న్యూయార్క్: అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. ఈ మేరకు అమెరికాలోని న్యూయార్క్ నగరం మంకీపాక్స్ వ్యాప్తికి కేంద్రంగా ఉందని, దాదాపు లక్ష మందికి పైగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్(డీఓహెచ్‌ఎంహెచ్) కమిషనర్ అశ్విన్ వాసన్ ప్రజారోగ్య దృష్ట్యా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు త్వరితగతిన వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
అంతేకాదు ఈ ఎమర్జెన్సీ తక్షణమై అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో డీఓహెచ్‌ఎంహెచ్ న్యూయర్క్ సిటీ హెల్త్ కోడ్ కింద అత్యవసర ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వ్యాధిని నియంత్రణలోకి తెచ్చేలే సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అదీగాక గతవారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మంకీపాక్స్ వ్యాప్తి అంతర్జాతీయ పరంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. అంతేకాదు ఇది ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కలిగిస్తుందో లేదో అంచనా వేయడం కోసం గత నెలలోనే ఘెబ్రేయేసస్ అత్యవసర కమిటీని సమావేశ పరిచారు. ఆ సమయంలోనే సుమారు 47 దేశాల్లో దాదాపు 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. అప్పటి నుంచి పెరుగుతూనే వచ్చిందని, ప్రస్తుతం ఇది కాస్త 75 దేశాలకు వ్యాపించి సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment