విలేజ్ మాల్స్ నిర్వహణకు టెండర్లు
Published Sat, Nov 26 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
కర్నూలు(అగ్రికల్చర్): విలేజ్ మాల్స్‌కు సరుకుల సరఫరాకు శనివారం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కాంట్రాక్టర్లతో నెగోషియస్ నిర్వహించారు. కంది పప్పు, ఎండు మిర్చి పౌడర్, అయోడైజ్డ్ ఉప్పు తదితర నిత్యావసర వస్తువుల సరఫరా చేసేందుకు ఇటీవల టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. దాఖలు చేసిన టెండర్లనే జేసీ తెరిచారు. 8 మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఇందులో ముగ్గురుకి మాత్రమే అర్హత లభించింది. వీరితో జేసీ ధరలను ఖరారు చేసేందుకు నెగోషియస్ నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇది కొలిక్కి రాలేదు. చౌకదుకాణాల ద్వారా మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరకు సరకులు పంపిణీ చేసేందుకు జేసీ చర్యలు తీసుకున్నారు. డిసెంబరు నెలలో మొత్తం కార్డులలో 20 శాతం కార్డులకు అదనపు సరుకులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ తిప్పేనాయక్ కూడా పాల్గొన్నారు.
Advertisement
Advertisement