public welfare
-
vinayakachavithi 2024: ప్రతి భాగం ఓ పాఠం... ..ప్రకృతికి పీఠం
భువనచంద్ర వినాయకచవితి అనేది కేవలం ఒక పండుగ కాదు.. ఈ పండుగ నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఏనుగు తలకాయ.. అంటే పెద్దది. అంటే గొప్పగా ఆలోచించు.. పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అంటే... ‘నాయనా నీ శక్తినంతా మాట్లాడుతూ మాట్లాడుతూ వేస్ట్ చేయకు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా విను.. ఆ విన్నదాన్ని చక్కగా నీ మెదడుతో ఆలోచించు..’ అని అర్థం. ఇక ఆయన పొట్టకు నాగబంధం కట్టేశారు.. అంటే అర్థమేంటీ? జాగ్రత్తగా గమనిస్తే.. నాయనా నువ్వు ఎక్కువ గనుక తిన్నట్టయితే.. అది విషంతో సమానం. అందుకే మితంగా భుజించడం నేర్చుకో.. అందుకే తినే ముందు నీళ్లు జల్లి అమృతమస్తుః అంటాం.. అమృతం ఎప్పుడు అవుతుంది? మితంగా తిన్నప్పుడు అమృతం.. అపరిమితంగా తిన్నప్పుడు అది విషం. మనం తినేటటువంటి ఆహారం ఎలుకలు గనుక తినేస్తే.. ఎలుకలను గనుక కంట్రోల్లో పెట్టక΄ోతే మనిషికి గింజ కూడా దొరకదు. అందు గురించే ఆయనకు వాహనంగా పాదాల దగ్గర ఎలుకను ఉంచి ఎలుకలను కంట్రోల్లో పెట్టుకున్నావో నీ ఆహారం సేవ్ అవుతుంది అని సూచిస్తున్నారు.వినాయకుడి చేతిలోని అంకుశం... దేన్నైనా కంట్రోల్ చేసుకునే పవర్.. ఏ బంధమైనా.. స్నేహం కావచ్చు.. ఏదైనా నిర్ణయం కావచ్చు.. అంకుశం ఏంటంటే.. నువ్వు ఏది చేయాలనుకున్నా ఆ చేస్తున్నది కరెక్టా కాదా అనేది మన చేతుల్లో ఉండాలి. తర్వాత పాశం.. రిలేషన్స్.. ఇలా వినాయకుడి శరీరంలో ఉండే ప్రతి భాగమూ మనకు ఒక పాఠం లాంటిది. జీవిత పాఠం అది. గ్రామాల్లో స్థానికంగా ఉండే దేవతల్లో లక్ష్మీ, వినాయకుడు ఇద్దరూ ఉంటారు. ఆహార ఉత్పత్తి, పొదుపు వల్ల సమృద్ధి. నాకు ఒకరు గొప్ప మాట చె΄్పారు. ఆరోజుల్లో జీతాలు తక్కువ వచ్చేవి కదా.. అప్పుడు ఒకరు చె΄్పారు. అది చాలా మంచి మాట. ‘ఏమండీ.. మా ఇంట్లో చింతపండు, ఉప్పు, ఎండు మిరిపకాయలు, బియ్యం కచ్చితంగా ఎప్పుడూ ఉంచుతానండీ... జీతం రాగానే మొట్టమొదట ఎక్కువ మోతాదులో అవే తీసుకుంటానండి’ అని. ‘అదేంటీ?’ అన్నాను. ‘మన ఇంటికి పది మంది అప్పటికప్పుడు వచ్చారనుకోండి.. ఆ నాలుగు పదార్థాలుంటే కనీసం చారన్నం అయినా పెట్టొచ్చు కదా?’ అని సమాధానం ఇచ్చారు. అంటే మిగిలినవన్నీ లగ్జరీ ఐటమ్స్.ఇక తర్వాత లేఖిని.. వ్యాసుడు చెబుతుంటే మహాభారతం రాయడం. ఇక్కడ లేఖిని అంటే అక్షరం రాయడం మాత్రమే కాదు.. ఏ విద్యైనా సిద్ధింపచేయాలంటే మొట్టమొదట చెవులు కరెక్ట్‌గా ఉండాలి.. బుర్ర కరెక్ట్‌గా ఉండాలి. అందుచేత సిద్ధి వినాయకుడు.. ఏది మొదలుపెట్టినా ‘అయ్యా ఇది నేర్చుకోదలిచాను.. నన్ను సిద్ధింపచేసే శక్తి నీలో ఉంది గనుక ఈ సిద్ధి నాకు ్రపాప్తించేలా చూడు’ అని నమస్కరిస్తాం. చిన్నతనంలో కూడా అందుకే వినాయకచవితి వచ్చిందంటే.. పుస్తకాలు, అట్టలు.. పెన్నులు అన్నీ స్వామి వారి ముందు ఉంచి పూజ చేసుకుంటాం. ఏ పని మొదలుపెట్టినా.. ఇల్లు కట్టినా.. పెళ్లి చేసినా వినాయకుడికి మొట్టమొదటి స్థానం ఎందుకు ఇస్తారంటే.. ఆయన సిద్ధి కావాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేనిదే సిద్ధి లేదు. నిజానికి కుమారస్వామితో ఆయన ΄ోటీ పడినప్పుడు కూడా ఆయన బుద్ధిని ఉపయోగించాడు.. అందుకే ఆయన భార్యలను సిద్ధి బుద్ధి అంటాం.. నీ బుద్ధిని గనుక సక్రమంగా వినియోగించినట్లు అయితే ఆటోమేటిక్‌గా సిద్ధి లభిస్తుంది. వినాయకచవితి ఏం చెబుతుందంటే.. ఏది చేసినా శ్రద్ధతో చెయ్.. చక్కటి ఆలోచనలతో ఉండాలి. ఆయన కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. చిన్నగా అంటే అర్థం ఏంటీ? సూక్ష్మమైనదాన్ని కూడా చూడగలగాలి. చీమ కన్ను ఎంత చిన్నగా ఉంటుంది? దానికి కూడా ఆహారం దొరుకుతుంది కదా? అట్లాగే ఏనుగు కళ్లు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ అతి సూక్ష్మమైన కదలికలను కూడా అది పట్టుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. జంతువులు అన్నింటిలోనూ చక్కటి బ్రెయిన్ ఉన్న జంతువు ఏనుగు. అదే నెంబర్ వన్ . మానవుడికి ఎంత శక్తి ఉంటుందో అంత పవర్ దానికి ఉంది. పత్రి అనేది మనం ఎందుకు కోసుకొస్తాం? వెలగ, వాక్కాయ్ వంటివన్నీ ఎందుకు తీసుకొస్తాం పూజకి? ఎందుకంటే ఈ సీజన్ లో వాక్కాయ్ పచ్చడి తినమంటే ఎవరూ తినరు..? అందుకే వాక్కాయ్ – కొబ్బరికాయి, కొబ్బరికాయ – వెలగ కలిసి చేసుకుంటాం. నిజానికి ఈ సీజన్ లో ఇవి తింటేనే రోగనిరోధక శక్తి అద్భుతంగా పని చేస్తుంది. రెండొవది ఆకులు దూసిన తర్వాత కొత్త ఆకులువస్తాయి. అలా కాకుండా ఆ ఆకులు మొక్కకే ముదిరి΄ోతే అక్కడితో ఎండ్ అయి΄ోతుంది. ప్రతి ఔషధ మొక్కలను సజీవంగా ఉంచాలంటే పాత ఆకుల్ని పీకాలి. ఇక కామెర్లకు నేల ఉసిరి బెస్ట్ మెడిసిన్ . ప్రకృతిని రక్షించేవాడు దేవత.. ప్రకృతిని రక్షిస్తూ.. ప్రకృతి మీద ఆధారపడేవాడు మానవుడు. ప్రకృతిని నాశనం చేసేవాడు రాక్షసుడు. ప్రకృతితో సహజీవనం చెయ్ అని చెప్పే ఏకైక పండుగ వినాయకచవితి.సుద్దాల అశోక్‌తేజ వినాయచవితి పట్ల నా పరిశీలన ఏంటంటే పురాణాలు కానివ్వండి.. ప్రబంధాలు కానివ్వండి.. కల్పనలు కావచ్చు.. యదార్థంగా జరిగినవి కావచ్చు.. ఏవైనా.. ఏవైనా సరే.. ప్రజాశ్రేయస్సు కోసం, ప్రకృతి శ్రేయస్సు కోసం రాసినవే.. పుట్టించినవే.. శంకరుడు.. పార్వతమ్మ ఉన్న ఇంట్లోకి వెళ్లబోతుంటే ఒక పిల్లోడు అడ్డుకుంటాడు.. అతడిపై ఆగ్రహించి శిరచ్ఛేదం చేశాడు. ఇది కదా కథ? తర్వాత పార్వతమ్మ వచ్చి.. బాగా ఏడ్చి.. భర్త మీద కోప్పడితే.. మళ్లీ బతికించాడు.. ఫస్ట్ ఏంటంటే.. తొందరపాటుతనం మనుషులకే కాదు.. దేవతలమైన మాకు కూడా ఉంటుందని చెప్పడమే ఆ పసివాడ్ని చంపడం.. ఒక తొందరపాటులో ఇన్ని అనర్థాలు జరగుతాయి అని చెప్పడానికి ఈ కథ ఏర్పడింది అనుకుంటాను.. శివుడు సహనంగా ఉండి ఉంటే చంపేవాడు కాదు కదా.. నంబర్ 2– ఎంత పరమేశ్వరుడైనా భార్యకు శరీరంలో సగభాగం ఇచ్చాడు.. అదొక ఆదర్శమైతే.. భార్య అతడు చేసిన పొరబాటు గురించి చెప్పగానే.. ఎక్కడా పురుషాధిక్యత లేకుండా తన పొరబాటు తాను గ్రహించాడు.. అంటే ఇక్కడ స్త్రీలను ద్వితీయశ్రేణి పౌరుల్లా భావించడం తప్పు అని తన ఈ చర్య ద్వారా తెలిపాడు.. ‘నేను భర్తను, నువ్వు భార్యవి.. అవును చంపేశాను.. నా ఇష్టం..’ అని ఉంటే ΄ోయేది కదా..? కానీ అలా అనలేదు.. పొరబాటు గ్రహించడమే కాదు.. భార్య చెప్పిన దిద్దుబాటు చర్యకు పూనుకున్నాడు. తనకన్నా చిన్నవాళ్లు చెప్పినా.. భార్య చెప్పినా.. మంచి చెప్పినప్పుడు మనం దాన్ని సవరించుకోవాలి.. వీలైతే ఆచరించుకోవాలి.. అనేది రెండో ఘటన.మూడవది ఇది చాలా చిత్రం అనిపిస్తుంది నాకు. తలను తీసేశాడు.. భార్య వచ్చి ఏడవగానే ఉన్న తలను అతికించొచ్చు కదా? ఎన్నో మాయలున్నవాడు.. పైగా నరికిన తల పక్కనే ఉంటుంది కదా? ఆ తలను అతికించకుండా ఏనుగు తల తీసుకుని రావడం ఎందుకు? ఎందుకు అంటే.. మనిషికి ఎంత ్రపాధాన్యత ఉందో.. దేవతలకు ఎంత ్రపాధాన్యత ఉందో.. జంతువులకు కూడా అంతే ్రపాధాన్యత ఉంది అని చెప్పడానికన్నమాట. అంటే ప్రకృతిని గౌరవించడం అనిమాటే. ‘‘నువ్వు జీవించు మిగతా వాటిని జీవించనివ్వు’’ అని చెప్పడం కోసం ఒక జంతువుకి అపారమైన ్రపాధాన్యత ఇవ్వడం కోసం ఏనుగు తలకాయ పెట్టి ఉంటాడా? ఇవన్నీ నా ఆలోచనలే.. నా వ్యక్తిగతమైనవి.తర్వాత శంకరుడి దగ్గర కైలాసంలో పరస్పర శత్రువులైన జంతువులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఎలుకలను తినే పాము పక్కనే ఉంటుంది. పాముని తినే నెమలి పక్కనే ఉంటుంది. మూడు పరస్పర వైషమ్యాలు కలిగిన జీవరాశులకు కూడా సమానమైన గౌరవం ఇస్తూ సమానమైన జీవితావకాశాన్ని ఇచ్చిన వాడు శివుడు. కైలాసంలో జాతీయ జంతువు ఎవరో తెలుసా..? ఎద్దు. ఎద్దుని వాహనం చేసుకున్నవాడు శివుడు. బ్రహ్మ కమలం మీద ఉంటాడు. విష్ణువు ఆదిశేషువు మీద ఉంటాడు. కాని శివుడు రైతుకి, వ్యవసాయానికి దగ్గరగా ఉన్న ఎద్దును వాహనంగా ఎంచుకున్నాడు. ఇక వినాయకుడిని పూజించే దగ్గర.. సాధారణంగా మనం లక్ష్మీదేవిని పూజిస్తే మన దగ్గర ఉన్నవో లేనివో నాణాలు తెచ్చిపెడతాం.. లేదా ఆరోజు బంగారం ఏదొకటి కొనుక్కుని పెడతాం. కానీ వినాయకుడికి అవేం ఉండవు. చెరకు, పత్రి, గరిక ఇలా అతి చౌక ఆకులు.. సులభంగా ప్రకృతిలో దొరికే వాటిని తెచ్చి పెడతాం. ప్రకృతి, ప్రకృతిలోని జీవులు, పరమాత్మ మూడు సమానమే అని చెప్పేందుకు గుర్తుగా ఈ వినాయకచవితి కొనసాగుతోంది. దీన్నే అందుకోవాలి సమాజం. దీన్ని అందుకోవాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. అందుకే బాలగంగాధర తిలక్ దైవభక్తిలో దేశభక్తిని రంగరించి.. వినాయకచవితిని మొట్టమొదటిసారి ఘనంగా జరిపించారు. అందుకే అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప శక్తిని నింపింది ఈ పండుగ. మా చిన్నప్పుడు వినాయకచవితికి ఇంత క్రేజ్ లేదు..ఇప్పుడు ఇంత ఘనంగా జరుగుతున్నదంటే దానికి కారణం తిలక్. ఆ గొప్పతనం ఆయనదే. ఆ తర్వాత గణపతితో ఏం చేయించినారు.. ప్రపంచ పరుగు పందెం ΄ోటీ పెట్టేస్తే ఎలుక మీదున్న వాడు ఏం గెలుస్తాడులే అని కుమారస్వామి నెమలి మీద వెళ్లి΄ోతుంటే.. వినాయకుడు అమ్మానాన్నలను మించి ప్రపంచం భూగోళంలో ఏముంటుందని చెప్పి మూడు చుట్లు తిరిగితే.. అందరూ కలసి ఎవరు మొదలు వచ్చారంటే.. వినాయకుడే మొదట వచ్చాడు కాబట్టి ఆయన ప్రధాన దేవుడు అయ్యాడు.. ప్రథమ దేవుడు అయ్యాడు.. ఇక్కడ తల్లిదండ్రుల ్రపాధాన్యత కనిపిస్తుంది. ఇది గ్రహించాల్సింది. -
ప్రజాసంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
హుజూర్నగర్, పాలకవీడు: ప్రజాసంక్షేమం.. అభి వృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఫణిగిరి గుట్ట వద్ద రూ.74.80 కోట్లతో 2,160 సింగిల్ బెడ్రూం ఇళ్ల పునర్నిర్మాణ పైలాన్ ఆవిష్కరించారు. రూ.50 లక్ష లతో క్రిస్టియన్ సిమెట్రీ, రూ.కోటితో టౌన్హాల్లో అభివృద్ధి పనులు, రూ.33.83 కోట్లతో పాలకవీడు మండలం బెట్టెతండ గ్రామం వద్ద మూసీనదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పనులకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లా డుతూ.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ఇప్పుడు మరోసారి అవకాశం రావడంతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయ న్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వంలో ధరణి పేరుతో వేలాది కోట్ల ఆస్తులు ఎలా దోచుకుని దాచుకున్నారో..ఆ లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం అభివృద్ధిపై పెట్టలేద ని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లలో అర్హుల ఎంపికకు రాజకీయాలకతీతంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇళ్లు అందించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్షా 12 వేల ఇళ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందిస్తామని చెప్పారు. వంద రోజుల్లో ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అనేక రంగాల్లో అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభు త్వంలో ఎన్నో లిఫ్ట్‌లు, రహదారులు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. త్వరలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లత, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు. -
‘కరోనా’పై అవగాహన పెంచండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్న వదంతులు, తప్పుడు వార్తలు, మూఢ విశ్వాసాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సామాజిక సంక్షేమ రంగంలో ఉన్న సంస్థలను కోరారు. తప్పుడు వార్తలు, కథనాలను ఖండిస్తూ సరైన సమాచారం ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ విశ్వాసాల పేరుతో భౌతికంగా దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ప్రజలు గుంపులుగా గుమికూడుతున్నారని, దీనివల్ల కరోనా వైరస్ మరింత ప్రబలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ రంగంలో పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులతో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సంభాషించారు. దేశం ఇప్పుడు మునుపెన్నడూ కనీవినీ ఎరగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న ప్రధాని.. ఈ గడ్డుకాలంలో పేదలు, ఇతర బలహీన వర్గాలకు నిత్యావసరాలను సమకూర్చడం, వైద్య సదుపాయాలు కల్పించడం, కరోనా పేషెంట్లకు సేవచేయడం తదితర మార్గాల్లో ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలను కోరారు. ‘ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక చర్యలు చేపట్టడంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మానవీయ దృక్పథం, ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉండటం సానుకూలతలు కలిగిన స్వచ్చంధ సంస్థలు ఈ సమయంలో ముందుకు రావాలి’ అన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు చేసే సేవే దేశసేవలో అత్యుత్తమ విధానమన్న మహాత్మాగాంధీ సూక్తిని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోదీ.. యోగా యోగా చేస్తున్న తన 3డీ యానిమేటెడ్ వీడియోలను మోదీ ట్వీట్ చేశారు. ‘ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ఈ సమయంలో మీరేం చేస్తున్నారని మన్ కీ బాత్ సందర్భంగా నిన్న ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించారు. యోగా చేస్తానని, ఆ వీడియోలను షేర్ చేస్తానని చెప్పాను. అందుకే ఇప్పుడు ఈ వీడియోలను ట్వీట్ చేస్తున్నా’ అని మోదీ తెలిపారు. మరోవైపు, విదేశాల్లోని 130 భారతీయ రాయబార కార్యాలయాల అధికారులతో సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా ప్రమాదాన్ని తగ్గించే లక్ష్యంతో భారత్ జనవరి రెండో వారం నుంచే మునుపెన్నడూ తీసుకోనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించిందని వారికి వివరించారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ భద్రత, ప్రజా సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రథమ లక్ష్యాలని నూతన హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హోం మంత్రిగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖ పనితీరు, ప్రస్తుతం శాఖకు సంబంధించిన కీలక అంశాలను అధికారులు వివరించారు. షాతో పాటు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి, నిత్యానంద్ రాయ్ కూడా దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు నార్త్‌బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్ తదితర సీనియర్ అధికారులు మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్లో..‘దేశ భద్రత, ప్రజా సంక్షేమం మోదీ ప్రభుత్వం ప్రథమ లక్ష్యాలు. మోదీజీ నేతృత్వంలో ఈ లక్ష్యాల సాధనకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నారు. -
టీఆర్ఎస్ ప్రజా సంక్షేమాన్ని విస్మరిం చింది...
సాక్షి, అచ్చంపేట రూరల్: ప్రజా సంక్షేమాన్ని విస్మరిం చిన టీఆర్ఎస్ను ప్రజలు నమ్మడం లేదని, కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు ఉందని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, అమ్రాబాద్ జెడ్పీటీసీ అనురాధ అన్నారు. సోమవారం పట్టణంలోని మారుతీనగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన సాగుతుందన్నారు. అలాగే శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో వారు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కటకం జయ, ఎం. లావణ్య, కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్లు శారద, సుశీల, లక్ష్మి, మఖ్బూల్, ఖాజా, భానుప్రసాద్, రమేష్‌గౌడ్, రఘురాం, షకీల్, అప్జల్, మహేష్, శేఖర్, కుమార్ పాల్గొన్నారు. విముక్తి కోసం కాంగ్రెస్‌ను ఆదరించండి మన్ననూర్: కుటిల రాజకీయాలకు పాల్పడుతూ వంచనకు గురి చేస్తున్న టీఆర్ఎస్ పాలకుల నుంచి ఉమ్మడి అమ్రాబాద్ మండలాన్ని విముక్తి చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నానని జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ అనురాధ అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ కూడళిలో ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణకు ఓటు వేయాలని అభ్యర్థించారు. త్యాగాల పునాదులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడంతో పాటూ ఇప్పటికే అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. వజ్రాల అన్వేషణ, వెలికితీత కోసం ఉమ్మడి అమ్రాబాద్ మండలాన్ని ఖాళీ చేయిం చేందుకు కుట్ర చేస్తున్నారని ఇది అందరు గమనించాలన్నారు. ఆమె వెంట వైస్‌ఎంపీపీ సంబు శోభ, సుజాత, నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల ప్రచారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్లబాబి, తుర్కపల్లి, మాచారం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, రేణయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పంబలి బుచ్చయ్య, వైస్‌ఎంపీపీ సంబు శోభ, నాయకులు అంబనారాయణ, నిరంజన్, సుందరయ్య, మల్లయ్య, బాల్‌రాజ్, రామాంజనేయులు, వెంకటేష్, కృష్ణయ్య, ఆనంద్, సిద్ధార్థ, కర్ణ పాల్గొన్నారు. కొండనాగులలో.. బల్మూర్: మండలంలోని కొండనాగులలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సోమవారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ధర్మనాయక్, నాయకులు శ్రీపతిరావు, నర్సింగ్‌రావు, వెంటేశ్వర్లు, బాబు, తదితరులు పాల్గొన్నారు. మద్దిమడుగులో.. అమ్రాబాద్: పదర మండలం మద్దిమడుగులో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకుముందు ఆం జనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు సంబుశోభ, చత్రునాయక్, రాంలింగయ్యయాదవ్, అచ్చిరెడ్డి, బుచ్చయ్య, జూలూరి సత్యనారా యణ, విజ్జప్ప, మల్లికార్జున్, కార్తిక్‌రెడ్డి, లింగం, రాములు, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక ఉప్పునుంతల: మండలంలోని గువ్వలోనిపల్లిలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కట్టా అనంతరెడ్డి, నర్సింహరావు, నాగయ్యగౌడ్, రవికుమార్, ప్రతాప్‌రెడ్డి, రాంచందయ్య, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే వైఎస్సార్ సీపీ ధ్యేయం
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజా సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ఇందుకోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పటిమే సాక్షాత్కరంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన 35 మంది యువత పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, ఐదవ వార్డు అధ్యక్షుడు ఇప్పిలి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పార్టీలో ఆదివారం చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కోలగట్ల, పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్ వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, హక్కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద వారి స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారన్నారు. పార్టీలో చేరిన వారంతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయటం ద్వారా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో జె.రమణమూర్తి, జె.గురువులు, బి.గంగరాజు, జి.జైరామ్, ఎం.ధనరాజ్ తదితరులు ఉండగా... కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నగర కన్వీనర్ ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన.శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్‌వివి.రాజేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నాయకులు బొద్దాన అప్పారావు, బోడసింగి ఈశ్వరరావు, మార్రోజు శ్రీనివాసరావు, రెడ్డి గురుమూర్తి, పూసర్ల చిన్ని, 5వ వార్డు నాయకులు డి.పద్మావతి, ఇప్పిలి త్రినా«ధ్, జె.కామేష్, బి.భాస్కరరావు, సింహాద్రి, ప్రసాదరావు, ఆడారి శ్రీను, పి.కృష్ణ, చందక పైడిరాజు, ఇప్పలి శ్రీను, పిట్ట శ్రీను కన్ని కళ్యాన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికే కొత్త పార్టీ
ఖమ్మంమామిళ్లగూడెం: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రశ్నించే వారిని టార్గెట్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమం కోసమే తాను పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పార్టీ విధివిధానాలను వెల్లడిస్తానన్నారు. శనివారం బడ్జెట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం ఒక విధానం ప్రకారం నడుస్తే బాగుంటుందని చెప్పిన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాంట్రాక్టర్ల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సర్కార్ పని చేస్తోందన్నారు. అందుకే రాజకీయ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. తాను బీజేపీనుంచి కోదండరామ్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ శీలం పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ఊపిరి
సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ శక్తుల కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ.. ప్రజా సంక్షేమమే ఊపిరిగా అవిశ్రాంత పోరాటాలు కొనసాగిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సప్త వర్షాలు పూర్తి చేసుకుని ఈ నెల 12న ఎనిమిదో ఏడాదిలోకి అడుగిడుతోంది. తెలుగు ప్రజల ఆకాంక్షల మేరకు ఒక చారిత్రక అవసరంగా 2010 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ అనతి కాలంలోనే బలీయమైన శక్తిగా ఎదిగింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత సంక్షోభాలు రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న తరుణంలో పుట్టిన పార్టీని మొగ్గలోనే తుంచేయాలని వ్యతిరేక శక్తులు చేసిన కుట్రలేవీ ఫలించలేదు. పార్టీని స్థాపించేటప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఒక్కరే తోడుగా నిలిచారు. ఉప ఎన్నికల్లో చారిత్రక ఘట్టం కేవలం ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే బలంతో ప్రస్థానం సాగించిన వైఎస్సార్సీపీ ఇంతింతై... వటుడింతై అన్నట్లుగా పైకి ఎదిగింది. 2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో 17 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను గెల్చుకుంది. పార్టీ ఆరంభంలోనే జరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి 5,45,672 ఓట్లు, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తల్లి విజయమ్మ 81,373 ఓట్ల భారీ ఆధిక్యంతో ఎన్నికై యావత్ దేశంలోనే మరపురాని ఒక చరిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత కొంతకాలానికి జరిగిన ఉప ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే స్థానాలను, మరో ఎంపీ స్థానాన్ని (నెల్లూరు)ను వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైనా, 67 సీట్లతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు ప్రజల తీర్పును శిరసావహిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీని దెబ్బతీసేందుకు పాలకులు కంకణం కట్టుకున్నారు. ప్రలోభాలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపారు. తన వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీల బలంతోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల తరపున అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం తొలి నుంచీ పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ కావడం గమనార్హం. జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న యోధుడు జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలన్న కొందరి ప్రయత్నాలు ఫలించలేదని జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్‌కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన కుట్రలు సాగలేదని చెప్పారు. పార్టీకి పెను సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో జగన్ మరింత రాటుతేలారని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారని, వైఎస్సార్సీపీకి ఇక రానున్నవి మంచి రోజులేనని స్పష్టం చేశారు. నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సోమవారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నాయి. పార్టీ కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, అన్ని పార్లమెంట్ జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఇప్పటికే పిలుపునిచ్చింది. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
- కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సిమెంట్‌నగర్ (బేతంచెర్ల) : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెం నాయుడు అన్నారు. ఆదివారం మండలంలోని కొలుములపల్లె, బుగ్గానిపల్లె, సిమెంట్‌నగర్ గ్రామాల్లో టీడీపీ డోన్ ఇన్చార్జి కేఈ ప్రతాప్, మండల నాయకులు బుగ్గన సంజీవరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జన చైతన్య యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జన చైతన్య యాత్రలు నిర్వహిస్తుట్లు తెలిపారు. అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి, జిల్లా మహిళా టీడీపీ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి, సిమెంట్ నగర్ గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి, గౌరి రామిరెడ్డి, మద్దిలేటిరెడ్డి, భీమేశ్వర్రెడ్డి, జేసీ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
రాయచోటి: నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయన తన కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. రాయచోటికి వెలిగల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్లు రెండు కళ్లులాంటివన్నారు. ఆ ప్రాజెక్టులతోపాటు శాశ్వత అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, అవసరమైనటువంటి పలు పథకాలను తన తండ్రి గడికోట మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోను.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చేపట్టడం గర్వంగా ఉందన్నారు. ఇటీవల వెలిగల్లు ప్రాజెక్టు ఆయకట్టుదారుల సమావేశంలో నీటిని త్వరగా విడుదల చేస్తామని కలెక్టర్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పుడో పూర్తి అయినా, ఒప్పందం లేకపోయినా ఎంపీ మిథున్‌రెడ్డి తన సొంత డబ్బును సుమారు రూ.30 లక్షలు వెచ్చించి, కాల్వలో నీళ్లు సరఫరా అయ్యేలా చేయడం అభినందనీయమన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు కాల్వలో ఒక అడుగు లోతు మట్టి ఎత్తివేయాలని ఇంజనీరింగ్ అధికారులు కోరడంతో.. ఈ విషయాన్ని తాను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఆ పనులను చేపట్టేందుకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చి ఇచ్చారని పేర్కొన్నారు. గాలివీడు, లక్కిరెడ్డిపల్లె ప్రధాన కాలువ ఉన్నంత వరకు ఆ నీటితో చెరువులన్నింటినీ నింపవచ్చునని, కాలువకు ఎటువంటి ఆటంకాలు కల్పించకపోతే హసనాపురం, గంగనేరు, దిన్నెపాడు చెరువులకు నీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ కాలువ పనులు అంతంత మాత్రమే జరుగుతున్నాయన్నారు. ముంపు ప్రాంత రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుండడం బాధాకరమన్నారు. వీలైనంత త్వరగా శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని డిమాండ్ చేశారు. వెలిగల్లు కాలువ పనులను పూర్తి చేసి కుడి కాలువకు త్వరగా నీటిని వదిలే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు ఆయన వివరించారు. -
డైట్ బిల్లుల స్వాహా
ఫోర్జరీ సంతకాలతో లక్షలు కాజేసిన కాంట్రాక్టర్ ఏరియా ఆసుపత్రిలో వెలుగుచూసిన వైనం మల్లగుల్లాలు పడుతున్న వైద్య సిబ్బంది ప్రజా సంక్షేమం కోసం తలపెట్టిన ఉపాధి హామీ.. సీసీరోడ్లు, నీరు-చెట్టు పనుల్లో అధికార పార్టీకి చెందిన అనుయాయులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఆఖరికి పేద రోగుల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఇస్తున్న డైట్ నిధులను సైతం వదలటం లేదు. ఏరియా ఆసుపత్రిలో లక్షల్లో డైట్ నిధుల స్వాహా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇలాకాలోనే రోగుల సొమ్ము కాజేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది. నర్సీపట్నం: అధికారుల ఫోర్జరీ సంతకాలతో స్థానిక ఏరియా ఆస్పత్రి కాంట్రాక్టర్ సుమారు 10 లక్షల రూపాయలు కాజేసిన వైనం వెలుగుచూసింది. గత ఎన్నికల్లో టీడీపీకి విధేయులుగా పనిచేసిన వారిలో కొంత మందికి ఆసుపత్రిలో ఏఎన్ఎంలు, సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పించారు. అప్పటి డైట్ కాంట్రాక్టర్‌ను అర్ధంతరంగా తొలగించి పార్టీకి విధేయుడుగా ఉన్న ఒక వ్యక్తికి బినామీ కాంట్రాక్టర్‌గా అవకాశం కల్పించా రు. వైద్య సిబ్బందిని ప్రలోభ పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఫోర్జరీ సంతకాలు చేసేందుకు కూడా వెనకాడలేదు. డైట్ పర్యవేక్షకురాలిగా ఆసుపత్రి హెడ్‌నర్సు పద్మ వ్యవహరిస్తున్నారు. ఆమె ఇచ్చిన హాజరు ప్రకారం రోగులకు భోజనం తయారు చేసి వడ్డించాలి. బిల్లుల చెల్లింపునకు వచ్చేసరికి హెడ్‌నర్సుతో పాటు ఆర్ఎంవో సుధా శారద, గుమస్తా ధ్రువీకరించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డైట్ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే పర్యవేక్షకురాలు పద్మ సంతకం ఫోర్జరీ చేసి, మిగిలిన ఇద్దరు చేత సంతకాలు పెట్టించి సూపరింటెండెంట్‌కు బిల్లులు సమర్పిస్తున్నారు. పర్యవేక్షకురాలు ఇచ్చిన హాజరు ప్రకారం రోగులకు కాంట్రాక్టర్ భోజనం పెడుతున్నాడు. ఉన్నవారి కంటే ఆదనంగా రోగుల సంఖ్యను చూపించి అధిక మొత్తంలో డైట్ బిల్లులు మారుస్తుండటంపై అనుమానం వచ్చి హెడ్‌నర్సు పద్మ డైట్ షీట్లను పరిశీలించారు. ఈ షీట్లలో సంతకాలు తనవి కావని, తన దగ్గర ఉన్న రోగుల హాజరుకు, ఫోర్జరీ సంతకాలతో ఉన్న హాజరుకు చాలా వ్యత్యాసం ఉందని సూపరింటెం డెంట్ హెచ్.వి.దొర దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో రోగులకు సంబంధించిన డైట్ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సంఖ్య కంటే ఆదనంగా బిల్లు మార్చినట్టు సూపరింటెండెంట్ నిర్ధారణకు వచ్చారు. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ స్వాహా పర్వంలో సుమారు రూ.10 లక్షల వరకు కాంట్రాక్టర్ కాజేసినట్లు ఆసుపత్రి అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. సంతకాల ఫోర్జరీ వాస్తవమే డైట్ బిల్లుల్లో ఫోర్జరీ సంతకాలు జరిగిన సంగతి వాస్తవమేనని ఆసుపత్రి సూపరింటెండెంట్ దొర స్పష్టంచేశారు. సంబంధిత కాంట్రాక్టర్ నుండి స్వాహా చేసిన నిధులు రికవరీ చేస్తామని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. చర్యలకు వైఎస్సార్సీపీ డిమాండ్ రోగుల పేరిట నిధులు స్వాహా చేసిన సంబంధిత కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, పార్టీ నాయకులు పెదిరెడ్ల నాగేశ్వరరావు, గుడబండి నాగేశ్వరరావు తదితరులు సూపరింటెండెంట్ దొరకు మెమొరాండం అందజేశారు. రోగుల సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించటం దారుణమని పేర్కొన్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల అండతోనే ఇష్టారాజ్యంగా బిల్లులు చేసుకుని స్వాహా చేశారని ఆరోపించారు. నిధుల స్వాహాపై జిల్లా కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిధులు రాబట్టడమే కాకుండా ఫోర్జరీ సంతకాలకు కారకులైన వారిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
డీఎంకే చేసిందేమీ లేదు: జయలలిత
తిరునల్వేలి: డీఎంకే హయాంలో ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదంటూ తమిళనాడు సీఎం జయలలిత విమర్శించారు. తిరునల్వేలి ఎన్నికల ప్రచారంలో గురువారం ఆమె ప్రసంగిస్తూ... డీఎంకే-కాంగ్రెస్ కూటమికి ఓటు వేయడమంటే ప్రజా సంక్షేమానికి వ్యతిరేకించినట్లేనన్నారు. చాలా సమస్యల్ని డీఎంకే ప్రభుత్వం పరిష్కరించలేక పోయిందంటూ తప్పుపట్టారు. శ్రీలంక తమిళుల సమస్య, అంతర్ రాష్ట్ర జలవివాదం, విద్యుదుత్పత్తి సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలమైందన్నారు. శ్రీలంక అంతర్యుద్ధ సమయంలో తమిళులపై దాడులు జరుగుతుంటే డీఎంకే ఎలాంటి చర్యలు తీసుకోలేదని తప్పుపట్టారు. కర్నాటకతో కావేరీ జల వివాదంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైందని, అన్నాడీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే న్యాయం జరిగిందని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం తమిళనాడుకు చీకట్లోకి నెట్టివేసిందని, తాము రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు తీసుకొచ్చామని చెప్పారు. 2జీ, ఎయిర్‌సెల్- మాక్సిస్ ఒప్పందం, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసుల అవినీతిలో డీఎంకే ప్రమేయం ఉందంటూ జయ విమర్శించారు. -
పదవుల పందేరం!
డిప్యూటీ సీఎంగా వైగో విద్యామంత్రిగా తిరుమా ఆర్థిక మంత్రిగా ముత్తరసన్ రామకృష్ణన్‌కు స్థానిక పరిపాలన శాఖ జాబితా ప్రకటించిన సుదీష్ సాక్షి, చెన్నై: సీట్ల పందేరంతో నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ జరగలేదు...ఇంకా, ఎన్నిక లూ జరగలేదు...అయితే, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి మాత్రం అధికార పగ్గాలు చేపట్టిన ధీమాతో ముందుకు సాగుతోంది. తన బావ విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా తెర మీదకు తెచ్చిన కూటమి నేతలకు పదవుల పంపకాల్లో డీఎండీకే యువజన నేత సుదీష్ నిమగ్నమయ్యారు. ప్రచార వేదిక లో కూటమి నేతలకు పదువల్ని కట్టబెట్టేసి అందర్నీ విస్మయంలో పడేశారు. ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ చేరిన విషయం తెలి సిందే. ఆయన రాకతో ఆ కూటమిలోని ఎం డీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. విజయకాం త్ను తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, కెప్టెన్ కూటమి గా పేరు మార్పు జరగడం వివాదానికి దా రి తీసింది. చివరకు నేతలందరూ ఏకతా టి పైకి వచ్చి డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అన్న నినాదాన్ని అందుకున్నా రు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. సీట్ల పందేరాల్లో సామరస్య పూర్వకంగానే నాయకులు వెళుతున్నారు. కూటమిలో చీలికకు ఆ స్కారం లేని విధంగా అడుగు లు వేసి, ఒకరి అభిప్రాయాల కు మరొకరు గౌరవం ఇస్తూ, తాము పంచ పాండవులం అని చాటుకునే పనిలో పడ్డారు. తమ బలాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ప్రచార సభల్ని విస్తృతం చేశారు. వీసీకేకు ఎన్నికల యంత్రాంగం ఉంగరం చిహ్నం కేటాయించడాన్ని పురస్కరించుకుని ఏకంగా పార్టీ నేత తిరుమావళవన్‌కు మంగళవారం రెండు సవరాలతో కూడిన బంగారం ఉంగరాన్ని తొడిగి తమ స్నేహబంధాన్ని వైగో చాటుకున్నారు. ఈ పరిస్థితుల్లో తన బావను సీఎం చేయడానికి సిద్ధమైన ప్రజా కూటమి నేతల్ని బుధవారం పొగడ్తల పన్నీరుతో ముంచెత్తిన డీఎండీకే యువజన నేత, విజయకాంత్ బావమరిది సుదీష్ పదవుల పంపకాలతో కూడిన జాబితాను ప్రకటించి అందర్నీ విస్మయంలో పడేశారు. డిప్యూటీ సీఎం వైగో: కోవిల్ పట్టి గాంధి మైదానంలో బుధవారం జరిగిన ప్రచార సభలో సుదీష్ తన ప్రసంగం ద్వారా ప్రజా కూటమి నేతల్ని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటుగా పదవుల పంపకాల్లో నిమగ్నం అయ్యారు. డీఎండీకే - ప్రజా కూటమి అధికార పగ్గాలు చేపట్టినట్టేనని, విజయకాంత్ సీఎం పగ్గాలు చేపట్టే సమయం ఆసన్నమవుతోందని వ్యాఖ్యానించారు. విజయకాంత్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే, డిప్యూటీ సీఎంగా వైగో బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. వీసీకే నేత తిరుమావళవన్ విద్యా శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం నేత రామకృష్ణన్ స్థానిక పరిపాలనా శాఖ మంత్రిగా పగ్గాలు చేపడుతారని ప్రకటించి, అక్కడున్న వారందర్నీ విస్మయంలో పడేశారు. సుదీష్ వ్యాఖ్యానించడంపై అక్కడే గుస..గుసలు అడిన వాళ్లూ ఉండడం గమనార్హం. ఇక, విజయకాంత్ ప్రభుత్వంలో తాను మాత్రం ఏ పదవీ స్వీకరించనని, ఒక సభ్యుడిగా అందరితో కలసి ఉంటానని, కూటమిలోకి వచ్చే వారికి కీలక మంత్రి పదవి గ్యారంటీ అని వ్యాఖ్యానించి పరోక్షంగా టీఎంసీ నేత వాసన్ తమ వైపునకు వస్తారన్న సంకేతాన్ని సుదీష్ ఇవ్వడం గమనార్హం. వాసన్‌కు 24 గ్యారెంటీ: తమతో కలిసి వస్తే 24 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని టీఎంసీ నేత జీకే వాసన్‌కు డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి సంకేతాన్ని పంపింది. ఇందుకు తగ్గ పొత్తు మంతనాల్లో కెప్టెన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనకు ప్రజా సంక్షేమ కూటమి కేటాయించిన 124 సీట్లలో 24 సీట్లను వాసన్‌కు ఇవ్వడానికి విజయకాంత్ నిర్ణయించినట్టు డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. వాసన్ తనకు మంచి మిత్రుడు కావడంతో ఆ దిశలోనే విజయకాంత్ ప్రయత్నాల్లో ఉన్నట్టు, రెండు మూడు రోజుల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోకి వాసన్ అడుగు పెడుతారని చెబుతున్నారు. -
లేట్ అయినా.. లేటెస్ట్
- నూతన పద్ధతులతో పనులు చేస్తున్నాం - ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - ఎంపీ కల్వకుంట్ల కవిత - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మోర్తాడ్: తాము అధికారంలోకి రావడం కొంచెం లేటయినా లేటెస్ట్గా పనులు చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండలంలోని పాలెం, తొర్తి, దోన్పాల్ గ్రామాలలో శనివారం ఆమె తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఉద్యమించిన తాము అధికారంలోకి రాగానే నూతన విధానంలో పనులు చేస్తున్నామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అధునాతన పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఎక్కడా లోపం లేకుండా అభిృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ తారురోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఎనుగందుల అమిత, సర్పంచ్‌లు మాదం వెంకవ్వ, తొగటి అనిత, లింగన్న, ఉప సర్పంచ్‌లు మాదం నర్సయ్య, రవి, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మి, ఎనుగందుల అశోక్, డాక్టర్ జయవీర్, టీఆర్ఎస్ నాయకులు రాజాపూర్ణనందం, ఏలియా, గంధం మహిపాల్, పర్సదేవన్న పాల్గొన్నారు. బాల్కొండలో.. ప్రజాసంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ కవిత అన్నారు. మండలంలోని మెండోరా నుంచి ముప్కాల్ వరకు 2.74 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు రూ. 8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 23 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుక్షణం ప్రజా సంక్షేమం కోసమే కష్టపడుతున్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట.. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని కవిత చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు రైతు సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అన్నదాతలు మనోస్థైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులందరికీ సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పథకాలు అందిస్తుందని, కేవలం అంకాపూర్ రైతులకే ఇస్తామనే భ్రమ వద్దని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ అర్గుల్రాధ, వైస్ ఎంపీపీ శేఖర్, ఎంపీడీఓ కిషన్, పీఆర్ ఏఈ ప్రభాకర్ గుప్త, సర్పంచ్ అరుణనవీన్, ఎంపీటీసీ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు సామ వెంకట్‌రెడ్డి, భూమేశ్వర్, కొట్టాల రాజేశ్వర్ పాల్గొన్నారు. -
అజరామరం ఆయన కీర్తి
సందర్భం తెలంగాణ, రాయలసీమలలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సదుపాయాల కోసం కేంద్ర సహాయం లేకుండా రాష్ట్ర వనరుల నుంచే వేల కోట్లు వెచ్చించడం అపూర్వం కాదా? ప్రజా సంక్షేమానికి వైఎస్ పట్టంగట్టిన తీరు నేడు ఎక్కడైనా కనబడుతోందా? నిరంతర కరువు పీడిత ప్రాంతం నుంచి ఎదిగివచ్చిన రాజకీయవేత్తగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నీటి కోసమే అనుక్షణం పరితపించారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా నీటి పారుదలకే ప్రథమ ప్రాధాన్యాన్నిచ్చారు. ప్రజా సంక్షేమమే పాలనకు ప్రధాన కేంద్రంగా చేసుకొని అహరహం కృషిచేసిన వైఎస్... ఎన్ని కష్టనష్టాలు, అపనిందలు, అపవాదాలు ఎదురైనా ప్రజల పట్ల ఆ అంకిత భావాన్ని సడలించలేదు. నేటి పాలకుల తీరుతెన్నులను, విధానాలను చూస్తుంటే ప్రజ ల పట్ల అలాటి అంకిత భావం కొరవడటం కనిపిస్తుంది. దేశ ప్రధానిలోనూ, ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల లోనూ దీన్ని ప్రస్ఫుటంగా గమనించవచ్చు. జలవనరు ల వినియోగానికి వారు తగు ప్రాధాన్యం ఇవ్వకపోవడ మే కాదు... నిరుద్యోగ యువతను, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించారు. ఇది చూస్తుంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టంగట్టిన వైఎస్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల తెలుగు ముఖ్యమంత్రులు అట్టహాసంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో దార్శనికత, పారదర్శకత కొరవడ్డాయని, అక్రమ పద్ధతులకు చోటిచ్చాయని విమర్శలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ నీటి పారుదల ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యం, ప్రత్యేకించి వెనుకబడిన తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీరందించాలని, కృష్ణా డెల్టాను స్థిరీకరించాలని చేసిన కృషి అజరామరం. తెలంగాణ, రాయలసీమలలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సదుపాయాల కోసం కేంద్ర సహాయ, సహకారాలు లేకుండా రాష్ట్ర వనరుల నుంచే వేల కోట్ల రూపాయలను వెచ్చించిన ఘనత వైఎస్‌దే. ఆయనను విమర్శించే చంద్రబాబు, కేసీఆర్‌లు దానికి సాటిరాగల కృషిని ఆచరణలో చూపారా? మహిళా సంక్షేమానికి వైఎస్ పట్టంగట్టిన తీరు నేటి రాజకీయాల్లో ఎక్కడైనా కనబడుతోందా? జాతీయ ప్రాజెక్టు పోలవరంపట్ల నేడు ప్రధాని మోదీ ఉదాసీనతను, నిర్ల క్ష్యాన్ని ప్రదర్శించడం వైఎస్ బతికి ఉంటే జరిగేదా? ఇందిరాగాంధీ కుటుంబం అంటే గౌరవంతో వైఎస్ పలు పథకాలకు ఇందిర, రాజీవ్‌ల పేర్లు పెట్టారు. అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ మరణానంతరం తెలుగుదేశంతో, దాని ప్రచార మాధ్యమాలతో చేయిగలిపి ఆయనను దుమ్మెత్తిపోసింది. టీడీపీతో కలిసి ఆయనపైనా, ఆయన కుటుంబంపైనా, ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైనా సీబీఐ కేసులు పెట్టి వేధించడానికి నీచమైన పద్ధతులకు పాల్పడింది. ప్రజలు ఆ ప్రయత్నాలను తిరస్కరించారు, ఛీత్కరించారు. అయినా నేడు చంద్రబాబు అసెంబ్లీలోని వైఎస్, టంగుటూరి ప్రకాశం చిత్రపటాలను తొలగించడం లాంటి దివాలాకోరుతనానికి తెరలేపారు. ప్రజల హృదయాల నుంచి వైఎస్‌ను ఎవరూ దూరం చేయలేరని గుర్తించలేని అజ్ఞానం ఆయనది. మానవ వనరుల అభివృద్ధికి వైఎస్ ఇచ్చినంతటి ప్రాధాన్యాన్ని మరెవరూ ఇవ్వలేదు. ఇడుపులపాయ, నూజివీడు, బాసరలలో గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టేందుకు స్థాపించిన విద్యాలయాలు ఆయన దార్శనికతకు నిదర్శనాలు. రైతు సంక్షేమానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అంతకు ముందు ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేదు. భూమిలేని నిరుపేదలకు నాలుగు విడతలుగా భూ పంపిణీ కార్యక్రమాలు చేపట్టి ఐదు లక్షల ఎకరాలు, దాదాపు ఏడు లక్షల ఎకరాలకు గిరిజనులకు పట్టాలను పంపిణీ చేశారు. అంతేగాక ఆ భూములను చదును చేసుకోవడానికి ‘ఇందిరప్రభ’ ద్వారా వందల కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఆయనది. అనంతపురం, ప్రకాశం జిల్లాలలో వైఎస్ హయాంలో ప్రభు త్వం పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చినా అందుకు రైతులు అంగీకరించలేదు. రైతుల బాగోగులను ఆయన అంతగా పట్టించుకొని పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి పునాదులు వేశారు. తెలు గు ప్రజల సమైక్యతకు, సంక్షేమానికి ఆయన ఎంతగానో తపించారు. నేటి తెలంగాణలో, ఏపీలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమలలో జరుగుతున్న పరిణాలమాలను చూస్తే వైఎస్ కార్యక్రమాలు ఎంత ముందు చూపు తో చేపట్టినవో అర్థమవుతుంది. వైఎస్ బాటలోనే అభి వృద్ధి-సంక్షేమ సాధన కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన నాయకత్వంలోని వైఎస్సార్సీపీ చేస్తున్న రాజకీయ పోరాటాలను ప్రజలు ఆదరిస్తున్నారు, వెంట నడు స్తున్నారు. తెలంగాణలో వైఎస్ తనయ వైఎస్ షర్మిల జరుపుతున్న ఓదార్పుయాత్రను ప్రజలు ఆదరిస్తుండటం గమనార్హం. నేటి దౌర్భాగ్యకర పరిస్థితులను చూస్తుంటే ప్రజలకు వైఎస్ గుర్తొకొస్తున్నారు. 108, 104 సర్వీసులు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత వివాహాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇల్లు, జలయజ్ఞం, వ్యవసాయ రంగానికి విశేష ప్రాధాన్యం ఆయన కృషిని గుర్తుకు తెస్తున్నాయి. ఇక రుణాల రద్దు, ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు, మున్సిపాలిటీలలో పన్నుల పెంపుదల లేకపోవడం, ఆర్టీసీ చార్జీల మోతలు లేకుండా చేయడం, కేంద్ర గ్యాస్ ధర పెంచితే పెంచిన గ్యాస్ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించడం అపూర్వం. పన్నులు వేయకుండా, ఆదా యం సమకూర్చుకుంటూ కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను పెంచిన అసాధారణ పాలనాదక్షుడు వైఎస్. రాష్ట్ర సంపదను పెంచారు, దాన్ని ప్రజలకు పంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ అభిమానులు ఆయన కలలను సాకారం చేయడానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇమామ్ - వ్యాసకర్త కదలిక సంపాదకులు: 99899 04389 -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, ముంబై: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభల్లో గవర్నర్ ప్రసంగించారు. అకాల వర్షాలతో పాటు వడగళ్ల వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మద్దతు కోసం వేచి చూడకుండా రూ. నాలుగు వేల కోట్ల ఇందుకోసం కేటాస్తామన్నారు. కరవు పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రం శాశ్వత పరిష్కారాలు ఎంచుకుందని, ఇందుకోసం ‘జల్యుక్త్ శివార్’ యోజన పథకాన్ని చేపడుతున్నామని, 2019 తర్వాత కరవు ప్రాంతం ఉండదన్నారు. మైక్రో నీటి పారుదలకు ప్రాధాన్యం ఇస్తామని, తద్వారా సాగుక్షేత్రం పెరుగుతుందన్నారు. ప్రతి ఏటా సుమారు అయిదు వేల గ్రామాలకు కరవు నుంచి విముక్తి కలిగించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా 2015-16లో గ్రామీణ ప్రాంతాల్లో 14.15 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి కోసం నాబార్డ్ నుంచి రూ. 450 కో ట్ల రుణం తీసుకుంటామన్నారు. 1200 ఎకారల్లో టెక్స్టైల్ హబ్ అయిదు లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందించే విషయమై పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అమరావతి నాంద్‌గావ్ పేట్లో 1200 ఎకరాల స్థలంలో టెక్స్టైల్ హబ్ నిర్మిస్తామన్నారు. మరాఠీ భాష భవనం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం నిర్మాణం కోసం ఇందు మిల్లు స్థలాన్ని కేంద్రం నుంచి పొందేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నామన్నారు. లండన్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసాన్ని అంతర్జాతీయ స్మారకంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దివంగత ప్రజా నాయకుడు గోపీనాథ్ ముండేకు ఔరంగాబాద్‌లో, రాజ్‌మాతా జిజావు స్మారకాన్ని ఆమె జన్మస్థలం సిందఖేడ్ రాజాలో స్మారకాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేసి చుట్టుపక్కల 600 చదరపు కిలోమీటర్ల క్షేత్రంలో ‘నైనా’ పేరుతో అత్యాధునిక నగరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. పుణే, ముంబైలలో సీసీటీవీ కెమెరాలను అమర్చే పనులు జరుగుతున్నాయని, ముంబైలో 90 వారాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం పూర్తవుతుందని చెప్పారు. -
ఫ్లెక్సీ.. పైత్యం
రౌతులపూడి : రాజకీయ పార్టీలు, వర్గాలకతీతంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన మండల పరిషత్ కార్యాలయంపై టీడీపీ ఫ్లెక్సీ ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది. నూతన సంవత్సరం దినోత్సవం సందర్భంగా అధికార తెలుగు దేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, ఎంపీపీ ఇటంశెట్టి సూర్యభాస్కరరావు, టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని మండల పరిషత్ కార్యాలయంపై ఏర్పాటు చేశారు. దీంతో ఇది టీడీపీ కార్యాలయమా, ప్రభుత్వ కార్యాలయమా అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆశ్చర్యపోయారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి చర్యలను ఖండించి ప్రభుత్వ కార్యాలయాలపై రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధించాలని పలువురు డిమాండ్ చేశారు. -
అబద్ధాలూ.. అతకలే!
* గోదాముల్లో గోల్మాల్ లేదట..! * ‘సాక్షి’కి సివిల్ సప్లయ్ మేనేజర్ వివరణ సాక్షి, టాస్క్‌ఫోర్స్, మెదక్: కోట్లాది రూపాయలు ఖర్చు చేసి.. ప్రజా సంక్షేమం కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం (సివిల్ సప్లయ్) అక్రమార్కుల పాలవుతున్నాయని, వీటిని రవాణా చేయకుండానే చేసినట్లు గోదాం స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తున్న వైనంపై ‘గోదాములో గోల్ మాల్ ’ శీర్షికతో ఈ నెల 21న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందిం చిన మంత్రి హరీష్ విచారణకు ఆదేశించారు. అయితే కథనంపై సివిల్ సప్లయ్ మేనేజర్ జయరావు ఈ నెల 22న పత్రికలకు వివరణ ఇచ్చారు. ఈ కాపీ బుధవారం ‘సాక్షి’కి చేరింది. దీనిలో ‘గోదాముల్లో గోల్మాల్’ పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ఆయన వివరణ అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉంది. కథనంలో ని వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు విచారణ లేకుండానే అ క్రమాలకు పాల్పడుతున్న వారిని వెనకేసుకొచ్చినట్లు ఉంది. పాపన్నపేట గోదాం ఇన్ చార్జ నరేందర్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో శంకరంపేట గోదాం ఇన్చార్జి నర్సిం లుకు పాపన్నపేట అదనపు బాధ్యతలు అప్పజెప్పామని, తప్పనిసరి పరిస్థితిలో నర్సిం లు చేతనే పాపన్నపేట గోదాంలో సరుకులు పంపిణీ చేయించామని వివరణ ఇచ్చారు. అం తేకాకుండా పాపన్నపేట, టేక్మాల్‌లో రెవెన్యూ సిబ్బంది లేకపోవడం వల్లేశంకరంపేట గో దాం ఇన్చార్జిని పాపన్నపేటకు తాత్కాలిక ఇన్‌చార్జిగాని యమించామన్నారు. ఆర్ఓలు రాయకుండానే స్టేజి-1,స్టేజి-2 గోదాముల్లో ఆక్రమా లు జరుగుతున్నాయనడం అవాస్తవమన్నారు. సారూ.. ఈ ప్రశ్నలకు బదులేవీ.. * పాపన్నపేట గోదాంకు ఇన్చార్జిగా నియమించిన శంకరంపేట గోదాం ఇన్చార్జి నర్సింహులేనా? ఈ వ్యక్తి ఎవరికి బంధు వు? రెవెన్యూ శాఖతో సంబంధం లేని ఈ ప్రైవేటు వ్యక్తి ఏ హోదాలో పాపన్నపేట గోదాంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. అది తేల్చి చెప్పండి. గతంలో కూడా ఈ వ్యక్తే గోదాం ఇన్చార్జి నర్సింహులుకు బదులు విధులు నిర్వహించడంపై మీకు ఫిర్యాదులు అందింది నిజమా కాదా..? * పాపన్నపేటలో ఇద్దరు ఆర్ఐలు ఉన్నా, వారిని కాదని నర్సింహులుకు ఎలా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు? ‘సాక్షి’లో కథ నం వచ్చాక అప్పటికప్పుడు ఉరుకులు పరుగుల మీద బుధవారం రోజున నర్సింహులును తప్పించి పాపన్నపేట ఆర్ఐ మారుతికి బాధ్యతలు ఎందుకు అప్పగించారు..? * ఇక మీరు చెప్పినట్టే అక్రమాలు అవాస్తవం అనుకుందాం. ‘సాక్షి’ కథనం వచ్చిన రోజునే మంత్రి హరీష్‌రావు ఎందుకు స్పం దించారు. సివిల్ సప్లయ్ గోదాంలపై ఇప్పటికీ మూడు సార్లు ఫిర్యాదులు వచ్చాయని అదే రోజు సిద్దిపేటలో జరిగిన ఒక సభలో ఆయన స్వయంగా ఎందుకు చెప్పారు. విచారణ జరపాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఎందుకు సూచించారు. మరి మీరు ఏ గో దాం లోనైనా విచారణ జరిపారా..! కనీసం ‘సాక్షి’ ఆరోపణ చేసిన గోదాంలోనైనా తని ఖీలు చేశారా? చేస్తే వివరణలో ఎందుకు పొం దుపరచలేదు. విచారణ జరపకుం డానే గోల్మాల్ జరగలేదని ప్రకటించడం, అక్రమార్కులను వెనుకేసుకు రావడం కాదా..? -
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ అశ్వాపురం : ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని, పాలన పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటినా కూడా ఏ ఒక్క విషయంలోనూ పురోగతి లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం పినపాక డివిజన్ మహాసభ ముగింపు స్థానిక వర్తక సంఘం కల్యాణ మండపంలో మంగవారం ముగిసింది. ముగింపు సమావేశంలో పోతినేని మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. సర్వేల పేరుతో కాలయాపనే తప్ప సాధించేదేమీ లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరిని క్రమబద్ధీకరిస్తామన్న ఎన్నికల హామీని కేసీఆర్ విస్మరించాని విమర్శిచారు. ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నరేంద్ర మోడి ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు అధిక ప్రాధాన్యమిస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికులకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహాసభలో రాష్ట్ర నాయకుడు కాసాని ఐలయ్య, డివిజన్ కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు మధు, కాటేబోయిన నాగేశ్వరరావు, సర్గం బాలనర్సయ్య, పాయం భద్రయ్య, బీరం శ్రీనివాస్, సున్నం రాంబాబు, నిమ్మల వెంకన్న, గద్దల శ్రీనివాసరావు, సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షం.. ప్రతిక్షణం ప్రజాపక్షం
కదిరి: ‘ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై అనుక్షణం అలుపెరుగని పోరాటం చేస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతుం ది’ అని ఆ పార్టీ కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను తక్షణం అమ లు చేయాలంటూ వైఎస్సార్సీపీ కలెక్టరేట్ ఎదుట డిసెంబర్ 5న తలపెట్టిన మహాధర్నా పోస్టర్లను ఎమ్మెల్యే ఆ పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ సిద్దారెడ్డి, ఇతర నాయకులతో కలిసి ఆదివారం అత్తార్ రెసిడెన్సీలో విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు పంటరుణాలేవో, వ్యవసాయరుణాలేవో తెలియకపోతే ఎలా? అని ఆయన తప్పుబట్టారు. బాబు తన పాదయాత్రలో రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని రోజుకో మాట..పూటకో అబద్ధం చెబితే ఎలా? అని మండిపడ్డారు. రైతులు బ్యాకుల నుంచి తీసుకున్న స్వల్ప, దీర్ఘకాలిక, ప్రాసెసింగ్ యూనిట్ తాలూకు రుణాలన్నీ వ్యవసాయ రుణాలకిందే వస్తాయన్నారు. ఆధార్‌ను ఆధారంగా చేసుకొని నిజమైన రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం వైఎస్ కుటుంబానికే సాధ్యమన్నారు. తొలి సంతకం అంటే ఏమిటో మహానేత వైఎస్‌ను చూసి నేర్చుకో అని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఎడ్ పూర్తి చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు వస్తాయని తప్పించుకోవడం వారిని మోసం చేయడమేనన్నారు. ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎవరికిచ్చారని ఆయన ప్రశ్నించారు. బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ తమ పార్టీ డిసెంబర్ 5న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, నిరుద్యోగ యువత, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల సత్తా ప్రభుత్వానికి తెలియజేద్దామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రూరల్ మండల కన్వీనర్ లోకేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు రాజశేఖర్‌రెడ్డి, ఖాదర్‌బాషా, కిన్నెర కళ్యాణ్, శివశంకర్‌నాయక్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు షౌకత్, జైనుల్లా, కొమ్మెద్ది అప్పల్ల, బీసీ నాయకులు క్రిష్ణమూర్తి, నాగమల్లు,ఆంజనేయులు, లక్ష్మీపతిలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఇదేనా ప్రజా సంక్షేమం
ఏలూరు (ఆర్ఆర్ పేట) :అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసిన పని ఒక్కటీ కనబడటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన బియ్యాన్ని ఉత్తరాంధ్రలో టీడీపీ కార్యకర్తలు దోచుకున్న ఘటనలు వెలుగు చూశాయని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ధర్మాన దుయ్యబట్టారు.టీడీపీ హయాంలో పోలీసులు సినిమా పోలీసుల్లా వ్యవహరిస్తున్నారని, అన్యాయం చేసింది టీడీపీ కార్యకర్తలైతే, అన్యాయానికి గురైన వారిపైనే కేసులు నమోదు చేస్తూ న్యాయ వ్యవస్థను, చట్టాలను పోలీసులు అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబుకు సింగపూర్‌లో వ్యవసాయం లేదని తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తే రైతులకు ఒనగూరే ప్రయోజనమేమిటని నిలదీశారు. రైతులను మోసగించడం మొదటినుంచీ చంద్రబాబుకు అలవాటైన విద్యేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అందరూ అనుకుంటున్నారని, అది వాస్తవం కాదని అన్నారు. పార్టీ పుట్టి నాలుగేళ్లే అయ్యిందని, తొలుత ఒక స్థానం నుంచి ప్రారంభమైన పార్టీ ప్రస్థానం అనంతరం 17 స్థానాలు, ప్రస్తుతం 69 స్థానాలతో దినదినాభివృద్ధి చెందుతోందనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ 150 స్థానాలకు పైబడి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పదవిని బట్టి గౌరవం దక్కుతుంని అనుకోవడం పొరపాటేనని, పదవీ బాధ్యతల నిర్వహణను బట్టే గౌరవం పెరుగుతుందని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వివిధ విభాగాల అధ్యక్షులకు ధర్మాన హితబోధ చేశారు. పార్టీ నిర్మాణంలో అనుబంధ విభాగాల నిర్మాణం కీలక ఘట్టమని, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ ్లనాని ఆ ఘట్టాన్ని సమర్థవంతంగా పూర్తి చేశారని అభినందించారు. ఇక పార్టీ నిర్మాణం అనుబంధ విభాగాల చేతుల్లో ఉందని ఏ విభాగానికీ ప్రత్యేక ప్రతిపత్తి ఉండదని, పార్టీ జిల్లా విభాగానికి లోబడి పనిచేయాలన్నారు. మరో రెండేళ్లలో వైఎస్సార్ సీపీలోకి ఇతర పార్టీల నాయకులు వలసలు వచ్చే పరిస్థితి ఉంటుందని అన్నారు. ఏ వర్గానికీ న్యాయం జరగడం లేదు : కొత్తపల్లి టీడీపీ పాలనలో జిల్లాలోని ఏ వర్గానికీ న్యాయం జరగడం లేదని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. ఉన్న పింఛన్లు తొలగించి ప్రభుత్వం అర్హుల ఉసురుపోసుకుంటోందని ద్వజమెత్తారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతిపక్షాలు ప్రజలకు తెలపాల్సిన అవసరం లేదని, ప్రజలకే ప్రత్యక్షంగా అనుభవం అవుతోందని పేర్కొన్నారు. అన్ని పార్టీల నాయకులు గడ్డాలు మెరిసిపోయిన వారు కాగా, తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే ఉత్సాహం నిండిన యువకుడని, ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టమని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అనుబంధ విభాగాలు పోరాటాలు చేయాలని, వారికి రక్షణ కవచంగా తాము ఉంటామని హామీ ఇచ్చారు. సింగపూర్‌కు రూ.400 కోట్లు తరలించాడు : ఇందుకూరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని పదేపదే చెబుతున్నారని, అయితే ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తిలో రూ.400 కోట్లను సింగపూర్‌కు తరలించినట్టు వార్తలు వచ్చిన నేపధ్యంలో చంద్రబాబు సచ్ఛీలతపై అనుమానాలు తలెత్తాయని అన్నారు. అనుకోకుండా వచ్చిన అధికారాన్ని చూసి టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారని, సామాన్య ప్రజలపై కూడా వారి దాష్టీకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాని సఫలమయ్యారని, అనుబంధ సంఘాల నాయకులు పార్టీని బలోపేతం చేయడంలో ఆయనకు సహకరించాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో పార్టీ జిల్లాలో స్థానాలనూ సాధిస్తుందని జోస్యం చెప్పారు. త్వరలోనే మండల కమిటీలు : ఆళ్ల నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నిర్మాణం పూర్తయ్యిందని, త్వరలోనే మండల కమిటీలపై దృష్టి పెడతామని పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని తెలిపారు. జిల్లాలోని అందరి నాయకుల, కార్యకర్తల సూచనలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి నూతన విభాగాలు పనిచేయాలన్నారు. టీడీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించామని, నరసాపురం నియోజకవర్గంలో సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. 48 మండలాల్లో పార్టీని పటిష్టం చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. -
నా జీతం అంతా ప్రజా సంక్షేమానికే!
నెల్లూరు: తన జీతం అంతా ప్రజాసంక్షేమానికే ఉపయోగిస్తానని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. జీతం నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోనన్నారు. ఐదేళ్లలో తనకు ప్రభుత్వం ద్వారా వచ్చే 60 లక్షల రూపాయల జీతం మొత్తం ప్రజలకే ఉపయోగిస్తానని చెప్పారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానన్నారు. తాగునీటి పునరుద్దరణకు ఖర్చు చేస్తానని తెలిపారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు. -
ప్రజాసంక్షేమం జగన్‌కే సాధ్యం
వెంకటాచలం, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కసుమూరులో పూల కోటేశ్వరరావు, గుర్రం మల్లికార్జున్, తురకా పెంచలయ్య, బెల్లం సురేంద్ర, వీరేపల్లి మహేష్, బాలా రమేష్, దేవళ్ల రత్నంతో పాటుగా తమ వర్గీయులు కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో శనివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. సీమాంధ్రులకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తీరని అన్యాయం చేశాయన్నారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం అవలంబించి తెలంగాణ విభజ నకు కారణమయ్యారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలుత విభజనకు మద్దతు తెలిపి అనంతరం రాజీనామాతో సరిపెట్టుకున్నారన్నారు. సోనియా తన కుమారుడిని ప్రధానిని చేయాలని స్వార్థపు రాజకీయాలతో తెలంగాణ విభజన జరిగిందన్నారు. ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉద్యమాలు చేస్తూ తెలంగాణ విభన బిల్లుకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాటాలు చేశారన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో ఫ్యాను గుర్తు కు ఓట్లు వేసి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. నాయకులు వడ్లమూడి సురేంద్రనాయుడు, పి.హుస్సేన్, ఈశ్వరనాయుడు, పూల శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఏన్కూరు, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఏన్కూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వైరా నియోజకవర్గంలోని గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు చెందిన 1250 మంది నిరుపేద గిరిజన రైతులకు 2150 ఎకరాలను పంపిణీ చేశామని అన్నారు. రానున్న రోజుల్లో భూమి లేని గిరిజన రైతులను గుర్తించి పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ ప్రవేశపెట్టారని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకాన్ని ప్రవేశపెట్టలేదని, అది కేవలం మనరాష్ట్రంలో మాత్రమే ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే బాణోత్ చంద్రావ తి, జేసీ సురేంద్రమోహన్, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమా ర్, జూలూరుపాడు, ఏన్కూరు, కారేపల్లి తహశీల్దార్లు తిరుమలాచారి, నాగమల్లేశ్వరరావు, రజని, అధికారులు పాల్గొన్నారు. -
ఆ మహానేతే ఉండివుంటే..
వైఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథంలో దూసుకెళ్లిన రాష్ట్రం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్‌లతో భవిష్యత్‌పై భరోసాతో నిశ్చింతగా జీవించిన రాష్ట్ర ప్రజానీకం వైఎస్ మరణం తర్వాత తల్లకిందులైన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అనిశ్చితి, సంక్షోభం, కల్లోలానికి మారుపేరుగా మారిన వైనం సంక్షేమ పథకాలకు తూట్లు.. పదేపదే పన్నుల చార్జీల వడ్డనలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కూరుకుపోయిన రాష్ట్రం భవిష్యత్‌పై ఆందోళన, నిత్యం అభద్రతతో ప్రజల జీవనం వైఎస్సే ఉంటే ఈ దుస్థితి కలలోనైనా వచ్చేది కాదంటున్న జనం మళ్లీ అలాంటి సమర్థ నాయకత్వం కావాలంటున్న రాజకీయ నిపుణులు ఒక మనసున్న మారాజు ఉన్నపుడు రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, భవిష్యత్‌పై భరోసాతో నిశ్చింతగా గడిపారు. ప్రజా సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం పరుగులు తీసింది. కానీ.. అదే మహానేత మరణంతో రాష్ట్రం పరిస్థితి ఒక్కసారిగా అధఃపాతాళానికి దిగజారిపోయింది. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తుపై నిత్యం అభద్రతతో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి ఆవిష్కృతమైంది. అనిశ్చితి, కల్లోలం, సంక్షోభం ఆంధ్రప్రదేశ్‌కు పర్యాయపదాలుగా మారిపోయాయి. ఆ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సరిగ్గా నాలుగేళ్ల కిందట సెప్టెంబర్ 2వ తేదీన ఘోర దుర్ఘటనలో అకాల మరణం చెందటం.. రాష్ట్ర గతిని, ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. వైఎస్సార్ జీవించి ఉండివుంటే ఈ పరిస్థితులు వచ్చేవే కాదని రాష్ట్ర ప్రజలు, రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు అభివృద్ధి, సంక్షేమపథంలో పయనం... పేద విద్యార్థి కలలకే పరిమితమైన ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఖరీదైన విద్యను వైఎస్ రాజశేఖరరెడ్డి వారి చేతుల్లోకి తెచ్చిపెట్టారు. నిరుపేదలు గడప తొక్కటానికే అవకాశం లేని కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యాన్ని ఆ పేదింటి ముంగిటికి తెచ్చి అందించాడు. ఆపదలో ఉన్న వారిని తక్షణం ఆదుకునేందుకు పల్లెల్లో, పట్టణాల్లో అత్యవసర అంబులెన్స్ సేవలు ప్రవేశపెట్టి నిరంతరం రక్షణ కల్పించాడు. ఏడేళ్ల కరువుతో సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్య తప్ప మరోగతి లేదనే నైరాశ్యంలో ఉన్న రైతన్నకు.. ఉచిత విద్యుత్, రుణమాఫీ, పావలా వడ్డీకి రుణాలు అందించి కొత్త ఊపిరిపోశాడు. రైతన్న బంగారు భవిష్యత్తు కోసం.. రాష్ట్రమంతా సస్యశామలం కావటం కోసం భగీరథ ప్రయత్నంతో జలయజ్ఞం ప్రారంభించాడు. పేదా, గొప్పా తేడా లేకుండా రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఉజ్వల భవిత కోసం ఊరూవాడా ఐఐటీలు, యూనివర్సిటీల వంటి విద్యాలయాలు, బడుగువర్గాలకు వసతిగృహాలు నెలకొల్పి విద్యాయజ్ఞం చేశారు. ప్రతి అవ్వా, తాతకు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు ఇచ్చి ఆదుకున్నాడు. ప్రతి పేదవాడికీ సొంత ఇంటి కలను సాకారం చేస్తూ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆయన ఉన్నన్నాళ్లూ ఒక్క చార్జీ.. ఆర్టీసీ చార్జీ కానీ, విద్యుత్ చార్జీ కానీ పెంచలేదు. ప్రజలపై ఏ పన్నునూ పెంచలేదు. కొత్తగా ఒక్క పన్ను కూడా వేయలేదు. ఆ తర్వాత ఐదేళ్లూ పెంచబోనన్నాడు. రాష్ట్ర ప్రజల్లో ఎలాంటి చింతా లేదు. భవిష్యత్‌పై ఎలాంటి ఆందోళనా లేదు. రాష్ట్రంలో రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఎలాంటి అస్థిరత, అభద్రత అన్న ఊసే లేదు. ప్రజా సంక్షేమానికి, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిత్యం పరితపించిన ఆ నాయకుడు మనసున్న మారాజుగా తిరుగులేని నాయకుడిగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరి సర్వతోముఖాభివృద్ధి కోసం ఎంతో దూరదృష్టితో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ సిసలైన సమర్థుడైన నాయకుడిగా జనం గుండెల్లో వైఎస్ పదిలమైన స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు అధఃపాతాళానికి పతనం... ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించే పాడిపంటలతో సుసంపన్నమైన హరితాంధ్రప్రదేశ్‌ను ఆ మహానేత స్వప్నించి.. అందుకోసమే అహర్నిశలూ శ్రమిస్తూ.. ఆ క్రమంలోనే ఘోర దుర్ఘటనలో ఆయన కన్నుమూశారు. ఆ మహానేత సరిగ్గా నాలుగేళ్ల కిందట హఠార్మరణంతో రాష్ట్రం పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. పెద్ద దిక్కును కోల్పోయిన జనం తల్లడిల్లిపోయారు. ఎంతోమంది గుండె ఆగి చనిపోయారు. ఆ తర్వాత సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వేగంగా దిగజారిపోయాయి. సంక్షేమం రోజురోజుకూ తరిగిపోతూ వచ్చింది. వైఎస్ మరణానంతరం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన పాలకులు ప్రజా సంక్షేమాన్ని తాము మోయనవసరం లేని భారంగా పరిగణించటంతో ప్రజల పరిస్థితి క్రమంగా మళ్లీ మొదటికొచ్చింది. పేద విద్యార్థుల ఆశాదీపమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆంక్షలతో కోతలు పడ్డాయి. సీటు దక్కేనా.. సీటు దక్కినా ఫీజు కట్టగలమా అనే ఆందోళనకరమైన దుస్థితిలోకి బడుగు విద్యార్థి మళ్లీ జారిపోయాడు. పేదల సంజీవని ఆరోగ్యశ్రీ పథకానిదీ అదే పరిస్థితి. ఎన్నో వ్యాధుల చికిత్సకు కోతలు, చికిత్సకు అందించే నిధులకు కోతలు. వైద్యం నామమాత్రంగా మారింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కూడా పేరుకు మాత్రమే అమలవుతోంది. అసలు విద్యుత్‌నే ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రం దిగజారింది. రైతన్నకు పంట రుణాలు మళ్లీ గగనంగా మారాయి. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. బీడుభూములు నీటి కోసం నోళ్లు తెరుచుకుని ఆశగా చూస్తూనే ఉన్నాయి. వాటి దాహం ఎప్పుడు తీరుతుందో తెలీదు. అవ్వా, తాతలు పింఛన్ల కోసం మళ్లీ నెలల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. కొత్త పింఛన్లు కావాలంటే పాత పింఛన్దార్లలో ఎవరైనా చనిపోయే వరకూ వేచిచూడాల్సిన దారుణ పరిస్థితి వచ్చిపడింది. పేదల సొంతింటి కల మళ్లీ కలగా మారిపోయింది. మరోవైపు.. రాజకీయ అనిశ్చితి రోజురోజుకూ తీవ్రమైపోయింది. సామాజిక సంక్షుభిత పరిస్థితులు పెరిగిపోతూ వచ్చాయి. రాష్ట్రం నిత్య కల్లోలంగా మారిపోయింది. చివరికి ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నం దిశగా పరిస్థితులు దారితీశాయి. ఇప్పుడు రాష్ట్రమంతటా పెను సంక్షోభంలో కూరుకుపోయివుంది. ప్రజలందరిలో తీవ్ర ఆందోళనలు చెలరేగుతూ ఉన్నాయి. మొత్తం రాష్ట్రమే అగ్నిగుండంలా రగులుతూ ఉంది. మళ్లీ ఆ నాయకత్వం కావాలి... ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నపుడూ.. వైఎస్సార్ మరణం తర్వాత.. అనే రెండు దశలుగా ప్రజానీకం చూస్తున్నారు. ఆ మహానేతే జీవించి ఉన్నట్లయితే.. ఈ పరిస్థితులు దాపురించి ఉండేవా? ఆయనే గనుక బతికివుంటే.. ఇంతటి కల్లోలం, ఇంతటి సంక్షోభం తలెత్తి ఉండేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు. వైఎస్సార్ గనుక జీవించి ఉంటే.. పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవని.. రాష్ట్రం సస్యశ్యామలంగా హరితాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉండేదని సామాన్యులతో పాటు రాజకీయ పండితులు సైతం విచారస్వరంతో వ్యక్తం చేస్తున్న నిశ్చితాభిప్రాయం. రాష్ట్రానికి ఇప్పుడు మళ్లీ వైఎస్సార్ వంటి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని అభిప్రాయపడుతున్నారు. అలాంటి నాయకత్వంతోనే రాష్ట్రం మళ్లీ గాడినపడుతుందని.. సంక్షేమ, సర్వతోముఖాభివృద్ధి పథంలో పయనిస్తుందని స్పష్టంచేస్తున్నారు. వ్యవసాయమంటే వైఎస్‌కు ఎంతో మక్కువ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకాల మరణం రాష్ట్ర రైతాంగానికి పెద్దలోటు. వ్యవసాయమన్నా, రైతు అన్నా ఓ ఆరాధనాభావమున్న అరుదైన నాయకుడు. ఏడేళ్ల కరువు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, గవర్నర్‌గా రంగరాజన్ పూర్తి సమన్వయంతో చేపట్టిన ప్రపంచబ్యాంకు సంస్కరణల కింద రాష్ట్ర రైతాంగం నలిగిపోతున్న సందర్భంలో రైతు బాంధవుడిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టారు వైఎస్. అధికారంలోకి వచ్చీ రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. ఈ నిర్ణయం తెలంగాణ రైతాంగానికి ఎంతో వెసులుబాటు నిచ్చింది. కేంద్రం రుణ మాఫీ ప్రకటిస్తే.. అది వర్తించని రైతులకు కూడా రూ. 5,000 చొప్పున మంజూరు చేసిన సిసలైన రైతు పక్షపాతి. దుర్భిక్ష రాయలసీమకు సాగునీరు ఇచ్చేందుకు పోతిరెడ్డిపాడును వెడల్పు చేయటం ఆయనకే సాధ్యమైంది. సొంత జిల్లాకు నీళ్లు ఇచ్చుకుంటున్నారని కొందరు విమర్శలు చేసినా.. వైఎస్ రాష్ట్రంలోని అన్ని దుర్భిక్ష ప్రాంతాలకూ సాగునీరు ఇవ్వాలని తపనపడ్డ నాయకుడు. సాంకేతిక అంశాలు.. సాధ్యాసాధ్యాలను కూడా పక్కన పెట్టి పెద్ద ఎత్తున జలయజ్ఞం చేపట్టారు. ఆయన మరణానంతరం ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకులు సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారు. వైఎస్ ఉంటే ఈ పాటికి పులిచింతల పూర్తయ్యి ఉండేది. ఆయన పోయాక ప్రాజెక్టులే కాదు రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్ అకాల మరణం రాష్ట్రంలో రైతులకు పెద్ద లోటు. - వడ్డే శోభనాద్రీశ్వరరావు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి ప్రాజెక్టులకు ప్రాణం... సంవత్సరాల తరబడి పునాది రాళ్లకే పరిమితమైన సాగునీటి ప్రాజెక్టుల పనులను ఆచరణలోకి తీసుకువచ్చిన ఘనత దివంగత రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ప్రాజెక్టుల పనులను ఆషామాషీగా, ఎన్నికల జిమ్మిక్కు కోసం ఆయన ప్రారంభించలేదు. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ప్రాజెక్టుల పరిపాలన అనుమతులు, టెండర్లు పిలవటం వంటి వాటికే సమయం సరిపోయింది. ఆ తరువాత ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంతో సాగాయి. అందుకు నిదర్శనం సాగునీటి ప్రాజెక్టుల పనులకు వైఎస్సార్ హయాంలో నెలకు రూ. 1,500 కోట్లు బిల్లులు చెల్లించేది. వైఎస్సార్ మరణం తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పుడు ప్రాజెక్టుల పనులకు నెలకు కేవలం రూ. 500 కోట్లే బిల్లులు చెల్లిస్తున్నారు. చాలా ప్రాజెక్టుల సమస్యలన్నింటినీ వైఎస్సార్ హయాంలోనే పరిష్కరించారు. అయినా ఆయన మరణానంతరం ప్రభుత్వాలు ప్రాజెక్టుల పనులను ముందు తీసుకువెళ్లలేకపోతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల పనులపై రాజశేఖరరెడ్డి ప్రతి నెలా రెండు సార్లు క్షేత్రస్థాయిలో పనుల ఎలా జరుగుతున్నాయనే విషయంపై చీఫ్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించేవారు. ఏదైనా సమస్యలుంటే వారం రోజుల్లో పరిష్కారాలు కనుగొనేవారు. ఇప్పుడు ఆ చొరవ లోపించింది. వైఎస్సార్ జీవించి ఉంటే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల పనులు నేటికి చివరి దశకు చేరేవి. ప్రాజెక్టులను పూర్తి చేయటమే కాదు.. వాటి ద్వారా నీటిని పొలాలకు పారిస్తేనే జలయజ్ఞం లక్ష్యం నెరవేరుతుందని పదే పదే ఇంజనీర్లకు గుర్తు చేసిన సీఎం రాజశేఖరరెడ్డి. - ఆర్.ప్రభాకర్‌రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వైఎస్ ఉండివుంటే ఇంత కల్లోలం ఉండేది కాదు ఒక ముఖ్యమంత్రి చనిపోతే రాష్ట్రంలో ఇంత కల్లోల పరిస్థితి ఏర్పడిన చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే.. ప్రస్తుత రాష్ట్ర దృశ్యం ఈ విధంగా ఉండేది కాదు. సంక్షేమ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంతంగా అమల్లో ఉండేవి. ప్రత్యేకించి సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు, పథకాలు, ప్రజాహిత చర్యలు ఆయనకు ఖ్యాతి తెచ్చిపెట్టాయి. అందువల్లే ఆయన చనిపోయినప్పుడు.. ప్రజలంతా తమ పెద్ద దిక్కును కోల్పోయినట్లు బాధపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, సమన్వయం కోసం వైఎస్ ఎంతో కృషి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి విశిష్టంగా కృషి చేశారు. ఆయన నాయకత్వ పటిమకు మచ్చుకు ఒక విషయం చెప్తాను. రాష్ట్రానికి గ్యాస్ సరఫరాలో జరిగిన అన్యాయాన్ని వైఎస్ ఎదిరించారు. కేజీ బేసిన్ గ్యాస్ విషయంలో రిలయన్స్ సంస్థ ఎన్ని నాటకాలు ఆడుతోందో చూస్తూనే ఉన్నాం. కొన్ని విషయాల్లో వైఎస్‌తో విభేదించినా.. ఆయన నాయకత్వ పటిమ, పాలనా దక్షతను అభినందించాల్సిందే. - ఎ.బి.కె.ప్రసాద్, ప్రముఖ సంపాదకులు ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు... దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమై, అద్భుత ప్రాచుర్యం పొందిన ఆరోగ్యశ్రీ, 108, 104 కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావటం లేదు. ముఖ్యంగా 108, 104 అనేవి సేవా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల అమలులో సమ్మెలు, బంద్‌లు జరగకూడదు. దురదృష్టవశాత్తు అలా జరుగుతున్నాయి. ఉద్యోగులు జీతాల పెంపుదల కోసం, హక్కుల కోసం నెలల తరబడి సమ్మెలు చేసిన ఉదంతాలు మన కళ్లముందే కనిపించాయి. ఆరోగ్యశ్రీ పథకం కూడా అంతే. సేవాభావంతో కార్పొరేట్ ఆస్పత్రులు స్పందించాల్సి ఉన్నా వాళ్లు ఎప్పుడూ స్పందించరు. వాళ్లు వ్యాపార దృక్పథంతోనే చూస్తారు. పోనీ ప్రభుత్వం నిధులు విడుదల చేసి పథకాన్ని అమలు చేస్తుందా అంటే అదీ లేదు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వాలు నిధులివ్వలేక పోవటం ఆశ్చర్యకరం. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఈ పథకాల అమలు సరిగా లేదు. -పొత్తూరి వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు నిరుపేద విద్యార్థి వైద్యుడయ్యాడు... ‘‘కనీసం రూ. 5 వేలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఓ నిరుపేద విద్యార్థి దర్జాగా తన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పట్టుకుని వెళ్లి ఫీజు ఎంత అన్న దానితో సంబంధం లేకుండా ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి వృత్తివిద్యా కోర్సుల్లో చేరే అవకాశం కల్పించింది ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఈ పథకాన్ని దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చాలా దూరదృష్టితో ప్రవేశపెట్టారు. విద్యార్థులపై పెట్టే పెట్టుబడిని ఖర్చు కోణంలో చూడవద్దని, దానిని పెట్టుబడి కోణంలోనే చూడాలని, ఒక పేదవాడు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివితే ఆ కుటుంబం శాశ్వతంగా అభివృద్ధి చెందుతుందని పదేపదే చెప్పే ఆయన తన ఆలోచనకు అనుగుణంగా రూపొందించిన మానసపుత్రిక ఈ పథకం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయాలని 2007లో రాజశేఖర్‌రెడ్డిని కోరాం. మా విజ్ఞప్తిని సీఎం అన్ని డిమాండ్ల తరహాలోనే మామూలుగా తీసుకుంటారని భావించాం. కానీ వైఎస్సార్ అలా చేయలేదు. వెంటనే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బీసీ విద్యార్థులకు శాచ్యురేషన్ (సంతృప్తస్థాయి) పద్ధతిలో ఫీజుల పథకాన్ని అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయన ఉన్నన్ని రోజులు ఈ పథకం చక్కగా అమలు జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని భ్రష్టు పట్టించాయి. - ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూరదృష్టితో వైఎస్ నిర్ణయాలు... ‘‘దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సజీవంగా ఉండివుంటే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తలెత్తి ఉండేవి కానేకావు. అనిశ్చిత పరిస్థితులు తలెత్తకుండా వైఎస్సార్ చాలా ముందస్తు ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోగలిగేవారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదు. ఏమైనా నిర్ణయాలు మెజారిటీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఉండాలి. శాంతిభద్రతలకు సంబంధించి కూడా రాజశేఖరరెడ్డికి స్పష్టమైన అవగాహన ఉండేది. భవిష్యత్‌లో వచ్చే సమస్యలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. దీంతోనే నక్సలైట్లతో శాంతిచర్చలు వంటి సంచలనాత్మక నిర్ణయాలను ఆయన అమలు చేయగలిగారు. ఆయన జీవించి ఉండివుంటే సంక్షేమ పథకాల అమలుకూడా మరింత వేగవంతమయ్యేదనటంలో సందేహం లేదు. - మాజీ డీజీపీ కె.అరవిందరావు విద్యాయజ్ఞం ఘనత ఆయనదే... కొన్ని ప్రత్యేక కారణాల వల్ల జలయజ్ఞానికి ప్రాధాన్యత లభించినా విద్యాయజ్ఞాన్ని ప్రారంభించింది కూడా వై.ఎస్.రాజశేఖరరెడ్డే. రాష్ట్రంలో ఐఐటీ, బిట్స్ మొదలుకుని ట్రిపుల్ ఐటీలు, జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించటంలో ఆయన ముందుచూపు, చిత్తశుద్ధి కనిపిస్తోంది. ఆయన హయాంలో అనేక విద్యాసంస్థల ద్వారా వృత్తివిద్యలో ప్రవేశాలు అందుబాటులోకి వచ్చాయి. ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ప్రతి పేద గుడిసెకూ ఉన్నత విద్యను చేర్చిన ఘనత ఈ దేశంలో ఒక్క రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుంది. ఆయన మరణం విద్యారంగానికి తీరని లోటు. - డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, విద్యారంగ నిపుణులు విద్యుత్ రంగంలో సాహసోపేత నిర్ణయాలు... రైతులపై పెట్టుబడి భారం తగ్గించేందుకు ఎంతో సాహసోపేతంగా ఉచిత విద్యుత్ పథకాన్ని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. రైతులు చెల్లించాల్సిన సుమారు రూ. 1,250 కోట్ల విద్యుత్ బకాయిలను కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేశారు. రైతులపై బనాయించిన విద్యుత్ కేసులను కూడా మాఫీ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని మాట ఇచ్చి.. అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కపైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. పరిశ్రమలకు విద్యుత్ చార్జీలను కూడా తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్పత్తి సంస్థ (జెన్కో)కు వైఎస్ ఊపిరిపోశారు. వైఎస్ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లను విజయవాడతో పాటు ఖమ్మం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి సమీపంలో మొత్తం మూడు విద్యుత్ ప్లాంట్లను చేపట్టారు. వైస్సార్ జిల్లాలో 210 మెగావాట్లు, 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏకంగా 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కష్ణపట్నం థర్మల్ ప్లాంటును ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలో మరో 600 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేశారు. అయితే.. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులకు ఈ దూరదృష్టి లేకుండా పోయింది. కొత్తగా ఒక్క విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా చేపట్టలేదు. రెగ్యులర్, సర్దుబాటు చార్జీలను ప్రజలపై భారీగా మోపారు. - ఎ. పున్నారావు, విద్యుత్‌రంగ నిపుణులు