సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని ప్రజారోగ్యం మీద చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఇందుకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు.
ఈ ఘటనలో 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదని మండిపడ్డారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని, అయినా సరే స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమని అన్నారు.
నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్ జగన్. లిక్కర్, ఇసుక స్కామ్‌లో నిండా మునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారని విమర్శించారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయని, బాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని, దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారని దుయ్యబట్టారు.
చదవండి: ప్రజలు ‘సూపర్‌సిక్స్’ కోసం చూస్తున్నారు: బొత్స
‘ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్‌క్లినిక్స్, పీహెచ్‌సీలను నిర్వీర్యంచేశారు. ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారు.
స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 19, 2024
Comments
Please login to add a commentAdd a comment