గుంటూరు మెడికల్: సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యా«దికి చికిత్స అందించేందుకు దేశంలోనే అత్యుత్తమ వైద్య విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో త్రీడీ డిజిటల్ మామోగ్రఫీ వైద్య పరికరాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. అమృతలూరుకు చెందిన గడ్డిపాటి కస్తూరిదేవి, రామ్మోహనరావు, శివరామకృష్ణబాబు, నాట్కో ట్రస్ట్–హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో రూ.కోటి విలువైన ఈ త్రీడీ డిజిటల్ మామోగ్రఫీ వైద్య పరికరాన్ని జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి రజిని విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదికి 50 వేల నుంచి 60 వేల వరకు కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ఆస్పత్రులను అత్యాధునిక క్యాన్సర్ కేర్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు వైద్యులు, సిబ్బందికి శిక్షణ, సాంకేతిక సహకారం కోసం విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రభుత్వాస్పత్రుల్లో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కడప, కర్నూలులో రూ.120కోట్లతో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానాన్ని ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మోసం చేయడం మాత్రమే తెలుసునని, వైద్య, ఆరోగ్య రంగానికి ఏమీ చేయని ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు షేక్ ముస్తఫా, మద్దాలి గిరి, ఉండవల్లి శ్రీదేవి, నాట్కో ట్రస్ట్ సీఈవో కేవీఎస్ స్వాతి, వైస్ చైర్మన్ సదాశివరావు, కో–ఆర్డినేటర్ యడ్లపాటి అశోక్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, డీఎంఈ వినోద్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి, డీఎంహెచ్‌వో డాక్టర్ సుమయ ఖాన్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment