సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ కోవిడ్-19కు సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేసింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 2057 మందికి కరోనా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అందులో 702 మంది కరోనా అనుమానితుల్లో 662 మందికి హోమ్ ఐసోలేషన్ అవసరమని వైద్యులు సూచించారు. కాగా 40 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 21 మందికి నెగిటివ్ అని తేలగా, ఒకరికి మాత్రం కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. కాగా 18 మందికి సంబంధించిన రక్త నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు 5 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలింది. కరోనా సోకిన ఐదుగురు దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చినవారున్నారు. వీరిలో ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ కాగా, మిగతా నలుగురు మాత్రం గాంధీలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment