
ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ కాకుండా ఏం చేయాలి?
పేదోడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ.... కలవారికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ వైద్యం కడుపేద పడక దాకా తీసుకువచ్చిన పథకం ఆరోగ్య శ్రీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజారోగ్యానికి ఇచ్చిన వరం ఆరోగ్య శ్రీ.
కానీ అదే ఆరోగ్య శ్రీని అనంతర కాలంలో నిమ్మకు నీరెత్తిన సర్కార్లు నీరుగార్చారు. నిస్సత్తువ చేశారు. నిర్లక్ష్యం నింపారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీ గా మారిపోయింది. ఒక్కో వ్యాధిని ఆరోగ్య శ్రీ జాబితా నుంచి తొలగించేస్తూ పోతున్నారు. ఫలితంగా ఆరోగ్యశ్రీ అస్థిపంజరం రూపాన్ని సంతరించుకుంది.
ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ మళ్లీ ఊపిరులూదేందుకు సిద్ధమౌతున్నారు. ఆయన ఆరోగ్య శ్రీ విషయంలో తెలుగు ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీపై మీ స్పందనేమిటి? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? తెలియచేయండి.