goods
-
వేసవి కాలం కంపెనీలకు లాభం!
వేసవి కాలం సమీపిస్తుండటంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించి అమ్మకాలను పెంచుకునేందుకు కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు మెగా మార్కెటింగ్‌కు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఐపీఎల్ వంటి ప్రధాన ఈవెంట్లు, వేసవి సెలవులు ప్రారంభంకానుండడంతో అధిక డిమాండ్ నెలకొంటుందని సంస్థలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వివిధ విభాగాలకు చెందిన కంపెనీలు కొత్త బ్రాండ్ల ఆవిష్కరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.ప్రధాన ఈవెంట్లు..వేసవిలో వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి ముఖ్యమైన ఈవెంట్లను సద్వినియోగం చేసుకోవడం కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల కీలక వ్యూహాల్లో ఒకటి. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి, ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు ఐపీఎల్ భారీ వేదిక కానుంది. కోకాకోలా, హావ్మోర్ ఐస్‌క్రీమ్, రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్.. వంటి సంస్థలు ప్రమోషన్ క్యాంపెయిన్స్ సిద్ధం చేస్తూ ఐపీఎల్ సీజన్ కోసం ప్రత్యేకంగా ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. చాలా కంపెనీలు తమ బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీములు, రిఫ్రెషింగ్ స్నాక్స్ వంటి ప్రత్యేకమైన ఉత్పత్తులపై దృష్టి పెడుతున్నాయి. ఉదాహరణకు, హావ్మోర్ ఐస్ క్రీమ్ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా ప్రీమియం ప్యాక్‌లను ప్రవేశపెడుతోంది. వేసవి సీజన్‌ను అదనుగా తీసుకొని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తన స్పోర్ట్స్ డ్రింక్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఐపీఎల్ జట్లలో రైట్స్ దక్కించుకుంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్కు రూ.6,000 కోట్లు.. కేబినెట్ ఆమోదంపెరిగిన ప్రకటన వ్యయాలువేసవి నెలల్లో ఎఫ్ఎంసీజీ కంపెనీ ఉత్పత్తుల వినియోగం అధికమవడంతోపాటు అందుకు అనుగుణంగా ప్రకటన వ్యయాలు సైతం గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. తమ ఉత్పత్తులు పెద్దమొత్తంలో ప్రేక్షకులను చేరుకోవడానికి టెలివిజన్, డిజిటల్ ప్రకటనలు రెండింటిలోనూ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ సీజన్లో ఐపీఎల్ కోసం టెలివిజన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి మొత్తం యాడ్ రెవెన్యూ రూ.4,500 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇది గతేడాది కంటే 8-10 శాతం అధికం. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ప్రచారాలు ప్రత్యేకంగా, సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నాయి. ఉదాహరణకు, కోకాకోలా అమ్మకాలను పెంచడానికి డొమినోస్ స్టోర్లలో క్రాస్ ప్రమోషన్ చేస్తోంది. -
టీజీ ఫుడ్స్ కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో తెలంగాణ ఫుడ్స్ విభాగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లేదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తున్న పప్పు, నూనె తదితరాల సరఫరాకు నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేయడంపైనా మంత్రి మండిపడ్డారు. ప్రతి అంశాన్ని టెండర్ ప్రాతిపదికనే చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడాన్ని తప్పుబడుతూ సంబంధిత అధికారులను మంత్రి సీతక్క మందలించారు. అదేవిధంగా టీజీఫుడ్స్ విభాగంలో కారుణ్య నియామకాలు, పదోన్నతుల విషయంలోనూ అవకతవకలు జరిగాయనే అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇటీవల భువనగిరిలో బాలామృతం దారి మళ్లింపు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలకు సంబంధించి డిజైన్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మంది సభ్యులకు ఈ చీరలు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, కమిషనర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు. హామీలను అమలు చేయండి.. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సచివాలయంలో వారు మంత్రి సీతక్కను కలిశారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.18 వేలకు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని కోరారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేసినప్పటికీ ఆ మేరకు వేతనాలు చెల్లించలేదని, దాదాపు ఏడు నెలల బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచి్చనట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. -
ఎలాంటి ఉత్పత్తులు వాడాలో చెప్పిన మంత్రి
పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను వినియోగించడంపై ప్రజలు దృష్టి సారించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దీంతో కర్బన ఉద్గారాలను తగ్గించ వచ్చన్నారు. ఫలితంగా పర్యావరణ సంబంధిత సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో గోయల్ మాట్లాడారు.‘ప్రస్తుత జీవన శైలి ధోరణుల కారణంగా వెలువడుతున్న వ్యర్థాలు, కర్బన ఉద్గారాల పట్ల స్పృహ కలిగి ఉండడం ఎంతో అవసరం. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్‌కు ఇది కీలకం. వినియోగ ధోరణలను చక్కదిద్దుకోకపోతే సుస్థిర, పర్యావరణ సవాళ్లకు పరిష్కారం లభించదు. తయారీ రంగం వెలువరించే కర్బన ఉద్గారాల వల్లే పూర్తిగా పర్యావరణ సవాళ్లు వస్తున్నట్లు భావించకూడదు. వినియోగం కూడా అందుకు కారణం. వినియోగ డిమాండ్‌పైనే తయారీ ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!వినియోగ ధోరణుల్లో మార్పు రావాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పర్యావరణ విధ్వంసానికి దక్షిణాది దేశాలు కారణం కాదని..ఇందులో అభివృద్ధి చెందిన దేశాల పాత్రం ప్రధానమని చెప్పారు. అవి చౌక ఇంధనాలను వినియోగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల మంత్రి ఎంకే నిర్ బర్కత్ ఇదే సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో ఇటలీ, భూటాన్, బహ్రెయిన్, అల్జీరియా, నేపాల్, సెనెగల్, దక్షిణాప్రికా, మయన్మార్, ఖతార్, కంబోడియా దేశాల సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. -
గూడ్స్ ఆటోలో రూ. 2.73 కోట్లు
బనశంకరి: ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.2.73 కోట్ల నగదును శనివారం బెళగావి సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణం నుంచి హుబ్లీకి గూడ్స్ వాహనంలో నగదును తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు మాళమారుతి ఠాణా పరిధిలో వాహనాన్ని అడ్డుకుని సోదాలు చేయగా నగదు లభించింది. సాంగ్లికి చెందిన సచిన్ మేనకుదుళె, మారుతి మారగుడె అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నగదును తరలించడానికి వీలుగా వాహనంలో అనేక మార్పులు చేయడం గమనార్హం. ఈ నగదు ఎవరిది అనేదానిపై దర్యాప్తు చేపడుతున్నామని డీసీపీ రోషన్ జగదీశ్ తెలిపారు. -
AP: పండగపూట సరుకుల్లేవ్!
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ‘కోతల పర్వం’ నడుస్తోంది. పేదలకు సబ్సిడీపై పంపిణీ చేసే సరుకులను కూటమి ప్రభుత్వం కుదించేస్తోంది. ఎన్నికలకు ముందు రేషన్ షాపుల్లో 18 రకాల సరుకులను ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు... అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక్కొక్కటిగా తగ్గించేస్తున్నారు. ఇప్పటికే గోధుమ పిండి సరఫరాకు మంగళం పాడేశారు. కందిపప్పును కూడా అటకెక్కించారు. కేవలం బియ్యం పంపిణీ చేసి పేదలను పండుగ చేసుకోండని చెబుతున్నారు. వాస్తవానికి ఆ బియ్యంలో కూడా సగానికి పైగా కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఉచితంగా ఇస్తోంది. అంటే... కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అరకొర పంచదార మినహా సొంతంగా పేదలకు పంపిణీ చేసిందేమీ లేదు. మూడు నెలల్లో ఇచ్చిన కందిపప్పు 249 టన్నులే... టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్లో అసలు పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో 1.48 కోట్లకుపై రేషన్ కార్డులు ఉండగా, గడిచిన మూడు నెలల్లో కేవలం 2శాతం.. అంటే 2.50లక్షల కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందింది. మొత్తం కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 15వేల టన్నులు అవసరం. కానీ, మూడు నెలల్లో ఇచ్చింది 249 టన్నులు మాత్రమే కావడం గమనార్హం. పండుగ వేళ ప్రచారం ఎక్కువ.. పంపిణీ తక్కువ సెపె్టంబర్ నెలలో వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ రేషన్‌లో కందిపప్పు పంపిణీ చేయలేదు. అదే సమయంలో అకాల వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. మూడు నెలలుగా ఇసుక దొరక్క... పనులు లేక సుమారు 45లక్షల మంది భవన నిర్మాణ కారి్మకుల కుటుంబాలు పస్తులుండే దుస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో రూ.160 నుంచి రూ.220 వరకు వెచ్చించి కందిపప్పు కొనుగోలు చేయలేకపోతున్నామని పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కంటితుడుపుగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కందిపప్పు పంపిణీని ప్రారంభించింది. కానీ, 11 రోజుల్లో 1.19 కోట్ల మంది కార్డుదారులు బియ్యం తీసుకుంటే... కేవలం 21.70లక్షల కార్డులకు మాత్రమే కందిపప్పు పంపిణీ చేసింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే మంత్రులు మాత్రం పండుగ వేళ ఇప్పుడే కొత్తగా కందిపప్పు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. బాబు హయాంలో ఇది కొత్తేమీ కాదుచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌లో కోతలు పెట్టడం.. నెలలు తరబడి నిత్యావసరాల పంపిణీని నిలిపివేయడం కొత్తేమీ కాదు. ఆయన అధికారంలో ఉండగా, 2014 సెపె్టంబర్ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీని ఆపేశారు. ఇక 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.1,605 కోట్ల విలువైన 0.93లక్షల టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేశారు. జగన్ హయాంలో క్రమం తప్పకుండా పంపిణీ » వైఎస్ జగన్ పాలనలో ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా కందిపప్పు పంపిణీ చేశారు. » బహిరంగ మార్కెట్లో కందిపప్పు రేటు రూ.170కి పైగా ఉన్నా.. రాయితీపై కిలో రూ.67లకే అందించారు. » టెండర్లలో కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేసినా... వారితో సంప్రదింపులు జరిపి అవసరమైతే మార్కెట్ రేటు ఇచ్చిమరీ కందిపప్పు కొనుగోలు చేసి కార్డుదారులకు రూ.67లకే అందించారు. » స్థానిక రైతుల నుంచి కందులు కొనుగోలు చేసి కందిపప్పుగా మార్చి ప్రత్యేక ప్యాకెట్ల రూపంలో వినియోగదారులకు సరఫరా చేశారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా రేటు పెంచలేదు. » జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,140 కోట్లు విలువైన 3.28లక్షల టన్నుల కందిపప్పును పేదలకు సబ్సిడీపై అందించడం విశేషం. గతంలోనే బాగుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు రేషన్ సరుకులు బాగా పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటి వద్దకే సరుకుల పంపిణీని ప్రారంభించి విజయవంతంగా నిర్వహించారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభించింది. పేదలకు నాణ్యమైన సరుకులు పారదర్శకంగా అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు అవసరమైన నిత్యావసర సరకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలకు అందాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. – మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నకరికల్లు, పల్నాడు జిల్లా ప్రహసనంగా రేషన్ పంపిణీ కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ సరకుల పంపిణీ ప్రహసనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీ బాగుంది. అధికారంలో వచ్చిన వెంటనే కందిపప్పు, ఇతర నిత్యవసరాలు పంపిణీ చేస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించింది. పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. – కోట బూరయ్య, మాజీ సర్పంచ్, పినపళ్ల, ఆలమూరు మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 4 నెలలుగా బియ్యం మాత్రమేమేము కర్నూలులో నివాసం ఉంటున్నాం. 4 నెలలుగా కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. పంచదార, కందిపప్పు ఇవ్వాలని కోరినా స్టాక్ లేదంటున్నారు. గతంలో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు ఇచ్చేవారు. ఇప్పుడు పండుగకు అయినా ఇస్తారనుకుంటే ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడంలేదు. – గొల్ల లలితమ్మ, కేసీ కెనాల్ ఏరియా, కర్నూలు -
పశ్చిమ బెంగాల్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
న్యూ మేనాగురి: పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అలీపుర్దువార్ డివిజన్లోని న్యూ మేనాగురి స్టేషన్లో ఒక గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన దరిమిలా ఈ మార్గంలో వెళ్లే రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఇది ఐదు లైన్లతో కూడిన స్టేషన్ అని, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.గూడ్సు రైలు పట్టాలు తప్పిన సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్ సూపరింటెండెంట్ ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు(మంగళవారం) ఉదయం 6:20 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రస్తుతం మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అలీపుర్దూర్ డివిజన్ డీఆర్ఎం అమర్జీత్ గౌతమ్ తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారని అన్నారు. కాగా గత నెలలో కూడా పశ్చిమ బెంగాల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాడు ఈ ఘటన మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్‌లోని కుమేదర్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్జీపీ నుంచి కతిహార్ వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. #WATCH | 5 wagons of an empty goods train derailed at New Maynaguri station in Alipurduar division. Trains have been diverted through alternate routes and movement has not been affected. Senior officers including DRM Alipurduar have moved to the site. Restoration work is going… pic.twitter.com/6GKv0otIAB— ANI (@ANI) September 24, 2024ఇది కూడా చదవండి: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి -
'బుడమేరు వరద' సాయం స్వాహా
విజయవాడస్పోర్ట్స్: బుడమేరు ముంపు వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారు. వరద వల్ల ఈ నెల ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు విజయవాడ నగర శివారులోని కొత్త రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, సుందరయ్యనగర్, శాంతినగర్, ప్రశాంతినగర్, కండ్రిక, రాజీవ్‌నగర్, ఉడా కాలనీ తదితర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బాధితుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది ముందుకొచ్చారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో ఆహారం, నీళ్లు, దుప్పట్లు, సరుకులు తీసుకొచ్చారు. వాటిపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. చాలావరకు సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలోనే వాటిని ఎగరేసుకుపోయారు. అంతటితో ఆగకుండా తమ పలుకుబడి ఉపయోగించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు తెచ్చిన సరుకులు, దుప్పట్లు, దుస్తులు వంటివి సింగ్‌నగర్ కృష్ణా హోటల్ సమీపంలోని ఎమ్మెల్యే బొండా ఉమా కార్యాలయానికి తరలించారు. వాటిని పసుపు సంచుల్లో వేసి టీడీపీ పంపిణీ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఈ సరుకుల పంపిణీకి కూడా పలు ప్రాంతాల్లో ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్ల కోసం వాంబేకాలనీలోని ఫంక్షన్ హాలు వద్దకు గురువారం అధిక సంఖ్యంలో పేదలు చేరడంతో గందరగోళం నెలకొంది. అక్కడి నుంచి టోకెన్లు తీసుకుని టీడీపీ కార్యాలయానికి వెళితే షట్టర్ మూసి ఉందని పలువురు వరద బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సాయం చేస్తామని చెప్పి వారం నుంచి టోకెన్లు, సరుకులు అంటూ తిప్పుకుంటున్నారని వాంబేకాలనీకి చెందిన మహిళలు కె.జయలక్ష్మి, ఎస్.కనకదుర్గ, ఎ.నాగమణి, కె.దుర్గాభవాని, వి.లక్ష్మి, బి.నాగరాణి, శాంతి, ఎస్.సన్యాసమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు.మహిళ పేరు బాణావతు మల్లేశ్వరి. టీడీపీ నాయకురాలు. 20 ఏళ్లుగా కొత్త రాజరాజేశ్వరిపేటలో నివసిస్తూ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బుడమేరు వరద కారణంగా ఆమె నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరిపేట అంతా మునిగిపోయింది. తమ పేటలోని బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నేతలు స్వాహా చేస్తున్న విషయాన్ని తేల్చుకునేందుకు పలువురు మహిళలతో కలిసి మల్లేశ్వరి గురువారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే కార్యాలయం షట్టర్ మూసి ఉంది. ‘మా ప్రాంతానికి ఇప్పటి వరకు టీడీపీ తరఫున ఎటువంటి సాయం చేయలేదు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇచ్చే సాయాన్ని కూడా మా పార్టీకే చెందిన మాజీ కార్పొరేటర్ యరబోతు రమణ పక్కదారి పట్టిస్తున్నాడు. సాయం చేసేందుకు వచ్చేవారిని మా పార్టీ నాయకులు వారి ఇళ్ల వద్దకు పిలిపించుకుని సరుకులు, దుస్తులు కాజేస్తున్నారు’ అని మల్లేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. వరద నష్టం అంచనాలు కూడా కొందరి ఇళ్లకే పరిమితం చేశారని, సామాజిక పింఛన్లు ఇంకా ఇవ్వలేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.నీచమైన బతుకులు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు మాకు ఎలాంటి సాయం చేయలేదు. సాయం చేసేందుకు వచ్చిన వారి నుంచి సరుకులన్నీ టీడీపీ నాయకులే తీసుకుంటున్నారు. వాటిని బయటపెట్టడం లేదు. ఎవరికీ పంచడం లేదు. మాకు అందాలి్సన వాటిని కాజేస్తూ నీచాతినీచమైన బతుకు బతుకుతున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆఫీసుకు వెళ్లి అడిగితే రోడ్డు పక్కన పడేసే చిరిగిన దుస్తులు పంపించారు. వాటనీ్నంటినీ బుధవారం రాత్రి మా వీధిలో పడేసి తీసుకువచ్చిన టీడీపీ నాయకుల ముందే తగలబెట్టేశాం. – రాజులపాటి తిరుపతమ్మ, న్యూఆర్ఆర్పేటసాయం అడిగితే పార్టీలు అంటగడుతున్నారుఇంట్లో సామాన్లు అన్నీ పోయి ఇబ్బందులు పడుతున్నాం. సాయం చేయాలని అడుగుతుంటే టీడీపీ నాయకులు పార్టీలను అంటగడుతున్నారు. మా పార్టీకి ఓటు వేయలేదు... మీకు ఇవ్వం అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగన్ పార్టీ వాళ్లు వచ్చి అందరికీ సాయం అందించారు. టీడీపీ వాళ్లు మాత్రం పార్టీల పేరుతో వేరు చేసి మాట్లాడుతున్నారు. వాళ్లు సాయం చేయకపోగా, సాయం చేసే వాళ్లని మా వరకు రానివ్వడం లేదు. – గుడిసే నాగమణి, న్యూఆర్‌ఆర్‌పేట -
ప్యాకేజీపై అన్ని వివరాలు ఉండాల్సిందే..
ప్యాక్ చేసి విక్రయించే వస్తువులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్యాకేజీపై తెలియజేయాలని భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ డ్రాఫ్ట్(ముసాయిదా)ను జారీ చేసింది. అందులో భాగంగా లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్ 2011లో సవరణలు చేయాలని ప్రతిపాదించింది.ఈ సవరణలు ఆమోదం పొందితే ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్కెట్లో విక్రయించే ప్యాకేజ్డ్ కమోడిటీలు అన్నింటికీ ఈ నియమాలు వరిస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. అన్నిరకాల వినియోగ వస్తువుల ప్యాక్‌లపై తయారీదారు/ ప్యాకర్/ దిగుమతిదారు పేరు, చిరునామా, వారి మాతృదేశం, ఆ వస్తువుల కామన్, జనరిక్ పేరు, నికర పరిమాణం, తయారు చేసిన నెల, సంవత్సరం, గరిష్ఠ చిల్లర ధర, ఒక్కో యూనిట్ అమ్మకం ధర, ఏ తేదీలోపు వినియోగించాలి, వినియోగదారుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలు ఉండాలి. అన్ని బ్రాండ్లకూ ఒకేరకమైన విధానం అమలుచేయడం వల్ల వినియోగదారులకు ఆ వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే వీలవుతుందని ప్రభుత్వం తెలిపింది.జులై 29, 2024లోపు ప్రతిపాదిత సవరణలపై వినియోగదారులు, తయారీదారులు తమ అభిప్రాయాలను కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖకు సమర్పించవచ్చని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలుఈ ప్రతిపాదనల నుంచి మినహాయింపు ఉన్న వస్తువులు25 కిలోగ్రాములు లేదా 25 లీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ప్యాకేజీలు.50 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో విక్రయించే సిమెంట్, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు.పారిశ్రామిక లేదా సంస్థాగత వినియోగదారుల కోసం ఉద్దేశించిన ప్యాకేజీ వస్తువులు. -
దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్న మోదీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని సామాజిక ఉద్యమ కార్యకర్త మేధా పాట్కర్ ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో కర్షక, కార్మిక సదస్సు నిర్వహించారు. మేధా పాట్కర్ మాట్లాడుతూ పేదలకు నిత్యావసర వస్తువులను అందించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర రావడంలేదని, అదానీ, అంబానీలకు మాత్రం రూ.వేల కోట్లు ఆదాయం వస్తోందన్నారు. ఆదివాసీల హక్కులను దెబ్బతీస్తూ అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టంలో మార్పులు చేస్తున్నారన్నారు.సంయుక్త కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు హన్నన్ ముల్లా మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 13 నెలలపాటు రైతులు చేసిన ఉద్యమం సందర్భంగా ప్రధాని ఇచ్చిన హామీల అమలు కోసం ఆగస్టులో ఆందోళనలను నిర్వహిస్తామన్నారు. రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వినర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆల్ ఇండియా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం జాతీయ అధ్యక్షుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
అది అత్యంత పొడవైన రైలు.. ఎన్ని వందల బోగీలు ఉంటాయంటే..
రైలులో ప్రయాణించడం అంటే ఎవరికైనా సరదాగానే ఉంటుంది. ఇక చిన్నపిల్లలైతే పట్టాలపై వెళుతున్న రైలును చూసి సంబరపడిపోతుంటారు. వారు ఆ రైలుకు ఎన్ని బోగీలు ఉన్నాయో లెక్కించే ప్రయత్నం చేస్తుంటారు. సాధారణంగా ఏదైనా రైలుకు 16 లేదా 17 బోగీల వరకూ ఉంటాయనే విషయం తెలిసిందే. కొన్ని రైళ్లకైతే ఈ సంఖ్య 20 నుంచి 25 వరకూ ఉంటుంది. అత్యధిక బోగీలతో.. ఇంతకన్నా అధికంగా బోగీలు కలిగిన రైలు గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ రైలు రెండు చివరలు చూడాలంటే 7.3 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత పొడవైన రైలు ఇదే. 24 ఈఫిల్ టవర్ల ఎత్తుకు ఈ రైలు పొడవు సమానంగా ఉంటుంది. ఈ రైలు వంద లేదా రెండు వందల బోగీలు ఉంటాయనుకుంటే పొరపాటు పడినట్టే. ఈ రైలుకు ఏకంగా 682 బోగీలు ఉంటాయి. దీని బరువు ఎంతంటే.. ఈ ఆశ్చర్యకరమైన రైలు పేరు ‘ది ఆస్ట్రేలియన్ బీహెచ్పీ ఐరన్ ఓర్'. ఇది గూడ్సు రైలు. ఈ గూడ్సు రైలు 2001, జూన్ 21న తొలిసారిగా పరుగు అందుకుంది. పొడవులోనే కాదు ఈ రైలు బరువులోనూ ముందుంటుంది. ఈ రైలు ముందుకు కదిలేందుకు మొత్తం 8 డీజిల్ లోకోమోటివ్ ఇంజిన్లు అవసరమవుతాయి. ఈ రైలు ఆస్ట్రేలియాలోని యాండీ మైన్ నుంచి హెడ్‌ల్యాండ్ మధ్య నడుస్తుంది. ఈ ఇరు గమ్యస్థానాల మధ్య దూరం 275 కిలోమీటర్లు. ఈ రైలు గమ్యస్థానాన్ని 10 గంటల్లో చేరుకుంటుంది. ఈ రైలు బరువు సుమారు లక్ష టన్నులు. ప్రైవేటు రైల్వే లైను.. ‘ది ఆస్ట్రేలియన్ బీహెచ్పీ ఐరన్ ఓర్' ఒక ప్రైవేటు రైల్వే లైన్. దీనిని ‘మౌంట్ న్యూమ్యాన్ రైల్వే’ అని కూడా అంటారు. ఈ రైలు నెట్వర్క్ ఐరన్ రవాణా కోసం డిజైన్ చేశారు. నేటికీ ఈ రైలు తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే దీని బోగీల సంఖ్యను తగ్గించారు. ప్రస్తుతం ఈ రైలుకు 250 బోగీలు తగిలిస్తుండగా, నాలుగు డీజిల్ లోకోమోటివ్ ఇంజన్లు రైలును ముందుకు లాగుతాయి. ఇది కూడా చదవండి: ఇది అరుదైన ‘సూసైడ్ డిసీజ్’ బాధితురాలి కన్నీటి గాథ -
ఈ ఎలక్ట్రిక్ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్‌కి 150 కిలోమీటర్లు!
సరుకు రవాణా అవసరాల కోసం ఎక్కువ మొత్తంలో బరువు తీసుగల టూ వీలర్ కోసం చేస్తున్నారా.. అది కూడా ఎలక్ట్రిక్ బండి (Electric Scooter) కావాలా.. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి పరిశీలించండి.. పొలం దగ్గరకు వెళ్లడానికి, ఎరువు బస్తాలు, కూరగాయలు, ఇతర బరువైన వస్తువులు తీసుకువెళ్లడానికి కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 ( KOMAKI XGT CAT 2.0) సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఏకంగా 350 కేజీల బరువునైనా లాగగలదు. రైతులు, కూరగాయలు, ఇతర చిరు వ్యాపారులు, దుకాణదారులు ఈ బండిలో సరుకు రవాణా చేయవచ్చు. పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. రేంజ్, ఫీచర్లు, ధరలు కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 బండిని ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఎక్స్ట్రా క్యారియర్, బీఎల్డీసీ హబ్ మోటార్, పార్కింగ్ అసిస్ట్, ఆటో రిపేర్, మల్టీపుల్ సెన్సార్స్, సెల్ఫ్ డయాగ్నసిస్, వైర్లెస్ అప్డేట్స్, స్మార్ట్ డ్యాష్ బోర్డ్, బ్యాక్ ఎల్ఈడీ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఎకో, స్పోర్ట్, టర్బో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇందులో ఉంటాయి. మొబైల్ చార్జింగ్ పాయింట్, లాక్ బై రిమోట్, టెలీస్కోపిక్ షాకర్, రిపేర్ స్విచ్, యాంటీ థెఫ్ట్ లాక్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఫోల్డబుల్ సీటు మరో ప్రత్యేకత. ఇక కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0లో రెండు వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. 72వీ 31 ఏహెచ్ వేరియంట్ ధర రూ.1.01 లక్షలు . దీని రేంజ్ 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 72వీ 44 ఏహెచ్ వేరియంట్ ధర రూ. 1.14 లక్షలు. దీని రేంజ్ 150 కిలోమీటర్ల వరకు ఉంది. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
ఒడిస్సా: ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైల్..
-
కొట్టేశానోచ్! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!
ఒక దొంగ మంచి ఖరీదైన వస్తువు కొట్టేశానన్న ఆనందంలో ముందు వెనుక చూడకుండా పారిపోయేందుకు యత్నించి బొక్క బోర్లాపడి అడ్డంగా దొరికి పోయాడు. ఈ ఘటన యూఎస్‌లోని వాషింగ్టన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో లూయిస్ విట్టన్ స్టోర్ అనే లగ్జరీ షాపుకి ఒక దొంగ వచ్చాడు. అతను ఆ షాపులో సుమారు రూ. 14 లక్షలు ఖరీదు చేసే వస్తువుని దొంగలించి పారిపోయేందుకు యత్నించాడు. ఐతే ఆ షాపుకి బయటవైపుగా క్లీన్‌గా ఉన్న అద్దాన్ని గమనించకుండా బయటకు దారి అదే అనుకుని ఆ అద్దం గుండా వెళ్లిపోవాలనుకున్నాడు. అంతే ఆ దొంగ ఆ అద్దానికి గుద్దుకుని ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాడు. అతను 17 ఏళ్ల యువకుడని పోలీసులు చెప్పారు. ఈ బెల్లేవ్ నగరంలో ఇటీవల 50కి పైగా ఇలాంటి రిటైల్ దోపిడి, షాప్ చోరి కేసులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. వారంతా తమను గుర్తుపట్టరన్న ధైర్యంతో చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు పోలీసులు బెల్లేవ్ నగరానికి వచ్చి ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే మరిన్ని కేసులు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
వీడెవడ్రా బాబు! ఇలా వెళ్తున్నాడు.. తేడా కొడ్తే అంతే సంగతులు
రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా మంది ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తుంటారు. సిగ్నల్స్ పట్టించుకోకుండా రయ్యిమంటూ దూసుకెళ్తుంటారు. బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అతివేగంగా వెళ్తుంటారు. పరిమితికి మించి లగేజ్‌ను తీసుకెళ్తుంటారు. ఇలాంటివారు తమ జీవితాన్నే నాశనం చేసుకోకుండా వేరే వాళ్ల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రోడ్డుపై ఇలాగే వెళ్తూ కనిపించాడు. తన టూవీలర్‌పై పరిమితికి మించి అధిక బరువులను తీసుకెళ్తున్నాడు. స్కూటీపై కనీసం తను కూడా కూర్చోడానికి ప్లేస్ లేకుండా వస్తువులతో నింపేసి.. బండి చివర కూర్చొని ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్నాడు. అతని కాళ్లు కిందకు ఆనుతుంటే.. స్కూటర్ హ్యాండిల్ అందుకోలేంత చివరలో కూర్చొని అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సాగర్ అనే వ్యక్తి తన ట్విటర్లో పోస్టు చేశాడు. ‘నా 32GB ఫోన్ 31.9 GB డేటాను తీసుకువెళుతోంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఇందులోని వ్యక్తి ఎవరో.. ఎక్కడ జరిగిందో తెలియలేదు కానీ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. There is a possibility to retrieve the data from the Mobile, even if it's damaged. But not life... So our appeal to people avoid putting their life's at risk and others too.#FollowTrafficRules #RoadSafety @HYDTP @CYBTRAFFIC @Rachakonda_tfc @hydcitypolice @cyberabadpolice https://t.co/Z6cipHFfDr — Telangana State Police (@TelanganaCOPs) June 21, 2022 దీనిని తెలంగాణ పోలీసులు కూడా షేర్ చేశారు. దీనిపై తెలంగాణ పోలీసులు స్పందించారు. ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ..‘మొబైల్ దెబ్బతిన్నప్పటికీ డాటా రికవరీ చేయవచ్చు కానీ జీవితాన్ని తిరిగి తీసుకురాలేం. కాబట్టి ప్రజలు తమ ప్రాణాలను, ఇతరులను కూడా ప్రమాదంలో పడకుండా నివారించండి’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 7లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అతని డ్రైవింగ్ భయంకరంగా ఉంది. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు. అతనికి భారీ జరిమానా విధించండి.’ అంటూ తిట్టిపోస్తున్నారు. -
బజ్జీల నుంచి ఐస్‌క్రీం వరకు.. అంతా కల్తీ మయం
సాక్షి,ఇచ్చోడ(అదిలాబాద్): కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా జిల్లాలో నిత్యావసరాల కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కట్టడి చేయాల్సిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కారం, పసుపు, నూనె, ఉప్పు, పప్పు, పాలు, పెరుగు, సబ్బులు, షాంపులు, టీ పొడి, చివరకు దేవుడి దీపాలకు ఉపయోగించే నూనెను కూడా కల్తీ చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు కల్తీ నిత్యావసరాలను పేద, మధ్య తరగతి ప్రజలకు విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా జిల్లాలో పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు కల్తీ సరుకులను ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, మిఠాయిల దుకాణాలు, బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్లలో కల్తీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బ్రాండెడ్ పేరుతో విక్రయాలు... జిల్లాలోని దుకాణాల్లో విక్రయిస్తున్న నిత్యావసర సరుకుల్లో అసలు ఏదో.. నకిలీ ఏదో గుర్తు పట్టడం కష్టంగా మారుతోంది. బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకుల వ్యాపారం జరుగుతోంది. అసలును పోలిన ప్యాకింగ్, కాస్త ధర తగ్గించి విక్రయిస్తుండడంతో వినియోగదారులు నకిలీ గుర్తించలేకపోతున్నారు. నిత్యావసరాలే లక్ష్యంగా ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిత్యం రూ.కోటి వ్యాపారం.. జిల్లాలో ప్రతీరోజు నిత్యావసర సరుకుల వ్యాపారం రూ.కోటి వరకు జరుగుతోంది. ధనికుల నుంచి నిరు పేదల వరకు నిత్యం వాడే నూనె, సబ్బులు, టీ పౌడర్, పప్పు, ఉప్పు, కారం, పంచదార ఇలా 30 రకాల వస్తువులు కల్తీ అవుతున్నాయి. వీటినే వ్యాపారులు ప్రజలకు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారసంతల్లో కల్తీ వస్తువుల విక్రయాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. వ్యాపారులకు తక్కువ ధరకు వస్తుండడం, లాభం ఎక్కువగా ఉండడంతో వారు కూడా కల్తీ సరుకుల విక్రయాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. బజ్జీల నుంచి ఐస్‌క్రీం వరకు.. రోడ్ల పక్కన విక్రయించే టిఫిన్లు, మిర్చి బజీలు, పానీ పూరి, కట్లెస్తోపాటు ఐస్‌క్రీం వరకు అన్నింటిలో కల్తీ జరుగుతోంది. ప్రతీరోజు ఉదయం కొనుగోలు చేసే పాలలోనూ వ్యాపారులు పిండి, రసాయనలు కలిపి కల్తీ చేస్తున్నారు. హోటళ్లలో గడ్డ పెరుగు పేరిట కల్తీ పెరుగు విక్రయిస్తున్నారు. 25 లీటర్ల పెరుగు తయారీకి కేవలం 25 లీటర్ల వెడినీళ్లలో రెండు మాత్రలు వేసి అరగంటలో పెరుగు తయారు చేస్తున్నారు. ఐస్క్రీంలలోనూ హానికరమైన రసాయనాలు వాడుతున్నారు. జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు.. ► ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంత కాలంగా మురిగి పోయిన, నాణ్యతలేని అల్లం, వెల్లులితో అల్లం పేస్టు తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసు ఇటీవల దాడిచేశారు. యాజామానిపై కేసు నమోదు చేశారు. ► గుడిహత్నూర్ మండలంలో కల్తీ కారం, పసుపు తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్‌పోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నమూనాలను సేకరించి కేసులు నమోదు చేశారు. ► ఐదు నెలల క్రితం నేరడిగొండ మడలంలోని వారసంతలో కొంత మంది వ్యాపారులు కల్తీ కారం, పసుపు, నూనె విక్రయిస్తుండగా వినియోగదారులు గుర్తించి గొడవ చేశారు. దీంతో వ్యాపారులు పారిపోయారు. ► జిల్లా కేంద్రంలో గతేడాది కల్తీ నూనె విక్రయిస్తున్న వ్యాపారీ నుంచి 4 వేల లీటర్ల నూనెను అధికారులు పట్టుకున్నారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. నాలుగు జిల్లాలకు ఒకే ఆధికారి... అహార భద్రత శాఖకు సంబంధించిన ఆధికారులు జిల్లాకు ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కలిపి ఒకే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. దీంతో కల్తీ నియంత్రణ సాధ్యం కావడం లేదు. ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. నాణ్యతలేని సరుకులు ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీతో క్యాన్సర్ ముప్పు.. పసుపు, కారంలో వ్యాపారులు నికిల్, గిలాటిన్ అనే పదార్థాలు కలుపుతున్నారు. ఇవి శరీరంలో రక్తకణాలను దెబ్బతీస్తాయి. కడుపులో మంట, అల్సర్ వస్తుంది. ప్రా«థమిక దశలో చికిత్స అందకపోతే క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. కల్తీ వస్తువలకు దూరంగా ఉండాలి. – రాథోడ్ రవికుమార్, పిల్లల వైద్యనిపుణుడు చదవండి: దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా.. -
కంప్యూటర్లు, బంగారం, యూరియా... వీటి దిగుమతులపై కేంద్రం నజర్
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు గణనీయంగా పెరిగిపోతున్న ఉత్పత్తుల జాబితాను కేంద్రంలోని వివిధ శాఖలకు వాణిజ్య శాఖ అందజేసింది. కోకింగ్ కోల్, కొన్ని రకాల మెషినరీ, రసాయనాలు, డిజిటల్ కెమెరాలు ఇలా మొత్తం మీద 102 ఉత్పత్తులను గుర్తించింది. స్థానికంగానే వీటి ఉత్పత్తిని పెంచే మార్గాలపై దృష్టి సారించాలని కోరింది. తద్వారా దిగుమతులను తగ్గించొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దిగుమతుల బిల్లును తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర వాణిజ్య శాఖ ఈ ఉత్పత్తులకు సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనం కూడా నిర్వహించింది. దీర్ఘకాలం నుంచి వీటి దిగుమతులు క్రమంగా పెరుగుతూనే ఉన్నట్టు గుర్తించింది. 2021 మార్చి నుంచి ఆగస్ట్ వరకు దేశ దిగుమతుల బిల్లులో ఈ 102 ఉత్పత్తుల వాటానే 57.66 శాతంగా ఉన్నట్టు తెలుసుకుంది. బంగారం, ముడి పామాయిల్, ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్లు, పర్సనల్ కంప్యూటర్లు, యూరియా, స్టెయిన్లెస్ స్టీల్ స్క్రాప్, శుద్ధి చేసిన రాగి, కెమెరాలు, పొద్దుతిరుగుడు నూనె, ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా వీటిల్లో ఉన్నాయి. 2021 ఏప్రిల్–అక్టోబర్ వరకు దేశ దిగుమతుల బిల్లు 331 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 79 శాతం అధికంగా ఉంది. -
దక్షిణ మధ్య రైల్వే: జహీరాబాద్ టు త్రిపుర!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే తొలిసారి 3,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య రాష్ట్రానికి వాణిజ్య రవాణా వాహనాలను తరలించి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు అంతదూరంలోని ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా చేయలేదు. దేశవ్యాప్తంగా సరుకు రవాణాను మరింత పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లను ప్రారంభించి కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే జహీరాబాద్‌లో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమల నుంచి తాజాగా మినీ ట్రక్కులు, గూడ్స్ ఆటోలతో కూడిన లోడ్‌ను ఓ ఫ్రైట్ రేక్ ఈశాన్య రాష్ట్రంలోని త్రిపురకు రవాణా చేసింది. రోడ్ ట్రాన్స్‌పోర్టుపై భారం తగ్గింపు దూర ప్రాంతాలకు ఇప్పటివరకు వాణిజ్యపరంగా సరుకు రవాణా రోడ్డు మార్గం ద్వారానే ఎక్కువగా సాగుతోంది. దీన్ని నియంత్రించటం ద్వారా రోడ్డు రవాణాపై భారాన్ని తగ్గించటంతో పాటు రైలు రవాణాకు లాభాలు పెంచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రైల్వేకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ల (బీడీయూ)ను ఏర్పాటు చేసుకుంది. ఆ యూనిట్లు పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ బిజినెస్ ఆర్డర్లు తెస్తున్నాయి. తాజాగా జహీరాబాద్‌లో ఉన్న ఆటోమొబైల్ యూనిట్లపై దృష్టి సారించాయి. ఇక్కడ పెద్ద ఎత్తున వాణిజ్య వాహనాలు ఉత్పత్తవుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలుతున్నాయి. వాటిని దేశంలో ఏ ప్రాంతానికైనా తరలించేందుకు ప్రత్యేక రేక్స్ ఏర్పాటు చేస్తామన్న హామీతో ఆయా యూనిట్లు రైల్వేకు ఆర్డర్లు ఇస్తున్నాయి. వసతులు కల్పించడంతో.. జహీరాబాద్‌లోని గూడ్స్ స్టేషన్‌ను ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేసింది. ఇక్కడ సరైన వసతులు లేక గతేడాది అతికష్టం మీద ఒకే ఒక రేక్ (ఒక గూడ్స్ రైలు) మాత్రమే లోడైంది. ఇటీవల వసతులు కల్పించటంతో గత ఏప్రిల్ నుంచి ఏకంగా 9 రేక్స్‌ల ద్వారా జహీరాబాద్ నుంచి 2,500 కి.మీ. దూరంలో ఉన్న అస్సాంలోని ఛాంగ్సరీకి వాణిజ్య వాహనాలను తరలించింది. అయితే అంతకంటే 1,100 కి.మీ. దూరంలో ఉన్న త్రిపురలోని జిరానియాకు వాహనాలు తరలించాలని ఆ కంపెనీ కోరింది. అంతదూరం తరలించే అనుమతి లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా అనుమతి తీసుకుని తాజాగా ఓ రేక్ ద్వారా వాణిజ్య వాహనాలను తరలించటం విశేషం. ఇందులో త్రిపురలోని జిరానియా స్టేషన్‌కు 69 మినీ ట్రక్కులు, గూడ్సు ఆటోలతో కూడిన 15 వ్యాగన్లు, అస్సాంలోని ఛాంగ్సరీకి 42 వాహనాలతో కూడిన 10 వ్యాగన్లు కలిపి ఓ రేక్‌ను దక్షిణ మధ్య రైల్వే తరలించింది. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో తొలిసారి 3,600 కి.మీ. దూరంలో ఉన్న స్టేషన్‌కు వాహనాలను తరలించి రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన సికింద్రాబాద్ డివిజన్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆర్డర్లు అధికంగా పొందాలని సూచించారు. -
అక్కడ ఇక స్కాచ్ దొరకదా? కేంద్రం కీలక ఆదేశాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి చేసుకున్న వస్తువులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనడం మానేయాలని దేశంలోని 4000 ఆర్మీ క్యాంటీన్లకు ఆదేశాలిచ్చినట్టు తాజా నివేదికల సమాచారం. అంతేకాదు ఆర్మీ క్యాంటిన్లలో ఇకమీదట విదేశీ మద్యం అమ్మకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అక్టోబర్ 19న అంతర్గత ఉత్తర్వులు జారీ అయినట్టు తెలుస్తోంది. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కథనం ప్రకారం, ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రిచర్డ్, యూకే కంపెనీ డియాజియోకు చెందిన స్కాచ్ లాంటి విదేశీ మద్యం అమ్మకాలను నిలిపివేయనుంది. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే విదేశీ బ్రాండ్ల కోసం ఆర్డర్లను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మే, జూలై నెలల్లో ఈ అంశంపై సైన్యం, వైమానిక, నావికాదళంతో చర్చల అనంతరం, దేశ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఏ ఉత్పత్తులను నిలిపివేయాలో ఆర్డర్ నిర్దిష్టంగా పేర్కొనలేదనీ అయితే, విదేశీ మద్యం కూడా జాబితాలో ఉండవచ్చని విశ్వసిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి డియోజియో, పెర్నోడ్ ప్రతినిధులు తిరస్కరించారు. దీనికి సంబంధించి క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు డిఫెన్స్ స్టోర్లలో దిగుమతి చేసుకున్న మద్యం అమ్మకాలు వార్షిక అమ్మకాలలో కేవలం 17 మిలియన్ డాలర్లు మాత్రమేనని, ఈ బ్రాండ్లపై బ్యాన్ విధించినా కూడా కలిగే నష్టం ఏమీ లేదని, స్టాక్ చాలా తక్కువగానే ఉంటుందని సీనియర్ అధికారి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనుకునే ప్రభుత్వం ఆలోచనకు తాజా ఆర్డర్ ప్రతికూల సంకేతాన్ని పంపుతుందన్నారు. కాగా దేశవ్యాప్తంగా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ దాదాపు 5,000 స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిద్వారా మద్యం సహా ఎలక్ట్రానిక్స్, ఇతర నిత్యావసర వస్తువులను సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు రాయితీ ధరలకు విక్రయిస్తుంది. 2 బిలియన్ డాలర్లకు పైగా వార్షిక అమ్మకాలతో, భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చెయిన్స్ లో ఒకటిగా క్యాంటీన్ స్టోర్స్ ఉన్నాయి. -
3.8 బిలియన్ డాలర్ల వస్తువులు కొట్టేసి..
మనిషికి డబ్బు ఆశ ఉండడం సహజం. అది ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో బయటికి వస్తుంది. కొందరు కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటే.. మరికొంతమంది అడ్డదారుల్లో సంపాదించాలని చూస్తారు. దీంట్లో కొంతమంది సక్సెస్ చూస్తారు.. ఓటములు చూస్తారు. కానీ అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 63 ఏళ్ల కిమ్ రిచర్డ్సన్ మాత్రం 19 ఏళ్లుగా సక్సెస్‌ను మాత్రమే చూస్తు వచ్చింది. ఆమె కేవలం కొట్టేసిన వస్తువులను ఆన్లైన్లో అమ్మేయడం ద్వారా కోట్లను కొల్లగొట్టింది. ఇంతకీ ఆమె కొట్టేసిన వస్తువుల విలువ ఎంతో తెలుసా.. అక్షరాల 3.8 బిలియన్ డాలర్లు. (చదవండి : వామ్మో ! పొడవంటే పొడువు కాదు..) ఇక అసలు విషయంలోకి వెళితే.. కిమ్ రిచర్డ్సన్ తనకు కావాల్సిన వస్తువులను కొట్టేయడంలో ఆరితేరిన వ్యక్తి. ఒకషాపులోకి వెళ్లిందంటే ఎదుట ఎలాంటి సీసీ కెమెరాలు ఉన్నా వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకొని తనకు కావాల్సిన వస్తువులను కొట్టేసేది. 44 ఏళ్ల వయసులో దొంగతనాలు చేయడం ప్రారంభించిన రిచర్డ్సన్ 2000 ఆగష్టు నుంచి 2019 వరకు 19 ఏళ్లపాటు అమెరికాలోని అనేక స్టోర్స్ లోని వస్తువులను కొట్టేసింది. ఒకటి,రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా 19 ఏళ్లలో 3.8 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొట్టేసింది. అలా కొట్టేసిన వస్తువులను ఈబేలో అమ్మకానికి పెట్టి దానికి రెట్టింపు సంపాదించేది. (చదవండి : అక్కడ 36 వేల మందికి ప్రాణాపాయం!) అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. ఇటీవలే రిచర్డ్సన్ చేసిన దొంగతనాలను పోలీసులు పసిగట్టారు. పెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వస్టిగేషన్తో రిచర్డ్సన్పై సీక్రెట్‌గా విచారణ చేయించగా ఆమె చేసిన పనులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. కాగా రిచర్డ్సన్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిచర్డ్సన్కు 54 నెలల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు 3.8 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.27 కోట్ల ) జరిమానా వేసింది. -
కరోనా తెచ్చిన తంటా
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతపై కరోనా లాక్డౌన్ ప్రభావం చూపుతోంది. మార్చి 22న జనతాకరŠూప్య నుంచి ఆశ్రమ, మోడల్‌స్కూల్, రెసిడెన్సియల్ పాఠశాలు మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో పాఠశాలలు తెరుచుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. నెలలు గడిచిపోతుండటం.. ఇంకోవైపు విద్యార్థుల కోసం తెప్పించిన నిత్యావసర సరుకులకు పురుగులు పడుతున్నాయి. గోధుమ పిండి, ఇడ్లీపిండి, ఉప్మారవ్వకు పురుగులు పట్టాయి. రాగిమాల్ట్ తదితర వస్తువుల కాలపరిమితి ముగిసిపోయింది. ప్యాకింగ్‌లో ఉండగానే ఎండవేడిమికి వంటనూనె లీకేజీతో ఆవిరైపోతోంది. చక్కెరకు చీమల బెడద ఎక్కువైంది. లక్షల రుపాయలతో కొనుగోలు చేసిన సరుకులు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. నిత్యావసర సరకుల సరఫరా ఇలా.. జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. 3,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాణ్యమైన ఆహారం అందించేందుకు కావాల్సిన నిత్యావసర సరుకుల సరఫరా ఏజెన్సీ ద్వారా జరుగుతోంది. ఏటా ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగుతుండటంతో రెండు నెలలకు సంబంధించిన సరుకులను ఆయా కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు ఏజెన్సీల నుంచి తెప్పించి నిల్వ ఉంచారు. మార్చి 22 నుంచి లాక్డౌన్ ప్రకటించటం..విద్యార్థులు ఇంటిబాట పట్టడంతో పాఠశాలలు మూతపడ్డాయి. పదోతరగతి పరీక్షల నేపథ్యంలో జూన్ 1 నుంచి ఆయా రెసిడెన్సియల్, ఆశ్రమ, పాఠశాలలు ప్రారంభించారు. అయితే కేజీబీవీల్లో కాస్త ఆలస్యంగా విద్యార్థులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏజెన్సీ ద్వారా సరుకుల పంపిణీ చేశారు. పరీక్షలు వాయిదా పడటం విద్యార్థులకు ఇంటికి వెళ్లిన సంగతి తెలియంది కాదు. ప్రస్తుతం ఆయా పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో.. తెలియని పరిస్థితి నెలకొంది. ఇంకో వైపు మిగిలిన విద్యాసంస్థల మాటేలా ఉన్న కేజీబీవీల్లో మాత్రం గోధుమపిండి 50 కిలోలపైన ఉంటుందని తెలుస్తోంది. ఇడ్లీపిండి, రాగిమాల్ట్, కుడకపోడి, అల్లంపెస్ట్, ధనియాల పౌడర్ తదితర వస్తువులన్ని పురుగులు పట్టి నాణ్యత కోల్పోయాయి. కొన్నింట్లో సరే.. మరికొన్నింట్లో.. కోటపల్లి, నస్పూర్, మందమర్రి మోడల్ స్కూల్లో క్వారంటైన్ ఏర్పాటు చేయటంతో అక్కడ ఎటువంటి సమస్య లేకుండా పోయింది. మరికొన్ని కేజీబీవీల్లో నిత్యావసర సరుకులను ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇదివరకే తహసీల్దార్లకు అప్పగించారు. మిగిలిన కేజీబీవీల్లో సరుకులకు మాత్రం పురుగులు పట్టి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. అయితే పురుగులు పట్టిన, కాలం చెల్లిన సరుకులు మినహా మిగిలన సరుకులు తీసుకెళ్లాలని పలుమార్లు సూచించినా నెలలు గడిచిపోతుండటంతో తామేమి చేసుకోవాలంటూ గుత్తేదారు మడతపేచి పెడుతున్నట్లు తెలుస్తోంది. పురుగులు పట్టి, కాలం చెల్లిన (గడువు ముగిసిన) సరుకులు పోనూ మిగిలిన సరుకులైనా గుత్తేదారు తీసుకెళ్లటానికి నిరాసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యాసంస్థలు తెరుచుకోవటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో సరుకుల పరిస్థితిపై ఎటూ తేలకుండా పోతోంది. ఈ విషయంపై డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు నడుచుకుంటామన్నారు. -
చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, దేశ సరిహద్దు వద్ద చైనా దుశ్చర్యతో 20 మంది సైనికుల మరణం తరువాత దేశీయంగా చైనాపై ఆగ్రహం మరింత రాజుకుంది. చైనా వస్తువులు, దిగుమతులను నిషేధించి, దాని ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఇందుకు భిన్నంగా స్పందించింది. చైనా వస్తువులను బహిష్కరించడం సాధ్యం కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. చైనా దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నందున బహిష్కరణ డిమాండ్ నెరవేరకపోవచ్చని గురువారం అభిప్రాయపడింది. అయితే చైనా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని తెలిపింది. (గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా ?) దేశ సరిహద్దు వద్ద చైనాతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో భారతదేశ స్వావలంబన అంశంపై ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాం, కానీ మనం చాలా కీలకమైన ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు శరద్ కుమార్ సారాఫ్ అన్నారు. భారతీయ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, చైనా వస్తువులను కొనడం మానేయాలని ప్రభుత్వం భారతీయులను కోరాలి. కానీ చైనా ఉత్పత్తులను నిషేధించడం లేదా బహిష్కరించాలన్న డిమాండ్ అన్ని భారతీయ తయారీదారులను కష్టాల్లోకి నెడుతుందన్నారు. మనం ఎగుమతి చేసే వస్తువులను తయారు చేయడానికి చాలా ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటామని సంస్థ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. (బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు) కాగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో ముందంజలో ఉన్న ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) 'చైనాను బహిష్కరించండి' అంటూ దేశీయ టాప్ పారిశ్రామికవేత్తలకు ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
చైనా వస్తువుల బ్యాన్ తొందరపాటు చర్య: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తన అభిప్రాయాలు చెప్పారు. ఈ నేపథ్యంలో చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. దేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. గాల్వన్ లోయలో వీర మరణం పొందిన సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అందించే సాయాన్ని కూడా కేసీఆర్ ప్రకటించారు. (నిమిషంలో అమ్ముడుపోయిన చైనా ఫోన్!) ‘చైనా, పాకిస్తాన్ దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో కూడా అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతోంది. భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తోంది. గాల్వన్ లోయ లాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తింది. 1962లో ఏకంగా భారత్ – చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగింది. 1967లో కూడా సరిహద్దులో ఘర్షణ జరిగింది. అప్పుడు 200 మంది మృతి చెందారు. ఇప్పుడు గాల్వన్ వద్ద మళ్లీ ఘర్షణలు జరిగాయి. అందులోనూ మన సైనికులు 20 మంది మరణించారు. వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన దేశంతో ఎక్కడో ఓ చోట ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది. చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. (సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం: కేసీఆర్ ) ‘ఆర్థికంగా ప్రబల శక్తిగా భారత్ మారుతున్నది. అమెరికా 21 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక శక్తి అయితే, చైనా 14 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల సంపద కలిగిన జపాన్ తో పాటుగా భారత్ కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయడం చైనా భరించలేక పోతున్నది. కరోనా వైరస్‌కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. అందుకే చైనా నుంచి చాలా బహుళ జాతి సంస్థలు బయటకు వచ్చి, భారత్ వైపు చూస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు రిపోర్టు ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142వ స్థానం నుంచి 63వ స్థానానికి భారతదేశం ఎదిగింది. 2014 నుంచి 2017 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 36 బిలియన్ డాలర్ల నుంచి 61 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. చైనా నుంచి వస్తువుల దిగుబడి ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది తొందరపాటు చర్య అవుతుంది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలి. ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు దొరకాలి. ముందుగా మనం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. రక్షణ వ్యవహారాలలో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి. బ్రిటన్ ప్రతిపాదించిన డి 10 గ్రూపులో కలవాలి. ఓరాన్ అలయెన్సులో చేరాలి. హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలి. మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’. అని కేసీఆర్ స్పష్టం చేశారు. (చెప్పిన పంటలే వేయాలని సీఎం అనలేదు: కేటీఆర్) బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు! -
ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆవిష్కరణ!
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో తమ కస్టమర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటుంది. తాజాగా ఈ కామెర్స్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొనడంతో ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇది వరకు నిత్యావసర వస్తువులు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండేవి కావని, కానీ తాజాగా స్థానిక స్టోర్స్‌ల సహాయంతో కేవలం 90 నిమిషాల్లోనే నిత్వావసర వస్తువులను డెలివరీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ కామర్స్‌లో జియో మార్ట్, అమెజాన్ సంస్థల రూపంలో ఫ్లిప్‌కార్ట్ తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో పోటీ సంస్థలకు దీటుగా ఎదుర్కొవడానికి ఫ్లిక్‌కార్ట్ ప్రణాళికలు రూపొందించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా వినియోగదరులకు మెరుగైన సేవలందించేందుకు లాజిస్టిక్స్ సంస్థ షాడోఫాక్స్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన గిడ్డంగులు, స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ మొదటగా బెంగుళూరులో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అభిపప్రాయపడుతున్నారు. (చదవండి: అపుడు లాక్డౌన్ పరిస్థితి వచ్చి వుంటే..) -
పలు వస్తువులు, సేవలకు మినహాయింపు
సాక్షి, అమరావతి: లాక్ డౌన్ నేపథ్యంలో పలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువుల సరఫరా, సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆయా ఉత్పత్తులు, సేవలను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ పలు సిఫార్సులు చేసింది. వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, శాంతిభద్రతల అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం విధులివీ.. ►సూపర్ మార్కెట్లు, అక్కడి నుండి వ్యాపారులు, చిల్లర వ్యాపారులు, కిరాణా దుకాణాలకు వస్తువులు సరఫరా అయ్యేలా చూడడం. ►ప్రజలకు అవసరమైన వస్తువులను హోం డెలివరీ చేసేలా సూపర్ మార్కెట్లను ప్రోత్సహించడం. ►సేవల బాధ్యతను చూసేందుకు జిల్లా, నగర, పట్టణ, మండల, పంచాయతీ, వార్డు స్థాయి కమిటీలు ఉంటాయి. ఒక్కో బాధ్యుడు ఉంటారు. వీరి పర్యవేక్షణలో వస్తువుల సరఫరా, రవాణా ఉంటుంది. ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వహిస్తారో ఖరారైంది. ►ప్రతి కిరాణా షాపును విధిగా ఆన్లైన్లో ట్యాగ్ చేసి ఎలా నిర్వహిస్తున్నారో పర్యవేక్షించాలి. రెండు మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రతి ప్రాంతానికి ఒక స్టోర్ ఉండేలా చూడాలి. ►ఎక్కువ ప్రాంతాల్లో తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటు చేయాలి. సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా, ధరలు పెరగకుండా చూడాలి. ►డెయిరీ, పాల కేంద్రాల ద్వారా నిత్యం పాల పాకెట్లు సరఫరా అయ్యేలా చూడాలి. ►శానిటైజర్లు, మాస్క్‌లు మామూలు ధరల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ►నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లే వాహనాలలో ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. ►చెక్ పోస్టుల వద్ద ఈ తరహా వాహనాలను గుర్తించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే 1902కు ఫోన్ చేయొచ్చు. వీటి సరఫరా సవ్యంగా సాగాలి ►తాగునీరు, వాటర్ ట్యాంకర్లు, కూరగాయలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, పౌల్ట్రీ, మాంసం, చేపలు, కిరాణా సామగ్రి (పచారి సామాన్లు), బ్రెడ్, బిస్కెట్లు, బియ్యం, పప్పులు, ఆయిల్ మిల్లులు. ►ప్రజా పంపిణీ వ్యవస్థలోని రేషన్ దుకాణాలు, అన్ని గోడౌన్ల నుండి ఆహార ధాన్యాల లోడ్, అన్లోడ్.. పశుగ్రాసం, ఆక్వా ఫీడ్, ఇతరత్రా పదార్థాలు. ►బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ప్రాణాల్ని కాపాడే మందులు, మాస్క్‌లు, శానిటైజర్లు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలు, మెడికల్ షాపులు, పశువైద్య సేవలు. ►పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ, సీఎఎన్‌జీ గ్యాస్, ఫర్నేస్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఎల్ఎస్, హెచ్ఎస్, ఏవియేషన్ ఫ్యూయల్, ఇథనాల్ తదితరాలు. ►ఇంటర్నెట్, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు, మరమ్మతులు, తపాలా కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, బీమా సంస్థలు. ►ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, కూరగాయలు, పండ్ల సేకరణ, నిల్వ, పంటల్ని కప్పి ఉంచేందుకు అవసరమైన టార్పాలిన్లు, గోతాలు, పాలిథిన్, డబ్బాలు తదితరాలు. ►అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. తదితర ఇ–కామర్స్ సంస్థలు అందించే సేవలు, ఆహార వస్తువుల సరఫరా. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల ద్వారా ఆహార పదార్థాల పంపిణీ. -
పుచ్చిపోయిన పప్పు.. బూజు పట్టిన బెల్లం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఈమె పేరు జయమ్మ (రేషన్ కార్డు నంబర్122700100427). అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రేషన్ దుకాణంలో ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు తీసుకొని ఇంటికొచ్చింది. ప్యాకింగ్‌లో ఉన్న కందిపప్పు, గోధుమపిండి తీసి చూడగా అందులో పురుగులు కన్పించాయి. బెల్లం బూజు పట్టింది. రేషన్ డీలర్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించింది. పురుగులున్న విషయాన్ని గుర్తించి అధికారులు ఆమెకు వేరే సరుకులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనేపల్లివారిపాలెం గ్రామానికి చెందిన కోనేటి వెంకటసుబ్బయ్య సంక్రాంతి పండుగకు ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న సరుకులు తీసుకున్నాడు. ప్లాస్టిక్ డబ్బాలో బూజు పట్టిన బెల్లం కన్పించింది. ఆ గ్రామంలో మరో 100 మందికి ఇలాగే బూజు పట్టిన బెల్లం వచ్చింది. దాన్ని వెనక్కి తీసుకుని, నాణ్యమైన బెల్లం ఇవ్వాలని కోరితే తనకు సంబంధం లేదంటూ రేషన్ డీలర్ చేతులెత్తేశాడు. పండుగల సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న చంద్రన్న కానుకలో నాణ్యత మచ్చుకైనా కనిపించడం లేదు. పుచ్చిపోయిన కందిపప్పు, పురుగులు పట్టిన శనగపప్పు, బూజు పట్టి పాకంలా మారిన బెల్లం, కాలం చెల్లిన నెయ్యితో పండుగపూట పిండివంటలు ఎలా చేసుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సరుకుల పంపిణీ టెండర్లను ప్రతిఏటా అధికార పార్టీ నాయకులే దక్కించుకుంటున్నారు. వారు పనికిరాని సరుకులు పంపిణీ చేస్తున్నా అధికారులు గట్టిగా నిలదీయలేకపోతున్నారు. చంద్రన్న కానుక పథకం అమలుకు ప్రతిఏటా దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాసిరకం సరుకులు ఇస్తున్నారంటూ లబ్ధిదారులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఫిర్యాదులు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నాణ్యత లేని కానుక సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. పనికిరాని సరుకులు తీసుకుని ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తే... ఉచితంగా ఇస్తున్నాం, నోరు మూసుకొని తీసుకెళ్లండి అంటూ అధికార పార్టీ నేతలు, డీలర్లు దబాయిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. నాణ్యత లేని, కాలం తీరిన సరుకులను సేకరించి, చంద్రన్న కానుక పేరిట పేదలకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలిముద్ర పడితేనే సరుకులు ఈ–పాస్ యంత్రంలో వేలిముద్రలు పడితేనే లబ్ధిదారులకు సంక్రాంతి కానుక సరుకులు అందజేస్తున్నారు. వివిధ కారణాలతో వేలిముద్రలు సరిగా పడని 18 నుండి 20 శాతం మందికి సరుకులు ఇప్పటికీ అందలేదు. రాష్ట్రంలో 1.44 కోట్ల తెల్లరేషన్‌కార్డులున్న కుటుంబాలు ఉండగా, ఇప్పటిదాకా 1.17 కోట్ల కుటుంబాలకు మాత్రమే చంద్రన్న కానుక సరుకులు అందాయి. దాదాపు 27 లక్షల కుటుంబాలకు సరుకులు అందలేదు. తూకాల్లోనూ మోసాలే.. చంద్రన్న కానుక పేరిట ఇస్తున్న సరుకుల్లో నాణ్యత లేకపోవడంతోపాటు తూకాల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. నెయ్యి 100 గ్రాములు ఇవ్వాల్సి ఉండగా ప్యాకెట్లలో 90 గ్రాములు మాత్రమే ఉంటోంది. అరకిలో నూనెకు బదులు 450 గ్రాములే ఇస్తున్నారు. గోధుమపిండి, కందిపప్పు, శనగపప్పు 10 నుంచి 30 గ్రాముల తక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. ఒక్కో కానుకకు రాష్ట్ర ప్రభుత్వం రూ.207.94 వెచ్చిస్తోంది. ఇందులో అరకిలో బెల్లం ధర రూ.24.70, అరకిలో గోధుమ పిండి రూ.29.78, అరకిలో శనగపప్పు రూ.29.58, అరకిలో కందిపప్పు రూ.36.50, అర లీటర్ పామాయిల్ రూ.39.83, 100 గ్రాముల నెయ్యి ధర రూ.30.55, సంచికి రూ.17 చొప్పున కేటాయిస్తోంది. బయట మార్కెట్లో ఇవే ధరలకు నాణ్యమైన సరుకులు వస్తాయని లబ్ధిదారులు చెబుతున్నారు. చంద్రన్న కానుక పథకం కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూర్చేలా ఉందని పేర్కొంటున్నారు. మిగిలిపోయిన పాత పప్పు అంటగట్టారు ‘‘సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన చంద్రన్న కానుక పూర్తిగా నాసిరకంగా ఉంది. నల్లగా మారిన బెల్లం ఇచ్చారు. తింటే ఏమౌతుందోనని భయమేస్తోంది. శనగపప్పు, కందిపప్పులో పురుగులు కనిపించాయి. మిగిలిపోయిన పాత పప్పును అంటగట్టారని అనుమానంగా ఉంది’’ – మల్లెల భవానీ, ఆటోనగర్, విజయవాడ -
సారుకు తీరిక లేక..
శ్రీకాకుళం, జలుమూరు: గర్భిణులు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వం బాల సంజీవిని అందిస్తోంది. దీని కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి నెలనెలా అందిస్తుంటారు. అయితే కోటబొమ్మాళి ప్రాజెక్టు పరిధి జలుమూరులో ఇప్పటికీ ఈ సంజీవని ప్యాకెట్లను అందించలేదు. దీనిపై ఆరా తీయగా స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి తీరిక లేక రాలేదని, ఆయన వచ్చిన తర్వాత పంపిణీ చేస్తారని ఐసీడీఎస్ సిబ్బంది ఆ శ్చర్యకర సమాధానం చెప్పారు. అయితే ఎమ్మెల్యే రాకపోవడం వల్ల ఎప్పుడో వచ్చిన సరుకులు పా డైపోయాయి. అంగన్వాడీ కార్యకర్తలు కూడా దీని పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాల సం జీవినిలో పాలు, గుడ్లు, న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, బెల్లం, ఎండు ఖర్జూరం, బెన్సీరవ్వ ఇలా ఆరు రకాలు అందించాలి. గత నెలలో వచ్చిన సరుకులను ఇప్పటికీ లబ్ధిదారులకు అందించలేదు. దీంతో సరుకులన్నీ పాడైపోయి కంపు కొడుతున్నాయి. అలాగే ఈ ఏడాది మే నెల నుంచి అంది స్తున్న నాంది ఫుడ్ కూడా అన్ని కేంద్రాలకు పంపిణీ కాలేదు. సూపర్వైజర్లే వీటిని పట్టుకుపోతున్నారని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. దీనిపై కోటబొమ్మాళి సీడీపీఓ అనురాధను సంప్రదించగా ఎమ్మెల్యే చేతులమీదుగా బాల సం జీవిని అందిస్తామన్నారు. పాడైన సరుకులపై కలెక్టర్‌కు సమాచారం అందించామని, వాటిని పం పిణీ చేయబోమని తెలిపారు. సరుకుల నాణ్యత చూసి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. నాంది ఫుడ్‌పై ఫిర్యాదులు పరిశీలిస్తామన్నారు. -
పాత వస్తువులు కొత్తగా.. ఫ్లిప్‌కార్ట్ న్యూ ప్లాట్‌ఫామ్
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన అనంతరం.. పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ అంతకముందు తాను దక్కించుకున్న ఈబే ఇండియాను మూసివేసింది. ఈబేను మూసివేసిన ఫ్లిప్‌కార్ట్.. రీఫర్బిష్డ్ గూడ్స్(పాతవాటినే మళ్లీ కొత్తగా మార్చిన వస్తువుల) కోసం సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తెరిచింది. అదే 2గుడ్. రీఫర్బిష్డ్ గూడ్స్ కోసం కంపెనీ ఏర్పాటు చేసిన తొలి ప్లాట్‌ఫామ్. వచ్చే ఐదు నుంచి ఆరేళ్లలో ఈ మార్కెట్ 20 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ 2గుడ్ ప్లాట్‌ఫామ్ తొలుత రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్ యాక్ససరీస్‌ను అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత హోమ్ అప్లియెన్స్‌కు కూడా దీన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్ లైవ్‌గా కస్టమర్లకు అందుబాటులో ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ 2గుడ్ వస్తువును కొనుగోలు చేసిన తర్వాత 3 నెలల నుంచి 12 నెలల వారెంటీ ఇస్తుంది. మొబైల్ వెబ్ ద్వారా మాత్రమే తొలుత ఇది అందుబాటులో ఉంటుంది. కానీ తర్వాత తర్వాత డెస్క్‌టాప్ వెబ్ ఇంటర్ఫేస్, మొబైల్ యాప్ యూజర్లకు కూడా చేరువ చేయాలని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోంది. ఈబే ఇండియాను మూసివేసే సమయంలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్ గురించి ఆ కంపెనీ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ప్రస్తావించారు. ఈబే.ఇన్ నుంచి పలు విషయాలు బోధపడ్డాయని, అవే రీఫర్బిష్డ్ గూడ్స్ కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌కు దోహదం చేసిందని పేర్కొన్నారు. ఆగస్టు 14 నుంచి ఈబే ఇండియా అధికారికంగా మూతపడింది. మార్కెట్ లీడర్‌గా.. ఫ్లిప్‌కార్ట్ మరింత షాపింగ్ అనుభవాన్ని అందించడానికే కృషిచేస్తుందన్నారు. రీఫర్బిష్డ్ గూడ్స్ మార్కెట్ విషయంలో ఉన్న నమ్మకపు లోపాన్ని తాము 2గుడ్ ద్వారా తొలగించనున్నామని పేర్కొన్నారు. సరసమైన ధరల్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేస్తామని కల్యాణ్ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. -
నెట్టింటి నుంచి నట్టింట్లోకి..
సాక్షి,సిటీబ్యూరో: నగర జీవనం బిజీ అయిపోయింది. ఇంట్లో పిల్లలు స్కూళ్లకు,కాలేజీలకు వెళితే.. పెద్దవారు ఆఫీసుల దారి పడుతుంటారు. ఇంట్లోకి ఏం కావాలన్నా ఎవరో ఒకరిని బతిమాలి తెచ్చుకునే రోజులు పోయాయి. మనకు కావాల్సిన మందులు, దుస్తులు వంటివి ఆన్లైన్లో ఆర్డరిచ్చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ దారిలో కిరాణా సరుకులు కూడా చేరాయి. ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చే బంధు, మిత్రులు.. అందరికీ మర్యాదలు చేయాలంటే ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. మంచి విందు ఏర్పాటు చేయాలి. ఇలాంటప్పుడు రోజుల తరబడి షాపింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే..ఓ వస్తువు ఒక దగ్గర ఉంటే మరొకటి ఇంకోచోట దొరుకుతుంది. అన్నీ ఒక్కచోటేఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం. ఇప్పుడు అలాంటి రోజు వచ్చేసింది.అదే ‘దుకాన్‌లైన్’. ఆర్డర్ ఇచ్చేసి ఇంట్లో కూర్చొంటే చాలు.. సాధారణంగా కిరాణ షాపునకు పోయేప్పుడు ఇంట్లో కావాల్సినవన్నీ ఓ చీటీ రాసుకుని బయలుదేరుతాం. వాటిలో చాలా వస్తువులు ఒకే షాపులో దొరకడం కష్టమే. పిల్లలకు కావాల్సిన వాటిని కిడ్స్ స్టోర్‌లో, మరికొన్ని మెడికల్ స్టోర్‌లో వెతకాలి. తాలింపు గింజలు, నూనెలు, బియ్యం, పప్పులు వంటివన్నీ కిరాణా స్టోర్‌లో దొరుకుతాయి. ఇక బ్యూటీ బ్రాండ్స్ కావాలంటే మరోచోటుకు పోవాల్సిందే. చిన్న మొత్తాల్లో కొనాలంటేనే రెండు మూడు షాపులు తిరగాలి. ఇక పెద్ద మొత్తంలో అయితే మరీ కష్టం. పైగా పెద్ద మొత్తంలో సరుకులు కొంటే తెచ్చుకోవడానికి ఏ ఆటోనో కిరాయికి పెట్టుకోవాలి. ఇలాంటి సమస్యలేవీ లేకుండా మనకు కావాల్సిన సరుకులను కావాల్సిన మొత్తంలో ఆర్డరిస్తే ఎంచక్కా ఇంటికే తీసుకొస్తుంది దుకాన్‌లైన్. మనకు కావాల్సినవి ‘ఆన్లైన్లో బుకింగ్’ చేసుకుంటే చాలు.. అన్ని కిరాణా సరుకులను ఇది ఇంటికి సరఫరా చేస్తుంది. వంటకు ఉపయోగించే సరుకులే కాదు.. సబ్బులు, క్రీములు కూడా అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో దుకాణం.. మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు కావాల్సిన సరుకులు నెట్లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. ‘దుకాన్‌లైన్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఎంచక్కా కావాల్సిన వాటిని ఆర్డర్ చేయొచ్చు. ఏ రోజు ఏయే వస్తువులపై ఎంత డిస్కౌంట్ ఉందో కూడా ఈ యాప్ సాయంతో చూసుకోవచ్చు. అంతేకాదు.. ఎంత మొత్తంలో కొంటే ఎంత తగ్గింపు వర్తిస్తుందో కూడా చూపిస్తుంది. ఈ డిస్కౌంట్ అవకాశాన్ని కేవలం గృహ వినియోగదారులే కాదు చిన్న స్థాయి కిరాణా వ్యాపారులూ ఉపయోగించుకోవచ్చు. రోజువారీగా షాపులో అయిపోయిన కిరాణా సరుకులు కోసం డీలర్ల దగ్గరకు పరుగుతీయకుండా నేరు ఈ దుకాన్‌లైన్ నుంచి కొనుక్కోవచ్చు. సరుకులు చేరాకే పేమెంట్.. మనకు కావాల్సిన కిరాణా సరుకులను సాయంత్రం 6 గంటల్లోగా ఆర్డర్ చేస్తే మరుసటి రోజు ఉదయం 10 గంటల్లోపు ఇంటికి చేరుస్తుంది దుకాన్‌లైన్. సరుకులు వచ్చాక అన్నీ సరిచూసుకుని తర్వాత డబ్బులు కట్టవచ్చు. కనీసం రూ.2 వేలకు పైగా మొత్తానికి డెలివరీ కూడా ఉచితమే. అంతేకాదు.. ప్రతి రోజూ మార్కెట్లో ధరలు తగ్గే సరుకుల వివరాలను దుకాన్‌లైన్ మెసేజ్ చేస్తుంది. -
ట్రేడ్ వార్: అమెరికాకు మరో గట్టి షాక్
లండన్: ఏకపక్ష నిర్ణయాలతో ట్రేడ్‌వార్ అందోళన రేపుతున్న అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుసగా ఒక్కోదేశం అమెరికా టాక్స్ విధింపులను తిప్పికొట్టే చర్యలకు దిగుతున్నాయి. ఇప్పటికే భారతదేశం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికా ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సుంకాలను పెంచుతామని ట్రంప్ తొలుత ప్రతిపాదించినప్పుడే తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామని హెచ్చరించిన యూరోపియన్ యూనియన్ ఇపుడు అన్నంత పనీ చేసింది. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. 3.2 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై టారిఫ్‌లను శుక్రవారం నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది. విస్కీ, పొగాకు, హార్లీ డేవిడ్ సన్ బైక్స్, కాన్‌బెర్రీ, పీనట్ బటర్‌లాంటి అమెరికా ఉత్పత్తులపై 25శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతోపాటు పాదరక్షలు, కొన్నిరకాల దుస్తులు, వాషింగ్ మెషీన్లు తదితర ఎంపిక చేసిన కొన్ని అంశాలపై 50శాతంకాదా టాక్స్‌ను పెంచింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే జంకర్ గురువారం రాత్రి ఐరిష్ పార్లమెంటులో మాట్లాడుతూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు. సుంకం విధింపులతో అమెరికా చట్టవిరుద్ధంగా, చరిత్రకువిరుద్ధగా పోతోందని వాఖ్యానించారు. అమెరికా యుఎస్ సుంకాల నేపథ్యంలో తమ ప్రతిస్పందన స్పష్టంగా ఉంటుందున్నారు. అటు భారత్ అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయించింది. ఆగస్టు నుంచి ఈ పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. కాగా ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలను భారీగా పెంచి వాణిజ్య యుద్ధానికి తెర లేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఇతర దేశాలను కూడా బెదిరిస్తున్నారు. ఈ సుంకాలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతీకార చర్యలకు దిగితే యూరప్ దేశాలకు చెందిన కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతామని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
దెబ్బకు దెబ్బ : ట్రంప్ సర్కార్‌కు భారత్ ఝలక్
న్యూఢిల్లీ : ట్రంప్ సర్కార్‌కు దెబ్బకు దెబ్బ తగిలింది. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా డ్యూటీలు పెంచడంతో, భారత్‌కు కూడా అదే స్థాయిలో టారిఫ్‌లను విధించి, ట్రంప్ సర్కార్‌కు ఝలకిచ్చింది. మోటార్ సైకిల్, ఇనుము, ఉక్కు, బోరిక్ ఆమ్లం, కాయధాన్యాలు వంటి 30 రకాల ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని 50 శాతం పెంచే ప్రతిపాదనను భారత్ ప్రభుత్వం డబ్ల్యూటీఓకు సమర్పించింది. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లను విధించడంతో ట్రంప్ సర్కార్ 241 మిలియన్ డాలర్ల వరకు ఆర్జిస్తోంది. ట్రంప్ టారిఫ్‌లపై ఆగ్రహించిన భారత్, అంతేమొత్తంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే 30 రకాల ఉత్పత్తులపై రాయితీలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది మే నెలలో కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదం, ఆపిల్, మోటార్‌సైకిల్స్ వంటి 20 రకాల ఉత్పత్తులపై కూడా డ్యూటీలను 100 శాతం పెంచాలని భారత్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్పత్తులపై భారత్ ప్రతిపాదించిన అదనపు డ్యూటీలు 10 శాతం నుంచి 100 శాతం రేంజ్లో ఉన్నాయి. 800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న మోటార్ సైకిళ్లపై 50 శాతం డ్యూటీ, బాదంపై 20 శాతం, వాల్‌నట్స్‌పై 20 శాతం, ఆపిల్స్‌పై 25 శాతం డ్యూటీని భారత్ ప్రతిపాదించింది. భారత్ ప్రతీకార టారిఫ్‌లను విధించడం ఇదే మొదటిసారి. ట్రంప్ సర్కార్ వెళ్తున్న నియంతృత్వ పోకడకు ప్రతీకారంగా భారత్ ఈ టారిఫ్‌లను విధించింది. సమీక్షించిన ఈ డ్యూటీలు జూన్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాకు ఇస్తున్న మినహాయింపులను నిషేధించే నిర్ణయం తీసుకున్నామని, దీంతో 238.09 మిలియన్ డాలర్ల డ్యూటీని సేకరించనున్నామని డబ్ల్యూటీఓకు భారత్ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగ, గత మార్చిలో అమెరికా తమ దేశానికి దిగుమతి అయ్యే స్టీల్ ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం డ్యూటీలను విధిస్తున్నట్టు ప్రకటించింది. -
ఏమయ్యాయో?
సంక్రాంతి కానుకలు పక్కదారి పట్టాయా... వచ్చిన సరకు మొత్తంసరఫరా కాలేదా... మిగిలిన సరకు ఎక్కడుందో కనిపించడం లేదా... ఈ ప్రశ్నలకు ఇప్పుడు జిల్లాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం... జిల్లాకు కేటాయించిన సరకు పూర్తిస్థాయిలో సరఫరా కాలేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. మిగిలినవాటిని గోదాములకు చేర్చాల్సి ఉన్నా... ఆ ప్రయత్నాలు జరగలేదని స్పష్టమవుతోంది. మరి అధికారులేం చేస్తున్నట్టు? విజయనగరం గంటస్తంభం: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రభుత్వం కంటితుడుపు కానుకగా ఆరు రకాల సరుకులు సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఒక్కో కుటుంబానికి కందిపప్పు, శనగపప్పు, బెల్లం అరకేజీ చొప్పున, గోధుమపిండి కేజీ, పామాయిల్ లీటరు, నెయ్యి రూ.100గ్రాముల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో ఉన్న 1400 రేషన్‌డిపోల ద్వారా జిల్లాలో ఉన్న 7,01,494 రేషన్‌కార్డులకు సరిపడా సరకులు డిపోలకు ముందుగానే పంపించారు. సరుకులను డీలర్లు జనవరి ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు పంపిణీ చేశారు. ఆ సమయంలో జిల్లాలో 6,41,960 కార్డులకే సరుకులు విడుదల చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.ఈ లెక్కన దాదాపుగా 3.21మెట్రిక్ టన్ను లవంతున కందిపప్పు, శనగపప్పు, బెల్లం, 642 మెట్రిక్ టన్నుల గోధమపిండి, 6,41,960 ప్యాకెట్ల వంతున పామాయిల్,, నెయ్యి మాత్రమే లబ్ధిదారులకు సరఫరా జరిగింది. మిగిలిపోయిన సరుకులు తిరిగి మండలస్థాయి నిల్వ కేంద్రాలకు పంపించాల్సి ఉంది. తిరిగి చేరని సరుకులు పంపిణీ తీరును బట్టి కందిపప్పు 30మెట్రిక్ టన్నులు, శనగపప్పు 29 మెట్రిక్ టన్నులు, బెల్లం 28మెట్రిక్ టన్నులు, గోధమపిండి 78మెట్రిక్ టన్నులు, పామాయిల్ ప్యాకెట్లు 59,245, నెయ్యి ప్యాకెట్లు 57,532 తిరిగి మండలస్థాయి నిల్వ కేంద్రాలకు చేరాలి. అయితే కందిపప్పు, పామాయిల్ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా జరుగుతున్నందున డీలర్లు వారి వద్ద ఉంచుకోవచ్చు. వాటికి మండలస్థాయి గోదాము నుంచి పంపిస్తున్నట్లు రిలీజ్ అర్డర్ ఇస్తున్నారు. అంటే శనగపప్పు, బెల్లం, గోధమపిండి, నెయ్యి వంటి సరుకులు వెనక్కి చేరాలి. కందిపప్పు, పామాయిల్ వంటి సరుకుల లెక్కలు పౌరసరఫరాలసంస్థ అధికారులు వద్ద ఉండాలి. అయితే రావాల్సిన సరుకులు సగానికిపైగా రాలేదని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. కనీసం ఎంత సరుకు చేరిందని అడిగితే లెక్కలు చెప్పలేకపోతున్నారు. ఇంకా సరుకులు రావాలని చెబుతున్నారు. సంక్రాంతి వెళ్లి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇంకా సరుకులు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీలర్లు, అధికారులు కుమ్మక్కై సరుకులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. -
విలువ తెలిసినవారు
విలువైనవి ఆనందించడం తెలిసినవాళ్లు అల్పమైన విషయాలను ఖాతరు చేయరు. ఒకానొక కాలంలో ఒక జెన్ గురువు ఉండేవాడు. ఆయన ఒక కొండవాలు దగ్గర చిన్న గుడిసె కట్టుకుని నివసిస్తుండేవాడు. ఆయన దగ్గర విలువైన వస్తువులు ఉండివుంటాయని పొరబడిన ఒక దొంగ ఒకరోజు రాత్రి దొంగతనానికి వచ్చాడు. గుడిసెలో కొన్ని ముంతల్లాంటివి తప్ప అపహరించదగినవేవీ కనబడలేదు. కనీసం పాత బట్టలు కూడా లేవు. దొంగ తీవ్ర నిరాశ చెందాడు. అయితే, దొంగతనానికి వచ్చిన మనిషి అలికిడి విని గురువు నిద్ర లేచాడు. దొంగ ఉత్తిచేతుల్తో తిరిగి వెళ్లడం ఆయన్ని బాధించింది. ‘మిత్రమా, కావాలంటే నువ్వు నేను వేసుకున్న బట్టలు తీసుకెళ్లు’ అన్నాడు. దొంగ దానికి ఒప్పుకున్నాడు. గురువు వాటిని విడిచి ఇచ్చేశాడు. దొంగ వెళ్లిపోయాడు. గురువు అలాగే ఆ రాత్రి ఆకాశంలో చందమామను చూస్తూ కూర్చున్నాడు. దివ్యంగా వెలుగుతున్న జాబిలి అందానికి ముగ్ధుడై, ‘అయ్యో, అతడికి నేను పాత బట్టలు ఇచ్చిపంపానే; ఈ చందమామను ఇవ్వగలిగివుంటే ఎంత బాగుండేది’ అని తలపోశాడు. ఈ కథ ఏం చెబుతోంది? దొంగతనం చేసినవాడిపట్ల కూడా చూపాల్సిన కరుణ గురించా? అదీ ఒక అంశమే. దానికన్నా కూడా ఇది చాటేది మరొకటుంది. విలువైనవి ఆనందించడం తెలిసినవాళ్లు అల్పమైన విషయాలను ఖాతరు చేయరు. బహుశా, మనలో చాలామందిమి దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామేమో! -
గూడ్సు రైలులో అగ్నిప్రమాదం
గుంటూరు : తాడేపల్లి సమీపంలో గూడ్స్ రైలులో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా బొగ్గు నుంచి మంటలు వ్యాపించటాన్ని గుర్తించిన అధికారులు గూడ్సు రైలును నిలిపి వేశారు. ఫైరింజన్ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగడంతో గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రమాద సమయంలో గూడ్సు రైలు ఒడిశా నుంచి చెన్నైకు వెళ్తోంది. అధికారులు సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. -
ఇదేం కక్కుర్తి
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి హాస్టల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న వస్తువులను ఏబీవీపీ నాయకులు పట్టుకుని నిలదీసి న సంఘటన ఎల్లారెడ్డిలో బుధవారం జరిగింది. ఏబీవీపీ నాయకులు ఓంకార్, తులసీరాంలు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల వార్డెన్‌గా విధులను నిర్వర్తిస్తున్న జ్యోతిలక్ష్మి బుధవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి అక్రమంగా విద్యార్థులకు అందించాల్సిన మిరియాలు, పెసర్లు, నువ్వులు, ఆవాలు, బెడ్ షీట్లు, స్టీల్ గిన్నెలను సంచిలో వేసుకుని ఇంటికి తరలిస్తుండగా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పట్టుకున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులకు అందించాల్సిన వస్తువులను ప్రతి సారీ సంచులలో తీసుకుని వెళ్తుందని వారు ఆరోపించారు. పట్టుకున్న వస్తువులను హాస్టల్‌కు తరలించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. స మాచారం అందుకున్న రెవెన్యూ అధి కారి గిర్దావార్ వెంకట్‌రెడ్డి పాఠశాలకు చేరుకుని పంచనామా నిర్వహించారు. ప్రిన్సిపాల్ సంచిలో 5కిలోల నువ్వులు, 5కిలోల ఆవాలు, 5కిలోల పెసర్లు, 5 బెడ్షీట్లు, 6స్టీల్ గిన్నెలు, 3కిలోల మిరి యాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపా రు. నివేదికను తహసీల్దార్ అంజయ్యకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. -
నవంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా రెండ వ నెల నవంబర్లోనూ తగ్గాయి. రూ.80,808 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో నూతన పన్ను వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వసూళ్లలో ఇది కనిష్టస్థాయి. కొత్త జాతీయ అమ్మకపు పన్ను విధానాన్ని మరింత ఆమోదనీయంగా మలచడంలో భాగంగా కొన్ని వస్తువులపై రేట్ల తగ్గింపు దీనికి ప్రధాన కారణం. తాజా వసూళ్లపై ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలను క్లుప్తంగా చూస్తే... అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.83,000 కోట్లు , నవంబర్‌లో ఇవి రూ. 80,808 కోట్లకు చేరాయి. జూలైలో జీఎస్టీ వసూళ్లు రూ. 95,000 కోట్లు. ఆగస్టులో రూ.91,000 కోట్లు. సెప్టెంబర్‌లో రూ.92,150 కోట్లు. నవంబర్ వసూళ్లు రూ.80,808 కోట్లలో రూ. 7,798 కోట్లు కాంపెన్సేగా సెస్‌గా వసూలయ్యాయి. రూ.13,089 కోట్లు సెంట్రల్ జీఎస్టీకాగా రూ.18,650 కోట్లు రాష్ట్ర జీఎస్టీ. రూ.41,270 కోట్లు ఇంటిగ్రేటెడ్ గూడ్స్ జీఎస్టీ. -
అంతరిక్ష కేంద్రంలో ‘అలమర’
వాషింగ్టన్: అంతరిక్ష కేంద్రంలోకి అత్యాధునిక అలమర (వస్తువులు దాచి ఉంచుకునే పెట్టె)ను శాస్త్రవేత్తలు త్వరలో తీసుకువెళ్లనున్నారు. హెచ్‌టీవీ–7గా పిలిచే ఈ అలమరను 2018 చివరి కల్లా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశపెట్టనున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) బుధవారం వెల్లడించింది. సైంటిస్టులు అంతరిక్ష కేంద్రంపైకి పరిశోధనలకు అవసరమయ్యే పరికరాలను తీసుకువెళుతుంటారు. అయితే అక్కడ మరిన్ని వస్తువులు దాయడానికి వీలుగా ఆధునిక పరికరాలతో అలమరను తయారు చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది అలమరలను పొందుపరిచే వీలున్నట్లు నాసా వెల్లడించింది. ఈ అలమరలను బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఈ అలమరలో పరిశోధనలకు ఉపయోగపడే ప్రామాణిక ఈథర్నెట్ కేబుల్ వైర్లను ఉంచనున్నట్లు వివరించింది. -
అమ్మ ప్రసాదానికి కల్తీ మరక
విజయనగరం కంటోన్మెంట్ : కల్తీ ఘనులు, నాణ్యత లేని వస్తువులను అందించే అక్రమార్కులు పైడితల్లమ్మ ప్రసాదాన్నీ వదల్లేదు. జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అయిన పైడి తల్లమ్మ సిరిమానోత్సవ సంబరానికి, పండగ మూడు రోజుల పాటు భక్తులకు అందించే ప్రసాదాల తయారీకి కల్తీ సరుకులు అంటగడుతున్నారు. ఈ విషయం ఆహార కల్తీ నిరోధక శాఖ ఆధ్వర్యంలోని ఆహార భద్రతాధికారుల తనిఖీల్లో బట్టబయలైంది. సోమవారం రాత్రి సహాయ ఫుడ్‌కంట్రోలర్ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని బందం తనిఖీలు చేపట్టింది. ఆహార పదార్థాలను తయారు చేసే ప్రాంతాన్ని పరిశీలించి తనిఖీలు నిర్వహించింది. వీరి ప్రాధమిక తనిఖీల్లో వేరుశనగ గుళ్లు పాడయినవి వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. అందులో ఎఫ్లోటాక్సిన్ అనే రసాయన విష పదార్థం ఉన్నట్టు తేల్చారు. వీటిని వినియోగించవద్దని వెంటనే ఆలయ అధికారులు, తయారీదారులను ఆదేశించారు. అంతే గాకుండా అప్పటికే తయారై సిద్ధంగా ఉన్న పైడితల్లి అమ్మవారి లడ్డూతో సహా పది రకాల సరుకుల శాంపిళ్లను తీశారు. వాటిని విశాఖపట్నంలోని రీజనల్ ల్యాబ్‌కు తరలించి నాలుగు రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఉత్సవానికి సిద్ధమైన ప్రసాదాలు సిరిమానోత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు పైడితల్లి అమ్మవారి ప్రసాదాన్ని అందజేస్తున్నారు. పులిహోర, లడ్డూ ఇందులో ముఖ్యమైనవి. వీటిని తయారు చేసేందుకు ఏటా కాంట్రాక్టు ఇస్తున్నారు. ఈ కాంట్రాక్టును పొందేందుకు ముగ్గురు నుంచి నలుగురు కాంట్రాక్టర్లు అలవాటుగా వస్తున్నారు. వీరు కేవలం సరుకులు కొనుగోలు చేసి ఇచ్చేందుకు మాత్రమే కాంట్రాక్టు పొందుతారు. సరుకులు ఇచ్చాక లడ్డూ తయారీని వేరే వ్యక్తికి అప్పగిస్తారు. ఈ ఏడాది 60వేల లడ్డూలను మూడు రోజుల పాటు పండగ సందర్భంగా అందజేసేందుకు సిద్ధం చేస్తున్నారు. తయా రు చేసిన లడ్డూలను అధికారులు తనిఖీ చేసి నాణ్య త బాగాలేదన్న నిర్ణయానికి వచ్చారు. లడ్డూ ప్రసాదంతో పాటు తయారీకి ఉపయోగించే పది రకాల సరుకుల శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ప్రసాదాల తయారీకి వచ్చిన ముడి సరుకుల నాణ్యత బాగులేదు. సోమవారం రాత్రి సహాయ ఫుడ్ కంట్రోల ర్ ఎం.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు ఎం.ఏ.కరీముల్లాల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాం. ఇప్పటికే తయారు చేసిన లడ్డూతో పాటు పది రకాల సరకుల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించాం. నాలుగు రోజుల్లో రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించాం. వేరుశనగ పలుకుల్లో ఎఫ్లోటాక్సిన్ అనే రసాయనం ఉన్నట్టు గుర్తించి వాటిని వెనక్కు పంపాలని ఆదేశాలు జారీ చేశాం. నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నాం. –కె.వెంకటరత్నం, ఫుడ్‌సేఫ్టీ అధికారి, విజయనగరం అధికారులు సేకరించిన శాంపిళ్ల వివరాలు: పటిక బెల్లం, ఆవునెయ్యి(అమృత), ఆయిల్, ఆవాలు, పంచదార, వేరుశనగ పలుకులు, కిస్మిస్, జీడిపప్పు, లడ్డు, శనగపప్పు -
ప్రమాదం తప్పింది!
♦ ఉర్లాం స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ ♦ ఖనాకు ఢీకొని నిలిచిపోయిన ఇంజిన్ ♦ ప్రమాదంపై స్పష్టత ఇవ్వని అధికారులు నరసన్నపేట: ఉర్లాం రైల్వేస్టేషన్ సమీపంలో దాసరివానిపేట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి పలాస వైపు ఐరన్ ప్లేట్లతో వెళ్తున్న గూడ్స్‌రైలు పట్టాలు తప్పి.. పక్కనే ఉన్న వంశధార నీరుపారే కాలువకు చెందిన ఖానాకు తగిలి నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రైలు ఇంజిన్‌తోపాటు కింద భాగంలో విలువైన పరికరాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంపై సంబంధిత అధికారులు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. బుధవారం రాత్రి 11.20 గంటల సమయంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి.. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వస్తున్నట్టు సమాచారం రావడంతో విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న గూడ్స్‌ను 10.45 గంటల సమయంలో ఉర్లాం స్టేషన్ సమీపంలోని నాలుగు లైన్లో డ్రైవర్ నిలిపివేశాడు. అనంతరం 11.20 గంటల సమయంలో గూడ్స్ బయలుదేరుతుండగా సాంకేతిక లోపంతో ఇంజిన్ పట్టాలు తప్పింది. వెంటనే స్టేషన్లో ఉన్న సిగ్నల్ వ్యవస్థలో రెడ్ లైట్ వెలగడంతో స్టేషన్ మాస్టర్ మోహనరావు అప్రమత్తమయ్యారు. సిబ్బందిని పంపి పరిశీలించే సరికి రైలు ఇంజిన్ గెడ్డ ఖనాకు ఢీకొని నిలిచిపోవడాన్ని గుర్తించారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రమాదంపై తొలుత అంతా ఆందోళన చెందారు. అయితే ప్రధాన ట్రాక్‌కు ఎటువంటి నష్టం వాటిళ్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏడీఆర్ఎం, ఓఏఎం, డీటీఐలతోపాటు పలువురు అధికారులు వచ్చి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పట్టాలు తప్పిన గూడ్స్ ఇంజిన్‌ను విడిచి పెట్టి లోడ్‌తో ఉన్న మిగిలిన పెట్టెలను గురువారం వేకువజామున నాలుగు గంటల సమయంలో వేరే ఇంజిన్ సాయంతో ఇక్కడ నుంచి పంపించారు. భిన్నాభిప్రాయాలు.. ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి సాంకేతిక లోపమని అధికారులు చెబుతున్నప్పటికీ ఇది ఎంతవరకూ వాస్తవం అనేది తేలాల్సి ఉంది. లూప్ లైన్లో 10.45 గంటల నుంచి ఉన్న గూడ్స్ ఒక్కసారిగా 11.20 గంటల సమయంలో ముందుకు కదిలింది. ఇలా కదలడానికి గల కారణాలు తెలియరా లేదు. ప్రమాదానికి కారణాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే వాదన కొంతమంది నుంచి వినిపిస్తోంది. సిగ్నల్స్ ఇవ్వకుండానే డైవర్ నిర్లక్ష్యంగా రైలును ముందుకు తీశారని కొందరు అంటుంటే , స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇచ్చి లూప్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్ మీదకు లైన్ కలపక పోవడంతో ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. ప్రోపర్ పద్ధతి ప్రకారం డ్రైవర్‌ను రైలును నిలపక పోవడంతో దానంతట అదే ముందుకు కదిలిందని మరికొందరు అంటున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు మాత్రం ఏమీ చెప్పడం లేదు. వాస్తవాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా.. పట్టలు తప్పిన గూడ్స్ ఇంజిన్‌ను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
దుకాణం బంద్
జీఎస్టీ ఎఫెక్ట్ వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళనబాట స్తంభించిన లావాదేవీలు తణుకు :వస్తు, సేవల పన్ను (జీఎస్టీకి) నిరసనగా వ్యాపారులు ఆందోళనబాట పట్టారు. ప్రధానంగా వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. వస్త్రవ్యాపారులు మంగళవారం నుంచి నాలుగురోజులపాటు బంద్ చేపట్టనుండగా, ఫర్నిచర్ వ్యాపారులు రెండురోజులపాటు దుకాణాలు మూయనున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే రూ.కోట్లలో లావాదేవీలు స్తంభించినట్టు సమాచారం. జీఎస్టీని తొలి నుంచి వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం వల్ల వ్యాపారాలు దెబ్బతిని దుకాణాలు మూతపడే దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆలిండియా టెక్స్టైల్స్ ఫెడరేషన్, ఫర్నిచర్ వ్యాపారుల అసోసియేషన్ పిలుపు మేరకు వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. తక్షణమే వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో వస్త్ర, ఫర్నిచర్ దుకాణాలు మూత పడ్డాయి. మూడు వేల వస్త్ర దుకాణాల మూత జిల్లా వ్యాప్తంగా క్లాత్ మర్చంట్స్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు వేల దుకాణాలు మూతపడినట్టు సమాచారం. దీనివల్ల రూ. 400 కోట్ల లావాదేవీలు నిలిచినట్టు అంచనా. భారం పెరగడం వల్లే.. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇటీవల నూలు, రంగులు, పట్టు ధరలు పెరగడంతో వస్త్రాల అమ్మకాలు తగ్గాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నూలుపై ప్రకటించిన జీఎస్టీ చేనేత పరిశ్రమకు మరింత భారం కానుంది. ఇంతవరకు రెడీమేడ్ వస్త్రాలపై ఐదు శాతం పన్ను అమల్లో ఉంది. వస్తు సేవల పన్ను వల్ల ఇది 12 శాతానికి పెరగనుంది. ఇంతవరకు చేనేత, సాధారణ వస్త్రాలపై ఎలాంటి పన్నూ లేదు. జీఎస్టీ రాకతో ఐదు శాతం వసూలు చేయనున్నారు. ఈ విధానాల వల్ల కొనుగోలు దారులపై భారీగా భారం పడుతుందని వస్త్ర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నుంచి ఏడు శాతం వరకు ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 18 శాతానికి పెంచారు. ఈ ప్రభావంతో మార్కెట్లో వస్త్రాలపై 10 నుంచి 15 శాతం వరకు భారం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీఎస్టీకి వ్యతిరేకంగా ఈనెల 15న ఓ దఫా ఆందోళన చేసిన వస్త్రవ్యాపారులు తాజాగా నాలుగురోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఉభయులకూ భారమే జీఎస్టీ వల్ల వస్త్రవ్యాపారులకూ, వినియోగదారులకూ భారమనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో ముఖ్యంగా తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం కేంద్రాలుగా వస్త్రవ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారంపై ఆధారపడి ఎంతో మంది చిన్నవ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులు ఎక్కువగా చితికిపోతారని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి జరిగిన వ్యాపారంపై లెక్కలు చూపించి వివరాలను అందించాలని కేంద్రం సూచించడం వీరికి మరింత భారంగా మారింది. గతంలో వ్యాట్ తొలగించాలని కోరుతూ వ్యాపారులు చేసిన ఆందోళనలతో ఆ విధానాన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు వ్యాట్ నుంచి జీఎస్టీకి మారాలంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి నెలా బిల్లులు జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌లో ఆన్లైన్ చేయాలంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకోవాల్సి ఉంటుందని, ఇదంతా పెద్దస్థాయి షాపింగ్‌మాల్స్‌కు మాత్రమే సాధ్యమవుతుందే తప్ప చిన్న వ్యాపారులకు సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో వస్త్ర దుకాణాలపై 12 శాతం వరకు పన్ను పడనుంది. ఈ భారం వినియోగదారులు భరించాల్సి వస్తోంది. రూ.వెయ్యిలోపు ఐదు శాతం, ఆ మొత్తం దాటితే 12 శాతం వరకు పన్ను విధించనున్నారు. ఇవి కాకుండా మేకింగ్, వర్కింగ్, డైయింగ్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయనున్నారు. ఇది వినియోగదారులకు భారంగా మారనుంది. ఫర్నిచర్ షాపుల బంద్ ఇదిలా ఉంటే ఫర్నిచర్ వ్యాపారులూ రెండురోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1500 షాపులు ఉంటాయని అంచనా. ఈ దుకాణాలన్నీ బుధవారం కూడా మూతపడనున్నాయి. తదుపరి కేంద్రం స్పందనను బట్టి ఆందోళన తీవ్రతరం చేయాలనే యోచనలో ఫర్నిచర్ వ్యాపారులు ఉన్నారు. -
ఎరువు.. జీఎస్టీ బరువు
⇒పెరగనున్న ఎరువుల ధరలు ⇒జిల్లా రైతులపై రూ.36 కోట్లకు పైగా భారం ⇒పురుగు మందులు మరింత ప్రియం చేజర్ల (ఆత్మకూరు): వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్ర«భావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలొస్తున్నాయి. జూలై 1నుంచి కొత్త పన్నుల విధానం అమలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యూరియా సహా రసాయన ఎరువుల ధరలు ఎంత పెరగవచ్చనే విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఎరువుల ధరలు కొన్ని నెలల క్రితమే కొంతమేర తగ్గాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని రకాల ఎరువులపై వ్యాట్ 5 శాతం మాత్రమే ఉంది. జీఎస్టీ అమలైతే ఈ పన్ను 12 శాతానికి పెరుగుతుంది. అంటే పన్నుభారం అన్నదాతపై అదనంగా 7 శాతం పడనుంది. యూరియా బస్తాపై దాదాపు రూ.18, మిగిలిన ఎరువులపై బస్తాకు రూ.60 నుంచి రూ.100 వరకు పెరిగే అవకాశం ఉంది. యూరియా భారం రూ.4.10 కోట్లు ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలో 3,40,077 టన్నుల రసాయన ఎరువులు అవసరమవుతాయి. అన్నిరకాల ఎరువుల ధరలు పెరుగుతున్నా ఇప్పటివరకు యూరియా ధర మాత్రం పెరగలేదు. ఇది రైతులకు కాస్త ఊరట కలిగిచింది. ప్రస్తుతం యూరియా 50 కిలోల బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్టీ కారణంగా రూ.316కు పెరగనుంది. అంటే బస్తాపై రూ.18 అదనపు భారం పడనుంది. జిల్లాకు 1,13,312 టన్నుల యూరియా ప్రతి ఏడాది అవసరమవుతోంది. టన్నుపై రూ.360 పెరగనుంది. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో రైతులపై రూ.4.10 కోట్ల పైగా భారం పడే అవకాశం ఉంది. ఇతర ఎరువుల ధరలు సైతం.. జిల్లాకు డీఏపీ 65,600 టన్నులు, ఎంఓపీ 16,432 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,42,733 టన్నులు అవసరమవుతున్నాయి. 50 కిలోల బస్తాపై గరిష్టంగా రూ.70 వరకు ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఎరువుల కంపెనీల ప్రతినిధులు జిల్లాలోని డీలర్లకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తే రైతులపై జీఎస్టీ భారం ఎక్కువగానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులు ఎక్కువగా వినియోగించే ఎరువుల్లో డైఅమోనియా సల్ఫేట్ (డీఏపీ) ముఖ్యమైనది. ప్రస్తుతం దీనిధర గరిష్టంగా బస్తా రూ.1,155 వరకు ఉంది. భవిష్యత్‌లో రూ.1,221కి చేరే అవకాశం ఉంది. జిల్లాకు డీఏపీ 66,600 టన్నులు అవసరమవుతుండగా, రైతులపై రూ.8.50 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 28.28.0 రకం ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.1,134 ఉంది. ఇది రూ.1,200 దాటే అవకాశం ఉంది. 10.26.26, 14.35.14 ఇలా అన్ని రకాల ఎరువుల ధరలు పెరగనున్నాయి. భారం కానున్న పురుగుమందుల ధరలు రైతులకు పురుగు మందులు సైతం రానున్న రోజుల్లో భారం కానున్నాయి. జిల్లాలో ఏటా దాదాపు 52 వేల టన్నుల పురుగు మందులు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిపై భవిష్యత్‌లో 18 శాతం వరకు జీఎస్టీ వర్తించే అవకాశం ఉంది. వీటితో వివిధ కంపెనీలు బయో ఉత్పత్తులను పెంచే అవకాశం ఉంది. ఓ వైపు పండిన పంటలు గిట్టుబాటు ధరలు లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. కేంద్రం అమల్లోకి తెస్తున్న జీఎస్టీ మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అవుతుంది. -
ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్ కార్డులకు సరుకులు
నంద్యాలరూరల్: కొత్త రేషన్ కార్డులను ఫిబ్రవరి నెల నుంచి సరుకులు అందజేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం నంద్యాల టెక్కెమార్కెట్ యార్డు ఆవరణంలోని సివిల్ సప్లయ్ గోదామును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డీలర్ల వద్ద మిగిలిన సంక్రాంతి చంద్రన్న కానుకలు వెనక్కు అందజేయాలన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో మిగిలిన ఆయిల్, కందిపప్పును ఉచితంగా ఐసీడీఎస్‌కు, శనగ పప్పు, గోధుమపిండి, నెయ్యి, బెల్లంస్టాక్ను.. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు ఉచితంగా అందివ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు సివిల్ సప్లయ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ గోదాము ఇన్చార్జి రామాంజనేయులు తదితరులు ఉన్నారు. -
మొరాయించిన గూడ్స్ ఇంజిన్
– ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం డోన్ టౌన్ : సాంకేతికలోపంతో బుధవారం మధ్యాహ్నం గూడ్స్ ఇంజిన్ మోరాయించింది. పట్టణంలోని రైల్వేగేట్ మధ్యలో గూడ్స్ కంటైనర్లు నిలిచిపోయాయి. దీంతో గేటుకు ఇరువైపులా ట్రాపిక్ స్తంభించిపోయింది. వాహనదారులు, పాదచారులు గంటపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఇంజిన్‌ను ఏర్పాటు చేసి గూడ్స్ కంటైనర్లను స్టేషన్లోకి తరలించడంతో గేట్లను ఎత్తివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఏర్పడిన అంతరాయం తొలగిపోయింది. -
సరుకులు పక్కదారి పట్టకుండా జీపీఎస్ అమలు: ఆనంద్
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల సరుకులు పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల శాఖ కట్టుదిట్టమైన చర్యలకు కసరత్తు చేస్తోంది. రవాణా కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేసింది. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లు, అక్కడ్నుంచి రేషన్ షాపులకు సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం సరుకు రవాణా కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. రోజూ ఎక్కడో ఒకచోట రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, వాటిని అరికట్టడానికి ఇకపై సరుకు రవాణా సక్రమంగా జరిగేలా జీపీఎస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే రైస్‌మిల్లర్లు, రేషన్, కిరోసిన్ డీలర్లు, అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించామని, రవాణా చేసే వారి ప్రమేయం లేకుండా బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేదని తేలిందని స్పష్టం చేశారు. సరుకు రవాణా పూర్తరుునప్పటికీ వాహనాలను అధికారుల అనుమతి లేకుండా జిల్లా పరిధి దాటకూడదని సూచించారు. జీపీఎస్‌తో కాంట్రాక్టర్ల తప్పులన్నీ రికార్డు అవుతున్నాయని, ప్రతి వాహనానికి శాశ్వతంగా ఒకే సెల్‌ఫోన్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని, తమ వాహనాలు ఎక్కడ ఉన్నాయో కాంట్రాక్టర్లు తెలుసుకునేలా ప్రత్యేక ఐడీ, పాస్వర్డ్ ఇవ్వనున్నామని కమిషనర్ తెలిపారు. ఇకపై కాంట్రాక్టర్ల లావాదేవీలన్నింటినీ ఆన్లైన్లోనే చేస్తామని స్పష్టం చేశారు. తమ కాంట్రాక్ట్ గడువును గతంలో మాదిరిగా రెండేళ్లకు పెంచాలని కాంట్రాక్టర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తానని కమిషనర్ అన్నారు. -
నాణ్యమైన సరుకులు ఇవ్వాలి
ఖానాపూర్ : వ్యాపారులు వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయడంతోపాటు విధిగా బిల్లు ఇవ్వాలని వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కడపత్రి తిలక్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలు కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు తూ.చ. తప్పకుండా బిల్లు తీసుకోవాలన్నారు. అప్పుడే వస్తువు నాణ్యమైందో కాదో తెలుస్తుందన్నారు. బిల్లు ఇవ్వకుంటే తమ దృష్టికి తేవాలన్నారు. వ్యాపారుల వద్ద బిల్లు తీసుకోవడం వినియోగదారుల హక్కన్నారు. వినియోగదారుల హక్కుల చట్టం బిల్లు 1956 లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టారన్నారు. కొందరు వ్యాపారులు ఈ చట్టాన్ని తుంగలో తొక్కి వినియోదదారులకు నష్టం చేకూరుస్తున్నారన్నారు. వినియోదారులను చైతన్య పరచడమే సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా వ్యాపారులు వినియోగదారులను మోసానికి గురైనట్లు తమ దృష్టికి తీసుకువస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వినియోదారుల సంఘం జిల్లా కోశాధికారి సలీంఖాన్, సభ్యులు, యోగి, పొలంపెల్లి సచిన్ తదితరులు ఉన్నారు. -
గూడ్సు రైల్లో మృత శిశువు
ముత్తుకూరు : ఒంగోలు నుంచి కష్ణపట్నం పోర్టుకు గ్రానైట్‌రాళ్ల లోడుతో మంగళవారం వచ్చిన గూడ్సు రైలులో ఒక మత శిశువు దర్శనమివ్వడంతో పోర్టు సెక్యూరిటీ వర్గాలు నివ్వెరపోయాయి. పోర్టు సమీపంలో రైలులో కార్మికులు వ్యాగన్లను పరిశీలిస్తుండగా గ్రానైట్ రాళ్ల మధ్య ఓ ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ కనిపించింది. అందులో నెలలు నిండని ఓ మతశిశువు ఉంది. దీంతో కార్మికులు వెంటనే పోర్టు సెక్యూరిటీకి సమాచారం అందించారు. వెంటనే పోర్టు సెక్యూరిటీ అధికారులు, కష్ణపట్నం పోలీసులు గూడ్సు రైలు వద్దకు చేరి, మతశిశువును పరిశీలించారు. గర్భంలోనే మతిచెందిన శిశువునుగానీ, లేదా అబార్షన్ చేయించుకున్న మహిళ శిశువునుగానీ గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ సంచిలో ఉంచి, గూడ్సు రైలులో పడవేసివుంటారని భావిస్తున్నారు. -
సరుకుల రవాణాకు రాచబాట!
– తిలారు రైల్వేస్టేషన్ కేంద్రంగా పేట్రేగిపోతున్న వ్యాపారులు – విచ్చలవిడిగా గుట్కాలు, బట్టలు దిగుమతి – భారీ మొత్తంలో పన్ను ఎగవేత –వాణిజ్య శాఖాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు తిలారు రైల్వే స్టేషన్ కేంద్రంగా సరుకుల రవాణా దర్జాగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. మూటల ముసుగులో గుట్కాలు, ఖైనీలు, బట్టలు, కంచు, ఇత్తడి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. ప్రభుత్వ ఖజనాకు రూపాయి కూడా చెల్లించకుండా వ్యాపారులు ఈ స్టేషన్ నుంచి దర్జాగా సరుకులను దిగిమతి చేసుకొని దొంగమార్గాన కావాల్సిన చోటుకు చేర్చుకుంటున్నారు. అక్రమంగా సరుకుల రవాణా ఎంతలా జరుగుతోందో బుధవారం రాత్రి పోలీసులకు పట్టుబడిన ఖైనీలు, గుట్కాలు, నరసన్నపేటలోఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాన్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారీగా.. వేళాపాళా లేకుండా చీకటి వ్యవహారం జరుగుతున్నా వాణిజ్య పన్నులశాఖాధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జలుమూరు: జిల్లా కేంద్రం శ్రీకాకుళం తరువాత భారీగా వ్యాపారం జరిగేది నరసన్నపేట ప్రాంతంలోనే. బంగారం నుంచి స్టీల్, సిమెంట్, గ్రానైట్, బట్టలు, నిషేధిత గుట్కాల వ్యాపారం ఇక్కడ కోట్లాది రూపాయల్లో జరుగుతోంది. ఇక్కడకు సరుకులు చేరేందుకు తిలారు రైల్వేస్టేషన్ అతి సమీపంలో ఉండడంతో వ్యాపారులకు కలిసి వస్తోంది. ఎలాంటి పన్నులను చెల్లించకుండానే సరుకులను దర్జాగా ఇక్కడకు చేర్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా దిగుమతులు వ్యాపారులు దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి అనేక వస్తువులను రైళ్ల ద్వారా తీసుకొని వస్తుంటారు. విలువ ఆధారిత,(వ్యాట్) ఎక్సైజ్ సుంకం, కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్‌డీటీ) తదితర పన్నులు, సుంకాలు చెల్లించాల్సి ఉండగా.. వ్యాపారులు వీటిని దర్జాగా ఎగ్గొట్టేస్తున్నారు. ఎక్కువగా ఒడిశా వైపు నుంచి వచ్చే రైళ్ల ద్వారా తిలారు స్టేషన్‌కు సరుకులను వ్యాపారులు దిగిమతి చేసుకుంటుంటారు. ఈ స్టేషన్ వద్ద ఎలాంటి తనిఖీలు అధికారులు చేపట్టకపోవడం వ్యాపారులకు కలిసి వస్తోంది. సరుకుల తరలింపు ఇలా సరుకుల రవాణా వెనుక భారీ నెట్ వర్క్ నడుస్తోంది. తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కోల్కత్తా, ఒడిశాలో ఉన్న దళారుల నుంచి తిలారు స్టేషన్ వరకు సరుకులు చేరేలా కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు. తిలారుకు చేరిన కంచు, ఇత్తడి, గుట్కాలు, బట్టలు, ఇతర విలువై సరుకులను వేర్వేరు ప్రాంతాల్లోని స్టాక్ పాయింట్లకు ముందుగా వ్యాపారులు చేర్చుతారు. బుడితి, సారవకోట వెళ్లాలంటే జోనంకి, కృష్ణాపురం మీదుగా అడ్డదారిలో సరుకులను చేర వేస్తారు. నరసన్నపేటకు తరలించేందుకు తిలారు స్టేషన్ వెనుక భాగంలో.. ఎఫ్‌సీ గొడౌన్ నుంచి రావిపాడు, ఏనేటి కొత్తూరు మీదుగా తరలిస్తారు. టెక్కలి, కోటబొమ్మాళి తీసుకెళ్లేందుకు రావిపాడు, తుంబయ్యపేట, రామినాయడుపేట గ్రామాలు మీదుగా కొందరు, నిమ్మాడ మీదుగా మరికొంత మంది సరుకులను అధికారుల కంట పడకుండా ఆటోల్లో తరలించుకుపోతున్నారు. సరుకులను తరలించే ముందు కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఎవరూ లేరని నిర్థారించుకుంటారు. ఈ విషయాన్ని సెల్ ఫోన్ల ద్వారా సమాచారం చేరవేసి సరుకులను గమ్యస్థానానికి చేర్చుతారు. పట్టించుకోని రైల్వే సిబ్బంది రైళ్ల నుంచి సరుకులు దిగితున్నా స్టేషభ్ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. సరుకులకు ఉన్న రశీదులు మాత్రమే చూస్తామని, అందులో ఏం ఉన్నాయో చూసే బాధ్యత తమది కాదని సంబంధిత సిబ్బంది చెప్పి తప్పించుకుంటున్నారు. డీసీటీవో ఏమన్నారంటే.. అక్రమంగా సరుకులు దిగిమతి చేసుకుంటున్న విషయాన్ని నరసన్నపేట డిప్యూటీ సీటీవో యూ.కేశవరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. ఎప్పకప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరైనా పట్టుబడితే కేసులు నమోదు చేయడంతోపాటు, అపరాధ రుసుం విధిస్తున్నామన్నారు. -
ఇదేం తోఫా?
అందింది సగం మందికే సరుకులూ నాసిరకమే గోధుమ పిండి, నెయ్యి మరీ అధ్వానం తూకంలోనూ చేతివాటం రంజాన్ తోఫాపై పెదవి విరుస్తున్న ముస్లింలు రంజాన్ తోఫా పేరిట పేద ముస్లింలకు రాష్ట ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఇచ్చిన సరుకులు నాసిరకంగా ఉండగా.. వాటిని కూడా సగం మందికే సరఫరా చేసి చేతులు దులుపుకుంటోంది. గోధుమ పిండి, నెయ్యి మరీ అధ్వానంగా ఉన్నాయని ముస్లింలు వాపోతున్నారు. తూకంలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. మదనపల్లె సిటీ : రంజాన్ తోఫా పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సరుకులు మరీ అధ్వానంగా ఉంటున్నాయి. గోధుమ పిండి, నెయ్యి నాసిరకంగా ఉన్నాయని ముస్లింలు చెబుతున్నారు. గోధు మ పిండి ప్యాకెట్ విప్పగానే ఓ రకమైన దుర్వాసనతో పాటు అధిక భాగం పొట్టు కలిపి ఉందని, నెయ్యి ఏ మాత్రం నాణ్యత లేదని, తూకంలోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని వారు వాపోతున్నారు. జిల్లాలో 2,832 రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్‌కార్డులు ఉన్న 1,15,137 పేద ముస్లింల కుటుంబాలకు చంద్రన్న తోఫా పేరిట నాలుగు నిత్యావసర సరుకులతో కూడిన గిఫ్ట్ ప్యాక్ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జులై 1 నుంచి వీటిని అందించాల్సి ఉంది. కానీ ఆదివారం నాటికి జిల్లాలో సగానికిపైగా లబ్ధిదారులకు అందలేదు. ఎంత అందించాలంటే ఒక్కో కుటుంబానికి రంజాన్ తోఫా పేరిట ఐదు కేజీల గోధుమ పిండి, రెండు కేజీల పంచదార, 100 గ్రాముల నెయ్యి అందించాలి. కొందరికే సరుకులు జిల్లాలోని కొన్ని మండలాల్లో అర్హులైన పేర్లు ఆన్లైన్లో రాకపోవడంతో వారికి సరుకులు పొందే అవకాశం లేకుండా పోయింది. మదనపల్లె పట్టణం సైదాపేట, అప్పారావుతోట, అనంతయ్యబంగ్లా వీధుల్లో సగానికిపైగా సరుకులు అందలేదు. దీనికి కారణం ఈపాస్‌లో చోటుచేసుకున్న సాంకేతిక తప్పిదాలే. వారికి నాట్ ఫర్ తోఫా అని ఈపాస్‌లో చూపిస్తోంది. ఇదే పరిస్థితి జిల్లాలోని పలు మండలాల్లోనూ ఎదురైనట్టు సమాచారం. నెయ్యిలో చేతివాటం నెయ్యి ప్యాకెట్ల తయారీలో చేతివాటాన్ని ప్రదర్శించారు. నాణ్యత విషయం పక్కనపెడితే తూకంలోనూ మోసం చేశారు. 100 గ్రాములు ఉండాల్సిన నెయ్యి 75 నుంచి 85 గ్రాములు ఉంది. గోధుమ పిండిలో ఎక్కువ మోతాదు తవుడు ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా ఉపయోగించలేని విధంగా రంగు మారి ఉంది. దీంతో చాలా మంది దీన్ని వినియోగించడం లేదు. చక్కెరలోనూ అంతే. నాణ్యమైన సన్న చక్కెరకు బదులు లావు చక్కెరను సరఫరా చేశారు. ఇక సేమియాల పరిస్థితి మరీ అధ్వానం. మూడు రోజుల నుంచి తిరుగుతున్నా రంజాన్ తోఫా కోసం మూడు రోజుల నుంచి షాపు వద్దకు తిరుగుతున్నా. ఈపాస్‌లో నాట్ ఫర్ తోఫా అని చూపిస్తోంది. షాపు డీలర్ తోఫా ఇవ్వలేదు. ఇదేమని అడిగితే మీకు రాలేదంటూ సమాధానం ఇస్తున్నారు. చాలా మందికి ఇలా అన్యాయం చేశారు. -ఆర్ఎం.మస్తాన్, అప్పారావుతోట, మదనపల్లె పేదోళ్లు కనబడలేదా? నేను బండిపై పూలు అమ్మి బతుకుతున్నా. రేషన్‌కార్డు కోసం పలు సార్లు అర్జీలు ఇచ్చాను. ఇప్పటి వరకు రాలేదు. ఆ సాకుతోనే నాకు రంజాన్ తోఫా ఇవ్వలేదు. కనీసం పండుగ సమయంలోనైనా పేదలు గుర్తుకు రాలేదా. -జి.హుస్సేన్, ఈశ్వరమ్మకాలనీ, మదనపల్లె రూరల్ నెయ్యి బాగాలేదు రంజాన్ తోఫాలో భాగంగా ఇస్తున్న నెయ్యి మరీ నాసిరకంగా ఉంటోంది. 100 గ్రాములకు కేవలం 75 గ్రాముల నెయ్యిని అందించారు. మిగిలిన సరుకులు కూడా అంతమాత్రమే. అర్హులైన అందరికీ నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి. -షేక్ మస్తాన్, మదనపల్లె -
బటన్స్‌తో బెస్ట్ డిజైన్స్..
ఇంటికి - ఒంటికి ఒక్కోసారి డ్రెస్ పాడైపోతుంది. కానీ దాని బటన్స మాత్రం బాగానే ఉంటాయి. అలాంటప్పుడు వాటిని పడేయడానికి మనసొప్పదు. పడేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో... ఇలా రకరకాల వస్తువులు తయారు చేయవచ్చు. 1. ఒక బెలూన్‌కి సగం వరకూ గ్లూ రాసి, రంగురంగుల బటన్సని అతికించండి. తర్వాత చిన్న సూదితో బెలూన్‌కి రంధ్రం చేసి, గాలిని తీసేయండి. ఆపైన బెలూన్ని తీసేస్తే బటన్స ఇలా బుట్టలా అవుతాయి. 2. పాతబడిన చెప్పులు, బూట్లను తీసుకుని, గ్లూ రాసి చక్కని బటన్సని అతికిస్తే... పాతవే కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. 3. ఓ దళసరి అట్టను తీసుకుని, అంచుల పక్కనంతా జిగురు రాసి, బటన్సని అతి కించండి. దాని చుట్టూ ఫ్రేమ్ బిగిస్తే మంచి ఫొటో ఫ్రేమ్ రెడీ. 4. రంగురంగుల బటన్సను దారాలకు ఎక్కించి, కళ కోల్పోయిన చెక్కగూళ్ల చుట్టూ వేళ్లాడదీస్తే సూపర్‌బగా ఉంటుంది. 5. సన్నని వైరు తీసుకుని, దానికి బటన్స ఎక్కించి ముడివేయండి. ఓ రిబ్బన్ కట్టి ఎక్కడైనా వేళ్లాడదీస్తే ఎంతో బాగుంటుంది. 6. పాడైపోయిన పర్సుకి కూడా రంగురంగుల బటన్సను అతికించి కొత్త రూపం తేవొచ్చు. 7. ఓ పేపర్ మీద ఇలా చెట్టు ఆకారంలోనో, మరో ఆకారంలోనే బటన్సని అతికించి, ఫ్రేమ్ కట్టించి వేళ్లాడదీస్తే మీ గోడలకు కొత్త అందం వస్తుంది. -
హాస్టల్ విద్యార్థులతో ‘చంద్రన్న’ చెలగాటం
పేద బిడ్డల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. చదివించుకోలేక సంక్షేమ హాస్టల్లో చేర్చితే ప్రజాప్రతినిధులు, అధికారులు ‘హాస్టల్లో ఉండేవాళ్లకు ఏమైతే నేం’ అడిగేదెవరన్నట్టు ప్రవర్తిస్తున్నారు. తమకు గుర్తుకొచ్చినప్పుడు హాస్టల్లో నిద్రించి, పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమంటూ ప్రకటనలు ఇస్తారు. ఫొటోలకు ఫోజులిస్తారు. నిజానికి ఆ పిల్లల పట్ల అధికారులకున్న ప్రేమ ఏపాటిదో ఇటీవల హాస్టళ్లకు అందించిన సరుకులే చెబుతున్నాయి. చంద్రన్న కానుకల పేరుతో రేషన్‌షాపులకు ఇటీవల పంపినవి కొంతమంది వినియోదారులు నాసిరకంగా ఉన్నాయని తీసుకోలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల సరుకులు మిగిలిపోయాయి. సగానికి సగం పురుగులు పట్టాయి. వాటిని సంక్షేమ హాస్టళ్లకు తరలించి విద్యార్థులకు ఆహార పదార్థాలు తయారుచేసి వడ్డిస్తున్నారు. తిరుచానూరు: తిరుపతిలోని హాస్టళ్లలో చంద్రన్న సరుకులతో త యారు చేసిన ఆహార పదార్థాలను విద్యార్థులు తినలేక పోతున్నారు. తిరుపతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలురు, బాలికల సంక్షేమ గృహాలున్నాయి. వీటిలో 3నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు సుమారు 800మంది ఉన్నారు. వీరికి రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం వడ్డిస్తా రు. ఇందుకోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులను అంది స్తుంది. ఇటీవల కాలం చెల్లిన చంద్రన్న కానుక సరుకులను రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలకు సరఫరా చేసింది.ఇందులోని గోధుమ పిండి, రంగుమారిన బెల్లం, పుచ్చిన కంది పప్పు, శెనగపప్పు ఉన్నాయి. వీటినే ఆహార పదార్థాలలో వినియోగిస్తున్నారు. జనవరి 2015లో తయారుచేసిన గోధుమ పిండి ప్యాకెట్లపైన రెండు నెలలలోపు వాడాలని ముద్రించి కూడా ఉన్నారు. గడువు తేదీ దాటి ఏడాదిపైనే గడిచిన గోధుమ పిండి ప్యాకెట్లను సరఫరా చేశారు. ఇవి పురుగులు పట్టి ఉన్నాయి. వీటినే జల్లించి పిల్లలకు చపాతీ, పూరీలు తయారు చేస్తున్నారు. పురుగులు పట్టిన కంది పప్పులతో సాంబారు తయారు చేస్తున్నారు. పేద విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వ పెద్దలు శ్రద్ధచూపాలని, నాసిరకం, కాలం చెల్లిన ఆహారపదార్థాలను సరఫరా చేయడం మానుకోవాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు. నాశిరకం వస్తువులతో తయారు చేసిన పదార్థాలు తింటే పౌష్టికాహరం మాట అటుంచితే లేనిపోని రోగాలు వ స్తాయని వైద్యాధికారులు చెబతున్నారు. నాణ్యత కొరవడింది.. పీలేరు /వాల్మీకిపురం/ గుర్రంకొండ: నియోజకవర్గ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు పంపిణీ చేసిన నాణ్యతలేని చంద్రన్న సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలు తినలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని పీలేరు, కేవీ పల్లె, కలకడ, గుర్రంకొండ, కలికిరి, వాల్మీకిపురం మండలాల్లోని హాస్టళ్లకు కాలం చెల్లిన చంద్రన కానుకలను గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చే శారు. సరఫరా చేసిన సరుకుల్లో నాణ్యత కొరవడింది. కా లం చెల్లిన గోధువు పిండి ప్యాకెట్‌పై వూర్కర్తో తేదీ వూ ర్పు చేసి ఉన్నారు. రంగువూరిన, నాణ్యత లేని కంది ప ప్పు, బుడ్డశెనగలు, బెల్లం సరఫరా చేశారు. కందిపప్పు సగానికిపైగా పుచ్చిపోరుు రంగువూరి మగ్గిపోయి ఉంది. గోధువు పిండిలో కూడా నాణ్యత కొరవడింది. ప్యాకింగ్ కవర్‌పై ఉన్న 2015 సంవత్సరంలోని 5ను వూర్కర్తో 6గా వూర్చిన విషయుం స్పష్టం గా కనిపిస్తోంది. ఈ లెక్కన ఏడాది క్రితం తయూరు చేసిన గోధువు పిండినే ప్రస్తుతం చంద్రన్న కానుకల్లో పంపిణీ చేసారనే విషయుం స్పష్టంగా అర్థవువుతోంది. గోధువు పిండిలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. రంగువూరిన బెల్లంతోనే పాయుసం చేసి పెడుతున్నారు. వీటితో తయారు చేసే ప దార్థాలు తిని విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఉచితంగా ఇస్తున్నావుని ఇలాంటి సరుకులను హాస్టళ్లకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తలి ్లదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయుమై హాస్టల్ వార్డన్లను వివరణ కోరగా, గోధువు పిండిని జల్లెడ పట్టి వాడుకుంటున్నావుని చెబుతున్నారు. రంగువూరిన, పనికిరాని బెల్లంను పారవేస్తున్నావుని పేర్కొంటున్నారు. పై అధికారుల ఆదేశాలను పాటిస్తున్నామని చెబుతున్నారు. అన్నీ నాసిరకమే.. వి.కోట : వుండలంలోని ఎస్సీ బాలురు, బీసీ బా లికల హాస్టళ్లకు చంద్రన్న కానుకల సరుకులను పంపిణీ చేశారు. బాలుర హాస్టల్‌కు పంపిణీ చేసిన గోధువుపిండిలో పురుగులు ఉండడంతో జల్లించి వాడుకుం టున్నారు. కందిపప్పులో పురుగులు ఉన్నాయి. బాలికల హాస్టల్‌కు పంపిణీ చేసిన వస్తువులు నాణ్యతగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. చెడిన సరుకులు తినిపించేశారు.. పలమనేరు : పలమనేరు నియోజకవర్గంలో పది సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పట్టణంలో మూడు, మండలాల్లో ఏడు సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్ళున్నాయి. చంద్రన్న సంక్రాంతి మిగిలిన సరుకులను హాస్టళ్లకు పంపిణీ చేశారు. సరుకులు నాసిరకంగా ఉన్నాయి. గోధుమపిండి, నెయ్యి మగ్గిన వాసన వస్తున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. కందిపప్పు పుచ్చిపోయి ఉందని, బెల్లం బంకపట్టి ఉందని చెబుతున్నారు. వీటితోనే పాయసం, తీపి బోం డాలు, తదితరాలను వండి పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం తం చంద్రన్న సరుకులు పూర్తిగా ఖాళీ అయినట్టు వార్డెన్లు చెబుతున్నారు. పురుగులు కనిపిస్తున్నా.. తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 16 హాస్ట ళ్లు ఉన్నాయి.1348 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో1348 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. హాస్టళ్లకు గత నెలలో చంద్రన్న కానుకలకు సంబంధించి గోధుమపిండి 1,860 కిలోలు, పచ్చి శెనగపప్పు 960 కిలోలు, కందిపప్పు 960 కిలోలు, బెల్లం 960 కిలోలు, నెయ్యి 18.6 కిలోలు, పామోలిన్ ఆయిల్ 1,860 లీటర్లను సరఫరా చేశారు. కందిపప్పు పుచ్చిపోయి ఉంది. పురుగులు పైకి కనిపిస్తున్నాయి. పచ్చిశెనగపప్పు సైతం పురుగులు పట్టి ఉంది. బెల్లం రంగుమారి ఉంది. కాలం చెందిన గోధుమ పిండిని సరఫరా చేశారు. వీటితో తయారు చేసిన పదార్థాలనే విద్యార్థులకు వడ్డిస్తున్నారు. కంపుకొడుతున్న బెల్లం శ్రీకాళహస్తి: చంద్రన్న కానుకలో కాలం చెల్లిన బెల్లం,గోధువుపిండి, పామారుుల్,కందిపప్పు, శెనగపప్పును నియోజకవర్గంలోని 14 హాస్టళ్లకు పంపిణీ చేశారు. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతోపాటు దీర్ఘకాలంగా వస్తువులు నిల్వ ఉండడంతో బెల్లం, కందిపప్పు, పా మారుుల్ కంపుకొడుతున్నారుు. గోధువుపిండి, శెనగపప్పు పురుగులు పట్టి ఉన్నాయి. వాటితో తయారు చేసిన పదార్థాలనే వడ్డిస్తుండడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా పంపిణీ చేసిన సమయంలో నాశిరకంగా ఉన్నాయని ఫిర్యాదు వెల్లువెత్తినా, సరుకులు బాగా లేవని వార్డెన్లు చెబుతున్నా హాస్టళ్లకు సరఫరా చేయడం పేద విద్యార్థులపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
తెలంగాణ వారికి ఆంధ్రాలో రేషన్ కోటా
నడిగూడెం: తెలంగాణ రాష్ట్రంలోని వారికి ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరుకులు కేటారుుంచిన విచిత్ర సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. నడిగూడెం మం డలం తెల్లబెల్లి గ్రామంలో ఒక రేషన్‌షాపు ఉంది. ఇక్కడ 524 ఇళ్లున్నాయి. అంత్యోదయ, పింక్ కార్డులు ఉన్నారుు. లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ తీసుకెళ్తున్నారు. మార్చి నెల రేషన్ బియ్యం కోసం షాపునకు వెళ్లగా 20 యూనిట్లకు మాత్రం కోటా కేటారుుంచలేదని డీలర్ తెలిపారు. దీంతో లబ్ధిదారులు మీసేవ కేంద్రానికి వెళ్లి చూసుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డివిజన్ పరిధిలోగల పలు రేషన్‌షాపులకు వీరి కోటా కేటారుుంచినట్లు ఉంది. దీంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకు గ్రామంలోనే సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దారు జక్కంపూడి కార్తీక్‌ను వివరణ కోరగా.. వీరి ఆధార్‌కార్డు నంబర్లు ఆంధ్రాకు జంప్ కావడం వల్ల ఇలా జరిగిందని, ఇలాంటి వారు జిల్లాలో ఐదువేల మంది వరకు ఉంటారని తెలిపారు. -
ఇత్తడి మెరుపు...
ఇంటిటిప్స్ ఇత్తడి లోహం పూజా సామగ్రి, ఇంటి అలంకరణ వస్తువులలో ప్రధానమైనది. అయితే, ఈ వస్తువులు సరిగా శుభ్రపరచకపోతే నల్లబడటం కళ తప్పడం చూస్తుంటాం. ఇత్తడి వస్తువులు కొత్తగా మెరవాలంటే... ఒక చిన్న పాత్రలో టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని క్లాత్కి అద్దుకుంటూ, ఇత్తడి పాత్రలపై రుద్దాలి. తర్వాత మరో పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడవాలి. క్లాత్కి కొద్దిగా ఆలివ్ ఆయిల్ అద్దుకొని శుభ్రపరిచిన వస్తువులపై మృదువుగా తుడవాలి. దీంతో అవి కొత్తవాటిలా మెరుస్తాయి. నిమ్మకాయ (అర చెక్క), టీ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. నిమ్మ చెక్కపై ఉప్పు వేసి నల్లబడిన ఇత్తడి వస్తువులపై రుద్ది, నీళ్లతో శుభ్రపరచాలి. తర్వాత మెత్తటి కాటన్ క్లాత్‌తో తుడవాలి. మురికి అంతా పోయి కొత్తవాటిలా మెరుస్తాయి. -
సంక్షేమ హాస్టళ్లలో.. సమస్యల ముళ్లు
హాస్టళ్ల విద్యార్థులను పీడించిన పాత సమస్యలు విరగడ కాకుండానే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఊడిన మరుగుదొడ్ల తలుపులు అలాగే ఉన్నారుు. దుస్తులు, వస్తువులను తుప్పురేకుల పెట్టెల్లోనో, నేలపైనో ఉంచాల్సిన దుస్థితి కొనసాగుతూనే ఉంది. కష్టాలు తిష్ట వేసిన అద్దె భవనాల నుంచి విముక్తీ సుదూరమే. మరో వైపు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు పెంచడానికి సిద్ధంగా లేదు. పిఠాపురం : జిల్లాలో పదవతరగతి లోపు ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు ఉండే వసతి గృహాలు (హాస్టళ్లు) 61 ఉండగా ఆ వర్గాల కాలేజీ విద్యార్థులుండే వసతిగృహాలు 38. వీటిలో సుమారు 9,400 మంది వసతి పొందుతున్నారు. 80 శాతానికి పైగా వసతిగృహాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బాలికల వసతిగృహాలలో మరుగుదొడ్లు లేక వారు పడుతున్న తిప్పలు.. గొప్పలు చెప్పుకొనే సర్కారు తలదించుకోవలసినవేనని చెప్పక తప్పదు. ఇక ఇచ్చే ఆహారంలో పోషక విలువలు లేక పలువురు విద్యార్థులు రక్తహీనత వంటి రోగాల బారిన పడుతున్నారు. ఒక్కో విద్యార్థికీ రోజూ 2,600 కిలో కేలరీల శక్తి గల ఆహారపదార్థాలు అందించాల్సి ఉండగా ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం కేవలం 1,500 కిలో కేలరీల శక్తినిచ్చే పదార్థాలు మాత్రమే అందుతున్నారుు. ఏరీ ఏఎన్ఎంలు? ప్రతి వసతిగృహంలో ఒక ఏఎన్ఎంను నియమించాల్సి ఉండగా ఏ ఒక్క దానిలో నూ వారు అందుబాటులో లేరు. దాంతో ఆ రోగ్య పరీక్షలు జరగక విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్య ప రీక్షల నిమిత్తం ఒక్కో హాస్టల్‌కు నెలకు రూ. 1,000 కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం వాటి ఊసెత్తడం లేదు. అనేక వసతిగృహా ల్లో ట్యూటర్ లేక పాఠ్యాంశాల్లోని సందేహాల్ని నివృత్తి చేసుకోలేకపోతున్నారు. పలు హాస్టళ్ల ప్రాంగణాల్లో లైట్లు వెలగక విద్యార్థులు చీకటిలోనే సంచరిస్తున్నారు. పలుచోట్ల హ్యేండ్ పంపులు రిపేరు వచ్చి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు జరగడం లేదు. ఇక మన్యంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. ఐరన్ లోపంతో పలువురు విద్యార్థులు మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నారు. నీటిశుద్ధి యంత్రాలు దాదాపు అన్నీ మూలనపడ్డారుు. చెప్పులూ అందలేదు.. సుమారు ఆరేళ్లుగా విద్యార్థులకు పెట్టెలు ఇవ్వక పోవడంతో తుప్పు పట్టిన పెట్టెల్లోనో, నేలపైనో ఉంచుకోవాల్సి వస్తోంది. కాస్మోటిక్స్ చార్జీలు సకాలంలో అందవు. పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ ధరలున్నప్పటి చార్జీలనే ఇవ్వడం వల్ల విద్యార్థులు చాలీచాలని సరుకులతో కాలం గడపాల్సి వస్తోంది. ఏడాదికోసారి పంపిణీ చేయాల్సిన చెప్పులు, బ్యాగులు, దుప్పట్లు, నోట్ పుస్తకాలు, కార్పెట్లు గత ఏడాది పూర్తిస్థాయిలో అందలేదు. జిల్లాలో 45 వరకు వసతిగృహాలు అద్దె భవనాలలోనే ఉన్నాయి, ఇవి కూడా శిథిలావస్థలో సమస్యలకు నెలవులుగా ఉన్నాయి. చాలీచాలని ఇరుకు గదులో మగ్గుతూనే విద్యార్థులు ఏడాదంతా గడుపుతున్నారు. సౌకర్యాల మెరుగుకు చర్యలు : డీడీ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగు పర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు చెప్పారు. రామచంద్రపురం, కాకినాడ, రంపచోడవరంలలో సొంత భవనాలను నిర్మించామని, మిగిలిన చోట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్టెలు గత ఆరేళ్ల నుంచి ఇవ్వలేదని, ప్రస్తుతం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. -
రేషన్ వేలిముద్ర
- సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ - తొలుత గ్రేటర్ పరిధిలో అమలు - దశలవారీగా జిల్లా అంతటా విస్తరణ - యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదనలు ప్రజాపంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా జిల్లా యంత్రాంగం సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల జారీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తోంది. చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశ పెడుతోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత, అవకతవకలు జరగకుండా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలివిడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్‌షాపుల్లో తొలిసారిగా అమలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీలోని 800 చౌకధరల దుకాణాల్లో ఈ విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు... బయోమెట్రిక్ మిషన్లను సమకూర్చుకునే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. యంత్రాల కొనుగోలుకు దాదాపు రూ.3 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:బయోమెట్రిక్ ద్వారా విధానంతో రేషన్‌డీలర్ల అక్రమ వ్యాపారానికి ఫుల్స్టాప్ పెట్టవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. కనిష్టంగా ప్రతి షాపులో 30 శాతం దుర్వినియోగాన్ని అరికట్టువచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా యేటా రూ.150 నుంచి రూ. 300 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుందని భావిస్తోంది. అంతేకాకుండా సరుకులు నల్లబజారుకు తరలకుండా డీలర్లలో జవాబుదారీతనం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం కార్డుదారులు వచ్చినా.. రాకున్నా, సరుకులు తీసుకున్నా. తీసుకోకపోయినా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తీసుకున్న సరుకులు మాత్రం వెనక్కి రావడంలేదు. అంటే రేషన్ తీసుకోనివారి కోటా కూడా పక్కదారిపడుతుందన్నమాట. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు.. కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయాలని సంకల్పించింది. వేలిముద్ర తప్పనిసరి! బయో మెట్రిక్ విధానంలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే కార్డుదారుడు తప్పనిసరిగా దుకాణానికి రావాల్సివుంటుంది. వేలిముద్ర సరిపోలినట్లు గుర్తించిన తర్వాతే సరుకులు పంపిణీ చేస్తారు. అయితే, ప్రస్తుతం కుటుంబసభ్యుల్లో ఎవరు వచ్చినా సరకులు ఇస్తారా? కుటుంబ పెద్ద వస్తేనే రేషన్ ఇవ్వడమన్న విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ విధానంలో కార్డుదారులకు మరో వెసులుబాటు కూడా ఉంది. తమ దగ్గర ఉన్న నగదుకు అనుగుణంగా నిర్దేశించిన సరకులను ఎన్నిసార్లయినా పొందే వీలుంది. ఉదాహరణకు.. తమకు రావాల్సిన రూ.20 కేజీల బియ్యాన్ని నాలుగు దఫాలుగా కూడా తీసుకోవచ్చన్నమాట. ప్రస్తుతం నగర శివార్లకే పరిమితం చేస్తున్న బయోమెట్రిక్ విధానాన్ని దశలవారీగా జిల్లా అంతటా విస్తరించనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’కి వివరించారు. -
సంక్రాంతిలో సడేమియా!
నాసిరకం సరుకులు అంటగట్టేందుకు రంగం సిద్ధం 4 రోజులు.. 6 సరుకులు.. జిల్లాకు అరకొర సరఫరా ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం.. అధికారుల్లో అయోమయం జిల్లా అంతటా 12 నాటికి ఉచిత రేషన్ పంపిణీ ప్రశ్నార్థకమే! పచ్చ బ్యాగులో గిఫ్ట్‌ప్యాక్ కర్నూలు : సందట్లో సడేమియా అన్న చందంగా సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్‌లో లబ్ధిదారులకు నాసిరకం సరుకులు కట్టబెట్టేందుకు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా కందిపప్పు, శనగలు, బెల్లం నాసిరకానివి సిద్ధం చేసినట్లు సమాచారం. కర్నూలు గోదాముకు వచ్చిన రెండు లారీల కందిపప్పును టెక్నికల్ ఆఫీసర్ పరిశీలించగా.. నాసిరకం అని తేలింది. దీంతో ఆయన కందిపప్పును వెనక్కి పంపినట్లు తెలిసింది. ఇక శనగలు, బెల్లంను పరిశీలించలేదు. కార్డుదారులకు నాసిరకం సరుకులు అంటగట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. పామాయిల్, నెయ్యి, గోధుమపిండి మినహా మిగతా మూడు సరుకులు విడిగా ఇస్తున్నారు. వాటిని కాటా వేసి ప్యాకెట్లుగా తయారు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న దుకాణాల్లో ప్యాకింగ్ చేయడానికే రెండు రోజుల సమయం పడుతుంది. ఇప్పటివరకు ప్యాకింగ్ కవర్లు కూడా చౌకదుకాణాలకు చేరలేదు. దీంతో పండుగకు ఎంత మందికి సరుకులు చేరుతాయనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. సంకటస్థితి.. సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్‌ను లబ్ధిదారునికి చేరవేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. సమయం తక్కువగా ఉండటం, అవసరమైన సరుకులు ఇంకా గోదాములకు చేరకపోవడంతో మండల స్థాయి అధికారులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. పండుగ సమీపిస్తుండటంతో లబ్ధిదారులకు సరుకుల పంపిణీ కత్తిమీద సాములా మారింది. పండుగ లోపు సరుకులు ఇవ్వకపోతే విమర్శలొస్తే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పవన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. జాయింట్ కలెక్టర్ కన్నబాబు పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ కావడం, రెగ్యులర్ డీఎస్ఓ లేకపోవడం, సీఎం విజయవాడలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరు కావడం వంటి కారణాలతో ఉచిత రేషన్ సరుకుల పంపిణీ గందరగోళంగా మారింది. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో రూ. 220 విలువ గల ఆరు సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తేదీలోపు సరుకులు లబ్ధిదారులకు అందించాలని సీఎం స్వయంగా అధికారులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఒత్తిడి పెంచడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. అయితే పూర్తి స్థాయి సరుకులు జిల్లాకు రావడానికి మరో రెండుమూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలో 10.39 లక్షల కార్డుదారులకు అమలు చేయనున్నారు. అమ్మ హస్తం బ్యాగ్ తరహాలో సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్ కోసం ‘పచ్చ’బ్యాగులు సిద్ధమయ్యాయి. అవి ఇంకా జిల్లా కేంద్రానికి చేరలేదు. వస్తువులన్నీ ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో దుర్వినియోగం కాకుండా గట్టి చర్యలకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాకు చేరిన ఉచిత సరుకులు.. వైజాగ్ కేంద్రీయ భాండార్ నుంచి బెల్లం రవాణా చేస్తున్నారు. 518 టన్నులకు గాను ఇప్పటి వరకు 88 టన్నులు జిల్లాకు చేరింది. అలాగే నెయ్యి కూడా వైజాగ్ కేంద్రీయ భాండార్ నుంచి సరఫరా చేస్తున్నారు. 103 కిలోలకు గాను కేవలం 13.5 కిలోలు మాత్రమే ఇప్పటి వరకు జిల్లాకు సరఫరా చేశారు. అలాగే వినుకొండ పూజిత దాల్మిల్ నుంచి కందిపప్పు సరఫరా అవుతుంది. 518 టన్నులకు గాను 176 టన్నులు గోదాములకు చేరాయి. కాకినాడ ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి పామాయిల్‌ను సరఫరా చేస్తున్నారు. 518 కిలో లీటర్లకు గాను 125 కిలోలీటర్లు గోదాములకు చేరాయి. అలాగే చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి శనగలు సరఫరా చేస్తున్నారు. 1036 టన్నులకు గాను 116 టన్నులు గోదాములకు చేరాయి. గోధుమ పిండి కాకినాడ గోదావరి ఫ్లోర్‌మిల్ నుంచి సరఫరా చేస్తున్నారు. 1036 టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 824 టన్నులు గోధుమ పిండి గోడౌన్లకు చేరింది. మిగిలిన సరుకులు వచ్చినవి వచ్చినట్లుగా చౌక డిపోలకు పంపాలని అధికారులు యోచిస్తున్నారు. ఒకటి ఒకసారి, మరోకటి ఒకసారి వస్తే తీసుకెళ్లడం పంపిణీ చేయడం చాలా కష్టమని డీలర్లు వాదిస్తున్నారు. -
కానుకకు దారేది
గుంటూరు సిటీ: చంద్రన్న సం‘క్రాంతి’ కానుక మసకబారేలా కనిపిస్తోంది. పండుగకు ఇంకా ఏడు రోజులే సమయం ఉన్నా, ఇప్పటికీ సరుకులు రాలేదు. సరుకులు ఉచితంగా రవాణా చేయాలని ప్రభుత్వం ఆదేశించిన కారణంగా కాంట్రాక్టర్ల కినుకతో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పథకాన్ని బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పేదలకు సంక్రాంతి నాటికి సరుకులందే మార్గం కనిపించడం లేదు. సంక్రాంతికి రాష్ట్రంలోని పేదలందరికీ కానుక అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయానికి సైతం బాలారిష్టాలు తప్పలేదు. ఆయన మనోభీష్టం మేరకు ఉచితంగా ఆరు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజల దరి చేర్చాలని కూడా భావించింది. ఈ మేరకు పది రోజుల ముందే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. 5వ తేదీ నాటికి ఆయా సరుకులన్నీ చౌక డిపోలకు చేరాల్సి ఉంది. అయితే పౌర సరఫరాల శాఖ ఉదాశీనం, ప్రభుత్వాధికారుల అత్యుత్సాహం కారణంగా ఆరవ తేదీ నాటికి కూడా వాటి జాడ లేదు. రూ. 230 విలువ గల కిలో గోధుమ పిండి, కిలో శనగలు, అర కిలో చొప్పున కందిపప్పు, బెల్లం, పామాయిల్, వంద గ్రాముల నెయ్యి ఉచితంగా తెల్ల రేషన్‌కార్డుదారులకు అందించాల్సి ఉంది. ఈ నెల 14వ తేదీ లోపు లబ్ధిదారుల ఇళ్లకు సరుకులు చేరితేనే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరినట్లు లెక్క. జిల్లాలో 12,72,390 తెల్ల కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ 2,173 చౌక డిపోల ద్వారా సంక్రాంతి కానుక చేరాల్సి ఉంది. ఉచితంగా సరుకులను రవాణా చేయాలన్న అధికారుల ఆదేశంతో కాంట్రాక్టర్లు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయానుకూలంగా వ్యవహరిస్తే తప్ప సంక్రాంతి నాటికి చంద్రన్న కానుక పేదలకు అందే సూచనలు దాదాపు లేనట్లేనని పలువురు చౌకడిపో డీలర్లు చెబుతున్నారు. -
ఏ కష్టమ్స్ లేకుండా..
విలువైన వస్తువులను విదేశాలకు తీసుకెళ్తే.. ఏవైనా విలువైన వస్తువులు, బంగారు నగలను విదేశాలకు తీసుకు వెళ్తున్నారా? తిరిగి వచ్చేటప్పుడు వాటిని మళ్లీ భారత్‌కు తీసుకు రావాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్ పొందాల్సిందే. ఈ సర్టిఫికెట్‌ను విమానాశ్రయాల్లోని ఇంటర్నేషనల్ డిపార్చర్ హాళ్లలోని కౌంటర్లలో మంజూరు చేస్తారు. దీన్ని పొందడానికి ముందుగా అధీకృత వాల్యూవర్‌తో వాటి విలువకు సంబంధించిన సర్టిఫికెట్ పొందాలి. ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్ తీసుకుంటే తిరుగు ప్రయాణంలో ఆయా వస్తువులపై సుంకం చెల్లించక్కర్లేదు. లేదంటే ఇబ్బంది తప్పదు. బంగారంపై ఇలా.. ప్రయాణికులు ఎవరైనా ఒక కేజీ వరకు బంగారం కడ్డీలు/ నాణాలు కొన్ని నిబంధనలకు లోబడి వెంట తెచ్చుకోవచ్చు. ప్రయాణికులు భారతీయ లేదా భారత సంతతి పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. కనీసం ఒక ఏడాది విదేశాల్లో ఉండి భారత్‌కు తిరిగి వస్తున్నట్లు ఆధారాలు తప్పనిసరి. తయారీదారుల పేర్లు, సీరియల్ నెంబర్లు, బరువును సూచించే ముద్రలు ఉన్న బంగారం కడ్డీలపై నిర్ణీత దిగుమతి సుంకం వసూలు చేస్తారు. ఇవేవీ లేని వాటిపై అదనపు సుంకం ఉంటుంది. విదేశాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండి భారత్‌కు తిరిగి వచ్చే పురుషులు సగటున రూ.50 వేల విలువ చేసే బంగారు ఆభరణాలను ఉచితంగా తెచ్చుకోవచ్చు. మహిళలైతే రూ.లక్ష విలువైన ఆభరణాలు తెచ్చుకునే అవకాశం ఉంది. ముత్యాలు, విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలు మినహా ఇతర ఆభరణాలను పరిమితికి మించి తెచ్చుకుంటే సుంకం చెల్లించాల్సి ఉంటుంది. గమనించాల్సిన ఇతర అంశాలు.. కస్టమ్స్, ఇతర సుంకాలను కేవలం స్థానికంగా మార్పిడికి అవకాశం ఉన్న కరెన్సీ రూపంలోనే చెల్లించాలి. ఈ సుంకాలు, నిబంధనలు పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది. కస్టమ్స్ నిబంధనలపై పూర్తి సమాచారం కోసం www.cbec.gov.in వెబ్‌సైట్‌ను చూడండి. -
ఎవరీ యోధానుయోధుడు?
పురాతనం తవ్వకాల్లో పురాతన వస్తువులే కాదు... చరిత్ర కూడా బయటపడుతుంది! ఈ అవకాశం సైబిరియాలో మరోసారి వచ్చింది. పదకొండవ శతాబ్దానికి చెందిన ఒక యుద్ధ వీరుడి సమాధిని సైబిరియాలోని ఒమ్స్క్ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బాణాలు, రక్షణకవచం... మొదలైన యుద్ధ సామాగ్రితో పాటు కొప్పెరలాంటి రకరకాల వస్తువులు ఈ సమాధిలో కనిపించాయి. ‘‘ఇదొక సంచలనాత్మక ఆవిష్కరణ’’ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ సమాధి ద్వారా ఆనాటి సంస్కృతి, యుద్ధతంత్రాలు, చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అయిదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఉన్న ఈ యుద్ధ వీరుడికి ఎడమ చేయి లేదు. యుద్ధంలో పోరాడే క్రమంలో చేయిని పోగొట్టుకొని ఉండొచ్చునని శాస్త్రవేత్తల అంచనా. సమాధిలో కంచు నాణెం ఒకటి కనిపించింది. దేవుళ్లతో సంభాషించడానికి ఇదొక మాధ్యమంగా ఆనాటి ప్రజలు భావించేవారు. అస్తిపంజరం ముక్కుపై ఎలుగొడ్డు పన్ను, తలకు వస్త్రంతో చేసిన శిరస్త్రాణం తొడిగి ఉంది. దీనికి ఇరువైపుల జేబులు ఉన్నాయి.... ఇదంతా మతాచారానికి సంబంధించిన వ్యవహారమై ఉంటుందని ఊహిస్తున్నారు. ‘‘ఇప్పటికిప్పుడు కొత్త విషయాలేమీ చెప్పలేంగానీ, భవిష్యత్‌లో చెప్పడానికి మాత్రం చాలా ఉంది’’ అని తవ్వకాల్లో బయటపడిన సమాధిని ఉద్దేశించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ, సైబిరియాకు చెందిన శాస్త్రవేత్త డా. కోరుసెన్కో అన్నారు.‘‘చనిపోయిన తరువాత గౌరవనీయులైన ప్రముఖులకు, యోధానుయోధులకు చేసే అంతిమసంస్కారానికి సంబంధించిన ఆనవాళ్లు సమాధిలో లభించాయి. ఈ ప్రముఖుడు ఎవరో తెలుసుకోవాల్సి ఉంది’’ అంటున్నారు శాస్త్రవేత్తలు. ‘‘ఈ యోధుడికి తనను తాను పరిచయం చేసుకోవాలనే కోరిక అకస్మాత్తుగా కలిగినట్టుంది’’ అని చమత్కరించారు కోరుసెన్కో. మరి ఆ యోధానుయోధుడు ఎవరో, తన గురించి తాను ఏం చెబుతాడో వేచి చూద్దాం. -
పురుగుల అన్నం మాకొద్దు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తమకు పెట్టాల్సిన సరుకులను వర్కర్లు కాజేస్తూ విద్యార్థినుల సంఖ్యకు సరిపోను వంట చేయకపోవడంతో రోజూ అర్థాకలితో అలమటిస్తున్నామని, పైగా పురుగుల అన్నం పెడుతున్నారని, దీనిపై వార్డెన్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని..వర్కర్లను నిలదీస్తే తమనే దండిస్తున్నారని.. మీరైనా సమస్యలు పరిష్కరిచాలని స్థానిక బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినీలు ఆదివారం కలెక్టర్ ప్రియదర్శినిని వేడుకున్నారు. దాదాపు గంటపాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారితో రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారుు.. ఆదివారం తెల్లవారుజామున బీసీ బాలికల హాస్టల్ నుంచి వర్కర్లు యాదమ్మ, జయమ్మ సరుకులు దొంగిలిస్తుండగా హాస్టల్ విద్యార్థిను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై వార్డెన్‌కు సమాచారం అందించినా ఆయన పట్టించుకోవడంతో వారు హాస్టల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ కిచిడి చేస్తే చట్నీ చేయలేదని, అర్ధరాత్రి రెండు గంటలకు వండిన అన్నం మధ్యాహ్నం తినాల్సి వస్తుందన్నారు. అన్నం సరిపోక ప్రతిరోజూ కొందరు విద్యారులు ఉపవాసం ఉండాల్సి వస్తోందన్నారు.అన్నంలో పురుగులు వస్తున్నాయని, భవనానికి కరెంట్ షాక్ వస్తుందని చెప్పినా వార్డెన్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వర్కర్ అలివేలు విద్యార్థినులతో వాగ్వాదానికి దిగడంతో వర్కర్లను తొలగించాలని పట్టుబడుతూ వారు ఆందోళన ఉధృతం చేశారు. 9గంటల వరకు ఆందోళన చేసినా సంబంధిత అధికారులు హాస్టల్ వద్దకు రాక పోవడంతో పీడిఎస్యు ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా నాయకురాలు గణిత మాట్లాడుతూ విద్యార్థినుల సమస్యలపై సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. నాణ్యమైన భోజనం పెట్టక పోవడంతో విద్యార్థినులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు రాము, వెంకట్, విద్యార్థినులు మమత, అరుణ, స్వప్న, షభానా, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు విప్లవ తదితరులు పాల్గొన్నారు. -
కెరీర్ కౌన్సెలింగ్
ప్యాకేజింగ్ కోర్సులను పూర్తిచేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? - సంతోష్‌కుమార్, వరంగల్ వస్తువుల విక్రయాల్లో ప్యాకేజింగ్‌దే కీలక పాత్ర. ప్యాకేజీ ఆకర్షణీయంగా ఉంటే వస్తువు వినియోగదారుడి దృష్టిని వెంటనే ఆకట్టుకుంటుంది. తద్వారా అమ్మకాలు పెరుగుతాయి. దీంతో కంపెనీలు ప్యాకేజింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సృజనాత్మకతతో విభిన్నమైన ప్యాకేజీలను సృష్టించాలనే ఆసక్తి ఉన్నవారు ప్యాకేజింగ్ కోర్సులను అభ్యసించవచ్చు. మనదేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) వివిధ ప్యాకేజింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. దీనికి హైదరాబాద్‌లోనూ శాఖ ఉంది. సైన్స్/టెక్నాలజీ/ఇంజనీరింగ్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అర్హులు. హైదరాబాద్‌లో జేఎన్ పాలిటెక్నిక్ కళాశాల ప్యాకేజింగ్ లో డిప్లొమా కోర్సును అందిస్తోంది. పాలిసెట్ ద్వారా ప్రవేశం ఉంటుంది. కెరీర్ స్కోప్: ప్రైవేట్ రంగంలోని అనేక సంస్థలు ప్యాకేజింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పేపర్, ప్లాస్టిక్ తయారీ యూనిట్లలో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రొడక్షన్, మార్కెటింగ్, పర్చేజ్, ఆర్ అండ్ డీ వంటి విభాగాల్లో ప్యాకేజింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్/ఆపరేటర్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్టు, ఇంజనీర్, సైంటిస్టు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ తదితర హోదాల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్యాకేజింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందొచ్చు. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పొందొచ్చు. తర్వాత అనుభవం, పనితీరును బట్టి అధిక వేతనాలు అందుకోవచ్చు. వివరాలకు: వెబ్సైట్: www.iip-in.com -
భూ ప్రకంపనం
రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదు 10 నుంచి 12 సెకన్ల పాటు కంపించిన భూమి భయంతో జనం పరుగులు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం రాత్రి 9.58 గం టల సమయంలో 10 నుంచి 12 సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. భవనాల్లో ఉన్న వారంతా కిందకు దిగిపోయారు. పలు ఇళ్లల్లో వస్తువులు, గృహోపకరణాలు కదిలాయి. తమ గృహాలు కంపించడానికి ముందు బుల్డోజర్తో ఢీకొన్నట్టు శబ్ధం వచ్చిందని పలువురు చెప్తున్నారు. నగరంతో పాటు జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఏజెన్సీ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. పది నుంచి పన్నెండు సెకన్ల పాటు భూమి కంపించింది. చాలా చోట్ల ప్రహరీలు, ఇంటి గోడలు పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. దీంతో అర్ధరాత్రి దాటినా.. చాలా మంది ఇళ్లల్లోకి వెళ్లేందుకు సాహసించలేకపోయారు. రోడ్లపైనే గంటల తరబడి పడిగాపులుకాశారు. ఈ స్థాయి ఇదే తొలిసారి విశాఖకు ఈశాన్యంగా సుమారు 550 కి.మీ. దూరంలో బంగాళాఖాతంలో 18.24 ఉత్తర అక్షాంశం, 87.95 తూర్పు రేఖాంశాల మధ్య 5 కి.మీ. లోతున భూకంప కేంద్రం సంభవించినట్టు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్‌కాయిసెస్) తన వెబ్సైట్లో వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్ర 5.8గా నమోదైనట్టు పేర్కొంది. గతంలో నగరంలో భూమి కంపించినా.. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2-3 పాయింట్లకు మించి లేదని నిఫుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏర్పడ్డ భూ కంప కేంద్రం కూడా నగరానికి చాలా దూరంగా ఉండడంతో ముప్పు తప్పిందన్నారు. -
‘అమ్మహస్తం’..అస్తవ్యస్తం
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: పేదలకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చే స్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం..వాటిని పూర్తిస్థాయిలో పం పిణీ చేయడంలో విఫలమైంది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అన్ని సరుకులను పంపిణీ చేయలేకపోయారు. మూడునెలల పాటు ప్రభుత్వం ప్రకటించిన తొ మ్మిది సరుకుల్లో సగం పంపిణీ కాలేదు. తొమ్మిది సరుకుల్లో అప్పుడప్పుడు గో ధుమలు, చక్కెర, చింతపండు మాత్రమే పంపిణీ చేసి మిగతా వాటిగురించి పట్టించుకోవడం లేదు. వచ్చిన అరకొర వస్తువులు కూడా నాణ్యత లేకపోవడం తో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తిచూపడం లేదు. కొందరు లబ్ధిదారులు విధిలేని పరిస్థితుల్లో నాసిరకమైన వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ చెల్లించే ధరకే బయటమార్కెట్లో నాణ్యమైన సరుకులు వస్తున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నా రు. అమ్మహస్తం పథకం అమలుచేసిన నాటి నుంచి లబ్ధిదారులకు అందాల్సిన కిరోసిన్, గోధుమలు, చక్కెరకోటాను పూర్తిగా తగ్గించారు. అమ్మహస్తం ద్వారా కంటే గతంలో పంపిణీచేసిన సరుకులే నాణ్యతగా ఉండేవని లబ్ధిదారులు పే ర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పామోలిన్ ఆయిల్‌ను తగ్గించి..కేవలం పట్టణప్రాంతాల్లో మాత్రమే ఇస్తున్నారు. నూనె, బియ్యం ఉంటే చెక్కర, కంది పప్పు రాదు. ఇక గోధుమ పిండి ప్యాకెట్లో 200 గ్రాముల వరకు పొట్టు కలిసి వస్తోందని లబ్ధిదారులు పెదవివిరుస్తున్నారు. సబ్సిడీ ఇలా.. ‘అమ్మహస్తం’ ద్వారా లబ్ధిదారులు పెద్దఎత్తున లబ్ధిపొందుతారంటూ ప్రభుత్వం ఊదరగొట్టింది. తొమ్మిది సరుకులకు ఒక్కో లబ్ధిదారుడిపై ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ.7.78 మాత్రమే. సరుకుల వారీగా ఉప్పుపై 0.91 పైసలు, కారంపొడిపై రూ. 3.75, చింతపండుపై రూ.4.25 (మొత్తం కలిపి రూ. 8.91) సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. అయితే పసుపుపొడి మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధర కంటే అదనంగా రూ.1.13ను లబ్ధిదారుపై భారంమోపి వసూలుచేస్తున్నారు. పసుపును మినహాయిస్తే ఒక్కోలబ్ధిదారుపై ప్రభుత్వం కేవలం రూ.7.78 మాత్రమే సబ్సిడీ అందజేస్తోంది. ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా అధికార పార్టీ నేతలు కేవలం ప్రచారానికే పరిమితమై లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. అమ్మహస్తం సరుకుల పంపిణీ ప్రక్రియ తలనొప్పిగా మారడంతో చాలామంది డీలర్లు డీడీలు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో తహశీల్దార్లు ఒత్తిడిచేసి డీడీలు కట్టించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 9 సరుకులు విక్రయిస్తే డీలర్‌కు వచ్చే కమీషన్ రూ.4.09 మాత్రమే వస్తుంది. వచ్చిన కమీషన్ మొత్తం సరుకుల దిగుమతి ఖర్చు, ఇతర ఖర్చులు పరిశీలిస్తే ఇంకా తమ చేతినుంచే డబ్బులు ఖర్చవుతోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అమ్మహస్తం పథకం ద్వారా నాణ్యవంతమైన సరుకులను పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
రేషన్ అందటం లేదని ఆందోళన
కోటబొమ్మాళి,న్యూస్‌లైన్: తమకు మూడు నెలలుగా రేషన్ సరుకులు అందడంలేదని కురుడు పంచాయతీ బావాజీపేట గ్రామస్తులు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తహశీల్దార్ ప్రవల్లికప్రియ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా ఆమెకు సమస్యను వివరించా రు. రేషన్ సరుకులు ఇవ్వాలని కోరితే .. ఇచ్చేదిలేదని, దిక్కున్నచోట చెప్పుకోండంటూ డీలర్ తండ్యాల లలితకుమారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డిపో పరిధిలో సుమారు వంద తెలుపుకార్డులున్నాయని, రేషన్ సరుకులు అందకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామ ని తెలిపారు. తహశీల్దార్ స్పందిస్తూ సీఎస్డీటీతో దర్యాప్తు జరిపించి డీలర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.