Village malls
-
గోల్మాల్
ఇది చంద్రన్న విలేజ్ మాల్స్‌లో లభిస్తున్న బెల్లం. కేవలం 450 గ్రాముల నల్లటి బెల్లం ఎంఆర్పీ ఏకంగా రూ.42 ఉంది. దీన్ని ఆఫర్ కింద రూ.37కు అమ్ముతున్నారు. అదే బహిరంగ మార్కెట్లో మొదటి రకం బెల్లం కిలో రూ.48కే లభిస్తోంది. ఒక్క బెల్లమే కాదు.. చింతపండు, ఇతర నిత్యావసర వస్తువులదీ ఇదే పరిస్థితి. కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 54 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. డీలర్లు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాల్ ఏర్పాటు చేయాలంటే డీలరుకు 200 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన షాపు ఉండాలి. అది కూడా రోడ్డుకు వంద మీటర్లలోపు ఉండాలి. ఇప్పటివరకు అతికష్టం మీద ఆరు మాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని కర్నూలు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆలూరు, పాణ్యం, కోడుమూరులో ప్రారంభించారు. ఇవి కూడా వినియోగదారులు రాక వెలవెలబోతున్నాయి. ఈ మాల్స్‌కు రిలయన్స్ సంస్థ సరుకులు సరఫరా చేస్తోంది. నాణ్యమైన నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువులనూ మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే..వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాల్స్‌కు సరఫరా అవుతున్న సరుకుల్లో కొన్ని నాణ్యతగా ఉండడం లేదు. ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మరీముఖ్యంగా బెల్లం, చింతపండు, శనగపప్పు, మినపపప్పు, చక్కెర, పామోలిన్ ప్యాకెట్లు తదితర వస్తువుల నాణ్యత, ధరల పట్ల వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. నాణ్యత బాగుంటే ఒకటి, రెండు రూపాయలు ఎక్కువ ఉన్నా తీసుకుంటారు. అయితే.. సరుకులు నాసిరకంగా ఉండడం, ధర కూడా ఎక్కువ కావడంతో వినియోగదారులు మాల్స్ వైపు వెళ్లడం లేదు. దీంతో డీలర్లు వాటిని మూసి ఉంచుతున్నారు. ఊరించి నష్టాల ఊబిలోకి.. చంద్రన్న విలేజ్ మాల్స్‌ను నిర్వహించే డీలర్లకు సరుకుల అమ్మకాలపై ఎనిమిది శాతం కమీషన్ ఇస్తామని మొదట్లో ఊరించారు. షాపును మాల్గా తీర్చిదిద్దేందుకు అయ్యే ఖర్చును వంద శాతం భరిస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేవలం మూడు శాతం కమీషన్‌తో సరిపుచ్చుతున్నారు. కర్నూలు ప్రకాశ్‌నగర్‌లోని రేషన్‌షాపు నంబరు 50లో చంద్రన్న విలేజ్ మాల్‌ను మూడు నెలల క్రితం ఏర్పాటు చేశారు. దీన్ని డిజైన్ చేసిన వ్యయంలో 50 శాతం మొత్తాన్ని ఎనిమిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని రిలయన్స్ సంస్థ ఒత్తిడి తెస్తోంది. డీలర్‌కు ఎనిమిది శాతం కమీషన్ ఇస్తామని మభ్యపెట్టి మూడు శాతంతో సరిపుచ్చుతోంది. పైగా బయటి మార్కెట్ కంటే తక్కువ ధర ఉండి.. డిమాండ్ ఉన్న వస్తువులను సరఫరా చేయడం లేదు. నాణ్యత లేని, అధిక ధరలు ఉన్న సరుకులను మాత్రమే సరఫరా చేస్తోందని డీలర్లు వాపోతున్నారు. ఇదెలా సాధ్యమో? చంద్రన్న విలేజ్‌మాల్‌కు సరఫరా చేసే 25 గ్రాముల సబ్బు ఎంఆర్పీ రూ.5గా నిర్ణయించారు. దీన్ని ఆఫర్ కింద రూ.4.70కి విక్రయించాల్సి ఉంది. డీలరుకు వేస్తున్న ధర రూ.5.40. పైగా నెలకు రూ.2 లక్షల విలువైన వస్తువులను సరఫరా చేస్తామని చెప్పిన రిలయన్స్ సంస్థ అడ్డగోలుగా ధరలు పెంచి తూతూ మంత్రంగా సరుకులు ఇస్తోంది. నిర్వహణ భారంగా మారింది షాపు డిజైన్ చేసిన ఖర్చు మొత్తం భరిస్తామని మొదట్లో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మొత్తం ఖర్చులో 50శాతం 8శాతం వడ్డీతో చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. 8శాతం కమీషన్ ఇస్తామని చెప్పి 3శాతం మాత్రమే ఇస్తున్నారు. మార్చిలో రూ.1,193, ఏప్రిల్‌లో రూ.3,002 మాత్రమే కమీషన్ వచ్చింది. కరెంటు బిల్లు రూ.800 దాకా వస్తోంది. షాపును శుభ్రం చేయడానికి రూ.1,200 ఇవ్వాల్సి వస్తోంది. కమీషన్ ఏ మూలకూ చాలడం లేదు. పైగా డిమాండ్ ఉన్న వస్తువులు సరఫరా చేయరు. డిమాండ్ లేని సరుకులు మాత్రం అడగకపోయినా ఇస్తున్నారు. ఇలాగైతే ఈ మాల్‌ను నిర్వహించడం కష్టం. – కరుణాకర్గుప్త, 50వ షాపు డీలర్, కర్నూలు -
చంద్రన్న విలేజ్ మాల్స్‌లో ధరల షాక్!
-
చంద్రన్న విలేజ్ మాల్స్‌లో ధరల షాక్!
సాక్షి, అమరావతి : చౌకధరల దుకాణాల స్థానంలో నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రారంభించిన ‘చంద్రన్న విలేజ్ మాల్స్’లో ధరలు షాక్ కొడుతుండడంతో ప్రజలు నిరసనాగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో లభిస్తున్న ధరలకన్నా ఈ మాల్స్‌లో ధరలు ఎక్కువ ఉండడం చూసి జనం అవాక్కవుతున్నారు. ధరల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండడంతో చంద్రన్న మాల్స్‌లో అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం సబ్బులు, ఇతర సౌందర్యసాధనాలు మాత్రమే విక్రయిస్తున్నారు. అవి కూడా మార్కెట్ రేట్లకే కావడం విశేషం. ఒకటి రెండు రోజుల్లో సరుకులన్నీ వస్తాయని డీలర్లు చెబుతున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రేషన్ షాపులను.. రిలయన్స్‌తో పాటు చంద్రబాబుకు వాటాలున్న ఫ్యూచర్ గ్రూప్‌లకు అప్పగించేస్తుండడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుండగా అవే ఉత్పత్తుల ధరలు వినియోగదారుల వద్దకు వచ్చేసరికి దిమ్మతిరిగేలా షాక్ కొడుతున్నాయి. అందులోనూ చౌకధరల దుకాణాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు తెచ్చిన చంద్రన్న మాల్స్‌లో ధరలు భారీగా ఉండడంపై వినియోగదారుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. 40శాతం చౌక ధరలంటూ ప్రచారం.. రాష్ట్రంలో 29 వేల రేషన్‌షాపులు ఉన్నాయి. వీటిల్లో ఎంపిక చేసిన 6,500 దుకాణాల్లో చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ, గుంటూరులోని రెండు దుకాణాలను ఎంపిక చేసింది. మిగిలిన దుకాణాలను వెంటనే ప్రారంభించనున్నామని, వీటిల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువకు అందుబాటులోకి తీసుకు వస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎంపిక చేసిన విలేజ్ మాల్స్ ఆకర్షణీయంగా ఉండే ఏర్పాట్లు కూడా చేసింది. దీంతో ఈ మాల్స్‌లోని నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నెల 12 వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ప్రారంభించారు. మొదటి రోజు ప్రారంభోత్సవ హడావుడి ఉండటంతో ఆ రోజు అమ్మకాలు పెద్దగా జరగలేదు. 13 వ తేదీన విజయవాడ భవానీపురంలోని విలేజ్‌మాల్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. అయితే బయట మార్కెట్ కంటే అక్కడి నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు కొనుగోలుదారులు ఇంటికి తీసుకువెళ్లిన వస్తువులను తిరిగి ఇచ్చేయడానికి ప్రయత్నించారు. అయితే దుకాణదారుడు వాటిని తిరిగి తీసుకునేందుకు అంగీకరించలేదు. ఆ రోజున దాదాపు రూ.6 వేల విలువైన నిత్యావసర వస్తువుల అమ్మకాలు జరిగాయి. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని కొందరు అధికారులు కొనుగోలుదారుల అభిప్రాయాలను తెలుసుకుని అదే రోజు సాయంత్రం నుంచి అమ్మకాలను నిలిపివేయాలని, అక్కడి నుంచి నిత్యావసర వస్తువులను తీసేయాలని ఆదేశించారు. 14వ తేదీ నుంచి ఆ దుకాణంలో నిత్యావసర వస్తువులు లేకపోవడంతో వచ్చిన కొనుగోలుదారులు తిరిగివెళ్లిపోయారు. వచ్చిన వారికి రెండు మూడు రోజుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు ప్రారంభం అవుతాయని చెబుతూ, దుకాణంలోని మిగిలిన సబ్బులు, పేస్టుల ధరలు మార్కెట్ కంటే తక్కువగా ఇస్తున్నామని చెబుతున్నారు. రైతు నుంచి వినియోగదారుడి వరకూ... ఏ పరిశ్రమలోనైనా ఒక ఉత్పత్తి బైటకొస్తే యజమాని దాని ధర నిర్ణయించి అమ్ముకుంటాడు. కానీ అలాంటి అవకాశం లేని ఉత్పత్తిదారుడు బహుశా రైతు ఒక్కడేనేమో. పండించిన పంటకు ధరలు నిర్ణయించేది ప్రభుత్వమో.. దళారీలో.. వారు చెప్పిన ధర గిట్టుబాటు కాకపోయినా పంటను తెగనమ్ముకోవలసిందే. వేరుశనగ, మినుము, కందులు, పసుపు సహా ఏ పంటకూ ధర లేదు. రైతులు పంటలు బాగా పండించినపుడు పూర్తిగా రేటు లేకుండా పోతోంది. అయితే వినియోగదారుడి దగ్గరకు వచ్చే సరికి రేట్లు షాక్ కొడుతుంటాయి. ఇదెలా జరుగుతోందంటే దళారులు వచ్చి రైతుల దగ్గర నుంచి పంటను తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత రేట్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అడ్డగోలుగా మోసం చేస్తున్నారు. వేరు శనగ పరిస్థితి అంతే.. రైతుల వద్ద క్వింటా రూ.3 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇదే వేరు శనగ హెరిటేజ్ షాపుల్లో కేజీ రూ.150 పలుకుతోంది. రైతుల వద్ద శనగలు క్వింటా సగటున రూ. 3,500లకే కొంటున్నారు. అంటే కిలో రూ. 35 అన్నమాట. హెరిటేజ్ షాపులో మాత్రం కేజీ రూ.180లకు అమ్ముకుంటున్నారు. కందులను రైతుల దగ్గర క్వింటా రూ. 2,500లకు కొని, తన హెరిటేజ్‌లో మాత్రం కేజీ కందిపప్పును రూ. 80లకు అమ్ముకుంటున్నారు. రూ.25కు కొని రూ.80కి అమ్ముతారా? ఇంత అన్యాయమైతే రైతెలా బతుకుతాడు? మిర్చికి కూడా గిట్టుబాటు ధరలేక రైతు మండిపోతున్నాడు. క్వింటాలు రూ. 2,500 నుంచి రూ. 3 వేలు మాత్రమే ధర ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అయితే... క్వింటా రూ. 8 వేలపైనే ఉంది. ఇపుడు కంది, మినుము, పెసర ధరలు క్వింటా సగటున రూ. 3 నుంచి 4 వేల మధ్యే ధర పలుకుతున్నాయి. వైఎస్సార్ హయాంలో రూ. 8 వేలకు తగ్గలేదు. ఇవాళ పసుపు ధర రూ. 4వేలు, రూ. 5 వేల మధ్య ఉంది. వైఎస్ పాలనలో రూ. 13 నుంచి రూ. 14 వేలుంది. అవికూడా మార్కెట్ ధరకే.. సబ్బులు, పేస్టులు వంటి వస్తువుల ఎంఆర్పీపై 8 నుంచి 12 శాతం వరకు రేటు తగ్గించి అమ్ముతున్నామని దుకాణదారులు చెబుతున్నారు. అయితే ఎంఆర్పీపై ఆ శాతం తగ్గించి వాటిని అమ్ముతున్నప్పటికీ మార్కెట్లోని మిగిలిన దుకాణాదారులు అదే ధరకు ఆ వస్తువులను విక్రయిస్తున్నారు. దీంతో సబ్బులు, పేస్టుల వంటి వస్తువుల ధరలు కూడా తక్కువగా ఏమీ లేవని కొనుగోలుదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రచారానికి భిన్నంగా చంద్రన్న విలేజ్మాల్లోని ధరలు ఉండటంతో శని, ఆదివారాలు కూడా కొనుగోలుదారులు రాలేదు. దాంతో ఆ మాల్ వెలవెలబోయింది. ఆందోళనలో చౌకడిపోల డీలర్లు.. రాష్ట్రంలోని 6,500 చౌకధరల దుకాణాలను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల డీలర్లు ఆందోళన చెందుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన విజయవాడ, గుంటూరులోని మాల్స్‌లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు లేకపోవడంతో ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం మినహా ఇతర వస్తువులు విక్రయించే అవకాశం ఉండదనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్నమాల్స్గా చౌకధరల దుకాణాలను ఆధునీకరించేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆ మొత్తాలకు నామమాత్రపు వడ్డీ కూడా వచ్చే అవకాశం లేదనే అభిప్రాయంలో ఉన్నారు. కొందరు చౌకధరల దుకాణదారులు తమ దుకాణాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా అమ్ముకుంటూ నెలకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు సంపాదించుకుంటున్నారు. చంద్రన్న విలేజ్‌మాల్‌గా ఆ దుకాణం మారితే మిగిలిన వస్తువులు అమ్ముకునే అవకాశం లేక నష్టపోతామనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం కొంటాం..ఏం తింటాం రేషన్ షాపులను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా మారుస్తున్నారంటే దానిలోని అన్ని రకాలు సరుకులు తక్కువ ధరలకు దొరుకుతాయనుకున్నాం. ప్రారంభోత్సవం రోజున వెళ్లి చూస్తే పప్పు దినుసులన్నీ బయట మార్కెట్‌కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇంత రేట్లు ఉంటే ఇక్కడి వరకూ రావడం దేనికి. ఇంటికి దగ్గరలో ఉన్న పచారి షాపులోనే కొనుక్కుంటాం కదా. – షేక్ ఆషాబీ, కబేళా రోడ్, విజయవాడ పప్పులు లేకుండా విలేజ్ మాల్స్ ఏమిటి? కందిపప్పు, మినపపప్పు, శనగపప్పు వంటి నిత్యావసర సరుకులు లేకుండా విలేజ్ మాల్స్ ఏమిటో అర్ధం కావడం లేదు. షాపునకు వెళ్లి చూస్తే నిత్యావసరాలు కనబడ లేదు. నిర్వాహకులను అడిగితే త్వరలో వస్తాయని సమాధానం చెబుతున్నారు. ఈ రేషన్ షాపును పైలెట్ ప్రాజెక్ట్‌గా రెండు నెలల క్రితమే నిర్ణయించినప్పుడు ముందుగా అన్ని సరుకులు సిద్ధం చేయకపోవడం ఏమిటో? – చిమటా గోపి, విద్యాధరపురం, విజయవాడ -
దేశమంతా జీఎస్టీ... రాష్ట్రంలో ‘సీఎస్టీ’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిని అడ్డం పెట్టుకొని పేదలు, చిరు వ్యాపారుల కడుపుకొడుతూ ఆయన కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్, ఇతర కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. దేశమంతా జీఎస్టీ అమలు చేస్తుంటే కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా రాష్ట్రంలో అదనంగా సీఎస్టీ (చంద్రబాబు సర్వీస్ ట్యాక్స్)ని కూడా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నోట్ల కట్టలకు, కార్పొరేట్ శక్తులకు పుట్టిన బిడ్డలా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. చౌక ధరల దుకాణాలను మాల్స్‌గా మార్చి హెరిటేజ్‌కు వాటాలున్న ఫ్యూచర్, వారికి సన్నిహితమైన రిలయన్స్ గ్రూపునకు అప్పగించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. మాల్స్ వెనుక వేల కోట్ల డీల్... రాష్ట్రంలోని 28 వేల రేషన్ షాపుల ద్వారా గతంలో 9 నుంచి 10 సరుకులు పేదలకు అతి తక్కువ ధరకే అందించేవారని రోజా గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎత్తివేస్తే.. దివంగత రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక సంతృప్త స్థాయిలో పేదలందరికీ సరుకులు అందించారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రేషన్ షాపుల్లో బియ్యం మినహా మరేమీ ఇవ్వటం లేదని, ఇప్పుడు వీటిని కార్పొరేట్ మాల్స్‌కు అప్పగించే కుట్రకు తెరతీశారన్నారు. చంద్రన్న మాల్స్‌లో తక్కువ ధరకు సరుకులు ఇస్తామని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. బహిరంగ మార్కెట్లో దొరికే నిత్యావసర సరుకులతో పోలిస్తే హెరిటేజ్, ఫ్యూచర్, రిలయన్స్ మాల్స్‌లలో దొరికే సరుకులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని రోజా తెలిపారు. కార్పొరేట్ మాల్స్‌లో 200 నుంచి 300 శాతం అధికంగా ధరలు ఉంటాయని పంచదార, గోధుమలు, తదితర సరుకుల ధరల వివరాలతో సహా వివరించారు. ఫ్యూచర్ గ్రూపు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సరుకులను ఎందుకు తగ్గించి ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 21 రకాల పథకాలకు చంద్రన్న అని పేరు పెట్టుకున్నారని రోజా పేర్కొన్నారు. ప్రతి దానికీ చంద్రన్న పేరు పెట్టుకోవడానికి ఆయన తండ్రి ఆస్తిలో నుంచి వాటా తెచ్చి ఏమైనా ప్రజలకు ఇస్తున్నారా? అని రోజా సూటిగా ప్రశ్నించారు. ఐదు నెలల్లో ఆస్తులు 20 రెట్లు ఎలా పెరిగాయ్? పాలు, కూరగాయలు అమ్ముకుంటేనే చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఐదు నెలల్లో 20 రెట్లు పెరిగితే మరి గేదెలకు తిండిపెట్టి పాలు పట్టే మహిళలు, రైతులకు ఎన్ని రెట్లు ఆస్తులు పెరగాలని రోజా ప్రశ్నించారు. లోకేష్‌ను దొడ్డిదారిన మంత్రిని చేసినప్పటి నుంచీ చంద్రబాబు పూర్తిగా సూట్ కేసుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. వర్థంతి, జయంతికి... రాష్ట్రానికి, దేశానికి తేడా తెలియని లోకేష్‌ను మంత్రిగా చేస్తే రాష్ట్రం ఏమైపోవాలని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మోదీ, చంద్రబాబుకు ఓట్లు వేయాలని ఊరూవాడా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్.. నేడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏ హక్కుతో ప్రశ్నిస్తున్నారని రోజా నిలదీశారు. కాపులు, రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, ప్రతి ఒక్కరికీ అన్యాయం చేసిన చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి ఆయన జగన్‌ను ప్రశ్నిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
చంద్రన్న విలేజ్ మాల్ ప్రారంభం
సాక్షి, అమరావతి: పేదలకు అన్ని రకాల సరుకులు తక్కువ ధరకే అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్ల డించారు. ఇందులో భాగంగానే చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ‘చంద్రన్న విలేజ్ మాల్’ను మంగళవారం సచివాలయం నుంచి సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలోని రేషన్ షాపులను చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్పీ కంటే 4 శాతం నుంచి 35 శాతం తక్కువ ధరకు లభిస్తాయని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి రెండో తేదీ నుంచి పది రోజుల పాటు ‘జన్మభూమి–మాఊరు’ కార్య క్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. పది రోజులపాటు పది అంశాలపై ఈ కార్యక్రమం జరపాలని, ఆయా అంశాల్లో రాష్ట్రం, మండలం, ఆ గ్రామం ఎక్కడ ఉందో చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు, రేషన్ కార్డులు కొత్తగా ఎంతమందికి అందివ్వాలన్నది త్వరలోనే నిర్ణ యిస్తామన్నారు. కలెక్టర్ల సదస్సుకు సన్నాహకంగా మంగళవారం సచి వాలయంలో మంత్రులు, కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులతో సీఎం సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. అందుబాటులో ‘పోలవరం’సమాచారం నిర్ణీత వ్యవధిలోగా పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేసి, 2019 నాటికి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆన్లైన్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలన్నారు. వెంటనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయాలని సీఎం సీఎస్‌కు సూచించారు. విజయవాడ శివారులో చేపట్టిన ఎకనామిక్ సిటీ నిర్మాణాన్ని, ప్రస్తుతం సేకరించిన 235 ఎకరాల్లోనే చేపట్టాలని బాబు ఆదేశించారు. -
చౌకదుకాణాలు కాదు.. చౌకబారు దుకాణాలు
సాక్షి, హైదరాబాద్ : గ్రామగ్రామాన చంద్రన్న చౌకదుకాణాల పేరిట ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్దమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించింది. గ్రామాల్లోని చిన్న వ్యాపారుల లాభాన్ని హెరిటేజ్‌కు మళ్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మరో కుట్రకు తెరలేపాడని ఆరోపించింది. ఇప్పటికే జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో దోచుకుంటున్న బాబు వర్గం.. ఈస్ట్ఇండియా కంపెనీ మాదిరి విడతల వారిగా ఈ విలేజ్ మాల్స్‌తో చిన్నవ్యాపారుల పొట్టగొట్టేందుకు సిద్దమైందని పేర్కొంది. తాను చేసిన పనులకు భవిష్యత్తులో తన పేరు ఎవరు గుర్తుంచుకోరనే భావనతో సీఎం చంద్రబాబు అన్ని సంక్షేమ పథకాలకు తన పేరు పెట్టుకుంటున్నారని ఎద్దేవ చేసింది. చివరకు తన కొడుకు లోకేశ్ కూడా గుర్తుపెట్టుకోడనే బాబు ఇలా ప్రవర్తిస్తున్నాడని పేర్కొంది. ఈ విలేజ్ మాల్స్ వెనుక చంద్రబాబు నాయుడు వ్యక్తిగత స్వార్థం, వ్యాపార వ్యూహాలు, రాజకీయ కుట్రలు దాగున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని స్పష్టం చేసింది. గ్రామల్లోని చిన్న దుకాణాలు, బడ్డీకొట్టుల నిర్వహాకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొంది. -
పెద్దలకు పేదల మాల్
పెద్దలను కొట్టి పేదలకు పెట్టిన రాబిన్ హుడ్ కథలు మనం చాలా చదువుకున్నాం. ఇపుడు రాష్ట్రంలో ‘రాబర్’ హుడ్ శకం నడుస్తోంది. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే ఈ ‘రాబర్’ హుడ్ లక్ష్యం. నిరుపేదలు, చిరువ్యాపారులు, కిరాణావ్యాపారులే టార్గెట్. చిరు వ్యాపారుల పొట్టకొట్టి కార్పొరేట్ కంపెనీల ఖజానాలు నింపే ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ కాన్సెప్ట్ ఇదే.. ఒక షాపు పెట్టి సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలి. నాణ్యమైన సరుకులు, తక్కువ ధరలతో ఎంతో కష్టపడి ఖాతాదారులను సంపాదించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ప్రాపకం సంపాదించిన కార్పొరేట్ కంపెనీలకు ఇవేవీ అక్కర్లేదు. రాత్రికి రాత్రి సరుకులు, ఖాతాదారులు, లాభాలు రెడీ.. చిరువ్యాపారాలను ధ్వంసం చేసి.. ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేసి మరీ వాటికి రెడ్ కార్పెట్ పరుస్తారు.. సాక్షి, అమరావతి:‘చంద్రన్న విలేజ్ మాల్స్’ పేరుతో రాష్ట్రంలోని కిరాణా వ్యాపారాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే భారీ దోపీడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి్టంది. లక్షలాది మందికి ఉపాధి కల్పించే కిరాణా వ్యాపారాన్ని దెబ్బతీస్తూ బడా కార్పొరేట్ సంస్థలను... ముఖ్యంగా ‘హెరిటేజ్’ రిటైల్ వ్యాపారానికి లబ్ధి చేకూర్చే సరికొత్త ఎత్తుగడకు ప్రభుత్వం తెరతీసింది. ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ.. అదే సమయంలో ఏటా రూ. 72.600 కోట్ల వ్యాపారాన్ని గంపగుత్త్తగా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పనుంది. రాష్ట్రంలో ఉన్న 29 వేల రేషన్ షాపులన్నీ దశల వారీగా రిలయన్స్, వాల్‌మార్ట్, 6+ప్యూచర్ రిటైల్ సంస్థలకు అప్ప చెప్పి తెల్ల రేషన్ కార్డున్న ప్రతి పేదవాడు కూడా భవిష్యత్తులో ఆ మాల్స్‌లోనే సరుకులు కొనుగోలు చేసేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఫ్యూచర్ రిటైల్ వ్యాపారంలో చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్ రిటైల్’ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తిపెరుగుతోంది. దీన్ని తగ్గించడం కోసం తక్కువ ధరలకే కిరాణా వస్తువులు అందిస్తున్నామంటూ ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ను తెరమీదకు తీసుకొచ్చారు. ఈ మాల్స్‌లో కేవలం బియ్యం మాత్రమే కాకుండా అన్ని కిరాణా సరుకులను బయట మార్కెట్ కంటే 10 నుంచి 12 శాతం తక్కువ ధరకు అందించనున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదీ... దోపీడీ లెక్క.. విలేజ్ మాల్స్ పేరుతో పైకి డిస్కౌంట్ రేట్లకే సరుకులు అందిస్తామంటున్నా.... వేల కోట్ల కిరాణా వ్యాపారాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలో సుమారు 1.40 కోట్ల తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు కూడా ప్రతీ నెల బియ్యంతో పాటు అన్ని కిరాణా, ఫ్యాన్సీ సామాన్లు కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 2,000 అవసరమవుతాయి. కేవలం ఈ తెల్ల రేషన్ కార్డుల వారు విలేజ్ మాల్స్ ద్వారా ప్రతీ నెలా కొనే సరుకుల విలువే... అక్షరాలా రూ. 2,800 కోట్లు. వీరు కాకుండా రాష్ట్రంలో మరో 60 లక్షల మధ్య తరగతి కుటుంబాలున్నాయి. వీరి నెలసరి బడ్జెట్ విలువ రూ. 5,000లుగా అంచనా వేస్తే మరో రూ. 3, 250 కోట్ల వ్యాపారం కార్పొరేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లిపోతుంది. అంటే ప్రతీ నెలా రూ. 6,050 కోట్ల చొప్పున ఏటా రూ. 72,600 కోట్ల మార్కెట్‌ను ప్రభుత్వమే పళ్లెంలో పెట్టి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పబోతోందన్నమాట. కార్పొరేట్ సంస్థల దోపిడీ ఎలా ఉంటుందో మనమందరికీ అనుభవమే. తొలుత ఆకర్షించడానికి డిస్కౌంట్లు ప్రకటించి.. అలావాటయ్యాక ఆ సంస్థలన్నీ గుత్తాధిపత్యం కింద ధరలు పెంచుకుంటూ పోతాయి. ఇప్పుడు ఈ విలేజ్ మాల్స్‌లో కూడా తొలుత తక్కువ ధరకే వస్తువులు విక్రయించడంతో కొనుగోలుదారులు వాటికి పూర్తిగా అలవాటు పడి పోతారు. ఈలోగా గ్రామాల్లో చిరువ్యాపారులు, కిరాణా వ్యాపారుల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినిపోతాయి. ఆ∙తర్వాత విలేజ్ మాల్స్‌లో క్రమేణా ధరలు పెంచినా వినియోగదారులు చచ్చినట్లు ఆ మాల్స్‌లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తారు. ఇదీ విలేజ్ మాల్స్ స్వరూపం.. కార్పొరేట్ సంస్థలకు లబ్దిచేకూర్చేలా రేషన్ షాపులన్నీ ఆధునీకరించి వారికి అప్పగించేందుకు అవసరమైన పనులన్నీ క్షేత్రస్థాయిలో చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుత రేషన్ షాపులను రూ.5 లక్షలతో విలేజ్ మాల్స్‌గా ఆధునీకరించనున్నారు. ఇందులో రేషన్ డీలర్ వాటా రూ. 1.25 లక్షలు, ప్రభుత్వం రూ. 1.25 లక్షలు, మరో రూ. 2.50 లక్షలు కార్పొరేట్ సంస్థలు ఖర్చు చేసేలా ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలు తయారు చేసింది. రేషన్ డీలర్ వాటా రూ. 1.25 లక్షలు ముద్ర బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోనుంది. ఇందులో భాగంగా మొదటి దశ కింద సుమారు 6,000 మాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత జిల్లాల్లో ఎక్కడెక్కడ చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలో రేషన్ షాపుల వివరాలు పంపాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఒక్కో జిల్లా నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద 500 తక్కువ కాకుండా పూర్తి వివరాలతో రేషన్ షాపుల జాబితా పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరుకుల నాణ్యతపై బాధ్యత ఎవరిది? సరుకులన్నీ కూడా చంద్రన్న విలేజ్ మాల్స్‌లోనే కొనుగోలు చేసేలా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలు 1.40 కోట్లు ఉంటే వీటిలో దాదాపు 80 శాతం కుటుంబాలు సబ్సిడీ బియ్యం తినడంలేదని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే బియ్యం వద్దనుకునే లబ్దిదారులకు వాటికయ్యే మొత్తాన్ని లెక్కకట్టి అదే మొత్తానికి చంద్రన్న మాల్స్‌లో సరుకులు తీసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రచారం చేస్తోంది. అంటే ఆ మేరకు మార్కెట్ అంతా ఆ మాల్స్‌కు తరలించబోతున్నారన్నమాట. కొత్తగా ప్రవేశపెట్టనున్న చంద్రన్న విలేజ్ మాల్స్‌లో నాణ్యమైన సరుకులు కాకుండా నాసిరకం విక్రయిస్తే ఎవరు చర్యలు తీసుకుంటారనేది అర్థంకాని సమస్య. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండటంతో వారు ఎలాంటి సరుకులు విక్రయించినా అధికారులు పట్టించుకొనే పరిస్థితి కూడా ఉండదు. గత మూడేళ్లుగా సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు ఐదు రకాల వస్తువులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. నాణ్యత లేకపోతే వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లు, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించినా ఇప్పటికీ చర్యలు లేవు. బెల్లం, గోధుమ పిండి నాసిరకంగా ఉందని కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. బాధ్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పినా ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రేషన్ షాపులను క్రమంగా నీరుగార్చారు.. రేషన్ షాపులను ఒక పథకం ప్రకారం ప్రభుత్వమే నీరుగార్చుతోందనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకులను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో బియ్యం, కిరోసిన్‌తో పాటు మరో తొమ్మిది రకాలైన సరుకులు కందిపప్పు(1 కిలో), పామాయిల్ (1 లీటర్), గోధుమపిండి(1 కిలో), గోధుమలు(1 కిలో), ఉప్పు(1 కిలో), చక్కెర(అర కిలో), చింతపండు(అర కిలో), కారం పొడి(250 గ్రాములు), పసుపు పొడి(100 గ్రాములు) ఒక బ్యాగులో ఉంచి ఒక్కో లబ్దిదారుడికి రూ.185లకు ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ 9 రకాల సరుకులకు మంగళం పాడటమే కాకుండా కిరోసిన్‌ను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం బియ్యం ఒక్కటే పేదలకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. పేదలకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించాలన్న లక్ష్యంతో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తే ఆ తర్వాత అదే పార్టీ నుంచి సీఎం పీఠం మీద కూర్చొన్న చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకోవడం గమనార్హం. ఖర్చు మాపై వేస్తే ఎలా? : రేషన్ డీలర్ల ఆందోళన చంద్రన్న విలేజ్ మాల్స్ అలంకరణ కోసం ఒక్కో రేషన్ డీలర్‌పై రూ. 1.25 లక్షలు భారం మోపాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు పేర్కొన్నారు. మాల్స్ ఏర్పాటుపై ఇప్పటి వరకు రేషన్ డీలర్లతో ఎలాంటి చర్చలూ జరపకుండానే ముందుకెళ్లడం అన్యాయం. డీలర్లను అడకుండానే వారి పేరిట ముద్ర బ్యాంకు ద్వారా ఒక్కొక్కరి పేరిట రూ. 1.25 లక్షలు రుణం తీసుకొని ఖర్చు చేస్తే వాటిని తిరిగి తామెలా చెల్లిస్తామని ప్రశ్నించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ నిర్వహణ రేషన్ డీలర్లకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు చెందిన వ్యక్తులను కౌంటర్లో కూర్చోబెట్టి వారి చేత డబ్బులు వసూలు చేస్తే తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చి వారి నుంచి ప్రతిఫలం పొందాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. అందుకే రేషన్ షాపులను వారికి అప్పగించి అందులో అన్ని సరుకులూ విక్రయించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కార్పొరేట్ చేతుల్లోకి అప్పజెప్పొద్దని డీలర్లు పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా స్పష్టమైన హామీ రాకపోవడంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులు మూసేసే ఎత్తుగడ చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో బడా రిటైల్ సంస్థలతో కలిసి రేషన్ షాపులను మూసే వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మార్కెట్ ధర కంటే 12 శాతం తక్కువ ధరకు సరుకులు ఎలా ఇవ్వగలరో ప్రభుత్వం వివరించాలి. చంద్రన్న మాల్స్ పేరుతో షాపులు తెరిస్తే కిరాణాషాపుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత తప్పదు. మల్టీ నేషనల్ కంపెనీలతో చేతులు కలిపి ఇటు రేషన్ దుకాణాలను, ఇటు కిరాణా షాపులను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి ప్రభుత్వమే వత్తాసు పలకడం దారుణం. ఆతుకూరి ఆంజనేయులు, అధ్యక్షులు, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్. -
విలేజ్ మాల్స్‌గా రేషన్ షాపులు
-
అన్న విలేజ్ మాల్స్‌గా రేషన్ షాపులు
సాక్షి, అమరావతి: రేషన్ షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తొలి విడతలో 6,500 రేషన్ షాపులను ‘అన్న విలేజ్ మాల్స్’గా మార్చాలని సూచించారు. ఈ మేరకు తయారు చేసిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పౌరసరఫరాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ మాల్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ప్రత్యేక లోగో తయారుచేయాలని ఆదేశించారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ‘అన్న విలేజ్ మాల్’ కోసమయ్యే వ్యయంలో 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరో 25 శాతం వ్యయాన్ని ‘ముద్ర’ నుంచి డీలర్‌కు రుణంగా ఇప్పిస్తుంది. ఈ విలేజ్ మాల్స్‌లో డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతో పాటు రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. అలాగే బందరు లడ్డు, కాకినాడ కాజా వంటి స్వీట్లతో పాటు పలురకాల పచ్చళ్లు కూడా లభిస్తాయి. విలేజ్ మాల్స్‌లో ఎవరైనా తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలనుకుంటే.. ఆ సౌలభ్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక రేషన్ బియ్యం వద్దనుకునే తెల్ల కార్డుదారులకు.. అంతే విలువైన ఆహార పదార్థాలను విలేజ్ మాల్స్ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 4,599 రేషన్ షాపులకు వెంటనే డీలర్లను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులకు మార్కెట్ కన్నా 50 శాతం తక్కువ ధరకే అర కిలో పంచదార పంపిణీ చేయాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అందించే రేషన్‌లో పంచదారను కూడా జత చేయాలని చెప్పారు. అలాగే రజక, మత్స్యకార తదితర సామాజికవర్గాల వారికి వైట్ కిరోసిన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. -
విలేజ్ మాల్స్‌లో మూడు రకాల సరుకులే..
– డీఎస్ఓ తిప్పేనాయక్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): చౌక దుకాణాల్లో డిసెంబర్ నెల నుంచి మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరకు మూడు రకాల సరుకులు మాత్రమే పంపిణీ చేయనున్నారు. చౌక దుకాణాలను విలేజ్ మాల్స్‌గా మార్చి గ్రామీణ ప్రజలు ఎక్కువగా వినియోగించే సరుకులను ప్రయోగాత్మకంగా పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ తిప్పేనాయక్ తెలిపారు. 5రకాల సరుకులు ఇవ్వాల్సి ఉందని.. అయితే డిసెంబర్ నెలలో వేరుశనగ విత్తనాలు, కందిపప్పు పెసరపప్పు మాత్రమే పంపిణీ చేస్తున్నామని, వీటిని కిలో ప్యాకెట్లలో ఇస్తామన్నారు. ఎండుమిర్చి పౌడరు, అయోడైజ్డ్ ఉప్పు పంపిణీ చేయాలని భావించినా సాధ్యం కాలేదన్నారు. వేరుశనగ విత్తనాలు, కందిపప్పు కిలో ప్యాకెట్లు రెండు లక్షల ప్రకారం సిద్ధం చేస్తున్నామని, పెసర పప్పు ప్యాకెట్లు మాత్రం లక్ష ప్యాకెట్లు సిద్ధం చేయిస్తున్నామన్నారు. డిమాండ్ ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో లక్ష ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇది విజయవంతం అయితే జనవరి నుంచి కార్డుదారులందరికీ ఇస్తామన్నారు. విధిగా సరుకులు తీసుకోవాలనే నిబంధన లేదని.. కావాల్సిన వారు మాత్రమే తీసుకోవచ్చన్నారు. -
అప్పు చేసి పప్పు కూడు
- అరువు పద్ధతిలో విలేజీ మాల్స్ నిర్వహణ – అధికారులపై భారం మోపిన ప్రభుత్వం – ఇదెక్కడి గోలంటున్న అధికారులు అనంతపురం అర్బన్ : చౌక దుకాణాలను విలేజీ మాల్స్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికారులకు కంటకంగా మారింది. రేషన్ సరుకులతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పంపిణీకి సంబంధించి సరైన మార్గదర్శకాలు ఇవ్వకుండా నిర్వహణ భారం ప్రభుత్వం అధికారులపై మోపింది. 'అరువు' పద్ధతిలో విలేజీ మాల్స్ నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను ఎలా అమలు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సరుకులు అప్పుగా తేవాలి.. విలేజి మాల్స్‌లో రేషన్ సరుకులతో కార్డుదారులకు నిత్యావసర వస్తువులు కందిపప్పు, పామాయిల్, ఉల్లిగడ్డలు, ఉప్పు, తదితర వాటిని కార్డుదారులకు పంపిణీ చేయాలి. ఈ సరుకులను జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ అప్పు రూపంలో తెప్పించాలి. డీలర్లకు అప్పుగానే అందజేయాలి. ఈ సరుకుల విలువ మొత్తం రూ.300 మించకూడదు. అమ్మగా వచ్చిన డబ్బును డీలర్లు అధికారుల ఖాతాలో జమ చేయాలి. ఆ మొత్తాన్ని సరుకులు ఇచ్చిన వ్యాపారులకు అధికారులు చెల్లించాలి. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాని ప్రారంభించాలి. దీన్ని జిల్లా సరఫరాల అధికారి నిర్వహించాలి. మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు ఇవ్వాలి.. విలేజీ మాల్స్‌లో మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు సరుకులను పంపిణీ చేయాలి. కిలో కందిపప్పు రూ.90, పామాయిల్ లీటరు రూ.52, ఉల్లిగడ్డలు కిలో రూ.8, ఉప్పు ప్యాకెట్ రూ.15, ఆలు గడ్డలు కిలో రూ.15కి ఇవ్వాలి వీటితో పాటు మరికొన్ని నిత్యాసవర సరుకులను కూడా పంపిణీ చేయవచ్చు. ఇవన్నీ ప్యాకెట్ రూపంలోనూ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 20 శాతం కార్డుదారులకే సరుకులు.. ప్రతి చౌక దుకాణంలో ఈ ప్రక్రియని ప్రారంభించి కనీసం 20 శాతం కార్డుదారుకులకు సరుకులు ఇచ్చేలా కలెక్టర్ చర్యలు చేపట్టాలి. మిగిలిని 80 శాతం కార్డుదారుల పరిస్థితి ఏమిటని అధికారులే ప్రశ్నిస్తున్నారు. పైగా అంత మొత్తంలో సరుకుల్ని అప్పుగా ఎలా తేవాలో అర్థం కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
విలేజ్ మాల్స్ నిర్వహణకు టెండర్లు
కర్నూలు(అగ్రికల్చర్): విలేజ్ మాల్స్‌కు సరుకుల సరఫరాకు శనివారం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కాంట్రాక్టర్లతో నెగోషియస్ నిర్వహించారు. కంది పప్పు, ఎండు మిర్చి పౌడర్, అయోడైజ్డ్ ఉప్పు తదితర నిత్యావసర వస్తువుల సరఫరా చేసేందుకు ఇటీవల టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. దాఖలు చేసిన టెండర్లనే జేసీ తెరిచారు. 8 మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఇందులో ముగ్గురుకి మాత్రమే అర్హత లభించింది. వీరితో జేసీ ధరలను ఖరారు చేసేందుకు నెగోషియస్ నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇది కొలిక్కి రాలేదు. చౌకదుకాణాల ద్వారా మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరకు సరకులు పంపిణీ చేసేందుకు జేసీ చర్యలు తీసుకున్నారు. డిసెంబరు నెలలో మొత్తం కార్డులలో 20 శాతం కార్డులకు అదనపు సరుకులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ తిప్పేనాయక్ కూడా పాల్గొన్నారు. -
విలేజ్ మాల్స్‌గా చౌక దుకాణాలు
ఒకే చోట అన్ని నిత్యావసరాల పంపిణీకి చర్యలు – మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు పంపిణీ – డిసెంబర్లో 20 శాతం కార్డులకు పంపిణీ చేయాలని నిర్ణయం కర్నూలు(అగ్రికల్చర్): గ్రామాల్లోని చౌక ధరల దుకాణాలు విలేజ్ మాల్స్‌గా మారనున్నాయి. ఇప్పటి వరకు వీటి ద్వారా బియ్యం, కిరోసిన్, చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ నెల నుంచి షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చి మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో అమలుపై జాయింట్ కలెక్టర్ నేతృత్యంలో కసరత్తు జరుగుతోంది. డిసెంబర్ నెలలో 20శాతం కార్డుదారులకు అదనపు సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించడంతో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విలేజ్ మాల్స్ ద్వారా కందిపప్పు, పామోలిన్ ఆయిల్, అయోడైజ్డ్ ఉప్పు, ఉల్లి, బంగాళ దుంపలను మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించారు. స్థానిక పరిస్థితులను బట్టి ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయవచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అదనంగా కారంపొడి, శనగపప్పు, పెసరపప్పు కూడా పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సరుకులను జిల్లా స్థాయి నుంచే సరఫరా చేస్తారు. నిబంధనల ప్రకారం టెండర్ పిలిచి ధరలను ఖరారు చేసి వారి ద్వారా గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే డిసెంబర్ మొదటిì వారం నుంచే పంపిణీ చేయల్సి ఉండటం వల్ల సమయం లేనందున హోల్‌సేల్ డీలర్లతో చర్చించి వారి ధరలు ఖరారు చేసి ఆ మేరకు చర్యలు చేపట్టనున్నారు. అయితే రూ.300 విలువ వరకు మాత్రమే ఈ సరుకులు ఇస్తారు. సరుకలు ఎట్టి పరిస్థితుల్లో లూజుగా ఇవ్వరాదు. ప్యాకింగ్‌లో మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున అమలు చేయాలని జేసీ భావిస్తున్నారు. డిసెంబర్లో 20శాతం కార్డులకు పంపిణీ చేయడంలో విజయవంతం అయితే జనవరి నెల నుంచి కార్డుదారులందరికీ వీటిని పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఐదు రకాల సరుకుల మార్కెట్ ధరలు, మాల్స్ ధరలు ఇలా.. సరుకు పేరు మార్కెట్ ధర 20 శాతం తక్కువ ధర –––––––––––––––––––––––––––––– కందిపప్పు రూ.120 రూ. 90 పామోలిన్ ఆయిల్ రూ. 65 రూ. 52 ఉప్పు రూ. 20 రూ.15 ఉల్లి రూ.10 రూ. 8 బంగాళదుంప రూ.20 రూ.15 –––––––––––––––––––––––––––––– -
చౌక దుకాణాలు.. ఇక 'విలేజ్ మాల్స్'
అనంతపురం అర్బన్ : చౌక ధరల దుకాణాలు 'విలేజ్ మాల్స్'గా పరిగణిస్తూ, అన్ని రకాల సరుకులు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఇక నుంచి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, గోధుమ పిండి, చక్కెర, కిరోసిన్‌తో పాటు కందిపప్పు, ఉప్పు, ఉల్లిపాయలు, సబ్బులు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అంశంపై బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో బ్యాంకర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి చౌక దుకాణానికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఇవ్వాలని లక్ష్మీకాంతం బ్యాంకర్లకు సూచించారు. డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించాలన్నారు. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) యంత్రాల వినియోగం, ఆన్లైన్ లావాదేవీలుపై గురువారం డివిజన్ వారీగా ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓలకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వాలన్నారు. -
‘చౌక’ సరుకులపై సర్కారు నీళ్లు!
విలేజ్ మాల్స్ ప్రతిపాదనను పక్కన పెట్టిన ప్రభుత్వం దసరా నుంచి 18 వస్తువులను చౌకగా అందిస్తామని హామీ కొత్త సంవత్సరం వస్తున్నా పట్టించుకోని పౌరసరఫరాల శాఖ సాక్షి, హైదరాబాద్: విలేజ్ మాల్స్ ద్వారా చౌక ధరలకు సరుకులు అందుతాయనుకుంటున్న ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. దసరా నుంచి విలేజ్ మాల్స్ ద్వారా 18 రకాల సరుకులను చౌక ధరలకే అందిస్తామని ప్రకటించిన పౌరసరఫరాల శాఖ.. ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదు. కొత్త సంవత్సరం వస్తున్నా దాని గురించి ఆలోచించడంలేదు. ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేసిందని, ఇక విలేజ్ మాల్స్ కథ కంచికి చేరినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దసరా నుంచి రాష్ట్రవ్యాప్తంగా 46 వేల గ్రామాల్లో విలేజ్ మాల్స్ ఏర్పాటు చేసి 18 రకాల వస్తువులను సరసమైన ధరలకు అందిస్తామని పౌరసరఫరాల కార్పొరేషన్ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. ఉత్పత్తిదారుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసిన వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా తక్కువ ధరతో ప్రజలకు అందించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రజలు నిత్యం వినియోగించే కాఫీ పొడి, టీ పొడి, సబ్బులు, టాల్కం పౌడర్, డిటర్జెంట్లు, టూత్‌పేస్టులు తదితర 18 రకాల వస్తువులను విక్రయించాలని నిర్ణయించారు. తర్వాత మరిన్ని వస్తువులను ఇందులో చేర్చాలని యోచించారు. తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన సంస్థలకు చెందిన వస్తువులను చౌక ధరల దుకాణాల డీలర్ల ద్వారా అమ్మించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ‘‘46 వేల చౌక దుకాణాల్లో సరుకులు అమ్మితే తయారీ సంస్థలకు కూడా మేలు జరుగుతుంది. ఉత్పత్తి సంస్థలు రాష్ట్ర స్థాయి అధీకృత డీలర్లకు ఇచ్చే ధరలకే వస్తువులను చౌక ధరల దుకాణాలకు సరఫరా చేస్తారు. దీంతో చౌక దుకాణాలను విలేజ్ మాల్స్‌లా మార్చి తక్కువ ధరకు గ్రామీణ ప్రజలకు సరుకులు అందించవవచ్చు. దీని వల్ల ప్రజలకు మేలు జరగడమేకాకుండా చౌక దుకాణాల డీలర్ల ఆదాయం కూడా కొంత పెరుగుతుంది’’ అని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఇది మంచి ఆలోచన అయినా దీనిని ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఈ విషయమై పౌరసరఫరాల సంస్థ అధికారులను సంప్రదించగా.. ‘‘కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలను క్రమబద్ధంగా నిర్వహించాలంటేనే తలనొప్పి తప్పడంలేదు. కొత్త తలనొప్పులు ఎక్కడ తెచ్చుకుంటాం’’ అని ప్రశ్నిస్తున్నారు. ఉన్న పథకాలను సక్రమంగా నిర్వర్తించడానికే ప్రాధాన్యం ఇస్తామని పౌరసరఫరాల అధికారి ఒకరు అన్నారు.