
పల్లె సేవలో జూనియర్లు
‘ పల్లె ప్రజల ఆరోగ్యం.. జూనియర్ డాక్టర్ల లక్ష్యం’ నినాదంతో రాష్ట్రంలోనే తొలిసారిగా జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో జఫర్‌గఢ్ మండలంలోని కూనూరులో సోమవారం చలో పల్లె కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం ఆస్పత్రులకు చెందిన 50మంది జూనియర్ వైద్యులు హాజరయ్యారు.
- జఫర్‌గఢ్