నాణ్యమైన సరుకులు ఇవ్వాలి
Published Sun, Aug 28 2016 10:25 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
ఖానాపూర్ : వ్యాపారులు వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయడంతోపాటు విధిగా బిల్లు ఇవ్వాలని వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కడపత్రి తిలక్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలు కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు తూ.చ. తప్పకుండా బిల్లు తీసుకోవాలన్నారు. అప్పుడే వస్తువు నాణ్యమైందో కాదో తెలుస్తుందన్నారు. బిల్లు ఇవ్వకుంటే తమ దృష్టికి తేవాలన్నారు. వ్యాపారుల వద్ద బిల్లు తీసుకోవడం వినియోగదారుల హక్కన్నారు. వినియోగదారుల హక్కుల చట్టం బిల్లు 1956 లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారన్నారు. కొందరు వ్యాపారులు ఈ చట్టాన్ని తుంగలో తొక్కి వినియోదదారులకు నష్టం చేకూరుస్తున్నారన్నారు. వినియోదారులను చైతన్య పరచడమే సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా వ్యాపారులు వినియోగదారులను మోసానికి గురైనట్లు తమ దృష్టికి తీసుకువస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వినియోదారుల సంఘం జిల్లా కోశాధికారి సలీంఖాన్, సభ్యులు, యోగి, పొలంపెల్లి సచిన్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement