civil supply
-
బియ్యం డోర్ డెలివరీకి 8న ట్రయల్‌రన్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయనున్న నేపథ్యంలో సోమవారం మొబైల్ యూనిట్ల ట్రయల్‌రన్ చేయనున్నారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు హామీ ఇచ్చారు. (మైనార్టీల జీవితాల్లో ఆర్థిక వెలుగు) ఈ హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు బియ్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేకంగా మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే తయారు చేసిన కొన్ని యూనిట్లను ఈ నెల 8న ట్రయల్ రన్ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 13,370 మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లను పిలుస్తామని తెలిపారు. నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ విధానం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. (ఏపీ ప్రభుత్వ పథకాలకు జాతీయస్థాయి ప్రశంసలు) మొబైల్ యూనిట్ వల్ల ప్రయోజనం... ► ఇందులోనే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ఉంటుంది. ► మొబైల్ యూనిట్ల ద్వారా ఇంటికివెళ్లి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తారు. ► లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్ ఓపెన్ చేసి రేషన్ ఇస్తారు. ► బియ్యం తీసుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగులను ముందే ఇవ్వనున్నారు. -
కోవిడ్ ఎఫెక్ట్ అద్దెలపైనా ప్రభావం...
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ కలకలం నేపథ్యంలో నగరంలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ అనూహ్యంగా తగ్గుతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా ఉన్న రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఏటా పలు దేశీయ, అంతర్జాతీయ స్థాయి బహుళ జాతి కంపెనీలు క్యూ కడతాయి. ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటుచేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దశాబ్దాలుగా వస్తున్న ఈ పరిణామం కరోనా కారణంగా తారుమారయ్యే ప్రమాదం పొంచి ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2019)లో సుమారు పది లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కావాలని పలు కంపెనీలు నగరానికి తరలి వచ్చాయి. ఈ ఏడాది ముగిసేనాటికి ఈ డిమాండ్ సగానికి అంటే ఐదు లక్షల చదరపు అడుగులకు పడిపోయే అవకాశాలున్నట్లు అంచనా వేస్తుండడం గమనార్హం. లాక్డౌన్ కారణంగా మన రాష్ట్రం, దేశంతోపాటు విశ్వవ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిన విషయం విదితమే. మరో ఆరు నెలలపాటు పలు కంపెనీల విస్తరణపై ఈ ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫీస్ స్పేస్‌ల అద్దెలు సైతం 10 నుంచి 15 శాతం తగ్గుముఖం పట్టే అవకాశాలుంటాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ సవిల్స్ ఇండియా సంస్థ తాజా అధ్యయనంలో తేలడం గమనార్హం. అద్దెలపైనా ప్రభావం... ప్రస్తుతం గ్రేటర్‌సిటీలో ఆఫీస్ అద్దెలు నెలకు ప్రతి చదరపు అడుగుకు రూ.55 నుంచి రూ.65 వరకు ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలోని ఏ గ్రేడ్ వాణిజ్య స్థలానికి నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ.75 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో వీటి అద్దెలు ప్రస్తుత తరుణంలో ఉన్న ధర కంటే సుమారు 10 నుంచి 15 శాతం మేర తగ్గుతాయని సవిల్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్ అధికంగా ఉండని కారణంగానే అద్దెలు తగ్గుముఖం పడతాయని..డిమాండ్..సప్లై సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఈ ఏడాది గ్రేటర్ పరిధిలో అనిశ్చితికి గురైనప్పటికీ వచ్చే ఏడాది పురోగమిస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌పై తీవ్రం కోవిడ్ కలకలం, లాక్డౌన్ అనంతరం సుమారు 12 నెలల పాటు నగరంలో కమర్షియల్ స్పేస్‌లకు డిమాండ్ తగ్గే సూచనలు ఉన్నాయని సెరెస్ట్రా ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ కూడా అంచనా వేస్తోంది. పలు స్టార్టప్ కంపెనీలు, కోవర్కింగ్ స్పేస్ అద్దెకు తీసుకునే సంస్థలు, పలు బహుళ జాతి సంస్థలు కూడా ఈ ఏడాది చివరి వరకు నూతన ఆఫీస్ స్పేస్ కోసం అన్వేషించే అవకాశాలుండవని, తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటాయని ఈ సంస్థ అంచనా వేయడం గమనార్హం. పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోంకు పరిమితం చేసే అవకాశాలున్నాయని ఈ సంస్థ చెబుతోంది. అయితే రాబోయే మూడేళ్లలో నగరంలో పలు బహుళ జాతి కంపెనీలు తమ సంస్థల విస్తరణ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేస్తాయంటూ ఈ సంస్థ తెలపడం విశేషం. -
పుట్టు పూర్వోత్తరాలు చెప్పాల్సిందే..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? అయితే మీ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ చెప్పాల్సిం దే.. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉందా..? ఉంటే ఏ కంపెనీ..? బ్యాంకు ఖాతా ఉందా..? అయితే ఏ బ్రాంచ్..? మీకు వాహనం ఉందా..? ఉంటే బై కా? కారా.? అలాగే భూములున్నాయా..? ఎన్ని ఎకరాలు..? ఇలా ఒకటేంటి చివరి ఇంటికి వచ్చే కరెంట్ బిల్లుతో సహా 24 రకాల వివరాలను ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేదంటే రేషన్ కార్డు రాదు. ఇప్పటినుంచి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే సంబంధిత ఫార్మెట్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే కొ త్త రేషన్ కార్డుల్లో బోగస్ లేకుండా అర్హులైన పేదలకే అందించడానికి సివిల్ సప్లయ్ శాఖ అధికారులు నిబంధనలతో కూడిన మూడు పేజీలు ఉ న్న దరఖాస్తు ఫారాన్ని రూపొందించారు. ఈ కొ త్త ఫార్మాట్‌ను రాష్ట్ర అధికారులు జిల్లా సివిల్ స ప్లయ్ అధికారులకు పంపించారు. ఇకపై కొత్త గా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఇదే ఫారం ద్వారానే దరఖాస్తులు చేసు కోవాల్సి ఉంటుందని, అయితే దరఖాస్తులను సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయం లో అందజేయాలని అధికారులు వెల్లడించారు. తెల్ల కాగితానికి స్వస్తి.. రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలనుకునే వారు ఇది వరకు మీసేవా కేంద్రాల్లోనో లే దా తహసీల్దార్ కార్యాలయాల్లోనో తెల్ల కాగి తంపై దరఖాస్తు చేసుకుని ఆధార్ జిరాక్స్ పెడి తే పరిపోయేది. కానీ తాజా మార్గదర్శకాల ప్ర కారం ఇకపై తెల్ల కాగితాలపై దరఖాస్తులు చేసుకునే విధానానికి స్వస్తి పలికారు. కొత్తగా రూ పొందించిన మూడు పేజీలు గల దరఖాస్తు ఫా రాన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో పొందాల్సి ఉంటుంది. ఇందులో పేరు, ఇంటి పేరు, తండ్రి లేదా తల్లి పేరు, పుట్టిన తేదీ, వయసు, వీధి, కాలనీ, కుటుంబ వార్షిక ఆదాయం, గ్యాస్ కనెక్షన్, వాహనాల వివరాలు, భూ ములు, అద్దె, సొంత ఇంటి వివరాలతో పాటు అందులో ఉన్న మరిన్ని అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దరఖాస్తుచ చేసుకునే వా రికి ఇంటి పక్కన గల ఎవరైనా సాక్షి సంతకం కూడా పెట్టించాలి. అన్ని వివరాలతో తహసీల్దా ర్ కార్యాలయంలో అందజేస్తే వారు విచారణ జరిపి జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయానికి పం పిస్తారు. జిల్లా కార్యాలయం అధికారులు సివిల్ సప్లయ్ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ కు రేషన్ కార్డు మంజూరుకై పంపిస్తారు. ఈ ప్రా సెస్ అంతా పూర్తయి కార్డు మంజూరు కావాలం టే సుమారు పక్షం రోజుల నుంచి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. పెండింగ్ దరఖాస్తులుదారులు కూడా.. కొత్త రేషన్ కార్డు కోసం జిల్లాలో గత కొన్ని నెలలుగా దరఖాస్తులు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా దాదాపు 6వేల దరఖాస్తులు మంజూరు కాక పెండింగ్‌లోనే ఉన్నాయి. వీరంతా మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. కానీ కొత్త దరఖాస్తు విధానం వచ్చిన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తు దారులు కూ డా కొత్త ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. కాని సాధారణ ప్రజలకు ఈ పద్ధతి ఎంతవరకు అర్థమవుతుందో చూడాలి. కొత్త విధానంలో దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్ర శాఖ అధికారులు రూపొందించిన దరఖా స్తు ఫారం ద్వారానే కొత్త రేషన్ కార్డుల కోసం ద రఖాస్తులు చేసుకోవాలి. తెల్ల కాగితాలపై రాసి ఇస్తే చెల్లదు. అందులో అడిగిన వివరాలతో త హశీల్ధా కార్యాలయాల్లో అందజేయాలి. కొత్త ద రఖాస్తు ఫారాలను తహసీల్దార్ కార్యాలయాల కు పంపిస్తున్నాం. – కృష్ణప్రసాద్, డీఎస్వో -
వీరింతే.. మారరంతే
♦ గోడౌన్లలో రేషన్ బియ్యం పరిశుభ్రత గాలికి ♦ ఉండలు కట్టి, పురుగు పట్టిన బియ్యమే సరఫరా ♦ అంగన్వాడీలు, విద్యార్థులకూ అవే దిక్కు ♦ మామూళ్ల మత్తులో అధికారులు బమోమెట్రిక్ వచ్చినా.. ఈ పోస్ పెట్టినా.. ఉన్నతాధికారులు హెచ్చరించినా.. తీరు మారలేదు. పేదోడి ఎండిన డొక్కలు నింపే రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆగలేదు. గోడౌన్లో సరుకు రేషన్ దుకాణాలకు చేరకుండానే నల్లబజారుకు తరలిపోతోంది. ఈ మధ్యలో జరుగుతున్నదంతా అవినీతి నాటకమే.. ఈ దోపిడీ నాటకంలో అధికార పార్టీ నేతలు తెర వెనుక సూత్రధారులైతే.. రేషన్ డీలర్లు పాత్రధారులు. ఇవన్నీ తెలిసినా కళ్లప్పగించి చూస్తూ మామూళ్ల మత్తులో జోగే అధికారులు ప్రేక్షకులు. ఇదీ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ తీరు.. కాదు కాదు దోపిడీకి గురవుతున్న నిరుపేదల ఆకలి కన్నీరు. సాక్షి, అమరావతి బ్యూరో : సివిల్ సప్లయ్స్ అధికారుల తీరు మారలేదు. జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా గత నెలలో సివిల్ సప్లయ్స్ అధికారులు, గోడౌన్ ఇన్చార్జిలు, సీఎస్ డీటీలతో సమావేశం ఏర్పాటు చేసి పనితీరు మార్చుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాలేదు. గుంటూరు నగరంలో పలు రేషన్ షాపులకు తూకాలు వేయకుండానే డీలర్లకు సరుకు పంపారు. కొన్ని వాహనాలకు జీపీఎస్ లేకుండానే బియ్యాన్ని తరలించారు. గోడౌన్లలో పరిశుభ్రతను గాలికొదిలేశారు. గుంటూరు, తెనాలిలలోని గోడౌన్లలో బియ్యం పురుగు పట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. గోడౌన్లలో లీకేజీలు, ప్యూమిగేషన్ షెడ్యూల్ గురించి సిబ్బంది మరిచిపోయారు. గోడౌన్ల నుంచే నేరుగా సరుకు నల్ల బజారుకు తరలుతున్నా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఆ తరువాత డీలర్లు, కార్డుదారులతో గుర్తు వేయించుకొని, బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి పంపుతున్నారు. తూకాలలో తేడాలు గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తారని డీటర్లు భయపడిపోతున్నారు. అధికారులు కొన్ని షాపులు తనిఖీ చేసిన బియ్యం తక్కువ నిల్వలు ఉన్నట్లు తెలిసింది. మార్క్ లేకుండానే బియ్యం సరఫరా గోడౌన్లలో ఉన్న బియ్యంలో కొద్దిగా మెరుగ్గా ఉన్న బియ్యం సంచులను పక్క తీసి, వాటికి ప్రత్యేకంగా మార్క్ చేయాలి. ఆ విధానం గుంటూరు నగరం పరిధిలోని గోడౌన్లో అమలు కావటం లేదు. కార్డుదారులకు ఇచ్చే బియ్యానే అంగన్వాడీలకు పంపుతున్నారు. మ««ధ్యాహ్న భోజనం, హాస్టల్ విద్యార్థులకు అవే బియ్యాన్ని అంటగడుతున్నారు. ఇవి పురుగుపట్టి, ఉండలు కట్టి ఉంటున్నాయి. గుంటూరు పరిసరాలలోని గౌడౌన్లలో జరిగిన అవకతకలపై ఇటీవలే డీటీలపై చర్యలు తీసుకొన్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తనిఖీలు చేస్తున్నాం ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలయ్యేందుకు తనిణీ చేస్తున్నాం. వీలైనంత వరకు అంగన్వాడీ కేంద్రాలకు మార్క్ చేసిన బియ్యాన్నే డీలర్లకు పంపుతున్నాం. ఎక్కడైనా నాణ్యతలేని బియ్యం వస్తే వాటిని రీ ప్లేస్ చేస్తాం. అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు తప్పవు. – చిట్టిబాబు, డీఎస్వో, గుంటూరు -
17 నుంచి రంజాన్ తోఫా
కర్నూలు(అగ్రికల్చర్): రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకొని ముస్లిం కార్డుదారులకు రంజాన్ తోఫా అందజేయనున్నారు. 2.02 లక్షల మంది ముస్లిం కార్డుదారులకు తోఫా కానుకలను ఈ నెల 17 నుంచి పంపిణీ చేయనున్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా కార్డుల వివరాలను తహసీల్దార్లకు పంపారు. ఇందులో అనర్హులు ఉన్నారా... లేదా అర్హత కలిగిన ఏ కుటుంబమైనా లేదా అనేదానిని పరిశీలించాల్సి ఉంది. రంజాన్ తోఫా కింద 5కిలోల గోదుమ పిండి, 2 కిలోల చక్కెర, 1కిలో సేమియా, 100 ఎంఎల్ నెయ్యి ఇస్తారు. అన్ని ప్రత్యేక ప్యాకెట్లలోనే ఉంటాయి. వీటిని ఒక బ్యాగ్‌లో వేసి ఇస్తారు. ఇప్పటి వరకు స్టాక్ పాయింట్లకు 60 శాతం సరుకులు వచ్చాయని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ తెలిపారు. ఈ– పాస్ మిషన్ల ద్వారానే కార్డుదారులకు పంపిణీ చేస్తారు. -
ప్రజా పంపిణీ 81.47 శాతం పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మే నెలకు సంబంధించి ప్రజాపంపిణీ కార్యక్రమం సోమవారం నాటితో ముగిసింది. 81.41 శాతం కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. జిల్లాలో 2,423 చౌకదుకాణాలు ఉండగా 11,48,970 రేషన్ కార్డులు ఉన్నాయి. రాత్రి 8 గంటల çసమయానికి 9,36,092 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 2,75,525 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో నగదు రహితంపై సరుకుల పంపిణీ కొంత వరకు పెరిగింది. సంజామల మండలంలో అత్యధికంగా 64.01శాతం, బేతంచెర్ల మండలంలో 60.81 శాతం కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. కోవెలకుంట్ల, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు మండలాల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అతి తక్కువగా ప్యాపిలి మండలంలో కేవలం 2.931శాతం కార్డులకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహించారు. -
ప్రజా పంపిణీ 81.41 శాతం పూర్తి
– 2,21,258 కార్డులకు నగదు రహితంపై సరుకులు – అత్యధికంగా బేతంచెర్ల మండలంలో నగదురహిత లావాదేవీలు కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రజా పంపిణీ కార్యక్రమం శనివారం నాటితో ముగిసింది. 81.41 శాతం కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. జిల్లాలో 2,423 చౌకదుకాణాలు ఉండగా.. 11,90199 రేషన్ కార్డులు ఉన్నాయి. సాయంత్రం 7గంటల సమయానికి 9,36,419 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 2,21,258 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో నగదు రహితంపై సరుకుల పంపిణీ గణనీయంగా పెరిగింది. బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 60.86 శాతం కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. కోవెలకుంట్ల, సంజామల, పగిడ్యాల, ఓర్వకల్లు మండలాల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అతి తక్కువగా ఎమ్మిగనూరు మండలంలో 3.41శాతం కార్డులకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహించారు. ఈ మండలంలో 45,603 రేషన్ కార్డులు ఉండగా 37,816 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 1,558 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. -
పుల్లమ్మకు రూ.లక్ష బహుమతి
- నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ప్రోత్సాహకం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీలో నగదు రహిత లవాదేవీలు నిర్వహించిన మహిళకు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి లభించింది. ప్రజాపంపిణీలో నగదు రహితాన్ని ప్రోత్సహించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రతి నెలా ప్రోత్సాహక బహుమతులను ప్రకటిస్తోంది. డిప్ ద్వారా కార్డుదారులను ఎంపిక చేస్తోంది. మార్చి నెలలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వారిలో లాటరీ ద్వారా విజయవాడలో శనివారం కార్డుదారులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో నందికొట్కూరు మండలం కొనిదెల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చందమాల పుల్లమ్మ( కార్డు నెంబరు డబ్ల్యూఏపీ 130802000313)కు రూ.లక్ష నగదు బహుమతి లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రం మొత్తం మీద 5వేల మంది కార్డుదారులు స్మార్ట్ఫోన్లకు ఎంపిక కాగా ఇందులో జిల్లాకు సంబంధించి 330 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. నగదు రహితంలో కర్నూలు జిల్లా ఫస్ట్ ప్రజాపంపణీలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. శనివారం సాయంత్రానికి 19,046వేల కార్డులకు సరుకులు ఇవ్వగా నగదు రహితంపై 4,797 కార్డులకు సరుకులు పంపిణీ చేశారు. -
డీలర్లకు తూకం సరకులు
–జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ కర్నూలు(అగ్రికల్చర్): పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ పాయింట్లలో డీలర్లకు సరుకులు విధిగా కాటా వేసి ఇవ్వాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా స్టాక్ పాయింట్ ఇన్‌చార్జీలకు ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ తెలిపారు. ఆయన బుధవారం సాక్షితో మాట్లాడుతూ... తాను ఇటీవలనే జిల్లా మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నానన్నారు. వచ్చిన వెంటనే డీలర్లకు సరుకులను తూకం వేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో 2,423 చౌక ధరల దుకాణాలు ఉండగా ఏప్రిల్ నెలకు సంబందించి 90 శాతం షాపులకు సరుకులు చేర్చినట్లు తెలిపారు. మిగిలిన షాపులకు 30వ తేదీ సాయంత్రానికి చేరుతాయన్నారు. చక్కెర కొంత ఆలస్యమైనా.. అన్ని కార్డులకు విడుదల అయిందని వివరించారు. చౌకదుకానికి సరుకులు చేరినట్లు డీలర్లు..ఈ–పాస్ మిషన్‌పై వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. -
ఇక పకడ్బందీగా పీడీఎస్
హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసే సరుకుల దుర్వినియోగానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో అడ్డుకట్టపడుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఆయన పౌర సరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఇందులో ఏర్పాటు చేసిన 210 అంగుళాల వెడల్పు, 72 అంగుళాల ఎత్తు ఉన్న భారీ వీడియో వాల్‌ను ఆయన ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వీడియో వాల్ అని తెలిపారు. ఈ కేంద్రంలో ఉండే అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ బియ్యం వాహనాల కదలికలను గోదాముల నుంచి ప్రారంభమై రేషన్ దుకాణాలకు చేరేదాకా పరిశీలించే వీలుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి వీడియో విధానాన్ని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టరేట్లలో అందుబాటులోకి తేనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రేషన్ సరుకులను సరఫరా చేసే వాహనాల్లో జీపీఎస్ సిస్టంను, గోదాముల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ చేసే 1383 వాహనాలను, 46 కిరోసిన్ ట్యాంకర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రేషన్‌కార్డు దారులకు సరుకులు సక్రమంగా అందేలా చర్యలను తీసుకుంటామన్నారు. త్వరలోనే మొత్తం 17,500 స్వైపింగ్ మెషిన్లను పౌరసరఫరాల దుకాణాల్లో అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. శాఖ పనితీరును మెరుగు పర్చటం, దళారుల జోక్యం నివారించటానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు చీఫ్ సెక్రటరీ ఎస్.పి.సింగ్ తెలిపారు. -
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిద్దాం
- డీలర్ల అవగాహన సదస్సులో ఎల్డీఎం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో వందశాతం నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టాలని ఎల్డీఎం నరసింహారావు సూచించారు. నగదు రహిత లావాదేవీలపై చౌకధరల దుకాణాల డీలర్లకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పినో కంపెనీ, ఐజీఎస్ ఇంటిగ్రాస్ కంపెనీలు ప్రజాపంపిణీలో నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు సాంకేతిక సహకారం ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తున్నట్లు ఎల్డీఎం తెలిపారు. నగదు ప్రమేయం లేని లావాదేవీలు వంద శాతం అమలు కావాలంటే కార్డుదారుల బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబరుతో అనుసంధానించాలన్నారు. బ్యాంక్ సర్వర్‌ను ఎన్ఐసీ సర్వర్‌తో లింకప్ చేయడం ద్వారా ఈ-పాస్ మిషన్ ద్వారానే నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు. కార్డుదారులు ఈ-పాస్ మిషన్‌లో వేలిముద్ర వేస్తే బ్యాంకు ఖాతా వివరాలు వస్తాయని తెలిపారు. సరుకులు, వాటి ధరలను బట్టి వెంటనే బిల్లు జనరేట్ అవుతుందని, దాని ప్రకారం అమౌంటు కార్డుదారుని ఖాతా నుంచి డీలరు ఖాతాకు జమ అవుతుందని వివరించారు. జిల్లాలో 1556 మంది డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించినట్లు వివరించారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ ఎఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, పినో కంపెనీ ప్రతినిధి చంద్రమోహన్ నాయుడు, ఐజీఎస్, ఇంటిగ్రాస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్‌తోపాటు మోదీ బొమ్మ కూడా ముద్రించాలి’
భువనగిరి: రాష్ట్రంలో పేద ప్రజలకు రేషన్ సరుకులు కూడా సరిగ్గా అందటం లేదని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు రేషన్ కార్డులను ముద్రించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ముద్రించబోయే వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంటే ప్రధానమంత్రి మోదీ చిత్రం కూడా ముద్రించాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషి వల్లే తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలు విద్యుత్ కొరత లేకుండా ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ.50 వేల కోట్ల జాతీయ రహదారుల నిర్మాణం కేంద్రప్రభుత్వం చేపట్టిందని వివరించారు. హైదరాబాద్ చుట్టూ పది జిల్లాలను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో వేసేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షకు పైగా పక్కా ఇళ్లను పేదలకోసం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి ఇళ్లను కూడా కేటాయించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపించారు. ఎయిమ్స్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ తరఫున నివేదించగా సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు. -
ఈ..ఫార్స్!
- ఈ-పాప్ విధానంలో లోపాలు - కొనసాగుతున్న అక్రమాలు - పక్కదారి పడుతున్న సరుకులు - పేదలకు అందని రేషన్ - కొందరు డీలర్ల చేతివాటం - అరికట్టలేకపోతున్న ప్రభుత్వం జిల్లాలో రేషన్ కార్డులు: 10.76 లక్షలు జనవరి నెలలో కొత్తగా వచ్చినవి : 87 వేలు డిసెంబర్, జనవరి నెలల్లో రేషన్ పంపిణీ : 90 శాతం గతంలో 80 శాతం ప్రజాపంపిణీ ఉండేది కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఈ- పాస్ విధానం అపహాస్యమవుతోంది. పేదలందరికీ రేషన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానం కొందరు డీలర్లకు కాసుల పంట పండిస్తోంది. జిల్లాలో అక్రమాలకు పాల్పడుతూ 149 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారంటే కుంభకోణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మంది డీలర్లు సస్పెండ్ అయినా ఈ-పాస్ తీరులో మార్పు రాలేదు. ఇప్పటికీ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలలతో పోలిస్తే డిసెంబరు, జనవరి నెలల్లో 3000 కార్డులకు పైగా ఎక్కువగా సరుకులు పంపిణీ కావడం విమర్శలకు తావిచ్చింది. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసి రేషన్ సరుకులను కొల్లగొట్టిన వ్యవహారం అక్టోబర్ నెలలో వెలుగు చూసింది. ఇప్పటికీ ఈ వ్యవహారం నడుస్తోంది. అదెలాగంటే.. రెండేళ్ల క్రితం ఆధార్ నంబర్లతో రేషన్ కార్డులను అనుసంధానం చేశారు. ఈ బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు అప్పగించారు. డీలర్లు ఈ కార్యక్రమంలో అడ్డుగోలుగా వ్యవహరించారు. ఆధార్ కార్డు దొరికితే చాలు తమ దగ్గర ఉన్న కార్డులకు లింకప్ చేసుకున్నారు. ఆధార్ కార్డు నంబర్ల కోసం జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల కొత్త ఎత్తుగడలు వేశారు. ఎన్ఐసీ ప్రధాన సర్వర్ నుంచే అధార్ లింకప్ను తమ వద్ద ఉన్న రేషన్ కార్డులతో లింకప్ చేసుకున్నారు. ఆన్లైన్లో వివరాలు చూసుకున్న కొందరు ప్రజలు.. తమ రేషన్ కార్డుకు వేరొకరి ఆధార్ కార్డు లింకప్ కావడంతో తప్పులను సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ అందకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి ఫిర్యాదులు ప్రస్తుతం డీఎస్ఓ, ఎఎస్‌ఓ, తహసీల్దారు కార్యాలయాల్లో వేలాదిగా ఉన్నాయి. కర్నూలులో వారిదే హవా.. ఈ పాస్ కుంభకోణంలో ఇటీవల కర్నూలులో నూరు మంది డీలర్ల సస్పెండ్ అయ్యారు. వారి స్థానంలో ఇన్చార్జీలను నియమించారు. అయితే చాల వరకు సస్పెండ్ అయిన డీలర్లే సరుకులు పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అక్రమాలు ఇవీ.. కర్నూలుకు చెందిన కళావతికి వైఏపీ 1382065ఎ0141 నంబరు రేషన్ కార్డు ఉంది. ఆధార్ నెంబరు 534513319754. ఆరు నెలల క్రితం వరకు ఎలాంటి సమస్య లేదు. ఇపుడు అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన డబ్ల్యూఏపీ 1286026ఎ0199 రేషన్ కార్డుకు కళావతి ఆధార్ నెంబరు లింకప్ అయింది. పత్తికొండ ప్రాంతానికి చెందిన కురువ హనుమన్న రేషన్ కార్డు నెంబరు డబ్ల్యూఏపీ 135103600049. ఆధార్ నెంబరు 852236000236. ఇటీవలి వరకు ఇక్కడే కార్డు ఉంది. కాని ఉన్నట్టుండి విశాఖపట్టణం జిల్లాకు చెందిన కార్డుకు ఈ ఆధార్ కార్డు అనుసంధానం అయింది. బోయ అనంతయ్యకు పత్తికొండలో రేషన్ కార్డు ఉంది. కార్డు నంబరు డబ్ల్యూఏపీ 135102200162. ఆధార్ నంబరు 296480428799. ఇపుడు ఈ ఆధార్ కార్డు నెల్లూరు జిల్లాకు రేషన్ కార్డుకు అనుసంధానం అయింది. -
ప్రజాపంపిణీలో అక్రమాలు
- డోన్‌లో ముధుసూదన్ గుప్త బినామీలే డీలర్లు -2వేల రేషన్ కార్డులు వస్తే కొందరికే ఇచ్చారు - ఆహార సలహా సంఘం సమావేశంలో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలు పెరిగిపోయని, నిజాయితీగా వ్యవహరించే డీలర్లపై వేధింపులు అధికమమ్యాయని ఏపీసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా ఆహార సలహా సంఘం సమావేశం జేసీ హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో మూడేళ్లుగా ఏ మండలంలోనూ ఆహార సలహా సంఘం సమావేశాలు జరిగిన దాఖలాలు లేవన్నారు. డోన్ పట్టణంలో 4, 7, 10, 17, 68 చౌకదుకాణాలకు మధుసూదన్ గుప్త అనే వ్యక్తి డీలరుగా ఉన్నారని, ఈయన పేరుతో బినామీలు డీలర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి నెలా ఒకరు సరుకులు పంపిణీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పట్టణంలో 27 మంది డీలర్లు ఉండగా సగం మందిని వేధిస్తున్నారని, గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేనట్లుగా చూపి కిరోసిన్ వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. డోన్ మున్సిపాలిటీకి కొత్తగా 2000 రేషన్ కార్డులు వస్తే కొందరికి మాత్రమే ఇచ్చారన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ..ఒకే వ్యక్తి ఆరు షాపులను నిర్వహించడంపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ప్రతి రెండు నెలలకోసారి విధిగా ఆహార సలహా సంఘం సమావేశం నిర్వహిస్తామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించండి ఈ–పాస్ కుంభకోణాన్ని బయటపెట్టిన కారణంగానే డీలర్ వెంకటేష్గౌడును హత్య చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని కమిటీ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ నేత తోట వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు తీర్మానం చేసి ఎస్పీకి పంపుదామని జేసీ తెలిపారు. కోడుమూరులో డీలర్ల దగ్గర బోగస్ కార్డులు ఉన్నాయని, ధనవంతులకు రేషన్ కార్డులు ఇచ్చారని కోడుమూరుకు చెందిన కమిటీ సభ్యుడు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఉల్లిని నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మించాలని జెడ్పీ మాజీ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి కోరారు. కర్నూలు కొత్త బస్టాండులో అన్ని వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నారని జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ విజయకుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటు, కొత్త బస్టాండు ప్రాంతాల్లోని రైస్ మిల్లులు, కారం, పసుపు, దాల్ మిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, కల్తీలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత నరసింహులు యాదవ్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తెలుపగా జేసీ స్పందిస్తూ విచారణ జరిపిస్తామని తెలిపారు. సమావేశంలో డీఓస్ఓ శశీదేవి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ ఏడీ రఘునాథరెడ్డి, కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు సత్యనారాయణ, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్ కార్డులకు సరుకులు
నంద్యాలరూరల్: కొత్త రేషన్ కార్డులను ఫిబ్రవరి నెల నుంచి సరుకులు అందజేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం నంద్యాల టెక్కెమార్కెట్ యార్డు ఆవరణంలోని సివిల్ సప్లయ్ గోదామును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డీలర్ల వద్ద మిగిలిన సంక్రాంతి చంద్రన్న కానుకలు వెనక్కు అందజేయాలన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో మిగిలిన ఆయిల్, కందిపప్పును ఉచితంగా ఐసీడీఎస్‌కు, శనగ పప్పు, గోధుమపిండి, నెయ్యి, బెల్లంస్టాక్ను.. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు ఉచితంగా అందివ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు సివిల్ సప్లయ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ గోదాము ఇన్చార్జి రామాంజనేయులు తదితరులు ఉన్నారు. -
డీలర్లు.. వేషాలు
సరుకుల పంపిణీలో అక్రమాలు - ప్రదక్షిణలు చేస్తున్న కార్డుదారులు - సరుకులు అయిపోయాయనే సమాధానంతో సరి - 15 వరకు షాపులు తెరవాలనే నిబంధనకు పాతర - ప్రజాపంపిణీలో యథావిధిగా దందా కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడని పరిస్థితి. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో డీలర్లు చేతివాటం చూపుతున్నారు. చౌక దుకాణాలను ప్రతి నెలా 15 వరకు తెరిచి ఉంచాలనే నిబంధనను గాలికొదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్డుదారులు రేషన్ షాపులు చుట్టూ తిరుగుతున్నా సరుకులు అందకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2వేల మంది కార్డుదారులు డీలర్ల నిర్లక్ష్యంతో రేషన్ సరుకులు పొందలేకపోయారు. కర్నూలులోనే వందలాది మంది కార్డుదారులు డీలర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. చంద్రన్న సంక్రాంతి కానుకల విషయంలోనూ ఇదే పరిస్థితి. కానుకల పంపిణీకి మొదట ఈ నెల 12 వరకు మాత్రమే అవకాశం కల్పించారు. అయితే చాలా మంది కార్డుదారులు పొందలేకపోవడంతో ఈ నెల 15 వరకు పంపిణీ చేసేలా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాలు వందలాది షాపుల్లో అమలుకు నోచుకోలేదు. కొత్త కార్డులకు కానుకలు ఇవ్వాల్సి ఉండగా 30శాతం కార్డుదారులకు నిరాశే మిగిలింది. ప్రజా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఈ–పాస్ మిషన్లను తీసుకొచ్చినా యథావిధిగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 149 మంది డీలర్లు ఈ–పాస్ మిషన్లనే బైపాస్ చేసి రేషన్ సరుకులను కొల్లగొట్టారు. ఇలాంటి డీలర్లు కర్నూలులోనే 100 మంది ఉన్నారు. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసిన కుంభకోణంలో 149 మంది డీలర్లను సస్పెండ్ చేసి వారి స్థానాల్లో ఇన్చార్జి డీలర్లను నియమించినా అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. సర్వర్‌కు లాక్ చేశారు.. ఇక అక్రమాలకు తావుండదని చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత కార్డుదారులు ఏ చౌకదుకాణం నుంచి అయిన సరుకులు తీసుకోవచ్చు. దీనినే పోర్టబులిటీగా వ్యవహరిస్తారు. చౌక దుకాణాలకు సరకులను కార్డుల సంఖ్యను బట్టి కేటాయిస్తున్నారు. పోర్టబులిటీ ప్రకారం డీలర్లకు సరుకులు ఇవ్వడం లేదు. నిబం«ధనల ప్రకారం ఈ నెల 15 వరకు షాపులను తెరచి ఉంచి కార్డులన్నింటికీ సరుకులు ఇవ్వాల్సి ఉంది. 15వ తేదీ వరకు సరుకులు ఇస్తారు కదా అని.. వారం, 10 రోజుల తర్వాత వెళ్లిన కార్డుదారులకు డీలర్లు మొండిచెయ్యి చూపుతున్నారు. సరుకులు అయిపోయినాయంటూ వెనక్కి పంపుతుండటం గమానార్హం. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత బియ్యం సరుకులు అయిపోయాయి అనే ప్రశ్నే రాదు. 15 వరకు సరకులు అలాగే ఉంచాలి. తర్వాత బ్యాక్లాగ్ చూపాల్సి ఉంది. కొందరు డీలర్లు పోర్టబులిటీ పేరుతో అదే షాపు పరిధిలోని కార్డుదారులకు మొండి చేయి చూపుతుండగా, మరికొందరు పోర్టబులిటీతో సంబంధం లేకుండానే సరకులు లేవు.. అలస్యంగా వచ్చారు.. అయిపోయాయి.. అంటూ వెనక్కి పంపుతుండటంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. షాపునకు ఉదయం పోతే సాయంత్రం రమ్మని, సాయంత్రం పోతే ఉదయం రమ్మని ఇలా రెండు మూడు రోజులు తిప్పుకొని తీరా సరకులు లేవు.. అయిపోయినాయని చెబుతుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసే అక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయనే విమర్శలకు బలం చేకూరుస్తోంది. అధికారికంగా పోర్టబులిటీ లేదు. ఉంటే ఆ విధంగా షాపులకు సరకులు కేటాయిస్తారు. జిల్లాలో ఏ షాపునకు పోర్టబులిటీ ప్రకారం సరకులు ఇవ్వడం లేదు. కానీ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కార్డుదారులను తిప్పుకొని చివరికి డీలర్లు చేతులెత్తేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమాల్లో కొన్ని... – కర్నూలు నగరానికి చెందిన షేక్ మహమ్మద్‌కు ఆర్ఏపీ 138210834806 నెంబర్ రేషన్ కార్డు ఉంది. అయితే 130వ షాపు దగ్గరగా ఉండటంతో పోర్టబులిటీ కింద ఈ షాపులో సరకులు తీసుకుంటున్నారు. సరుకుల కోసం కార్డుదారుడు ఈ షాపు చుట్టూ తిరిగినా చివరకు సరుకులు అయిపోయినాయంటూ వెనక్కి పంపారు. 108వ షాపునకు సరుకుల కోసం వెళ్లగా అక్కడా మొండి చేయి చూపారు. ఇలా ఆయన జనవరి నెల సరుకులను కోల్పోయారు. – కర్నూలుకు చెందిన ఈడిగ రేవతికి 129వ షాపులో కార్డు ఉంది. కార్డు నెంబర్ డబ్ల్యూఏపీ 1382129బి0045. జనవరి నెల సరుకుల కోసం 129-2 షాపులోను, అటు పోర్టబులిటీ కింద సరుకులు తీసుకునేందుకు 130 షాపునకు వెళ్లారు. పలు సార్లు తిప్పుకున్నా చివరకు సరుకులు అయిపోయాయంటూ వెనక్కు పంపించారు. – కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన వీరన్నగౌడుకు జేఏబీ 131803500036 నెంబర్ కార్డు ఉంది. అయితే పోర్టబులిటీ కింద కర్నూలులో సరుకులు తీసుకుంటున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకలను పోర్టబులిటీ కింద తీసుకునే అవకాశం లేదు. ఎక్కడ కార్డు ఉంటే అక్కడే కానుకలు తీసుకోవాల్సి ఉంది. కానుకల కోసం పెద్దపాడులోని డీలరు షాపునకు వెళితే నిరాకరించారు. -
18 నుంచి ప్రపంచ వినియోగదారుల వారోత్సవాలు
–డీఎస్ఓ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ప్రపంచ వినియోగదారుల వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి(డీఎస్ఓ) శశిదేవి తెలిపారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ...ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురష్కరించుకుని హైస్కూల్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియంలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. హైస్కూల్ విద్యార్థులకు డీఈఓ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కేవీఆర్ కళాశాల ప్రిన్స్‌పాల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి మీడియంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని, మొదటి స్థానంలో గెలిచిన వారికి రూ.3000, రెండో స్థానంలో గెలిచిన వారికి రూ.2000, తృతీయ స్థానంలో గెలుపొందిన వారికి రూ.1500 నగదు బహుమతులు ఇస్తున్నట్లు వివరించారు. అలాగే మొదటి స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు. వారోత్సవాల్లో భాగంగా 24న కర్నూలులో పెద్ద ఎత్తున ర్యాలీ, సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
లావణ్య మళ్లీ అరెస్టు
కర్నూలు: జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన లావణ్యను బియ్యం స్వాహా కేసులో రెండో సారి పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందించాల్సిన సబ్సిడీ సరుకులను డీలర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. శ్రీశైలానికి చెందిన చౌక డిపో డీలర్ చెరుకూరి మల్లికార్జున లావణ్యతో కలసి ఈ స్కామ్‌కు తెర తీసిన సంగతి తెలిసిందే. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాండేను కూడా పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన లావణ్య ఎన్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న స్వప్న డీలర్లతో కుమ్మక్కై స్కామ్ వ్యవహారాన్ని నడిపించారు. ఒక్కొక్క డీలర్ నుంచి రూ.10 వేలు అడ్వాన్స్, రూ.5 వేలు మామూళ్ల కింద ఒప్పందం కుదుర్చుకుని 2016 ఏప్రిల్ నుంచి జులై దాకా బోగస్ వ్యవహారాన్ని నడిపించారు. ఈ కేసును మొదట సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేసి అందుకు బాద్యులైన లావణ్య, అజయ్‌కుమార్ పాండేలను అరెస్టు చేశారు. బెయిల్‌పై నుంచి విడుదల కాగానే రెండో సారి అర్బన్ ఏఎస్ఓ ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ సీఐ కృష్ణయ్య వారిని పాతబస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 409, 420, ఐటీ ఆక్ట్ 66 కింద కేసు నమోదు చేసి కటకటాలకు పంపినట్లు తెలిపారు. -
వారిని అరెస్ట్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సిబ్బందితో లాలూచీపడి నిత్యావసర సరకుల పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసులు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లాకు చెందిన చౌకధర దుకాణదారులు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ 140 మందికి పైగా చౌకధర దుకాణదారులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, లైసెన్సుల రద్దుపై వారు దాఖలు చేసిన వ్యాజ్యాలపై నిర్ణయం వెలువడేంత వరకు వారిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే ప్రతీ రోజూ పోలీసుల ముందు హాజరు కావాలని వారికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ఐసీ సిబ్బంది సాయంతో నిత్యవసర సరుకులను ఇవ్వకుండా, ఇచ్చినట్లు చూపి ప్రజలను మోసం చేశారంటూ కర్నూలు జిల్లాలో 149 మంది చౌకధర దుకాణదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు తమపై కేసులను కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేశారని వారు కోర్టుకు నివేదించారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. భారీస్థాయిలో మోసానికి పాల్పడ్డారని, కంప్యూటర్లలో తప్పుడు వివరాలు నమోదు చేసి ప్రజలకు ఇవ్వాల్సిన సరుకులను దారి మళ్లించారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, లైసెన్సుల రద్దుపై పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై నిర్ణయం వెలువడేంత వరకు వారిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
అప్పు చేసి పప్పు కూడు
- అరువు పద్ధతిలో విలేజీ మాల్స్ నిర్వహణ – అధికారులపై భారం మోపిన ప్రభుత్వం – ఇదెక్కడి గోలంటున్న అధికారులు అనంతపురం అర్బన్ : చౌక దుకాణాలను విలేజీ మాల్స్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికారులకు కంటకంగా మారింది. రేషన్ సరుకులతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పంపిణీకి సంబంధించి సరైన మార్గదర్శకాలు ఇవ్వకుండా నిర్వహణ భారం ప్రభుత్వం అధికారులపై మోపింది. 'అరువు' పద్ధతిలో విలేజీ మాల్స్ నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను ఎలా అమలు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సరుకులు అప్పుగా తేవాలి.. విలేజి మాల్స్‌లో రేషన్ సరుకులతో కార్డుదారులకు నిత్యావసర వస్తువులు కందిపప్పు, పామాయిల్, ఉల్లిగడ్డలు, ఉప్పు, తదితర వాటిని కార్డుదారులకు పంపిణీ చేయాలి. ఈ సరుకులను జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ అప్పు రూపంలో తెప్పించాలి. డీలర్లకు అప్పుగానే అందజేయాలి. ఈ సరుకుల విలువ మొత్తం రూ.300 మించకూడదు. అమ్మగా వచ్చిన డబ్బును డీలర్లు అధికారుల ఖాతాలో జమ చేయాలి. ఆ మొత్తాన్ని సరుకులు ఇచ్చిన వ్యాపారులకు అధికారులు చెల్లించాలి. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాని ప్రారంభించాలి. దీన్ని జిల్లా సరఫరాల అధికారి నిర్వహించాలి. మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు ఇవ్వాలి.. విలేజీ మాల్స్‌లో మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు సరుకులను పంపిణీ చేయాలి. కిలో కందిపప్పు రూ.90, పామాయిల్ లీటరు రూ.52, ఉల్లిగడ్డలు కిలో రూ.8, ఉప్పు ప్యాకెట్ రూ.15, ఆలు గడ్డలు కిలో రూ.15కి ఇవ్వాలి వీటితో పాటు మరికొన్ని నిత్యాసవర సరుకులను కూడా పంపిణీ చేయవచ్చు. ఇవన్నీ ప్యాకెట్ రూపంలోనూ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 20 శాతం కార్డుదారులకే సరుకులు.. ప్రతి చౌక దుకాణంలో ఈ ప్రక్రియని ప్రారంభించి కనీసం 20 శాతం కార్డుదారుకులకు సరుకులు ఇచ్చేలా కలెక్టర్ చర్యలు చేపట్టాలి. మిగిలిని 80 శాతం కార్డుదారుల పరిస్థితి ఏమిటని అధికారులే ప్రశ్నిస్తున్నారు. పైగా అంత మొత్తంలో సరుకుల్ని అప్పుగా ఎలా తేవాలో అర్థం కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
పక్కా దగా..
ముఠాలుగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా దందా నిలువరించని సాంకేతిక పరిజ్ఞానం పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అక్రమాలు తూతూమంత్రంగా తనిఖీలు పేదలకు పూర్తిస్థాయిలో అందని బియ్యం బినామీ పేర్లతో రేషన్ బియ్యం పక్కదారి పేదల బియ్యం పక్కదారిపడుతోంది. రూపాయికి కిలోబియ్యం పథకం కొందరికి కాసులు కురిపిస్తోంది. పక్కా ప్రణాళికతో సాగుతోన్న ఈ గోల్మాల్ దందాతో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. జిల్లాలో డీలర్ల పేరుతో సాగుతున్న ఈ బినామీల దందా వెనుక పెద్దల హస్తాలున్నట్లు తెలుస్తోంది. సరుకులు దారి మళ్లిస్తున్న ఈ వ్యవహారంపై తనిఖీలు తూతూమంత్రంగా నిర్వహిస్తూ తమవంతు సహకరిస్తున్నారు కొందరు అధికారులు. పౌర సరఫరాల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న జియో ఫెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ దగాను ఏమాత్రం నిలువరించలేకపోతోంది. మహబూబ్‌నగర్ న్యూటౌన్ : వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని పేదల బియ్యాన్ని నొక్కేసి సొమ్ము చేసుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలతో పాటు జియోఫెన్సింగ్ యాప్ కూడా పనిచేస్తున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదు. దొడ్డిదారిన బియ్యం తరలిపోతున్నా అక్రమాలను కట్టడి చేయడానికి అధికారులు సాహసించడం లేదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న దళారులు రెచ్చిపోయి బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. ప్రతినెల చౌకధర దుకాణాల ద్వారా పేదలకు చేరాల్సిన బియ్యాన్ని దళారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారనే ఆరోపణలున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 3,66,813 రేషన్ కార్డులున్నాయి. అందులో 3,39,393 ఆహార భద్రత కార్డులు, 27,164 అంత్యోదయ కార్డులు, 256 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఆహార భద్రత కింద కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా సీలింగ్ విధించకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తుంది. ప్రతినెల 8222 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. జిల్లాకేంద్రం మహబూబ్‌నగర్ పట్టణంలోనే మొత్తం 86 రేషన్ డీలర్ షాపులు ఉన్నాయి. ఒకరిద్దరి చేతుల్లోనే దాదాపు 37డీలర్ షాపులు నడుస్తున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లుగా కొత్త డీలర్ల నియామకాలు లేకపోవడంతో కొంతమందికి ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇన్ చార్జ్ లుగా వ్యవహరిస్తున్న కొందరు డీలర్లు ఇదే అదనుగా భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జియో ఫెన్సింగ్యాప్ ఉఫ్... పౌర సరఫరాల శాఖలో బియ్యం సరఫరా, పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న జియోఫెన్సింగ్ యాప్ ఆశించిన ఫలితాన్నివ్వడం లేదు. బియ్యాన్ని సరఫరా చేసే లారీలకు జియో మ్యాపింగ్ చేశారు. డీలర్లు, గోదాం అధికారులు, పౌర సరఫరాల అధికారుల ఫోన్ నెంబర్లకు ఈ జియో ఫెన్సింగ్ యాప్‌ను అనుసంధానించారు. గోదాం నుంచి బియ్యం లారీ బయలుదేరి స్టేజ్–2 అధికారి పర్యవేక్షణలో ఎంఎల్ఎస్ పాయింట్‌కు చేరుతుంది. లారీ బయలుదేరడం, ఎంఎల్ఎస్ పాయింట్‌కు చేరడం వంటి ప్రక్రియ జియోఫెన్సింగ్ యాప్‌లో నమోదవుతుంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌకధర దుకాణాలకు చేరిన వెంటనే సంబందింత డీలర్ సంతకం చేసి బియ్యాన్ని స్టాక్ చేసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తం సంబందిత యాప్ సర్వర్‌లో నమోదు చేస్తారు. దీంతో స్టాక్ వచ్చినట్లు లబ్ధిదారులకు, అధికారులకు సమాచారం వెళ్తుంది. అలా లారీ బయలుదేనప్పటి నుంచి ఎక్కడెక్కడ వెళ్లిందనేది తెలుస్తుంది. ఇంతమంచి వ్యవస్థ ఉన్నా కేవలం యాప్‌ను సక్రమంగా వినియోగించకపోవడం వల్లే బియ్యం అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ధనార్జనే లక్ష్యంగా.. రూపాయికి కిలో బియ్యం అందజేసి పేదవారి కడుపు నింపాలనే ప్రభుత్వ ఆశయానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు బినామీ డీలర్లు రూ.12నుంచి రూ.14ల వరకు బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు ఇదే పనిగా తిరుగుతున్నారు. కొనుగోలు చేసిన రేషన్ ను పక్కాప్లాన్ తో ప్యారా బాయిల్డ్ రైస్‌మిల్లులకు చేరుస్తున్నారు. రాత్రికిరాత్రే బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రభుత్వానికే తిరిగి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ముఠాగా ఏర్పడి రూ.కోట్ల దందా.. పేదల బియ్యాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు జిల్లాలో పెద్ద ముఠానే పనిచేస్తోంది. దీనంతటికీ కల్వకుర్తిలోని ఓ బియ్యం మిల్లు వ్యాపారి ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్, అలంపూర్, గద్వాల, జడ్చర్లలో కొందరు బడావ్యక్తుల ద్వారా ఈ అక్రమ వాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి అడ్డు చెప్పకుండా జిల్లాస్థాయిలో కొందరు అధికారులకు ప్రతినెలా కొంత మొత్తాన్ని ముట్టజెప్పి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కఠిన చర్యలు తీసుకుంటాం పేదలకు ఆహార భద్రత కింద అందజేస్తున్న బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ షాపులపై డిసెంబర్ నుంచి పర్యవేక్షణ పెంచుతాం. పౌర సరఫరాల శాఖ విభజన ఇంకా పూర్తికాలేదు. ఉమ్మడి జిల్లా కేటాయింపులే ఉన్నాయి. ఈనెలాఖరులోగా విభజన పూర్తవుతుంది. చిన్న జిల్లాలో మా టీంతో రేషన్ షాపులపై నిరంతర పర్యవేక్షణ పెంచుతాం. డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. బినామీ దందాను ఎట్టి పరిస్థితుల్లో సహించబోం. - శారదా ప్రియదర్శిని, డీఎస్ఓ -
రేషన్ బియ్యం పట్టివేత
బోధన్ టౌన్ : పట్టణ శివారులోని బైపాస్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 29 క్వింటాళ్ల 95 కిలోల రేషన్ బియాన్ని బుధవారం సివిల్ సప్లై్స అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్వో సుదర్శన్ మాట్లాడుతూ సివిల్ సప్లై్స శాఖ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని ఆచన్‌పల్లి బైసాస్ వద్ద సాధారణ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ సమయంలో నిజామాబాద్ వైపునకు వెళుతున్న టీఎస్ 16 ఈఏ 7826 నంబర్‌గల ఫ్యాసింజర్ ఆటోలో, ఏపీ 25 వై 0233 నంబరు గల టాటా ఏస్‌లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని, వాహనాలను తనిఖీ చేయడానికి ఆపడంతో డ్రైవర్లు వాహనాలను వదిలి పారిపోయారని తెలిపారు. ఆటోల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువ 49 వేల 931 రూపాయలు ఉంటుందని తెలిపారు. రేషన్ బియ్యాన్ని బోధన్‌లోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించి, ఆటోలను బోధన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో జీపీఏ హరిబాబు, డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వెంకట్రావులు పాల్గొన్నారు. -
97క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
► తాటికుంట రేషన్ డీలర్లపై ఎన్ఫోర్స్మెంట్దాడులు ► ఇద్దరు రేషన్ డీలర్లపై కేసు నమోదు తాటికుంట(మల్దకల్) : మండలంలోని తాటికుంటలో చౌకధర దుకాణాలపై శనివారం సాయంత్రం సివిల్సప్లై, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. షాప్ నంబర్.8, షాప్ నంబర్.30లో పంపిణీ చేయాల్సిన సబ్సిడీ బియ్యం, చక్కెర, గోధుమలు, ఉప్పును పంపిణీ చేయకుండా ఉంచిన నిల్వలను గుర్తించారు. షాపునం.8లో 46క్వింటాళ్ల 50కేజీల బియ్యం 101పాకెట్ల చక్కెర, 484ప్యాకెట్ల గోధుమలు, 200కేజీల ఉప్పు, అలాగే షాపు నం. 30లో 51క్వింటాళ్ల 50కేజీల బియ్యం, 118పాకెట్ల చక్కెర, 671కేజీల గోధుమలు, 175కేజీల ఉప్పును స్వాధీనం చేసుకుని, షాపులను సీజ్ చేశారు. షాపు నం. 8కి పాలవాయి రేషన్ డీలర్ శివకేశవ్రెడ్డి ఇన్చార్జి కాగా, 30వ షాపుకు ఉలిగేపల్లి రేషన్ డీలర్ రామచంద్రయ్య ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. వీరికి తెలియకుండా రేషన్‌షాపులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన మల్దకల్, ఆంజనేయులుపై 6ఎ కేసులు నమోదు చేశామని అధికారులు జ్యోతి, వనజాక్షి తెలిపారు. వారివెంట ఆర్ఐ గోవిందు, వీఆర్ఓ వెంకట్రాముడు, గ్రామస్తులు ఉన్నారు. -
రోడ్డెక్కిన ఏపీ రేషన్ డీలర్లు
హైదరాబాద్ : కమీషన్ పెంచాలని ఏపీ రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. ఎర్రమంజిల్ లోని సివిల్ సప్లయ్ కార్యాలయం ఎదుట బుధవారం డీలర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అదేవిధంగా నగదు బదిలీ పధకం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. (ఎర్రమంజిల్) -
అబద్ధాలూ.. అతకలే!
* గోదాముల్లో గోల్మాల్ లేదట..! * ‘సాక్షి’కి సివిల్ సప్లయ్ మేనేజర్ వివరణ సాక్షి, టాస్క్‌ఫోర్స్, మెదక్: కోట్లాది రూపాయలు ఖర్చు చేసి.. ప్రజా సంక్షేమం కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం (సివిల్ సప్లయ్) అక్రమార్కుల పాలవుతున్నాయని, వీటిని రవాణా చేయకుండానే చేసినట్లు గోదాం స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తున్న వైనంపై ‘గోదాములో గోల్ మాల్ ’ శీర్షికతో ఈ నెల 21న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందిం చిన మంత్రి హరీష్ విచారణకు ఆదేశించారు. అయితే కథనంపై సివిల్ సప్లయ్ మేనేజర్ జయరావు ఈ నెల 22న పత్రికలకు వివరణ ఇచ్చారు. ఈ కాపీ బుధవారం ‘సాక్షి’కి చేరింది. దీనిలో ‘గోదాముల్లో గోల్మాల్’ పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ఆయన వివరణ అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉంది. కథనంలో ని వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు విచారణ లేకుండానే అ క్రమాలకు పాల్పడుతున్న వారిని వెనకేసుకొచ్చినట్లు ఉంది. పాపన్నపేట గోదాం ఇన్ చార్జ నరేందర్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో శంకరంపేట గోదాం ఇన్చార్జి నర్సిం లుకు పాపన్నపేట అదనపు బాధ్యతలు అప్పజెప్పామని, తప్పనిసరి పరిస్థితిలో నర్సిం లు చేతనే పాపన్నపేట గోదాంలో సరుకులు పంపిణీ చేయించామని వివరణ ఇచ్చారు. అం తేకాకుండా పాపన్నపేట, టేక్మాల్‌లో రెవెన్యూ సిబ్బంది లేకపోవడం వల్లేశంకరంపేట గో దాం ఇన్చార్జిని పాపన్నపేటకు తాత్కాలిక ఇన్‌చార్జిగాని యమించామన్నారు. ఆర్ఓలు రాయకుండానే స్టేజి-1,స్టేజి-2 గోదాముల్లో ఆక్రమా లు జరుగుతున్నాయనడం అవాస్తవమన్నారు. సారూ.. ఈ ప్రశ్నలకు బదులేవీ.. * పాపన్నపేట గోదాంకు ఇన్చార్జిగా నియమించిన శంకరంపేట గోదాం ఇన్చార్జి నర్సింహులేనా? ఈ వ్యక్తి ఎవరికి బంధు వు? రెవెన్యూ శాఖతో సంబంధం లేని ఈ ప్రైవేటు వ్యక్తి ఏ హోదాలో పాపన్నపేట గోదాంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. అది తేల్చి చెప్పండి. గతంలో కూడా ఈ వ్యక్తే గోదాం ఇన్చార్జి నర్సింహులుకు బదులు విధులు నిర్వహించడంపై మీకు ఫిర్యాదులు అందింది నిజమా కాదా..? * పాపన్నపేటలో ఇద్దరు ఆర్ఐలు ఉన్నా, వారిని కాదని నర్సింహులుకు ఎలా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు? ‘సాక్షి’లో కథ నం వచ్చాక అప్పటికప్పుడు ఉరుకులు పరుగుల మీద బుధవారం రోజున నర్సింహులును తప్పించి పాపన్నపేట ఆర్ఐ మారుతికి బాధ్యతలు ఎందుకు అప్పగించారు..? * ఇక మీరు చెప్పినట్టే అక్రమాలు అవాస్తవం అనుకుందాం. ‘సాక్షి’ కథనం వచ్చిన రోజునే మంత్రి హరీష్‌రావు ఎందుకు స్పం దించారు. సివిల్ సప్లయ్ గోదాంలపై ఇప్పటికీ మూడు సార్లు ఫిర్యాదులు వచ్చాయని అదే రోజు సిద్దిపేటలో జరిగిన ఒక సభలో ఆయన స్వయంగా ఎందుకు చెప్పారు. విచారణ జరపాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఎందుకు సూచించారు. మరి మీరు ఏ గో దాం లోనైనా విచారణ జరిపారా..! కనీసం ‘సాక్షి’ ఆరోపణ చేసిన గోదాంలోనైనా తని ఖీలు చేశారా? చేస్తే వివరణలో ఎందుకు పొం దుపరచలేదు. విచారణ జరపకుం డానే గోల్మాల్ జరగలేదని ప్రకటించడం, అక్రమార్కులను వెనుకేసుకు రావడం కాదా..?