విజయకాంత్ ౖ(ఫెల్)
సాక్షి, చైన్నె: డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోగ్యంపై ఆ పార్టీ వర్గాలలో ఆందోళన నెలకొంది. ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు బుధవారం బులెటిన్ విడుదలైంది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అందులో వైద్యులు వెల్లడించారు. వివరాలు.. డీఎండీకే అధినేత విజయకాంత్ ఈనెల 18వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన్ని మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
ఇక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఆయన అవయవాల పరిస్థితిపై వైద్యులు పరిశోధించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తుండటం, తరచూ శ్వాస సమస్య తలెత్తినట్టుగా, కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపై వదంతులు రావడంతో దేరడంతో వాటిని నమ్మవద్దని డీఎండీకే కార్యాలయం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో బుధవారం వెలువడ్డ బులిటెన్ డీఎండీకే వర్గాలలో ఆందోళన రెకెత్తించాయి.
విజయకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అవశ్యమైనట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చికిత్స కొనసాగుతోందని, ఆయన మరో రెండు వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని ఆ బులిటెన్‌లో పేర్కొనడం డీఎండీకే వర్గాలను కలవరంలో పడేశాయి. గతంలో విజయకాంత్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆయన ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. తాజాగా ఆయనకు మరోమారు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment