ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్ కార్డులకు సరుకులు
కొత్త రేషన్ కార్డులను ఫిబ్రవరి నెల నుంచి సరుకులు అందజేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కృష్ణారెడ్డి తెలిపారు.
నంద్యాలరూరల్: కొత్త రేషన్ కార్డులను ఫిబ్రవరి నెల నుంచి సరుకులు అందజేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం నంద్యాల టెక్కెమార్కెట్ యార్డు ఆవరణంలోని సివిల్ సప్లయ్ గోదామును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డీలర్ల వద్ద మిగిలిన సంక్రాంతి చంద్రన్న కానుకలు వెనక్కు అందజేయాలన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో మిగిలిన ఆయిల్, కందిపప్పును ఉచితంగా ఐసీడీఎస్‌కు, శనగ పప్పు, గోధుమపిండి, నెయ్యి, బెల్లంస్టాక్‌ను.. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు ఉచితంగా అందివ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు సివిల్ సప్లయ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ గోదాము ఇన్‌చార్జి రామాంజనేయులు తదితరులు ఉన్నారు.