అనంతపురం అర్బన్ : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఐదు మండలాల్లో చౌక దుకాణాల ద్వారా ఈ నెల నుంచి రాగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 11 మండలాల్లో ఎఫ్‌పీ (విలేజ్ మాల్స్) ద్వారా సరుకులు పంపిణీ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాగులను రామగిరి, రొద్దం, అమరాపురం, కంబదూరు, డి.హీరేహల్ మండలాల పరిధిలో 184 చౌక దుకాణాల పరిధిలో 73,646 కార్డులకు అందజేస్తారు.
బియ్యం బదులుగా మూడు కిలోల రాగులు ఇస్తారు. తొలివిడతగా 11 మండలాల పరి«ధిలో 947 చౌకదుకాణాలను విలేజ్ మాల్స్‌గా మార్పు చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. ఉప్పు కిలో రూ.12, పామాయిల్ లీటర్ రూ.70 పంపిణీ చేస్తారు. అదేవిధంగా కందిపప్పు, శనగపప్పు, మినపపప్పు కిలో రూ.70 చొప్పున ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చౌక దుకాణాల ద్వారా రాగుల పంపిణీ
Published Tue, Jan 31 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
Advertisement