ప్రభుత్వం 67 మున్సిపాలిటీలకు రూ.36.38 కోట్లు విడుదల చేసినా అవి ఇప్పటికే ఖర్చయిపోయాయి. అదనంగా మరో రూ.64.61 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కాలేదు. దీంతో మున్సిపాలిటీలు తమ సాధారణ నిధుల నుంచి ఖర్చు చేసి నీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఆ 44 పట్టణాలివే.. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లందు, సదాశివపేట, జహీరాబాద్, మెదక్, ఆర్మూర్, తాండూరు, నారాయణపేట మున్సిపాలిటీలు తాగునీటి పరంగా డేంజర్‌జోన్‌లో ఉన్నాయి. హుస్నాబాద్, హుజూరాబాద్, వేములవాడ, జమ్మికుంట, పెద్దపల్లి, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్, నర్సంపేట, మధిర, హుజూర్నగర్, కోదాడ, మేడ్చెల్, నాగర్ కర్నూల్, షాద్‌నగర్‌లు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. నిర్మల్, మందమర్రి, సిరిసిల్ల, కొల్లాపూర్, ఐజా, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి, దేవరకొండ, బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, గద్వాల్, ఖమ్మం పట్టణాల్లో కాస్త మెరుగ్గా ఉంది. ఇక్కడ 45 నుంచి 90 రోజుల వరకు నీటి సరఫరా కొనసాగనుంది. -
మలి దశలో పట్టణ వాటర్‌గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశలో గ్రామీణ ప్రాంత పనులే జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో జరగనున్న పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులను ప్రారంభించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేసారి పనులు చేపడితే ప్రయోజనం ఉండదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. పట్టణ శివార్ల వరకు ప్రాజెక్టు పనులన్నీ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలోనే జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్డబ్ల్యూఎస్ పట్టణాల శివార్ల వరకు ప్రధాన పైప్లైన్లు వేస్తే, మునిసిపాలిటీలు అక్కడి నుంచి నీటిని తరలించుకుని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను 26 ప్యాకేజీలుగా విభజించి 11 ప్యాకేజీల పనులకు టెండర్లను ఆహ్వానించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 15 ప్యాకేజీలకూ టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే పట్టణ ప్రాంతాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల అనుసంధానం పూర్తయిన తర్వాతే పట్టణాల్లో సర్వీసు రిజర్వాయర్లు, క్లియర్ వాటర్ ఫీడర్ మెయిన్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇంటింటికి నల్లా కనెక్షన్ తదితర పనులను చేపట్టనున్నారు. 2035 అవసరాలకు తగ్గట్లు.. వాటర్‌గ్రిడ్ కింద పట్టణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలనపర అనుమతులు రాలేదు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 మునిసిపాలిటీల్లో ఇంటింటికి నీటి సరఫరా కోసం రూ.3,038 కోట్లతో పనులు చేయాల్సి ఉందని పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. 2035 సంవత్సరం నాటికి పట్టణ జనాభా అవసరాలకు తగ్గట్లు తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులతో పనులను చేపట్టనుంది. ఈ ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు హడ్కో నుంచి రుణం అందిన తర్వాతే ఈ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ప్రజారోగ్యశాఖకు అవినీతి జబ్బు
- కార్యాలయాలకే పరిమితమవుతున్న పీహెచ్ వర్కర్లు - డబ్బు ముట్టే చోటికే మేస్త్రుల బదిలీలు - క్యాష్ ఇస్తే దేనికైనా రెడీ - కుంటుపడుతున్న నగర పారిశుధ్యం విజయవాడ సెంట్రల్ : ప్రజారోగ్యశాఖకు అవినీతి జబ్బు చేసింది. కాసులిస్తే చాలు.. కావాల్సిన పోస్టింగ్ వచ్చి ఒళ్లో వాలుతుంది. పీహెచ్ వర్కర్‌గా నియామకం పొంది రోడ్లు ఊడ్చేందుకు ఇష్టపడని వారు టైపిస్టులుగా, స్కూళ్లలో వాచ్మెన్లుగా పనిచేసుకోవచ్చు. ఇక శానిటరీ మేస్త్రులైతే డబ్బు బాగా వచ్చే ప్రాంతానికి బదిలీ చేయించుకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా అధికారుల చేయి తడపడమే. అడిగినంత ముట్టజెబితే చాలు డెప్యూటేషన్ ముసుగులో పీహెచ్ (పబ్లిక్ హెల్త్) వర్కర్లు కార్యాలయానికే పరిమితమైనా పట్టించుకునే వారుండరు. కార్పొరేషన్‌లోని ప్రజారోగ్య శాఖ అవినీతి కథ ఇదంతా. ఇలాంటి వాటిని అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ విజిటింగ్ ఆఫీసర్లలా వచ్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కమిషనర్ జి.వీరపాండియన్ కలగజేసుకుంటే కానీ పరిస్థితి మారదని కొందరు అధికారులే పేర్కొంటున్నారు. అంతులేని అవినీతి ప్రతినెలా నాలుగున్నర కోట్లు జీతాల రూపంలో అందిస్తున్నా నగరంలో మెరుగైన పారిశుధ్యం అందించలేని పరిస్థితి. ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు అవినీతికి దాసోహం అంటున్నారు. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నగరపాలక సంస్థలో 44 శానిటరీ డివిజన్లు ఉండగా, 102 మంది మేస్త్రులు పనిచేస్తున్నారు. దండిగా ఆదాయం వచ్చే డివిజన్లలో ఇద్దరు, ముగ్గురు మేస్త్రులు పనిచేయడంతో 12 డివిజన్లు మేస్త్రులు లేక ఖాళీగా ఉన్నాయి. గత డిసెంబర్లో లాటరీ పద్ధతిలో మేస్త్రుల్ని బదిలీ చేశారు. ఈ లాటరీని కూడా కొందరు అధికారులు క్యాష్ చేసుకున్నారు. కాసులిస్తే కావాల్సిన చోట అనధికారికంగా పోస్టింగ్ ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. దీంతో నెలరోజులు కూడా తిరక్కుండానే కొందరు తమకు కావాల్సిన డివిజన్లలో అనధికారికంగా పోస్టింగ్ పొందారు మచ్చుకు కొన్ని... 7, 5 డివిజన్లలో పనిచేయాల్సిన రాజేంద్రప్రసాద్, శివప్రసాద్ వాటర్‌వర్క్స్ ఏఈ, సర్కిల్-3 నైట్ శానిటేషన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాగ మారుతి అనే మహిళకు 18వ డివిజన్ మేస్త్రిగా పోస్టింగ్ ఇస్తే.. ఆమె ఏఎంహెచ్‌వో-3 వద్ద సబర్డినేట్గా పనిచేస్తున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. నిశితంగా పరిశీలిస్తే మరిన్ని అక్రమ బదిలీలు వెలుగుచూసే అవకాశం ఉంది. ముడుపుల బాగోతం అనధికార బదిలీలకు సంబంధించి అధికారులకు రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. పీహెచ్ వర్కర్లను క్షేత్రస్థాయిలోనే పనిచేయించాలని కమిషనర్‌గా హరికిరణ్ ఉన్న సమయంలో మేయర్ కోనేరు శ్రీధర్ సూచించారు. దీనిపై ఫైల్ తయారు చేయించాల్సిందిగా సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కమిషనర్ మారడంతో ఆ ఫైల్‌ను పక్కన పడేశారు. హెల్త్ సెక్షన్లో టైపిస్ట్‌లుగా, స్కూళ్లలో వాచ్మెన్లుగా, అర్బన్ హెల్త్ సెంటర్లలో డెప్యూటేషన్లపై సుమారు 200 మంది విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా నగర పారిశుధ్యం మరుగున పడుతోంది. విచారణ చేపడతా.. అనధికారిక బదిలీల విషయం నా దృష్టికి రాలేదు. లాటరీలో వచ్చిన ప్రకారమే మేస్త్రులు డివిజన్లలో పనిచేయాలి. ఇందుకు విరుద్ధంగా పనిచేస్తామంటే కుదరదు. దీనిపై సమగ్ర విచారణ చేపడతా. అక్రమాలను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకుంటాం. - ఎం.గోపీనాయక్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ -
పురపాలికల్లో 744 ఖాళీ పోస్టులు
కేసీఆర్‌కు పురపాలకశాఖ నివేదికలు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 1535 పోస్టులు ఉండగా.. అందులో 744 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో మరో 666 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికల స్థితిగతులతోపాటు ఉద్యోగుల కొరతపై తాజా సమాచారంతో కూడిన నివేదికలను రాష్ట్ర పురపాలకశాఖ ఆయనకు సమర్పించింది. పురపాలక సంస్థల్లోని పరిపాలన, రెవెన్యూ, అకౌంట్స్, ప్రజారోగ్యం-పారిశుద్ధ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా ఈ నివేదికలో పేర్కొంది. నిబంధనల ప్రకారం పదోన్నతులు, నియామకాల (డెరైక్ట్ రిక్రూట్మెంట్) ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీ పోస్టులను సైతం నివేదికలో పొందుపరిచింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఖాళీల భర్తీపై సీఎం ప్రకటన చేసే అవకాశం లేదు. కోడ్ ముగిశాక ఖాళీల భర్తీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఖాళీ పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా... -
పల్లె సేవలో జూనియర్లు
‘ పల్లె ప్రజల ఆరోగ్యం.. జూనియర్ డాక్టర్ల లక్ష్యం’ నినాదంతో రాష్ట్రంలోనే తొలిసారిగా జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో జఫర్‌గఢ్ మండలంలోని కూనూరులో సోమవారం చలో పల్లె కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం ఆస్పత్రులకు చెందిన 50మంది జూనియర్ వైద్యులు హాజరయ్యారు. - జఫర్‌గఢ్ -
ప్లాస్టిక్‌ను నిషేధించాలి
ఎమ్మిగనూరు టౌన్ : ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ బుధవారం ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో కస్తూరి కాన్సెప్ట్ స్కూల్, బాలికల హైస్కూల్ విద్యార్ధినీ, విద్యార్థులు పురవీధుల గూండా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లితుందని, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను బహిష్కరించాలని నినదించారు. అనంతరం సోమప్ప సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది లక్ష్మీనారాయణ, బసిరెడ్డి, సూర్యనారాయణ, బందెనవాజ్, మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రమీలారాణి, పట్టణ సమైక్య కార్యదర్శి హేమలత, విద్యార్థినీ, విద్యార్థులు, పొదుపు మహిళలు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చెత్తే కదా అని విసిరేస్తే జైలుకే!
జీహెచ్ఎంసీ కొరడా దశలవారీగా జరిమానాలు పదేపదే అదే తప్పు చేస్తే జైలుశిక్ష ఎంపిక చేసిన 8 ప్రధాన మార్గాల్లో రేపట్నుంచి అమలు సాక్షి, సిటీబ్యూరో: ఇకపై రోడ్లపై ఇష్టానుసారం చెత్త వేస్తే కుదరదు. తొలిసారి రూ.500 జరిమానా.. మళ్లీ మళ్లీ అదే తప్పుచేస్తే ఈ మొత్తం దశల వారీగా రూ. 10 వేలకు పెరుగుతుంది. అంతేకాదు.. జైలు శిక్షా పడొచ్చు. గ్రేటర్లో చెత్త సమస్య పరిష్కారానికి సిద్ధమైన జీహెచ్ఎంసీ.. చెత్త రహిత రహదారుల (లిట్టర్ ఫ్రీ రోడ్స్)ను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 8 ప్రధాన మార్గాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ మార్గాల్లో ఆగస్టు 1 నుంచి ‘చెత్త వేస్తే జరిమానా’ చర్యలు అమల్లో ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రకటించారు. ప్రజారోగ్యం, నగర సుందరీకరణ కోసం ఈ కఠిన చర్యలకు సిద్ధమయ్యామన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టాలను అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవీ నిబంధనలు.. ఎంపిక చేసిన మార్గాల్లోని దుకాణదారులు, సంస్థలు, నివాసితులు చెత్తను జీహెచ్ఎంసీ నియమించిన వ్యక్తులకే అందజేయాలి సిబ్బంది రోజుకు రెండుసార్లు నిర్ణీత సమయాల్లో (ఉదయం 11-మధ్యాహ్నం 2, రాత్రి 8-10 గంటలు) చెత్తను సేకరిస్తారు. స్థానిక పరిస్థితులను బట్టి ఈ వేళల్లో మార్పుచేర్పులకు వీలుంది ఎంపిక చేసిన ప్రాంతాల్లోని రోడ్లపై ఎవరూ చెత్త వేయరాదు. దీనిని ఉల్లంఘిస్తే జరిమానా.. ఆపై జైలు శిక్ష ఉంటాయి ఈ మార్గాల్లోని దుకాణాదారులు, గృహాల వారితో పాటు తోపుడుబండ్ల వ్యాపారులు చెత్తను తమ ప్రాంగణంలోనే ఉంచాలి తడి, పొడి చెత్తలు వేయడానికి వీలుగా రెండు డబ్బాలను వినియోగించాలి. వాటికి మూతలుండాలి. ఆకుపచ్చ రంగు డబ్బాలో తడి చెత్త, తెలుపు రంగు డబ్బాలో పొడి చెత్త వేయాలి. నిర్ణీత సమయాల్లో వచ్చే జీహెచ్ఎంసీ గుర్తింపు పొందిన సేకరణదారుకు వీటిని అందజేయాలి రోజులోని 24 గంటల- నిబంధనలు అమల్లో ఉంటాయి. ఎప్పుడు చెత్త వేసినా అందుకు కారకులైన వారికి జరిమానా విధిస్తారు ఇవీ చెత్తర హిత మార్గాలు.. బంజారాహిల్స్ రోడ్‌నెంబరు 1: మాసాబ్‌ట్యాంక్ ప్యారడైజ్ హోటల్ నుంచి జీవీకే మాల్ మీదుగా నాగార్జున సర్కిల్ వరకు. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2: నాగార్జున సర్కిల్ నుంచి రోడ్డునెంబరు 2, టీవీ 9 కార్యాలయం, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చె క్పోస్టు వరకు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12: కళింగ ఫంక్షన్ హాల్ నుంచి ఇన్‌కంట్యాక్స్ క్వార్టర్స్ మీదుగా పెన్షన్ ఆఫీసు వరకు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 36: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి పెద్దమ్మగుడి మీదుగా మాదాపూర్ ఠాణా వరకు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 92: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి సీవీఆర్ న్యూస్, బాలకృష్ణ ఇంటి మీదుగా కళింగ ఫంక్షన్ హాల్ వరకు. ఖైరతాబాద్ ప్రధాన రహదారి: ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్‌భవన్ రోడ్డు, సోమాజిగూడ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం మీదుగా బేగంపేట ఫ్లైఓవర్ వరకు. బేగంపేట రోడ్: బేగంపేట ఫ్లైఓవర్ నుంచి గ్రీన్లాండ్స్ గెస్ట్‌హౌస్, పంజగుట్ట న్యూ ఫ్లైఓవర్ మీదుగా జీవీకే మాల్ వరకు. సచివాలయం రోడ్: ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్, అంబేద్కర్ విగ్రహం, రవీంద్రభారతి మీదుగా అసెంబ్లీ వరకు. ఈ మార్గాల్లో రోడ్డుకు రెండు వైపులా నిబంధనలు అమలు చేస్తారు. -
వైద్య శాఖకు చికిత్స
అధికారుల పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం చిన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవాలన్న డాక్టర్ రాజయ్య నాలుగోవ తరగతి ఉద్యోగుల్లో మార్పు రావాలని సూచన కలెక్టరేట్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా సోమవారం వైద్యారోగ్యశాఖ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. ఉత్తర తెలంగాణకే పెద్దదిక్కుగా ఉన్న మహాత్మాగాంధీ స్మారక(ఎంజీఎం) ఆస్పత్రి, కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన సమస్యలపై చర్చించారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు మెరుగు పడాలని అధికారులకు స్పష్టం చేశారు. వైద్య విద్యార్థులు ఉండే కేఎంసీ హాస్టళ్లు.. సాంఘిక సంక్షేమ హాస్టళ ్లకన్నా దారుణంగా ఉన్నాయన్నారు. పాముల పుట్టలు పెరిగినా, చెత్తకుప్పలు పేరుకుపోయినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్థానికంగా ఆస్పత్రి అభివృద్ధి మండలి(హెచ్‌డీఎస్), జిల్లా కలెక్టర్, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు సరిగ్గా 15 రోజుల్లో పూర్తికావాలని ఆదేశించారు. ఎంజీఎం, కేఎంసీలో అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకనే సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరు పూర్తిగా అధ్వానంగా ఉందని, ఈ విషయంలో పూర్తి బాధ్యత ఉన్నతాధికారులదేనని అన్నారు. కింది స్థాయి సిబ్బందితో పనిచేయించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని అన్నారు. చెత్త పేరుకుపోయి, లైట్లు లేక, పారిశుద్ధ్యం సక్రమంగా లేక పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. ఈ సందర్భంగా ఎంజీఎం, కేఎంసీలో గమనించిన సమస్యలకు మంత్రి పరిష్కారాలు సూచించారు. ఎంపీ లాడ్స్ కేటాయిస్తాం : వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి ఎంజీఎంలో ఉన్న సమస్యల్లో ఎక్కువగా కొద్దిపాటి నిధులతో పరిష్కారమయ్యేవే ఉన్నాయి. జనరేటర్, వెంటిలేటర్స్, శానిటేషన్, తాగునీటి వసతి వం టివి... నిర్లక్ష్యం వల్ల పెరిగిన సమస్యలు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఒక్కోసారి బాధితులను పరామర్శించేందుకు వద్దామన్నా రోగుల బంధువులు ఆందోళన చేస్తారేమో అనే భయం వేస్తోంది. అధికారులు, కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నుంచి ప్రతిపాదనలు వస్తే ఎంపీ నిధులు కేటారుుంచేందుకు సిద్ధం. ఇవన్నీ కావాలంటే అధికారుల్లో కూడా మార్పురావాలి. ప్రతి ఆరునెల్లకోసారైనా ఎంజీఎంపై సమీక్ష నిర్వహించాలి. పనిచేయకుండా నిర్లక్ష్యంగా ఉండేవారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి : మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ఎంజీఎం, కేఎంసీలలో విశాలమైన స్థలం ఉంది. అక్కడంతా అడవిలా మారకుండా పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఔట్ సోర్సింగ్ వారికి ఇచ్చి గార్డెనింగ్ చేయించండి. నెలకు కేవలం రూ.2లక్షలతో పచ్చదనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆసుపత్రికి వచ్చిన వారికి ఏ వార్డు ఎక్కడుందో... రక్తం ఉక్కడ దొరుకుతుందో... తెలియదు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారు వస్తారు. పీఆర్వోలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నందున కనీసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తే కొంత సౌకర్యంగా ఉంటుంది. గతంలో చెప్పిన వెంటిలేటర్లు ఏమయ్యాయి : ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ గత సమావేశాల్లో డీఎంఈ మాట్లాడుతూ 24గంటల్లో వెటిలేటర్లు వస్తాయని చెప్పారు. వాటి సంగతి ఏమైంది. వచ్చాయా... రాలేదా... ఎంజీఎంలో కాంట్రాక్ట్ సిబ్బందికి సక్రమంగా వేతనాలు అందడం లేదు. పీఎఫ్ వంటివి అందడం లేదు. సెక్యురిటీ పనితీరుపై ఆరోపణలు ఉన్నాయి. వాటిని అధికారులు సమీక్షించాలి. గతంలో ఎంజీఎం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి చెప్పినా పనులు కాలేదు. తొలగించిన కాంట్రాక్టు సిబ్బందిని కూడా తీసుకోవాలి. పీఆర్వోలను తొలగించవద్దు : ఎమ్మెల్యే కొండా సురేఖ ఎంజీఎంలో గత నాలుగేళ్లుగా పనిచేసస్తున్న పీఆర్వోలను తొలగించడం వల్ల వారు ఉపాధి కోల్పోతారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తే మంచిది. స్థానిక సమస్యలపై స్థానికంగా అధికారులు దృష్టిపెట్టాలి. క్రమంతప్పకుండా జిల్లా స్థాయిలో సమీక్షలు ఏర్పాటు చేయాలి. కలెక్టర్ దృష్టిపెట్టాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చిన్న సమస్యలు కూడా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల పెద్దగా తయారవుతున్నాయి. జనగామ ఏరియా ఆస్పత్రిలో కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. నేను ప్రత్యేక చొరవతో ఆస్పత్రి సందర్శించడంతో క్రమంగా అధికారుల్లో కూడా మార్పువచ్చింది. ఇప్పుడు మా ఏరియా ఆస్పత్రిలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. కలెక్టర్ కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి పర్యవేక్షణ పెంచితే అధికారుల్లో కొంత మార్పు వస్తుంది. ప్రతి పనీ నిధులతో ముడిపెట్టడం సరికాదు. వర్ధన్నపేట ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి : ఎమ్మెల్యే అరూరి రమేష్ వర్ధన్నపేట క్లస్టర్ ఆస్పత్రిలో సదుపాయాలు మెరుగుపరిస్తే వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. సిబ్బంది కొరత మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. గతంలో ఉన్న వైద్యుడు బదిలీ అయ్యాక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. మహబూబాబాద్ ఆస్పత్రిలో సిబ్బందిని నియమించాలి : ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మహబూబాబాద్‌లోని ఏరియా ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి. సిబ్బంది నియామకాలు చేపట్టాలి. వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులు ఏమన్నారంటే... కేఎంసీకి సీనియర్ రెసిడెంట్‌ని నియమించాలి. లైబ్రరీ బిల్డింగ్, పరీక్ష హాలు, హాస్టల్ భవనాలు ఏర్పాటు చేయాలి. సుమారు 120ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కళాశాలలకు అదనంగా దంత వైద్య కళాశాలను మంజూరు చేయాల్సి ఉంది. హెల్త్ వర్సిటీకి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. సెంట్రజైలును అక్కడి నుంచి తరలిస్తే మరో 80ఎకరాలు స్థలం సమకూరుతుంది. ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుంది. ఎంజీఎంకు ప్రస్తుతం ఓపీ అత్యవసర విభాగంలో 20పడకలకు మాత్రమే అవకాశం ఉంది. మెడిసిన్ విద్యార్థుల సంఖ్య ప్రకారం మరో 10పడకలు ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాలయం ఖాళీచేసి అక్కడ నూతన భవనం నిర్మిస్తే సమస్యలు తీరుతాయి. ఆసుపత్రిలో టెలిఫోన్ ఇంటర్‌కం సేవలు అందుబాటులోకి తేవాలి. 17ఫ్రొఫెసర్, 4 అసోసియేట్ ప్రొఫెసర్, 30 అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ఎంసీఐ అభ్యంతరం తెలిపింది. సిబ్బంది నియామకాలు చేపట్టాలి. వెంటిలేటర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. సీకేఎం ఆసుపత్రిని 1993లో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. సౌకర్యాలు, సిబ్బంది మాత్రం 60పడకలకు మాత్రమే ఉన్నారు. ఆసుపత్రి రోగుల రద్దీ దృష్ట్యా 200 పడకలు చేయాల్సి ఉంది. ప్రసుత్తం 4 ఎకరాల ఖాళీ స్థలం ఆసుపత్రికి అందుబాటులో ఉంది. జిల్లాలో అతిపెద్ద ప్రసూతి ఆసుపత్రిగా ఉంది. పెథాలజీ, రేడియాలజీ, బయాలజీ, మైక్రో బయాలజీ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ఎంజీఎంకు రోగులను తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. ఉర్సు ఆసుపత్రికి ఓపీ సౌకర్యం అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. కేఎంసీలో మంత్రి గమనించిన అంశాలు ఇవీ... హాస్టల్ గదులు, పరిసరాలు భయానకంగా ఉన్నాయి. పాముల పుట్టలు పెరిగాయి. నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరు సక్రమంగా లేదు వారితో పనిచేయించడంలో అధికారులు విఫలమయ్యారు. విద్యుత్ సమస్య ఉంది. లోవోల్టేజీ, లైట్లు లేకపోవడం, వైరింగ్ సక్రమంగా లేదు. తాగునీటి సౌకర్యం లేదు. ఎక్కడికక్కడ చెత్త, పాత సామాన్లు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త విద్యార్థులు.. ఈ క్యాంపస్ చూస్తే కేఎంసీలో ప్రవేశాలు రద్దు చేసుకుంటారు. ఎంజీఎంలో గుర్తించిన సమస్యలు... శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉంది. సెక్యూరిటీ వ్యవస్థ సక్రమంగా లేదు. నాలుగో తరగతి సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదు. జనరేటర్ అందుబాటులోలేదు. ఎంజీఎంలో పైఅంతస్తుల్లోకి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం లేదు. పీఆర్వోలను తొలగించడం వల్ల వారు ఉపాధి కోల్పోతున్నారు. సెక్యూరిటీ, ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు పీఎఫ్, కనీస వేతనాలు అందడం లేదు. -
వ్యాధులను నియంత్రిస్తాం
పక్కాగా పిన్‌పాయింట్ ప్రోగ్రాం అందుబాటులో వైద్యులు, సిబ్బంది ఎక్కడ నిర్లక్ష్యమున్నా.. శాఖాపరమైన చర్యలు ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ పాడేరు,న్యూస్‌లైన్: ఏజెన్సీలో ఎపిడమిక్‌ను ఎదుర్కొంటామని, మలేరియాతో పాటు అన్ని సీజనల్వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యాధుల నియంత్రణకు ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. ఏజెన్సీలోని మలేరియా తీవ్రత తగ్గుముఖం పట్టిందన్నారు. 2010లో జనవరి నుంచి మే నెల వరకు 1498 కేసులు నమోదవ్వగా, గతేడాది 779, ప్రస్తుతం 700 మలేరియా కేసులను గుర్తించారన్నారు. దోమల నివారణ మందు పిచికారీ జరుగుతోందన్నారు. దోమతెరలను గిరిజనులు వినియోగించుకోవాలని కోరారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత లేదన్నారు. 35అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామన్నారు. డౌనూరు పీహెచ్‌సీకి అంబులెన్స్ లేదని, నర్సీపట్నం, కేడీపేట పీహెచ్‌సీల అంబులెన్స్‌లను అక్కడకు అనుసంధానం చేస్తున్నామన్నారు. మైదానం నుంచి 16 మంది వైద్యులను డెప్యుటేషన్‌పై ఏజెన్సీలో నియమించామన్నారు. 70 మంది మేల్ హెల్త్ అసిస్టెంట్లు, 36 మంది హెల్త్ సూపర్వైజర్లను కూడా ఏజెన్సీలో ఎపిడమిక్ విధులకు వినియోగిస్తున్నామని, వారంతా సోమవారం నాటికి విధులలో చేరుతారన్నారు. అన్ని సీజనల్ వ్యాధుల నియంత్రణకు వారపుసంతల్లో ప్రత్యేక వైద్య శిబిరాలతోపాటు గ్రామాలలో పిన్‌పాయింట్ ప్రోగ్రాంను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. హైరిస్క్ గ్రామాలపై మరింత శ్రద్ధ పెడుతున్నామన్నారు. ఎక్కడైనా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీహెచ్వోలు, మండల ప్రత్యేకాధికారులు నిరంతరం వైద్య ఆరోగ్య కార్యక్రమాలను తనిఖీ చేసి రోజూ నివేదికను తనకు అందజేస్తారన్నారు. పాఠశాలల విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించామన్నారు. గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.2 కోట్లతో యాక్షన్ ప్లాన్ కూడా జిల్లా కలెక్టర్‌కు అందజేశామన్నారు. అలాగే 13వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు వచ్చాయని, వాటితో తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగించాలని సర్పంచ్‌లను ఆదేశించామన్నారు. తాగునీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో పీవీఎస్ నాయుడు, జిల్లా మలేరియాశాఖ అధికారి ప్రసాదరావు, ఇన్చార్జి ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలాప్రసాద్ పాల్గొన్నారు. 10 నుంచి ఏజెన్సీలో వైద్యశిబిరాలు... ఈ నెల 10వ తేదిన కొయ్యూరు మండలం యు.చీడిపాలెం, 15న అరకులోయ మండలం సుంకరమెట్ట, 18న పాడేరు మండలం కాశీపట్నం, 29న సీలేరులో ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నామని పీవో తెలిపారు. ఈ వైద్యశిబిరాలను గిరిజనులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీకేవీధిలో ఆకస్మిక తనిఖీ గూడెంకొత్తవీధి : ఎపిడమిక్ దృష్టా మారుమూల గూడేల్లోని వారు రోగాల బారిన పడకుండా ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ శనివారం వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా జీకేవీధి మండలంలోని ఆర్వీనగర్, జీకేవీధి పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. తొలుత జీకేవీధి పీహెచ్సీలో అన్ని గదులను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ఇద్దరు విధులకు హాజరుకాకపోవడంతో అటెండెన్స్ రిజిస్టర్లో ఆబ్సెంట్ మార్కు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ల్యాబ్, వైద్యాధికారి గది, రోగుల గదులను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆర్వీనగర్ పీహెచ్‌సీని సందర్శించి అక్కడ రూ.3 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న కొత్త భవనాన్ని కూడా పరిశీలించారు. రికార్డులను, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరుగురికి చార్జీమెమోలు విధి నిర్వహణలో నిర్లక్ష్యంలో వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ హెచ్చరించారు. శనివారం జీకేవీధి, చింతపల్లి మండలం తాజంగి పీహెచ్‌సీలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన ఆర్వీనగర్ పీహెచ్సీ ఫార్మసిస్ట్ ఎంఆర్ఎన్ శ్రీనివాసరావు, ఎంపీహెచ్‌డబ్ల్యూ ఎం.అరుణకుమారి, పి.రాజుబాబులకు చార్జిమెమోలు జారీ చేశారు. చింతపల్లి మండలం తాజంగి పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ వి.ప్రసాదరావు, జీకేవీధి పీహెచ్సీలో ఎస్ఆర్ రెడ్డి, ఎం.సత్యనారాయణమ్మలు విధులకు గైర్హాజరడంతో చార్జీమెమోలను అందజేశారు. ఆర్వీనగర్, తాజంగి పీహెచ్‌సీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎపిడమిక్‌లో వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆరోగ్యమంటే అలుసేనా?
మంచి ఆహారం, ఇల్లు, పారిశుద్ధ్యం ఆరోగ్యానికి ప్రధానం. కానీ దేశంలో 20 కోట్ల మందికి చాలినంత ఆహారం లేదు. క్షుధార్తుల సూచిలో మన స్థానం 66. కాంగ్రెస్ ఆహార భద్రత చట్టం తెచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలో సామాజిక వంటశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇవి ఆకలి తీర్చగలవా? ఆరోగ్యానికి సహాకరించేవా? ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ, లేదా కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశాలు ఎక్కువ. కానీ ఈ రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలు కూడా వైద్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయి. 123 కోట్ల ప్రజల ఆరోగ్యం గురించి మన రాజకీయ పార్టీలలో ఎంత ఉదాసీనత నెలకొని ఉన్నదో దీనితో రుజువయింది. సార్వత్రిక ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తామని 2005 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ సదస్సులో మనం కూడా సంతకం చేశాం. కానీ మొదటి అడుగు కూడా వేయలేదు. బహుశా భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు సంతకం చేసి, ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేస్తున్నదేమో! కాంగ్రెస్‌కు ఆరోగ్య ప్రణాళికే లేదు 1970 దశకం నుంచి చూసినా ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం మేనిఫెస్టోలలో పొందుపరిచిన హామీలేమీ కానరావు. ఇప్పుడు కూడా రెండు పార్టీలు దాదా పు సమాన నిర్లక్ష్యాన్నే ప్రదర్శించాయి. స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) ఆరోగ్యం మీద చేసే వ్యయం గురించి అన్ని దేశాలు సూత్రబద్ధ వైఖరిని కలిగి ఉంటాయి. యూపీఏ తన మేనిఫెస్టోలో నేషనల్ రూరల్ హెల్త్ కమిషన్ వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. నేషనల్ రూరల్ కమిషన్ (2005-2012) యూపీఏ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆరోగ్య కార్యక్రమం. ఇంతకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం జీడీపీలో దీని వ్యయం 0.9 నుంచి 2 శాతానికీ, తరువాత మూడు శాతానికీ పెంచాలి. ఆ పెంపు 1.2 దగ్గరే ఉంది. ఇప్పుడు దానినే మూడు శాతానికి పెంచుతామని చెప్పడం మోసగించడమే. బీజేపీ ఈ అంశం జోలికే వెళ్లలేదు. నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ జీడీపీలో ఆరోగ్యం కోసం ఐదు శాతం ఖర్చు చేయాలని నిర్దేశిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్లలో ఆరోగ్య ప్రణాళికను కూడా రూపొందించలేదు. ఇలాంటి ప్రణాళికను గురించి తాజా మేనిఫెస్టో కూడా చెప్పలేదు. బీజేపీ మేనిఫెస్టోలో ఓఓపీ దేశంలో రూపొందిన ఆఖరి ఆరోగ్య ప్రణాళిక 2002 నాటిది. అంటే ఎన్డీఏ రూపొందించినది. దీనినే కాంగ్రెస్ అమలు చేసింది. బీజేపీ కొత్త ఆరోగ్య ప్రణాళికను గురించి ప్రస్తావించింది. ఆరో గ్య సమస్యలను అధ్యయనం చేయడానికి ఈ ప్రణాళికను ప్రతిపాదిస్తున్నట్టు ఆ పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ విడిచిపెట్టినా, బీజేపీ ప్రతిపాదించిన మ రో అంశం- నేషనల్ అసూరెన్స్ మిషన్. దీని ద్వారా స మర్థమైన ఆరోగ్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం తన ఆశయంగా ఆ పార్టీ చెప్పుకున్నది. ఈ మిషన్ ద్వారానే ఔటాఫ్ పాకెట్ ఎక్స్పెండీచర్ (ఓఓపీ) తగ్గిస్తామని బీజేపీ ప్రకటించడం ఉదాత్తంగానే ఉంది. ప్రజలే సొంత ఖర్చుతో వైద్యం చేయించుకోవడాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఓఓపీ అని పిలుస్తున్నారు. మన దేశంలో ఓఓపీదే పై చేయి. 70 శాతం కుటుంబాలు ఆదాయమంతా ఆస్పత్రులకే పోస్తున్నాయి. వైద్య ఖర్చుల పు ణ్యమా అని ఏటా 39 మిలియన్ల ప్రజలు దారిద్య్ర రేఖ దిగువకు పోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 30 శాతం ప్రజలు ఖర్చులకు భయపడి ఆస్పత్రుల వంకే చూడడం లేదు. దేశంలో జరుగుతున్న వైద్య వ్యయంలో 60 శాతం ప్రజలే భరించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన 2010 నివేదిక ప్రకారం, ఓఓపీ 15 నుంచి 20 శాతానికి మించి ప్రజలు భరించవలసి వస్తే కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి. అయినా ఈ అంశం కాంగ్రెస్ దృష్టికి రాలేదు. గ్రామీణ ఆరోగ్యం ఈ అంశాన్ని రెండు పార్టీలూ ప్రస్తావించాయి. బీయస్సీ (సామాజిక ఆరోగ్యం) కోర్సును ప్రవేశపెట్టి, అభ్యర్థులను తయారు చేసి గ్రామ ప్రాంతాలలో వైద్యుల కొరత తీర్చడానికి కృషి చేస్తామని కాంగ్రెస్ పేర్కొన్నది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలి పింది కూడా. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలను అందిం చే కృషికి తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని బీజేపీ కూడా మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ చేస్తున్న ఈ యోచనలో గ్రామీణ భారతం పట్ల వివక్ష సుస్పష్టం. 2011 లెక్కల ప్రకారం గ్రామీణ భారతీయుల సంఖ్య 83.3 కోట్లు (68 శాతం). ఆ ఏడాది ఆరోగ్య గణాంకాల ప్రకారం దేశంలో 23,887 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1,48,124 ఉప కేంద్రాలు పని చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికను చూస్తే మరో 7,048 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 35,762 ఉపకేంద్రాలు అవసరం. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు కావలసిన వైద్యుల సంఖ్య 30,051. అందుబాటులో ఉన్న డాక్టర్లు 26,329 మంది. ఇక దేశంలో ఏటా 45,000 మంది ఎంబీబీఎస్‌లు తయారవుతున్నారు. మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న డాక్టర్ల సంఖ్య ఏడులక్షలు. అంటే ఒక్క ఏడాది బయటకు వచ్చిన డాక్టర్లలో 70 శాతం మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చాలు. కానీ అరవయ్యేళ్లు దేశాన్ని ఏలిన కాం గ్రెస్ ఇప్పుడు వైద్యులను గ్రామీణ ప్రాంతాలకు పంపలేక బీయస్సీ (సామాజిక ఆరోగ్యం) అభ్యర్థుల ద్వారా ఆ కొరతను తీర్చాలని చూస్తోంది. వారు డాక్టర్లు కాదు. కాబట్టి ఇది కంటి తుడుపే. వైద్య విద్యను బాగు చేయకుండా వైద్యాన్ని బాగు చేయడం కష్టం. వైద్య విద్యను ప్రక్షాళించే యోచన మన రాజకీయ పార్టీలకు ఉందా? శిశు మరణాలూ పట్టలేదు సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అంశాల పట్ల వ్యవస్థకు ఉన్న శ్రద్ధ ఏ పాటిదో శిశు మరణాలు అద్దం పడతాయి. కానీ రెండు జాతీయ పార్టీలు ఈ అంశానికి చోటివ్వనే లేదు. ఒక సంవత్సరంలో, ఒక నిర్దిష్ట ప్రాంతంలోని వేయి జననాలలో ఏడాది లోపు పిల్లల మరణాలను బట్టి వీటి రేటును నిర్ణయిస్తారు. దేశంలో ఈ మరణాల రేటు ప్రస్తుతం 42. ఈ రేటు చైనాలో 15, ఎంతో చిన్న దేశమైన శ్రీలంకలో 9. దేశంలో శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించామని కాంగ్రెస్ మేనిఫెస్టో చాటుకుంది. వాస్తవం ఏమిటి? 2010 సంవత్సరానికల్లా ఈ రేటును 30కి తగ్గించాలని జాతీయ ఆరోగ్య ప్రణాళిక (2002)లో నిర్దేశించుకున్నాం. నేషనల్ రూరల్ హెల్త్ కమిషన్లోనూ 2012 నాటికల్లా 30కే తగ్గిస్తామని కూడా కాంగ్రెస్ ప్రతిన చేసింది. ఏదీ జరగలేదు. ఈ నేపథ్యంలో సహస్రాబ్ది లక్ష్యాలను గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఈ రెండు పార్టీలు గుర్తించవలసిన అంశం- ప్రపంచ దేశాల సరసన మన గౌరవం నిలబడాలంటే, శిశు మరణాల రేటు త గ్గినపుడే సాధ్యం. ఆకలి తీరిస్తేనే ఆరోగ్యం మంచి ఆహారం, ఇల్లు, పారిశుధ్యం ఆరోగ్యానికి ప్రధానం. కానీ దేశంలో 20 కోట్ల మందికి చాలినంత ఆహారం లేదు. క్షుధార్తుల సూచిలో మన స్థానం 66. కాంగ్రెస్ ఆహార భద్రత చట్టం తెచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలో సామాజిక వంటశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇవి ఆకలి తీర్చగలవా? ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా ఆకలికి దూరం చేయగలమా? కొనుగోలు శక్తి పెరగాలంటే అంతరాలు తగ్గాలి. వీటి ప్రస్తావన మేనిఫెస్టోలలో లేదు. గృహ వసతి, రక్షిత మంచినీరు వంటి అంశాలకు తగినంత ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ పని చేసే మరుగుదొడ్ల గురించి పేర్కొన్నది. బీజేపీ మాత్రం 2019 నాటికి (గాంధీజీ 150వ జయంతి) ‘స్వాచ్ఛ్ భారత్’ ను సాధిస్తామని చెప్పింది. ప్రతి రాష్ట్రంలోను ఎయిమ్స్ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న బీజేపీ యోచన ఆహ్వానించదగినదే. కానీ ప్రతి సూపర్ స్పెషాలిటీ అన్న నినాదం సరికాదు. ఇక స్థానిక సంస్థలకు పారిశుధ్యం, ఆరోగ్యం అప్పగించడానికి ఉద్దేశించిన 73వ రాజ్యాంగ సవరణ గురించి ఎవరికీ పట్టలేదు. విశ్లేషణ: డాక్టర్ ఆరవీటి రామయోగయ్య (వ్యాసకర్త ఏపీ ఆరోగ్యశాఖ మాజీ సంచాలకులు) -
ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ కాకుండా ఏం చేయాలి?
పేదోడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ.... కలవారికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ వైద్యం కడుపేద పడక దాకా తీసుకువచ్చిన పథకం ఆరోగ్య శ్రీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజారోగ్యానికి ఇచ్చిన వరం ఆరోగ్య శ్రీ. కానీ అదే ఆరోగ్య శ్రీని అనంతర కాలంలో నిమ్మకు నీరెత్తిన సర్కార్లు నీరుగార్చారు. నిస్సత్తువ చేశారు. నిర్లక్ష్యం నింపారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీ గా మారిపోయింది. ఒక్కో వ్యాధిని ఆరోగ్య శ్రీ జాబితా నుంచి తొలగించేస్తూ పోతున్నారు. ఫలితంగా ఆరోగ్యశ్రీ అస్థిపంజరం రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ మళ్లీ ఊపిరులూదేందుకు సిద్ధమౌతున్నారు. ఆయన ఆరోగ్య శ్రీ విషయంలో తెలుగు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీపై మీ స్పందనేమిటి? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? తెలియచేయండి. -
ముగిసిన వైద్యుల నియామక కౌన్సెలింగ్
రాష్ట్ర వ్యాప్తంగా 1,009 పోస్టుల భర్తీ పోస్టింగ్ ఆర్డర్ల కోసం అభ్యర్థుల పడిగాపులు జిల్లాలో పోస్టింగ్ తీసుకున్న 40 మంది విజయవాడ, న్యూస్‌లైన్ : వైద్య ఆరోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) నియామకాలకు సంబంధించి నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్ ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టుల కోసం 1,239 మంది హాజరగా, వారిలో 1,009 మంది పోస్టింగ్‌లు పొందారు. మిగిలిన వారు వివిధ కారణాలతో పాటు, తాము కోరుకున్న ప్రాంతంలో ఖాళీలు లేక పోస్టింగ్ తీసుకోవడానికి నిరాకరించారని సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 5, 6వ తేదీల్లో నియామక కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కేవలం ఒక్క రోజు ముందు ప్రకటించిన ఉన్నతాధికారులు, అందుకు తగిన ఏర్పాట్టు చేయలేదు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆద్యంతం నత్తనడకన సాగింది. అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న తీరుపై అభ్యర్థులు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో రెండు రోజుల్లో ముగియాల్సిన కౌన్సెలింగ్‌కు నాలుగు రోజులు పట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటలపాటు అభ్యర్థుందరికీ కౌన్సెలింగ్ పూర్తి చేశారు. వారికి శనివారం నియామక ఉత్తర్వులు ఇవ్వాలి. అయితే కంప్యూటర్ ప్రింటర్లు మొరాయించడం, విద్యుత్ కోతకారణంగా మధ్యాహ్నం వరకూ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఒక్కరోజు ముందు ఫోన్‌చేసి కౌన్సెలింగ్‌కు పిలవడంతో చంటిబిడ్డలతో వచ్చామని, నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని మహిళా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టింగ్ ఆర్డర్ల కోసం శనివారం నాలుగు వందల మంది అభ్యర్థులు పడిగాపులుకాశారు. సీఏఎస్‌ల నియామకాల్లో భాగంగా కృష్ణా జిల్లాలో 40 మంది కొత్త వైద్యులు పోస్టింగులు పొందారు. వారంతా 15 రోజుల్లో విధుల్లో చేరతారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.సరసిజాక్షి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
ప్రాణసంకటం
పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణసంకటం.. అన్నట్లు తయారైంది పేద రోగుల పరిస్థితి. ఏదైనా అనారోగ్యం వస్తే ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక సర్కారు దవాఖానాకు వచ్చే పేద రోగులకు నాసిరకం మందులు అంటగడుతూ వారి ప్రాణాలతో వైద్యసిబ్బంది ఆటలాడుకుంటున్నారు. ఎలాంటి మందులిస్తే ఏంటి? పోయేది పేదోడి ప్రాణమే కదా! అన్న తరహాలో ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యో నారాయణో హరి అని భావించే రోగులు వారు ఇచ్చే మందులను అలాగే వాడుతున్నారు. విజయనగరం మండలం కోరుకొండ పాలెం గ్రామానికి చెందిన పి. అప్పారావు కడుపులో మంట వస్తోందని కేంద్రాస్పత్రికి వెళ్లాడు. అక్కడ రెంటిడిన్ మాత్రలు ఇచ్చారు. మాత్రలు వేసుకోవడానికి తీసి చూస్తే ముద్దలా అయిపోయాయి. దీంతో వాటిని వాడడం మానేసి బయట మందుల దుకాణంలో కొనుక్కున్నాడు. ఇదే మండలం, ఇదే గ్రామానికి చెందిన పి.సురేష్‌ది కూడా అదే పరిస్థితి. ఇతనికి కూడా కడుపులో బాగులేకపోవడంతో కేంద్రాస్పత్రికి వెళ్లాడు. వైద్యులు రెంటిడిన్ మాత్రలు ఇచ్చారు. ఇంటికి వెళ్లి స్ట్రిప్ప్ తెరవగా మాత్రలు పిండి లాగా అయిపోయాయి. దీంతో వాటిని బయట పారవేసి బయట మందుల దుకాణంలో కొనుగోలు చేసి వాడుతున్నాడు. ఈ ఇద్దరి విషయంలో నాసిరకం మాత్రలు బయటపడ్డాయి. జిల్లాలో అధికశాతం మంది రక్తపోటుకు ఎంటినాల్, మధుమేహ వ్యాధికి మెట్‌పార్మిన్, కడుపులో నొప్పికి సంబంధించి ఇచ్చే మెట్రోజోల్ మాత్రలు, జ్వరానికి ఉపయోగించే పారాసిట్మాల్ మాత్రలు కూడా నాసిరకంగానే ఉన్నట్టు పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. విజయనగరంఆరోగ్యం,న్యూస్‌లైన్: ప్రజారోగ్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం నాసిరకం మందులను సరఫరా చేస్తూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. సర్కారు సరఫరా చేసే మందులు అలాగే వేసుకుంటే రోగం తగ్గకపోగా మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం సరఫరా చేసే రెంటిడిన్ మాత్రలు నాసిరకంగా ఉన్నాయి. కొన్ని స్ట్రిప్పుల్లో మాత్రలు ఖాళీగా ఉండగా, మరి కొన్ని స్ట్రిప్పుల్లో మాత్రలు బెల్లం ఊటల్లా తయారయ్యాయి. ఆ మాత్రలు వేసుకుంటే వ్యాధి తగ్గడం మాట దేవుడెరుగు వ్యాధి మరింత తీవ్రమవడం ఖాయమని రోగులు వాపోతున్నారు. జిల్లాలో 7 వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు, 8 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 68 పీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటికి ఏపీఎంఐడీసీ(ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సొసైటీ) ద్వారా మందులు సరఫరా చేస్తారు.ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మందుల కంపెనీలు ఏపీఎంఐడీసీకి మందులను సరఫరా చేస్తాయి. అయితే ఆ మందుల నాణ్యతను పరిశీలించి సరఫరా చేయాల్సిన అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం మందులను సరఫరా చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లక్షల్లో నాసిరకం మాత్రల పంపిణీ క్వార్టర్‌కు (మూడునెలలకు) రెంటిడిన్ మాత్రలు 6లక్షల వరకు వినియోగమవుతున్నాయి. కేంద్రాస్పత్రిలోనే రోజుకు 500 వరకు రెంటిడిన్ మాత్రలు వినియోగమవు తాయి. మాత్రలు నాసిరకం అని తెలియక అమాయక రోగులు వేసుకుంటున్నారు. ఇవి పనిచేయవని తెలిసినా గత్యంతరం లేక వాడుతున్నారు. మరి కొంతమంది మాత్రలు బయటపడేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇంతవరకు పీహెచ్సీ, వైద్యవిధాన్ పరిషత్ ఆస్పత్రులు, సీహెచ్‌సీలకు 24 లక్షల మాత్రలు సరఫరా అయ్యాయి. పాంటెప్ స్ట్రిప్పుల్లో మాత్రలు ఖాళీ జీర్ణకోశ వ్యాధులకు ఇచ్చే పాంటెప్ మాత్రలు కూడా పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. ఒక స్ట్రిప్‌లో పది మాత్రలు ఉండాల్సి ఉండగా 9 మాత్రమే ఉంటున్నాయి. దీంట్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. పేదోడికి ఇచ్చే మందు బిళ్లలపై ప్రభుత్వం చిన్నచూపు చూడ డంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏపీఎంఐడీసీ ఈఈ టీవీఎస్ఎన్.రెడ్డి వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా మందుల కంపెనీలు సరఫరా చేసిన మందులను నేరుగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నాం. మాత్రలు నాణ్యత లేదని సంబంధిత ఆస్పత్రుల వైద్యాధికారులు తిరిగి పంపిస్తే కంపెనీలకు పంపిస్తామన్నారు. -
చెత్తగించగలరు..
=అనకాపల్లిలో పారిశుద్ధ్య సిబ్బంది కొరత =వార్డుల్లో పేరుకుపోతున్న చెత్తా, చెదారం =పూడుకుపోతున్న మురుగునీటి కాలువలు =విజృంభిస్తున్న దోమలు, ఈగలు అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి పట్టణంలో ఎక్కడికి వెళ్లినా ముక్కుమూసుకోవాల్సిందే. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. గబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. పూడిక తొలగించకపోవడంతో మురుగునీటి కాలువలు గబ్బుకొడుతున్నాయి. ఇది గ్రేటర్ విశాఖలో విలీనమై నాలుగు నెలలు గడిచినా ఇక్కడి వారికి ‘చెత్త’కష్టాలు తీరడం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ల నుంచి పారిశుద్ధ్య కార్మికుల కొరతే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా దోమలు, ఈగలు విజృంభించి జనం రోగాల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీగా ఉన్నంత కాలం అయిదుజోన్లుగా ఉన్న పారిశుద్ధ్య వ్యవస్థను తాజాగా మూడు జోన్లుగా విభజించారు. 1, 3 సర్కిళ్లను మొదటి జోన్‌గా, 2,4 సర్కిళ్లను రెండవ జోన్‌గా, 5వ సర్కిల్‌ను మూడవ జోన్‌గాను విభజించారు. మొదటి జోన్‌కు శానిటరీ సూపర్‌వైజరే ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తున్నారు. రెండవ జోన్‌కు మరో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉండగా మూడవ జోన్‌కు హెల్త్ అసిస్టెంట్‌ను ఇన్చార్జిగా నియమించారు. మూడు జోన్ల పరిధిలో 252 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం. ప్రస్తుతం 162 మందే ఉన్నారు. వీరిలో 20 మంది పాఠశాలలకు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో 144 మందే అందుబాటులో ఉంటున్నారు. అనకాపల్లి జోన్లో 67.19 కిలోమీటర్ల పరిధిలో సీసీ, 14.78 కిలోమీటర్ల పరిధిలో బీటీ, 2.5 కిలోమీటర్ల పరిధిలో డబ్ల్యూబీఎం, 12.11 కిలోమీటర్ల పరిధిలో కచ్చారోడ్లు ఉన్నాయి. అదేవిధంగా 113.4 కిలోమీటర్ల పరిధిలో పక్కా డ్రైన్లు, 11.90 కిలోమీటర్ల పరిధిలో తుపాను నీరు పారే కాలువలు ఉన్నాయి. రహదారులు శుభ్రం చేసేందుకు రెండు కిలోమీటర్లకు ఒక స్వీపర్, కాలువల్లో ఊడ్చేందుకుకిలోమీటరుకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉండాలి. కాలువలను శుభ్రం చేసే 25 మందిని ఇంటింటా చెత్త సేకరణకు వినియోగిస్తున్నారు. దీంతో కాలువలు శుభ్రంచేసే కార్మికులు 17 మందే సేవలు అందిస్తున్నారు. 48 ఖాళీలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా పబ్లిక్ హెల్త్ అధికారులే అంగీకరిస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా కాలువలను శుభ్రం చేయలేకపోతున్నామని సంబంధిత విభాగం అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కాలువల శుభ్రం చేసేందుకు తక్షణమే సిబ్బందిని నియమించకపోతే అనకాపల్లి కంపు కంపుగానే కనిపిస్తుంది. ఇదిలా ఉండగా రూ.27 కోట్లతో చేపడుతున్న సమగ్ర పారిశుద్ధ్య అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా సాగడం వల్లే అనకాపల్లిలో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడలేదన్న వాదన ఉంది. -
పల్లెలకు సుస్తీ..!
సాక్షి, గుంటూరు:ప్రజారోగ్యం మెరుగుదలకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు కుమ్మరిస్తున్నా, వ్యాధుల నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఎన్నడూ లేనంతగా జిల్లాలో వైరల్, చికున్ గున్యా జ్వరాలు విజృంభించాయి. తీవ్రమైన కీళ్ల నొప్పులతో సత్తువను హరించి వేశాయి. చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో మంచం పట్టారు. కిందటేడాది కంటే జ్వరాల వ్యాప్తి పది నుంచి పదిహేను శాతం అధికంగా నమోదైనట్లు జిల్లా ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇది 50 శాత ం దాటినట్టు సమాచారం. ఈ దఫా మలేరియా, డెంగీ, గున్యా, వైరల్ జ్వరాలు ఒకే సారి విజృంభించడంతో ఈ వ్యాధుల బారిన పడిన వారు కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. జ్వరం నుంచి కోలుకోని నెలలు గడిచినా ఇప్పటికీ తీవ్రమైన ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జ్వర పీడితులతో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రోగుల్లో 90 శాతం మంది ప్రయివేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు అవసరం లేకున్నా టెస్టుల పేరుతో రకరకాల మందుల రాసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ జ్వరాల చికిత్సలతో గుంటూరు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.30 కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు అంచనా. ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయ లేమి వ్యాధుల తీవ్రతకు కారణమవుతోంది. కలుషిత తాగు నీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నియంత్రణకు ఫాగింగ్, పిచికారి యంత్రాలు లేకపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైద్యాధికారుల తప్పుడు నివేదికలు జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో రెండు లక్షల మందికి పైగా చికున్‌గున్యా బారిన పడ్డారు. తండాలు, మారుమూల పల్లెల్లో మాత్రమే కనిపించే మలేరియా కేసులు ఈ ఏడాది పట్టణాల్లోనూ అధికంగానే నమోదవుతున్నాయి. వేలల్లో మలేరియా, వందల్లో డెంగీ కేసులను గుర్తించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని పల్లెల్లో జనం ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వ్యాధులపై జిల్లా వైద్యాధికారులు లెక్కలు చిత్రంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 12 మండలాల్లో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 72 గ్రామాల్లోనే జ్వరాలున్నట్లు నివేధించారు. మలేరియా కేసులు 410, డెంగ్యూ నిర్ధారిత కేసులు 16, చికున్ గున్యా కేసులు 42 కేసుల్ని మాత్రమే నిర్ధారించినట్లు ప్రకటించారు. ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో గృహ సందర్శనలు చేసి వ్యాధులపై ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంత స్థాయిలో వ్యాధులు ప్రబలితే, ఎస్పీఎం విభాగం సర్వేపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ్య లోపంతోనే జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యాధికారులు నివేదికల్లో పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది నవంబరు వరకు జిల్లాలో 5,35,672 రక్తపూతలు సేకరించామని చెబుతున్న అధికారులు చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు తక్కువగానే చూపడం లెక్కలపై అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంపై ఏదీ.. చైతన్యం.. పల్లెల్లో వర్షపు నీరు.. చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నా నివారణకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రయత్నాలు మాత్రం సరిగా జరగడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా పీహెచ్సీ సబ్ సెంటర్లకు రూ.10 వేలకు పైగా నిధులు అందుతున్నాయి. కానీ ఈ నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏఎన్ఎం, గ్రామ కార్యదర్శి సంయుక్త చెక్ పవర్‌తో ఈ నిధుల్ని ఖర్చు చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యే సమయంలోనే జిల్లాలోని రెవెన్యూ గ్రామ పంచాయితీలు 1,021కి శానిటేషన్ నిర్వహణకు రూ.10 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేసి ప్రజారోగ్యం మెరగుదలకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో 226 వైద్య శిబిరాలు నిర్వహించామని, 33,906 మందికి వైద్య సేవలు అందించామని అధికారులు పేర్కొంటున్నారు. దోమల నియంత్రణకు యాంటి లార్వాను గృహాల్లో, కాల్వల్లో మలాథియన్ ఫాగింగ్ చేశామని చెబుతున్నారు. -
పల్లెలకు సుస్తీ..!
సాక్షి, గుంటూరు:ప్రజారోగ్యం మెరుగుదలకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు కుమ్మరిస్తున్నా, వ్యాధుల నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఎన్నడూ లేనంతగా జిల్లాలో వైరల్, చికున్ గున్యా జ్వరాలు విజృంభించాయి. తీవ్రమైన కీళ్ల నొప్పులతో సత్తువను హరించి వేశాయి. చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో మంచం పట్టారు. కిందటేడాది కంటే జ్వరాల వ్యాప్తి పది నుంచి పదిహేను శాతం అధికంగా నమోదైనట్లు జిల్లా ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇది 50 శాత ం దాటినట్టు సమాచారం. ఈ దఫా మలేరియా, డెంగీ, గున్యా, వైరల్ జ్వరాలు ఒకే సారి విజృంభించడంతో ఈ వ్యాధుల బారిన పడిన వారు కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. జ్వరం నుంచి కోలుకోని నెలలు గడిచినా ఇప్పటికీ తీవ్రమైన ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జ్వర పీడితులతో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రోగుల్లో 90 శాతం మంది ప్రయివేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు అవసరం లేకున్నా టెస్టుల పేరుతో రకరకాల మందుల రాసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ జ్వరాల చికిత్సలతో గుంటూరు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.30 కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు అంచనా. ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయ లేమి వ్యాధుల తీవ్రతకు కారణమవుతోంది. కలుషిత తాగు నీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నియంత్రణకు ఫాగింగ్, పిచికారి యంత్రాలు లేకపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైద్యాధికారుల తప్పుడు నివేదికలు జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో రెండు లక్షల మందికి పైగా చికున్‌గున్యా బారిన పడ్డారు. తండాలు, మారుమూల పల్లెల్లో మాత్రమే కనిపించే మలేరియా కేసులు ఈ ఏడాది పట్టణాల్లోనూ అధికంగానే నమోదవుతున్నాయి. వేలల్లో మలేరియా, వందల్లో డెంగీ కేసులను గుర్తించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని పల్లెల్లో జనం ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వ్యాధులపై జిల్లా వైద్యాధికారులు లెక్కలు చిత్రంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 12 మండలాల్లో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 72 గ్రామాల్లోనే జ్వరాలున్నట్లు నివేధించారు. మలేరియా కేసులు 410, డెంగ్యూ నిర్ధారిత కేసులు 16, చికున్ గున్యా కేసులు 42 కేసుల్ని మాత్రమే నిర్ధారించినట్లు ప్రకటించారు. ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో గృహ సందర్శనలు చేసి వ్యాధులపై ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంత స్థాయిలో వ్యాధులు ప్రబలితే, ఎస్పీఎం విభాగం సర్వేపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ్య లోపంతోనే జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యాధికారులు నివేదికల్లో పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది నవంబరు వరకు జిల్లాలో 5,35,672 రక్తపూతలు సేకరించామని చెబుతున్న అధికారులు చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు తక్కువగానే చూపడం లెక్కలపై అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంపై ఏదీ.. చైతన్యం.. పల్లెల్లో వర్షపు నీరు.. చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నా నివారణకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రయత్నాలు మాత్రం సరిగా జరగడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా పీహెచ్సీ సబ్ సెంటర్లకు రూ.10 వేలకు పైగా నిధులు అందుతున్నాయి. కానీ ఈ నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏఎన్ఎం, గ్రామ కార్యదర్శి సంయుక్త చెక్ పవర్‌తో ఈ నిధుల్ని ఖర్చు చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యే సమయంలోనే జిల్లాలోని రెవెన్యూ గ్రామ పంచాయితీలు 1,021కి శానిటేషన్ నిర్వహణకు రూ.10 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేసి ప్రజారోగ్యం మెరగుదలకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో 226 వైద్య శిబిరాలు నిర్వహించామని, 33,906 మందికి వైద్య సేవలు అందించామని అధికారులు పేర్కొంటున్నారు. దోమల నియంత్రణకు యాంటి లార్వాను గృహాల్లో, కాల్వల్లో మలాథియన్ ఫాగింగ్ చేశామని చెబుతున్నారు. -
వ్యాధుల విజృంభణ
రావికమతం /దేవరాపల్లి, న్యూస్‌లైన్: ప్రజారోగ్యం ప్రమాదకర స్థితిలో పడింది. వాతావరణంలో మార్పులతో వ్యాధులు కమ్ముకుం టున్నాయి. జలకాలుష్యం పుణ్యమా అని విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది మంచానపడి లేవలేని స్థితిలో అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో కొరవడిన పారిశుద్ధ్యం, ఇళ్ల సమీపంలోనే పశువుల శాలలు, కలుషిత తాగునీటి కారణంగా పరిస్థితి అదుపు తప్పుతోంది. రావికమతం మండలం కన్నంపేట గ్రా మాన్ని పక్షం రోజులుగా పీడిస్తున్న జ్వరాలు మరొకరిని బలిగొన్నాయి. నాగులాపల్లి బాబూరావు(33) వారం రో జులుగా జ్వరంతో బాధపడుతూ శుక్రవారం చనిపోయాడు. వారం రోజుల క్రితం ఇదే లక్షణాలతో దంట్ల శివలక్ష్మి(25), ఉలంపర్తి లోవరాజు(55) మృతి చెందిన సంగతి తెలిసిందే. నాటి నుంచి గ్రామంలో కొత్తకోట వైద్యాధికారి నరేంద్రకుమార్ మూడు సార్లు వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అం దిస్తున్నా మాయదారి జ్వరాలు అదుపులోకి రావడం లేదు. తీవ్ర జ్వరంతో అల్లాడిపోతున్న బాబూరావును మూడు రోజుల క్రితం నర్సీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ మణిపాల్‌లో చేర్చారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. గ్రామంలో ఇంకా 30 మందికి పైగా జ్వర పీడితులున్నారు. ఏ ఇంటిలో చూసినా జ్వరం, తలనొప్పితో మంచానపడి మూలుగుతున్నవారే కన్పిస్తున్నారు. ఒక్కో ఇంటిలోనివారంతా జ్వరాల బారిన పడటంతో ఒకరికొకరు సాయం చేసుకోలేని దుస్థితి. విశాఖ వైద్యులతో మెగా వైద్యశిబిరం నిర్వహించాలని సర్పంచ్ దంట్ల అరుణ కోరారు. కాగా దేవరాపల్లి మండలం గరిసింగి పంచాయతీ శివారు సంతపాలెంలో డయేరియా విజృంభించింది. వాంతులు, విరోచనాలతో ఇరటా గంగులు(50) శుక్రవారం మృతిచెందాడు. మరో పదిమంది అస్వస్థతతో దేవరాపల్లి, కె.కోటపాడు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాదల మరిడమ్మ , వాకపల్లి దేముడమ్మ , కాదల దేముడు, అతని భార్య ఈశ్వరమ్మతో పాటు మరి కొందరు డయేరియా బారినపడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దేవరాపల్లి పీహెచ్సీ వైద్యాధికారి జె.పద్మజ, ఏఎన్ఎం ఆర్.దేముడమ్మ గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి రోగులకు సేవలు అందిస్తున్నారు.