సాక్షి, అచ్చంపేట రూరల్: ప్రజా సంక్షేమాన్ని విస్మరిం చిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మడం లేదని, కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు ఉందని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, అమ్రాబాద్ జెడ్పీటీసీ అనురాధ అన్నారు. సోమవారం పట్టణంలోని మారుతీనగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన సాగుతుందన్నారు. అలాగే శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో వారు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కటకం జయ, ఎం. లావణ్య, కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్లు శారద, సుశీల, లక్ష్మి, మఖ్బూల్, ఖాజా, భానుప్రసాద్, రమేష్‌గౌడ్, రఘురాం, షకీల్, అప్జల్, మహేష్, శేఖర్, కుమార్ పాల్గొన్నారు.
విముక్తి కోసం కాంగ్రెస్‌ను ఆదరించండి
మన్ననూర్: కుటిల రాజకీయాలకు పాల్పడుతూ వంచనకు గురి చేస్తున్న టీఆర్‌ఎస్ పాలకుల నుంచి ఉమ్మడి అమ్రాబాద్ మండలాన్ని విముక్తి చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నానని జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ అనురాధ అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ కూడళిలో ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
త్యాగాల పునాదులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడంతో పాటూ ఇప్పటికే అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. వజ్రాల అన్వేషణ, వెలికితీత కోసం ఉమ్మడి అమ్రాబాద్ మండలాన్ని ఖాళీ చేయిం చేందుకు కుట్ర చేస్తున్నారని ఇది అందరు గమనించాలన్నారు. ఆమె వెంట వైస్‌ఎంపీపీ సంబు శోభ, సుజాత, నాయకులు ఉన్నారు.
కాంగ్రెస్ నాయకుల ప్రచారం
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్లబాబి, తుర్కపల్లి, మాచారం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, రేణయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పంబలి బుచ్చయ్య, వైస్‌ఎంపీపీ సంబు శోభ, నాయకులు అంబనారాయణ, నిరంజన్, సుందరయ్య, మల్లయ్య, బాల్‌రాజ్, రామాంజనేయులు, వెంకటేష్, కృష్ణయ్య, ఆనంద్, సిద్ధార్థ, కర్ణ పాల్గొన్నారు.
కొండనాగులలో..
బల్మూర్: మండలంలోని కొండనాగులలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సోమవారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ధర్మనాయక్, నాయకులు శ్రీపతిరావు, నర్సింగ్‌రావు, వెంటేశ్వర్లు, బాబు, తదితరులు పాల్గొన్నారు.
మద్దిమడుగులో..
అమ్రాబాద్: పదర మండలం మద్దిమడుగులో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకుముందు ఆం జనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు సంబుశోభ, చత్రునాయక్, రాంలింగయ్యయాదవ్, అచ్చిరెడ్డి, బుచ్చయ్య, జూలూరి సత్యనారా యణ, విజ్జప్ప, మల్లికార్జున్, కార్తిక్‌రెడ్డి, లింగం, రాములు, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిక
ఉప్పునుంతల: మండలంలోని గువ్వలోనిపల్లిలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కట్టా అనంతరెడ్డి, నర్సింహరావు, నాగయ్యగౌడ్, రవికుమార్, ప్రతాప్‌రెడ్డి, రాంచందయ్య, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment