
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఆదివారం 65,263 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,484 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.61 లక్షలకు చేరుకుంది. తాజాగా 4,207 మంది కోలుకోగా, మొత్తంగా 7.18 లక్షలమంది రికవరీ అయ్యారు. ఆదివారం కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు 4,086 మంది బలయ్యారు.
ప్రస్తుతం 38,723 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిలో 3,214 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 843 మంది ఐసీయూలో, 1,319 మంది ఆక్సిజన్, సాధారణ పడకలపై 1,052 ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు.