అప్పు చేసి పప్పు కూడు | village malls replaced fp shops | Sakshi
Sakshi News home page

అప్పు చేసి పప్పు కూడు

Published Sat, Nov 26 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

అప్పు చేసి పప్పు కూడు

అప్పు చేసి పప్పు కూడు

- అరువు పద్ధతిలో విలేజీ మాల్స్‌ నిర్వహణ
– అధికారులపై భారం మోపిన ప్రభుత్వం
– ఇదెక్కడి గోలంటున్న అధికారులు


అనంతపురం అర్బన్‌ : చౌక దుకాణాలను విలేజీ మాల్స్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికారులకు కంటకంగా మారింది.  రేషన్‌ సరుకులతో పాటు  ఇతర నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పంపిణీకి సంబంధించి సరైన మార్గదర్శకాలు ఇవ్వకుండా నిర్వహణ భారం  ప్రభుత్వం అధికారులపై మోపింది. 'అరువు' పద్ధతిలో విలేజీ మాల్స్‌ నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలను ఎలా అమలు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సరుకులు అప్పుగా తేవాలి..

    విలేజి మాల్స్‌లో రేషన్‌ సరుకులతో కార్డుదారులకు నిత్యావసర వస్తువులు కందిపప్పు, పామాయిల్, ఉల్లిగడ్డలు, ఉప్పు, తదితర వాటిని కార్డుదారులకు పంపిణీ చేయాలి. ఈ సరుకులను  జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ అప్పు రూపంలో తెప్పించాలి. డీలర్లకు అప్పుగానే అందజేయాలి. ఈ సరుకుల విలువ మొత్తం రూ.300 మించకూడదు. అమ్మగా వచ్చిన డబ్బును డీలర్లు అధికారుల ఖాతాలో జమ చేయాలి. ఆ మొత్తాన్ని సరుకులు ఇచ్చిన వ్యాపారులకు అధికారులు చెల్లించాలి. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంక్‌ ఖాతాని ప్రారంభించాలి. దీన్ని జిల్లా సరఫరాల అధికారి నిర్వహించాలి.

మార్కెట్‌ ధర కంటే 20 శాతం తక్కువకు ఇవ్వాలి..
    విలేజీ మాల్స్‌లో మార్కెట్‌ ధర కంటే 20 శాతం తక్కువకు సరుకులను   పంపిణీ చేయాలి. కిలో కందిపప్పు రూ.90, పామాయిల్‌ లీటరు రూ.52, ఉల్లిగడ్డలు కిలో రూ.8, ఉప్పు ప్యాకెట్‌ రూ.15, ఆలు గడ్డలు కిలో రూ.15కి ఇవ్వాలి వీటితో పాటు మరికొన్ని నిత్యాసవర సరుకులను కూడా పంపిణీ చేయవచ్చు. ఇవన్నీ ప్యాకెట్‌ రూపంలోనూ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

20 శాతం కార్డుదారులకే సరుకులు..
    ప్రతి చౌక దుకాణంలో ఈ ప్రక్రియని ప్రారంభించి కనీసం 20 శాతం కార్డుదారుకులకు సరుకులు ఇచ్చేలా కలెక్టర్‌ చర్యలు చేపట్టాలి.  మిగిలిని 80 శాతం కార్డుదారుల పరిస్థితి ఏమిటని అధికారులే ప్రశ్నిస్తున్నారు. పైగా  అంత మొత్తంలో సరుకుల్ని అప్పుగా ఎలా తేవాలో అర్థం కావడం లేదని అధికారులు
తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement