ఎమ్మిగనూరు టౌన్ : ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ బుధవారం ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో కస్తూరి కాన్సెప్ట్ స్కూల్, బాలికల హైస్కూల్ విద్యార్ధినీ, విద్యార్థులు పురవీధుల గూండా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లితుందని, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను బహిష్కరించాలని నినదించారు.
అనంతరం సోమప్ప సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది లక్ష్మీనారాయణ, బసిరెడ్డి, సూర్యనారాయణ, బందెనవాజ్, మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రమీలారాణి, పట్టణ సమైక్య కార్యదర్శి హేమలత, విద్యార్థినీ, విద్యార్థులు, పొదుపు మహిళలు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్‌ను నిషేధించాలి
Published Thu, Aug 14 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement