fp shops
-
చౌక దుకాణాల ద్వారా రాగుల పంపిణీ
అనంతపురం అర్బన్ : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఐదు మండలాల్లో చౌక దుకాణాల ద్వారా ఈ నెల నుంచి రాగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 11 మండలాల్లో ఎఫ్పీ (విలేజ్ మాల్స్) ద్వారా సరుకులు పంపిణీ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాగులను రామగిరి, రొద్దం, అమరాపురం, కంబదూరు, డి.హీరేహల్ మండలాల పరిధిలో 184 చౌక దుకాణాల పరిధిలో 73,646 కార్డులకు అందజేస్తారు. బియ్యం బదులుగా మూడు కిలోల రాగులు ఇస్తారు. తొలివిడతగా 11 మండలాల పరి«ధిలో 947 చౌకదుకాణాలను విలేజ్ మాల్స్‌గా మార్పు చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. ఉప్పు కిలో రూ.12, పామాయిల్ లీటర్ రూ.70 పంపిణీ చేస్తారు. అదేవిధంగా కందిపప్పు, శనగపప్పు, మినపపప్పు కిలో రూ.70 చొప్పున ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అప్పు చేసి పప్పు కూడు
- అరువు పద్ధతిలో విలేజీ మాల్స్ నిర్వహణ – అధికారులపై భారం మోపిన ప్రభుత్వం – ఇదెక్కడి గోలంటున్న అధికారులు అనంతపురం అర్బన్ : చౌక దుకాణాలను విలేజీ మాల్స్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికారులకు కంటకంగా మారింది. రేషన్ సరుకులతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పంపిణీకి సంబంధించి సరైన మార్గదర్శకాలు ఇవ్వకుండా నిర్వహణ భారం ప్రభుత్వం అధికారులపై మోపింది. 'అరువు' పద్ధతిలో విలేజీ మాల్స్ నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను ఎలా అమలు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సరుకులు అప్పుగా తేవాలి.. విలేజి మాల్స్‌లో రేషన్ సరుకులతో కార్డుదారులకు నిత్యావసర వస్తువులు కందిపప్పు, పామాయిల్, ఉల్లిగడ్డలు, ఉప్పు, తదితర వాటిని కార్డుదారులకు పంపిణీ చేయాలి. ఈ సరుకులను జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ అప్పు రూపంలో తెప్పించాలి. డీలర్లకు అప్పుగానే అందజేయాలి. ఈ సరుకుల విలువ మొత్తం రూ.300 మించకూడదు. అమ్మగా వచ్చిన డబ్బును డీలర్లు అధికారుల ఖాతాలో జమ చేయాలి. ఆ మొత్తాన్ని సరుకులు ఇచ్చిన వ్యాపారులకు అధికారులు చెల్లించాలి. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాని ప్రారంభించాలి. దీన్ని జిల్లా సరఫరాల అధికారి నిర్వహించాలి. మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు ఇవ్వాలి.. విలేజీ మాల్స్‌లో మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు సరుకులను పంపిణీ చేయాలి. కిలో కందిపప్పు రూ.90, పామాయిల్ లీటరు రూ.52, ఉల్లిగడ్డలు కిలో రూ.8, ఉప్పు ప్యాకెట్ రూ.15, ఆలు గడ్డలు కిలో రూ.15కి ఇవ్వాలి వీటితో పాటు మరికొన్ని నిత్యాసవర సరుకులను కూడా పంపిణీ చేయవచ్చు. ఇవన్నీ ప్యాకెట్ రూపంలోనూ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 20 శాతం కార్డుదారులకే సరుకులు.. ప్రతి చౌక దుకాణంలో ఈ ప్రక్రియని ప్రారంభించి కనీసం 20 శాతం కార్డుదారుకులకు సరుకులు ఇచ్చేలా కలెక్టర్ చర్యలు చేపట్టాలి. మిగిలిని 80 శాతం కార్డుదారుల పరిస్థితి ఏమిటని అధికారులే ప్రశ్నిస్తున్నారు. పైగా అంత మొత్తంలో సరుకుల్ని అప్పుగా ఎలా తేవాలో అర్థం కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
చౌక దుకాణాలు.. ఇక 'విలేజ్ మాల్స్'
అనంతపురం అర్బన్ : చౌక ధరల దుకాణాలు 'విలేజ్ మాల్స్'గా పరిగణిస్తూ, అన్ని రకాల సరుకులు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఇక నుంచి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, గోధుమ పిండి, చక్కెర, కిరోసిన్‌తో పాటు కందిపప్పు, ఉప్పు, ఉల్లిపాయలు, సబ్బులు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అంశంపై బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో బ్యాంకర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి చౌక దుకాణానికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఇవ్వాలని లక్ష్మీకాంతం బ్యాంకర్లకు సూచించారు. డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించాలన్నారు. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) యంత్రాల వినియోగం, ఆన్లైన్ లావాదేవీలుపై గురువారం డివిజన్ వారీగా ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓలకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వాలన్నారు.