
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 36,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 189 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,376కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,995కి చేరిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment