పదవుల పందేరం!
పదవుల పందేరం!
Published Thu, Mar 31 2016 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
డిప్యూటీ సీఎంగా వైగో
విద్యామంత్రిగా తిరుమా
ఆర్థిక మంత్రిగా ముత్తరసన్
రామకృష్ణన్‌కు స్థానిక పరిపాలన శాఖ
జాబితా ప్రకటించిన సుదీష్
సాక్షి, చెన్నై: సీట్ల పందేరంతో నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ జరగలేదు...ఇంకా, ఎన్నిక లూ జరగలేదు...అయితే, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి మాత్రం అధికార పగ్గాలు చేపట్టిన ధీమాతో ముందుకు సాగుతోంది. తన బావ విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా తెర మీదకు తెచ్చిన కూటమి నేతలకు పదవుల పంపకాల్లో డీఎండీకే యువజన నేత సుదీష్ నిమగ్నమయ్యారు. ప్రచార వేదిక లో కూటమి నేతలకు పదువల్ని కట్టబెట్టేసి అందర్నీ విస్మయంలో పడేశారు. ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ చేరిన విషయం తెలి సిందే. ఆయన రాకతో ఆ కూటమిలోని ఎం డీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. విజయకాం త్‌ను తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే, కెప్టెన్ కూటమి గా పేరు మార్పు జరగడం వివాదానికి దా రి తీసింది. చివరకు నేతలందరూ ఏకతా టి పైకి వచ్చి డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అన్న నినాదాన్ని అందుకున్నా రు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. సీట్ల పందేరాల్లో సామరస్య పూర్వకంగానే నాయకులు వెళుతున్నారు. కూటమిలో చీలికకు ఆ స్కారం లేని విధంగా అడుగు లు వేసి, ఒకరి అభిప్రాయాల కు మరొకరు గౌరవం ఇస్తూ, తాము పంచ పాండవులం అని చాటుకునే పనిలో పడ్డారు. తమ బలాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ప్రచార సభల్ని విస్తృతం చేశారు. వీసీకేకు ఎన్నికల యంత్రాంగం ఉంగరం చిహ్నం కేటాయించడాన్ని పురస్కరించుకుని ఏకంగా పార్టీ నేత తిరుమావళవన్‌కు మంగళవారం రెండు సవరాలతో కూడిన బంగారం ఉంగరాన్ని తొడిగి తమ స్నేహబంధాన్ని వైగో చాటుకున్నారు.
ఈ పరిస్థితుల్లో తన బావను సీఎం చేయడానికి సిద్ధమైన ప్రజా కూటమి నేతల్ని బుధవారం పొగడ్తల పన్నీరుతో ముంచెత్తిన డీఎండీకే యువజన నేత, విజయకాంత్ బావమరిది సుదీష్ పదవుల పంపకాలతో కూడిన జాబితాను ప్రకటించి అందర్నీ విస్మయంలో పడేశారు.
డిప్యూటీ సీఎం వైగో: కోవిల్ పట్టి గాంధి మైదానంలో బుధవారం జరిగిన ప్రచార సభలో సుదీష్ తన ప్రసంగం ద్వారా ప్రజా కూటమి నేతల్ని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటుగా పదవుల పంపకాల్లో నిమగ్నం అయ్యారు.
డీఎండీకే - ప్రజా కూటమి అధికార పగ్గాలు చేపట్టినట్టేనని, విజయకాంత్ సీఎం పగ్గాలు చేపట్టే సమయం ఆసన్నమవుతోందని వ్యాఖ్యానించారు. విజయకాంత్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే, డిప్యూటీ సీఎంగా వైగో బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. వీసీకే నేత తిరుమావళవన్ విద్యా శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం నేత రామకృష్ణన్ స్థానిక పరిపాలనా శాఖ మంత్రిగా పగ్గాలు చేపడుతారని ప్రకటించి, అక్కడున్న వారందర్నీ విస్మయంలో పడేశారు. సుదీష్ వ్యాఖ్యానించడంపై అక్కడే గుస..గుసలు అడిన వాళ్లూ ఉండడం గమనార్హం.
ఇక, విజయకాంత్ ప్రభుత్వంలో తాను మాత్రం ఏ పదవీ స్వీకరించనని, ఒక సభ్యుడిగా అందరితో కలసి ఉంటానని, కూటమిలోకి వచ్చే వారికి కీలక మంత్రి పదవి గ్యారంటీ అని వ్యాఖ్యానించి పరోక్షంగా టీఎంసీ నేత వాసన్ తమ వైపునకు వస్తారన్న సంకేతాన్ని సుదీష్ ఇవ్వడం గమనార్హం. వాసన్‌కు 24 గ్యారెంటీ: తమతో కలిసి వస్తే 24 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని టీఎంసీ నేత జీకే వాసన్‌కు డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి సంకేతాన్ని పంపింది. ఇందుకు తగ్గ పొత్తు మంతనాల్లో కెప్టెన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
తనకు ప్రజా సంక్షేమ కూటమి కేటాయించిన 124 సీట్లలో 24 సీట్లను వాసన్‌కు ఇవ్వడానికి విజయకాంత్ నిర్ణయించినట్టు డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. వాసన్ తనకు మంచి మిత్రుడు కావడంతో ఆ దిశలోనే విజయకాంత్ ప్రయత్నాల్లో ఉన్నట్టు, రెండు మూడు రోజుల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోకి వాసన్ అడుగు పెడుతారని చెబుతున్నారు.
Advertisement