అబద్ధాలూ.. అతకలే! | Civil Supply Manager Description | Sakshi
Sakshi News home page

అబద్ధాలూ.. అతకలే!

Published Thu, Dec 25 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

అబద్ధాలూ.. అతకలే!

అబద్ధాలూ.. అతకలే!

* గోదాముల్లో గోల్‌మాల్ లేదట..!
* ‘సాక్షి’కి సివిల్ సప్లయ్ మేనేజర్ వివరణ

సాక్షి, టాస్క్‌ఫోర్స్, మెదక్: కోట్లాది రూపాయలు ఖర్చు చేసి.. ప్రజా సంక్షేమం కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం (సివిల్ సప్లయ్) అక్రమార్కుల పాలవుతున్నాయని, వీటిని రవాణా చేయకుండానే చేసినట్లు గోదాం స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేస్తున్న వైనంపై ‘గోదాములో గోల్ మాల్ ’ శీర్షికతో ఈ నెల 21న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందిం చిన మంత్రి హరీష్ విచారణకు ఆదేశించారు. అయితే కథనంపై  సివిల్ సప్లయ్ మేనేజర్ జయరావు ఈ నెల 22న పత్రికలకు వివరణ ఇచ్చారు. ఈ కాపీ బుధవారం ‘సాక్షి’కి చేరింది. దీనిలో ‘గోదాముల్లో గోల్‌మాల్’ పూర్తిగా అవాస్తవమని ఖండించారు.

ఆయన వివరణ అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉంది. కథనంలో ని వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు  విచారణ లేకుండానే అ క్రమాలకు పాల్పడుతున్న వారిని వెనకేసుకొచ్చినట్లు ఉంది. పాపన్నపేట గోదాం ఇన్ చార్‌‌జ నరేందర్ బదిలీ కావడంతో, ఆయన  స్థానంలో శంకరంపేట గోదాం ఇన్‌చార్జి నర్సిం లుకు పాపన్నపేట అదనపు బాధ్యతలు అప్పజెప్పామని, తప్పనిసరి పరిస్థితిలో నర్సిం లు చేతనే పాపన్నపేట గోదాంలో సరుకులు పంపిణీ చేయించామని వివరణ ఇచ్చారు. అం తేకాకుండా పాపన్నపేట, టేక్మాల్‌లో రెవెన్యూ సిబ్బంది లేకపోవడం వల్లేశంకరంపేట గో దాం ఇన్‌చార్జిని పాపన్నపేటకు తాత్కాలిక ఇన్‌చార్జిగాని యమించామన్నారు. ఆర్‌ఓలు రాయకుండానే స్టేజి-1,స్టేజి-2 గోదాముల్లో ఆక్రమా లు జరుగుతున్నాయనడం అవాస్తవమన్నారు.
 
 సారూ.. ఈ ప్రశ్నలకు బదులేవీ..
* పాపన్నపేట గోదాంకు ఇన్‌చార్జిగా నియమించిన శంకరంపేట గోదాం ఇన్‌చార్జి నర్సింహులేనా? ఈ వ్యక్తి ఎవరికి బంధు వు? రెవెన్యూ శాఖతో సంబంధం లేని ఈ ప్రైవేటు వ్యక్తి ఏ హోదాలో పాపన్నపేట గోదాంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. అది తేల్చి చెప్పండి. గతంలో కూడా ఈ వ్యక్తే గోదాం ఇన్‌చార్జి నర్సింహులుకు బదులు విధులు నిర్వహించడంపై మీకు ఫిర్యాదులు అందింది నిజమా కాదా..?
* పాపన్నపేటలో ఇద్దరు ఆర్‌ఐలు ఉన్నా, వారిని కాదని నర్సింహులుకు ఎలా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు? ‘సాక్షి’లో కథ నం వచ్చాక అప్పటికప్పుడు ఉరుకులు పరుగుల మీద బుధవారం రోజున నర్సింహులును తప్పించి పాపన్నపేట ఆర్‌ఐ మారుతికి బాధ్యతలు ఎందుకు అప్పగించారు..?
* ఇక మీరు చెప్పినట్టే అక్రమాలు అవాస్తవం అనుకుందాం. ‘సాక్షి’ కథనం వచ్చిన రోజునే మంత్రి హరీష్‌రావు ఎందుకు స్పం దించారు. సివిల్ సప్లయ్ గోదాంలపై ఇప్పటికీ మూడు సార్లు ఫిర్యాదులు వచ్చాయని అదే రోజు సిద్దిపేటలో జరిగిన ఒక సభలో ఆయన స్వయంగా ఎందుకు చెప్పారు. విచారణ జరపాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఎందుకు సూచించారు.

మరి మీరు ఏ గో దాం లోనైనా విచారణ జరిపారా..! కనీసం ‘సాక్షి’ ఆరోపణ చేసిన గోదాంలోనైనా తని ఖీలు చేశారా?   చేస్తే  వివరణలో ఎందుకు పొం దుపరచలేదు.   విచారణ జరపకుం డానే గోల్‌మాల్ జరగలేదని ప్రకటించడం, అక్రమార్కులను వెనుకేసుకు రావడం కాదా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement