vijayakanth
-
విజయ్ అభిమానం.. విజయకాంత్ ఇంట్లో గోట్ టీమ్
కోలీవుడ్ స్టార్ విజయ్- దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా (ది గోట్) ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’. తాజాగా ఈ సినిమాకు చెందిన యూనిట్ దివంగత నటుడు విజయకాంత్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ వారి కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట షేర్ చేశారు. త్వరలో సినిమా విడుదల కానున్నడంతో చిత్ర యూనిట్ వేగంగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంతగా మెప్పించలేదనే విమర్శలు వస్తున్నప్పటికీ మార్కెట్ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది.‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ సినిమాలో ఏఐ సాయంతో దివంగత నటుడు విజయకాంత్‌ను వెంకట్ ప్రభు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సెప్టెంబరు 5న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విజయకాంత్‌కు వెంకట్ ప్రభు, విజయ్ నివాళులర్పించారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి, విజయకాంత్ సతీమణి ప్రేమలతతో వారు కొంతసమయం పాటు మాట్లాడారు.విజయ్, అయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ అంటే విజయకాంత్‌కు చాలా ఇష్టం. అదేవిధంగా విజయకాంత్ అంటే కూడా విజయ్‌కు చాలా గౌరవం. అలా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. గతంలో వెట్రి, సెంతూరపండి తదితర చిత్రాల్లో వారిద్దరూ కలిసి నటించారు. విజయకాంత్ మరణం తర్వాత తన రూపాన్ని సినిమాలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న డైరెక్టర్. ఈమేరకు పలుమార్లు ప్రేమలతను విజ్ఞప్తి చేసి అనుమతి పొందారు. అలా గోట్ సినిమాలో ఏఐ టెక్నాలజీ సాయంతో విజయకాంత్‌ను వెండితెరపై చూపించబోతున్నారు. ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రలలో కనిపించనున్నాడు. ఆయన్ను కుర్రాడిగా చూపించేందుకు 'డీ- ఏజింగ్' టెక్నాలజీ వినియోగించారు. సెప్టెంబరు 5న 6వేల థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. చెన్నైలో ప్రతి థియేటర్లో మొదటిరోజు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ సినిమానే ఉండేలా ప్లాన్ చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. -
లారెన్స్‌పై విజయ కాంత్ ఫ్యాన్స్ ఫైర్
దివంగత ప్రముఖ నటుడు విజయ కాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ తన తండ్రి బాటలోనే నటించడానికి సిద్ధమయ్యారు. అలా ఆయన సహాబ్దం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. కాగా తాజాగా అన్బు దర్శకత్వంలో పడై తలైవన్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. విజయకాంత్ మరణానంతరం షణ్ముఖ పాండియన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో తాను కూడా ఒక పాత్రలో నటిస్తానని రాఘవ లారెన్స్ మాట ఇచ్చారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆయన ఈ చిత్రంలో నటించడం లేదు. దీంతో రాఘవ లారెన్స్ గురించి సామాజిక మాధ్యమాల్లో పలు రకాలుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ కాంత్ ఫ్యాన్స్ అయితే లారెన్స్‌ను ట్రోల్ చేయడం కూడా ప్రారంభించారు. దీంతో చిత్ర దర్శకుడు అన్బు ఇలా క్లారిటీ ఇచ్చారు. విజయ కాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో లారెన్స్ నటించడం లేదని తెలిపారు. తమ సినిమాలో ఒక పాత్రను పోషిస్తానని రాఘవ లారెన్స్ చెప్పిన విషయం తెలిసిందే.. దీంతో షణ్ముఖ పాండియన్‌తో పాటు తాను కూడా రాఘవ లారెన్స్‌ను వెళ్లి కలిశామని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు కథను చెప్పగా బాగుందని మెచ్చుకుంటూ తాను నటిస్తానని లారెన్స్ మాట కూడా ఇచ్చారు. ఆ విధంగా చిత్ర షూటింగ్ ప్రారంభం అయిన తరుణంలో తనకు చిన్న సందేహం కలిగిందని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో నటుడు రాఘవ లారెన్స్ పాత్ర బలంగా ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లారెన్స్‌కు కూడా తెలిపినట్లు అన్బు అన్నారు. తన నిర్ణయాన్ని రాఘవ లారెన్స్ కూడా స్వాగతించారని చెప్పారు. ఈ సనిమాలో లారెన్స్ నటించిక పోయిన విడుదల సమయంలో ప్రమోషన్ కార్య క్రమాలకు తన చేతనైన సహాయం చేస్తానని మాట ఇచ్చారన్నారు. కాగా రాఘవ లారెన్స్ నటించాల్సిన పాత్రలో దివంగత నటుడు విజయ్‌కాంత్‌ను ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో నటింపజేస్తున్నట్లు సమాచారం. -
నాతో సినిమా చేసేందుకు విజయకాంత్ ఒప్పుకోలేదు: ఊర్వశి
రాజకీయాల్లో రాణించిన సినిమా స్టార్లు చాలామందే ఉన్నారు. అందులో విజయకాంత్ ఒకరు. రాజకీయాల్లో కరుప్పు ఎంజీఆర్‌గా, సినీరంగంలో కెప్టెన్‌గా క్రేజ్ అందుకున్నాడు విజయకాంత్. హీరోగా రోజుకు మూడు షిఫ్టులు పని చేసేవాడు. ఎంతలా అంటే 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆయన గతేడాది డిసెంబర్లో అనారోగ్యంతో కన్నుమూశారు. నన్ను ప్రేమగా పిలిచేవారు తాజాగా సీనియర్ నటి ఊర్వశి ఆయన్ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది. ఆయన తనతో పని చేయడానికి నిరాకరించారంటూ ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంది. 'నేను చిన్నగా ఉన్నప్పుడు విజయకాంత్ సినిమాల్లో నటించాను. అప్పుడు ఆయన నన్ను తంగాచ్చి (చెల్లి) అని పిలిచేవారు. తర్వాత నేను హీరోయిన్‌గానూ సినిమాలు చేశాను. నాతో సినిమా చేయనన్నారు అలా ఓసారి విజయకాంత్ సినిమాలో నన్ను హీరోయిన్గా అనుకున్నారు. అందుకాయన ఒప్పుకోలేదు. నా పక్కన నటించేందుకు ఇష్టపడలేదు. చెల్లి అని పిలిచాక తనకు జంటగా ఎలా నటించగలను అన్నారు. అంతేకాదు, ఆ మూవీలో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. అందుకోసమే నా పక్కన నటించలేదు' అని ఊర్వశి చెప్పుకొచ్చింది. చదవండి: నాని 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్ అలాంటి సినిమా చేసిందా.. 20 నిమిషాల సీన్స్ కట్ -
విజయ్‌కాంత్ కోసం ఆ పని చేయనున్న లారెన్స్!
కెప్టెన్ విజయ్‌కాంత్ ఇక లేరన్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న కన్నుమూశారు. ఆయన మరణవార్త విని సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. కొందరు సెలబ్రిటీలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కంటతడి పెట్టుకోగా మరికొందరు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ అయ్యారు. హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ కొద్ది రోజుల క్రితమే తన తల్లితో కలిసి విజయ్‌కాంత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాడు. అతడి సినిమాలో చేస్తా ఆ సమయంలో కెప్టెన్ తనయుడు షణ్ముగ పాండియన్ కెరీర్ బాధ్యతలు నువ్వే తీసుకోవాలని ఇంటిసభ్యులు రాఘవను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు రాఘవ కీలక ప్రకటన చేశాడు. 'షణ్ముగ పాండియన్ నెక్స్ట్ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తాను. వీలైతే దర్శకులు మల్టీస్టారర్ కాన్సెప్ట్‌తో రండి. అప్పుడు ఇద్దరం ప్రధాన పాత్రల్లో నటించే వీలుంటుంది. అలాగే కెప్టెన్ రెండో కుమారుడు విజయ ప్రభాకరన్ రాజకీయాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు. విజయ్‌కాంత్ మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్(ట్విటర్)లో వెల్లడించాడు. అలా తెలుగువారికీ పరిచయం నల్ల ఎంజీఆర్, పురట్చి కలైజ్ఞర్, కెప్టెన్.. ఎలా పలు పేర్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్‌కాంత్. తమిళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ఆయన ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఛాలెంజ్ రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, మా బావ బంగారం, సింధూరపువ్వు, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం.. ఇలా ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో అనువాదమవడంతో ఇక్కడివారికీ సుపరిచితులయ్యారు. ఒక్క రూపాయి తీసుకోలేదు నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే ఈయన ఒక్క రూపాయి పారితోషికం తీసుకునేవారు కాదు. అలాగే తన కార్యాలయంలో నిత్యాన్నదానం చేసేవారు. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేసేవారు. అలాగే ఎందరో నటీనటులను ప్రోత్సహించి మంచి కెరీర్ అందించారు. ఈయన చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్‌ను హీరోగా పరిచయం చేసిన సహాబ్దం సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. I’m happy to share with you all that I’m ready to do a cameo role in captain sir’s Son Shanmuga Pandian’s movie as my respect and love for Vijayakanth sir 🙏🏼 pic.twitter.com/zIlNBqnVs2 — Raghava Lawrence (@offl_Lawrence) January 10, 2024 చదవండి: 'ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది'.. నమ్రత పోస్ట్ వైరల్! విరాట్ నాకు బావ అవుతాడు.. నాతో ఎలా ఉంటాడంటే?: సైంధవ్ హీరోయిన్ -
Actor Surya : బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి (ఫొటోలు)
-
మా గుండెల్లో ఉంటావ్ అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య
గతేడాది చివర్లో కోలివుడ్ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడును విషాదంలో ముంచెత్తింది. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా ప్రజల మనసు గెలుచుకున్న విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. తమ ప్రియతమ సహ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రపంచం కూడా తరలి వచ్చింది. ఆ సమయంలో రాలేని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుతం హీరో సూర్య విజయకాంత్‌కు నివాళులు అర్పించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. విజయకాంత్ స్మారక స్థూపం వద్దకు చేరుకోగానే సూర్య తీవ్రమైన భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడుస్తూ ఆ వీడియోలో ఉన్నారు. విజయకాంత్ ఇంటికి చేరుకున్న సూర్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్తీ కూడా అక్కడే ఉన్నాడు. విజయకాంత్ మరణించే సమయంలో సూర్య విదేశాల్లో ఉన్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక వీడియో ద్వారా విజయకాంత్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సూర్య కెరీర్ తొలి చిత్రం విజయకాంత్తోనే మొదలైంది. వారిద్దరూ కలిసి నటించిన పెరియన్నలో సూర్య టైటిల్ క్యారెక్టర్‌గా నటించాడు. మొదటి చిన్న పాత్ర అని సూర్యను తీసుకున్నారు.. కానీ సూర్య టాలెంట్‌ను గుర్తించిన విజయకాంత్ అతని రోల్ మరింత సమయం ఉండేలా డైరెక్టర్ ఎస్.ఏ చంద్రశేఖర్‌కు చెప్పారట. అలా అతిధి పాత్రలో అనుకున్న సూర్య ఆ సినిమాలో ప్రధాన పాత్రధారిగా కనిపించారు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. కానీ ఈ సినిమా సూర్య కెరీయర్లో 4వ చిత్రంగా వచ్చింది. విజయకాంత్ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సూర్య ఇలా మాట్లాడారు.. 'ఆయనతో కలిసి పని చేస్తూ, మాట్లాడి, తింటూ గడిపిన రోజులు ఎప్పటికీ మరువలేను.. సాయం అడిగిన ఎవ్వరికీ నో చెప్పలేదు. లక్షలాది మందికి సాయం చేసి వారందరికీ పురట్చి కలైంజర్గా మారిన నా సోదరుడు విజయకాంత్ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఇక లేరనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. ఒక కన్నులో ధైర్యం, మరో కన్ను కరుణతో జీవించిన అరుదైన కళాకారుడు. ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికి సాయం చేశాడు. పిరాట్చి కలైంజర్ మా గుండెల్లో కెప్టెన్ అయ్యాడు. అన్న విజయకాంత్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని సూర్య సంతాపం తెలిపారు. View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) -
విజయకాంత్‌ను తల్చుకుని ప్రధాని మోదీ భావోద్వేగం
చెన్నై: ప్రముఖ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్‌ను తల్చుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం తిరుచిరాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడ కెప్టెన్ విజయకాంత్ ప్రస్తావన తెచ్చి మరీ నివాళులర్పించారు. ‘‘కొన్నిరోజుల కిందటే.. విజయకాంత్ గారిని మనం కోల్పోయాం. ఆయన సినీ ప్రపంచంలో మాత్రమే కెప్టెన్ కాదు.. రాజకీయ రంగంలో కూడా కెప్టెనే. సినిమాల ద్వారా అశేష ప్రజాభిమాన సంపాదించుకున్న విజయకాంత్.. ఒక నేతగా రాజకీయం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమనుకునేవారు.. అని ప్రధాని మోదీ విజయకాంత్‌ను కొనియాడారు. ఆయన మరణం తమిళ భూమికి.. దేశానికి తీరని లోటు అని పేర్కొంటూ.. విజయకాంత్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. PM Modi’s heartfelt condolences to the family and admirers of his dear friend Captain Vijaykanth ❤️#VanakkamModi #Vijayakanth pic.twitter.com/31N8MPYCLx — இந்தா வாயின்கோ - Take That (@indhavaainko) January 2, 2024 తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. తొలుత... తిరుచిరాపల్లిలోని భారతిదశన్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారాయన. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత త్రిచీ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్‌ను ప్రారంభించారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ డిసెంబర్ 28వ తేదీన కన్నుమూశారు విజయకాంత్(71). ‘కెప్టెన్’ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సైతం సంతాపం ప్రకటించారు. తమిళ సినీ రంగంలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ విజయకాంత్ తనదైన ముద్ర వేశారు. Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo — Narendra Modi (@narendramodi) December 28, 2023 -
కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
డీఎండీకే అధినేత, నటుడు విజయ్‌కాంత్ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది. కాగా.. మొదట విజయ్‌కాంత్ భౌతికకాయాన్ని డీఎండీకే కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత విజయకాంత్ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడే సినీస్టార్ కమల్ హాసన్, రజనీకాంత్ ఆయనకు నివాళులు అర్పించారు. విజయకాంత్ చివరి చూపు కోసం సామాన్య ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అనంతరం డీఎండీకే ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా.. కెప్టెన్ విజయకాంత్(71) డిసెంబర్ 28న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. #WATCH | Chennai, Tamil Nadu: A large number of people gathered to pay tribute to DMDK President and Actor Vijayakanth. His mortal remains are being taken from Island ground, Anna Salai to Koyambedu DMDK office for the last rites. pic.twitter.com/cbSweIhY7z — ANI (@ANI) December 29, 2023 -
నాలుగేళ్లుగా విజయకాంత్ కుమారుడి పెళ్లికి బ్రేకులు.. ప్రధాని మోదీ కోసమేనా?
కోలీవుడ్ నటుడు, డీఎండీ వ్యవస్థాపకుడు విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. కొద్దిమంది సమక్షంలో విజయకాంత్ అంత్యక్రియలు జరిగాయి.కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణాలతో విజయకాంత్ క్రియాశీలక రాజకీయాలకు విరామం ఇచ్చారు. ఇంతలో చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాడు. పూర్తి విశ్రాంతిలో ఉన్న ఆయన ఎప్పటికప్పుడు వాలంటీర్లను కలవడం మాత్రమే అలవాటు చేసుకున్నారు. వీటన్నింటికీ మించి కొన్ని వారాల క్రితం మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఆయన పదేపదే ఆసుపత్రిలో చేరడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కుమారుడి పెళ్లికి బ్రేక్ విజయకాంత్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయప్రభాకరన్, షణ్ముఘపాండియన్... చిన్న కుమారుడు షణ్ముఘ పాండియన్ తన తండ్రి అడుగుజాడల్లో తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా మారాడు. పెద్ద కుమారుడు విజయప్రభాకరన్ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. అతను తన తండ్రి విజయకాంత్ స్థాపించిన రాజకీయ సంస్థ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) యొక్క వివిధ కార్యక్రమాలలో పాల్గొంటాడు. డిసెంబర్ 2019లో, విజయప్రభాకరన్ కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త ఇళంగో కుమార్తె కీర్తనాతో సన్నిహితులు, బంధువుల సమక్షంలో చాలా తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో కూడా అనారోగ్య కారణాలతో నిశ్చితార్థ వేడుకకు విజయకాంత్ రాలేకపోయారు. నిశ్చితార్థం జరిగి నాలుగేళ్లు కానీ.. అయితే ఈ జంట నిశ్చితార్థం జరిగి ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి విషయంలో పలు ఊహాగానాలు సినీ పరిశ్రమతో పాటు విజయకాంత్ అభిమానుల్లో జోరందుకున్నాయి. కానీ విజయకాంత్ సన్నిహితులు చెబుతున్న ప్రకారం, వారి నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల తర్వాత బయటపడిన కరోనావైరస్ మహమ్మారి వల్ల వారి వివాహ ప్రణాళికలలో అనేక మార్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత పెళ్లి పనులు ఏర్పాటు చేసుకుందామనుకుంటే.. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వీలు కాలేదు. మోదీ చేతుల మీదుగా తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్ ఆశించారట కానీ ఆ సమయంలో ఆయన బిజీగా ఉండటం వల్ల ఆ పెళ్లికి తేదీలు కేటాయించలేకపోయారు మోదీ. దీంతో 2022లో కూడా ఆ పెళ్లికి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత మోదీ నుంచి ప్రకటన వచ్చినా.. విజయకాంత్ ఆరోగ్యం మరింత క్షణించడం వైద్యం కోసం అమెరికా వెళ్లడం వంటి కారణాల వల్ల ఆ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ప్రధాని మోదీ సమక్షంలో తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్ ఎక్కువగా కోరుకున్నారట. రేపొద్దన్న ఆ పెళ్లికి మోదీ రావచ్చు... కానీ ఆ వేడుకలను చూసేందుకు విజయకాంత్ గారు లేరు. కుమారుడి పెళ్లి చూడకుండానే విజయకాంత్ వెళ్లిపోవడం విషాదాన్ని నింపింది. -
విజయ్ మీదకు చెప్పు విసిరిన వ్యక్తి, వీడియో వైరల్
కెప్టెన్ విజయకాంత్(71) ఇక సెలవంటూ గురువారం (డిసెంబర్ 28న) శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో విజయ్.. గురువారం రాత్రి చెన్నైలోని ఐల్యాండ్ గ్రౌండ్లో విజయకాంత్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించాడు. ఆయనను చివరి చూపు చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. చేదు అనుభవం.. కెప్టెన్ కుటుంబసభ్యులను పరామర్శించి తిరిగి వెళ్తున్న క్రమంలో విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి హీరో మీదకు చెప్పు విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు ఇలాంటి సమయంలో ఈ పిచ్చి పనులేంటని మండిపడుతున్నారు. అజిత్ అభిమానులు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇకపోతే విజయకాంత్ సినిమాల్లో విజయ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అలాగే విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ విజయకాంత్‌తో పలు సినిమాలు చేశారు. ఇక విజయ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నాలయ తీర్పు' ఫెయిల్ కావడంతో అతడి రెండో సినిమాలో నటించమని విజయకాంత్‌ను కోరాడు చంద్రశేఖర్. విజయకాంత్ వల్లే.. అతడికి ఇచ్చిన మాట ప్రకారం సింధూరపండి మూవీలో నటించగా ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రాణించింది. ఆ తర్వాత విజయ్ తనకంటూ ఓ స్టార్‌డమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. 'అయితే వియజకాంత్ ఆ రోజు సాయం చేసి ఉండకపోతే ఈరోజు విజయ్ ఇలా ఉండేవాడు కాదు' అని స్వయంగా దళపతి తండ్రి చంద్రశేఖరే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. Actor #Vijay was attacked by some unidentified persons in the #Vijayakanth funeral place 💔#Captain #RIPVijayakanth pic.twitter.com/lmrmRr1WVR — AK (@iam_K_A) December 29, 2023 We #Ajith fans strongly condemneding this disrespect behaviour to vijay . whoever it may be, we should respect when they came to our place. Throwing slipper to @actorvijay is totally not acceptable 👎🏻 Stay strong #Vijay #RIPCaptainVijayakanth pic.twitter.com/dVg9RjC7Yy — AK (@iam_K_A) December 29, 2023 చదవండి: ఇంటి నుంచి పారిపోయిన హీరోయిన్.. పెళ్లి వద్దు, సహజీవనమే ముద్దంటున్న బ్యూటీ -
వెన్నుపోట్లు, అవయవ మార్పిడి.. ఇష్టమైన ప్రదేశంలో శాశ్వత నిద్ర!
తమిళ రాజకీయాల్లో కరుప్పు ఎంజీఆర్‌గా, సినీ రంగంలో కెప్టెన్‌గా పేరు గడించిన సీనియర్ హీరో విజయకాంత్ (71) అనారోగ్య సమస్యలతో గురువారం చైన్నెలో కన్నుమూశారు. ఆయన మరణం దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం(డీఎండీకే) కేడర్‌ను, సినీ అభిమానులను శోక సంద్రంలో ముంచింది. తమ నేత చివరి చూపు కోసం తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు చెన్నైకి పోటెత్తారు. దీంతో కోయంబేడులోని డీఎండీకే కార్యాలయ పరిసరాలు కిక్కిరిసాయి. సాక్షి, చైన్నె: కరుప్పు ఎంజీఆర్ (నలుపు ఎంజీఆర్), కెప్టెన్, పురట్చి కలైంజ్ఞర్ (విప్లవనటుడు)గా మధురైలో స్థిరపడిన తెలుగు సంతతి కుటుంబానికి చెందిన విజయ్‌రాజ్ నాయుడు తమిళ తెరపై తనదైన ప్రతిభతో విజయకాంత్‌గా మెరిశారు. తమిళ రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ ఏకంగా పార్టీనే ప్రారంభించారు. 2005 సెప్టెంబర్ 14న మధురైలో జరిగిన బహిరంగ సభ ద్వారా డీఎండీకే (దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం) పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరు నెలల కాలంలో తమిళ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి తన సత్తా చాటుకున్నారు. పేదరికం, అవినీతి నిర్మూలనను, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, నటుడు దివంగత నేత ఎంజీయార్ ఆశయాల సాధనే అజెండాగా చేసుకుని 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరుదాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయకాంత్ ఎంపికయ్యారు. అవినీతి నిర్మూలన, ప్రజాసంక్షేమ పరిపాలన నినాదంతో ప్రజాసేవలో ఒంటరిగా ముందుకు సాగారు. అవిశ్రాంత శ్రమతో.. ఎన్నికల అనంతరం మూడేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా జోడు పదవులతో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. డీఎండీకేను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. ముక్కుసూటితనం, విషయాన్ని కుండబద్దలు కొట్టడం, పసలేని ప్రభుత్వ పథకాలను నిర్మొహమాటంగా ఎండగట్టడం, తమిళుల రక్షణకు నడుం బిగించటం ద్వారా పార్టీ కేడర్‌ను, బలాన్ని పెంచుకున్నారు. దరిమిలా 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అతిపెద్ద అన్నాడీఎంకే పార్టీ తన వైపు చూసేలా చేశారు. ఈ ఎన్నికల ద్వారా తల పండిన నేతలతో నిండిన డీఎంకేను మూడో స్థానంలోకి నెట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. అదే సమయంలో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత అమ్మ జయలలితతో వైరం తదుపరి పరిణామాలతో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. డిపాజిట్లు గల్లంతు అయినా, ఏమాత్రం తగ్గలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏతో కలిసి తమిళనాట మూడో కూటమి ఏర్పాటులో సఫలీకృతులయ్యారు. ఆ ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైనా, రాజకీయంగా దాడులు పెరిగినా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు సాగారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తన నేతృత్వంలో కూటమి ఏర్పాటు ద్వారా కింగ్ మేకర్ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పార్టీలోని ముఖ్య నేతలందరూ బయటకు వెళ్లడం, అంతకు ముందు ఎదురైన రాజకీయ దాడులతో ఈ ఎన్నికలలోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. అనారోగ్య సమస్యలు.. రాజకీయాల్లో పేదల పెన్నిదిగా నిలిచిన తమిళ ఆరాధ్య నటుడు ఎంజీఆర్, తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ఎన్టీఆర్‌లే తనకు మార్గదర్శకులుగా చెప్పుకునేవారు విజయకాంత్. అయితే తనకు ఎదురైన అనారోగ్య సమస్యల కారణంగా క్రమంగా రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటములు, తన వెన్నంటి ఉన్న వారు గతంలో వెన్ను పోటుపొడవడం వంటి పరిణామాలతో బాధను మనసులో మోసి మరింత క్షీణించారు. విదేశాల్లో సైతం ఆయనకు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. దీంతో పార్టీ బాధ్యతలను ఆయన భార్య ప్రేమలత విజయకాంత్ తన భుజాన వేసుకుని, కేడర్ చేజారకుండా ముందుకు సాగుతూ వచ్చారు. గత వారం జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో విజయకాంత్ పాల్గొనడం కేడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. ఇందులో తన ప్రధాన కార్యదర్శి పదవిని భార్యకు అప్పగించారు. ఇక సెలవంటూ.. గత నెలలో కొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలో ఉన్నా, చివరకు సర్వసభ్య సమావేశంలో పాల్గొనడంతో తమ నాయకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారనే ఆనందంలో ఉన్న డీఎండీకే కేడర్, అభిమానులకు గురువారం విషాదకర సమాచారం చేరింది. తన సినీ, రాజకీయ ప్రయాణానికి ఇక సెలవంటూ కరుప్పు ఎంజీఆర్ అనంత లోకాలకు వెళ్లిపోవడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోయింది. ఆస్పత్రి నుంచి శాలిగ్రామంలోని నివాసానికి కెప్టెన్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ లాంఛనాలు ముగించి కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఊరేగింపులో తండోప తండాలుగా అభిమానులు తరలి రావడంతో నాలుగు కిలోమీటర్ల దూరం దాటేందుకు 3 గంటలు పట్టింది. ముందుగా సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ విజయకాంత్ పార్థివ దేహానికి అంజలి ఘటించారు. ఇష్టమైన ప్రదేశంలోనే శాశ్వత నిద్రలోకి.. కోయంబేడులోని తన కల్యాణ మండపం అంటే విజయకాంత్‌కు ఎంతో ఇష్టం. పార్టీ ఆవిర్భావంతో దీనిని డీఎండీకే ప్రధాన కార్యాలయంగా మార్చేశారు. ఇక్కడి నుంచి అన్ని రకాల కార్యక్రమాలు, వ్యవహారాలు జరిగేవి. ఇక్కడకు వచ్చే కార్యకర్తలకు ఎల్లవేళలా కడుపు నిండా అన్నం పెట్టి పంపించేవారు. తనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించే వారు. గతంలో రాజకీయ కారణాలతో ఈ కల్యాణ మండపం కొంత భాగం వంతెన కోసం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చినా, దీనిని ఆయన వదులుకోలేదు. ప్రస్తుతం ఆయన ఇక్కడే శాశ్వత నిద్రలో సమాధి రూపంలో ఉండబోతున్నారు. ఈ కార్యాలయం ఆవరణలోనే ఆయన్ని ఖననం చేయనున్నారు. శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కన్నీటి సంద్రంలో.. డీఎండీకే కార్యాలయంలో ఉంచిన విజయకాంత్ పార్థివదేహాన్ని కడసారి దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కదిలి వస్తున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు ఇక లేరన్న సమాచారంతో బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రంలోని తమ కార్యాలయాలలో పార్టీ జెండాను అవనతం చేశారు. విజయకాంత్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. చదవండి: 'ప్రేమమ్' దర్శకుడు షాకింగ్ పోస్ట్.. ఏకంగా సీఎం కొడుక్కి అలా! -
విజయకాంత్ మృతిపై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
తమిళ హీరో, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో చాలామంది ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలానే ఆయన సినిమాల్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఓ స్టార్ దర్శకుడు మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చనిపోలేదని, కొందరు హత్య చేశారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) మలయాళంలో 'ప్రేమమ్', 'గోల్డ్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్ఫోన్స్ పుత్రెన్.. ప్రస్తుతం కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. తాజాగా విజయకాంత్ మృతిపై స్పందించిన ఇతడు.. ఇన్ స్టా స్టోరీలో షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ హత్య ఎవరు చేశారో కనిపెట్టకపోతే మాత్రం.. నెక్స్ట్ మీ తండ్రి స్టాలిన్, అలానే మిమ్మల్ని కూడా వాళ్లు టార్గెట్ చేసే అవకాశముందని ఇతడు రాసుకొచ్చాడు. 'కరుణానిధి, జయలలితని మర్డర్ చేసింది ఎవరో కనిపెట్టాలని మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్‌ను ఎవరు హత్య చేశారో కూడా కనిపెట్టాలి. ఇదంతా ఏముందిలే అని పక్కన పెట్టేస్తారేమో.. ఇప్పటికే స్టాలిన్ సార్‌పై, ఇండియన్ 2 సెట్స్‌లో కమల్ హాసన్‌పై హత్యా ప్రయత్నం జరిగింది. ఒకవేళ ఈ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు' అని ఆల్ఫోన్స్ రాసుకొచ్చాడు. అయితే అసలు ఈయన ఎందుకు ఇలా రాసుకొచ్చాడా? అని అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) -
50 ఏళ్ల స్నేహం.. ఫ్రెండ్స్ మధ్య విభేదాలు..
స్నేహానికి విలువనిచ్చిన నటుడు విజయకాంత్. ఈయన, నిర్మాత ఇబ్రహిం రావుత్తర్ చిన్ననాటి నుంచే మంచి మిత్రులు. ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకున్న వాళ్లు. అలా వీరి మధ్య స్నేహం చిత్ర పరిశ్రమ వరకూ చేరి 50 ఏళ్లు కొనసాగింది. విజయకాంత్ హీరోగా ఇబ్రహిం రావుత్తర్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయనకు సలహాదారుడిగానూ ఉన్నారు. విజయకాంత్ వివాహానంతరం వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో దూరం పెరిగింది. అయితే ఇబ్రహిం రావుత్తర్ మరణించినప్పుడు విజయకాంత్ వెంటనే వెళ్లి ఆయన పార్థివ దేహంపై పడి బోరున ఏడ్చేశారు. అంతటి స్నేహబంధం వారిది. ఇక తొలి రోజుల్లో తన సరసన నటించడానికి నిరాకరించి అవమాన పరిచిన పలువురు నటీమణులకు ఆ తరువాత విజయకాంతే అవకాశాలు కల్పించడం విశేషం. ఇక శరత్‌కుమార్, మన్సూర్ అలీఖాన్, పొన్నంబలం వంటి పలువురు నటులకు తన చిత్రాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించి తన మంచి మనసు చాటుకున్నాడు. చదవండి: విజయకాంత్ మరణం.. విశాల్ కన్నీటి పర్యంతం! యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే? -
మనసున్న మాస్ హీరో
తమిళ ప్రేక్షకులకు విజయ్‌కాంత్ ఓ ‘పురట్చి కలైజ్ఞర్’ (విప్లవ కళాకారుడు)... నల్ల ఎంజీఆర్... అభిమానులకు మంచి మాస్ హీరో... కెప్టెన్ ... ఇవే కాదు.. ధైర్యం, తెగువకు చిరునామా అనే పేరు కూడా ఉంది.. మంచి మానవతావాది కూడా. ఇలా ఎన్నో రకాల రూపాల్లో నటుడిగా, వ్యక్తిగా తమిళ ప్రజల మనసుల్లో ‘మనసున్న మాస్ హీరో’గా చెరగని ముద్ర వేసుకున్న విజయ్‌కాంత్ ఇక లేరు. విజయ్‌కాంత్ తమిళంలో తప్ప ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ‘ఛాలెంజ్ రౌడీ, రౌడీలకు రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, కెప్టెన్ ప్రభాకరన్, మా బావ బంగారం, నేటి రాక్షసులు, సింధూరపువ్వు, అమ్మను చూడాలి, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం’.. ఇలా ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అను వాదమై, ఇక్కడి ప్రేక్షకులకు విజయ్‌కాంత్‌ని దగ్గర చేశాయి. తెలుగు హీరోలు పలువురు విజయ్‌కాంత్ తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్స్ కొట్టారు. చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఠాగూర్’ (2003) విజయ్‌కాంత్ హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘రమణ’ (2002)కు రీమేక్. అలాగే విజయ్‌కాంత్ హీరోగా నటించిన ‘సట్టమ్ ఒరు ఇరుట్టరై’ (1981), ‘వెట్రి’ (1984), ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే’ (1986) సినిమాలు తెలుగులో ‘చట్టానికి కళ్ళు లేవు’ (1981) ‘దేవాంతకుడు’ (1984), ‘ఖైదీ నంబరు 786’ (1988)గా రీమేక్ కాగా, ఈ చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించారు. విజయ్‌కాంత్ ‘చిన్న గౌండర్’ (1992) తెలుగు రీమేక్ ‘చినరాయుడు’ (1992)లో వెంకటేశ్, ‘నానే రాజా నానే మంత్రి’ (1985) రీమేక్ ‘నేనే రాజు నేనే మంత్రి (1987)’, ‘ఎన్ పురుషన్దాన్ ఎనక్కు మట్టుమ్దాన్’ (1989) రీమేక్ ‘నా మొగుడు నాకే సొంతం’ (1989) చిత్రాల్లో మోహన్‌బాబు హీరోగా నటించారు. విజయ్‌కాంత్ ‘వానత్తై పోల’ (2000) సినిమాను తెలుగులో ‘మా అన్నయ్య’గా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు రాజశేఖర్. కాగా కొందరు తెలుగు హీరోల సినిమాల తమిళ రీమేక్‌లో నటించి హిట్స్ అందుకున్నారు విజయ్‌కాంత్. బాలకృష్ణ హీరోగా నటించిన ‘భానుమతిగారి మొగుడు’ (1987) సినిమా తమిళ రీమేక్ ‘తెర్కత్తి కళ్లన్’ (1988)లో, ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘సింహాద్రి’ (2003) రీమేక్ ‘గజేంద్ర’ (2004)లో విజయ్‌కాంత్ హీరోగా నటించి, బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయ్‌రాజ్ అళగర్సామి. కేఎన్ అళగర్సామి, ఆండాళ్ అళగర్సామి దంపతులకు 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారాయన. కాగా అళగర్సామి కుటుంబానికి తెలుగు మూలాలు ఉన్నాయి. పదో తరగతి వరకు చదివిన విజయ్‌రాజ్ తండ్రికి సహాయంగా రైస్ మిల్లు బాధ్యతలను చూసుకునేవాడు. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో 1979లో చెన్నై చేరుకున్నాడు విజయ్‌రాజ్. సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన ఆయనకు ఎంఏ రాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుమ్ ఇళమై’ (1979) చిత్రంలో ప్రతినాయకుడిగా తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్ర దర్శక–నిర్మాత ఎంఏ కాజానే విజయ్‌రాజ్ పేరుని విజయ్‌కాంత్‌గా మార్చారు. ‘ఇనిక్కుమ్ ఇళమై’ తర్వాత ‘అగల్ విళక్కు, నీరోట్టం, చామంతి పూ’ తదితర చిత్రాల్లో ఆయన నటించినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరత్తు ఇడి ముళక్కమ్’ (1980) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్‌కాంత్. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో నటించిన ద్వితీయ చిత్రం ‘చట్టం ఒరు ఇరుట్టరై’ (1981) సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు విజయ్‌కాంత్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. హీరోగా చాలా బిజీ అయిపోవడంతో రోజుకు మూడు షిఫ్టులుగా పని చేశారాయన. ఎంత బిజీ హీరో అంటే 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. విజయ్‌కాంత్ సినిమాల్లో ఎక్కువగా సామాజిక నేపథ్యం ఉంటుంది. వీరోచితం, విప్లవ భావాలు, ప్రజలను ఉత్తేజపరచే అంశాలు ఉంటాయి. అలాగే ఆయన యాక్షన్ కు ప్రత్యేక అభిమానులున్నారు. ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే, వైదేహి కాత్తిరిందాళ్, చిన్న గౌండర్, వానతై ్త పోల’ వంటి పలు కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రాల్లోనూ తనదైన నటనతో అలరించారాయన. పోలీస్ పాత్రలకు వన్నె తెచ్చిన విజయ్‌కాంత్‌కు ‘కెప్టెన్ ప్రభాకరన్’ సంచలన హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఫ్యాన్స్ ఆయన్ను ‘కెప్టెన్’ అని ప్రేమగా పిల వడం మొదలు పెట్టారు. కొందరు ఫ్యాన్స్ విప్లవ కళా కారుడు అంటూ గౌరవంతో పిలుచుకుంటారు. అయితే విజయ్‌కాంత్ సినీ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. ఆదిలో ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్నారు. విజయ్‌కాంత్ నలుపు రంగులో ఉండటంతో మొదట్లో పలువురు ప్రముఖ నటీమణులు ఆయన సరసన నటించడానికి నిరాకరించారట. అయినా తనను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌కాంత్. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేశారాయన. సినిమా ప్రారంభంలో కాకుండా విడుదల ముందు పారితోషికాన్ని అందుకుని నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒకవేళ ఆ సినిమా నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదట. ఎంజీఆర్ అభిమాని అయిన విజయ్‌కాంత్.. తన అభిమాన హీరోలాగా ప్రజల ఆకలి తీర్చేవారు. ఆయన కార్యాలయంలో నిత్యాన్నదానం చేస్తూ.. కరుప్పు (నలుపు) ఎంజీఆర్‌గా కొనియాడబడ్డారు విజయ్‌కాంత్. ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ ప్రభాకరన్ ’ విజయ్‌కాంత్‌కు నూరవ చిత్రం. ఆయన కెరీర్లో 150కిపైగా సినిమాల్లో నటిస్తే.. అందులో 20కిపైగా పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమాలే ఉండడం విశేషం. చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్ ను హీరోగా పరిచయం చేసిన ‘సహాబ్దం’ (1993) చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారాయన. ‘విరుదగిరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు విజయ్‌కాంత్. బావ ఎల్.కె. సుధీశ్‌తో కలిసి మూడు సినిమాలు నిర్మించారు విజయ్‌కాంత్. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడిగానూ విశేష సేవలందించారాయన. సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కూడా ఆయనకు మృతి పట్ల విచారం వ్యక్తం చేశాయి. విజయ్కాంత్కుభార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ ఉన్నారు. -
విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!
తమిళస్టార్ నటుడు, డీఎండీకే అధినేత మృతి పట్ల పలువురు సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులర్పించారు. తాజాగా విజయ్‌కాంత్ మృతిపట్ల కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో విశాల్ ఏడుస్తున్న వీడియో అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. విశాల్ వీడియోలో మాట్లాడుతూ..' కెప్టెన్ మరణించిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది. ఈ వార్త విన్నాక నా కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్‌ను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా. నేను నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఈ సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్‌కాంత్ సార్‌కు ఇదే నా కన్నీటి నివాళి' అంటూ ఏడుస్తూ పోస్ట్ చేశారు. కాగా.. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ బుధవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో మంగళవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు చెన్నై మియాట్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. -
సినిమాలు, రాజకీయాలు.. విజయ్‌కాంత్ ఆస్తులు ఎన్ని కోట్లంటే!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్(71) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. (ఇది చదవండి: విజయ్‌కాంత్ గొప్పమనసు.. వారికోసం స్థలం ఇస్తానన్న కెప్టెన్.!) అయితే సినిమాలతో పాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్‌కాంత్ గురించి సినీ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్‌కాంత్ తన సుదీర్ఘ కెరీర్లో ఎంత సంపాదించారు? ఆయనకున్న ఆస్తుల విలువ ఎంత? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తన 1991 చిత్రం కెప్టెన్ ప్రభాకరన్‌లో సాహసోపేతమైన పోలీసు అధికారి పాత్రలో మెప్పించారు. అప్పటి నుంచి అభిమానులు ఆయనను 'కెప్టెన్' అని ముద్దుగా పిలుచుకున్నారు. 2016లో విజయకాంత్ ఉలుందూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరుపై ఉన్న చరాస్తుల విలువ రూ.7.6 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. నగదు, బ్యాంకుల్లో ఉన్న వివరాలతో పాటు ఆయన వివరాలు సమర్పించారు. అతని భార్య ప్రేమలతతో పాటు.. అతనిపై ఆధారపడిన వారి ఆస్తులు కూడా కలిపి మొత్తం ఆస్తులు రూ. రూ.14.79 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్లో వివరించారు. (ఇది చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!) అంతే కాకుండా వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య, నివాస భవనాలు మొదలైన స్థిరాస్తులు విలువ రూ. రూ. 19.37 కోట్ల ఆస్తులు ఆయన పేరుమీద ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య ప్రేమలత విజయ్‌కాంత్ పేరుపై రూ. 17.42 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. దీని ప్రకారం స్థిరాస్తుల మొత్తం విలువ రూ. 38.77 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అన్ని రకాల అప్పులు మొత్తం రూ. 14.72 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో మొత్త స్థిర, చరాస్తుల విలువ మొత్తం కలిపి రూ.53 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా 2016లో ప్రకటించిన ఆస్తుల విలువ కాగా.. ఎన్నికల సమయంలో ఈ వివరాలు విజయ్‌కాంత్ సమర్పించారు. -
విజయ్‌కాంత్ గొప్పమనసు.. వారికోసం స్థలం ఇస్తానన్న కెప్టెన్.!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు.. ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. అయితే గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి ఖననానికి తన సొంత స్థలం ఇస్తానని ప్రకటించారు. ఈ విషయంపై ఆయన గతంలో ట్వీట్ చేశారు. ఎందుకలా చేశారంటే... గతంలో చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. దీంతో వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై స్పందిస్తూ విజయ్‌కాంత్ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో మృతిచెందిన వారిని ఖననం చేయడానికి తన సొంత స్థలం ఇస్తానన్నారు. తన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగాన్ని ఖననానికి ఇస్తున్నట్లు వెల్లడించారు. కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేయటంతో వైరస్ వ్యాపించెందదని.. ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని అప్పటి విజయ్‌కాంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఇవాళ విజయ్‌కాంత్ మృతి చెందడం అభిమానులకు షాక్‌కు గురిచేసింది. கொரோனாவால் உயிரிழந்தவர்களின் உடல்களை அடக்கம் செய்ய பொதுமக்கள் எதிர்ப்பு தெரிவித்தால், ஆண்டாள் அழகர் பொறியியல் கல்லூரியின் ஒரு பகுதியை உடல் அடக்கம் செய்ய எடுத்துகொள்ளலாம்.#SpreadHumanity | #COVID19 pic.twitter.com/CG2VLBzj4F — Vijayakant (@iVijayakant) April 20, 2020 -
విజయకాంత్ మృతి పట్ల మోదీ, స్టాలిన్ ఏమన్నారంటే..
దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) వ్యవస్థాపకుడు విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. స్టాలిన్ సంతాప సందేశంలో, 'మా ప్రియ మిత్రుడు - నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడ సంఘం కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతితో పాటు ఎంతో బాధను కలిగించింది. మంచి మనసున్న మిత్రుడు విజయకాంత్ సినీ పరిశ్రమలోనూ, ప్రజా జీవితంలోనూ తన కఠోర శ్రమతో ఎన్నో విజయాలను అందుకుని ప్రజల పక్షాన నిలబడ్డారు. నటుడిగా, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా.. ఏ పని చేపట్టినా దానికే పూర్తిగా అంకితమై తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదరించారు. కుటుంబ స్నేహితుడిగా నాకు సుపరిచితుడు. అని స్టాలిన్ తెలిపారు. కొద్దిరోజుల నుంచి విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతుండగా ఈరోజు (డిసెంబర్ 28) ఉదయం మృతి చెందాడు. విజయ్ కాంత్ మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు. నేడు తమిళనాడు లోని అన్ని థియేటర్స్‌ను క్లోజ్ చేస్తున్నారు. అన్ని షో లు రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కాంత్ నటించిన చివరి సినిమా మధుర విరన్ (2018)లో విడుదలైంది. ఆయన తమిళ చిత్రాల్లో మాత్రమే నటించడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ: విజయకాంత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. విజయకాంత్‌ను తమిళ సినిమా లెజెండ్ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. అతని నటన లక్షల మంది హృదయాలను తాకింది. ఆపై రాజకీయ నాయకుడిగా, అతను తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపారు. ప్రజా సేవలో ఉంటూ చాలా ఏళ్లుగా పోరాడారు. అతని మరణం తమిళనాట రాజకీయాల్లో పూడ్చడం కష్టతరమైనది.' అని మోదీ తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై: 'అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎండీకే అధినేత నా సోదరుడు కెప్టెన్ విజయకాంత్ మృతి చెందారని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేడు ఒక మంచి నటుడిని, మంచి రాజకీయ నేతను కోల్పోయాం. ఆయన నాకు మంచి సోదరుడు.' అని తమిళిసై తెలిపారు. కమల్ హాసన్: నా సోదరుడు, డీఎండీకే అధ్యక్షుడు, విలక్షణ నటుడు విజయకాంత్ మరణవార్త ఎంతో తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయాల్లో ఎంతో ధైర్యంగా ఆయన రానించారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు. తమిళనాట ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్: విజయకాంత్‌గారి మరణ వార్త ఎంతో బాధాకరం. సినిమా, రాజకీమాల్లో ఆయనొక పవర్‌హౌస్. సినీ పరిశ్రమ ఒక మంచి నటుడితో పాటు మనసున్న రాజకీయనాయకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.. చిరంజీవి: మన ‘పురట్చి కలైంగర్’, ‘కెప్టెన్’ విజయకాంత్ ఇక లేరని తెలిసి గుండె తరుక్కుపోయింది. అయనొక మంచి వ్యక్తిత్వంతో పాటు తెలివైన రాజకీయ నాయకుడు. అయన ఎప్పుడూ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలలో నటించనప్పటికీ, ఇక్కడ కూడా ఆయనకు విపరీతమైన ప్రజాదరణతో పాటు ప్రేమను పొందాడు. మన ప్రియమైన ‘కెప్టెన్’ చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని శూన్యాన్ని మిగిల్చాడు! ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.. మంచు విష్ణు: విజయకాంత్ గారు లేరని వార్త జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన సినిమాలు చూస్తూనే నా బాల్యం అంతా గడిచింది. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో గుర్తుండిపోతాయి. ఆయన ఎంతో అభిమానంతో మాట్లాడుతారు. రంగం ఏదైనా సరే ఆయన నిజమైన నాయకుడని మంచు విష్ణు తెలిపారు. సంతాపం తెలిపిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి విజయకాంత్ మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సంతాపం తెలిపింది. తెలుగు చిత్రసీమతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, టి. ప్రసన్న కుమార్ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం కుటుంబానికి అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని వారు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo — Narendra Modi (@narendramodi) December 28, 2023 உடல் நலக்குறைவால் மருத்துவமனையில் சிகிச்சை பெற்று வந்த தேமுதிக தலைவர்,சகோதரர் கேப்டன் திரு.விஜயகாந்த் அவர்கள் உயிரிழந்த செய்தியறிந்து மிகவும் மனவேதனை அடைந்தேன். நல்ல திரைப்படக்கலைஞர்.... நல்ல அரசியல் தலைவர்.... நல்ல மனிதர்.... நல்ல சகோதரர்.... ஒட்டுமொத்தமாக ஒரு நல்லவரை நாம்… pic.twitter.com/oPVTWZ1uRD — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 28, 2023 Heartbroken to know that our ‘Puratchi Kalingar’, ‘Captain’ Vijayakanth is no more. He was a wonderful human being, Hero of the Masses,a multi faceted personality and an astute politician. Though he never acted in straight Telugu films, he is hugely popular and loved by the… pic.twitter.com/r0N4olxFrL — Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023 -
కెప్టెన్ విజయ్‌కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. కుటుంబ నేపథ్యమిదే.. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా పేరు మార్చుకున్నారు. కె.ఎన్. అళగర్స్వామి, ఆండాళ్ ఆయన తల్లిదండ్రులు. 1990లో జనవరి 31న ఆయన ప్రేమలతను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్ సగప్తం, మధుర వీరన్ చిత్రాల్లో నటించారు. విజయ్ కుటుంబం చాలా పెద్దది. విజయ్‌కాంత్‌కు ఐదుగురు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌కాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. ఆయన డీఎండీకే పార్టీ ఎన్నికల సమయంలో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోవడం విశేషం. -
కెప్టెన్ విజయ్‌కాంత్.. అవార్డుల రారాజు!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయ్‌కాంత్ జన్మించారు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్‌కాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్‌గా నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్‌కాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. అవార్డులు దాదాపు 100కి పైకి సినిమాల్లో నటించిన విజయ్‌కాంత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. 1981లో ఆయన నటించిన తూరతు ఇడిముజక్కం చిత్రానికి ప్రపంచ చలన చిత్రోత్సవ అవార్డ్ లభించింది. 1986లో అమ్మన్ కోయిల్ కిజకలే చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 1989లో పూంతోట్ట కవల్కరన్ అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఎక్స్‌ప్రెస్ అవార్డ్ వరించింది. అదే ఏడాదిలో చిందుర పూవే అనే చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డుతో పాటు ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 2001లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు. వీటితో పాటు 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్ పురస్కారం). 2001లో ‘బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు’, 2009లో ‘టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్’ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్) పొందారు. అంతే కాకుండా అనేక ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్.కె. సుధీశ్‌తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు. -
కెప్టెన్‌గా విజయ్‌కాంత్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?
డీఎండీతే అధినేత, నటుడు విజయ్‌కాంత్ తమిళనాడులోని మధురైలో ఆగస్టు 25, 1952న జన్మించారు. కె.ఎన్.అలగస్వామి, ఆండాళ్ దంపతులకు ఆయన జన్మించారు. జనవరి 31, 1990 న ప్రేమలతను విజయకాంత్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవాళ కరోనా బారిన పడిన ఆయన ఆస్పతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ పేరు ఎందుకు వచ్చిందంటే.. "కెప్టెన్ ప్రభాకరన్" అనే చిత్రం ద్వారా విజయ్‌కాంత్‌కు కెప్టెన్' అని పేరు పెట్టారు. "కెప్టెన్ ప్రభాకరన్" 1992 సంవత్సరంలో విడుదల కాగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన విజయ్‌కాంత్.. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. -
Vijayakanth: విజయ్‌కాంత్ కన్నుమూత
దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్(71) కన్నుమూశారు. చెన్నై మియోట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అటు ఆస్పత్రి వర్గాలు.. ఇటు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి విజయకాంత్ మృతిపై అధికారిక ప్రకటన చేశారు. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. మధురైలో 1952 ఆగష్టు 25న జన్మించారు. విజయకాంత్‌గా పేరు మార్చుకుని 27 ఏళ్ల వయసులో.. ‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంలో ఆయన ప్రతినాయకుడి(విలన్)రోల్ చేశారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్‌కాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. సోలో హీరోగా విరుధగిరి(2010) ఆయన చివరిచిత్రం. తనయుడు షణ్ముగ పాండియన్ హీరోగా నటించిన సగప్తం(2015)లో చివరిసారిగా ఓ అతిథి పాత్రలో తెరపై విజయ్‌కాంత్ కనిపించారు. Official medical bulletin from Chennai MIOT hospital announcing the passing away of Captain #Vijayakanth #RIPCaptain pic.twitter.com/yLynSrBj9I — Ramesh Bala (@rameshlaus) December 28, 2023 విజయకాంత్ నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. ఇక, విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోనూ సత్తా చాటినా ఆయన.. తమిళనాడు రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 👉: కెప్టెన్ ఓ సెన్సేషన్.. విజయకాంత్ అరుదైన చిత్రాలు -
నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా.. పరిస్థితి విషమం!
తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డీఎండికే నేత విజయకాంత్ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు , పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు దగ్గు గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని , వైద్యులు పూర్తి ఆక్సిజన్‌తో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం అలాగే ఆయన ఆర్యోగం విషమంగా ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు పేర్కోని చికిత్స అనంతరం ఈనెల 11న డిశ్చార్జి చేశారు. డీఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv — ANI (@ANI) December 28, 2023 -
కమెడియన్ మృతి.. కుటుంబానికి సాయం చేసిన కెప్టెన్!
సీనియర్ సినీ హాస్యనటుడు బోండామణి (60) శనివారం రాత్రి చైన్నె సమీపంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. శ్రీలంకకు చెందిన ఈయన అక్కడ సైనికుల యుద్ధంలో కుటుంబ సభ్యులను కోల్పోగా తను మాత్రం తప్పించుకుని చైన్నెకి చేరుకున్నారు. చైన్నెలో సినీ ప్రయత్నాలు చేసి చివరకు 1981లో విడుదలైన పవును పవును దాన్ చిత్రం ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో చిన్న పాత్ర చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మంచి హాస్యనటుడుగా గుర్తింపు పొందారు. వందల సినిమాల్లో నటించి.. అలా సుందర ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం, జిల్లా.. తదతిర చిత్రాల్లో నటించారు. దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వడివేలు వంటి హాస్యనటులతో కలిసి పలు చిత్రాలు చేశారు. కొంతకాలంగా బోండామణి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన రెండు కిడ్నీలు పాడవడంతో చైన్నె ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదికి పైగా చికిత్స పొందుతూ వచ్చారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో బోండామణికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. స్వగృహంలో కన్నుమూత రోజూ డయాలసిస్ చేసుకుంటూ వచ్చిన బోండామణి డిసెంబర్ 23న రాత్రి 11 గంటల ప్రాంతంలో రాత్రి ఉన్నట్లుండి కింద పడిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బోండామణి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈయనకు భార్య మాధవి, కొడుకు సాయిరాం, కూతురు సాయికుమారి ఉన్నారు. బోండామణి మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష సాయం కమెడియన్ మృతి పట్ల నటుడు, డీఎండీకే పార్టీ నేత విజయకాంత్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ లక్ష రూపాయలను నటుడు మీసై రాజేంద్రన్ ద్వారా ఆయన భార్యకు అందించారు. కాగా ఆదివారం క్రోంపేటలోని శ్మశాన వాటికలో బోండామణి అంత్యక్రియలు నిర్వహించారు. బోండామణి కొడుకు సాయిరాం మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి జీవనాధారం లేదని, అద్దె ఇంటిలోనే ఉంటున్నామని నడిగర్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: రొమాన్స్ సీన్లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా -
ఆస్పత్రి నుంచి నటుడు విజయకాంత్ డిశ్చార్జ్
కోలీవుడ్‌లో కొద్దిరోజుల క్రితం ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యానికి గురైయారు. ఈ కారణంగా చెన్నైలోని మియత్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట పలు ఊహాగానాలు వచ్చిన సమయంలో ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. దగ్గు,జలుబు కారణంతో ఆస్పత్రిలో విజయకాంత్ చేరారు. చికిత్స అందిస్తున్న క్రమంలో శ్వాసకోస సంబంధిత సమస్యలను ఆయన ఎదుర్కొన్నారు. సుమారు 20 రోజులకు పైగనే ఆయన చికిత్స పొందారు. విజయకాంత్ ఆరోగ్యంపై పలు రూమర్స్ రావడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు చాలాసార్లు వివరణ ఇచ్చారు. ఆయన సతీమణి ప్రేమలత కూడా వీడియో ద్వారా కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రకటించారు. ఊపిరితిత్తులలో శ్లేష్మం ఎక్కువగా ఉండడంతో మరో 14 రోజుల పాటు విజయకాంత్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. నేడు (డిసెంబర్ 11)న మయత్ హాస్పిటల్ నుంచి విజయకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. -
మళ్లీ క్షీణించిన విజయకాంత్ ఆరోగ్యం..!
డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ పరిస్థితి మళ్లీ విషమించినట్లు తెలుస్తోంది. మరోసారి అస్వస్థకు గురి కావడంతో కాగా ఆయనకు వెంటి లేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉండగా.. ఆయన ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. శనివారం విజయకాంత్ ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తులలో తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస సమ స్య అధికంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. (ఇది చదవండి: క్యాసినో ఆడి గీతా మాధురి డబ్బులు పోగొట్టింది: నందు) డీఎండీకే అధినేత విజయకాంత్ గత నెల 18వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన్ని మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు.. ఓ దశలో ఆయన ఆరోగ్యంపై చాలా రూమర్స్ వచ్చాయి. ఆయన పరిస్థితి విషమించినట్టుగా వదంతులు వ్యాపించాయి. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తుండటం, తరచూ శ్వాస సమస్య తలెత్తినట్టుగా, కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. దీంతో డీఎండీకే వర్గాలలో ఆందోళన రెకెత్తించాయి. ఆ తర్వాత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ విడుదల చేసిన వీడియోతో ఆందోళన సద్దుమణిగింది. (ఇది చదవండి: మనలో ఎలాంటి జంతువులు ఉన్నాయో కనిపిస్తోంది: ఆర్జీవీ ట్వీట్) -
కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని.. విజయకాంత్‌పై సూర్య కామెంట్
తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ కారణంగానే సుమారు మూడేళ్లుగా ఆయన బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో పాల్గొనడం మానేశారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం నవంబర్ 23న జ్వరంతో అడ్మిట్ అయిన విజయకాంత్ ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతకాలం తర్వాత ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలో, 'విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయితే, అతని పరిస్థితి గత 24 గంటల్లో నిలకడగా లేనందున, అతనికి పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము. అతను అవసరం ఇంకా 14 రోజులు హాస్పిటల్లో ఫాలో-అప్ చేయవలసి ఉంటుంది.' అని తెలియజేసారు. దీంతో విజయకాంత్ అభిమానులు, డీఎం కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆసుపత్రి యాజమాన్యం నివేదికపై ప్రేమలత విడుదల చేసిన వీడియోలో.. విజయకాంత్ త్వరగా కోలుకుంటారని ఆమె వాలంటీర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు హల్ చల్ చేస్తున్న వేళ.. విజయకాంత్ ఆస్పత్రిలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఎవరూ అనవసర పుకార్లు ప్రచారం చేయవద్దని, ఆ పుకార్లను ఎవరూ నమ్మవద్దని, విజయకాంత్ త్వరగా కోలుకుని మిమ్మల్ని కలుస్తారని అన్నారు. ఈ సందర్భంలో, నటుడు సూర్య కూడా విజయకాంత్ ఆరోగ్యం గురించి అతని కుటుంబం ద్వారా అడిగి తెలుసుకున్నాడు. ఈ మేరకు విజయకాంత్ సతీమణికి ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే, నటుడు విజయకాంత్ త్వరగా కోలుకోవాలని సూర్య తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో 'సోదరుడు విజయకాంత్ పూర్తిగా కోలుకోవాలని ప్రార్థించే కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయి. ఆయన పూర్తిగా కోలుకుని మనందరి ముందుకు వస్తారు.' అని పోస్ట్ చేశారు. 1999లో నటుడు సూర్య నటించిన 'పెరియన్న' చిత్రంలో నటుడు విజయకాంత్ ప్రత్యేక పాత్ర పోషించడం గమనార్హం. அண்ணன் விஜயகாந்த் அவர்கள் நலம் பெறப் பிரார்த்திக்கும் கோடான கோடி இதயங்களில் நானும் ஒருவனாகப் பங்கேற்கிறேன்.! கோடானகோடி மனிதர்களின் வேண்டுதல்கள் நிச்சயம் பலிக்கும்.! அவரை பூரண குணமாக்கி, நலம் பெற வைக்கும்.!! — Suriya Sivakumar (@Suriya_offl) December 3, 2023 -
విజయకాంత్ ఫోటోను విడుదల చేసిన సతీమణి
డీఎండీకే అధినేత, కోలీవుడ్ నటుడు విజయకాంత్ కోలుకుంటున్నారని ఆయన సతీమణి ప్రేమలత తెలిపారు. అనారోగ్యం కారణంగా నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని ఆస్పత్రి వర్గాలు తెలపడంతో ఆయన ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. తర్వాత ఆయన కోలుకుంటున్నారని మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇలా వైద్యుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో ఫ్యాన్స్‌లో మరింత ఆందోళన నెలకొంది. దీంతో ఆయన సతీమణి ప్రేమలత ఒక వీడియో ద్వారా విజయకాంత్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో క్షేమంగా ఇంటికి వస్తారని చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి వద్దకు పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడంతో విజయకాంత్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు రేకెత్తాయి. వాటిని ఖండించిన ప్రేమలత... విజయకాంత్‌తో ఉన్న పోటోలను విడుదల చేసింది. కెప్టెన్ ఆరోగ్యంగా ఉన్నాడు. అతి త్వరలో ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి మనందరినీ చూస్తాడు. వదంతులను ఎవరూ నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు! అని దయతో మనవి చేస్తున్నానని తెలిపింది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని కృత్రిమ శ్వాసక్రియతో చికిత్సపొందుతున్నారని పలు యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయడం భాదగా ఉందని ఆమె తెలిపింది. ఇప్పటికైన ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు చేయడం ఆపాలని ప్రేమలత కోరింది. கேப்டன் ஆரோக்கியமாக இருக்கிறார். வெகு விரைவில் கேப்டன் நல்ல உடல் நலத்துடன் வீடு திரும்புவார், நம் அனைவரையும் சந்திப்பார். யாரும் வதந்திகளை பரப்பவும் வேண்டாம், நம்பவும் வேண்டாம்! என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன். - திருமதி. பிரேமலதா விஜயகாந்த். pic.twitter.com/u6tvBGtCdD — Vijayakant (@iVijayakant) December 2, 2023 -
విజయకాంత్ ఆరోగ్యంపై ప్రకటన చేసిన నాజర్
జలుబు, దగ్గు, గొంతునొప్పితో డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ చికిత్స పొందుతున్నారు. నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని నవంబర్ 23న మయత్ ఆసుపత్రి యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ కొన్ని రోజుల తర్వాత, అకస్మాత్తుగా మరోక ప్రకటన విడుదల చేసి అతని పరిస్థితి గత 24 గంటల నుంచి నిలకడగా లేదు అంటూనే పల్మనరీ చికిత్స అవసరం ఉందని తెలిపి విజయకాంత్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పింది. ఆయనకు మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది. దీంతో ఆయన అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. విజయకాంత్ ఆరోగ్యంపై ప్రేమలత విడుదల చేసిన వీడియోలో.. 'కెప్టెన్ ఆరోగ్యంపై ఆసుపత్రి యాజమాన్యం రెగ్యులర్‌గా నివేదిక ఇస్తుంది. ఆయన ఆరోగ్యంపై భయపడాల్సిన అవసరం లేదు. కెప్టెన్ ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యులు, నర్సులు, నేను అతనిని బాగా చూసుకుంటున్నాం.' అని తెలిపింది. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి అందరినీ కలుస్తారని ఆమె తెలిపారు. ఆమె ప్రకటనతో అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. విజయకాంత్ ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతున్న సమయంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, నిర్మాత శివ ఆస్పత్రికి వెళ్లారు. విజయకాంత్ ఆరోగ్యం గురించి వైద్యుల ద్వారా పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయనపై వస్తున్న వార్తలు నమ్మెద్దు. విజయకాంత్ త్వరలో అభిమానులను కలుస్తారు. అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ ICU వార్డులో అతను ఉన్నందున మేము చూడలేకపోయాం. కానీ విజయకాంత్ ఆరోగ్యంపై తమకు వైద్యులు సమాచారం అందించారు. వైద్య భద్రత దృష్ట్యా ఆయన్ను చూసేందుకు అనుమతించలేదు.' అని తెలిపారు. దీంతో ఆయన అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. -
కెప్టెన్ ఓ సెన్సేషన్.. విజయకాంత్ అరుదైన చిత్రాలు
-
విజయకాంత్ అనారోగ్యంపై పుకార్లు.. ఖండించిన నటుడి సతీమణి
తమిళ స్టార్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మరణించాడంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌లో విజయకాంత్ ఇక లేరంటూ ఇష్టారీతిన ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలత సైతం సదరు వార్తలను ఖండించింది. కెప్టెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొంది. ఆయన అనారోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది. అటు చెన్నైలోని ఆస్పత్రి వర్గాలు సైతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని బుధవారం నాటి ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇకపోతే విజయకాంత్ 'ఇనిక్కుం ఇలమై' సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించారు. 150కి పైగా సినిమాలు చేసిన ఆయన ఇరవైకి పైగా పోలీస్ స్టోరీల్లో నటించి అలరించారు. ఆయన నటించిన 100వ మూవీ 'కెప్టెన్ ప్రభాకర్' హిట్ అయిన తర్వాత నుంచి ఈయన్ని అందరూ కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్, రీమేక్ అయ్యాయి. చిరంజీవి 'ఠాగూర్' మూవీ ఒరిజినల్ వెర్షన్ 'రమణ'లో విజయ్ కాంతే హీరోగా నటించారు! கேப்டன் நலமாக இருக்கிறார். விரைவில் முழு உடல் நலத்துடன் வீடு திரும்பி, நம் அனைவரையும் சந்திப்பார். - திருமதி. பிரேமலதா விஜயகாந்த் pic.twitter.com/P9iHyO7hzG — Vijayakant (@iVijayakant) November 29, 2023 చదవండి: ‘యానిమల్’ మూవీ టాక్ ఎలా ఉందంటే.. ? -
విషమంగా విజయకాంత్ ఆరోగ్యం
సాక్షి, చైన్నె: డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోగ్యంపై ఆ పార్టీ వర్గాలలో ఆందోళన నెలకొంది. ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు బుధవారం బులెటిన్ విడుదలైంది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అందులో వైద్యులు వెల్లడించారు. వివరాలు.. డీఎండీకే అధినేత విజయకాంత్ ఈనెల 18వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన్ని మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఆయన అవయవాల పరిస్థితిపై వైద్యులు పరిశోధించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తుండటం, తరచూ శ్వాస సమస్య తలెత్తినట్టుగా, కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపై వదంతులు రావడంతో దేరడంతో వాటిని నమ్మవద్దని డీఎండీకే కార్యాలయం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో బుధవారం వెలువడ్డ బులిటెన్ డీఎండీకే వర్గాలలో ఆందోళన రెకెత్తించాయి. విజయకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అవశ్యమైనట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చికిత్స కొనసాగుతోందని, ఆయన మరో రెండు వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని ఆ బులిటెన్‌లో పేర్కొనడం డీఎండీకే వర్గాలను కలవరంలో పడేశాయి. గతంలో విజయకాంత్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆయన ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. తాజాగా ఆయనకు మరోమారు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడం గమనార్హం. -
హీరో విజయ్‌కాంత్ హెల్త్ బులెటిన్.. ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఈ మధ్య అనారోగ్యానికి గురైన తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్.. అనారోగ్యం వల్ల ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) 'విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయినప్పటికీ గత 24 గంటల్లో ఆయన పరిస్థితి స్థిరంగా లేనందున.. ఆయనకు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఇంకా 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది' అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో విజయకాంత్‌ను.. ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లని తొలగించారు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) -
నటుడు విజయకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల
డీఎండీకే అధినేత, సీనియర్ నటుడు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని మళ్లీ వార్తలు తెరపైకి వచ్చాయి. చెన్నై మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మరికొన్ని రోజులపాటు చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే నేతలు అప్పట్లో వివరించారు. సుమారు 10 రోజుల నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై వారు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. విజయకాంత్ సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారని.. ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని ఇలాంటి పరిస్థితిల్లో ఆయనపై వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని వారు తెలిపారు. కానీ ఆయనకు ఇప్పటికీ కూడా ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తుండటంతో అభిమానుల్లో అనుమానం పెరిగిపోయింది. వైద్యులు ఏమైనా దాస్తున్నారా..? అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితిలో, ఈ రోజు (29-11-2023), DMDK అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మయత్ హాస్పిటల్ వైద్యులు నివేదికను విడుదల చేశారు. అందులో విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారని కానీ గత 24 గంటల నుంచి అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, అతనికి పల్మనరీ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అతను త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని అందులో తెలిపారు. వైద్యుల సూచన ప్రకారం అతనికి ఇంకా 14 రోజులు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం ఉందని తెలిపారు. -
తెలుగు హీరోపై కోలీవుడ్ నటి 'విచిత్ర' వ్యాఖ్యలు.. తెరపైకి విజయకాంత్ పేరు
కోలీవుడ్ నటి విచిత్ర ప్రస్తుతం తమిళ బిగ్ బాస్-7లో కంటెస్టెంట్‌గా కొనసాగుతుంది. ఆ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. 1992లో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విచిత్ర.. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే ఆమె కనిపించింది. అక్కడ సుమారు 90కి పైగా చిత్రాల్లో ఆమె నటించింది. తెలుగులో మాత్రం కేవలం రెండు చిత్రాల్లో మాత్రమే కనిపించగా.. ఇందులో వెంకటేశ్ సూపర్ హిట్ చిత్రం అయిన 'పొకిరి రాజా' (1995)లో 'చిత్ర' పాత్రతో ఆమె మెప్పించింది. ఆపై 2001లో నందమూరి బాలకృష్ణ డిజాస్టర్ సినిమా అయిన 'భలేవాడివి బాసు'లో 'పుష్ప' పాత్రలో కనిపించింది. టాలీవుడ్ హీరోపై నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు 21 ఏళ్లుగా వెండితెరకు దూరంగా విచిత్ర తాజాగా బిగ్‌బాస్ షోలో తెలుగు చిత్ర పరిశ్రమ నటుడి గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. 2000 సంవత్సరంలో తనకు తెలుగు సినిమా ఛాన్స్ వచ్చినట్లు విచిత్ర ఇలా చెప్పింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఫేమస్ హీరోను కలిశానని.. అతను తన గదికి రావాలని పిలిచాడు. కానీ నేను వెళ్లలేదు. దీంతో నాపై కోపం పెంచుకున్నాడు. ఆ హీరో రోజూ తాగి వచ్చి నా గది తలుపు తట్టేవాడు. అంతేకాకుండా ఓరోజు అడవిలో షూటింగ్ జరుగుతుండగా అతడు నన్ను అసభ్యంగా తాకాడు. అక్కడే నా జీవితంలోనే అత్యంత దారుణమైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పాశాను.' అని బాంబ్ పేల్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. తెరపైకి వచ్చిన విజయకాంత్ పేరు..ఎందుకు..? ఈ వివాదం గురించి ఆ సమయంలో నడిగర్ సంఘానికి విజ్ఞప్తి చేస్తే.. అప్పట్లో నటీనటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇవన్నీ మరిచిపోయి పని చూసుకోమన్నారని విచిత్ర తెలిపింది. కావాలంటే పోలీసుల వద్దకు వెళ్లండి.. అసోసియేషన్‌కి ఎందుకు వచ్చారని ఎదురు ప్రశ్నించారని ఆమె వాపోయింది. ఆ తర్వాత చేసేది ఏమీ లేక సినిమాల నుంచి తప్పుకున్నట్లు విచిత్ర పేర్కొంది. అప్పట్లో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయకాంత్‌పై తాజాగా విమర్శలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: తెలుగు హీరోపై కోలీవుడ్ నటి విచిత్ర చేసిన పూర్తి వ్యాఖ్యలు ఇవే.. ) 2001లో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగా విజయకాంత్ ఉన్నారు. 2000-2006 సంవత్సరం వరకు నడిగర్ అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. ప్రస్తుతం విచిత్ర చెప్తున్న వివాదం కూడా 2000-2001 సమయంలో జరిగినట్లు తెలిపింది. కాబట్టి ఆమె ఫిర్యాదు చేసింది కూడా విజయకాంత్‌కే ఉంటుందని నెటిజన్లు తెలుపుతున్నారు. అయితే అన్యాయం జరిగిందని సాయం కోసం ఒక ఆడపిల్ల వస్తే విజయకాంత్ ఎందుకు సపోర్ట్ చేయలేదని చెబుతున్నారు. విజయకాంత్ కూడా తెలుగు హీరోకు సపోర్టుగా నిలిచాడా..? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విజయకాంత్‌పై ఇప్పటి వరకు తమిళ పరిశ్రమలో ఎలాంటి విమర్శలు లేవు. ఒక రకంగా ఆయనపై ఇదే తొలి విమర్శ అంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
విజయకాంత్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన తమిళనాడు మంత్రి
డీఎండీకే అధినేత, కోలీవుడ్ సినీ నటుడు విజయకాంత్ తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డ విజయకాంత్ ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్లీ అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఆయన తిరిగి చికిత్స పొందుతున్నారు. విజయకాంత్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడిన మంత్రి ఈమేరకు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న విజయకాంత్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వచ్చాయని డీఎండీకే పార్టీ నేతలు చెప్పారు. తాజాగా మంత్రి సుబ్రహ్మణియన్ కూడా ఇదే విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. రెగ్యులర్‌గా ఆయనకు అందించే చికిత్సలో భాగంగానే ప్రస్తుతం కూడా చికిత్స కొనసాగుతున్నదని , ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. రెండు మూడు రోజులలో విజయకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పేర్కొంది. -
ఆస్పత్రిలో చేరిన విజయకాంత్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్
డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితులలో విజయకాంత్‌ను చూడలేక పోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న కేడర్‌కు ఇటీవల ఆయన దర్శనం కల్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే విజయకాంత్ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి ఆదివారం తరలించారు. ఆయనకు ఆస్పత్రిలో పరిశోధనలు, చికిత్సలు కొనసాగుతున్నాయి. విజయకాంత్ ఆస్పత్రిలో చేరిన సమాచారంతో డీఎండీకే వర్గాలలో ఆందోళన నెలకొంది. అదే సమయంలో వదంతులు, ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందుకు ముగింపు పలికే విధంగా డీఎండీకే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించారు. ఆయన రెండు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్‌కు భరోసా ఇచ్చారు. -
విజయ్‌కాంత్‌కు ప్రధాని మోదీ ఫోన్ పరామర్శ
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి విజయ్‌కాంత్ భార్య ప్రేమలత విజయకాంతతో గురువారం ఫోన్లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపుడుతన్న విజయ్‌కాంత్‌కు మధుమేహం తీవ్రత ఎక్కువైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుడి కాలి మూడు వేళ్లను తొలిగించారు వైద్యులు. దీంతో ఆయన ఆరోగ్యంపై డీఎండీకే వర్గాలు ఆందోళనకు లోనయ్యాయి. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఆందోళన చెందవద్దని డీఎండీకే కార్యాలయం మరోమారు ప్రకటన విడుదల చేసింది. విజయ్‌కాంత్ త్వరితగితిన కోలుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆకాంక్షించారు. -
నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన..
సాక్షి, చెన్నై: అన్యుల మాటలకు మోసపోయి పార్టీకి ద్రోహం చెయొద్దు, పార్టీపై దుష్ప్రచారం చేసే వారిని నమ్మవద్దని కార్యకర్తలకు డీఎండీకే అధ్యక్షులు విజయ్‌కాంత్ విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి తీవ్ర ఆవేదనతో సోమవారం విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు ఇలా.. ‘తమిళనాడులో మార్పు తీసుకువచ్చి, రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయాలనే ఉన్నతమై సంకల్పంతో డీఎండీకేను స్థాపించానన్న సంగతి మీకందరికీ తెలుసు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసంక్షేమం కోసం నా అభిమాన సంఘాలు పనిచేశాయి. అభిమాన సంఘాలు పార్టీలో విలీనమైన తరువాత నాకు అండగా నిలిచింది మీరే. అందరూ కష్టపడి బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. చదవండి: (నేరగాడిగా చిత్రీకరించే ఆ వ్యాఖ్యలు నొప్పించాయి: విజయ్ ఆవేదన) అయితే ఇప్పుడు కొందరు కార్యకర్తలు బ్రెయిన్‌వాష్ చేసే వారి మాటలు నమ్మి పార్టీని వీడివెళ్లడం.. నాకు మాత్రమే కాదు పార్టీకే ద్రోహం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నాను. ఇలా వీడి వెళ్లడం మీ బలహీనతను చాటుతోంది. అవకాశవాదంతో ఈ నిర్ణయం తీసుకున్నా మని మీరంతా బాధపడే రోజు వస్తుంది. నా ఆరోగ్యం క్షీణించి ఉన్న విషయం నిజమే. ఈమాత్రాన పార్టీకి భవిష్యత్ లేదని భావించడం సరికాదు. వందేళ్లయినా డీఎండీకేను రూపుమాపడం ఎవ్వరివల్ల కాదు. చదవండి: (అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు) తమిళనాడులో ఎప్పటికీ అది వేళ్లూనుకునే ఉంటుంది. పార్టీని ప్రగతిబాటలో తీసుకు వెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృతనిశ్చయంతో ఉండాలి. పార్టీని అప్రతిష్టపాలు చేసేవారి మాటలు నమ్మవద్దు. పార్టీని వీడేలా ప్రలో భాలకు గురిచేస్తున్న వారిని ఖండించడంతోపాటూ అలాంటి వ్యక్తులను గుర్తించి ప్రధాన కార్యాలయం దృష్టికి తీసుకెళ్లండి. అందరం కలిసి బలమైన పార్టీగా ముందుకు సాగుదాం’ అని విజ్ఞప్తి చేశారు. -
నర్సులతో కలిసి సినిమా చూస్తున్న విజయకాంత్
Vijayakanth Watches Super Hit Movie With Nurses In Dubai : తాను ఆరోగ్యంగానే ఉన్నానని డీఎండీకే అధినేత విజయకాంత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నర్సులతో కలిసి కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆయన్ని దుబాయ్‌కు తరలించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై పార్టీ నాయకులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో తాను ఆరోగ్యంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. తాను నటించిన క్షత్రియన్ను ఆస్పత్రి నర్సు లతో కలిసి చూస్తూ.. కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీంతో డీఎండీకే వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. Am doing well. Watching 'Satriyan' movie, with Sisters who taking care of me. நான் நல்ல உடல் நலத்துடன் உள்ளேன். நான் நடித்த 'சத்ரியன்' திரைப்படத்தை, எனது சிகிச்சைக்கு உதவிபுரியும் செவிலியர் சகோதரிகளுடன் பார்த்த போது எடுத்த படம். pic.twitter.com/QekthdQNz2 — Vijayakant (@iVijayakant) September 5, 2021 చదవండి : బిల్డప్ రౌడీగా వచ్చేస్తున్న సందీప్ కిషన్ హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు -
విజయకాంత్‌కు అనార్యోగం? చికిత్స కోసం అమెరికాకు..
సాక్షి, చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ వైద్య చికిత్స కోసం సోమవారం చెన్నై నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లారు.దీంతో విజయకాంత్ ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం, సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చారు. అయినా ఆశించినంతగా ఆరోగ్యం మెరుగుపడలేదు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలతకు అప్పగించి ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అడపాదడపా చెన్నైలోని ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సెకెండ్ వేవ్‌లో ఆయన కరోనా బారినపడి కోలుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రసంగాలు చేయలేక ప్రజలకు చేతితో సైగలు చేస్తూ నామమాత్రంగా ప్రచారం నిర్వహించారు. ఈనెల 25వ తేదీన జన్మదినం కూడా జరుపుకున్నారు. మాట్లాడే సామర్థ్యం, తానుగా లేచి నిలబడే శక్తిని కోల్పోయి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం విజయకాంత్ తన కుమారుడు షణ్ముగపాండియన్, సహాయకులు కుమార్, సోములతో మళ్లీ అమెరికాకు పయనమయ్యారు. చదవండి : '40 ఏళ్ల క్రితం ఈ అమ్మాయి కనిపిస్తే నాకు విడాకులు అయ్యేవి కావు' Karthikeya 2: హీరోయిన్ను రివీల్ చేశారు.. -
Tamil Nadu: స్టాలిన్‌తో జతకట్టనున్న నటుడు విజయ్‌కాంత్!
ఉదయసూర్యుని (డీఎంకే చిహ్నం) కిరణాల ధాటికి రాష్ట్రంలోని రెండాకులు (అన్నాడీఎంకే చిహ్నం) విలవిల్లాడుతున్నాయి. రెండాకుల నీడను వీడి, దినకరన్ పంచన చేరిన విజయకాంత్ ఇకపై ఉదయసూర్యుడి కోసం ఢంకా (డీఎండీకే చిహ్నం) భజాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు విజయకాంత్ అధ్యక్షతన డీఎండీకే ఏర్పడిన తరువాత రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో చేరింది. అధికార అన్నాడీఎంకే తరువాత అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రధాన ప్రతిపక్షస్థానం హోదాను పొందింది. ఆ తరువాత జయలలితతో విబేధించి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే సహా పలుపార్టీలు ఏకమై ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగి అందరూ బోల్తాపడ్డారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేడీకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూటమిలో చేరింది. అయితే ఆ కూటమి కనీసం ఒక్కసీటులో కూడా గెలుపొందలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందని కొందరు అంచనా వేసినా అది జరగలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత డీఎండీకే తరఫున విజయకాంత్ బావమరిది ఎల్కే సుధీష్, కుమారుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత సీఎం స్టాలిన్ అనారోగ్యంతో ఉన్న విజయకాంత్‌ను ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడు కరోనా నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలను విజయకాంత్ అందజేశారు. ఈ పరిణామాలతో డీఎంకే, డీఎండీకే కార్యకర్తలు, నిర్వాహకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే శ్రేణుల కూడా ఇదే ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఏమీ సాధించలేమని డీఎండీకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో చేరాలని భావించాం, అయితే చివరి రోజుల్లో ఆ నిర్ణయం మారిపోయిందని సీనియర్ నేత ఒకరు పెదవి విరిచారు. అన్ని పార్టీలతోపాటూ డీఎండీకే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు స్థానిక ఎన్నికల్లో చవిచూడరాదని డీఎండీకే గట్టిగా భావిస్తోంది. డీఎంకే కూటమిలో చేరి స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలత త్వరలో పార్టీ నిర్వాహకులతో సమావేశం అవుతున్నట్లు సమాచారం. అదే సమావేశంలో డీఎంకే కూటమిలో డీఎండీకే చేరడంపై అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. -
కెప్టెన్ ఇంటికి సీఎం స్టాలిన్.. ఆత్మీయ పలకరింపు
సాక్షి, చెన్నై: అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం పరామర్శించారు. డీఎంకే పార్టీ నేతలు దురైమురుగన్, రాజాలతో కలిసి విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇంటికి స్టాలిన్ వెళ్లారు. విజయకాంత్‌ను శాలువతో సత్కరించారు. తన పక్కన కూర్చోవాలని స్టాలిన్‌ను విజయకాంత్ కోరడం విశేషం. 15 నిమిషాల పాటు స్టాలిన్ అక్కడే గడిపారు. వారితో పాటు విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత, తనయుడు విజయ ప్రభాకరన్, బావమరిది సుదీష్ ఉన్నారు. అనంతరం కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును విజయకాంత్ సీఎంకు అందజేశారు. రాజకీయ వైర్యం మరిచి తమ నేతను స్టాలిన్ కలవడంపై డీఎండీకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని వీడి అమ్మామక్కల్ మునేట్ర కళగంతో కలిసి పోటీచేసిన డీఎండీకే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. -
నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా
చెన్నై : తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు తేలింది. దీంతో చెన్నైలోని మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మియోట్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ పృథ్వీ మోహన్‌దాస్ గురువారం విజయ్‌కాంత్ హెల్త్‌బులెటిన్ గురించి వివరించారు. 'విజయకాంత్‌కు తేలికపాటి కరోనా లక్షణాలు వచ్చాయని .. ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు .ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నాం ' అని తెలిపారు. కాగా అంతకుముందు విజయకాంత్‌కు కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని డీఎండీకే పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. విజయ్‌కాంత్ సాధారణ చెకప్ కోసమని ఎప్పటిలాగే మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి వెళ్లగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు.ఇందులో కరోనా సాధారణ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో వివరించింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పళనిసామి సహా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. (చదవండి : భారత్‌లో 57 లక్షలు దాటిన కరోనా కేసులు) -
కష్టాల్లో ‘కెప్టెన్’.. ఆస్తులు వేలం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల చేత కెప్టెన్ అని ప్రేమగా పిలిపించుకునే డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆర్థిక కష్టాల్లో పడిపోయారు. విజయకాంత్ చెల్లించాల్సిన రూ.5.50 కోట్ల అప్పుబకాయిని రాబట్టుకునేందుకు ఆయన ఇళ్లు, ఇంజినీరింగ్ కాలేజీని వేలం వేయనున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. చెన్నై సాలిగ్రామంలోని లగ్జరీ ఇంట్లో ఆయన కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. అలాగే చెన్నై శివార్లు చెంగల్పట్టు సమీపంలోని మామండూరులో శ్రీ ఆండాళ్ అళగర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కింద ఆండాళ్ ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఇటీవలి కాలంలో రాజకీయ ఆర్థిక అవసరాలకు అదనంగా డబ్బు అవసరమైంది. అలాగే ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో నెలరోజులకు పైగా అమెరికాలో చికిత్స పొందారు. ఇలాంటి అదనపు ఆర్థిక అవసరాల కోసం ఆయన అప్పులు చేయాల్సి వచ్చింది. చెన్నై మౌంట్‌రోడ్డులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఆయన అప్పు తీసుకున్నారు. మధురాంతకంలోని కాలేజీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టారు. అలాగే కాలేజీ అవసరాల కోసం అప్పు అవసరం కావడంతో బ్యాంకు రుణానికి జామీనుదారులుగా విజయకాంత్ ఆయన సతీమణి ప్రేమలత సంతకాలు చేశారు. ఈ రుణం కోసం అదనంగా తన నివాసంతోపాటూ సాలిగ్రామంలోని మరో ఇళ్లను సైతం తనఖా పెట్టారు. ఇలా పలురూపాల్లో తీసుకున్న అప్పు వడ్డీతో కలుపుకుని రూ. 5,52,73,825 కు చేరుకుంది. ఇందుకు సంబంధించి డబ్బు లేదా కనీసం వడ్డీని కూడా విజయకాంత్ గత కొంతకాలంగా చెల్లించలేదు. దీంతో బ్యాంకు ఇటీవల నోటీసులు జారీచేసినా ఆయన స్పందించలేదు. దీంతో తనఖా పెట్టిన విజయకాంత్ ఆస్తులను వేలం వేసి బకాయి రాబట్టుకునేందుకు బ్యాంకు నిర్ణయించుకుంది. విజయకాంత్‌కు చెందిన స్థిరాస్తులను జూలై 26వ తేదీన వేలం వేయనున్నట్లు శుక్రవారం బహిరంగ ప్రకటన చేసింది. చట్టపరంగా కాపాడుకుంటాం: ప్రేమలత విజయకాంత్ ఆస్తుల వేలం వార్త శుక్రవారం సాయంత్రానికి అన్ని మాధ్యమాల్లో మార్మోగిపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఎదరువుతాయోనని ఆందోళన చెందారు. కెప్టెన్ ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుని తమ అవేదనను వ్యక్తం చేశారు. పలు తమిళమీడియా ప్రతినిధులు సైతం సాలిగ్రామంలోని విజయకాంత్ ఇంటికి వద్దకు రాగా ఆయన సతీమణి ప్రేమలత మాట్లాడుతూ, విజయకాంత్ జీవితం తెరిచిన పుస్తకం, ఎలాంటి దాపరికాలు లేవని అన్నారు. ఆయన సినిమాలు చేయడం లేదు, రాజకీయాల కోసం డబ్బు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఇంజినీరింగ్ విద్యకు ఉద్యోగావకాశాలు లేకపోవడంతో మా కాలేజీనే కాదు అన్ని కాలేజీల్లో సరైన అడ్మిషన్లు లేవు. ఇలా పలుకోణాల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బ్యాంకు బకాయిలు చెల్లించలేకపోయాం. అయినా మించిపోలేదు, ఆస్తులు వేలంలోకి వెళ్లకుండా చట్టపరంగా ఎదుర్కొంటాం అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. -
నడిగర్ సంఘం ఎన్నికల్లో రాజకీయాల్లేవు
పెరంబూరు: నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీ య ప్రభావం లేదని ఐసరిగణేశ్ పేర్కొన్నారు. ఈ సంఘానికి 2019–2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామిశంకరదాస్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి కూడా పోటీ బలంగా ఉండడం, ఎన్నికలకు మరో 9 రోజులే గడువు ఉండడంతో ప్రచార మోత మొదలైంది. సభ్యులను ప్రభావితం చేసేలా వాగ్దానాస్త్రాలను ఇరు జట్లు తమ అంబులపొదలలో వేసుకుని సంధించడానికి సిద్ధం అయ్యారు. కాగా ఈ సారి ప్రచారంలో స్వామిశంకర్దాస్ జట్టు ముందుంది. నడిగర్ సంఘం ప్రస్తావనలో నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేరు గుర్తుకు రాక తప్పదు. సంఘం అప్పుల భారం మోస్తున్న తరుణంలో పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టిన విజయకాంత్ సంఘాన్ని రుణ విముక్తి చేసి లాభాల బాట పట్టించారు. దీంతో సంఘంలో ఆయనకు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఏ జట్టు అయినా ఆయనను కలిసి మద్దతు తీసుకుంటారు. అలా గురువారం ఉదయం స్వామిశంకరదాస్ జట్టు విజయకాంత్‌ను ఆయన ఇంట్లో కలిసి మద్దతు కోరారు. అనంతరం ఆ జట్టు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న దర్శక, నటుడు కే,.భాగ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన నాటక కళాకారులకు డబ్బు ఇస్తానన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించగా, అందుకు బదలిచ్చిన కే.భాగ్యరాజ్ తాను ఓటుకు నోటులిస్తానని చెప్పలేదని, సాధారణంగా సినీ కళాకారులు ఆర్థి కంగా చితికిపోయిన నాటక కళాకారులను కలసినప్పుడు వారికి డబ్బు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు నటుడు విశాల్, కార్తీ వంటి వారూ అతీ తులు కాదని పేర్కొన్నారు. విజయకాంత్‌ను కలవడం గురించి అడిగిన ప్రశ్నకు విజయకాంత్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తమ చేతులు పట్టుకుని ఆశీర్వదించారని చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అదే విధంగా నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్ నటుడు,నడిగర్‌సంఘం మాజీ కార్యదర్శి రాధారవి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా నటుడు,నిర్మాత, ప్రస్తుతం సంఘ కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న ఐసరిగణేశ్ స్పందిస్తూ తమ జట్టుకు పలువులు సహకరిస్తున్నారనీ, అయితే నటుడు రాధారవి తమకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పలేమనీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు.తమకు సంబంధించినంత వరకూ ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేదనీ ఐసరిగణేశ్ పేర్కొన్నారు. -
విజయకాంత్, ప్రేమలతపై సెటైర్లు..
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతే కాదు, ఓటింగ్ శాతాన్ని డీఎండీకే పూర్తిగా కోల్పోయింది. వరుస పతనాల నేపథ్యంలో ఆ పార్టీ మరింత కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ పార్టీకి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు అయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం దూరం కావడం దాదాపుగా ఖాయమైంది. విజయకాంత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగలడం ఓ వైపు ఉంటే, ఆయన సతీమణి ప్రేమలత తీరుపై డీఎండీకే వర్గాలు విమర్శలు గుప్పించే పనిలో పడడం గమనార్హం. సినీ నటుడిగా అశేషాభిమాన లోకం మదిలో ముద్ర వేసుకున్న విజయకాంత్ 2005లో మదురై వేదికగా డీఎండీకేను ప్రకటించారు. దేశీయ ముర్పోగు ద్రావిడ కళగంతో 2006లో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో విజయకాంత్ ఒక్కడే అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అయితే, ఆ ఎన్నికల్లో విజయకాంత్ సొంతం చేసుకున్న ఓటు బ్యాంక్ ఆ పార్టీ బలాన్ని మరింతగా పెంచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విజయకాంత్ 10.3 శాతం ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తదుపరి పరిణామాలతో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇందుకు కారణం అన్నాడీఎంకేతో పొత్తుతో ఆ ఎన్నికల్ని ఎదుర్కొనడమే. ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్నత స్థితికి ఎదిగిన వేళ అన్నాడీఎంకేతో వైరం విజయకాంత్‌ను కష్టాల సుడిగుండంలో పడేసింది. పార్టీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే జై కొట్టడం వంటి పరిణామాలు విజయకాంత్‌ను ఇరకాటంలో పెట్టాయి. అయినా, ఏ మాత్రం తగ్గని విజయకాంత్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ నేతృత్వంలో కూటమి ఏర్పాటులో సఫలీకృతుడయ్యారు. అయితే, ఆ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో పాటు ఓటు బ్యాంక్ పతనం మొదలైంది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వెళ్లడంతో అభ్యర్థుల కోసం తీవ్ర కుస్తీలు పట్టక తప్పలేదు. చివరకు ఆ ఎన్నికల ఫలితాలు విజయకాంత్‌ను పాతాళంలోకి నెట్టే పరిస్థితిని కల్పించాయి. విజయకాంత్ సైతం ఓటమి పాలు కాగా, ఓటు బ్యాంక్ ఐదు శాతం పైగా దక్కించుకుని పార్టీ గుర్తింపు రద్దు కాకుండా గట్టెక్కారు. గుర్తింపు రద్దయినట్లే.... 2016 ఎన్నికల అనంతరం అనారోగ్య కారణాలతో విదేశాలకు వెళ్తూ వచ్చిన విజయకాంత్‌కు 2019 లోక్‌సభ ఎన్నికల్లో డిమాండ్ పెరిగింది. ఆయన్ను తమ వైపు అంటే, తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రయత్నించాయి. చివరకు అన్నాడీఎంకే – బీజేపీతో జతకట్టిన విజయకాంత్ నాలుగు చోట్ల పోటీ చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు డీఎండీకేను కష్టాల కడలిలో పడేసింది. డిపాజిట్లే కాదు, ఓటు బ్యాంక్ పూర్తిగా పతనమైంది. విజయకాంత్ బావ మరిది సుదీష్ కళ్లకురిచ్చి నుంచి పోటీ చేయగా, 3 లక్ష 21 వేల 794 ఓట్లు దక్కించుకున్నారు. విరుదునగర్‌లో ఆ పార్టీ నేత అళగర్ స్వామి 3 లక్షల 16 వేల 329 ఓట్లు రాబట్టుకోగలిగారు. ఇక, ఉత్తర చెన్నైలో మోహన్ రాజు లక్షా 29 వేల 468, తిరుచ్చిలో ఇలంగోవన్ లక్షా 61 వేల 999 ఓట్లతో సరిపెట్టుకున్నారు. పార్టీ ఓటు బ్యాంక్ అన్నది 2.19 శాతానికి దిగ జారింది. దీంతో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు అయినట్టే అన్న పరిస్థితి. డిపాజిట్లతో పాటు ఓటు బ్యాంక్ తగ్గిన దృష్ట్యా, ఆ పార్టీ ఎన్నికల చిహ్నం ఢంకా కూడా దూరమైనట్టే. ఎన్నికల కమిషన్ గుర్తింపు ఓ పార్టీకి తప్పనిసరిగా ఉండాలంటే, కనీసం ఆరు శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను కల్గి ఉండాల్సి ఉంది. అలాగే, ఒక ఎంపీ లేదా, కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలైనా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే, డీఎండీకేకు వరసుగా మూడు ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఆ పార్టీ గుర్తింపు ఇక రద్దయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం కూడా ఆ పార్టీకి శాశ్వతంగా దూరం ఖావడం తథ్యం. కాగా, పార్టీ ఓటమికి కోశాధికారి ప్రేమలత విజయకాంత్ కారణం అంటూ ఆ పార్టీ వర్గాలే విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా, సామాజిక మాధ్యమాల్లో ప్రేమలత విజయకాంత్‌పై సెటైర్లు జోరందుకోవడం గమనార్హం. డీఎంకే తలుపులు తెరచి ఉన్నప్పుడే లోనికి వెళ్లకుండా, అన్నాడీఎంకే వైపుగా వెళ్లి వదినమ్మ పెద్ద తప్పే చేశారని, ఇప్పడు అన్నయ్యకు మరింత కష్టాలు తెచ్చి పెట్టారన్నట్టుగా వ్యాఖ్యల తూటాలు సామాజిక మాధ్యమాల్లో పేలుతున్నాయి. -
మోదీ సభ: బీజేపీ కూటమిలోకి విజయ్‌కాంత్
సాక్షి, చెన్నై: పొత్తుల పరంగా తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమితో నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే చేతులు కలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కంచీపురంలో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో అన్నాడీంఎకే-బీజేపీ కూటమిలో డీఎండీకే చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ కూటమిలో డీఎండీకే చేరిన విషయాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి ధ్రువీకరించారు. రానున్న ఎన్నికల్లో మొత్తం నాలుగు పార్టీలు (అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే) కూటమిగా పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలతతోపాటు పలువురు నేతలు సీఎం నివాసంలో పళనిస్వామిని కలిశారు. మరోవైపు ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో వేదికపై ఏర్పాటు చేసిన పోస్టర్లో ప్రధాని మోదీ, సీఎం పళనిస్వామితోపాటు విజయ్‌కాంత్ చిత్రం కూడా ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో కొత్తగా చేరిన డీఎండీకేకు నాలుగు నుంచి 5 లోక్‌సభ స్థానాలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్-డీఎంకేలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో చేరేందుకు డీఎండీకే ఆసక్తి చూపించినా.. మిత్రపక్ష పార్టీల కోసం మరిన్ని సీట్లు వదులుకోవడానికి డీఎంకే నిరాకరించడంతో ఇది సాధ్యపడలేదని తెలుస్తోంది. తమిళనాడులోని 39స్థానాల్లో బీజేపీకి ఐదు, పీఎంకేకు ఏడు స్థానాలను అన్నాడీఎంకే ఇప్పటికీ ఖరారు చేసింది. -
కెప్టెన్ చుట్టూ కూటమి రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలోని రెండు కూటములు సీట్ల సర్దుబాట్లలో ఒకవైపు దూసుకుపోతున్నా డీఎండీకే వైఖరి వల్ల ముందుకు పోలేని పరిస్థితి నెలకొని ఉంది. రెండు కూటములకు చెందిన నేతలు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కెప్టెన్ చుట్టూ కూటమి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్‌లో మరోకూటమిగా ఏర్పడి అధికారహోదా కోసం అర్రులు చాస్తున్నాయి. రాష్ట్రంలోని వామపక్షాలతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక కూటమిలో సర్దుకుపోయాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకేల తరువాత అతిపెద్ద పార్టీ తనదేనని చెప్పుకుంటున్న డీఎండీకే అధినేత విజయకాంత్, గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి మాత్రం సొంతకుంపటి పెట్టుకున్న తమిళమానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ మాత్రం ఏ కూటమిలో చేరుదామా అనే తీరులో ఇంకా తర్జనభర్జన దశలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల వేడిరాజుకున్న కొత్తల్లో అన్నాడీఎంకే– బీజేపీ కూటమివైపు మొగ్గిన విజయకాంత్‌కు అక్కడ ఆశించిన సీట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్, డీఎంకే కూటమి వైపు దృష్టి సారించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రతిపక్ష కూటమి విజయకాంత్‌ను మచ్చిక చేసుకునే పనిలో పడింది. తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ గురువారం విజయకాంత్‌ను కలిశారు. ఇక శుక్రవారంనాడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా విజయకాంత్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. అయితే ఎవ్వరికీ విజయకాంత్ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఒకటి రెండురోజుల్లో నిర్ణయాన్ని తీసుకుంటానని విజయకాంత్ ప్రకటించారు. ఇదిలా ఉండగా నటుడు రజనీకాంత్ సైతం శుక్రవారం విజయకాంత్ ఇంటికి వెళ్లి వచ్చారు. అయితే కేవలం స్నేహపూర్వక కలయిక మాత్రమే ఒక్కశాతం రాజకీయాలు కూడా లేవని రజనీకాంత్ ఈ సందర్భంగా మీడియాకు స్పష్టం చేశారు. విజయకాంత్ ఇంటి వద్ద ఇలా ఎదుటి కూటమికి చెందిన నేతలు క్యూ కట్టడం అన్నాడీఎంకే అగ్రజులు ఎడపాడి, పన్నీర్‌సెల్వంలను ఆశ్చర్యానికి గురిచేసింది. డీఎండీకేను ఎలాగైనా తమ జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్న అన్నాడీఎంకే విజయకాంత్‌కు ఐదుస్థానాలు కేటాయించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ మేరకు మరలా కెప్టెన్‌తో చర్చలు మొదలుపెట్టారు. బీజేపీ–అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే చేరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు. కూటమి చర్చల్లో ఎలాంటి ప్రతిష్టంభనలు లేవు, వారంరోజుల్లో ఒక నిర్ణయానికి వస్తామని విజయకాంత్ సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలత ప్రకటించారు. ఇలా రాష్ట్రంలోని రెండు కూటములు కెప్టెన్ చుట్టూ తిరుగుతుండగా విజయకాంత్ ఎటువైపు మొగ్గుతారా వేచిచూడాల్సిందే. -
విజయకాంత్, రజనీకాంత్ భేటీపై తీవ్ర చర్చ
సాక్షి, చెన్నై: నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం విజయకాంత్ నివాసానికి వచ్చిన రజినీకాంత్ అరగంట సేపు అక్కడ గడిపారు. కేవలం విజయకాంత్‌ను పరామర్శించేందుకే తాను వచ్చినట్టు భేటీ అనంతరం రజనీకాంత్ పేర్కొన్నారు. అలాగే తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. కానీ ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ వర్గాలో తీవ్ర చర్చకు దారితీసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో కలిసి అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడితే.. డీఎంకే కాంగ్రెస్‌తో జత కట్టింది. అయితే తొలుత అన్నాడీఎంకే కూటమిలో చేరుతుందని భావించిన డీఎండీకే.. సీట్ల సర్దుబాటు కుదరక కూటమి నుంచి వైదొలుగుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య విజయకాంత్ తమ పార్టీ ఆశవహులు ఒంటరిగా బరిలో నిలువనున్నారనే సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో గురువారం విజయకాంత్‌తో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తాజా మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. పరోక్షంగా అన్నాడీఎంకే కూటమికి దూరంగా ఉండాలని ఆయన విజయకాంత్‌ను కోరినట్టుగా సమాచారం. అయితే ఆ మరుసటి రోజే రజినీకాంత్ విజయకాంత్‌తో భేటీ కావడంతో డీఎండీకే ఏ కూటమి వైపు మొగ్గు చూపుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది. మరోవైపు రాజకీయ ఎంట్రీని స్పష్టం చేసిన రజినీకాంత్.. తాను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని తెల్చిచెప్పిన సంగతి తెలిసిందే. -
డీఎండీకే అధినేతకి అస్వస్థత
సాక్షి, చెన్నై : : డీఎండీకే అధినేత, తమిళ ప్రముఖ నటుడు విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. అరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆదంబాక్కంలోని మియాట్ ఆస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సినీ నటుడిగా అశేష అభిమానుల నాయకుడిగా మన్ననల్ని అందుకున్న విజయకాంత్ డీఎండీకేతో రాజకీయాల్లో అడుగు పెట్టి ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. -
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు అస్వస్థత
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత, తమిళ ప్రముఖ నటుడు విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. అయితే సాధారణ హెల్త్ చెకప్ కోసమే విజయకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. శనివారం ఉదయం డిశ్చార్జ్ అవుతారని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. -
విజయకాంత్ చేదు వార్త
సాక్షి, హైదరాబాద్ : సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ముద్ర వేసిన నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో కెప్టెన్ సతమతమవుతున్నారు. ఇందుకోసం పలుమార్లు శస్త్రచికిత్సలు కూడా ఆయన చేయించుకున్నారు. తాజాగా అనారోగ్యానికి గురైన డీఎమ్‌డీకే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయ్యారు. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్తున్నట్లు ట్విట్టర్లో విజయ్‌కాంత్ ట్వీట్ చేశారు. ఈ నెల 7వ తేదీన వెళ్తున్నానని, వీడ్కోలు చెప్పేందుకు ఎయిర్‌పోర్టుకు రావొద్దని అభిమానులను కోరారు. pic.twitter.com/967LlEGiVd — Vijayakant (@iVijayakant) July 5, 2018 -
నాన్నకు ప్రేమతో..
తమిళసినిమా: కన్నవారిపై ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అయితే దాన్ని నిరూపించుకోవడానికి విశేష సందర్భం అందరికీ కలగదు. యువ నటుడు షణ్ముగ పాండియన్‌కు అలాంటి మంచి తరుణం కలిసొచ్చింది. సీనియర్ నటు డు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్ పుత్రరత్నాల్లో ఒకరే ఈ షణ్ముగపాండియన్. ఈయన కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. షణ్ముగ పాండియన్ నటించిన మదురైవీరన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చిం ది. ఇక విజయకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనది 40 ఏళ్ల గొప్ప నట చరిత్ర. అందులో ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. ఎందరికో నట జీవితా న్ని ప్రసాదించిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి న నటుడు విజయకాంత్. అలాంటి ఆయన 40 సినీ వసంతోత్సవ వేడుకను ఇటీవల కాంచీపురం సమీపంలో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆ వేడుకలో పాల్గొని ఆశీర్వాదాలు, అభినందనలు అందించారు. అదే వేదికపై విజయకాంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నా, ఆయన చిన్న కొడుకు, నటుడు షణ్ముగపాండియన్ హాజరు కాలేదు. కారణం ఆ సమయంలో ఆయన లండన్‌లో ఉన్నారు. నాన్న 40 నట వసంతాల వేడుకలో పాల్గొన లేకపోయానన్న కొరతను ఇటీవల చెన్నైకి తిరిగొచ్చిన తరువాత తీర్చుకున్నారు. అది ఎలాగంటే తన తండ్రి రెండు కళ్లను తన బాహువులపై పచ్చబొట్టు పొడిపించుకుని ఆయన ముందు నిలిచి ఇది నాన్నపై తనకున్న ప్రేమ అని నిరూపించుకున్నారు. అదే సమయంలో తన తండ్రి ఆశీస్సులు అందుకుని ఎనలేని ఆనంద తరుణాన్ని పంచుకున్నారు. తండ్రితో ఫొటో తీసుకుని మధురానుభూతిని పొందారు. -
విజయకాంత్, ప్రేమలత అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటకకు చెందిన వ్యక్తిని అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా నియమించడాన్ని నిరసిస్తూ డీఎండీఎంకే శుక్రవారం భారీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు విజయకాంత్తోపాటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నాయూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సూరప్పను గవర్నర్ ఖరారు చేశారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి జల వివాదం, మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరిపై రాష్ట్రంలో ఉధృతంగా పోరాటాలు సాగుతున్న తరుణంలో సూరప్ప నియామకం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇవేమీ పట్టనట్లుగా ఇటీవలే వైస్‌చాన్స్‌లర్ సూరప్ప బాధ్యతలు చేపట్టారు. సూరప్ప పేరును ఉపసంహరించాలని కోరుతూ ఈనెల 18వ తేదీన గవర్నర్ బంగ్లా దిశగా ర్యాలీలు నిర్వహించాలని డీఎండీకే నిర్ణయించింది. అయితే ఇందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసు నిషేధాజ్ఞలు మీరి ఈనెల ర్యాలీ జరపాలని డీఎండీకే శ్రేణులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సైదాపేట పనగల్మాలిగై వద్ద వేలాదిగా చేరుకున్నారు. వందకుపైగా పోలీసులు మోహరించారు. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత నాయకత్వంలో పార్టీ కార్యకర్తలంతా గవర్నర్ బంగ్లా వైపు ర్యాలీగా కదిలారు. వీసీగా సూరప్ప నియామకాన్ని ఖండిస్తూ, గోబ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ కొద్దిదూరం కూడా సాగకమునుపే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు కార్యకర్తలు గవర్నర్ బంగ్లా వైపు పరుగులు పెట్టగా పోలీసులు వారి వెంటపడి పట్టుకున్నారు. గవర్నర్ బంగ్లా ముట్టడియత్నం చేసిన విజయకాంత్, ప్రేమలత సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో కూర్చుని ఉన్న విజయకాంత్ గవర్నర్ బంగ్లావైపు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు. డీఎండీకే ఆందోళన కారణంగా సైదాపేట పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అరెస్ట్ చేసిన వారందరినీ సాయంత్రం విడిచిపెట్టారు. -
రేపు కుండబద్దలు కొడతా: అగ్రహీరో
సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు కమల్‌హాసన్ రేపటి నుంచి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. రేపు ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారు. ఈ నెల 21న రామేశ్వరంలో కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తన రాజకీయ ప్రయాణంలో రేపు అన్ని కుండబద్దలు కొడతానని ఆయన తెలిపారు. ఎవరెవరు తనతో కలిసి వస్తారో పార్టీ ప్రకటించాక చెబుతానని అన్నారు. తమిళ రక్తానికి నా మద్దతు: సీమాన్ నామ్ తమిళర్ నేత సీమాన్ మంగళవారం కమల్‌హాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ.. తమిళ రక్తానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కమల్ నటన చూసి అభిమానిగా పెరిగానని, ఆయన కలుస్తానంటే వచ్చికలిసినట్టు చెప్పారు. రజనీకాంత్ కలుస్తానంటే తప్పకుండా కలుస్తానని చెప్పారు. కాగా, కమల్ హాసన్ సోమవారం డీఎండీకే విజయకాంత్‌ను కలిశారు. రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌లతో ఆదివారం భేటీ అయ్యారు. -
రాజకీయాల్లో ఆయన నా సీనియర్..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ పార్టీ ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఇటీవల పలు పార్టీల నేతలను, సహచర నటులను కలుస్తున్నారు. ఆ కోవలోనే ఆయన నటులు రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్లను ఆదివారం కలిశారు. తాజాగా, సోమవారం చెన్నైలోని కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి విజయకాంత్‌తో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ‘మీవంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం అవసరం’ అని కమల్‌కు విజయకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని ప్రారంభించే ముందు నేతలను కలుస్తున్నట్లే రాజకీయాల్లో తన కంటే సీనియర్ అయిన విజయకాంత్‌ను కలిసానని కమల్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కాగా, కమల్, రజనీ కలవడం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని మంత్రి జయకుమార్ వాఖ్యానించారు.ఈ నెల 21న రామేశ్వరంలో కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, విజయకాంత్ ఇలా అందరూ తమ రాజకీయ తొలి అడుగును మథురై జిల్లా నుంచే ప్రారంభించడం గమనార్హం. -
రజనీ, కమల్ పొలిటికల్ ఎంట్రీపై ‘కెప్టెన్’ కామెంట్
సాక్షి, చెన్నై: రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయ ప్రవేశంపై డీఎండీకె అధ్యక్షుడు, నటుడు ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ స్పందించారు. వీరిద్దరి కంటే రాజకీయాల్లో తానే సీనియర్ అని చెప్పారు. రజనీ, కమల్ తన కంటే జూనియర్లని అని వ్యాఖ్యానించారు. వీరిద్దరితో కలిసి పోటీ చేయబోమని సూచనప్రాయంగా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎండీకె ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. తమిళుల దేవత ఆండాల్ అమ్మవారిపై కవి, సినీగేయ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలను విజయ్‌కాంత్ ఖండించారు. వైరముత్తుకు వ్యతిరేకంగా జీయర్ల పోరాటానికి మద్దతు తెలిపారు. కాగా, ఒక పత్రికలో ఆండాల్ అమ్మవారి గురించి రాసిన వైరముత్తు.. ఆమెను 'దేవదాసి'తో పోల్చారు. దీంతో హిందూ సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. తన వ్యాఖ్యలకు వైరముత్తు క్షమాపణ చెప్పినప్పటికీ నిరసనలు ఆగలేదు. వైరముత్తు నాలుక కోస్తే రూ.10 కోట్లు బహుమతిగా ఇస్తానని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటించడం సంచలనం రేపింది. -
రంగంలోకి దిగిన కెప్టెన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ స్పందించారు. పళనిస్వామి సర్కారు బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలోకి పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్‌ను కోరారు. చెన్నై రాజ్‌భవన్‌లో శనివారం కొత్త గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ‘గత ఏడాది కాలంలో రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడింది. ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. ప్రజలను, రాష్ట్రాన్ని మోసపుచ్చుతూ పాలకులు కాలక్షేపం చేస్తున్నారు. డెంగీ జ్వరాల విశ్వరూపం, శాంతి భద్రతల సమస్య, అన్నదాతల ఆవేదనలు, రేషన్ దుకాణాల్లో సరుకుల కొరత వంటి సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టిన అధికార పార్టీ నేతలు తమ పదవులను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా వ్యవహరిస్తారని గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేపుడు మీరు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రం సమర్పిస్తూ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామ’ని వినతి పత్రంలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధం అని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఈ సందర్భంగా కలిసిన మీడియాతో విజయకాంత్ చెప్పారు. -
వారు రాజకీయాల్లోకొచ్చినా భయం లేదు
పెరంబూరు: రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకొచ్చినా మాకేం భయం లేదు అని డీఎం డీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ అన్నారు. పుదుగై జిల్లా, నెడువాసల్ గ్రామప్రజలు తమ ప్రాంతంలో హైడ్రోకార్బన్ పథకానికి వ్యతిరేకంగా గత ఏప్రిల్ 12 నుంచి పోరాటాలు చేస్తున్నారు. వారికి మద్దతు తెలపడానికి ఆదివారం డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయకాంత్ మాట్లాడుతూ ప్రాణాలొడ్డి అయినా హైడ్రోకార్బన్ పథకాన్ని అడ్డుకుంటా మన్నారు. సోమవారం ఆ గ్రామంలో హైడ్రోకార్బన్ పథకం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించిన విజయకాంత్ ఈ పథకాన్ని నిలిపి వేసేలా అవసరం అయితే రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అదే విధంగా రజనీకాంత్, కమలహాసన్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తావిస్తూ, వారు రాజకీయల్లోకి వచ్చినా తమకు భయం లేదని వ్యాఖ్యానించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తుండటంతో పాటు, ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా నటుడు కమలహాసన్ అన్నాడీఎంకే నేతలపై అవినీత అస్త్రాలను సంధిస్తున్నారు. దీంతో తమిళనాడు భవిష్యత్తు రాజకీయాలు ఎటు దారి తీస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. -
వాళ్లిద్దరూ వచ్చినా భయంలేదు: విజయ్‌కాంత్
పెరంబూరు(తమిళనాడు): రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాల్లోకొచ్చినా తమకేం భయం లేదని డీఎండీకే అధ్యక్షుడు, నటుడు ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ అన్నారు. కమల్‌హాసన్ ఒక్కరే ధైర్యంగా రాష్ట్ర నాయకుల గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారని మెచ్చుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తుండటంతోపాటు, ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అన్నాడీఎంకే నేతల అవినీతిపై కమల్‌హాసన్ విమర్శనాస్త్రాలను సంధించారు. దీంతో తమిళనాడు భవిష్యత్ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. పుదుగై జిల్లా నెడువాసల్ గ్రామ ప్రజలు తమ ప్రాంతంలో హైడ్రో కార్బన్ పథకాన్ని అమలు చేయరాదంటూ గత ఏప్రిల్ 12వ తేదీ నుంచి పోరాటం చేస్తున్నారు. వారికి మద్దతు తెలపడానికి ఆదివారం డీఎండీ నేత విజయ్‌కాంత్, ఆయన సతీమణి ప్రేమలత ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయకాంత్ మాట్లాడుతూ హైడ్రో కార్బన్ పథకాన్ని అమలు పరచడానికి అధికారులతో మంత్రులు గ్రామంలోకి అడుగు పెడితే ప్రాణాలొడ్డి అయినా వారిని అడ్డుకుంటామని అన్నారు. సోమవారం ఆ గ్రామంలో హైడ్రో కార్బన్ పథకాన్ని ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించిన విజయకాంత్ ఈ పధకాన్ని నిలిపి వేసేలా అవసరం అయితే రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాలను ప్రస్తావిస్తూ, వారు రాజకీయల్లోకి వచ్చినా తమకు భయం లేదని వ్యాఖ్యానించారు. -
పనికొచ్చే ప్రశ్నలు వేయండి
సాక్షి, చెన్నై : ప్రజల్లోకి వచ్చిన మరుసటి రోజే డీఎండీకే అధినేత విజయకాంత్ టెన్షన్‌కు గురయ్యారు. తన ధోరణి ఇంతే అని నిరూపించుకుంటూ మీడియా ముందు శివాలెత్తారు. ఏందీ..అమ్మమ్మా...అంటూ కోపం వచ్చేస్తుంది..వస్తే అంతే అంటూ విరుచుకు పడ్డారు. తదుపరి త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.రెండు నెలలకు పైగా డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యంతో ఇం టికి, ఆస్పత్రికి పరిమితమైన విష యం తెలిసిందే. శని వారం శివగంగైలో పర్యటించిన ఆయన తాను ఆరోగ్య వంతుడినయ్యానని చాటుకున్నారు. ప్రజలతో ఇక మమేకం అని ప్రకటించుకుని , రెండో రోజు ఆదివారం తిరునల్వేలిలో పర్యటించారు. అయితే, ఆయన ధోరణిలో మాత్రం ఎలాంటి మార్పులేదు. మరింత దూకుడుతో ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. కెప్టెన్ టెన్షన్ : డీఎండీకే నాయకుడి ఇంటి శుభకార్య వేడుకకు సతీమణి ప్రేమలతతో కలిసి హాజరై విజయకాంత్‌ను మీడియా వర్గాలు చుట్టుముట్టి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో తనలో కొంత కాలంగా నిద్రపోతున్న ఆవేశాన్ని బయటకు తీశారు. అన్నాడీఎంకే గురించి సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఓపీఎస్ చెప్పాడంటా... అమ్మ.. అమ్మ మ్మా... ఏందీ అమ్మమ్మా...నాకు కోపం వచ్చిం దో... అంటూ నాలుక మడత పెట్టి మరీ ఆగ్రహాన్ని ప్రదర్శించడంతో మీడియా వర్గాలు అవాక్కయ్యారు. అన్నాడీఎంకేలోని శిబిరాల గురించి ప్రస్తావించగా, ఓపీఎస్(పన్నీరు), ఈపీఎస్(ఎడపాడి పళనిస్వామి) ఇద్దరూ వేస్ట్.., తన వద్ద ఆ ఇద్దరి ప్రస్తావన వద్దే వద్దంటూ మళ్లీ తన ఆక్రోశాన్ని ప్రదర్శించారు. అమ్మ సమాధి వద్ద కూర్చున్నాడంటా...నీ...అంటూ మళ్లీ కోపం వచ్చేస్తుందంటూ ఆ ప్రశ్నకు సమాధానం దాట వేశారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, చిదంబరం ఇంట్లో ఐటీ దాడుల ప్రస్తావన తీసుకురాగా, ఉపయోకరంగా, ప్రజలకు మంచి అనిపించే ప్రశ్నలను వేస్తే సమాధానాలు ఇస్తానని, లేదంటే వెళ్లి పోతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌కు వ్యతిరేకత బయలు దేరి ఉందే అని ప్రశ్నించగా, అవన్నీ సహజం అని, తనుకూ వ్యతిరేకత తప్పలేదు..ఇప్పుడు రాజకీయాల్లో ఏ స్థాయికి చేరానో చూసుకోండంటూ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తనకు మంచి మిత్రుడు...అంతే అని స్పందించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం సిద్ధం కావాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ ఎన్నికలకు ముందే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. చివరగా ఈవీఎంలలో ఎలాంటి మోసాలు, అవకతవకలు చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. -
ప్రేమలతకు పగ్గాలు
డీఎండీకే పగ్గాలు విజయకాంత్ సతీమణి ప్రేమలత చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టేందుకు డీఎండీకే వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. సాక్షి, చెన్నై: 2005లో సినీ నటుడు విజయకాంత్ దేశీయ ముర్పోగు ద్రావిడ కళగం(డీఎండీకే)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో జరిగిన తొలి ఎన్నికల్లో తానొక్కడినే గెలిచినా, ఢీలా పడకుండా అడుగులు వేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా జోడు పదవులతో ముందుకు సాగి 2011లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. అయితే 2016 ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు డీఎండీకేను ఢీలా పడేలా చేశాయి. ఎండీఎంకే, వామపక్షాలు, వీసీకే నేతృత్వంలోని కూటమిలోకి విజయకాంత్ వెళ్లడాన్ని ఖండిస్తూ, ఆ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ బయటకు వచ్చేశారు. ఈ ప్రభావం ఆ ఎన్నికల్లో విజయకాంత్‌కు గట్టి దెబ్బ తగిలేలా చేశాయి. డిపాజిట్లే కాదు, గత కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంక్‌ను ఆయన కోల్పోక తప్పలేదు. మళ్లీ పూర్వ వైభవం లక్ష్యంగా మీలో ఒక్కడ్నీ అంటూ కేడర్ వద్దకు పరుగులు తీస్తూ వచ్చిన విజయకాంత్ ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రికి, ఇంటికి తిరగక తప్పడం లేదు. ప్రస్తుతం ఆయనకు మళ్లీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో పార్టీని నడిపించడంతోపాటుగా కేడర్‌ను దక్కించుకునే విధంగా పగ్గాలు ఆయన సతీమణి ప్రేమలతకు అప్పగించేందుకు తగ్గ కార్యాచరణ డీఎండీకేలో సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయకాంత్ సతీమణి ప్రేమలత మంచి వాక్చాతుర్యం కల్గిన వారు. సమయానుగుణంగా స్పందించే తత్వం ఉన్న వారు. ఇంకా చెప్పాలంటే, విజయకాంత్‌ను మించి ప్రసంగాలు సాగించగల సమర్థురాలు. డీఎండీకే ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్ర కీలకం. పార్టీలో ఎలాంటి పదవీ లేకున్నా, అన్నీ తానై విజయకాంత్ వెన్నంటి ఆమె సాగుతున్నారని చెప్పవచ్చు. పార్టీలో ఆమెకు పదవి కట్టబెట్టాలన్న నినాదం ఎప్పటి నుంచో వస్తున్నా, విజయకాంత్ అందుకు తగ్గ నిర్ణయాన్ని ఎన్నడూ తీసుకోలేదు. ఇందుకు కారణం, ఎక్కడ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తారోననే. ప్రస్తుతం సీనియర్లు ఎవ్వరూ ఆ పార్టీలో లేరు. ఉన్నదంతా అభిమాన లోకం. వారిని రక్షించుకోవాలంటే, పార్టీ పగ్గాలు ప్రేమలతకు అప్పగించాల్సిన అనివార్యం ప్రస్తుతం ఏర్పడి ఉంది. విజయకాంత్ ఆసుపత్రిలో ఉండడంతో, పార్టీని నడిపించేందుకు తగ్గ కార్యాచరణను డీఎండీకే వర్గాలు సిద్ధం చేశాయి. విజయకాంత్ చేతిలో ఉన్న జోడు పదవుల్లో ఓ పదవిని ప్రేమలత స్వీకరించాలన్న నినాదాన్ని అందుకుని ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పదవి విజయకాంత్ వద్దే ఉంచి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ప్రేమలత మీద ఒత్తిడి తెచ్చే పనిలో కేడర్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో, డీఎండీకే వెబ్సైట్లోనూ ఆమె తప్ప మరొకరు లేరని, ఆమె పగ్గాలు చేపట్టాల్సిందేనని కేడర్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో డీఎండీకే కార్యాలయం నుంచి ప్రేమలత ప్రధాన కార్యదర్శి అన్న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువేనని ఓ నేత పేర్కొన్నారు. విజయకాంత్ బావమరిది సుధీష్ ఆ పార్టీ యువజన నేతగా ఉన్నా, పార్టీని నడిపించే సత్తా మాత్రం ప్రేమలతకు మాత్రమే ఉందని, ఆమె పగ్గాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయంగా ఆ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. -
సింగపూర్‌కు విజయకాంత్
చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సింగపూర్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడు రోజులుగా ఆయన పోరూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స సింగపూర్‌లో జరిగినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మేరకు మళ్లీ సింగపూర్‌కు తరలించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నాయి. ఈ విషయంపై వైద్యులతో ఆయన సతీమణి ప్రేమలత చర్చిస్తున్నట్టుగా సమాచారం. అయితే విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన వద్దంటూ ప్రేమలత మీడియాకు వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆర్కేనగర్ ఎన్నికల ప్రచారానికి ఆయన వస్తాడని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. -
ఆర్కేనగర్ బరిలో డీఎండీకే
► అభ్యర్థిగా మదివానన్ ► పన్నీరు శిబిరంలో తిలకవతి ► దీప పూజలు ► ఏర్పాట్లలో ఈసీ సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ బరిలో డీఎండీకే అభ్యర్థిగా మదివానన్ పోటీ చేయనున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటామని ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటించారు. అవకాశం ఇస్తే, పన్నీరుసెల్వం శిబిరం నుంచి ఆర్కే నగర్ నుంచి పోటీకి సిద్ధమని మాజీ డీపీజీ తిలకవతి సంకేతాన్ని ఇచ్చారు. ఇక, వేంకటేశ్వరుని సన్నిధిలో పూజల అనంతరం ఆర్కేనగర్పై దీప దృష్టి పెట్టారు. అమ్మ జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడ్డ ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ఆ సీటును కైవసం చేసుకోవడం లక్ష్యంగా డీఎంకే పావులు కదిపే పనిలో పడింది. జయలలిత చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసిన సిమ్లా ముత్తు చోళన్‌ను మళ్లీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం అభ్యర్థి విషయంగా డీఎంకే కార్యాలయం ప్రకటన చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కమ్యూనిస్టులకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విన్నవించుకున్నారు. డీఎండీకే అభ్యర్థిగా : అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు, ఓటింగ్ శాతం గల్లంతు చేసుకున్న డీఎండీకే, తాజాగా ఆర్కేనగర్ ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివానన్ పేరును విజయకాంత్ ఖరారు చేశారు. అయితే, పలువురు నాయకులు విజయకాంత్ సతీమణి ప్రేమలత పోటీ చేయాలని నినదిస్తున్నారు. పోటీకి సిద్ధం : మాజీ డీజీపీ తిలకవతి ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న సంకేతాన్ని పంపించారు. మాజీ సీఎం పన్నీరుశిబిరం నుంచి ఆర్కేనగర్ బరిలో దిగేందుకు తాను రెడీ అని, అయితే, అవకాశం దక్కేనా అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె ఈ ప్రకటన చేశారు. దీప పూజలు: ఆర్కే నగర్ నుంచి ఎన్నికల్లో పోటీకి జయలలిత మేన కోడలు దీప సిద్ధమయ్యారు. టీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజల అనంతరం ఆమె ఆర్కేనగర్ ఎన్నికల పనుల మీద దృష్టి పెట్టారు. అలాగే, ఎంజీఆర్, అమ్మ, దీపా పేరవై సభ్యత్వ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఏర్పాట్లలో ఈసీ: రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఎంపిక , గెలుపు పావులు కదిపేందుకు తగ్గ వ్యూహ రచనల్లో ఉంటే, ఎన్నికల ఏర్పాట్ల మీద ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఖర్చుల పరిశీలనకు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రత చర్యల మీద దృష్టి పెట్టింది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీసు కమిషనర్ జార్జ్ బదిలీకి రంగం సిద్ధం అయింది. సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. -
సారీ కెప్టెన్..
ఉపఎన్నికల్లో ఎవరికీ మద్దతుఇచ్చేది లేదన్న మక్కల్ ఇయక్కం నేతలు డీఎండీకేకు మద్దతుపై తిరుమా మరో కొత్త పలుకు సాక్షి, చెన్నై: మక్కల్ ఇయక్కం వర్గాల మాటల గారడీ రాజకీయ విశ్లేషకులనే విస్మయంలో పడేస్తోంది. రోజుకో మా ట, పూటకో అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా, మరో మారు డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరకు మద్దతు కోరితే, పరిశీలన అని పలికిన ఆ నాయకులు మంగళవారం ఉప ఎన్నికల్లో డీఎండీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్ కొత్త పలుకుగా, యూసీసీకి వ్యతిరేకంగా రా జకీయ పక్షాలు ఏకం కావాలంటూ అఖి ల పక్షానికి పిలుపునిచ్చే పనిలో పడ్డారు. మక్కల్ ఇయక్కంలోని ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్‌ల తీరు విమర్శలకు దారి తీస్తున్నారుు. రోజుకో మాట, పూటకో అభిప్రాయం అన్నట్టుగా ఎవరికి వారు మీడియా ముందుకు వచ్చి చర్చల్లోకి ఎక్కడమే కాకుండా, విమర్శలను, వ్యంగ్యాస్త్రాలను ముట్టగట్టుకునే పనిలో పడ్డారు. నిన్నటి వరకు ఉప ఎన్నికల్లో డీఎండీకే మద్దతు కోరితే పరిశీలిస్తామన్న సీపీఎం, సీపీఐ, వీసీకే నేతలు , తాజాగా మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చేశారు. వీరి పరిశీలన మేరకు డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమని ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా తమకు మద్దతును ప్రకటించాలని విన్నవించారు. దీంతో మక్కల్ ఇయక్కం మద్దతు ఉప రేసులో ఉన్న డీఎండీకే అభ్యర్థులకు దొరికినట్టేనా..? అన్న ఎదురు చూపులు పెరిగా రుు. అయితే, మీడియా సందించిన ప్రశ్నలకు సమాధానంగానే పరిశీలన అన్న నినాదాన్ని తాము తెర మీదకు తెచ్చామేగానీ, ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు లేదంటూ ఆ ఇయక్కం తేల్చడం డీఎండీకేకు మరో షాక్కే. గత వారం విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని ఆ ఇయక్కంలోని వైగో స్పందిస్తే, తాజాగా మిగిలిన ముగ్గురు విజయకాంత్‌కు పరిశీలన అంటూ ఝలక్ ఇవ్వడం గమనార్హం. వీసీకే నేత తిరుమావళవన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉప ఎన్నికల్ని బహిష్కరిస్తూ ఇయక్కం వర్గాలు నిర్ణయం తీసుకున్నాయని, విజయకాంత్ తమ వద్దకు వచ్చి ఎలాంటి మద్దతు కోరలేదని, ఏ పనిచేసినా సక్రమంగా చేయాలన్నదే తన అభిమతం అని, అందుకే ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సీపీఎం నేత రామకృష్ణన్ అదేపల్లవి అందుకున్నారు. తామందరం కల సి కట్టుగా ఎన్నికల బహిష్కరణ నిర్ణ యం తీసుకున్నామని, అలాంటప్పుడు ఎలా మద్దతు ఇస్తామని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ఇక, పరిశీలన అన్న విషయం, కేవలం డీఎండీకేకు మద్దతు ఇస్తారా..? అని మీడియా సంధించిన ప్రశ్నకు , అటు వైపు నుంచి వచ్చే విజ్ఞప్తి మేరకు పరిశీలన అని సమాధానం ఇచ్చామేగానీ, మద్దతు ఇచ్చేస్తామని చెప్పలేదుగా అంటూ స్పందించారు. తిరుమా కొత్త పల్లవి : యూనిఫాం ’సివిల్’ కోడ్ (యూసీసీ- ఉమ్మడి పౌర సృ్మతి)కి వ్యతిరేకంగా రాష్ట్రంలో మైనారిటీ సంఘాలు, పార్టీలు, జమాత్‌లు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాము సైతం అంటూ వీసీకే నేత తిరుమావళవన్ కదిలారు. ఏకంగా సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా ఏకం అవుదామని రాజకీయ పక్షాలకు పిలుపు నిచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈ విషయంలో తమతో చేతులు కలపాలని, ప్రతి పక్షాలన్నీ ఏకం కావాలని కోరారు. అఖిల పక్షంగా ముందుకు సాగుదామని, యూసీసీని వ్యతిరేకిద్దామని పిలుపు నిచ్చారు. -
కొత్త పలకరింపు
చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయం మెట్లు ఎక్కారు. ఆ పార్టీ అధినేత విజయకాంత్‌తో ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయచర్చ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ వైపునకు డీఎండీకేను తిప్పుకుని డీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. అయితే, మెట్టు దిగని విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరి డిపాజిట్లనే కాదు, పార్టీ పరంగా తీవ్ర కష్ట నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాతాళంలోకి నెట్టబడ్డ విజయకాంత్ స్థానిక ఎన్నికలతో బలాన్ని చాటుకునేందుకు తీవ్ర కుస్తీలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. గత వారం స్టాలిన్‌కు వ్యతిరేకంగా తిరునావుక్కరసర్ స్పందించిన తీరు డీఎంకే వర్గాల్లో ఆక్రోశాన్ని రగిల్చి ఉన్న విషయం తెలిసిందే. మళ్లీ డీఎంకేకు అనుకూలంగా తిరునావుక్కరసర్ స్పందించే యత్నం చేస్తున్నా, డీఎంకే వర్గాలు మాత్రం కాంగ్రెస్‌కు స్థానికంలో చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నాడీఎంకేకు అనుకూలంగా స్పందించిన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి గుణపాఠం చెప్పే దిశలో స్థానిక సీట్ల బేరాల్లో పొమ్మని పొగ బెట్టే విధంగా వ్యవహరించాలని అధిష్టానంపై పలువురు డీఎంకే నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో తిరునావుక్కరసర్ డీఎండీకే అధినేత విజయకాంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నట్టు అయింది. తమ భేటీలో స్థానిక చర్చ సాగినట్టు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం గమనార్హం. డీఎంకే పక్కన పెట్టిన పక్షంలో డీఎండీకేతో కలసి పయనించేందుకు తగ్గట్టుగా స్థానిక చర్చ సాగి ఉంటుందేమో అన్న ప్రచారం ఊపందుకోవడం ఆలోచించదగ్గ విషయమే.కొత్త పలకరింపు : కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ కోయంబేడులోని డీఎండీకే కార్యాలయం మెట్లు ఎక్కారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి కూడా ఉన్నారు. తమ కార్యాలయానికి చేరుకున్న తిరునావుక్కరసర్‌కు డీఎండీకే అధినేత విజయకాంత్, యువజన నేత సుదీష్ ఆహ్వానం పలికారు. మర్యాద పూర్వక పలకరింపుల్లో రాజకీయ, స్థానిక చర్చ సాగి ఉండడం గమనార్హం. మీడియాతో తిరునావుక్కరసర్ మాట్లాడుతూ విజయకాంత్‌తో భేటీలో ప్రస్తుత రాజకీయ అంశాలపై మాట్లాడుకున్నామని, స్థానిక ఎన్నికలపై చర్చించుకున్నామని స్పందించారు. విజయకాంత్ తనకు మిత్రుడు అని, ఆయన్ను మర్యాద పూర్వకంగా పలకరించేందుకు వచ్చానని వ్యాఖ్యానించారు. -
అన్నా నీవే దిక్కు!
మా దగ్గర డబ్బుల్లేవ్ కెప్టెన్‌కు నేతల షాక్ ఇక దరఖాస్తుల హోరు ‘స్థానిక’ సమరం డీఎండీకే వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఓ వైపు బల నిరూపణ, మరో వైపు ఎన్నికల ఖర్చుకు నిధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉన్నదంతా పార్టీ కోసం ఇన్నాళ్లు ఖర్చు పెట్టిన వాళ్లంతా, ఇప్పుడు ‘అన్నా’ డబ్బుల్లేవు... నీవే దిక్కు అని కెప్టెన్ కోర్టులోకి బంతిని నెట్టే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గ షాక్‌లను పార్టీ అధినేత విజయకాంత్‌కు ఇచ్చే పనిలో జిల్లా నేతలు ఉన్నారు. చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి డీఎండీకే అన్నట్టుగా ప్రజల మన్ననల్ని అందుకున్న నాయకుడు విజయకాంత్. పార్టీ ఆవిర్భావ సమయంలో సినీ అభిమానం ఆయన వెంట కదిలింది. అభిమాన లోకం రాజకీయంగా ఎదిగారు. తమ నేత ఇచ్చే పిలుపు మేరకు చేపట్టే కార్యక్రమాలకు ఇళ్లు గుళ్ల చేసుకున్న వాళ్లెందరో ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించినా, చివరకు అధికార పక్షంతో విజయకాంత్ పెట్టుకున్న వైర్యం డీఎండీకే వర్గాల్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చావు దెబ్బే తిన్నారు. ఇక, తాము ఇమడలేమంటూ పెద్ద సంఖ్యలో కేడర్ డీఎండీకేను వీడింది. దీంతో మిగిలిన వాళ్లను రక్షించుకునేందుకు విజయకాంత్ తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఇప్పుడు ఉన్న కేడర్‌లో ఆర్థికంగా దెబ్బ తిన్న వాళ్లు కొందరు అయితే, మరి కొందరు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా రాజకీయాలు చేసే వాళ్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నేతల్లో స్థానిక ఎన్నికల ఖర్చు గుబులు బయలు దేరింది. ఎక్కడ తమ నెత్తిన వేసే రీతిలో కెప్టెన్ పిలుపునిస్తారో అన్న ఉత్కంఠ బయలు దేరింది. దీంతో ముందస్తుగా మేల్కొన్న జిల్లాల నేతలు అన్నా..డబ్బుల్లేవు...నీవే దిక్కు అన్నట్టు విజయకాంత్ వద్ద మొరపెట్టుకునే పనిలో పడ్డారు. అన్నా డబ్బుల్లేవు..: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? పొత్తా? ఒంటరా..? అన్న అంశాలపై కేడర్ అభిప్రాయాల్ని విజయకాంత్ స్వీకరించే పనిలో పడ్డారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఇందులో జిల్లాలు, డివిజన్ల నుంచి వస్తున్న నేతలు విజయకాంత్‌కు షాక్‌లు ఇచ్చే పనిలో పడ్డారట..!. బలోపేతం లక్ష్యంగా కెప్టెన్ ఇచ్చే సూచనలు, సలహాలను నేతలు చక్కగా ఆలకిస్తున్నారు. అదే అభిప్రాయాల విషయానికి వచ్చే కొద్ది నేతలు తమ గళాన్ని విప్పే పనిలో పడడం కెప్టెన్‌కు పెద్ద షాక్కే అంట..!. డబ్బుల్లేవు, మళ్లీ..మళ్లీ తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టలేం అన్న సమాధానాలు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్నట్టుగా సలహాలు ఇచ్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందరి అభిప్రాయాల్ని శ్రద్ధంగా వినే విజయకాంత్, చివరలో ఎన్నికల్లోకి వెళ్తున్నాం...తాను సూచించే వ్యక్తి గెలుపునకు శ్రమించాల్సిందే అంటూ కేడర్‌కు హుకుం జారీ చేసి పంపించేస్తున్నట్టు సమాచారం. ఇంత మాత్రానికి తమను పిలిపించి అభిప్రాయాలు సేకరించడం ఏమిటో అంటూ పలువురు నేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయం వద్ద పెదవి విప్పడం గమనార్హం. అదే సమయంలో తాను మాత్రం తగ్గేది లేదన్నట్టుగా విజయకాంత్ ముందుకు సాగుతుండడంతో స్థానికంలో బలాన్ని చాటగలమా అన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారట! ఇక, ఓ వైపు కేడర్ అభిప్రాయాలు అంటూ, మరో వైపు దరఖాస్తుల స్వీకరణ అంటూ విజయకాంత్ తనదైన రూట్లో పయనం సాగిస్తుండడం గమనార్హం. దరఖాస్తుల హోరు : ఎన్నికలపై అభిప్రాయ సేకరణ ఓ వైపు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సాగితే, మరో వైపు బుధవారం నుంచి ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులు దరఖాస్తులు సమర్పించుకునే విధంగా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడం ఆలోచించదగ్గ విషయమే. ఇక విజయకాంత్ రూటే సెపరేటుగా ఉంటే, పీఎంకే అయితే, తాము ఒంటరే అన్నది స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి శ్రీకారం చుట్టారు. అలాగే, బీజేపీ సైతం ఒంటరి అన్నట్టుగానే దరఖాస్తుల పర్వానికి శ్రీకారం చుట్టింది. కోడంబాక్కంలో ఈ దరఖాస్తుల పంపిణీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించేశారు. దీంతో ఆయా పార్టీలో దరఖాస్తుల వేగం పుంజుకుంది. -
ఫీనిక్స్ పక్షి!
కెప్టెన్ కొత్త నినాదం 65వ వసంతంలోకి విజయకాంత్ మక్కల్ ఇయక్కం నేతల శుభాకాంక్షలు స్నేహ పూర్వక పలకరింపు : వైగో, తిరుమా సరైన సమయంలో నిర్ణయం : ప్రేమలత సాక్షి, చెన్నై: తమ నేత విజయకాంత్ పేరుకు ముందు కెప్టెన్ అన్న పదం డీఎండీకే వర్గాలకు కలిసి రానట్టుంది. అందుకే ఇక, తమ నేతను ఫీనిక్స్పక్షితో పోల్చే పనిలో పడ్డట్టున్నారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం ఆయన బర్త్‌డే కేక్‌లలో ‘ఫీనిక్స్ పక్షి’ అని తాటి కాయంత అక్షరాలతో కొన్ని నినాదాల్ని పొందు పరచి ఉండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీఎండీకే అధినేత విజయకాంత్ చతికిలబడ్డ విషయం తెలిసిందే. కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుని తీరుతామన్న ధీమాతో డీఎండీకే వర్గాలు ఉన్నాయి. తమ నేత బర్త్‌డే తదుపరి జరిగే కార్యక్రమాలతో డీఎండీకే పుంజుకున్నట్టే అన్న వ్యాఖ్యల్ని సంధించడం మొదలెట్టారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం 65వ వసంతంలోకి అడుగుపెట్టిన విజయకాంత్‌ను అభినందనలతో ముంచెత్తిన డీఎండీకే వర్గాలు, ఇక తమ నేత ఫీనిక్స్పక్షి అన్నట్టు నినాదాన్ని అందుకోవడం విశేషం. ఎట్టి ఆటుపోట్లు ఎదురై కింద పడ్డా, మళ్లీ చటుక్కున పుంజుకుని రయ్యూ మంటు గాల్లో దూసుకు వెళ్లే ఫీనిక్స్పక్షితో తమ నేత విజయకాంత్‌ను పోల్చడం కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే అంటూ డీఎండీకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఫీనిక్స్పక్షి: విజయకాంత్ బర్త్‌డేను పురస్కరించుకుని శాలిగ్రామంలోని ఆయన నివాసం పరిసరాల్ని డీఎండీకే వర్గాలు సుందరంగా తీర్చిదిద్దాయి. పార్టీ తోరణాలు, జెండాలతో ఆలంకరించడంతో పాటు విజయకాంత్ ఇంటి వద్ద ఏదో పండుగ అన్నట్టుగా వాతావరణం కల్పించారు. ఉదయాన్నే విజయకాంత్‌కు ఆయన సతీమణి ప్రేమలత, తనయులు షణ్ముగపాండియన్, విజయ ప్రభాకరన్, బావమరిది సుదీష్ నిలువెత్తు పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పటికే బారులు తీరిన పార్టీ వర్గాలు, కేడర్ ఒక్కక్కరుగా విజయకాంత్‌కు స్వయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి పదకొండు గంటల సమయంలో కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న విజయకాంత్‌కు బ్రహ్మరథం పలికారు. మక్కల్ ఇయక్కంకు చెందిన ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం తరఫున సంపత్ అక్కడికి చేరుకుని నిలువెత్తు పూలమాలతో, శాలువలతో సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ ఫీనిక్స్ పక్షి అన్న పదంతో, నేడు చతికిల బడ్డా, రేపు అధికారం అన్న నినాదంతో పొందు పరిచిన భారీ కేక్‌ను విజయకాంత్‌తో కలిసి వైగో, తిరుమావళవన్ కట్ చేశారు. తమ స్నేహాన్ని చాటుకునే రీతిలో కేక్ కత్తిరింపు సాగింది. తదుపరి పార్టీ కార్యాలయంలో నేతలందరూ కాసేపు సమాలోచన అయ్యారు. అనంతరం వెలుపలకు వస్తూ, మీడియాతో వైగో మాట్లాడుతూ మక్కల్ ఇయక్కంలో ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ ఉన్నాయని, ఈ నాలుగు పార్టీలు కలిసి స్థానిక ఎన్నికల్ని ఎదుర్కొంటాయని వ్యాఖ్యానించారు. విజయకాంత్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చామేగానీ, ఎలాంటి రాజకీయం చర్చ లేదని స్పష్టం చేశారు. ఇక, తిరుమావళవన్ మాట్లాడుతూ స్నేహ పూర్వక పలకరింపు మాత్రమేనని, స్థానిక చర్చకు ఆస్కారం లేదన్నారు. విజయకాంత్ సతీమణి, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సాగుతున్న తీరును చూస్తుంటే, అధికార పక్షం బలహీన పడ్డట్టు స్పష్టం అవుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానిక సమరం గురించి సరైన సమయంలో విజయకాంత్ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇక, విజయకాంత్‌కు టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ఇళంగోవన్ పలువురు ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. -
ఇక వదినమ్మ రాజ్యం
సాక్షి, చెన్నై: డీఎండీకేలో వదినమ్మ ప్రేమలత విజయకాంత్ ఇక పూర్తిస్థాయిలో చక్రం తిప్పబోతున్నారు. కొత్త రక్తంతో పూర్వవైభవం లక్ష్యంగా అడుగులకు సిద్ధ పడ్డ విజయకాంత్ తన సతీమణికి పార్టీలో పదవి కట్టబెట్టేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో ఇందుకు తగ్గ అధికార ప్రకటన వెలువడ బోతున్నది. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు వదినమ్మను వరించే అవకాశాలు ఉన్నట్టుగా డీఎండీకేలో చర్చ బయలుదేరడం గమనార్హం. సినీ నటుడి నుంచి రాజకీయ నేత గా ఎదిగిన విజయకాంత్‌కు వెన్నంటి ఆయన సతీమణి ప్రేమలత, బావ మరి ది సుదీష్ ఉంటూ వస్తున్నారు. సుదీష్ డీఎండీకే యువజన పగ్గాలతో ఆది నుం చి ముందుకు సాగుతూ వస్తున్నారు. పా ర్టీ ఆవిర్భావంతో డీఎండీకే వ్యవహారాలను తెర వెనుక నుంచి ప్రేమలత సా గించే వారు. 2011 ఎన్నికల్లో ఆమె పార్టీ కోసం పూర్తి స్థాయిలో తనను అంకితం చేసుకున్నారు. ఎలాంటి పదవి పార్టీలో లేకున్నా, ఆ ఎన్నికల్లో డీఎంకే పతనం లక్ష్యంగా ప్రచార బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన వాక్చాతుర్యంతో ప్రజ ల్ని ఆకర్షించారని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో డీఎండీకే ప్రధాన ప్రతి పక్షంగా అవతరించడం ప్రేమలత బాధ్యతలు పెరి గాయి. పార్టీ అనుబంధ మహిళా విభా గం కార్యదర్శి పదవితో పార్టీ వ్యవహారాల్లో ఆమె జోక్యం పెరిగిందని చెప్పవచ్చు. ఇది మరీ ఎక్కువ కావడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకేకు పెద్ద దెబ్బ తగిలేలా చేశాయి. టార్గెట్ వదినమ్మ: ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకేను తీసుకెళ్లడంలో ప్రేమలత కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు, విమర్శలు బయలు దేరాయి. వదినమ్మ తీరును ఖండిస్తూ, నిరసిస్తూ బయటకు వెళ్లిన వాళ్లు తీవ్రంగానే స్పందించారు. వాటిని ఖాతరు చేయని వదినమ్మ రాష్ట్ర వ్యాప్తం గా సుడిగాలి పర్యటనే సాగించారు. విజ యకాంత్ కేవలం బహిరంగ సభలకు పరిమితం అయితే, తానొక్కరే అన్నట్టుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రేమలత తీవ్రంగానే చక్కర్లు కొట్టారు. ఇంత వరకు సాగిన తతంగాలు ఓ ఎత్తు అయితే, ఎన్నికల అనంతరం డీఎండీకేను వీడే వారు మరీ ఎక్కువే అయ్యారు. వీళ్లు కూడా వదినమ్మను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన వాళ్లే. వదినమ్మకు పదవి: ఇన్నాళ్లు తన సతీమణికి పార్టీలో ఎలాం టి పదవి లేనందునే, విమర్శలు, ఆరోపణలు గుప్పించారని, ఇక, ఆమెను అందలం ఎక్కిస్తా చూడండి అన్నట్టు, ఉండే వాళ్లు ఉండొచ్చు, వెళ్లే వాళ్లు వెళ్లొచ్చన్న సంకేతాన్ని విజయకాంత్ జిల్లాల నేతల కు రెండు రోజుల క్రితం పంపిం చినట్టు సమాచారం. ఇప్పటికే డీఎండీకే నుంచి ముఖ్యమైన నాయకులు బయటకు వెళ్లిన దృష్ట్యా, ఇక ఉన్న వాళ్లందరూ తన అభిమానులేనని, వీరి ద్వారా సరికొత్త రక్తాన్ని నింపి, బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతానన్న ధీమాను విజయకాంత్ తన సంకేతంతో నేతల్లోకి పంపించి ఉండడం గమనార్హం. సరికొత్త అడుగులతో ముందుకు సాగి పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉందని, స్థానిక సమరంతో సత్తా ను చాటుకోవాల్సి ఉన్నందున, పార్టీలో వదినమ్మకు పదవిని అప్పగించే విధం గా జిల్లాల్లో తీర్మానాలు చేసి రాష్ర్ట కమిటీకి పంపించాలని సూచించి ఉండటం ఆలోచించదగ్గ విషయమే. తానేదో స్వ యంగా వదినమ్మకు పదవి కట్టబెట్టినట్టుగా కాకుండా, జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అందలం ఎక్కించినట్టు చెప్పుకునేందుకే అన్నయ్య తన సంకేతా న్ని పంపించినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాల కమిటీల సమావేశాల్లో తీసుకునే తీర్మానం మేరకు త్వరలో రాష్ట్ర కమిటీ ఆమోదించి వదినమ్మకు పార్టీలో పదవి కట్టబెట్టడం ఖాయం అంటున్నారు. వదినమ్మకు పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు అప్పగించేందుకు అవకాశాలు ఉన్నాయ ని, ఆ పదవికి ఆమె అన్ని రకాలుగా అర్హురాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. విజయకాంత్ సంకేతం అలా పంపించారో లేదో, ఇలా కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం జిల్లాల నేతలు ఇందుకు తామూ ఒకే అన్నట్టుగా తమ అన్నయ్యకు లేఖల్ని పంపించి ఉండడం విశేషం. విజయకాంత్ ఆరోగ్య పరంగా సమస్యల్ని ఎదుర్కొంటున్న దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్యటనలు సాగించడం కష్టతరమే. ఇందుకు నిదర్శనం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం బహిరంగ సభలకే ఆయన పరిమితం కావడమే. ఈ దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, కేడర్‌లో ఉత్సాహం నింపడం, పూర్వ వైభం లక్ష్యంగా ముందుకు సాగాలంటే, వదినమ్మకు తగిన బాధ్యతలు తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తించే తమ అన్నయ్య పదవీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీఎండీకే నాయకుడు ఒకరు పేర్కొనడం గమనార్హం. వదినమ్మ చేతికి పదవి దక్కిన పక్షంలో, ఇక డీఎండీకేలో ఆమె పూర్తిస్థాయిలో చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువే. ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు, పరిణామాలకు దారి తీస్తాయో అన్నది వేచి చూడాల్సిందే. -
సుప్రీంకు అన్న, వదిన..
వారెంట్ రద్దుకు పిటిషన్ విల్లుపురం కోర్టు సమన్లు సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతల, ఆ పార్టీ వర్గాల మీదున్న పరువు నష్టం దావాల విచారణల వేగం పెరిగింది. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసి ఉంటే, విల్లుపురం కోర్టు బుధవారం సమన్లు జారీ చేయడం గమనార్హం. సీఎం జయలలితకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు, ఆధార రహిత ఆరోపణలు గుప్పించే వారిపై పరువు నష్టం దావాల మోత రాష్ట్రంలో మోగడం జరుగుతున్నది. ఆ దిశగా డీఎండీకే అధినేత విజయకాంత్‌పై అనేకానేక పిటిషన్లు జిల్లాల వారీగా దాఖలై ఉన్నాయి. పిటిషన్ల విచారణల్లో భాగంగా కోర్టు మెట్లు ఎక్కకుండా డుమ్మాలు కొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్ కోర్టు డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బుధవారం విల్లుపురం కోర్టు సమన్లు జారీ చేయడం గమనార్హం. మరో కేసు నిమిత్తం కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉండగా, డుమ్మా కొట్టారు. ఎక్కడ తిరుప్పూర్ కోర్టు తరహాలో విల్లుపురం కోర్టు సైతం పీటీ వారెంట్ జారీ చేస్తుందోనన్న ఆందోళనతో విజయకాంత్, ప్రేమలత తరఫున న్యాయవాదులు మేల్కొన్నారు. ఆ ఇద్దరు కోర్టుకు హాజరు కాలేని పరిస్థితులను వివరించడంతో న్యాయమూర్తి సరోజిని దేవి ఏకీభవించారు. ఆగస్టు తొమ్మిదో తేదీకి విచారణ వా యిదా వేస్తూ, ఆ రోజున తప్పని సరిగా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. విల్లుపురం కోర్టు సమన్లతో తప్పించుకున్నా, తిరుప్పూర్ కోర్టు వారెంట్‌తో ఎక్కడ అరెస్టు కావాల్సి వస్తుందోనన్న బెంగ తో విజయకాంత్, ఆయన సతీమణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఇద్దరి తరఫున న్యాయవాది మణి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్‌ను రద్దు చేయాలని విన్నవించారు. -
అన్న, వదినమ్మకు వారెంట్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు తిరుప్పూర్ కోర్టు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలన్న ఈ వారెంట్‌తో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆధార రహిత ఆరోపణలు గుప్పించినా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ఇందుకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పరువు నష్టం దావాల్ని కోర్టుల్లో కోకొల్లలుగా దాఖలు చేశారు. ఇందులో భాగంగా గతంలో తిరుప్పూర్ జిల్లా పల్లడంలో జరిగిన బహిరంగ సభలో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత సీఎం జయలలితను టార్గెట్ చేసి తీవ్రంగానే విరుచుకు పడ్డారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది సుబ్రమణియన్ తిరుప్పూర్ మొదటి మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో సీఎంకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు గుప్పించిన విజయకాంత్, ప్రేమలతలపై చర్యకు కోర్టును విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి అలమేలు నటరాజన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఆ సమన్లను ఆ ఇద్దరూ ఖాతరు చేయలేదు. మంగళవారం కోర్టుమెట్లు ఎక్కాల్సిన ఆ ఇద్దరు డుమ్మా కొట్టారు. దీంతో న్యాయమూర్తికి ఆగ్రహం వచ్చినట్టుంది. ఆ ఇద్దర్నీ కోర్టులో హాజరు పరచాలని పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ జారీతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. అసలే రోజుకో రూపంలో సమస్యలు తమ అన్న, వదినమ్మలను చుట్టుముట్టుతున్న సమయంలో ఈ వారెంట్ ఏమిటో అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు రాష్ర్టంలో తమకు వ్యతిరేకంగా ఉన్న దృష్ట్యా, పోలీసులు అరెస్టు చేసినా చేస్తారేమో అన్న ఉత్కంఠకు గురి అవుతున్నారు. ఇది వరకు విజయకాంత్, ప్రేమలతల మీద వేర్వేరుగా కోర్టుల్లో పరువు నష్టం దావాలు విచారణలో ఉన్నాయి. అయితే, తిరుప్పూర్ కోర్టులో మాత్రం ఇద్దరి మీద ఒకే కేసు విచారణలో ఉన్నది. -
ఎదురుదాడి!
అసంతృప్త వాదుల ఆరోపణలకు చెక్ పెట్టే రీతిలో ఎదురు దాడికి డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి. డీఎండీకే ట్రస్టుకు రూ.500 కోట్లు విరాళాల రూపంలో వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయా? ఉంటే కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధం అని ఆ పార్టీ కోశాధికారి కేఆర్ ఇలంగోవన్ సవాల్ చేశారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతు, ఓటు బ్యాంక్ పతనం వెరసి డీఎండీకేను పీకల్లోతు కష్టాల్లో ముంచింది. ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు బయలు దేరాయి. పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ మీద అసంతృప్తి, అసహనంతో బయటకు వచ్చిన ముఖ్య నేతలందరూ డీఎంకే తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న విజయకాంత్ మీద తీవ్ర ఆరోపణలు సంధించే పనిలో పడ్డారు. డీఎండీకే ట్రస్టులో ఉన్న రూ.ఐదు వందలు మింగేశారని, డీఎంకే చేతికి అధికారం దక్కకుండా చేయడం లక్ష్యంగా ప్రజా సంక్షేమ కూటమిలోకి వెళ్లినందుకు అన్నాడీఎంకే రూ.750 కోట్లు అప్పగించినట్టుగా తీవ్ర ఆరోపణలు చేయడం మొదలెట్టారు. ఇది కాస్త విజయకాంత్‌ను, ఆయన వెన్నంటి ఉన్న మరి కొందరు నేతల్లో తీవ్ర ఆవేదనను రేకెత్తించిన ట్టు సమాచారం. దీంతో పార్టీ నుంచి బయటకు వెళ్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించే వారిపై ఎదురుదాడికి డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి. పార్టీని అడ్డం పెట్టుకుని బయటకు వెళ్లిన ఆయా నేతలు గతంలో ఏ మేరకు సంపాదించారో ఆ వివరాల్ని సేకరించడం, వారి పనితీరును టార్గెట్ చేసి తీవ్రంగా స్పందించేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం డీఎండీకే కోశాధికారి కేఆర్ ఇలంగోవన్ పేర్కొంటూ విజయకాంత్, పార్టీ మీద ఆధార రహిత ఆరోపణలు చేస్తూ ఉంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఎంకే ఇచ్చిన స్క్రిప్ట్‌తో డీఎండీకే మీద దుమ్మెత్తి పోయడం ఇకనైనా మానుకోవాలని, లేని పక్షంలో బయటకు వెళ్లిన వారందరి బండారం చిట్టా విప్పాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. విరాళాల రూపంలో డీఎండీకే ట్రస్టుకు రూ. ఐదు వందల కోట్లు వచ్చినట్టు, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పార్టీ, ట్రస్టు వ్యవహారాల లెక్కలు వివరాలు ఆదాయపన్ను, ఎన్నికల కమిషన్, పార్టీ సర్వసభ్య సమావేశం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నట్టు పేర్కొన్నారు. చౌక బారు విమర్శలు, ఆరోపణలు గుప్పించే ఈ నాయకులు పార్టీని అడ్డం పెట్టుకుని ఏ మేరకు సంపాదించారో? బయట పెట్టాలా..? అని మండి పడ్డారు. విజయకాంత్ మీదగానీ, పార్టీ మీదగానీ నిందలు వేస్తూ ఉంటే, కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ట్రస్టు నిధుల వ్యవహారంగా శ్వేత పత్రానికి సిద్ధమంటూ, కోర్టులోనూ తేల్చుకునేందుకు రెడీ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
శశికళ ద్వారా కెప్టెన్‌కు రూ.750 కోట్లు
సాక్షి, చెన్నై : ప్రజా సంక్షేమ కూటమితో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్న డీఎండీకే అధినేత విజయకాంత్‌కు అన్నాడీఎంకే తరఫున భారీ కానుక ముట్టినట్టు మాజీలు ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ద్వారా రూ.750 కోట్లు కెప్టెన్ ఖాతాలోకి చేరినట్టుగా ఆరోపణలు గుప్పిస్తూ, డీఎండీకే ట్రస్టులో మాయమైన రూ. ఐదు వందల కోట్ల వ్యవహారం కోర్టులో తేల్చుకుంటామని ప్రకటించారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కింగ్ కావాలన్న ఆశతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కూటమితో కలిసి ఎదుర్కొన్నారు. ఈ కూటమి అన్నాడీఎంకే షాడోగా, ఇందుకుగాను కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగోకు రూ. 1,500 కోట్లు అన్నాడీఎంకే ముట్టచెప్పినట్టు ఆరోపణలు ఎన్నికల సమయంలో గుప్పుమన్నాయి. అదే సమయంలో ఆ కూటమితో పొత్తు వద్దే వద్దంటూ డీఎండీకే ముఖ్య నేతలు తమ కెప్టెన్‌కు సూచించి, చివరకు టాటా చెప్పారు. ఆ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, ఇక డీఎండీకే పాతాళంలోకి చేరినట్టే అన్నట్టుగా ఫలితాలు వెలువడ్డాయి. ఈ ప్రభావం తో డీఎండీకేను వీడి డీఎంకే, అన్నాడీఎంకే గూటికి చేరే వారి సంఖ్య పెరిగి ఉన్నది. అత్యధిక శాతం మంది డీఎంకేలోకి వస్తున్నారని చెప్పవచ్చు. అలాగే, డీఎండీకేను చీల్చి మక్కల్ డీఎండీకేను ఏర్పాటు చేసుకుని డీఎంకేలోకి విలీనానికి సిద్ధం అవుతున్న మాజీలు తమ కెప్టెన్ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డీఎండీకే ట్రస్టులో ఉన్న రూ. ఐదు వందల కోట్లను విజయకాంత్ కుటుంబం మింగేసిందంటూ డీఎండీకే మాజీలు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. తాజాగా, అన్నాడీఎంకే నుంచి విజయకాంత్‌కు ఇటీవల భారీ కానుక ముట్టినట్టుగా ఆరోపణలు అందుకోవడం గమనార్హం. రూ.750 కోట్లు : డీఎంకే చేతికి అధికారం చిక్కకుండా చేయడం లక్ష్యంగా ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమిలో ఏమి ఏరుగని అమాయకుడిగా వ్యవహరించిన విజయకాంత్ నిజ స్వరూపం తాజాగా బయట పడిందని మక్కల్ డీఎండీకే నేత ఆరోపించే పనిలోపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మక్కల్ డీఎండీకే నేత చంద్రకుమార్ నేతృత్వంలో సేలం వేదికగా బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ముఖ్య నేత పార్తీబన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకేకు వ్యతిరేకం..వ్యతిరేకం అంటూ , చివరకు ఆ పార్టీకి అధికార పగ్గాలు అప్పగించడంలో విజయకాంత్ కూడా కీలక భూమిక పోషించి ఉన్నారని ఆరోపించారు. పేదరిక నిర్మూలన, అవినీతి నిర్మూలన అని వ్యాఖ్యలు చేసిన విజయకాంత్‌కు అవినీతి సొమ్ము కోట్లల్లో ముట్టి ఉన్నదని ఆరోపణలు గుప్పించారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి రావడం లక్ష్యంగా చేసుకున్న లోపాయికారి ఒప్పందానికి తగ్గ కానుక విజయకాంత్‌కు ఇటీవల లభించినట్టు పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలిత నెచ్చెలి శశికళ ద్వారా రూ. 750 కోట్లు విజయకాంత్ గుప్పెట్లోకి చేరి ఉన్నదని ఆరోపించారు. అవినీతి గురించి డైలాగులు వళ్లించే విజయకాంత్ సినిమాల్లోనే హీరో అని, వాస్తవిక జీవితంలో విలన్‌గా మారి ఉన్నారని ధ్వజమెత్తారు. విజయకాంత్ బండారం బయట పడి ఉన్నదని, అందుకే ఆపార్టీ గుడారం ఖాళీ కానున్నదని వ్యాఖ్యానించారు. డీఎండీకే నుంచి 90 శాతం మంది బయటకు రానున్నారని, ఇందులో 70 శాతం మంది తమతో కలిసి డీఎంకేలో చేరనున్నట్టు ప్రకటించారు. సేలం వేదికగా ఈనెల 17న జరగనున్న బహిరంగ సభతో డీఎంకే దళపతి స్టాలిన్ సమక్షంలో మక్కల్ డీఎండీకేను విలీనం చేయనున్నామని ప్రకటించారు. విజయకాంత్‌కు వ్యతిరేకంగా త్వరలో కోర్టుకు వెళ్లనున్నామని, పేదల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు నుంచి మాయం చేసిన రూ. 500 కోట్లను కక్కిస్తామన్నారు. ఈట్రస్టు నుంచి ఇటీవల 1.15 కోట్లతో ఓ కారును సైతం కొనుగోలు చేసి ఉండడం బట్టి చూస్తే, విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్ ఏ మేరకు అవినీతికి పాల్పడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నాని పేర్కొన్నారు. ఆ ట్రస్టు వ్యవహారాలు, నిధులకు సంబంధించిన శ్వేత పత్రాన్ని విడుదల చేయడానికి సిద్దమా..? అని ఈ సందర్భంగా విజయకాంత్‌కు సవాల్ విసిరారు. -
మూడు లక్షల మంది పార్టీకి టాటా!
చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్‌ను అసెంబ్లీ ఎన్నికలు పీకల్లోతు కష్టాల్లో ముంచిన విషయం తెలిసిందే. పార్టీలో చీలిక, జిల్లాల కార్యదర్శులు గుడ్‌బై లేఖాస్త్రాలు, కేడర్‌లో అసంతప్తి జ్వాల వెరసి డీఎండీకే భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇప్పటికే పలువురు నాయకులు గుడ్‌బై చెప్పేయగా, ఉన్న వాళ్లను లాక్కెళ్లేందుకు మక్కల్ డీఎండీకే నేత చంద్రకుమార్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ డీఎండీకే కేడర్‌ను తన వైపునకు తిప్పుకోవడంతో తీవ్రంగానే చంద్రకుమార్ అండ్ బృందం పరుగులు తీస్తున్నది. డీఎండీకే నుంచి మూడు లక్షల మంది తమతో కలసి డీఎంకేలో చేరబోతున్నట్టు ఆదివారం చంద్రకుమార్ ప్రకటించడం గమనార్హం. దీంతో విజయకాంత్ వెన్నంటి ఎందరు ఉంటారో అన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక సమరంపై సమాలోచనకు ఆహ్వానిస్తే నేతలు పార్టీ కార్యాలయం వైపుగా తొంగిచూడక పోవడం బట్టి చూస్తే, ఇక, డీఎండీకే భవిష్యత్తు ఏమిటో అన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక బరిలో దిగాలంటే, పార్టీ నిధులు ఇవ్వాల్సిందేనని, తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో లేమంటూ పలువురు నాయకులు కరాఖండీగా విజయకాంత్ ఎదుట స్పష్టం చేశారు. పార్టీ నిధులు ఇప్పట్లో రాలే పరిస్థితిలేని దష్ట్యా, ట్రస్టు నిధుల వ్యవహారంలో ఆరోపణలు వచ్చి ఉన్న నేపథ్యంలో ఈ సారి స్థానిక సమరం తమకు అవసరమా? అన్న యోచనలో విజయకాంత్ ఉన్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. నిధులు పంపిణీ చేసినా, ఎన్నికల్లో ప్రస్తుతం తమ ఓటమి తప్పదని, అధికార బలం ముందు అభ్యర్థులు తల వంచాల్సిన పరిస్థితి తప్పదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ సారి స్థానిక ఎన్నికల్ని బహిష్కరించి, తదుపరి పార్టీ బలోపేతం దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు తగ్గ కార్యాచరణతో విజయకాంత్ ఉన్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. స్థానిక సమరం బహిష్కరణ ప్రకటనను తన జన్మదినం సందర్భంగా విజయకాంత్ చేస్తారని చెబుతున్నారు. -
ఇక ఒంటరే!
మళ్లీ పాత నినాదం కెప్టెన్ నిర్ణయం ఇలంగోవన్ వ్యాఖ్య ఆ మూడు చోట్ల బరిలో అభ్యర్థులు స్థానికంతో సత్తా చెన్నై : పార్టీ ఆవిర్భావంతో అందుకున్న నినాదాన్ని మళ్లీ తారక మంత్రంగా స్వీకరించి ప్రజల్లోకి వెళ్లేందుకు కెప్టెన్ నిర్ణయించారు. తంజావూరు, అరవకురిచ్చిలతో పాటు తిరుప్పర గుండ్రం ఉపఎన్నికలో ఒంటరిగా తమ అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ కోశాధికారి ఇలంగోవన్ స్పందించడం గమనార్హం. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తానే అంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాన ప్రతి పక్ష స్థాయికి ఎదిగిన నాయకుడు డీఎండీకే అధినేత విజయకాంత్. పార్టీ ఆవిర్భావంతో ఐదేళ్లు ఒంటరిగా పయనం సాగించి, తదుపరి అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొన్న ఎన్నికలతో ప్రజల మన్ననల్ని అందుకున్నారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పాతాళంలోకి నెట్టింది. కింగ్ కావాలన్న ఆశతో ఈ కింగ్‌మేకర్ ప్రజా సంక్షేమ కూటమికి నేతృత్వం వహించి చతికిల బడ్డారు. అడ్రస్సు గల్లంతు చేసుకుని, చేసిన తప్పునకు ఇప్పుడు పశ్చాత్తాపంలో పడ్డారని చెప్పవచ్చు. కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునేందుకు బలోపేత నినాదాన్ని అందుకున్నారు. బలోపేతం లక్ష్యంగా పార్టీ వర్గాలతో ఏకంగా పది రోజులు చర్చించి, సమీక్షించి చేసిన తప్పులు మళ్లీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారు. గతంలో ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆదరణ లభించిన దృష్ట్యా, మళ్లీ అదే నినాదంతో ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక, తాను ఒంటరి...ప్రజలతోనే పొత్తు అంటూ బయట నుంచి ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీయండి, అరవకురిచ్చి, తంజావూరు ఎన్నికలు, తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా డీఎండీకే కోశాధికారి ఏఆర్ ఇళంగోవన్ గురువారం స్పందించడం గమనార్హం. ధర్మపురిలో జరిగిన ఓ కార్యక్రమానంతరం మీడియా ప్రశ్నలకు ఇలంగోవన్ సమాధానాలు ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి రాష్ట్రంలో డీఎండీకే మాత్రమేనని, కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. స్వలాభం కోసం కొందరు పార్టీని వీడారని, నిజమైన అభిమానం పార్టీలోనే ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇక, ఏ ఎన్నికలు అయినా సరే ఒంటరిగానే ఎదుర్కొనేందుకు తమ అధినేత నిర్ణయించారని, అందుకు తగ్గ పయనం సాగనున్నదని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కొంటామని, ఇక ఏ కూటమి లేదని, అవసరం అయితే, ఎవరైనా తమ గొడుగు నీడకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఆ రెండు నియోజకవర్గాలు, తిరుప్పర గుండ్రం ఉప ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు పోటీలో ఉంటారని, ఒంటరి పయనం, ఇక ప్రజలతో తమ అధినేత కెప్టెన్ పొత్తు అంటూనే, అసెంబ్లీలో డీఎంకే అధినేత కరుణానిధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
టాటా..బైబై
ఇక ఎవరి దారి వారిదే త్వరలో కొత్త పొత్తులు వాసన్ బహిరంగ ప్రకటన తదుపరి కెప్టెన్ సమాయత్తం వీసీకే, వామపక్షాలు కూడా సంక్షేమ కూటమి శుభం కార్డు ప్రజా సంక్షేమ కూటమికి టాటా.. బైబై చెప్పేందుకు అందులోని పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. ఆ కూటమితో పొత్తు ముగిసిందంటూ తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ వ్యాఖ్యానించారు. తదుపరి ఇదే వ్యాఖ్యను అందుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. ఆయన బాటలో తలా ఓ దారి అన్నట్టుగా వీసీకే, వామపక్షాలు నడిచేందుకు నిర్ణయించాయి. ఈ దృష్ట్యా, ఇక ప్రజా సంక్షేమ కూటమి అడ్రస్సు గల్లంతైనట్టే. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామే అని జబ్బలు చరిచిన డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమికి ఫలితాలు చెంప పెట్టే. ఈ కూటమిలోని డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్, సీపీఎం, సీపీఐల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అందరి కన్నా,ఈ ఎన్నికల్లో భారీ నష్టాన్ని డీఎండీకే, సీపీఎం, సీపీఐలు చవిచూశాయి. ఇక, కాంగ్రెస్‌ను వీడి తమిళ మానిల కాంగ్రెస్‌కు పునర్ జీవం పోసిన సీకే వాసన్‌కు తొలి ఎన్నికలే పెద్ద షాక్. డీఎంకే గొడుగు నీడన రాజకీయ పయనం సాగించి ప్రజా సంక్షేమ కూటమిలోకి చేరిన వీసీకేకు కోలుకోలేని దెబ్బ తప్పలేదు. ఇక, ఎండీఎంకే అంటారా..?. గత ఎన్నికల్ని బహిష్కరించిన ఆ పార్టీకి, తాజా ఫలితాల ఓ లెక్కే కాదు. ఎన్నికల అనంతరం ఆ కూటమిలో బీటలు వారినట్టే అన్న ప్రచారం బయలు దేరింది. అయితే, కూటమి కన్వీనర్ ఎండీఎంకే నేత వైగో మాత్రం తమ కూటమిలో చీలికకు అవకాశం లేదని, ప్రజల కోసం ఒకే గళం, ఒకే నినాదంతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ కూటమికి టాటా..బైబై అని స్పందించడంతో అదే నినాదంతో ముందుకు వెళ్లేందుకు మిగిలిన పార్టీలు సిద్ధమయ్యాయి. టాటా.. బైబై : చెన్నైలో పార్టీ ముఖ్య నాయకులు, జిల్లాల నేతలతో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ సమాలోచించారు. ఇందులో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక టాటా గుడ్ బై అంటూ ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఆ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వరకు మాత్రమేనని ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాసన్ వ్యాఖ్యానించారు. అందుకే ఎన్నికల సమయంలో తమ కంటూ ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించామని గుర్తు చేశారు. ఆ కూటమి ఆ ఎన్నికలతో ముగిసిందని, ఇక తమ పయనం బలోపేతం అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్టు వివరించారు. స్థానిక ఎన్నికల్లో తమ బలాన్ని చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్నది తేల్చుతామని వ్యాఖ్యానించారు. సందర్భానుచితంగా, సమయానుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కొత్త పొత్తు ప్రయత్నాలు ఉంటాయని చెప్పారు. కెప్టెన్ కూడా : వాసన్ అధికారికంగా ప్రకటించి కూటమి నుంచి బయటకు వెళ్లడంతో ఆ బాటను అనుసరించేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. పార్టీ నేతలతో సమీక్షను ముగించిన విజయకాంత్ ఇక, భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నామన్న అధికారిక ప్రకటనను ఒకటి రెండు రోజుల్లో విజయకాంత్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో సమీక్షల సమయంలో నాయకుల అభిప్రాయాల్ని విన్న విజయకాంత్, వారి అభిష్టానికి అనుగుణంగా నడచుకునే విధంగా వ్యవహరించడమే కాకుం డా, కొన్ని సందర్భాల్లో తిరగబడే విధంగా వ్యాఖ్యల్ని సంధించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన నాయకులకు దూకుడుకు కల్లెం వేసే రీతిలో అవసరం అయితే, పార్టీని రద్దు చేయడం, లేదా మరో పార్టీలోకి విలీనం చేయడానికి తాను వెనుకాడబోనంటూ విజయకాంత్ హెచ్చరించి ఉండటం గమనించాల్సిన విషయమే. ఇక, ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమీ లేని దృష్ట్యా, మళ్లీ డీఎంకేకు దగ్గరయ్యే విధంగా వీసీకే నేత తిరుమా ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే రీతిలో డీఎంకే అధినేత కరుణానిధికి అనుకూల వ్యాఖ్యల్ని అందుకుని ఉండటం ఆలోచించాల్సిందే. అదే విధంగా వామపక్షాలు సైతం కూటమి నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వామపక్షాలు మాత్రమే ఇక కలిసి నడిచే రీతిలో కార్యాచరణను సీపీఎం, సీపీఐ వర్గాలు సిద్ధం చేసి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. స్థానిక ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు కలిసి కట్టుగా సాగితే, తమకు పట్టున్నచోట్ల గెలుపు బావుటాకు మార్గం సుగమం అవుతుందన్న ధీమాతో ఆ పార్టీల వర్గాలు ఉండడం విశేషం. -
కెప్టెన్ కసరత్తు
రాష్ర్ట పర్యటనకు నిర్ణయం బలోపేతం లక్ష్యంగా పయనం సాక్షి, చెన్నై: చతికిలపడ్డ డీఎండీకేను బలోపేతం చేయడం లక్ష్యంగా ఆ పార్టీ అధినేత విజయకాంత్ కసరత్తుల్లో పడ్డారు. పార్టీల నేతలతో సమీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20 వరకు ఈ సమీక్షలు సాగనున్నాయి. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బలోపేతం లక్ష్యంగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే రీతిలో ఈ పర్యటనకు చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తానే అన్నంతగా ఎదిగిన నేత విజయకాంత్. డీఎండీకే ఆవి ర్భావంతో సత్తా చాటి, ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించి చివరకు చతికిలబడ్డారు. ఎంత వేగంగా ఎదిగారో, అంతే వేగం గా పాతాళంలోకి నెట్టబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా ఉండి ఉంటే, కెప్టెన్‌ను ప్రజలు ఆదరించి ఉంటారేమో. కింగ్ అంటూ ముందుకు సాగి ఆరుగురితో కలసి డీఎంకే, అన్నాడీఎంకే అనే ఇద్దర్ని వేర్వేరుగా ఢీ కొట్టి చివరకు అడ్రస్సు గల్లంతు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయకాంత్ చరిష్మా అంటే ఇది అని చెప్పుకున్న వాళ్లంతా, ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు సంధించే పనిలో పడ్డారు. డిపాజిట్లు గల్లంతై, ఓటు బ్యాంక్ కోల్పోయి దీనావస్థలో ఉన్న పార్టీకి కొత్త ఉత్సాహం నింపడం ఇప్పుడు విజయకాంత్ ముందు ఉన్న పెద్ద సవాల్. కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకోవడం లక్ష్యంగా తీవ్ర కసరత్తులకు సిద్ధం అయ్యారు. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల, యూనియన్, నియోజకవర్గ స్థాయిల్లోని నేతలతో సమీక్షించి, మళ్లీ బలనిరూపణ లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తీరుపై సమీక్షించే పనిలో పడ్డారు. ఆ మేరకు సమీక్షలకు సోమవారం శ్రీకారం చుట్టారు. చెన్నై కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో తొలి రోజు చెన్నై, తిరువళ్లూరు జిల్లాల నేతలతో సమీక్షించారు. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ప్రస్తుతం పార్టీ పరిస్థితి, వెన్నంటి ఉన్న కేడర్, నాయకుల వివరాలను సేకరించారు. పార్టీలో ప్రక్షాళన పర్వంతో ముందుకు సాగితే, కొత్త రక్తం నింపినట్టు అవుతుందన్న అంశాన్ని నాయకుల ముందు ఉంచి వారి అభిప్రాయాల్ని సేకరించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని, అధికార పూర్వకంగా ప్రజా సంక్షేమ కూటమికి టాటా చెప్పే ప్రకటన విడుదల చేయాలని విజయకాంత్‌ను నాయకులు పట్టుబట్టి ఉన్నారు. ఇందుకు సానుకూలంగానే విజయకాంత్ స్పందించినట్టు, ఆ కూటమితో పని లేకుండా, పార్టీ బలం పెంపు లక్ష్యంగా ముందుకు సాగుదామని నేతలకు సూచించి ఉన్నారు. ఈ సమీక్షలు 20వ తేదీ వరకు సాగించే రీతిలో నిర్ణయం తీసుకుని ఉన్నారు. మంగళవారం తిరువణ్ణామలై, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా విజయకాంత్ పర్యటన సాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో రోజుకు ఒక జిల్లా చొప్పున ఎంపిక చేసుకుని, మూడు నాలుగు ప్రధాన నియోజకవర్గ కేంద్రాల్లో సంక్షేమ సామగ్రి పంపిణీ, బహిరంగ సభలతో బలాన్ని చాటుకోవడం, ఢీలా పడ్డ కేడర్‌లో ఉత్సాహం నింపడం లక్ష్యంగా విజయకాంత్ పర్యటన సిద్ధం అవుతోన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మూడు గుడ్‌బైలు
వైదొలగాలని డీఎండీకే, తమాకా, వీసీకే నిర్ణయం వాసన్, విజయకాంత్, తిరుమా వెల్లడి అసెంబ్లీ ఎన్నికల సమయంలోఎన్నో ఆశలతో ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమి సంక్షోభంలో పడిపోయింది. ఎన్నికలు ముగిసి ముప్పైరోజులు కూడా కాకుండానే మూడు పార్టీలు కూటమికి గుడ్‌బై చెప్పేశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోగా డీఎంకే, అన్నాడీఎంకేలే ప్రభుత్వ పగ్గాల కోసం పోటీపడుతున్నాయి. సుమారు ఐదు దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలదే పెత్తనంగా మారింది. మూడో అతిపెద్ద పార్టీగా పుట్టుకొచ్చిన డీఎండీకే ఒంటరిగా తన సత్తాను చాటలేక చతికిలబడింది. డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి గండికొట్టడమే లక్ష్యంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజాసంక్షేమ కూటమి ఆవిర్భవించింది. కూటమి ఏర్పాటుకు మూలకర్తై ఎండీఎంకే అధినేత వైగో అనేక పార్టీలను కూటమిలో చేర్చే బాధ్యతలను చేపట్టారు. వీసీకే, వామపక్షాలు కూటమిలో చేరిపోయాయి. ఆ తరువాత డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ డీఎంకే కూటమివైపు మొగ్గుచూపుతూనే సంక్షేమ కూటమిలో చేరిపోయారు. అన్నాడీఎంకేతో పొత్తు కోసం పాకులాడిన తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్ సైతం గత్యంతరం లేక సంక్షేమ కూటమి తీర్థం పుచ్చుకున్నారు. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్‌ను రంగంలోకి దించారు. అత్యధిక పార్టీలు కలిగిన కూటమిగా తాము అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం చేసుకున్నారు. తీరా ఓట్ల లెక్కింపు రోజున వెల్లడైన ఫలితాల్లో సంక్షేమ కూటమికి శృంగభంగమే మిగిలింది. సంక్షేమ కూటమి నుంచి పోటీ చేసిన 234 మంది అభ్యర్థుల్లో ఒక్కరూ గెలవలేదు. కూటమిలోని వివిధ పార్టీ అధ్యక్షులు ఘోరపరాజయం పాలైనారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ ఏకంగా డిపాజిట్టునే కోల్పోయారు. కనీస శాతం ఓట్లు కూడా సాధించలేకపోయిన కూటమిలోని పార్టీలు చివరకు ఎన్నికల కమిషన్ గుర్తింపునే కోల్పోయే దుస్థితికి చేరుకున్నాయి. కూటమి ఓటమితో పార్టీ నేతలు పోస్టుమార్టం చేసుకున్నారు. ఓటమిపై ఒకరికొకరు నిందించుకున్నారు. కూటమి నుంచి వైదొలగాలంటూ ఆయా పార్టీ నేతలపై ఒత్తిళ్లు పెరిగాయి. ఇదిలా ఉండగా, కూటమి నుంచి డీఎండీకే, తమాకా వెళ్లిపోయినా నష్టం లేదంటూ ఇటీవల జరిగిన ఎండీఎంకే నిర్వాహకుల సమావేశంలో వైగో వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని వైగో కూడా ఖండించలేదు. కూటమికి బై: జీకే వాసన్ సంక్షేమ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ సోమవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మూడు దశలుగా పార్టీ సమావేశమైందని తెలిపారు. సోమవారం రాష్ట్రస్థాయి నిర్వాహకులతో సమావేశం అయ్యామని చెప్పారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి విశ్లేషించుకున్నామని అన్నారు. ఈ నెల 11వ తేదీన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తామని తెలిపారు. సంక్షేమ కూటమి నుంచి వైదొలగాలన్న నేతల అభిప్రాయంతో ఏకభవిస్తూ కార్యవర్గ సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నట్లు వాసన్ నర్మగర్భంగా తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలు సైతం కూటమికి గుడ్‌బై చెప్పనున్నట్లు స్పష్టం చేశారు. విజయకాంత్ సిద్ధం సంక్షేమ కూటమి నుంచి వైదొలిగితేనే డీఎండీకే నిలబడుతుందనే స్థాయిలో ఒత్తిళ్లను విజయకాంత్ ఎదుర్కొంటున్నారు. ఓటమి కారణాలపై పార్టీ సమావేశంలో పోస్టుమార్టం నిర్వహించగా అందరూ సంక్షేమ కూటమినే నిందించారు. ఎన్నికల బూత్ నిర్వహణకు ఏజెంట్లకు కూటమి నుంచి కనీస ఆర్థిక సాయం అందలేదని, ఉన్న ఆస్తులను పణంగాపెట్టి నడిరోడ్డులో నిలుచున్నామని ఆవేదన వ్యక్తం చేయడంతో ఒక్కో అభ్యర్థికి రూ.10 లక్షలు చెల్లించాలని విజయకాంత్ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా డీఎండీకే నుంచి వేరుపడిన మక్కల్ డీఎండీకే పెట్టుకున్న నేతలు మరింత మందిని తమవైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దుష్పరిణామాల నుంచి బైటపడేందుకు కూటమి నుంచి వీలైనంత త్వరగా బైటపడాలని విజయకాంత్ నిర్ణయించకున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేత సోమవారం తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో విజయకాంత్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని ఆయన చెప్పారు. ‘స్థానికం’లో ఒంటరి పోరు: తిరుమా రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సంక్షేమ కూటమి అవసరం ఎంతమాత్రం లేదని, ఒంటరిగా బరిలోకి దిగుతామని వీసీకే అధినేత తిరుమావళవన్ సోమవారం ప్రకటించారు. సంక్షేమ కూటమితో తెగదెంపులకు సిద్ధం అవుతున్నామని అన్నారు. తాను పోటీ చేసిన కాట్టుమన్నార్ కోవిల్లో ఓట్లను మరోసారి లెక్కించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. -
తప్పులు గుర్తించే పనిలో..
ఘోర పరాజయం డీఎండీకేను డీలా పడేలా చేసింది. డిపాజిట్ల గల్లంతుతో పాటుగా ఓటు బ్యాంక్ పతనం కావడంతో భవిష్యత్తు కార్యచరణపై విజయకాంత్ దృష్టి పెట్టారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాల కార్యదర్శులతో సమాలోచనలో మునిగారు. ప్రజా సంక్షేమ కూటమితో పొత్తే పార్టీ కొంప ముంచిందని పలువురు జిల్లా కార్యదర్శులు విజయకాంత్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ సైతం తప్పులను గుర్తించే పనిలో పడింది. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలి సిందే. ఇందులో డీఎండీకేకు అత్యధికంగా నష్టం జరిగి ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో ఉన్న పార్టీ, ఇప్పుడు చతికిల పడింది. 5.4 శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. విజయకాంత్ సైతం ముఫ్పై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సినంతగా డీఎండీకే దిగజారింది. విజయకాంత్‌కు తీవ్ర నష్టం ఏర్పడిందన్న విషయం కూటమిలోని మిత్రులందరికీ తెలుసు. అందుకే ఆయన్ను ఓదార్చే రీతిలో కూటమిలోని ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లు రెండు రోజుల క్రితం విజయకాంత్‌తో సమాలోచించారు. ఈ సమాలోచనతో విజయకాంత్ మినహా తక్కిన నేతలు మీడియా ముందుకు వచ్చి తమ కూటమి కొనసాగుతుందని ప్రకటించి వెళ్లారు. అయితే, నష్టం ఎక్కడి నుంచి తమకు ఎదురైందో అన్వేషించి, భవిష్యత్తును మళ్లీ పునర్ నిర్మించుకునేందుకు విజయకాంత్ సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటుగా రాష్ట్రంలోని పార్టీ జిల్లాల కార్యదర్శులు ముఖ్య నాయకులతో సమాలోచనకు నిర్ణయించారు. ఆ మేరకు కోయంబేడులో జరిగిన సమాలోచనకు ఉదయం పలువురు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. పొత్తే కొంప ముంచింది: కోయంబేడులో విజయకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ సమాలోచనలో పలువురు నేతలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో కలిసి వెళ్లడం వల్లే పార్టీ పతనం కావాల్సి వచ్చిందని, ఇది కొనసాగితే, ఇక కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికను చేసినట్టు సమాచారం. ఇకనైనా వ్యూహాత్మకంగా వ్యవహరించడం, అదును చూసి అడుగులు వేసి బలోపేతం చేసుకోవాలని లేనిపక్షంలో కేడర్ చేజారే ప్రమాదం ఉందని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఎన్నికల గుర్తింపు రద్దు, ఢంకా చిహ్నం దూరం కాబోతున్న విషయంగా విజయకాంత్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఆ ఎన్నికల్లో గెలుపుతో మళ్లీ బలాన్ని చాటుకుందామన్న భరోసాను కేడర్‌కు ఇచ్చే విధంగా పలు సూచనలు , సలహాల్ని జిల్లాల కార్యదర్శులకు విజయకాంత్ ఇచ్చి ఉన్నారు. ఇక, విజయకాంత్ బాటలోనే ఎండీఎంకే నేత వైగో ఓటమిపై నేతలతో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఒకటో తేదిన చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఈ సమాలోచనా సమావేశం సాగనున్నది. ఇక, రాష్ట్రంలో ఓటమి చవి చూసినా, ఓటు బ్యాంక్ ఊరట నివ్వడంతో తదుపరి అడుగులు దిశగా పీఎంకే సిద్ధం అయింది. ఇందు కోసం కేడర్‌తో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఓటమి చవిచూసిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం పీఎంకే అధినేత రాందాసు, ఎంపీ అన్భుమణి రాందాసు, పార్టీ అధ్యక్షుడు జికే మణిలు సమాలోచనా సమావేశానికి నిర్ణయించారు. కమలనాథుల మంతనాలు : ఇక ఐదుసీట్లు గ్యారంటీ అని ఢిల్లీకి నివేదిక పంపించి చివరకు ఒక్కటి కూడా దక్కక నిరాశలో పడ్డ కమలనాథులు సైతం మంతనాల్లో మునిగారు. నాలుగు చోట్ల రెండో స్థానం దక్కినా, మిగిలిన అన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతు కావడంతో ఓటమి కారణాలపై సోమవారం సమీక్షించారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సంతోష్ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, నేతలు ఇలగణేషన్, వానతీ శ్రీనివాసన్, హెచ్ రాజా తదితరులతో కూడిన కమిటీ సమాలోచించి ఓటమి కారణాలను ఆరా తీసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు తగ్గట్టుగా బలాన్ని పెంచుకునే విధంగా కార్యచరణను సిద్ధం చేశారు. ఈసమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీలోని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించేందుకు నిర్ణయించారు. -
మళ్లీ తెరపైకి కెప్టెన్
చిత్ర పరిశ్రమలోనే కాదు రాజకీయాల్లోనూ కెప్టెన్‌గా పేరుగాంచిన నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటనపై దృష్టి సారించారు. ఇంతకు ముందు చిత్రపరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా రాణించిన విజయకాంత్ నడిగర్‌సంఘం అధ్యక్షుడిగా కొంత కాలం బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత రాజకీయరంగప్రవేశం చేసి డీఎండీకే పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. 2011 శాసనసభ ఎన్నికల్లో 29 నియోజక వర్గాల్లో తన అభ్యర్థులను గెలిపించుకుని ప్రతి పక్ష నేత స్థాయికి ఎదిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కింగ్‌మేకర్‌ను కాదు ఏకంగా కింగ్‌నే అవతానని ఆశించారు. అయితే సరైన ప్రణాళిక లేకుండా ఎన్నికల బరిలోకి దిగిన విజయకాంత్ పార్టీ ఫలితాల్లో బొక్కబోర్లాపడింది. కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడమే కాకుండా డిపాజిట్లనే కోల్పోయి ఇప్పుడు పార్టీ గుర్తింపునకే ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత విజయకాంత్ తన దృష్టిని నటనపై సారించారు. ఆయన చివరిగా తన కొడుకు షణ్ముగపాండియన్ను హీరోగా పరిచయం చేసిన సహాబ్ధం చిత్రంలో అతిథి పాత్రలో నటించారు.ఆ తరువాత ఎన్నికలకు రెండు నెలల ముందు తన కొడుకుతో కలిసి తమిళన్ ఎండ్రు సొల్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఆ చిత్రం 10 రోజులు షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత ఎన్నికలు దగ్గర పడడంతో దాన్ని పక్కన పెట్టి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ తుడుచుకుపోవడంతో ఇప్పుడు తమిళన్ ఎండ్రు సొల్ చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ మన విజయం మరికొంత ఆలస్యం అవుతోంది. ధైర్యాన్ని కోల్పోవద్దు. మనం అధికారాన్ని చేపడతాం. ప్రస్తుతం తాను తమిళన్ ఎండ్రు సొల్ చిత్రంపై దృష్టి సారిస్తున్నాను అంటూ ఆ చిత్ర ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో విజయకాంత్ రచయితగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ కాంత్ కు డిపాజిట్ గల్లంతు
కింగ్ మేకర్ అవుతారనుకున్న 'కెప్టెన్' కుదేలయ్యారు. 'అమ్మ' హవాకు కొట్టుకుపోయారు. డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమి(పీబ్ల్యూఎఫ్)తో జట్టుకట్టిన విజయ్ కాంత్ చివరకు బోర్లా పడ్డారు. పీబ్ల్యూఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన డీఎండీకే అధినేత తన సీటు కూడా కాపాడులేకపోరు. అన్నాడీఎంకే చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ డిపాజిట్ కూడా కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. 2011లో రిషివాందియమ్, 2006లో విరుదాచలం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మూడో పర్యాయం ఎన్నికల్లో భంగపాటుకు గురయ్యారు. 2006 ఎన్నికల్లో డీఎండీకే కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 10 శాతం ఓట్లు దక్కించుకున్నారు. 2011లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 29 సీట్లు గెల్చుకున్నారు. జయలలితతో విభేదాలు కారణంగా అన్నాడీఎంకే గుడ్ బై చెప్పారు. తాజా ఎన్నికల్లో ఆయనతో జట్టు కట్టేందుకు డీఎంకే ప్రయత్నించినా ఫలించలేదు. తానే సీఎం కావాలన్న మొండి పట్టుదలతో కరుణానిధితో పొత్తు పెట్టుకునేందుకు ఆయన ఒప్పుకోలేదు. నాలుగు పార్టీలతో ఏర్పడిన పీబ్ల్యూఎఫ్ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు అంగీకరించడంతో ఆ కూటమిలో చేరారు. అయితే ఈ సంకీర్ణంలోని ఒక్క పార్టీ కూడా ఖాతా తెరవకపోవడం విశేషం. కట్టుమన్నార్ కోయల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వీసీకే చీఫ్ తిరుమావలన్ ఒక్కరే విజయానికి దగ్గరగా వచ్చారు. కేవలం 87 ఓట్లతో ఆయన ఓడిపోయారు. మిగతా అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. డీఎంకేతో విజయకాంత్ పొత్తు పెట్టుకుని వుంటే ఫలితాలు వేరేగా ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఎంకే అధికారంలోకి రాకుండా సైంధవుడిలా ఆయన అడ్డుపడ్డారని కరుణానిధి మద్దతుదారులు మండిపడుతున్నారు. -
ఉపన్యాసాలకు విజయకాంత్ తగడు
సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా మదురై: వేదికలపై ప్రసంగించేందుకు విజయకాంత్ తగిన వాడు కాదని ఆయన మాటలు అతనికే అర్థం కావని సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన గురువారం మదురై అన్నాడీఎంకే నార్త్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ మేయర్ రాజన్ చెల్లప్పకు మద్దతుగా శరత్‌కుమార్ మదురై పుదూర్, సెల్లూర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. డీఎంకే కోశాధికారికి గణాంకాలు కూడా సరిగ్గా తెలియవన్నారు. కచ్చదీవిని ధారాదత్తం చేసిన ఘనత డీఎంకేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడును అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 234 నియోజకవర్గాలలో ఘన విజయం సాధించడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. -
కెప్టెన్ మరో కోణం
చెన్నై: పిడిగుద్దులు గుద్దుతాడు ... ఎదురుగా వెళ్లాలంటే ఆపార్టీ వర్గాలకు భయం. ఇందుకు కారణం ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటాడో అని కార్యకర్తల ఆందోళన... ఆయనే డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్. అయితే, తిరుమంగళం వేదికగా జరిగిన సభలో చమటలు కక్కుతూ తన కోసం భద్రతా విధుల్లో ఉన్న కార్యకర్త మీద కెప్టెన్ కరుణ చూపించడం అందర్నీ అశ్చర్యచకుతుల్ని చేసింది.. డీఎండీకే అధినేత విజయకాంత్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు కోపం వస్తే చాలు చితక్కొట్టుడే. అది మీడియా అయినా సరే, అభ్యర్థి అయినా సరే, నాయకుడైనా సరే. అందుకే ఆయనతో వ్యవహరించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటారు. అలాగే, ఆయన పక్కకు గానీ, ఎదురుగా గానీ ద్వితీయ శ్రేణి నాయకులెవ్వరూ వెళ్లరు. గత వారం మీడియాను కొట్టేందుకు చేతులు ఎత్తడమే కాదు... ఆ ప్రతాపాన్ని ప్రైవేటు భద్రతా సిబ్బంది మీద చూపించారు కూడా. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి తిరుమంగళంలో జరిగిన ప్రచార సభలో విజయకాంత్ ముక్కోపినే కాదు, మంచోడ్ని కూడా అని చాటుకున్నారు. ప్రచార వేదిక మీదకు విజయకాంత్ రాగానే, ఆయన్ను మదురై జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో ఉన్న ప్రజా కూటమి అభ్యర్థులు, ముఖ్య నాయకులు చుట్టుముట్టారు. వారి వలయం నుంచి విజయకాంత్‌ను బయటకు తీసుకొచ్చేందుకు కార్యకర్తల సమూహంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అలాగే, వేదిక ముందు భాగంలో ఎవ్వరూ విజయకాంత్ వైపుగా దూసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేదికపై విజయకాంత్ ఆశీనుడు అయ్యారు. ఆయనకు ముందుగా గణేషన్ అనే సెక్యూరిటీ చమటలు కక్కుతూ, తడిసి ముద్దయిన యూనిఫాంతో వేదిక ముందు కూర్చుని తనకు భద్రతగా ఉండడాన్ని విజయకాంత్ గుర్తించారు. దీంతో గాలి ఆడక చమటలు కక్కుతున్న గణేషన్ వైపుగా తన చేతిలో ఉన్న ప్రసంగాల పేపర్‌తో ఉన్న అట్టను తీసుకుని విసరడం మొదలెట్టారు. ఉన్నట్టుండి చల్లగాలి హాయిగా వస్తుండడాన్ని గణేషన్ ఆశ్వాదిస్తూ, ఎక్కడి నుంచి వస్తుందో తలెత్తి చూసి చటుక్కున అక్కడి నుంచి తప్పుకున్నారు. అయితే, ఇక్కడ గణేషన్ మీద కెప్టెన్ జాలి చూపిస్తే, గణేషన్ ఏమో కెప్టెన్ ఎక్కడ అట్టతో కొడుతారేమో...! అన్న ఆందోళనతో తప్పుకున్నట్టుగా వేదిక ముందున్న వాళ్లు, వేదిక మీదున్న వాళ్లు చమత్కారాలు విసిరే పనిలో పడ్డారటా. చివరకు తన మీద కెప్టెన్ చూపిన జాలికి గణేషన్ తలగోక్కోవడం, దీనిని కెప్టెన్ చిరునవ్వులు చిందించడం విశేషం. -
ఇప్పుడు శరత్ కుమార్ వంతు
సాక్షి, చెన్నై : ఇన్నాళ్లు కార్యకర్తల మీద విరుచుకుపడ్డ విజయకాంత్‌ను చూశాం. ఇప్పుడు శరత్ వంతు వచ్చినట్టుంది. వ్యాన్ నుంచి దిగి మరీ అంతు చూస్తా అని బెదిరించడం ఆత్తూరు ఓటర్లను విస్మయంలో పడేసిందట.తన ప్రసంగానికి ఎవరైనా అడ్డు పడినా, ఇష్టారాజ్యంగా వ్యవహరించినా, తాను చెప్పింది వినకున్నా, చితక్కొట్టే నాయకుడు విజయకాంత్. ఇప్పటి వరకు ఆయన చేతిలో ఎందరో దెబ్బలు తిన్నారు. చివాట్లు ఎదుర్కొన్నారు. ఆయన బెదిరింపుల్ని ప్రత్యక్షంగా ఇన్నాళ్లు ఓటర్లు తిలకించిన సందర్భాలు అనేకం. అదే బాటలో ప్రస్తుతం శరత్ నడిచేందుకు సిద్ధ పడ్డట్టుంది. అందుకు తగ్గట్టుగా వ్యవహరించి ఆత్తూరు ఓటర్లను ముక్కుమీద వేలు వేసుకునే లా చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా సినీ నటుడు శరత్‌కుమార్ ప్రచారం సాగిస్తున్నారు. ఆత్తూరు ఎన్నికల బరిలో ఉన్న మంత్రి నత్తం విశ్వనాథన్‌కు మద్దతుగా ప్రచార వాహనంలో శరత్ దూసుకొచ్చారు. తిత్తల్ పట్టి వద్ద ఆయన ప్రచార రథం ఆగింది. అక్కడి వేదిక వద్ద ప్రసంగం మొదలెట్టారు. ఈ సమయంలో జనం వైపు నుంచి సాత్తూరు డీఎంకే కోట, ఇక్కడ పాగా వేయలేరంటూ వచ్చిన నినాదం శరత్‌కు కొపాన్ని తెప్పించిందట. అంతే చటుక్కున వేదిక దిగి వచ్చి మరీ ఎవడ్రా..ఎవడ్రా అంటూ సినీ బానీలో డైలాగులు చెప్పడమే కాకుండా, అంతు చూస్తా...నేనేమిటో చూపించాల్సి ఉంటుందని గర్జించడంతో ఓటర్లు నివ్వెర పోయారట. ఇంతలో మేల్కొన్న మంత్రి నత్తం విశ్వనాథన్ చటుక్కున శరత్‌ను వ్యాన్ వైపుగా లాక్కెళ్లడంతో అక్కడ పరిస్థితి కాస్త కుదుట పడిందట. అయితే, ఇన్నాళ్లు విజయకాంత్ ఒక్కడే కొపంతో గర్జించే నాయకుడిగా అందరి నోట నానుతుంటే, ఇప్పుడు ఆ బాటలో శరత్ సాగి సెటైర్లు ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఇది శరత్‌కు అవసరమా?అని పెదవి విప్పే వాళ్లూ ఉన్నారు. -
మీడియాపై కెప్టెన్ చిందులు
పిడికిలి బిగించి ఆక్రోశం సర్వత్రా విస్మయం అభ్యర్థులతో సేలంలో సమావేశం డీఎండీకే అధినేత విజయకాంత్ మళ్లీ తన చేతికి పని పెట్టే పనిలో పడ్డారు. మీడియాపై చిందులు తొక్కడమే కాకుండా, నాలుక మడిచి, పిడికిలి బిగించి కొట్టేందుకు సిద్ధం అయ్యారు. తన పక్కనే ఉన్న ప్రయివేటు భద్రతా సిబ్బందికి మోచేతి గుద్దుల రుచి చూపించారు. సీఎం అభ్యర్థి ఇలా బాదుడికి దిగడంతో సర్వత్రా విస్మయంలో పడ్డారు. సేలంలో హఠాత్తుగా అభ్యర్థులతో కెప్టెన్ సమాలోచించడం గమనార్హం. సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ రూటే సెపరేటు అన్న విషయం తెలిసిందే. ఆయన ప్రసంగాలు శైలి గందరగోళమే. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన చేతి దెబ్బ ఎవరో ఒకరు రుచి చూడక తప్పదు. అది అభ్యర్థి కావొచ్చు, పార్టీ నాయకులు కావచ్చు. కోపం వస్తే చాలు చితక్కొట్టుడే. ఇన్నాళ్లు ఓ పార్టీ నేతగా ఆయన ప్రచారాల్లో వ్యవహరించిన తీరుపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో విజయకాంత్ హోదా పెరిగింది. ఐదు పార్టీలు కలిసి ఆయన్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. దీంతో తదుపరి సీఎం తానే అన్న ధీమాతో విజయకాంత్ ముందుకు సాగుతున్నారు. ఇన్నాళ్లు మీడియాపై పదే పదే చిందులు తొక్కుతూ వచ్చిన విజయకాంత్, సీఎం అభ్యర్థిగా ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో కాస్త తగ్గారు. హుందాతనాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేసినా, చివరకు తానింతే అని దూకుడుగా ప్రదర్శించి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. బుధవారం హఠాత్తుగా సేలం లో పార్టీ జిల్లాల కార్యదర్శులు, 104 మంది అభ్యర్థులతో సమావేశానికి విజయకాంత్ పిలుపు నివ్వడంతో అక్కడికి వచ్చిన మీడియాకు చీవాట్లు తప్పలేదు. పిడికిలి బిగించి చివరకు ఆక్రోశాన్ని పక్కనే ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బంది మీద చూపించిన విజయకాంత్‌పై సెటైర్లు బయలు దేరాయి. కెప్టెన్ బాధుడు : సేలం ఐదు రోడ్ల కూడలిలోని కల్యాణ మండపంలో పార్టీ కార్యదర్శులు, అభ్యర్థుల సమావేశానికి చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మీడియాకు ఆహ్వానం లేదు. వీడియో కెమెరాలు, ఫోటో గ్రాఫర్లు ఆ దరిదాపుల్లోకి రాకూడదన్న ఆంక్షలు సైతం విధించారు. పది గంటల సమయంలో ఎన్నికల అధికారి శేఖర్ ఓ వీడియో గ్రాఫర్ తో కలిసి అక్కడికి వచ్చారు. అయితే, ఆయన్ను లోనికి అనుమతించ లేదు. తీవ్ర ఆక్రోశాన్ని ఆయన వ్యక్తం చేసిన తదుపరి అనుమతించారు. సరిగ్గా పదకొండున్నర గంటల సమయంలో విజయకాంత్ అక్కడికి వచ్చారు. ఆయన తన వాహనం నుంచి దిగడంతో సమావేశం ప్రాధాన్యతను గురించి తెలుసుకునేందుకు మీడియా ఉరకలు తీసింది. మీడియా చుట్టుముట్టడంతో విజయకాంత్ సహనం కోల్పోయారు. తానో సీఎం అభ్యర్థి అన్న విషయాన్ని మరిచి నాలుక మడిచి , పిడికిలి బిగిస్తూ మీడియా వర్గాలపై దాడికి యత్నించే విధంగా ప్రయత్నం చేశారు. అంతలో తనను తాను శాంతించుకుని వద్దన్నట్టుగా చేతులు ఊపుతూ ముందుకు వెళ్లే యత్నం చేశారు. ఓ మీడియా ప్రతినిధి మైక్ విజయకాంత్ ముందుగా ప్రత్యక్షం కావడంతో ఆక్రోశాన్ని ఆపుకోలేక, ఆ మైక్‌ను దూరంగా విసిరి కొట్టారు. అంతటితో ఆగకుండా, ముందుకు సాగుతూ తన వెనుక రక్షణగా వస్తున్న ప్రైవేటు భద్రతా సిబ్బంది ఆక్రోశాన్ని ప్రదర్శించారు. మో చేతితో అతడి ముఖం మీద గుద్దుతూ విజయకాంత్ వ్యవహరించిన తీరు అనేక తమిళ ఛానళ్లకు హాట్ టాపిక్‌గా మారాయి. పదే పదే ఆయన వ్యవహరించిన తీరును ప్రసారం చేస్తూ, సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. ఇక, విజయకాంత్ ఆక్రోశంతో వీర బాదుడు పర్వాన్ని మళ్లీ కొనసాగించే పనిలో పడటంతో ఇక, అభ్యర్థులు, ఆ పార్టీ నాయకులు ఆయనకు కాస్త దూరంగా ఉండాల్సిందే. అలాగే, ఐదు పార్టీల నాయకులు ఏదేని వేదిక పై ప్రత్యేక్షమైన పక్షంలో విజయకాంత్‌కు కాస్త దూరంగా కూర్చుంటే సరి, లేదంటే ఆయన బాదుడు రుచి చూడాల్సిందే అన్న చమత్కారాలు సోషల్ మీడియాల్లో బయలు దేరాయి. -
మీడియాపై కెప్టెన్ మళ్లీ ఫైర్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ మీడియాతో మళ్లీ దురుసుగా వ్యవహరించారు. ప్రైవేటు భద్రతా సిబ్బందిని కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎండీఎంకే, వీసీకే, తమాకా, వామపక్షాలతో కూడిన ప్రజా సంక్షేమ కూటమికి డీఎండీకే అధినేత విజయకాంత్ సీఎం అభ్యర్థిగా నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయికతే ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సేలం టౌన్ కు వచ్చిన విజయకాంత్‌ను మీడియా చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. నాలుక మడత పెట్టి, పిడికిలి బిగిస్తూ కొట్టేందుకు సిద్ధపడి చివరకు తనను తాను సముదాయించుకున్నారు. ఓ మీడియా మైక్‌ను లాగి పడేసి ముందుకు సాగారు. చివరకు తన వెంట ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బందిపై ఆగ్రహాన్ని చూపించి మోచేతితో ఓ వ్యక్తిపై దాడి చేశారు. కొంత కాలం నుంచి మీడియాతో దురుసుగా వ్యవహరిస్తూ వచ్చిన విజయకాంత్, సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతుండటంతో తన పంథాను మార్చుకున్నట్లు కనిపించారు. అయితే, మళ్లీ తన ఆవేశాన్ని వెళ్లగక్కడంతో రాజకీయ ప్రత్యర్థులు ఈ విషయంపై వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థినో, పార్టీ నాయకుడినో చితక్కొట్టడం విజయకాంత్‌కు పరిపాటే కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
మరో వివాదంలో విజయ్ కాంత్
చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై డిఎండికె అధినేత, నటుడు విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం చల్లారకముందే ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నారు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్ మరోసారి రెచ్చిపోయాడు. బుధవారం సేలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సహనం కోల్పోయిన విజయ్ కాంత్ పాత్రికేయులపై ఆగ్రహంతో ఊగిపోయారు. చెంప దెబ్బ కొడతానంటూ బెదిరించి మరో వివాదానికి కేంద్రంగా మారారు. అయితే ఆయన జర్నలిస్టులపై విరుకుచుపడడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. కాగా డిఎండీకె, పీడబ్ల్యూఎఫ్ కూటమికి ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా బరిలో ఉన్న విజయకాంత్ ఉల్లుందూర్ పేట్ నుంచి పోటీ చేస్తున్నారు. -
విజయకాంత్‌కు ఓటమి భయమా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘స్థానబలిమే గానీ తన బలిమి కాదని’ అనేది విజయాన్ని సాధించిన నేపథ్యంలో చలామణి ఉండే ప్రాచీన సామెత. అయితే తన బలిమిపై విజయకాంత్‌కు సందేహమో ఏమో స్థాన బలిమి కోసం తరచూ నియోజకవర్గాన్ని మారుస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే, డీఎండీకేను స్థాపించినపుడు విజయకాంత్ 2006లో తొలిసారిగా విరుదాచలం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆనాటి ఎన్నికల్లో డీఎండీకే తరఫున పోటీచేసి గెలిచిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ వైపు వెళ్లలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా విజ్ఞప్తులను పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశన్ స్వీకరించేవాడు. అడపాదడపా విజయకాంత్ బావమరిది, యువజన విభాగం అధ్యక్షుడు సుదీష్ వెళ్లి ప్రజలను కలిసేవాడు. ఆ తరువాత 2011 నాటి ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్నాడు. ఆనాటి ఎన్నికల్లో విజయకాంత్ ఆశించిన స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులను జయలలిత ప్రకటించడంతో కోపగించుకుని వామపక్షాలతో కలిసి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జయలలిత మళ్లీ విజయకాంత్‌ను బుజ్జగించి రిషివైద్యం నియోజకవర్గం నుంచి పోటీకి సమ్మతించారు. ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రతిపక్ష నేత హోదాకు ఎదిగారు. ఈసారి ఉళుందూర్ పేట మూడోసారి ముచ్చటగా విజయకాంత్ మరోసారి నియోజకవర్గం మార్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉళుందూరుపేట నుంచి విజయకాంత్ పోటీ చేస్తాడని పార్టీ ప్రకటించింది. గెలిచినా, ఓడినా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడరనే విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. తొలి ఎన్నికల్లో ఒంటరిపోరు, మలి ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా గెలుపొందారు. ప్రస్తుతం ప్రజా సంక్షేమ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్‌కు గెలుపు ప్రతిష్టాత్మకమని ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. దీంతో విజయకాంత్‌కు గెలుపు అనివార్యమైంది. ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా కూటమి పరువు పోవడం ఖాయం. గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తే ప్రజలు ఓడించి తీరుతారనే భయంతోనే విజయకాంత్ ఈసారి ఉళుందూర్పేటను ఎన్నుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాసంక్షేమ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలో ఉన్న విజయకాంత్ గెలుపోటముల మాటెలా ఉన్నా గణనీయమైన సంఖ్యలో ఓట్లను చేకూర్చాలని కూటమిలోని అన్నిపార్టీల నేతలు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. -
అధికారం మాదే !
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కూటమి పాలన తథ్యం అని, తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. కూటమిలోని ఆరుగురు నేతలు ఆదివారం ఒకే వేదిక మీదకు వచ్చారు. తమ కూటమి సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును అధికార పూర్వకంగా ప్రకటించారు. కాంచీపురం జిల్లా మామండూరు వేదికగా ఆ కూటమి వర్గాలు హోరెత్తాయి. డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి నేతృత్వంలో కాంచీపురం జిల్లా మామండూరు వేదికగా భారీ మహానాడుకు పిలుపు నిచ్చారు. ఇప్పటి వరకు ప్రజా సంక్షేమ కూటమి నాయకులు మాత్రమే ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షం అవుతూ రాగా, ప్రస్తుతం తొలి సారిగా డీఎండీకే అధినేత విజయకాంత్ వేదిక ఎక్కారు. ఈ కూటమిలోకి తమిళ మానిల కాంగ్రెస్ సైతం చేరడంతో ఆ పార్టీ నేత జి కే వాసన్ సైతం వేదిక మీద ప్రత్యక్షం అయ్యారు. సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, డీఎండీకే నేత విజయకాంత్, తమాకా నేత వాసన్ ఒకే వేదికగా తమ ఎన్నికల శంఖారావం పూరించారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను అధికార పూర్వకంగా తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి పాలన తథ్యం అని, తామే అధికార పగ్గాలు చేపట్టనున్నామని, విజయకాంత్ సీఎం ఖావడం తథ్యం అంటూ ఈసందర్భంగా నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రేమలత తన ప్రసంగంలో డీఎండీకే నుంచి బయటకు వెళ్లిన వారిని ఉద్దేశించి తీవ్రంగా విరుచుకు పడ్డారు. తానే కెప్టెన్ కంట్రోల్లో ఉంటే, ఇక, డీఎండీకే తన కంట్రోల్లో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వదిన వదిన అంటూ తన పేరుకు కళంకం తీసుకొస్తే ఉపేక్షించనని మండి పడ్డారు. ఆ కూటమి కన్వీనర్ వైగో ప్రసంగిస్తూ , ఇక నేతలందరూ తలా ఓ వైపుగా రాష్ట్రం ఆరు దిశల్లో పర్యటించనున్నామని, డీఎంకే, అన్నాడీఎంకేలకు పతనం లక్ష్యంగా, కూటమి పాలన అధికార పగ్గాలు చేపట్టడం థ్యేయంగా ఇక తమ పయనం ఉంటుందని ప్రకటించారు. డిఎంకే, అన్నాడిఎంకేలు అవినీతి ఊబిలో కూరుకున్నారని, వీళ్లంతా ఆ కేసుల్లో జైలుకు వెళ్లడం ఖాయం అని వ్యాఖ్యానించారు. అన్నాడిఎంకేకు అనుకూలంగా ఎన్నికల యంత్రాంగం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. డిఎంకే, అన్నాడీఎంకేలు నోట్లతో ఓట్లను రాబట్టే వ్యూహంతో ఉన్నారని, ఆయా ప్రాంతాల్లోని ఆరు పార్టీల నాయకులు ప్రత్యేక కమిటీలుగా ఏర్పడి ఆ రెండు పార్టీల నగదు బట్వాడాను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. అవినీతి ఆస్తులు జప్తు తాము అధికారంలోకి రాగానే, లోకాయుక్త అమలు తక్షణ నిర్ణయంగా వైగో ప్రకటించారు. ఆ చట్టం అమలుతో అవినీతితో సంపాదించిన డిఎంకే, అన్నాడీఎంకే వర్గాల ఆస్తులన్నింటినీ జప్తు చేస్తామన్నారు. డిఎంకే, అన్నాడీఎంకేలు దోపిడీల్లో దొందు దొందే అని, మద్యం రాష్ట్రంలో ఏరులై పారేందుకు ఈ ఇద్దరే కారణం అని శివాలెత్తారు. డిఎంకే అధికారంలోకి వస్తే, అన్నాడీఎంకే వర్గాల కంపెనీల నుంచి, అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే డిఎంకే కుటుంబానికి చెందిన మద్యం కంపెనీల నుంచి సరకు కొనుగోలు చేయడం జరుగుతున్నదని, దీన్ని బట్టి చూస్తే, ఈ ఇద్దరు కంబైన్డ్ డెకాయిట్స్ అంటూ వ్యాఖ్యానించారు. -
విజయకాంత్ కు షాక్
చెన్నై: 'కెప్టెన్' విజయకాంత్ కు షాక్ తగిలింది. డీఎండీకేలో రగిలిన ముసలం పార్టీ విచ్ఛిన్నానికి దారి తీసింది. డీఎండీకే రెండుగా చీలిపోయింది. తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే చంద్రకుమార్.. డీఎండీకే నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టారు. పీడీఎండీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నై టీ నగర్ లోని త్యాగరాజ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అసంతృప్త నాయకులతో చంద్రకుమార్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయకాంత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. డీఎంకేతో పొత్తుకే ఎక్కువశాతం మొగ్గుచూపిన ఎమ్మెల్యేలు, నేతలను కాదని ప్రజా సంక్షేమ కూటమితో జతకట్టడంపై తిరుగుబాటు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక విజయకాంత్ తో కొనసాగరాదని వారందరూ నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపారు. చంద్రకుమార్ నాయకత్వంలో పీడీఎండీకే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎండీకే రెండు పార్టీలుగా చీలిపోవడం రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. ఇంకా ఎన్ని సిత్రాలు జరుగుతాయోనని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
కెప్టెన్ కసరత్తు
సాక్షి, చెన్నై : పార్టీని, కేడర్‌ను నిలుపుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. అదే సమయంలో డీఎండీకేను రక్షించడం లక్ష్యంగా పోటీ సర్వసభ్య సమావేశానికి సన్నద్ధం అవుతున్నట్టు చంద్రకుమార్ ప్రకటించారు. డీఎండీకేలో ముసలం బయలు దేరిన విషయం తెలిసిందే. విజయకాంత్ సతీమణి ప్రేమలత చేతిలోకి చేరిన పార్టీని కైవసం చేసుకునేందుకు చంద్రకుమార్ నేతృత్వంలోని బృందం తీవ్ర కసరత్తుల్లో మునిగింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎండీకే వర్గాల మద్దతు సేకరించే పనిలో చంద్రకుమార్ నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో పోటీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రేమలత గుప్పెట్లో ఉన్న డీఎండీకేను రక్షించుకుంటామని చంద్రకుమార్ ప్రకటించడం గమనార్హం. విజయకాంత్ చేతి నుంచి డీఎండీకే ప్రేమలత చేతిలోకి చేరినందుకే, తాము తిరుగు బాటుతో ముందుకు సాగుతున్నామని, ఒకటి రెండు రోజుల్లో తమ నిర్ణయం ఉంటుందని గురువారం చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. పదో తేదిన తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు చంద్రకుమార్ ఉరకలు తీస్తుంటే, మరో వైపు అదే రోజున అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు విజయకాంత్ సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, అదే రోజు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, సర్వ సభ్య సమావేశానికి ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. ఇక, ధర్మపురి, కోయంబత్తూరు, నాగపట్నం జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యే విజయకాంత్‌ను కలిసి, ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చే విధంగానిర్ణయం తీసుకోవాలని, గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించి, డీఎంకేలోకి చేరుదామంటూ కన్నీళ్ల పర్యంతంతో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, విజయకాంత్ ఏమాత్రం తగ్గని దృష్ట్యా, ఆ నలుగురు చంద్రకుమార్ జట్టులోకి దూకేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, డీఎండీకేలో ముసలం బయలు దేరిన సమయంలో ప్రజా సంక్షేమ కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి పరుగులు తీశారు. అక్కడ విజయకాంత్‌తో సమాలోచించారు. తదుపరి తన వెంట వచ్చిన కొన్ని పార్టీల నేతల్ని విజయకాంత్‌కు పరిచయం చేసి, వారి మద్దతును స్వీకరించారు. ఎస్ఎంకేలోనూ : ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు రావాలని విజయకాంత్‌పై ఒత్తిడి తెచ్చే విధంగా డీఎండీకేలో తిరుగు బాటు సాగుతుంటే, మరో వైపు అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు రావాలని సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే)లో తిరుగు బాటు బయలు దేరింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కాళిదాసు, నాయకుడు ఆదియమాన్ శరత్‌కుమార్ తీరును ఖండిస్తూ తిరుగు బాటు చేపట్టారు. అన్నాడీఎంకేలో అత్యధిక స్థానాలు ఆశించకుండా, కేవలం తన వరకు మాత్రం శరత్‌కుమార్ చూసుకోవడం మంచి పద్ధతి కాదని, ఆ కూటమి నుంచి బయటకు రావాలని ఈ నేతలు నినదించడం గమనార్హం. కూటమిలోనే గరం గరం: డీఎంకే అధినేత కరుణానిధిపై ఎండీఎంకే నేత వైగో చేసిన వ్యాఖ్యలను ప్రజా సంక్షేమ కూటమిలో ఉన్న పార్టీలు ఖండిస్తుండడం గమనార్హం. ఆయన వ్యాఖ్యల్ని పట్టించుకోదలచుకోలేదని సీపీఎం నేత జి రామకృష్ణన్ వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యల్ని వీసీకే నేతలు తిరుమావళవన్, రవికుమార్‌లు ఖండించారు. ఇక, సీపీఐ నేత ముత్తరసన్ సైతం ఆ వ్యాఖ్యల్ని అంగీకరించ లేమని వ్యాఖ్యానించారు. ఇక, జీకే వాసన్ సైతం వైగో తీరును తప్పుబట్టారు. వ్యక్తిగత విమర్శలు వైగో మానుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై హితవు పలికారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా వైగోకు వ్యతిరేకంగా డీఎంకే నిరసనలు రాజుకున్నాయి. దీంతో జీవిత కాలంలో తాను చేసిన అతిపెద్ద తప్పు ఇది అని, కరుణానిధి వద్ద బహిరంగ క్షమాపణ కోరుతున్నట్టుగా వైగో ఓ ప్రకటన విడుదల చేశారు. -
చీలికే లక్ష్యం
కన్నీళ్లు పెట్టిన చంద్రకుమార్ పెరుగుతున్న మద్దతు కెప్టెన్‌కు తప్పని షాక్‌లు కేడర్‌ను దక్కించుకునేందుకు పరుగు నేతలతో విజయకాంత్ సమాలోచన తొమ్మిది మంది ఎమ్మెల్యేల డుమ్మా సాక్షి, చెన్నై : డీఎండీకేను చీల్చేందుకు బహిష్కృత నేత చంద్రకుమార్ సిద్ధమవుతున్నారు. మద్దతు గణంతో డీఎండీకేను కైవసం చేసుకునేందుకు సన్నాహాలు వేగం వంతం చేశారు. అసంతృప్తి వాదుల్ని ఏకం చేసి డీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కార్యచరణతో ముందుకు వెళుతున్నారు. మెజారిటీ బలంతో ఎన్నికల కమిషన్ ఎదుట తమదే నిజమైన డీఎండీకే అని చాటుకుని ఢంకా చిహ్నాన్ని తన్నుకెళ్లే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఇక చంద్రకుమార్ స్పీడ్‌కు కళ్లెం వేయడానికి విజయకాంత్ సైతం తీవ్ర కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. అందుబాటులో ఉన్న నాయకులతో సమాలోచనలో మునిగారు. డీఎండీకేలో తిరుగుబాటు బయలుదేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి, అసెంబ్లీ విప్ చంద్రకుమార్ నేతృత్వంలో శేఖర్, పార్తిబన్ తదితర ఎమ్మెల్యేలతో పాటుగా పది మంది జిల్లాల కార్యదర్శులు తిరుగు బాటు ధోరణి అనుసరించడంతో వారికి విజయకాంత్ ఉద్వాసన పలికారు. ఈ పరిణామాలతో ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో డీఎంకేలోకి వలసలు బయలు దేరినట్టే అన్న సంకేతాలు బయలు దేరాయి. అయితే, తమది డీఎంకే బాట కాదని, డీఎండీకేను చీల్చడం, తదుపరి కైవసం లక్ష్యం అన్న నినాదాన్ని చంద్రకుమార్ బృందం అందుకునేందుకు సిద్ధం అవుతుండడం చర్చనీయాంశంగా మారి ఉన్నది. ఇందుకు తగ్గట్టుగానే వారి వ్యవహారాలు ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు. తమను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చంద్రకుమార్, మద్దతు సమీకరణతో ఒకటి రెండు రోజుల్లో పార్టీని చీల్చబోతున్నారు. అనంతరం పోటీ సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందులో తీసుకునే నిర్ణయం మేరకు డీఎండీకేను కైవ సం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో పార్టీ ప్రస్తుతం ప్రేమలత గుప్పెట్లో ఉందని, ఆమె రూపంలో సర్వనాశనం అవుతున్న పార్టీని, కేడర్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రకుమార్ స్పందించడం ఆలోచించాల్సిందే. పార్టీ కైవసంతో తమ మెజారిటీని ఎన్నికల యంత్రాంగం ఎదుట చాటుకుని డీఎండీకే చిహ్నం ఢంకాను సైతం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. తదుపరి డీఎంకేతో కలసి బరిలోకి దిగేందుకు తగ్గ వ్యూహంతో చంద్రకుమార్ బృందం దూకుడు పెంచి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కన్నీళ్లు పెట్టిన చంద్రకుమార్: బుధవారం మైలాపూర్‌లో తన మద్దతు ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులతో కలసి చంద్రకుమార్ మీడియాతో మాట్లాడారు. తమను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా తాము డీఎండీకేలోనే ఉన్నామని, కెప్టెన్ చిత్ర పటాన్నే తమ జేబుల్లో పెట్టుకుని ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం డీఎండీకే వదినమ్మ ప్రేమలత గుప్పెట్లోకి చేరిందని, అందుకే తాము గళం విప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తమ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటే వివరణ కోరాల్సి ఉందని, క్రమ శిక్షణ చర్యలు తప్పని సరి అన్నప్పుడు కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. అయితే, ఆ కమిటీలో ఉన్న వాళ్లల్లో ఎక్కువ శాతం మంది ఇక్కడే ఉంటే, ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తమ కెప్టెన్ కు ఇష్టం లేకున్నా, బలవంతంగా ప్రజా సంక్షేమ కూటమిలోకి ప్రేమలత చేర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. జేబులు, ఇళ్లు గుళ్ల అయ్యాయని, ఆస్తులు పార్టీ కోసం కరిగి పోయాయని, అద్దె ఇళ్లల్లో భారాన్ని మోస్తున్న తాము మళ్లీ మళ్లీ కష్టాల్ని చవి చూడదలచుకోలేదని ఈసందర్భంగా చంద్రకుమార్ కన్నీళ్లు పెట్టడం మీడియా సమావేశంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. తానేదో ఎవరో ఇచ్చే నోట్లకు ఆశ పడి తిరుగు బావుటా ఎగుర వేయలేదని, పదవుల కోసం వెంపర్లాడం లేదని, మహోన్నత ఆశయంతో డీఎండీకే ఆవిర్భవించిందని, దానిని, కేడర్‌ను రక్షించుకోవాలన్న లక్ష్యంతో ఈ తిరుగుబాటు అని కన్నీళ్ల పర్యంతంతో వ్యాఖ్యలు చేశారు. ఎండీఎంకే నేత వైగో అనుచితంగా తమ మీద వ్యాఖ్యలు చేస్తున్నారని, తమ పార్టీ అంతర్యగత విభేదాలు, వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని వైగోను హెచ్చరించారు. డీఎంకే నుంచి బయటకు వచ్చినప్పుడు అన్నాడీఎంకే వద్ద ఎన్ని కోట్లు తీసుకుని ఎండీఎంకేను పెట్టావు..? అని తాము ప్రశ్నించాల్సి ఉంటుందని మండి పడ్డారు. అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించి వైగో, ఇప్పుడు డీఎండీకేను సర్వనాశనం చేయడానికి సిద్ధం అయ్యారని,అందుకే పార్టీని రక్షించుకుంటాం అంటూ పరోక్షంగా ఇక కైవసం తదుపరి అన్న సంకేతాన్ని ఇవ్వడం గమనార్హం. అలాగే, ఒకటి రెండు రోజుల్లో మద్దతు చాటుకుంటామని, తదుపరి తమ నిర్ణయాల్ని ప్రకటిస్తామంటూ దూకుడు పెంచే పనిలో పడ్డారు. అదే సమయంలో చంద్రకుమార్ వెంట నడిచేందుకు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, 20 మంది జిల్లాల కార్యదర్శులు సిద్ధం అవుతుండడంతో ఇక, డీఎండీకేను చేజిక్కించుకుంటారా..?అన్న ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్ సమాలోచన : చంద్రకుమార్ బృందం దూకుడు కల్లెం వేసి కేడర్‌ను దక్కించుకునేందుకు విజయకాంత్ రంగంలోకి దిగారు. పార్టీ నేతలు, జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేల్ని ఆగమేఘాలపై చెన్నైకు పిలిపించారు. అయితే, తొమ్మిది మంది ఎమ్మెల్ల్యేలు ఇరవై జిల్లాలకు చెందిన కార్యదర్శులు, మరికొందరు నాయకులు ఈ సమావేశానికి డుమ్మాకొట్టారు. అయినా, వచ్చిన వారితో సమాలోచించి, కేడర్‌ను దక్కించుకునేందుకు తగ్గ వ్యూహ రచనల్లో పడ్డారు. చాలా రోజులుగా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్న విజయకాంత్, మధ్యాహ్నం కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని తనతో కలిసి వచ్చే వారితో సమాలోచనలో మునిగారు. ఇక, చంద్రకుమార్ అండ్ బృందం పై కెప్టెన్ వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలు పార్థసారథి, ఎ.మురుగేషన్ తీవ్రంగా స్పందించారు. -
కెప్టెన్‌కు షాక్
సాక్షి, చెన్నై: విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో ప్రకంపనలు బయలుదేరాయి. విజయకాంత్‌కు కుడి భుజంగా, పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శిగా ఉన్న చంద్రకుమార్ తిరుగు బావుటా ఎగుర వేశారు. ఆయన వెంట ఐదుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడంతో విజయకాంత్‌కు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. ఆగమేఘాలపై వారిలో పది మందిని పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ వెంట మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు నడవబోతున్నారని చంద్రకుమార్ ప్రకటించారు. ప్రజాసంక్షేమ కూటమితో కలసి తమఅధినేత విజయకాంత్ అడుగులు వేయడాన్ని డీఎండీకే వర్గాలు పెద్ద సంఖ్యలో వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. విజయకాంత్ తీరును నిరసిస్తూ పలువురు టాటా చెప్పే పనిలో పడ్డారు. డీఎంకే దళపతి స్టాలిన్ చేపట్టిన ఆకర్ష్‌తో పలువురు జిల్లాల కార్యదర్శులు ఇప్పటికే డీఎండీకేను వీడారు. మరెందరో డీఎండీకేను వీడబోతున్నట్టుగా తీర్థం పుచ్చుకున్న వాళ్లందరూ ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో అసెంబ్లీలో విజయకాంత్ తదుపరి స్థానంలో, కెప్టెన్‌కు కుడి భుజంగా, పార్టీలో కీలక పదవిలో ఉన్న చంద్రకుమార్ తిరుగుబాటు డీఎండీకేలో కలకలం రేపింది. చంద్రకుమార్ వెంట గుమ్మిడి పూండి శేఖర్, మెట్టూరు ఎస్ఆర్ పార్తిబన్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు నడవడం గమనార్హం. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు మరో 24 గంటల్లో తన వెంట రాబోతున్నారని చంద్రకుమార్ ప్రకటించడంతో ఆ పార్టీలో ప్రకంపనలు బయలుదేరాయి. తిరుగు బాటు : మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో చంద్రకుమార్‌తో కలసి నలుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు చెన్నై ప్రెస్ క్లబ్లో ప్రత్యక్షం అయ్యారు. ఇప్పటికే డీఎండీకే నుంచి వలసలు డీఎంకేలోకి బయలు దేరి ఉండడంతో, వీరి రాక ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. మీడియాతో చంద్రకుమార్ మాట్లాడుతూ అన్నాడీఎంకేతో కలిసి గత ఎన్నికల్లో పయనం సాగించి విజయ ఢంకా మోగించినా, తమ కెప్టెన్ నిర్ణయంతో ఎదురైన కష్టాలు, నష్టాలను గుర్తు చేశారు. విజయకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించి తిరుగు బావుట ఎగుర వేశారు. 95 శాతం మంది పార్టీ వర్గాలు డీఎంకేతో కలిసి అడుగులు వేద్దామని విజయకాంత్‌కు సూచించారన్నారు. ఇందుకు కెప్టెన్ కట్టుబడి, చివరకు ప్రజా సంక్షేమ కూటమిలోకి చేరడాన్ని జీర్ణించుకోలేక పోయామని వ్యాఖ్యానించారు. ఆ కూటమితో కలసి మళ్లీ అన్నాడీఎంకేను అధికారంలోకి తెచ్చేందుకు తమ కెప్టెన్ అడుగులు వేయడాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతో మీడియా ముందుకు వచ్చామన్నారు. 24న ఈ విషయంగా కెప్టెన్‌కు లేఖ రాశామని, ఆయన నుంచి స్పందన లేని దృష్ట్యా, ఇక మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. డిఎంకేతో కలసి అడుగులు వేద్దామని, ఇకనైనా ప్రజా సంక్షేమ కూటమిని వీడాలంటూ బుధవారం మధ్యాహ్నం వరకు విజయకాంత్‌కు గడువు ఇస్తూ మాటల తూటాల్ని పేల్చారు. విజయకాంత్ తమను ఆహ్వానించి సంప్రదింపులు జరుపుతారన్న నమ్మకం ఉందని, ఆయన అలా వ్యవహరించని పక్షంలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, మరో పది మంది జిల్లాల కార్యదర్శులు బయటకు అడుగు పెట్టడం ఖాయం అని వ్యాఖ్యానించారు. ఇక, తదుపరి అడుగు డీఎంకే వైపు అన్న విషయాన్ని పరోక్ష వ్యాఖ్యలతో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక డీఎండీకేలో ప్రస్తుతం కెప్టెన్ మాటకు చెల్లుబాటు లేదని, అంతా వదినమ్మ (ప్రేమలత విజయకాంత్) హవా అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఉద్వాసన : విజయకాంత్‌కు బుధవారం మధ్యాహ్నం వరకు చంద్రకుమార్ అండ్ బృందం గడువు ఇస్తే, డీఎండీకే పార్టీ కార్యాలయం మాత్రం ఆ బృందానికి రెండున్నర గంటల్లో షాక్ ఇచ్చింది. విజయకాంత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటుగా, పది మందికి ఉద్వాసన పలుకుతూ ప్రకటన వెలువరించింది. అలాగే, మరి కొందరిపై చర్యలు తప్పదని , అందుకు తగ్గ కార్యాచరణలో ఉన్నట్టు వివరించడం గమనార్హం. చంద్రకుమార్ తో కలిసి అడుగులు వేస్తూ పది హేను జిల్లాలకు చెందిన కీలక నాయకులు బయటకు అడుగులు వేయడం, మరో పదిహేను మంది సిద్ధం అవుతోన్న సంకేతాలతో విజయకాంత్ అప్రమత్తం అయ్యారు. ఉన్న వాళ్లనైనా దక్కించుకునేందుకు తగ్గ కసరత్తుల్లో పడ్డారు. ఆగమేఘాలపై బుధవారం పార్టీ సమావేశానికి పిలుపు నిచ్చారు. ఇక, ఇప్పటికే 29 మందిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోకి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఐదుగురు బయటకు వెళ్లడంతో, మిగిలిన పదిహేను మందితో పాటుగా జిల్లాల కార్యదర్శులు తప్పని సరిగా సమావేశానికి హాజరు కావాలని పిలుపు నిచ్చి ఉన్నారు. అదే సమయంలో చంద్రకుమార్ అండ్ జట్టు డీఎంకే నోట్లకు అమ్ముడు పోయారంటూ డీఎండీకేకు చెందిన ఎమ్మెల్యేలు నల్లతంబి, మోహన్ రాజులు ఆరోపించడం గమనార్హం. చంద్రకుమార్ సృష్టించి, ప్రకంపనతో ఇన్నాళ్లు కార్యకర్తలు లేక బోసి పోయిన ఉన్న డీఎండీకే కార్యాలయంలో తాజాగా హడావుడి నెలకొని ఉండడం కొసమెరుపు. -
పదవుల పందేరం!
డిప్యూటీ సీఎంగా వైగో విద్యామంత్రిగా తిరుమా ఆర్థిక మంత్రిగా ముత్తరసన్ రామకృష్ణన్‌కు స్థానిక పరిపాలన శాఖ జాబితా ప్రకటించిన సుదీష్ సాక్షి, చెన్నై: సీట్ల పందేరంతో నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ జరగలేదు...ఇంకా, ఎన్నిక లూ జరగలేదు...అయితే, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి మాత్రం అధికార పగ్గాలు చేపట్టిన ధీమాతో ముందుకు సాగుతోంది. తన బావ విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా తెర మీదకు తెచ్చిన కూటమి నేతలకు పదవుల పంపకాల్లో డీఎండీకే యువజన నేత సుదీష్ నిమగ్నమయ్యారు. ప్రచార వేదిక లో కూటమి నేతలకు పదువల్ని కట్టబెట్టేసి అందర్నీ విస్మయంలో పడేశారు. ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ చేరిన విషయం తెలి సిందే. ఆయన రాకతో ఆ కూటమిలోని ఎం డీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. విజయకాం త్ను తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, కెప్టెన్ కూటమి గా పేరు మార్పు జరగడం వివాదానికి దా రి తీసింది. చివరకు నేతలందరూ ఏకతా టి పైకి వచ్చి డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అన్న నినాదాన్ని అందుకున్నా రు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. సీట్ల పందేరాల్లో సామరస్య పూర్వకంగానే నాయకులు వెళుతున్నారు. కూటమిలో చీలికకు ఆ స్కారం లేని విధంగా అడుగు లు వేసి, ఒకరి అభిప్రాయాల కు మరొకరు గౌరవం ఇస్తూ, తాము పంచ పాండవులం అని చాటుకునే పనిలో పడ్డారు. తమ బలాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ప్రచార సభల్ని విస్తృతం చేశారు. వీసీకేకు ఎన్నికల యంత్రాంగం ఉంగరం చిహ్నం కేటాయించడాన్ని పురస్కరించుకుని ఏకంగా పార్టీ నేత తిరుమావళవన్‌కు మంగళవారం రెండు సవరాలతో కూడిన బంగారం ఉంగరాన్ని తొడిగి తమ స్నేహబంధాన్ని వైగో చాటుకున్నారు. ఈ పరిస్థితుల్లో తన బావను సీఎం చేయడానికి సిద్ధమైన ప్రజా కూటమి నేతల్ని బుధవారం పొగడ్తల పన్నీరుతో ముంచెత్తిన డీఎండీకే యువజన నేత, విజయకాంత్ బావమరిది సుదీష్ పదవుల పంపకాలతో కూడిన జాబితాను ప్రకటించి అందర్నీ విస్మయంలో పడేశారు. డిప్యూటీ సీఎం వైగో: కోవిల్ పట్టి గాంధి మైదానంలో బుధవారం జరిగిన ప్రచార సభలో సుదీష్ తన ప్రసంగం ద్వారా ప్రజా కూటమి నేతల్ని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటుగా పదవుల పంపకాల్లో నిమగ్నం అయ్యారు. డీఎండీకే - ప్రజా కూటమి అధికార పగ్గాలు చేపట్టినట్టేనని, విజయకాంత్ సీఎం పగ్గాలు చేపట్టే సమయం ఆసన్నమవుతోందని వ్యాఖ్యానించారు. విజయకాంత్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే, డిప్యూటీ సీఎంగా వైగో బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. వీసీకే నేత తిరుమావళవన్ విద్యా శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం నేత రామకృష్ణన్ స్థానిక పరిపాలనా శాఖ మంత్రిగా పగ్గాలు చేపడుతారని ప్రకటించి, అక్కడున్న వారందర్నీ విస్మయంలో పడేశారు. సుదీష్ వ్యాఖ్యానించడంపై అక్కడే గుస..గుసలు అడిన వాళ్లూ ఉండడం గమనార్హం. ఇక, విజయకాంత్ ప్రభుత్వంలో తాను మాత్రం ఏ పదవీ స్వీకరించనని, ఒక సభ్యుడిగా అందరితో కలసి ఉంటానని, కూటమిలోకి వచ్చే వారికి కీలక మంత్రి పదవి గ్యారంటీ అని వ్యాఖ్యానించి పరోక్షంగా టీఎంసీ నేత వాసన్ తమ వైపునకు వస్తారన్న సంకేతాన్ని సుదీష్ ఇవ్వడం గమనార్హం. వాసన్‌కు 24 గ్యారెంటీ: తమతో కలిసి వస్తే 24 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని టీఎంసీ నేత జీకే వాసన్‌కు డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి సంకేతాన్ని పంపింది. ఇందుకు తగ్గ పొత్తు మంతనాల్లో కెప్టెన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనకు ప్రజా సంక్షేమ కూటమి కేటాయించిన 124 సీట్లలో 24 సీట్లను వాసన్‌కు ఇవ్వడానికి విజయకాంత్ నిర్ణయించినట్టు డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. వాసన్ తనకు మంచి మిత్రుడు కావడంతో ఆ దిశలోనే విజయకాంత్ ప్రయత్నాల్లో ఉన్నట్టు, రెండు మూడు రోజుల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోకి వాసన్ అడుగు పెడుతారని చెబుతున్నారు. -
డీఎంకేలోకి యువరాజ్
సాక్షి, చెన్నై: తమ దారికి డీఎండీకే అధినేత విజయకాంత్ రాని దృష్ట్యా, ఇక ఆపరేషన్ ఆకర్ష్‌తో ఆ పార్టీ వర్గాల్ని తమ వైపునకు తిప్పుకునే పనిలో డీఎంకే సిద్ధమైంది. ఇందుకు తగ్గ వ్యూహల అమలులో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి యువరాజ్, సేలం యూనియన్ నేత షణ్ముగం తమ బుట్టలో పడడంతో, ఇక వారి ద్వారా పావుల్ని కదిపే పనిలో పడ్డారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే ప్రయత్నిం చిన విషయం తెలిసిందే. అ యితే, ఆయన దూరం కావడంతో ఇక, ఆ పార్టీ కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే సిద్ధమైంది. విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రజా కూటమి ప్రకటించినా, ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్లే ఆ పార్టీలో ఎక్కువ. డీఎంకేతో కలసి నడుద్దామని విజయకాంత్ మీద మెజారిటీ శాతం జిల్లాల కార్యదర్శులు ఒత్తిడి కూడా తె చ్చారు. అయితే, తమ అభిప్రాయాల్ని విజ యకాంత్ ఖాతరు చేయకపోవడంతో వారం తా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పవచ్చు. వీరందర్నీ గురి పెట్టి, ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్‌కు డీఎంకే దళపతి స్టాలిన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఉత్తర చెన్నై జిల్లా డీఎండీ కే కార్యదర్శి, విజయకాంత్ సన్నిహితుడు యువరాజ్‌ను తమ వైపునకు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. బుధవారం గోపాలపురంలో అడుగు పెట్టిన యువరాజ్ అధినేత కరుణానిధి సమక్షంలో డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. అలాగే, సేలం యూనియన్ నేత షణ్ముగం నేతృత్వంలో వందకు పైగా ఆ జిల్లాలోని నాయకులు డీఎంకేలోకి చేరడం గమనార్హం. డీఎంకేలో తమ కోసం తలుపులు తెరవడంతో లోనికి అడుగులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో డీఎండీకే జిల్లాల కార్యదర్శులు ఉరకలు తీయడానికి సిద్ధమవుతున్నారని యువరాజ్ ప్రకటించారు. తన లాంటి వారెందరో డీఎంకేతో కలసి అడుగులు వేద్దామని సూచించినా, తమకు విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత పతనం లక్ష్యం అంటున్న విజయకాంత్, అందుకు తగ్గ నిర్ణయం తీసుకోకుండా పెద్ద తప్పు చేశారని , ఈ ఎన్నికల ద్వారా ఆయనకు తీవ్ర కష్టాలు, నష్టాలు తప్పదని హెచ్చరించడం గమనార్హం. కాగా, విజయకాంత్‌ను నమ్ముకుని పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టినా, తమకు ఇంత వరకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఇక్కడే ఉండి ఉన్నది రాల్చుకోవడం కన్నా, డిఎంకే తీర్థం పుచ్చుకుని భవిష్యత్తులో ఏదో ఒక పదవినైనా దక్కించుకోవచ్చన్న ఆశాభావంతో జంప్ జిలానీకి జిల్లాల కార్యదర్శులు సిద్ధం అవుతుండడం గమనార్హం. ఇక, ఈ వలసల్ని అడ్డుకునేందుకు విజయకాంత్ తీవ్ర కసరత్తులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. యువరాజ్ బయటకు వెళ్లడంతో తక్షణం ఆ పదవిని ఎగ్మూర్ ఎమ్మెల్యే నల్ల తంబి ద్వారా బర్తీ చేశారు. బరిలోకి ఎస్ఎస్పీ: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని శివగామి నేతృత్వంలోని సమూహ సమత్తువ మక్కల్ పడై ఉదయ సూర్యుడి చిహ్నంతో ఎన్నికల బరిలో దిగనుంది. ఈ మేరకు కరుణానిధితో శివగామి భేటీ అయ్యారు. ఒక్క సీటును అప్పగించడంతో డీఎంకే చిహ్నం మీదే పోటీకి శివగామి నిర్ణయించారు. మద్య నిషేధం అమలు లక్ష్యంగా డీఎంకే నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు. -
ఎన్ని ట్విస్టులో..
► కూటమిలో పేరు రచ్చ ► నేతల భిన్న స్వరాలు ► కెప్టెన్ టీంకు వామపక్షాల నిరాకరణ ► గౌరవం తగ్గదన్న తిరుమా ► సింగపూర్‌కు విజయకాంత్ ► కేడర్‌లో గందరగోళం సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజా సంక్షేమ కూటమి అలియాస్ కెప్టెన్ టీంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయోనన్న ప్రశ్న బయలు దేరింది. ఇంతకీ వీరంతా కలసికట్టుగా ముందుకు సాగుతారా..? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో నెలకొంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ నాయకుల ఆదివారం భిన్న స్వరాలు పలకడం గమనార్హం. ఒక్కో నేత ఒక్కో వ్యాఖ్యలు, నియోజకవర్గాల ఎంపిక వ్యవహారాల్లోనూ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోంది. ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్‌ల నేతృత్వంలో ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమి డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం అని జబ్బలు చరస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కూటమిలోకి డీఎండీకే చేరడంతో ఇక, ఎన్నికల్లో కీలక సమరం అన్నాడీఎంకే, తమ మధ్య మాత్రమే అన్న కొత్త నినాదాన్ని అందుకుని ఉన్నారు. డీఎండీకే నేత విజయకాంత్ రాకతో ఆనంద తాండవం చేసిన ఈ కూటమి నాయకులు, మరింత బలాన్ని పెంచుకునే వ్యూహంతో మరికొన్ని పార్టీల్ని ఆహ్వానించడంలో నిమగ్నమయ్యారు. అయితే, ఈ కొత్త ప్రయత్నాలు ఎలాంటి మలుపులకు దారి తీయనున్నయో అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు కారణం ‘సీట్లే’. డీఎండీకేకు వచ్చి రాగానే 124 సీట్లను కట్టబెట్టారు. మిగిలిన 110 సీట్లను ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఎండీఎంకే, వీసీకేలు ఎక్కువ స్థానాల్ని తీసుకోవడాన్ని సీపీఎం, సీపీఐ వర్గాలు తప్పుబడుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ిసీపీఎం, సీపీఐలకు 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఒక్క సీటూ లేని ఎండీఎంకే, వీసీకేలకు మాత్రం అత్యధికంగా స్థానాలు ఏమిటన్న ప్రశ్నను తెర మీదకు తెచ్చారు. దీంతో ఆ రెండు పార్టీల నాయకులు జి రామకృష్ణన్, ముత్తరసన్ ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. అదే సమయంలో తమ సిట్టింగ్ స్థానాల్ని మళ్లీ అప్పగించాల్సిందే అన్న నినాదంతో ఎమ్మెల్యేలు గళం విప్పడంతో పాటుగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదుల్ని పంపినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తతంగం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు కొత్తగా కూటమిలోకి ఎవరైనా వచ్చిన పక్షంలో వారికి సీట్లను విజయకాంత్ సర్దాల్సిందే అన్న నినాదాన్ని కూటమి నేతలు అందుకున్నారు. కూటమిలోకి జికే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ), కృష్ణ స్వామి నేతృత్వంలోని పుదియ తమిళగంలు వచ్చి చేరిన పక్షంలో తనకు కేటాయించిన 124లో సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి విజయకాంత్‌కు ఎదురై ఉన్నది. అన్నాడీఎంకే వద్దే 35 సీట్లకు పైగా డిమాండ్ ఉంచిన జీకే వాసన్ బృందం, తాజాగా, ప్రజా సంక్షేమ కూటమిలోకి వచ్చిన పక్షంలో కనీసం యాభైకు పైగా అడిగే అవకాశాలు ఎక్కువే. ఇక, పుదియ తమిళగం పది వరకు ఆశించ వచ్చు. కొత్త పార్టీల చేరికతో సుమారు 50కు పైగా సీట్లను విజయకాంత్ వదులుకోక తప్పదు. చివరకు 70 - 75 లోపు సీట్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇందుకు డీఎండీకే వర్గాలు అంగీకరించేనా అన్న ప్రశ్న బయలు దేరింది. సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన విజయకాంత్, ఇంత తక్కువ సీట్లతో బరిలోకి దిగేది అనుమానమే. ఇక, నియోజకవర్గాల ఎంపికలో ఎలాంటి వివాదాలు బయలు దేరుతాయో అన్నది కూడా గమనించాల్సిన విషయమే.తాజా పరిణామాలపై కూటమిలోని నాయకులు ఆదివారం భిన్న స్వరాలు పలకడం చర్చకు దారి తీయడంతో పాటు, సఖ్యతతో ఎన్నికల నాటికి ఈ కూటమి ముందుకు సాగేనా అన్న ప్రశ్న బయలు దేరింది. పేరు రచ్చ : విజయకాంత్ రాకతో, ఇక ప్రజా సంక్షేమ కూటమి కెప్టెన్ టీంగా పేరు మారుస్తూ ఎండీఎంకే నేత వైగో ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడ్డ మరుసటి రోజే సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను పెదవి విప్పారు. ఆ పేరు మార్చ వద్దని, ప్రజా సంక్షేమ కూటమి నినాదంతో ముందుకెళ్దామంటూ వ్యాఖ్యలు చేసి చర్చకు తెర లేపారు. ఇక, తమ వంతు వచ్చినట్టుగా ఆదివారం సీపీఎం నేత జి రామకృష్ణన్ స్పందించారు. కెప్టెన్ టీంను తాము అంగీకరించబోమని, ప్రజా సంక్షేమ కూటమిగానే పిలవాలన్న డిమాండ్‌ను లేవదీశారు. ఈ నెల 23న కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అని స్పష్టం చేయబడిందని, అయితే, కెప్టెన్ టీం అని నామకరణం చేయడానికి ఖండిస్తున్నామన్నారు. ఇక, జి రామకృష్ణన్‌కు సమాధానం ఇచ్చే క్రమంలో వీసీకే నేత తిరుమావళవన్ చేసిన వ్యాఖ్య మరో చర్చకు దారి తీసింది. ప్రజా సంక్షేమ కూటమి - డీఎండీకే కూటమి అని పిలిచినా, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అని పిలిచినా, కెప్టెన్ టీం అని పిలిచినా అంతా ఒక్కటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, కెప్టన్ టీం అని పిలిచినంత మాత్రాన ఎవరి గౌరవమూ తగ్గదంటూ హితవు పలకడం గమనార్హం. అదే సమయంలో ఎండీఎంకే నేత వైగో ఓ మీడియాతో మాట్లాడుతూ, ఇక, తమ కూటమిలోకి ఏ పార్టీ వచ్చినా సరే, సీట్లను మాత్రం విజయకాంత్ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. నియోజకవర్గాల ఎంపికపై నేతలందరూ నెల 31న సమావేశం కానున్నామని, సామరస్య పూర్వకంగా ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెన్నైలో అడుగు పెట్టిన సమయంలో జి రామకృష్ణన్ వ్యాఖ్యలు సంధించడం, తదుపరి ఆగమేఘాలపై సీతారాం ఏచూరితో ఎండీఎంకే నేత వైగో సంప్రదింపులు జరపడం గమనించాల్సిన విషయం. సింగపూర్‌కు విజయకాంత్: తాజా పరిణామాలతో వాడి వేడి చర్చ సాగుతున్న సమయంలో డీఎండీకే అధినేత విజయకాంత్ సింగపూర్ పయనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసిన విజయకాంత్ కొంత కాలంగా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. తాజాగా, ఆయన తప్పనిసరిగా చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆదివారం అర్ధరాత్రి కానీ సోమవారం ఉదయం కానీ సింగపూర్ బయలు దేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజులు అక్కడే ఉండబోతున్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇక, సీఎం అభ్యర్థి సింగపూర్ పయనం అవుతుండడంతో కూటమిలో కొత్త గందరగోళం బయలు దేరింది. -
కెప్టెన్‌గానే..
ప్రజా సంక్షేమ కూటమికి ‘కెప్టెన్’ చేకూరాడు. వైగో నేతృత్వంలో సాగుతున్న కూటమిలో డీఎండీకే చేరడం ద్వారా విజయకాంత్ ఒంటరి పోరుకు తెరదించాడు. అలాగే పొత్తులు పెట్టుకున్నా సీఎం అభ్యర్థిగా మాత్రమే ఎన్నికల బరిలోకి దిగుతాననే పంతాన్ని కెప్టెన్ ఎట్టకేలకూ నెగ్గించుకున్నాడు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులతో రాజకీయపార్టీల వ్యూహాలన్నీ ఒక కొలిక్కివచ్చినా డీఎండీకే మాత్రం నాన్చుడు ధోరణిని అవలంభించింది. ఇదిగో వస్తా, అదిగో చె బుతా అంటూ డీఎంకే, బీజేపీలను ఊరిం చి ఉడికించింది. చివరకు డీఎండీకే ఒంటి రి పోరుకు సిద్ధపడినట్లు ఇటీవల విజయకాంత్ ప్రకటించాడు. రాజకీయపార్టీలన్నీ విజయకాంత్ ప్రకటనతో నివ్వెరపోయాయి. డీఎండీకేపై బీజేపీ ఆశలు వదులుకోగా డీఎంకే మాత్రం ‘వస్తాడు నా రాజు ఈరోజు’ అంటూ సోమవారం వర కు పాటలు పాడుకుంటూ ఆశతో ఎదురు చూసింది. ఖంగు తినిపించిన విజయకాంత్: రాజకీయ నిర్ణయాల్లో ఆచీతూచీ అడుగేస్తున్నట్లుగానే వ్యవహరిస్తూ పొత్తు లు, కూటములపై జాప్యం చేస్తూ వచ్చిన విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరడం ద్వారా అందరినీ ఖంగుతినిపించాడు. కూటమి నేత వైగో, విజయకాంత్ సూలైలోని ఒక స్నేహితుని ఇంటిలో రెండురోజుల క్రితం కలుసుకున్నారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్లు కెప్టెన్ వెంట ఉన్నారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా వైగో సోమవారం కూటమినేతలో మరోసారి సమావేశం అయ్యారు. దీంతో డీఎండీకేతో పొత్తు కుదిరింది. మంగళవారం ఉదయం 9.45 గంటలకు విజయకాంత్, సుదీష్ తదితర ముఖ్యనేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి వెనుకవైపు ద్వారం గుండా చేరుకున్నారు. 9.50 గంటలకు వైగో, వీసీకే అధ్యక్షులు తిరుమావలవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణన్ వచ్చి విజయకాంత్‌తో చర్చలు జరిపారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు ముగియగా పొత్తు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ప్రజా సంక్షేమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ పేరును నిర్దారించారు. అలాగే డీఎండీకేకు 124సీట్లు, వైగో బృందానికి 110 సీట్లు కేటాయించేలా ఒప్పందం జరిగింది. వైగో మాట్లాడుతూ తమ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరడం హాస్యాస్పదమని పీఎంకే అధికార ప్రతినిధి బాలు వ్యాఖ్యానించారు. కూటమి నేతలు ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయని ఎద్దేవా చేశారు. విజయకాంత్ తన రాజకీయ జీవితాన్ని వృథా చేసుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సానుభూతి వ్యక్తం చేశారు. -
దింపుడు కళ్లం ఆశ
డీఎండీకే కోసం డీఎంకే ఎదురుచూపులు విజయకాంత్ వస్తాడన్న కరుణానిధి ఎన్నికలకు సిద్ధమన్న స్టాలిన్ ఎన్నికల వేళ డీఎంకే దింపుడు కళ్లం ఆశలో పడిపోయింది. డీఎండీకే తమ జట్టులో చేరడం ఖాయమని డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్ని కూటములు ఏర్పడినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకే మధ్యనే అన్నది నిర్వివాదాంశం. డీఎంకే, కాంగ్రెస్ కలిసిపోగా డీఎండీకేకు కరుణ ఆహ్వానం పంపా రు. డీఎంకేలో కాంగ్రెస్‌తోపాటూ మనిదనేయ మక్కల్ కట్చి, ఇండియ యూనియన్ ముస్లింలీగ్, ఎస్టీపీఐ, పెరుందలైవర్ మక్కల్ కట్చి తదితర పార్టీలు ఉన్నాయి. అయితే డీఎంకే కూటమిలో ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ మాత్రమే పెద్దపార్టీ. పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రజల్లో పరపతి అంతంత మాత్రమే. రాష్ట్రంలో ఎంతో కొంత ప్రజాబలం, కార్యకర్తల బలం ఉన్న పార్టీగా పేరొందిన డీఎండీకే మాత్రం డీఎంకేకు ముఖం చాటేసింది. డీఎండీకేను కూటమిలోకి తెచ్చే బాధ్యతను మిత్రపక్ష కాంగ్రెస్‌కు అప్పగించారు. కాంగ్రెస్ కంటే డీఎండీకేనే బలమైన పార్టీగా డీఎంకే నమ్ముతోంది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తమ సీట్లు తగ్గించుకుని డీఎండీకేకు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎవరెన్ని ఆఫర్లు ప్రకటించినా మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చున్న విజయకాంత్ ఒంటరిపోరుకు పోతున్నట్లు ప్రకటించారు. కింగా, కింగ్‌మేకరా అంటూ నినాదాలు చేసిన పార్టీ శ్రేణులు తనను కింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు విజయకాంత్ తేల్చిచెప్పారు. డీఎండీకే కలిసిన పక్షంలో మాత్రమే డీఎంకే బలమైన కూటమిగా మారి అన్నాడీఎంకేను ఎదుర్కోగలదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విశ్లేషణ కొంత వరకు నిజమేనని పలువురు హెచ్చరిస్తున్న తరుణంలో విజయకాంత్‌ను బుజ్జగించే చర్యలు ప్రారంభమైనాయి. ఓట్లను చీల్చడం ద్వారా విజయకాంత్ అన్నాడీఎంకేకు గెలుపు సులువు చేయగలడని డీఎంకే ఆందోళన చెందుతోంది. నేను రాను మొర్రో అంటూ విజయకాంత్ స్పష్టం చేసినా డీఎంకే మాత్రం చివరి ప్రయత్నంలో పడింది. కెప్టెన్ మాతోనే: కరుణ : ఈ నేపథ్యంలో అన్నా అరివాలయంలో సోమవారం డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ డీఎండీకే తమ కూటమిలో చేరుతుందనే విశ్వాసాన్ని కోల్పోలేదని వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు ఈ నెల 23వ తేదీన ప్రారంభం అవుతాయని తెలిపారు. పార్టీ పరంగా కనీసం 190 సీట్లలో పోటీచేయనున్నట్లు చెప్పారు. చర్చలను వేగంగా ముగించి అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తామని అన్నారు. అలాగే మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మరి డీఎండీకే మా టేమిటని ప్రశ్నించగా, తమ కూటమిలోకి విజయకాంత్ వస్తాడని తాను మొద టి నుంచి నమ్ముతున్నానని, ఆ నమ్మకం వమ్ము కాదని కరుణ స్పష్టం చేశారు. అధికారం మాదే - స్టాలిన్ ధీమా :రాబోయే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ కోశాధికారి స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే కోసం పార్టీ అర్రులు చాస్తున్న క్రమంలో స్టాలిన్ ప్రకటన చర్చనీయాంశమైంది. తాను చేపట్టిన నమక్కు నామే పర్యటన ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని పెంచిందని స్టాలిన్ పేర్కొన్నారు. తన పర్యటన సమయంలో ప్రజలతో చేసిన సంభాషణలు పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. సుమారు నాలుగున్నర లక్షమంది ప్రజలు తను విజ్ఞప్తులను ఇచ్చి డీఎంకే అధికారంలోకి వచ్చి తమ కోర్కెలను నెరవేర్చాలని కోరినట్లు స్టాలిన్ తెలిపారు. అలాగే అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీలోని కుమ్ములాటలు తమకు కలిసొచ్చే అంశాలని ఆయన చెబుతున్నారు. ‘అన్నాడీఎంకేను అధికారంలో నుంచి దింపుతాను, జయలలితను మరోసారి ముఖ్యమంత్రిని కానివ్వను, ఇవే లక్ష్యాలున్న కూటమితోనే పొత్తుపెట్టుకుంటా ను’ అంటూ విజయకాంత్ ప్రతిజ్ఞ చేశారని స్టాలిన్ అన్నారు. ఈ ప్రతిజ్ఞలకు ఆకర్షితుడై కరుణానిధి పొత్తుకు ఆహ్వానం పంపారని తెలిపారు. అయితే విజ యకాంత్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారోనని అన్నారు. ఏదైమైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు డీఎంకే సిద్ధంగా ఉందని స్టాలిన్ స్పష్టం చేశారు. -
మాకంటూ ఓటు బ్యాంకు ఉంది: కనిమొళి
కేకే.నగర్: విజయకాంత్ ఒంటరిగా పోటీ చేస్తే తమకు ఎలాంటి నష్టం ఉండదని అన్నాడీఎంకే ఓట్లన్నీ డీఎంకేకే వస్తాయని డీఎంకే ఎంపీ కనిమొళి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ప్రధాన పార్టీలుగా ఢీకొననున్నాయి. డీఎండీకే ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలిపి 28 స్థానాలను గెలిచింది. అనంతరం డీఎండీకే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కూటమి చేరింది. అయితే ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ స్థితిలో డీఎండీకేకు డీఎంకే నుంచి పిలుపువచ్చింది. రహస్య సమావేశాలు జరిగాయి. అయితే పొత్తు కుదరలేదు. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఏ పార్టీలతో కూటమి చేరాలనేది వారి వ్యక్తిగత విషయం అన్నారు. తాము కూటమి కోసం కొన్ని పార్టీలను ఆహ్వానించామని అదే విధంగా విజయకాంత్‌ను పిలిచామే కానీ అతడిని బలవంత పెట్టలేదన్నారు. అయితే విజయకాంత్ నిర్ణయం వలన డీఎంకేకు నష్టం లేదని తమకంటూ ఓటు బ్యాంక్ ఉందన్నారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగలదని, కొత్త పార్టీలు, కూటమిలు తమ విజయాన్ని అడ్డుకోలేవని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇతర పార్టీలకు ఓటు వేసి ఓట్లును నిరుపయోగం చేయరని డీఎంకేకు తమ ఓట్లును వేసి సద్వినియోగం చేసుకుంటారని కనిమొళి తెలిపారు. -
నిరాశలో డీఎండీకే శ్రేణులు
పళ్లిపట్టు: డీఎంకేతో దోస్తి కట్టడం ఖాయమని డీఎండీకే కార్యకర్తలు ఆశతో ఎదురుచూసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఒంటరి పోరు ప్రకటన పార్టీ క్యాడర్‌ను నిరాశలో ముంచింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఏర్పాటు చేసి అన్నాడీఎంకేను అధికారానికి దూరం చేస్తామని సవాల్ పలుకుతూ వచ్చారు. ఈ క్రమంలో కాంచీపురంలో నిర్వహించిన మహానాడులో పొత్తుపై ప్రకటిస్తారని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఆ మహానాడులో మాట్లాడిన విజయకాంత్ కింగ్ కావాలా కింగ్ మేకర్ కావాలా అనే ప్రశ్న లేవనెత్తి కూటమి విషయంలో సస్పెన్స్‌లో పెట్టారు. అనంతరం పార్టీ తరఫున పోటీ చేసేందుకు నామినేషన్ చేసిన శ్రేణుల నుంచి విజయకాంత్ లేవనెత్తిన ప్రశ్నలకు తమ పొత్తు నిర్ణయాన్ని 90 శాతం పార్టీ జ్లిలా కార్యదర్శులు, యూనియన్ కార్యదర్శులు, అధికార ప్రతనిధులు, రాష్ట్ర స్థాయి నిర్వాహకులు సైతం అన్నాడీఎంకేను ఓడించేందుకు డీఎంకేతో జతకట్టాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకేతో డీఎండీకే పొత్తు ఖాయమని మీడియాలో వచ్చిన వార్తలతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపించారు. ఎన్నికలకు సైతం సిద్ధమవుతూ వచ్చారు. ఈ క్రమంలో చెన్నైలో నిర్వహించిన మహిళా దినోత్సవ డీఎండీకే బహిరంగ సభలో పాల్గొన్న విజయకాంత్ మాట్లాడుతూ డీఎండీకే ఓంటరిగా పోటీ చేస్తుందని కుండ బద్దలు కొట్టడంతో పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. విజయకాంత్ నిర్ణయం పట్ల డీఎండీకే శ్రేణుల దిగ్భ్రాంతి విజయకాంత్ డీఎండీకే ను 1996 లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు, మహానాడులో, ఎన్నికల్లో పోటి చేసి పార్టీ కోసం తమ ఆస్తులు సైతం కోల్పోయాం. 2006 లో అన్నాడీఎంకేతో జతకట్టి విజయం సాధించినా పొత్తు మూడు నెలలు కూడా కాకముందే అధికార పార్టీతో విభేదించడంతో తీవ్రంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 2014 లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరినా విజయం సాధించేకోలేని పరిస్థితి. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహానాడులు, సమావేశాలు, వివిధ వేడుకలు, పార్టీకి నిధులు అందజేశాం. ప్రజా వ్యతిరేక అన్నాడీఎంకే ప్రభుత్వానికి అంతం పలికేందుకు పొత్తు పెట్టడం ఖాయమని చెప్పుకుంటూ రావడంతో నమ్మకంతో అప్పులు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాం. అయితే పార్టీ క్యాడర్‌కు ఏ మాత్రం ఇష్టం లేని విధంగా ఒంటరి పోరుతో తమ బతుకులు ఇక బజారు బతుకులు కాక తప్పదు. అన్నాడీఎంకేను ఇంటికి పంపాలనే లక్ష్యంతో వ్యవహరిస్తూ వచ్చిన కెప్టెన్ ఎన్నికల నాటికి ఒంటరి పోరుతో ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి భవిష్యత్ ఉండాలంటే కచ్చితంగా క్యాడర్ ఆశయం ప్రకారం డీఎంకేతో పొత్తు పెట్టాలన్నదే ఆ పార్టీలోని ప్రతి ఒక్కరి ఆశయంగా ఉంది. -
నేనే కింగ్
ఇక ఒంటరి సమరమే ప్రకటించిన కెప్టెన్ ప్రత్యామ్నాయం డీఎండీకే రెండో మేనిఫెస్టో విడుదల డీఎంకే, బీజేపీలకు షాక్ ‘కింగ్ మేకర్‌గా కాదు...కింగ్‌గా ఉండాలనుకుంటున్నా...ఇక ఎన్నికల్లో ఒంటరి సమరమే...’ అని డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం డీఎండీకే మాత్రమేనని స్పష్టం చేశారు. పొత్తు సస్పెన్షన్‌కు తెర దించుతూ విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే, బీజేపీ, ప్రజా కూటమిలకు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. చెన్నై : పది శాతం మేరకు ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపు కలుపుకునే దిశగా డీఎంకే, బీజేపీ, ప్రజా కూటమిలు తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయకాంత్ నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతూ వచ్చారు. ఈ సమయంలో రెండు రోజుల క్రితం విజయకాంత్ మా వెంటే అని డీఎంకే అధినేత కరుణానిధి ప్రకటించడం, అదే సమయంలో విజయకాంత్ సీఎం అభ్యర్థిగా కూటమి అని బీజేపీ ప్రకటించడం వంటి పరిణామాలతో డీఎండీకే కేడర్‌లో గందరగోళం బయలు దేరింది. ఇక నాన్చుడు ధోరణిని పక్కన పెట్టిన విజయకాంత్ తన మదిలో మాటను బయట పెట్టేందుకు నిర్ణయించారు. ఇందు కోసం వైఎంసీఏ మైదానంలో పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో మహిళా దినోత్సవ మహానాడుకు ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ మహానాడుకు ప్రాధాన్యం సంతరించుకోవడంతో అందరి చూపు వైఎంసీఏ మీద పడింది. ఇందులో ప్రేమలత విజయకాంత్ ప్రసంగించే క్రమంలో తొలుత అన్నాడీఎంకే సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రమంగా డీఎంకే టార్గెట్ చేసి వ్యాఖల్ని సంధించడంతో ఇక, ఆ పార్టీతో పొత్తు డౌటే అన్నది స్పష్టమైంది. అదే సమయంలో ప్రజాకూటమి, బీజేపీలను లెక్కలోకి తీసుకోకుండా ఆమె ప్రసంగం సాగడంతో డీఎండీకే పయనం ఎటో అన్న ప్రశ్న సర్వత్రా బయలుదేరింది. అయితే, ఆది నుంచి డీఎంకేను ప్రేమలత విమర్శిస్తూ వస్తున్న దృష్ట్యా, ఇక విజయకాంత్ ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఉత్కంఠ బయలు దేరింది. ఇక ఆలస్యంగా విజయకాంత్ వేదిక మీదకు వచ్చిన రాగానే, పార్టీ నేతృత్వంలో సిద్ధం చేసిన యాప్‌ను విడుదల చేశారు. తదుపరి రెండో మేనిఫెస్టో అంటూ, మహిళా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలు, పథకాలను వివరించే వీడియో చిత్రాన్ని విడుదల చేశారు. తదుపరి యథాప్రకారం తన దైన శైలిలో ప్రసంగాన్ని మొదలెట్టగానే, పొత్తు ప్రక టన చేస్తారా..? మళ్లీ నాన్చుడు ధోరణి అనుసరిస్తారా..? అన్న ఉత్కంఠ బయలు దేరింది. పొత్తు ప్రకటిస్తానంటూ, చివరకు విజయకాంత్ కింగ్ మేకర్‌గా కాదు...కింగ్ గా ఉండాలన్నదే కార్యకర్తల అభిమతంగా ప్రకటించారు. తానేదో భేరసారాల్లో ఉన్నట్టుగా తెగ కథనాలు వచ్చాయని, తానెవ్వరితోనూ ఎలాంటి భేరాలు సాగించ లేదని వ్యాఖ్యానించారు. చివరల్లో పొత్తు ప్రకటన చేస్తానని, అంత వరకు వేచి ఉండాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ, తాను కింగ్...ఒంటరిగానే ఎదుర్కొంటా....ఇక, తన ఎన్నికల పయనం ఒంటరి సమరమే.. అని స్పష్టం చేయడం విశేషం. ఒంటరి సమరమే అంటూ విజయకాంత్ ప్రకటన చేయడంతో అక్కడున్న డీఎండీకే వర్గాలు కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. తదుపరి అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఉందని, ఇందు కోసం ఓ కమిటీని ప్రకటిస్తూ, ఇక, ఒంటరిగా సమరాన్ని ఎదుర్కొనే కార్యచరణ మీదే దృష్టి... అంటూ ముగించడం విశేషం. కాగా, మహిళా సంక్షేమం, ప్రగతిని కాంక్షిస్తూ సరికొత్త పథకాల్ని, ప్రభుత్వ నేతృత్వంలో సినీ మాల్స్ నిర్మాణాలు, మహిళలకు అప్పగింత, పేద మహిళలకు ఆలయాల్లో ఉచిత వివాహాలు, అన్ని రకాల లాంఛనాలు, వివిధ రంగాల్లో శిక్షణలు, రాయితీలతో మహిళలకు రుణాలు, తదితర కొత్తప్రకటనలు మేనిఫెస్టో ద్వారా చేయడం విశేషం. ఇక, పొత్తు వ్యవహారాన్ని విజయకాంత్ తేల్చడంతో షాక్‌కు గురై తదుపరి కార్యచరణ మీద డీఎంకే, బిజేపీ, ప్రజా కూటమిలు దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. -
కరుణ వైపు చూపు
*తమీమున్ రెడి *కార్తీక్ కూడా *దరిదాపుల్లో విజయకాంత్ చెన్నై: రానున్న ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎం కరుణానిధి వెంట పయనం సాగించేందుకు మరికొన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇందులో మనిద నేయ జననాయగ కట్చి, అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి ఉన్నాయి. డీఎండీకే నేత విజయకాంత్ దరిదాపుల్లోకి చేరుకుని ఉన్నా, తుది నిర్ణయాన్ని సస్పెన్షన్‌లో పెట్టి ఉన్నారు. అధికారం లక్ష్యంగా తీవ్ర వ్యూహాలతో ముందుకు సాగుతున్న డీఎంకేతో పొత్తుకు కాంగ్రెస్ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. పాత స్నేహం మళ్లీ చిగురించడంతో ఇక, సీట్ల పందేరం కొలిక్కి రావాల్సి ఉంది. ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ డిఎంకే వెంటే పయనం కొనసాగించేందుకు నిర్ణయించింది. మరికొన్ని చిన్న పార్టీలు కరుణ వెంట నడిచేందుకు సిద్ధం కాగా, ప్రస్తుతం మరికొన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇందులో తమీమున్ అన్సారి నేతృత్వంలోని మనిద నేయ జననాయగ కట్చి, సినీ నటుడు కార్తీక్ నేతృత్వంలోని అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి ఉన్నాయి. ఎంఎంకేను చీల్చి తన బలాన్ని చాటుకునేందుకు తమీమున్ అన్సారి పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో చెన్నై వేదికగా మైనారిటీ సామాజిక వర్గం తన వెంటే అని చాటుకునే విధంగా భారీ మహానాడుకు తమీమున్ అన్సారీ కార్యచరణలో పడ్డారు. ఇక, తన తొలి పయనాన్ని డీఎంకేతో కలసి సాగించేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చాక, తన సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను టార్గెట్ చేసి అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చిని సినీ నటుడు కార్తీక్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొన్నా డిపాజిట్లు గల్లంతు కాక తప్పలేదు. తాజాగా, డిఎంకే వెంట నడిచేందుకు కార్తీక్ సిద్ధ పడ్డారు. తమకు అక్కున చేర్చుకునే విధంగా డిఎంకే వర్గాలతో మంతనాలకు సిద్ధమయ్యారు. ఇక, అందరి చూపు డీఎండీకే అధినేత విజయకాంత్ వైపు ఉంటూ వస్తోంది. నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతూ వస్తున్న విజయకాంత్, డీఎంకేతో పొత్తుకు గోపాలపురం దరిదాపుల్లోకి వచ్చి ఆగి ఉన్నారని చెప్పవచ్చు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ తమకు తప్పని సరి కావడంతో, రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికేందుకు డిఎంకే వర్గాలు సిద్ధంగానే ఉన్నాయి. అయితే, దరిదాపుల్లో ఆగిన విజయకాంత్ రెండు మూడు రోజుల్లో గోపాలపురంలోకి అడుగు పెట్టే యోచనలో ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో గురువారం తన నియోజకవర్గం రిషివంధియంలో జరిగిన కార్యక్రమంలో విజయకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడం ఆలోచించాల్సిందే. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం విదేశీ ఆస్తుల వ్యవహారంలో పార్లమెంట్, రాజ్య సభల్లో అన్నాడీఎంకే నానా రాద్దాంతం సృష్టిస్తుండడాన్ని ప్రస్తావిస్తూ, ఢిల్లీలో ఓ న్యాయం, రాష్ట్రంలో ఓ న్యాయమా ..? అంటూ అసెంబ్లీలో అధికార పక్షం తీరును దుయ్యబట్టారు. విజయకాంత్‌తో మంతనాలకు బీజేపీ పెద్దలు చెన్నై చేరుకునే సమయంలో ఆయన, రిషివంధియంకు చెక్కేయడం గమనార్హం. ఇక, డిఎంకేకు క్యాథలిక్ క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన సంఘం పెద్ద యూనికో హృదయ రాజ్ తమ మద్దతును డీఎంకేకు ఇస్తున్నామని ప్రకటించారు. -
కెప్టెన్ కింగ్
డీఎండీకే అధినేత విజయకాంత్ గొడుగు నీడన ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు.కెప్టెన్‌ను కింగ్ చేయడానికి రెడీ అంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించి ఉన్నారు. ఇక ప్రజా కూటమి విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయాన్ని పరిశీలనలో ఉంచింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ సాగుతున్న విషయం తెలిసిందే. ఆయన్ను తమ వైపు తిప్పుకునే యత్నం చేసి డీఎంకే దాదాపుగా విరమించుకుందని చెప్పవచ్చు. బీజేపీ, ప్రజా కూటమి ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాయి. అయితే ఒకరి గొడుగు నీడన తాను నిలబడడం కన్నా, తన గొడుగు నీడన ఇతరులు రావాలన్న కాంక్షతో విజయకాంత్ వ్యూహ రచనల్లో ముని ఉన్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా తాను ‘కింగ్’ కావాలో, లేదా కింగ్ మేకర్ కావాలో కార్యకర్తల అభీష్టానికి వదిలి వేస్తున్నట్టుగా కాంచీపురం మహానాడులో విజయకాంత్ ప్రకటించారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో కొంత భాగా న్ని ప్రకటించేశారు. తాను సీఎం కావాలన్న కాంక్ష విజయకాంత్‌లో పెరిగి ఉండడాన్ని బీజేపీ, ప్రజా కూటములు పరిగణనలోకి తీసుకునే పనిలో పడ్డాయి. విజయకాంత్‌తో దోస్తీ కట్టని పక్షంలో ఒంటరిగా మిగులుతామన్న ఆందోళనలో ఉన్న కమలనాథులు ఆయన్ను కింగ్‌గా చూడడానికి సిద్ధం అయ్యారు. విజయకాంత్ సీఎం అభ్యర్థిగా ప్రకటించేం దుకు తగ్గ కూటమికి బీజేపీ సిద్ధం అవుతున్నది. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు స్పందిం చడం గమనార్హం. విజయకాంత్‌ను కింగ్‌ను చేయడానికి తాము సిద్ధం అని వ్యాఖ్యానించి ఉండడం ఆలోచించాల్సిందే. విజయకాంత్‌ను కింగ్ గా చూడడానికి బీజేపీ సిద్ధం కావడంతో, ఆయన మద్దతు కోసం తీవ్ర కుస్తీలు పడుతున్న ప్రజా కూటమి పరిశీలనలో పడింది. ప్రజా కూటమిలోని ఎండీఎంకే, వామపక్షాలు, వీసీ కే వర్గాలు విజయకాంత్ వ్యూహాల్ని పరిశీలిస్తూ, అందుకు తగ్గట్టుగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. విజయకాంత్‌ను కింగ్ చేయడానికి తామూ సిద్ధం అని, అయితే ఆయన ప్రజా కూటమిలోకి రావాల్సి ఉంటుందని వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. తన వ్యూహాలకు పదును పెట్టి విజయకాంత్ కింగ్‌గా అవతరించే యత్నం చేస్తారా? లేదా, అధికారాన్ని శాసించే దిశగా కింగ్ మేకర్ అయ్యే మార్గాన్ని ఎంచుకుని డీఎంకే వైపు అడుగులు వేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. -
కెప్టెన్‌పై సీఎం పరువునష్టం దావా
చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువునష్టం కేసు దాఖలు చేశారు. జయ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ సెషన్స్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల మూడో తేదీన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ విడుదల చేసిన ప్రకటనలో చెన్నైలో గతేడాది సంభవించిన వరదలు కృత్రిమంగా సృష్టించబడ్డాయని ఆరోపించారు. అంతేకాకుండా ఈ వరద నష్టాన్ని జయలలిత పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మరునాడు అంటే నాలుగో తేదీ పత్రికలో ప్రకటన వచ్చింది. విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జయలలిత పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉందని, వాస్తవాలకు విరుద్ధమని జయ తరఫు న్యాయవాది జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయనపై పరువునష్టం కింద చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ అడిషనల్స్ సెషన్స్ కోర్టులో త్వరలో విచారణకు రానుంది. ఇదేవిధంగా వరద ముప్పు గురించి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రకటనను విడుదల చేసిన మురసోలి పత్రిక సంపాదకులు సెల్వంపై రెవెన్యూ శాఖా మంత్రి ఉదయకుమార్ తరఫున పరువునష్టం పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. -
మౌనం దేనికి అంగీకారమో?
కులదైవానికి కెప్టెన్ పూజలు మీడియా ఎదుట మౌనం చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ రానున్న ఎన్నికల్లో ఏదో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అది ఏమిటో అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. మంగళవారం తన కుల దైవం వీర చిన్నమ్మాల్ సన్నిధిలో సతీమణి ప్రేమలతతో కలిసి విజయకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. పొత్తు పై మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, మౌన ముద్రతో ముందుకు సాగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదేని కీలక ప్రకటనలు చేయాలన్న ముందుగా తన కుల దైవం ఆలయాన్ని సందర్శించడం జరుగుతూ వస్తున్నది. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తన చుట్టూ రాజకీయం తిరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై విజయకాంత్ మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. ఓవైపు బీజేపీ, మరో వైపు డిఎంకే, ఇంకో వైపు ప్రజా కూటములు ఆహ్వానం పలికి ఉండటంతో ఏదో ఒక కూటమిని ఎంపిక చేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని తెలిసింది. డిఎంకే కూటమి వైపుగా వస్తారన్న ప్రచారం ఉన్నా... ఆయన సతీమణి ప్రేమలత వ్యాఖ్యలు కొంత గందరగోళంలోకి నెట్టి ఉన్నాయి. బీజేపీ వైపుగా నడుస్తారా..? లేదా, ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థిగా నేతృత్వ పగ్గాలు చేపడుతారా..? అన్న ప్రశ్న ఉత్పన్నమయింది.. ఈ సమయంలో తన నిర్ణయం ఏమిటో ప్రకటించేందుకు మహానాడు వేదికగా కాంచీపురంను ఎంపిక చేసుకున్న విజయకాంత్, అందుకు తగ్గ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈనెల 20వ తేదీన జరగనున్న ఈ మహానాడు ద్వారా కీలక ప్రకటన చేయడానికి ఆయన సిద్ధం అయ్యారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం తన కుల దైవాన్ని దర్శించుకుని, మహానాడు ఆహ్వాన పత్రికకు పూజలు చేయడం గమనార్హం. కుల దైవానికి పూజలు : తన సతీమణి ప్రేమలతతో కలసి మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కాంగేయంకు ఉదయం విజయకాంత్ చేరుకున్నారు. అక్కడ కొలువు దీరి ఉన్న తన కుల దైవం వీర చిన్నమ్మాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయంలోకి వెళ్లే సమయంలో మరొకరి సాయంతో ముందుకు సాగిన విజయకాంత్ పూజల అనంతరం మౌనంగా బయటకు వచ్చారు. మీడియా చుట్టుముట్టినా, ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ముందుకు సాగారు. అయితే, ప్రేమలత మాత్రం తమ కులదైవాన్ని సందర్శించే విషయం తెలిసిందేగా అని సమాధానం ఇచ్చి కదిలారు. తదుపరి శ్రీవిళ్లి పుత్తూరు అండాల్ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన విజయకాంత్, తదుపరి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ ఆలయబాట తదుపరి ఆయన కీలక నిర్ణయం ప్రకటించడం ఖాయం. అయితే, ఆ నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ బీజేపీ, డీఎంకే, ప్రజా కూటమికి మరికొద్ది రోజులు తప్పదు. -
కెప్టెన్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం
చెన్నై: తమిళ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ చిక్కుల్లోపడ్డారు. జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై విజయ్‌కాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దేవరాజన్ అనే జర్నలిస్ట్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుబ్బయ్య విచారించారు. గత నెలలో ప్రెస్ మీట్ సందర్భంగా విజయ్‌కాంత్ మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా అని ఓ విలేకరి విజయకాంత్‌ను ప్రశ్నించగా ... ఈ ప్రశ్నను జయలలితను అడిగే దమ్ము మీకుందా అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ.. మీకు భయం.. మీరు జర్నలిస్టులా అంటూ ఉమ్మి వేశారు. అప్పట్లో ఈ ఘటనను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దేవరాజన్ హైకోర్టును ఆశ్రయించారు. డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, మైలాపూర్ డిప్యూటి పోలీస్ కమిషనర్లను ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. డిసెంబర్ 28న ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశానని, స్పీడ్ పోస్ట్ లో కాపీని పోలీసు ఉన్నతాధికారులకు పంపానని, అయితే పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని దేవరాజన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. విజయ్ కాంత్ పై చట్టప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. -
ఎటూ తేల్చని కెప్టెన్!
సాక్షి, చెన్నై : ఏ విషయాన్ని త్వరితగతిన తేల్చని డీఎండీకే అధినేత విజయకాంత్, ఎన్నికల పొత్తుల్లోనూ అదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. కూటమి అంశాన్ని మరో నెలన్నర రోజులు సాగ దీయడానికి సిద్ధమయ్యారు. బీజేపీ, ప్రజా కూటముల్ని ఊరిస్తూనే, అన్నాడీఎంకే నిర్ణయం మేరకు డీఎంకేతో చెలిమికి వ్యూహ రచన చేస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌కు దూకుడు ఎక్కువే. విమర్శలు, ఆరోపణలు గుప్పించేటప్పుడు గానీ, అనుచరులు ఏ చిన్న తప్పు చేసినా చితక్కొట్టడంలో గానీ ఈ దూకుడును ప్రదర్శించడం జరుగుతూ వస్తోంది. ఇక, ఏదేని నిర్ణయం తీసుకోవాలంటే అందరితోనూ చర్చించడం, చివరకు కింది స్థాయి కార్యకర్త అభిష్టాన్ని తీసుకున్నాకే వెల్లడించడం చేస్తూ వస్తున్నారు. అదే బాణిని ప్రస్తుతం అనుసరించే పనిలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో తన మద్దతు కీలకం కావడం, తన చుట్టూ రాజకీయం సాగుతుండడం విజయకాంత్‌కు లోలోన ఆనందం కలిగిస్తోంది. అయితే, గత ఎన్నికల్లోలా కాకుండా, ఈ సారి పొత్తు వ్యవహారంలో ఆచితూచి స్పందించాలని నిర్ణయించారు. శనివారం పెరంబలూరు వేదికగా జరిగిన పార్టీ సమాలోచన సమావేశం, సర్వ సభ్యం భేటీలో ఇందుకు తగ్గ వ్యూహాల్ని రచించి ఉన్నారు. ఈ సమావేశంలో పార్టీ వర్గాలు మెజారిటీ శాతం మంది విజయ కాంత్‌ను సీఎంగా చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినా, అందుకు తగ్గ పరిస్థితులు రాష్ట్రంలో ఉందా..?, ఇది సాధ్యమేనా ..? అన్న ప్రశ్న కెప్టన్ మదిలో మెదులుతున్నట్టు సమాచారం. బీజేపీ లేదా ప్రజా కూటమిలతో కలసి పనిచేస్తే వచ్చే ఫలితాలు, డీఎంకేతో చెలిమికి సిద్ధ పడితే, వచ్చే లాభ నష్టాలపై ఈ సమావేశంలో కెప్టెన్ బేరిజు వేసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పొత్తు అన్న అంశాన్ని మరికొన్నాళ్లు తేల్చకుండా ఉండేందుకు నిర్ణయించడంతో పాటుగా తన వ్యూహాల్లో ఒకొక్కటి అమలుకు సిద్ధమైనట్టున్నారు. ముందుగా బీజేపీ, ప్రజా కూటమిల మదిలో తన మీదున్న అభిప్రాయాన్ని పసిగట్టేందుకు వీలుగానే, సీఎం ఆకాంక్షతో తాను ఉన్నట్టు ప్రకటించుకుని ఉన్నారని చెబుతున్నారు. ఆ రెండు పార్టీల్లో ఎవ్వరో ఒకరు తనను సీఎం అభ్యర్థి గా ప్రకటిస్తే, అందుకు తగ్గట్టు ఆ సమయంలో నిర్ణయం తీసుకునేం దుకు విజయకాంత్ నిర్ణయించి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నా యి. ప్రజా కూటమిలో ముసలం బయలు దేరి ఉండటం, వీరి వైపు నుంచి వచ్చే స్పందనను, ఆ కూటమిలో సాగే వ్యవహారాలను నిశితం గా పరిశీలించాలని పార్టీ వర్గాలకు కె ప్టెన్ సూచించి ఉన్నారని డీఎండీకే నేత ఒకరు పేర్కొన్నారు. ఇక, అన్నాడీఎంకే నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే బీజేపీకి స్పష్టమైన హామీ ఇవ్వాలని సంకల్పించినట్టు చెబుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా తన నిర్ణయం ఉంటుందని పొత్తు అంశంపై ఆ పార్టీ అధినేత్రి జయలలిత ప్రకటించి ఉన్న దృష్ట్యా, కమలం అడుగుల్ని సైతం నిశితంగా పరిశీలించేందుకు పార్టీ వర్గాల్ని రంగంలోకి దించి ఉన్నారు. ఇక, తన కోసం డీఎంకే తలుపులు తెరుచుకునే ఉన్నందున, ఆ పార్టీని దూరం చేసుకోకుండా ఆచీ తూచి స్పందించేందుకు తగ్గ ఉపదేశాలను పార్టీ వర్గాలకు విజయకాంత్ చేసి ఉండటం గమనార్హం. తనకు డీప్యూటీ సీఎంతో పాటుగా 70 సీట్లు ఇస్తే డీఎంకేతో కలిసి పనిచేయడానికి సిద్ధం అన్న నిర్ణయాన్ని పార్టీ వర్గాల ముందు విజయకాంత్ ఉంచినా, పొత్తు అంశంపై అన్నాడీఎంకే వేసే ఎత్తుగడల మేరకు డీఎంకేతో చెలిమి అన్న విషయాన్ని స్పష్టం చేసినట్టు మరో నేత పేర్కొనడం గమనార్హం. అందుకే పొత్తు అంశాన్ని మరో నెలన్నర రోజులు సాగదీయడానికి నిర్ణయించి, ఫిబ్రవరి చివరి వారం లేదా, మార్చి మొదటి వారంలో పార్టీ మహానాడుకు కసరత్తుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఈ మహానాడు వేదికగా అందరి అభీష్టం మేరకు మార్చి రెండు లేదా, మూడో వారం విజయకాంత్ తన నిర్ణయాన్ని చెబుతారని, అంత వరకు అందరితోనూ మంతనాల పర్వం సాగాల్సిందేనని పేర్కొనడం గమనించాల్సిన విషయం. -
పొత్తులపై కెప్టెన్ రూటు ఎటు?
చెన్నై: కెప్టెన్ విజయకాంత్ స్థాపించిన తమిళ పార్టీ డీఎండీకే శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలన్న నిర్ణయాన్ని అధినేతకు అప్పగిస్తూ తీర్మానించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేత జయలలిత విజయానికి సహకరించిన విజయ్‌కాంత్ ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో జత కట్టారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో రాజకీయంగా అందరి దృష్టి ఆయనపైనే ఉంది. దేసియ ముర్పోకు ద్రవిడ కజగం (డీఎండీకే) ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామియేనని బీజేపీ భావిస్తుండగా విజయ్‌కాంత్ మాత్రం ఎవరితో జత కట్టాలనే విషయమై ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అయితే తన డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకొచ్చే పార్టీలతోనే ఆయన పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే ఏ కూటమితోనైనా చేతులు కలుపుతానని ఆయన స్పష్టం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. డీఎండీకే ఇప్పుడు తమిళనాడులో నెంబర్-2 స్థానంలో ఉంది. దీంతో ఇప్పటికే తమతో కలిసిరావాలని డీఎంకే సుప్రీం కరుణానిధి విజయ్‌కాంత్‌కు ఆహ్వానం పంపారు. అలాగే వామపక్షాలు, వైకో ఎండీఎంకే పార్టీలతో కొత్తగా ఏర్పడిన ప్రజా సంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్) కూడా విజయ్‌కాంత్‌తో పొత్తుకు తహతహలాడుతోంది. విజయ్‌కాంత్ మాత్రం ఎప్పటిలాగే కింగ్ మేకర్లాగా ఉండేందుకు సిద్ధపడటం లేదు. మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి పీఠాన్నే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల పీడబ్ల్యూఎఫ్ నేతలతో జరిగిన చర్చల్లో ఇదే విషయాన్ని కెప్టెన్ స్పష్టం చేసినట్టు సమాచారం. విజయ్‌కాంత్‌కు బలమైన ఓటుబ్యాంకు ఉంది. 2006 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన విజయ్‌కాంత్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే 10శాతం ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనతో జతకట్టే ఏ కూటమి అయినా ఎక్కువ స్థానాలు గెలుపొందే అవకాశముంది. అదేవిధంగా విజయ్‌కాంత్ ఒంటరిగా పోటీచేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని పరిశీలకులు చెప్తున్నారు. దీంతో ఏ కూటమి వైపు విజయ్‌కాంత్ మొగ్గుచూపుతారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. -
కెప్టెన్‌కి డీఎంకే గాలం
టీనగర్: తమ కూటమి నుంచి విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఆరోపించారు. ఇది సత్సంప్రదాయం కాదని మండిపడ్డారు. హెచ్.రాజా శుక్రవారం చెన్నై టీనగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని హిందువులు ఎటువంటి గొడవల్లోనూ పాల్గొనరని తెలిపారు. ముస్లిం తీవ్రవాదులు మాత్రమే రాష్ట్రంలో ఏదో ఒక ఉత్పాతాన్ని సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ప్రజలు మౌనం పాటిస్తూ, రాష్ట్రంలో ప్రతి ఏడాదీ డిసెంబర్ ఆరో తేదీన స్మారకదినం అంటూ ఉద్రిక్త వాతావరణాన్ని కలిగిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం కొత్త సంవత్సరంలో మొదటి రోజుని వాణియంబాడి న్యూటౌన్‌లో అవాంఛనీయ సంఘటనకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. బీజేపీకి చెందిన జిల్లా మాజీ నిర్వాహకుడు శివప్రకాశంపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఆంబూరు ఉద్రిక్తతకు సంబంధించి అరెస్టయిన ముస్లిం తీవ్రవాదులు బెయిలుపై విడుదలై స్వేచ్ఛగా తిరుగుతున్నారని రాజా పేర్కొన్నారు. వారిని గూండా చట్టం కింద అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి సూచించారు. మహిళలు లెగిన్స్, జీన్స్ ధరించి ఆలయాలకు వెళ్లడాన్ని నిషేధించడం హర్షణీయమని, దీన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువులు, జలాశయాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించడం వల్లే చెన్నై నగరానికి వరదలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ ఆక్రమణలు డీఎంకే ప్రభుత్వ హయాంలోనే అధికంగా జరిగాయన్నారు. విజయకాంత్ డీఎంకే కూటమిలోకి రావాలంటూ కరుణానిధి ఆహ్వానించడంపై విలేకరులు ప్రశ్నించగా విజయకాంత్ తమ కూటమిలోనే ఉన్నారని రాజా స్పష్టం చేశారు. ఈ కూటమి ఇంకా కొనసాగుతోందన్నారు. విజయ్ కాంత్ ని డీఎంకే ఆహ్వానించడం సత్సంప్రదాయం కాదని విమర్శించారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ ఉన్నారు. -
పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న విజయకాంత్
అనేక పార్టీలతో బేరసారాలు తలపట్టుకుంటున్న డీఎంకే, బీజేపీ అన్నాడీఎంకేలోకి రెబల్ ఎమ్మెల్యేలు చెన్నై : ఎన్నికల కూటమికై అన్ని పార్టీల్లో జోరుగా కసరత్తులు సాగుతున్న తరుణంలో డీఎండీకే అధినేత విజయకాంత్ తన వింత వైఖరితో పార్టీలను ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల్లో అన్నాడీఎంకే, డీఎంకే తరువాత డీఎండీకే మూడోస్థానాన్ని ఆక్రమించి ఉంది. ఏ ఎన్నికలు జరిగినా ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే గట్టిపోటీ నెలకొనగా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి అధికార పీఠాన్ని దక్కించుకుంటాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మారిపోయింది. జార్జికోటపై జెండా పాతేందుకు మరో రెండు కూటములు సిద్దం అవుతున్నాయి. పొత్తులపై ఇప్పట్లో నిర్ణయం ఉండదని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన మనస్సులోని మాట గురువారం నాటి సమావేశంలో బైటపెట్టింది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేసే అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే ఆ తరువాతి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పంచన చేరింది. ఎన్నికల అనంతరం బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లుగా విజయకాంత్ వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం కెప్టెన్‌ను వదులుకోరాదని మంచిగా మెలుగుతోంది. ఇటీవల ఆయన ఇంటికి సైతం వెళ్లి పొత్తు ఖరారుకు ప్రయత్నాలు చేసింది. అయితే విజయకాంత్ తనదైన శైలిలో దాటవేయడంతో బీజేపీ నేతలు బిక్కమొహం వేశారు. విజయకాంత్‌తో బీజేపీ సాగించిన రెండు విడదల చర్చలు విఫలం కావడంతో డీఎంకే వేగం పెంచింది. విజయకాంత్‌తో తన జట్టులో కలుపుకోవాలని డీఎంకే గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రత్యక్షంగా ఆహ్వానం కూడా పలికింది. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా తాను ముఖ్యమంత్రి అభ్యర్దిగా ఉంటానని విజయకాంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు బీజేపీ ఎంతోకొంత మొగ్గుచూపుతోంది. అయితే డీఎంకేతో చేతులు కలిపితే విజయకాంత్‌కు ముఖ్యమంత్రి అభ్యర్దిత్వం దక్కే అవకాశమే లేదు. కనీసం ఉప ముఖ్యమంత్రిగానైనా ప్రకటించాలని డీఎంకే వద్ద విజయకాంత్ బేరమాడుతున్నట్లు సమాచారం. అయితే అన్నాడీఎంకేతో కయ్యానికి కాలుదువ్వడం అనే అంశంలో డీఎంకే, డీఎండీకేల వైఖరి ఒకేలా ఉండటంతో చెలిమికి ఆస్కారం ఉంది. ఇతర పార్టీలతో పోల్చుకుంటే బీజే పీతో కొంత సఖ్యత ఉన్నా విజయకాంత్..అకస్మాత్తుగా బీజేపీ అన్నాడీఎంకేల మధ్య సంధికుదిరిన పక్షంలో దూరం జరగక తప్పదు. ఇదిలా ఉండగా, విజయకాంత్‌ను సీఎం అభ్యర్దిగా ప్రకటించేందుకుక మక్కల్ నల కూట్టని సిద్దంగా ఉన్నట్లు సమాచారం. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్దిత్వం, పెద్ద సంఖ్యలో పోటీకి సీట్లు వంటి అనేక అజెండాలతో అన్ని పార్టీలతోనూ విజయకాంత్ మంతనాలు సాగించడంతో డీఎంకే, బీజేపీలకు అంతు బట్టడంలేదు. ప్రాంతీయ పార్టీల జాబితాలో మూడోస్థానంలో ఉన్న డీఎండీకే ముప్పతిప్పలు పెట్టడాన్ని మింగలేక, కక్కలేక అవస్థలు పడుతున్నారు. అన్నాడీఎంకేలోకి రెబల్ ఎమ్మెల్యేలు: పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ అష్టకష్టాలు పడుతుండగా, అదే పార్టీకి చెందిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే వైపు వలసబాట పడుతున్నారు. సుమారు ఏడాది క్రితమే అమ్మ పంచన చేసిన డీఎండీకే ఎమ్మెల్యేలు సుందరరాజన్ (మదురై సెంట్రల్), తమిళ్ అళగన్ (తిట్టకుడి), అరుణ్ సుబ్రమణియన్ (తిరుత్తణి), సురేష్‌కుమార్ (సెంగమ్), శాంతి ( సేందమంగళం), పాండియరాజన్ (విరుదనగర్), మైకేల్ రాయప్పన్( రాధాపురం), అరుణ్ పాండియన్ (పేరావూరణి) జనవరి చివరి వారంలో అన్నాడీఎంకేలో చేరుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే చివరి అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అన్నాడీఎంకే తీర్దం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. -
థూ.. అని ఉమ్మేశారు!
-
థూ.. అని ఉమ్మేశారు!
చెన్నై: అధికారం ఇచ్చినా సరే, లేకుంటే పీఎం పదవైనా ఓకే అంటూ వ్యాఖ్యలు చేసిన డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా మీడియాపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో నిలిచారు. డీఎండీకే పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయకాంత్‌ను మీడియా పలకరించింది. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే అయ్యగారు తన ప్రతాపం చూపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా అని విజయకాంత్‌ను ఓ విలేకరి ప్రశ్నించగా ...అందుకు ఆయన సావధానంగానే జవాబిచ్చారు. అంతేకాకుండా అన్నాడీఎంకే మళ్లీ అధికారాన్ని చేపట్టడం సాధ్యం కాదని ఆయన తేల్చిపారేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ విజయకాంత్ అకస్మాత్తుగా విలేకరులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నను జయలలితను అడిగే దమ్ము మీకుందా అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. అనంతరం ఆగ్రహంతో ఊగిపోతూ.. మీకు భయం.. మీరు జర్నలిస్టులా అంటూ థూ.. అని వారిపై ఉమ్మి వేశారు. ఈ ఘటనను పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విజయకాంత్ వైఖరిని జర్నలిస్టు సంఘాలు తప్పుబట్టాయి. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
విజయకాంత్‌కి ఆహ్వానం
విజయకాంత్‌కు కరుణ ఆహ్వానం ఎన్నికల మేనిఫెస్టో కసరత్తు చెన్నై : డీఎంకేతో దోస్తికి ముందుకు రావాలని డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి స్వయంగా ఆహ్వానం పలికారు. ఎన్నికల మేనిఫెస్టో కసరత్తుకు డీఎంకే శ్రీకారం చుట్టింది. డీఎండీకేను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయకాంత్ వారికి చిక్కకుండా ముందుకు సాగుతున్నారు. ఇన్నాళ్లు డీఎంకే దూతలు విజయకాంత్‌తో మంతనాలు సాగిస్తే, తాజాగా ప్రజా కూటమి రంగంలోకి దిగడంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం మెట్టుదిగినట్టు ఉన్నారు. విజయకాంత్‌కు స్వయంగా కరుణానిధి ఆహ్వానం పలకడం విశేషం. బుధవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఎన్నికల మేనిఫెస్టో కసరత్తులకు కరుణానిధి శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టో కమిటీతో భేటీ అయ్యారు. తదుపరి మీడియా ముందుకు వచ్చిన కరుణానిధి విజయకాంత్‌కు ఆహ్వానం పలికారు. డీఎంకేతో దోస్తికి విజయకాంత్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా కూటమి నాయకులు డీఎండీకే అధినేత విజయకాంత్‌తో భేటీ కావడం గురించి ప్రశ్నించగా, సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. -
సీఎం అభ్యర్థిగా కెప్టెన్
►కమలం పెద్దల నిర్ణయం..? ► విజయకాంత్‌తో చర్చల జోరు ► ఎన్డీఏలోనే ఆయన : పొన్ రాధాకృష్ణన్ ► ప్రేమలతతో తమిళి సై భేటీ సాక్షి, చెన్నై : బీజేపీ సీఎం అభ్యర్థిగా డీఎండీకే అధినేత విజయకాంత్ పేరును ప్రకటించేందుకు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో విజయకాంత్‌తో కమలనాథుల మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఇక, ఆయన ఎన్డీఏలోనే ఉన్నారని, ఉంటారంటూ కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలసి డీఎండీకే అధినేత విజయకాంత్ పయనించిన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో కమలనాథులతో అంటీఅంటనట్టు వ్యవహరించడం మొదలెట్టారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందన్న ఆగ్రహాన్ని పలు మార్లు వ్యక్తం చేసి ఉన్నారు. తాను ఎన్డీఏలో లేదన్నట్టుగా వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం పదవిని ఆయనకు కట్టబెట్టేందుకు తగ్గ మంతనాలు సాగినట్టు సమాచారం. అయితే, డీఎంకే, అన్నాడీఎంకేలకు తాను దూరం అని పదే పదే విజయకాంత్ వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. దీంతో డీఎంకే ప్రయత్నాలు నీరుగారినట్టు అయ్యాయి. అలాగే, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో కూడిన ప్రజా కూటమికి మద్దతుగా విజయకాంత్ వ్యాఖ్యలు అందుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకున్నట్టైంది. ఆయన వస్తే, అందరితో చర్చించి సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధం అని ఎండీఎంకే నేత వైగో ప్రకటించారు. దీంతో విజయకాంత్ అడుగులు ఆ వైపుగానే ఉంటాయన్న ప్రచారం బయలు దేరింది. ఈ సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి కమలనాథులు సిద్ధమైనట్టున్నారు. తమతో చేతులు కలిపిన పక్షంలో సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును తెర మీదకు తెస్తామో, తీసుకురామో అన్న బెంగ తో ఉన్న డీఎండీకే వర్గాల్లో నమ్మకాన్ని కల్గించే ప్రయత్నాలకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో పార్టీ అధినేత అమిత్‌షాతో సాగిన భేటీలో విజయకాంత్ ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. అలాగే, అన్నాడీఎంకేతో కలిసి నడవడం కన్నా, బీజేపీ, డీఎండీకే, ఇతర పార్టీలు కలిసి నడిస్తే లాభం ఉంటుంద న్న వాదనను కొందరు నేతలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో విజయకాంత్ ఇతర కూటమిలోకి వెళ్లకుండా, ఆయన్ను బీజేపీ వైపే ఉండే విధంగా మంతనాలు సాగించాలని అమిత్ షా ఆదేశించినట్టు తెలిసింది. ఆయన్ను బీజేపీ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించేం దుకు తగ్గ ఏకాభిప్రాయాన్ని పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామన్న హామీని అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. విజ యకాంత్ తమ చేతి నుంచి జారిపోకుండా జాగ్రత్తలకు సిద్ధమైన రాష్ట్ర నాయకులు మంతనాల జోరులో పడ్డట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో శనివారం విజయకాంత్‌తో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ , ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్‌తో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ భేటీ కావడం గమనార్హం. ఈ భేటీలో విజయకాంత్ ప్రజా కూటమి వైపుగా అడుగులు వేయకుండా, ఆయన మనస్సు మార్చే ప్రయత్నం చేసినట్టుగా కమలాలయం వర్గాలు పేర్కొం టున్నాయి. సీఎం అభ్యర్థిత్వానికి విజయకాంత్ పేరును తప్పకుండా తమ అధిష్టానం ప్రతిపాదిస్తుందన్న నమ్మకాన్ని కల్గించే యత్నం చేసినట్టు సమాచారం. ఈ విషయంగా పొన్ రాధాకృష్ణన్‌ను కదిలించగా, ఆయన ఎన్డీఏ వెంటే అని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆయన తమతో కలిసి అడుగులు వేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇక, తమిళి సై సౌందరరాజన్‌ను కదిలించగా, తాను ప్రేమలతతో భేటీ కావడం కొత్తేమి కాదన్నారు. తరచూ తాము కలవడం జరుగుతున్నదని, తాము మంచి మిత్రులం అన్నట్టుగా స్పందించడం బట్టి చూస్తే, విజయకాంత్ దారి ఏ వైపు ఉంటుందోనన్న ఎదురు చూపులు మిగిలిన పార్టీల్లో నెలకొంది. -
'విజయకాంత్ మా కూటమిలోకి రండి'
ఎరగా నగదు డీఎంకేపై వైగో ఆగ్రహం ప్రజా కూటమిలోకి విజయకాంత్‌కు ఆహ్వానం చెన్నై : ఎండీఎంకేను నిర్వీర్యం చేయడానికి మహా కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేత వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ వర్గాలకు నగదు, పదవుల్ని ఎరగా వేస్తూ డీఎంకే వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఇక, ప్రజా కూటమిలోకి రావాలని డీఎండికే అధినేత విజయకాంత్‌కు పిలుపునిచ్చారు. ఎండీఎంకే నుంచి వలసల పర్వం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు మళ్లీ పాత గూటికే (డీఎంకే)లోకి చేరే పనిలో పడ్డారు. మరి కొందరు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా, ఎండీఎంకేకు బలం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల మీద డీఎంకే కన్నేసింది. అక్కడి ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని తమ వైపు ఆకర్షించేందుకు శ్రీకారం చుట్టి, కార్యరూపం దాల్చే పనిలో డీఎంకే వర్గాలు పడ్డాయి. ఎక్కడెక్కడ జంప్ జిలానీలు ఉన్నారో వారిని పసిగట్టే పనిలో పడ్డ ఎండీఎంకే నేత వైగో, వారు పార్టీ ఫిరాయించకుండా చూసేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. బలం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ వర్గాలకు భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా తన పార్టీని దెబ్బతీసేందుకు మహా కుట్ర జరుగుతున్నదంటూ గురువారం వైగో తీవ్రంగానే స్పందించారు. ఈ కుట్రకు వ్యూహకర్త డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అని నిప్పులు చెరిగారు. పధకం ప్రకారం తనను, తన పార్టీని టార్గెట్ చేసి స్టాలిన్ ముందుకు సాగుతున్నట్లుందని ధ్వజమెత్తారు. ఈ ప్రయత్నాలను, కుట్రను ఎదుర్కొని తన బలాన్ని చాటుకుంటానని ప్రకటించారు. కొన్ని చోట్ల తన పార్టీ వర్గాలకు నగదు, పదవులు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీన్ని బట్టి చూస్తే, డీఎంకే ఎంతగా దిగజారుడు నీచ రాజకీయాలు సాగిస్తోందో స్పష్టమైందని దుయ్యబట్టారు. ఇక, డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రజా కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో ఏర్పడిన ఈ ప్రజా కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ కూడా రావాలని ఎదురు చూస్తున్నామని, ఆయనకు ఆహ్వానం సైతం పలికామన్నారు. ఒకవేళ విజయకాంత్ ప్రజా కూటమిలోకి వస్తే, ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? అన్న ప్రశ్నకు.. ఆయన వస్తే ఆనందమేనని, అయితే ప్రజా కూటమికి నాయకత్వం ఎవరు వహించాలన్నది అందరూ చర్చించుకుని సమష్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఎంజీయార్‌కే పంగనామాలు
చెన్నై : ప్రజలకే కాదు...దివంగత నేత ఎంజీయార్‌కు సైతం అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత పంగనామాలు పెట్టారంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోపించారు. ఇందుకు తగ్గ లేఖ ఆధారం తన వద్ద ఉందని వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో డీఎండీకే నేతృత్వంలో గురువారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో విజయకాంత్ ప్రసంగిస్తూ, తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అంటూ సీఎం జయలలిత వ్యాఖ్యానిస్తుంటే, పోలీసు భద్రత మీద తమకు నమ్మకం లేదంటూ ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర పోలీసుల మీద తమకు నమ్మకం లేదని, కేంద్ర భద్రత అవసరం అని కోర్టు వ్యాఖ్యాలు చే స్తుండడం బట్టి చూస్తే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ మేరకు క్షీణించాయో స్పష్టం అవుతోందన్నారు. ప్రజలకు భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జయలలిత, ఇప్పుడు ఆ కేంద్రంలో ఉత్పత్తి ఆగిందంటూ, అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడం బట్టిచూస్తే, ఏ మేరకు అక్కడి ప్రజల్ని ఆమె మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు. అరాచకాలు పెరిగాయని, అవినీతి తాండవం చేస్తున్నదని పేర్కొంటూ, ఎలాగైనా సరే, కుట్రలు, కుతంత్రాలు, వ్యూ హాలతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జయలలిత ప్రయత్నాల్లో ఉ న్నారని, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలు పు నిచ్చారు. ఓటుకు రూ. మూడు నుంచి రూ. ఐదు వేల వరకు ఇస్తారని, అది ప్రజల సొమ్ము కాబట్టి, వాటిని అందరూ తీసుకోవాలని, ఓటు మాత్రం మంచి వాళ్లకు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకే కాదు...ఎంజీయార్‌కే పంగనామాలు పెట్టిన ఘనత జయలలితకు దక్కుతుందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని తరిమికొడుదామని పిలుపు నిచ్చారు. ఇక, చెన్నైలో విలేకరులతో మాట్లాడిన, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడ్డారు. రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. అలాగే, తిరుచ్చిలో జరిగిన బీజేపీ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీ ధర్‌రావు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకేకు గుణపాఠం త థ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జయలలితకు రాజకీయ సంబంధిత సంబంధాలు లేవు అని, కేవలం పరిపాలనా పర వ్యవహారాల మధ్య సంబంధాలు మాత్రమే ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
కెప్టెన్ చిక్కేనా?
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఉన్న కనీస ఓటు బ్యాంక్ ఆయనకు ఓ వరం. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ ఆయన చుట్టూ పార్టీలు తిరగక తప్పడం లేదు. ప్రస్తుతం విజయకాంత్ చుట్టూ మూడు పార్టీలు ప్రదక్షిణ చేసే పనిలో పడ్డారు. ప్రజా కూటమిలోకి ఆయన్ను ఆహ్వానించడమే లక్ష్యంగా రంగంలోకి వైగో దిగారు. చెన్నై : గతంలో ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్న విజయకాంత్ పది శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారు. దీంతో ఆయనకు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. చివరకు అన్నాడీఎంకేతో జత కట్టి ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఆ పార్టీతో ఏర్పడ్డ విబేధాలతో బయటకు వచ్చి, చివరకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పక్షాన చేరారు. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా తన ఓటు బ్యాంక్‌ను మాత్రం పదిలం చేసుకున్నారు. ఈ ఓటు బ్యాంకే ప్రస్తుతం విజయకాంత్ చుట్టూ పార్టీలు తిరిగేలా చేస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ ఓటు బ్యాంక్ తమకు కలసి వస్తాయన్న ఆశాభావంతో తొలుత డీఎంకే వర్గాలు తీవ్రంగానే ఆయన్ను లాగే యత్నం చేశాయి. అయితే, విజయకాంత్ నోరు మెదపలేదు. ఎన్నికల సమయానికి ఆయన తమ వైపునకు తప్పకుండా వస్తారన్న ఆశాభావం డీఎంకే వర్గాల్లో ఉన్నా, ఇటీవలి పరిణామాలు కంగు తినిపించేలా చేస్తున్నాయి. ప్రజా కూటమి : ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎంఎంకే నేత జవహరుల్లా, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ఒకే వేదిక మీదుగా వచ్చి ప్రజా కూటమిని ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న ఈ కూటమి ఎన్నికల కూటమిగా అవతరిస్తుందన్న ధీమాను పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ కూటమిలోకి డీఎండీకే నేత విజయకాంత్, టీఎంసీ నేత జీకే వాసన్‌లను ఆహ్వానించేందుకు కసరత్తులు సాగాయి. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి విజయకాంత్‌తో భేటీ కావడం ప్రజా కూటమి వర్గాలకు షాక్ ఇచ్చినట్టైంది. బీజేపీ వైపు ఎక్కడ విజయకాంత్ అడుగులు వేస్తారోనన్న ప్రశ్న బయలు దేరడంతో వారికి చిక్కకుండా విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు ఎండీఎంకే నేత వైగో రంగంలోకి దిగారు. రంగంలోకి వైగో: విజయకాంత్‌ను బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కలిసిన నేపథ్యంలో ప్రజా కూటమికి ఎక్కడ బలం త గ్గుతుందోనన్న ఉత్కంఠ ఆ కూటమి నాయకుల్లో బయలు దేరింది. ఇప్పటికే విజయకాంత్‌తో సీపీఎం నేత రామకృష్ణన్ సంప్రదింపులు జరిపారు. తాజాగా ఎండీఎంకే నేత వైగో రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. విజయకాంత్ , వైగోల మధ్య అన్నదమ్ముల్లా సాన్నిహిత్యం ఉండడంతో వారి సంప్రదింపులకు రంగం సిద్ధం అవుతోంది. లోక్ సభ ఎన్నికల అనంతరం బీజేపీ చూసిన చిన్న చూపును విజయకాంత్‌కు గుర్తు చేయడం, ఇచ్చిన హామీని విస్మరించి, చేసిన మోసాన్ని , ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్ని విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లి ఆయన్ను ప్రజా కూటమిలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాలకు వైగో కార్యచరణ సిద్ధం చేశారు. దీంతో విజయకాంత్ చుట్టూ కూటమి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఈ దృష్ట్యా, విజయకాంత్ ఎవరికి చిక్కుతారోనన్నది మాత్రం మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే. లేని పక్షంలో గతంలో వలే తాను ఎవరికీ చిక్కను అంటూ ఒంటరి నినాదాన్ని అందుకున్నా, అందుకునే అవకాశాలూ ఎక్కువే. -
ఆగస్టు 25న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: విజయకాంత్ (నటుడు); రాజీవ్ కపూర్ (నటుడు); ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యంతో పెండింగ్ పనులను చకచకా పూర్తి చేసి, కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. పండితులు, పురోహితులు, జ్యోతిష్యులకు ఇది మంచి కాలం. విద్యార్థులకు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక భద్రత, స్నేహ సంబంధాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. ఎంతో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయవలసి వచ్చినప్పుడు విజ్ఞతతో వ్యవహరించకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది. పుట్టిన తేదీ 25 కేతు సంఖ్య కావడం వల్ల దైవకృపతో నీతి నిజాయితీలతో పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. యోగ, ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మంచి మార్పు వస్తుంది. ఆధ్యాత్మికోన్నతి కలిగి ఆత్మసాక్షాత్కారం పొందుతారు. లక్కీ నంబర్స్: 2,3,5,7; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, వైట్, గ్రీన్, గోల్డెన్, ఎల్లో సూచనలు: పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం, గురువులకు, వేదపండితులు, పాష్టర్లు, కాజీలను గౌరవించి, సన్మానం చేయడం, ఆవులకు, కోతులకు ఆహారం పెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
మద్యంపై పోరు
రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించాలని కోరుతూ వేలాది కార్యకర్తల సమక్షంలో డీఎండీకే అధినేత విజయకాంత్ గురువారం నిరాహారదీక్ష చేపట్టారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యం నిషేధం విధించాలనే డిమాండ్‌పై రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నీ గళమెత్తిన నేపథ్యంలో డీఎండీకే కొన్ని రోజుల క్రితం మానవహారంతో తన నిరసన ప్రకటించింది. మద్యంపై పోరులో భాగంగా చెన్నై కోయంబేడులోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఉదయం సతీమణి ప్రేమలతతో కలిసి కెప్టెన్ నిరాహారదీక్షలు ప్రారంభించారు. వేలాది మంది కార్యకర్తలు రాష్టం నలుమూలల నుంచి తెల్లవారుజామునే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం ముందు భాగంగా భారీగా నిర్మించిన వేదికపై పార్టీ యువజన విభాగం కార్యదర్శి ఎల్కే సుధీష్ సహా ముఖ్యనేతలు కూడా కూర్చున్నారు. మద్య నిషేధం నినాదాలతో కూడిన ప్లకార్డులను వేదిక చుట్టూ అలంకరించారు. ఉదయం 9 గంటలకు నిరాహారదీక్షలు ప్రారంభం కాగా 9.20 గంటలకు విజయకాంత్ వేదికపైకి చేరుకున్నారు. ప్రజలే బుద్ధి చెప్పాలి: విజయకాంత్ ప్రజల జీవితాలను పణంగాపెట్టి మద్యంపై వచ్చే ఆదాయంతో బతుకున్న ఈ ప్రభుత్వానికి అదే ప్రజలు బుద్ధి చెప్పాలని విజయకాంత్ పిలుపునిచ్చారు. పాఠశాలలు, కాలేజీలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, బస్స్టేషన్లు అనే విచక్షణ లేకుండా టాస్మాక్ దుకాణాలకు అనుమతులిచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ధనదాహానికి మహిళలు, విద్యార్థులు, బాలురు సైతం మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కంటే మద్యం అమ్మకాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యం వద్దంటూ మహిళలు సాగిస్తున్న పోరు, ప్రజా, విద్యార్థి సంఘాల ఆందోళనలపై ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. టాస్మాక్ దుకాణాల నిర్వహణలో అక్కడి సిబ్బందే అశువులు బాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మద్యం నిషేధం కోసం సాగుతున్న పోరాటంలో రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. -
మానవహారం భగ్నం
సాక్షి, చెన్నై : సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో డీఎండీకే తలపెట్టిన మానవహారం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆ పార్టీ కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు లాఠీలు ఝుళిపించారు. ఆ పార్టీ అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, యువజన నేత సుధీష్‌తో పాటుగా నాయకుల్ని అరెస్టు చేశారు. టాస్మాక్‌లకు వ్యతిరేకంగా గురువారం కూడా నిరసనలు సాగాయి. కాగా, గాంధేయ వాది శశి పెరుమాళ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబీకులు అంగీకరించారు. శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి. టాస్మాక్‌లకు వ్యతిరేకంగా గాంధేయవాది శశిపెరుమాళ్ ఆత్మతర్పణంతో రాష్ట్రంలో ఉద్యమం రాజుకున్న విషయం తెలిసిందే. సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో రాష్ట్రంలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. విద్యార్థులు, మహిళలు, వికలాంగులు, కొన్ని పార్టీలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీస్తూ వస్తున్నాయి. టాస్మాక్లపై దాడులు పెరిగాయి. సేలంలో జరిగిన దాడితో టాస్మాక్ సిబ్బంది సెల్వం బలి కావడంతో ఆందోళనలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుంది. గురువారం చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. నాగుర్ కోవిల్లో టాస్మాక్ దుకాణంపై దాడికి యత్నించి విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించి చెదరగొట్టారు. పచ్చయప్ప కళాశాల విద్యార్థులు తమ కళాశాల ఆవరణలో దీక్ష చేపట్టడంతో దాన్ని భగ్నం చేయడానికి యత్నించి విఫలం అయ్యారు. అంబత్తూరులోని టాస్మాక్ గోడౌన్‌కు తాళం వేయడానికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టు చేశారు. నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో పలు చోట్ల నిరసనలు సాగగా, వారందర్నీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఇలా పలు చోట్ల నిరసనలకు యత్నించిన వాళ్లందర్నీ అరెస్టు చేయడం, తిరగబడ్డ పక్షంలో లాఠీలు ఝుళిపించే పనిలో పడ్డారు. ఇక, ప్రధాన ప్రతి పక్షం డీఎండీకే తలబెట్టిన మానవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. చేపాక్కంలో వికలాంగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సందర్శించి మద్దతు తెలియజేశారు. మానవహారం భగ్నం : టాస్మాక్‌లకు వ్యతిరేకంగా డీఎండీకే నేత విజయకాంత్ మానవహారానికి పిలుపునిచ్చారు. చెన్నై కోయంబేడు నుంచి సచివాలయం వరకు ఈ మానవ హారం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరారు. తొలుత అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా కోర్టును విజయకాంత్ ఆశ్రయించారు. కోర్టు విచారణను ఈనెల పదో తేదికి వాయిదా వేయడంతో ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు మానవహారానకి ఆయన సిద్ధం అయ్యారు. సాయంత్రం కోయంబేడు నుంచి - సచివాలయం మీదుగా ఆ పార్టీ వర్గాలు అక్కడక్కడ గుమిగూడాయి. మరి కాసేపట్లో మానవహారం ఆరంభం కానున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి భగ్నం చేశారు. విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, యువజన నేత సుధీష్లతో పాటుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల్ని బలవంతంగా అరెస్టు చేసి , బస్సులో ఎక్కించారు. దీంతో ఆగ్రహించిన ఆ పార్టీ వర్గాలు బస్సును అడ్డుకోవ డంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. దీంతో ఆ పార్టీ వర్గాలపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కన్పించిన వాళ్లందర్నీ చితక్కొట్టి, చెదరగొట్టాడు. దీంతో ఆ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపులోకి వచ్చినానంతరం విజయకాంత్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అలాగే, పలు మార్గాల్లో గుమిగూడిన ఆ పార్టీ వర్గాలను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. కాగా, తమ మానవహారం భగ్నం చేయడానికి లాఠీలు ఝుళిపించారని, ఆందోళన కారుల్ని అణగదొక్కేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రేమలత విజయకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విజయకాంత్ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల ఆ పార్టీ వర్గాలు ఆందోళన లకు దిగాయి. కాగా, దీక్ష భగ్నం చేస్తూ పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో విజయకాంత్ నేరుగా బస్సులోకి ఎక్కేస్తూ ప్రదర్శించిన హావా బావాలు వ్యంగాస్త్రాలకు అపహస్యానికి గురికాక తప్పలేదు. నేడు అంత్యక్రియలు : గాంధేయ వాది శశిపెరుమాళ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబీకులు అంగీకరించారు. గాంధేయ వాది శశిపెరుమాళ్ కుటుంబం మృతదేహాన్ని తీసుకోకుండా దీక్ష చేపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉదయం ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్‌లు శశిపెరుమాళ్ కుటుంబాన్ని పరామర్శించారు. వారిని బుజ్జగించి మృత దేహాన్ని తీసుకునేందుకు అంగీకరింప చేశారు. అయితే, తాము చేపట్టిన దీక్ష మాత్రం అంత్యక్రియల అనంతరం విరమిస్తామని ఆయన కుటుంబీకులు స్పష్టం చేశారు. దీంతో శుక్రవారం శశిపెరుమాళ్ మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో సేలంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. మూడు వేల దుకాణాల మూత: రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదం ఊపందుకుని ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్మథనంలో పడింది. టాస్మాక్ మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి ప్రజల్ని బుజ్జగించే కార్యాచరణలో పడ్డట్టు సమాచారం. రాష్ట్రంలో స్కూళ్లు, ఆలయాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మూడు వేల మద్యం దుకాణాలు ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు అందుకు తగ్గ నివేదికను సీఎం జయలలితకు పంపినట్టు తెలిసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సీఎం జె జయలలిత ఏ క్షణానైనా ప్రకటన వెలువరించ వచ్చన్న సంకేతాలు ఉన్నాయి. మద్య నిషేధం దశల వారీగా అమలు చేయడంలో భాగంగా ఈ దుకాణాలను మూసి వేస్తూ, ప్రజల్లో బయలు దేరిన ఆక్రోశాన్ని చల్లార్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ప్రజల్లోకి కెప్టెన్
డీఎండీకే అధినేత, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈనెల 20 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. కాగా, ఈ పర్యటనల్లో తానే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసుకోబోతున్నట్టు సమాచారం. సాక్షి, చెన్నై :రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించిన విజయకాంత్ ప్రజల పక్షాన నిలబడతానంటూ అధికార అన్నాడీఎంకేతో వైర్యాన్ని పెంచుకుని కష్టాలను కొనితెచ్చుకున్న విషయం తెలిసిందే. అధికార పక్షం కేసుల మోత ఓ వైపు, అనారోగ్య సమస్యలు మరో వైపు వెరసి కొన్నాళ్లు ప్రజల్లోకి వెళ్లడం మానుకోవాల్సిన పరిస్థితి. తాజాగా, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా పార్టీలు కసరత్తులు వేగవంతం చేయడాన్ని విజయకాంత్ పరిగణించారు. తాను బీజేపీ కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్టు ఇంతవరకు ఆయన స్పష్టం చేయలేదు. ఆయన తమ కూటమి అంటూ బీజేపీనేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో అపాయింట్మెంట్ లభించడం, బీజేపీ పెద్దలతో మంతనాలు ముగించుకున్న విజయకాంత్ ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు కార్యచరణ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఆగస్టులో తన జన్మదినం రానున్నడాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. 20 నుంచి పర్యటన : తన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదరిక నిర్మూల పథకానికి శ్రీకారం చుట్టడంతో పాటుగా పనిలో పనిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు. అధికార పక్షం వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెప్పించే విధంగా పర్యటన సాగించేందుకు ఆయన నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యేకంగా తమ నేత విజయకాంత్‌ను పలకరించడం, ఆయన ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించడంతో ఇక, తమ నేతకు బీజేపీ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టేనన్న ఆశాభావంలో పడ్డారు. విజయకాంత్ సాగించనున్న రాష్ట్ర పర్యటనలో బీజేపీ కూటమి సీఎం అభ్యర్థి తమ నేతే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డీఎండీకే వర్గాలు సిద్ధమవుతోండడం గమనార్హం. ఇక, విజయకాంత్ పర్యటన ఆగస్టు 20వ తేదీని గుమ్మిడిపూండి నుంచి ఆరంభం కానున్నది. మరుసటి రోజు కాంచీపురంలో సాగనున్నది. అన్ని జిల్లాల్లో బహిరంగ సభల రూపంలో భారీ జన సమీకరణ, తమ బలం, సత్తా చాటే విధంగా విజయకాంత్ పర్యటనకు డీఎండీకే వర్గాలు ఉరకలు పరుగులు తీస్తున్నాయి. -
పేరు మార్చండి
అమ్మ టాస్మాక్గా మార్చాలని విజయ్‌కాంత్ చురక నామకరణానికి పట్టు సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని అన్ని టాస్మాక్ మద్యం దుకాణాల పేర్లను మార్చాలని డీఎండీకే అధినేత, ప్రతి పక్ష నేత విజయకాంత్ డిమాండ్ చేశారు. ఈ దుకాణాలకు ‘అమ్మ’టాస్మాక్ అని నామకరణ చేయాలని హితవు పలికారు. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతున్న విషయం తెలిసిందే. మద్య నిషేధం లక్ష్యంగా కొన్ని పార్టీలు గళం విప్పాయి. ఇందులో డీఎండీకే కూడా ఉంది. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదంతో ముందుకెళ్తోన్న ఆ పార్టీ తాజాగా, ఆ దుకాణాలకు అమ్మ(జయలలిత) పేరు పెట్టాలన్న డిమాడ్‌ను తెర మీదకు తెచ్చింది. ఈ విషయంగా డీఎండీకే అధినేత విజయకాంత్ రెడ్ హిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విద్యా ప్రదాత కామరాజర్ జయంతిని పురస్కరించుకుని తమ వంతుగా పార్టీ వర్గాలు సేవలు అందించాయని వివరించారు. తాజగా ఇక్కడ పేదలకు కుట్టు మిషన్లు, ఐరన్ బాక్సులు, హెల్మెట్ల పంపిణీ జరిగింద న్నారు. విద్యా ప్రదాత కామరాజర్ ప్రజల కోసం శ్రమించారని, పదవులు, పేరుకోసం ఏ మాత్రం కాదన్నారు. అయితే, ఇప్పుడున్న వాళ్లు పదవులు కాపాడుకోవడంతో పాటుగా తమ పేరు స్థిరం కావాలన్న కాంక్షంతో భజనల్ని అందుకుని ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా అమ్మ..అమ్మ....అబ్బో తెగ భజన చేస్తున్నారని చురకలు అంటించారు. ఏ టీవీ చూసినా అమ్మ, ఏ బోర్డు చూసినా అమ్మ ...ఇలా ప్రతి ఒక్కరూ ఆ అమ్మ భజనకే పరిమితం అవుతున్నారని, ఆ పథకం తమ అమ్మ ఘనత, ఈ పథకం తమ అమ్మ తీసుకొచ్చిందని జబ్బలు చరస్తున్నారని గుర్తు చేశారు. ఇంత హంగామా చేస్తూ, అమ్మ భజన చేస్తున్న వాళ్లు ,రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం దుకాణాలకు మాత్రం అమ్మ పేరు పెట్టడం మరచినట్టున్నారేనని ఎద్దేవాచేశారు. ఇకనైనా టాస్మాక్ మద్యం దుకాణాలకు అమ్మ టాస్మాక్ అని నామకరణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలంటూ హితవు పలికారు. -
ఆయన రూటే సపరేటు
బిజీ బిజీగా విజయకాంత్ కేంద్ర మంత్రులతో మంతనాలు మా వెంటేనన్న పొన్ రాధాకృష్ణన్ సాక్షి, చెన్నై: మేఘదాతులో డ్యాం అడ్డుకట్ట లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి పక్షాల్ని ఏకం చేయడంలో సఫలీకృతుడైన విజయకాంత్ ఢిల్లీలో బిజీబిజీగా గడపడం చర్చకు దారి తీస్తోంది. కేంద్ర మంత్రులతో ఆయన మంతనాల్లో మునగడంతో రాజకీయం ఎత్తుగడలు తెరమీదకు వస్తున్నాయి. అదే సమయంలో పీఎంతో భేటీ ఏర్పాట్లన్నీ చేసింది తానేనని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వెల్లడించడంతో పాటుగా విజయకాంత్ తన వెంటనేనని స్పష్టం చేయడం గమనార్హం. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి అడుగులు వేసిన డీఎండీకే నేత విజయకాంత్ క్రమంగా ఆపార్టీకి దూరం అవుతూ వచ్చారని చెప్పడం కన్నా, కమలనాథులే పక్కన పెట్టారన్నది జగమెరిగిన సత్యం. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలం కావడంతో విమర్శల పర్వాన్ని అందుకునే పనిలో విజయకాంత్ పడ్డారు. బీజేపీతో అంటి ముట్టనట్టు ఉన్నా, ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చాం అని ఏ సందర్భంలోనూ స్పష్టం చేయలేదు. ఈ పరిస్థితుల్లో మేఘ దాతులో కర్ణాటక కుట్రల్ని అడ్డుకోవడం లక్ష్యంగా ప్రతి పక్షాల్ని ఏకం చేయడానికి విజయకాంత్ రంగంలోకి దిగారు. ప్రధాన ప్రతి పక్ష నేత అంటే, ఇలా... ఉండాలన్న విషయాన్ని నాలుగేళ్ల అనంతరం తెలుసుకున్నా, అన్ని పక్షాల్ని ఏకం చేయడంలో సఫలీకృతుడైనా రాజకీయంగా విజయకాంత్ ఎవరికీ అంతు చిక్కరు. తన రూటే సపరేటు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్నా, అన్నాడిఎంకే జై కొట్టినా, బీజేపీ జిందాబాద్ అన్నా, అది ఆయనకే సాటి. అలాంటి విజయకాంత్ తాజాగా ఢిల్లీలో బిజీబిజీగా గడపడంతో ఆయన బీజేపీతో కలసి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగులు వేయనున్నారా..? అన్న ప్రశ్న తలెత్తక మానదు. లేదా, లోక్ సభ ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకునే పయనం సాగిస్తున్నారా..? అన్న చర్చ తెర మీదకు వచ్చి ఉన్నది. అదే సమయంలో విజయకాంత్‌కు బిజేపీ వర్గాలే అనుమతి ఇప్పించి ఉండటంతో, ప్రతి పక్షాల్ని ఏకం చేయడంలో తెర వెనుక కమలనాథుల పాత్ర కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నది. విజయకాంత్ ఇప్పుడు, ఎప్పుడూ మా వెంటేనని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేయడం గమనించాల్సిన విషయం. ఢిల్లీలో బిజీ : అన్ని రాజకీయ పక్షాలతో కలసి ఢిల్లీ వెళ్లిన విజయకాంత్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అన్ని పార్టీల నాయకులు బయటకు వచ్చాక మరో మారు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది, యువజన నేత సుదీష్ నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ భేటీ ఆంతర్యమేమిటోనన్నది పక్కన పెడితే, అన్ని పార్టీల నాయకులు రాష్ట్రానికి తిరుగు పయనం అయినా, విజయకాంత్ మాత్రం ఢిల్లీలోనే తిష్ట వేసి ఉండడం గమనించాల్సిన విషయం. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో అర గంట పాటుగా సమావేశం జరిపి ఉన్నారు. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కావడం, మరి కొందరు కేంద్ర మంత్రుల్ని ఆయన కలవడం బట్టి చూస్తే, బీజేపీని వీడి బయటకు వచ్చేందుకు విజయకాంత్ మనస్సు అంగీకరించనట్టుంది. ఈ భేటీల్లో ఆంతర్యాల్ని వెతికే పనిలో రాజకీయ విశ్లేషకులు ఉన్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఓ మీడియాకు చేసిన వ్యాఖ్యలు ఆలోచింపక మానదు. మా వెంటే : కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయకాంత్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మా వెంటేనని స్పష్టం చేశారు. బిజేపీ రాష్ట్రంలో బలంగానే ఉందని, తమ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని విజయకాంత్ తనను కోరడం జరిగిందన్నారు. విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. అపాయింట్ మెంట్ ఇప్పించింది తానేనని స్పష్టం చేశారు. విజయకాంత్‌తో ప్రధాని భేటీ సంతృప్తికరంగా సాగిందని పేర్కొంటూ, ఆయన తమ కూటమిలో లేరని చెప్పిందెవరని ప్రశ్నించారు. తాజా, పరిస్థితుల్ని ఎన్నికల కూటమిగా మార్చే యోచనలో డిఎంకే ఉండొచ్చేమోగాని, లోక్ సభ ఎన్నికల్లో ఏర్పడ్డ తమ కూటమిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదన్నారు. పీఎంకే సీఎం అభ్యర్థిని ప్రకటించినా, అది ఆచరణలో పెట్టేది కష్టమేనని, తమ కూటమి కొనసాగుతుందని, విజయకాంత్ తమ వెంటనేనని స్పష్టం చేయడం గమనార్హం. ఇక, విజయకాంత్ ఢిల్లీ పర్యటనను అన్నాడీఎంకే వర్గాలు వ్యంగ్యాస్త్రాలతో చమత్కరించే పనిలో పడ్డారు. అలాగే, ప్రధాని తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న వేదనలో ఉన్న విజయకాంత్, మేఘదాతు అస్త్రాన్ని సంధించి తన స్వలాభం కోసం ఢిల్లీకి వెళ్లినట్టున్నారని ఆరోపించే పనిలో పడ్డారు. -
ఇది రీమేక్స్ ఇయర్!
బాలీవుడ్ గెలిచే గుర్రంపై పందెం కడితే గెలుపు మనదే. ఇది చిత్రసీమకూ వర్తిస్తుంది. కొత్త కథతో సినిమా తీయడంలో ఉన్న రిస్క్, ఆల్రెడీ బంపర్ హిట్ అయిన చిత్రాలు తీయడంలో ఉండదు. అందుకే ఇతర భాషల్లో విజయం సాధించిన చిత్రాలపై దర్శక, నిర్మాతలు దృష్టి పెడుతుంటారు. అలాగే తమ భాషలో రూపొందిన పాత చిత్రాలను కూడా రీమేక్ చేస్తుంటారు. రీమేక్ అనేది ఒక విధంగా ‘సేఫ్ గేమ్’ అనొచ్చు. అలా హిందీ రంగంలో... ప్రస్తుతం ఏడెనిమిది సేఫ్ గేమ్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం... గబ్బర్ గెలుస్తాడా? విజయ్‌కాంత్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘రమణ’ తెలుగులో చిరంజీవితో ‘ఠాగూర్’గా పునర్నిర్మితమైంది. రెండు భాషల్లోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ‘రమణ’ ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’. అక్షయ్‌కుమార్, శ్రుతీహాసన్ జంటగా తెలుగు దర్శకుడు ‘క్రిష్’ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మే 1న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. మరి.. దక్షిణాదిన రెండు భాషల్లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఉత్తరాదిన ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి? నార్త్‌లోనూ... అంత దృశ్యం ఉంటుందా? కొన్ని కథలు ఏ భాషలవారికైనా నచ్చుతాయి. మలయాళ ‘దృశ్యం’ కథ అలాంటిదే. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి, ఘనవిజయం సొంతం చేసుకుంది. హిందీలో ‘దృశ్యం’ పేరుతో రీమేక్ అవుతోంది. అజయ్ దేవగణ్, శ్రీయ జంటగా నిశికాంత్ కామత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పోలీసాఫీసర్ పాత్రను టబు చేస్తున్నారు. ఇప్పటికి మూడు భాషల్లో విజయం సాధించిన ఈ ‘దృశ్యం’ ఉత్తరాదివారిని హత్తుకుంటుందో, లేదో నాలుగైదు నెలల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే, ఈ చిత్రాన్ని అప్పుడు విడుదల చేయాలనుకుంటున్నారు. నాటి హీరోను తలపిస్తుందా? దాదాపు 30 ఏళ్ల క్రితం జాకీ ష్రాఫ్, మీనాక్షీ శేషాద్రి జంటగా స్వీయదర్శకత్వంలో సుభాష్ ఘయ్ రూపొందించిన చిత్రం ‘హీరో’. ఈ సినిమాతో జాకీ, మీనాక్షీ స్టార్స్ అయిపోయారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు హీరో సల్మాన్ ఖాన్ పునర్నిర్మిస్తున్నారు. నటుడు ఆదిత్యా పంచోలీ తనయుడు సూరజ్ పంచోలీ, నటుడు సునీల్‌శెట్టి కుమార్తె అథియా శెట్టి ఈ చిత్రం ద్వారా నాయకా నాయికలుగా పరిచయమవుతున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరి.. నాటి ‘హీరో’లా నేటి ‘హీరో’ ఘనవిజయం సాధిస్తుందా? సౌత్‌లో హీరో కథ...నార్త్‌లో హీరోయిన్ కథ... తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మౌన గురు’ హిందీలో పునర్నిర్మితమవుతోంది. తమిళంలో కథానాయకుడు ప్రాధాన్యంగా సాగే ఈ చిత్రకథను హిందీలో కథానాయిక ప్రాధాన్యంగా సాగేట్లు మలిచి, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. సోనాక్షీ సిన్హా కథానాయికగా ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి ‘అకిరా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం సోనాక్షీ సిన్హా పోరాటాలు నేర్చుకున్నారు. ఇందులో ప్రముఖ నటుడు, సోనాక్షీ సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. అక్కడి ‘వారియర్’...ఇక్కడ బ్రదర్స్ 2011లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘వారియర్’ చిత్రం రీమేక్ హక్కులను కరణ్ జోహార్ పొందారు. ఈ చిత్రాన్ని ‘బ్రదర్స్’ పేరుతో కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో ఆయన పునర్నిర్మిస్తున్నారు. అక్షయ్‌కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ అతిథి పాత్ర చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం సిద్ధార్థ్ మల్హోత్రా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అక్షయ్ కుమార్‌కు ఆల్రెడీ ఈ కళ తెలుసు. హాలీవుడ్లో ‘వారియర్’కు భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. మరి.. హిందీలో ‘బ్రదర్స్’గా రీమేక్ అవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో? ఇవి కాకుండా తెలుగులో ఘనవిజయం సాధించిన ‘మగధీర’ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో తాను పోషించనున్న రెండు పాత్రల కోసం భారీ ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. అలాగే, తమిళంలో ఘనవిజయం సాధించిన ‘సూదు కవ్వుమ్’ చిత్రం కూడా హిందీలో పునర్నిర్మితం కానుంది. ఇంకా ఈ జాబితాలో చాలా చిత్రాలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ రీమేక్ చిత్రాలు రూపొందుతున్నాయి కాబట్టి, హిందీ రంగ పరంగా ఈ ఏడాది ‘రీమేక్స్ ఇయర్’ అని చెప్పొచ్చు. - డి.జి. భవాని -
ఏకమయ్యారు
డ్యాంలను అడ్డుకునేందుకు ఒకే వేదికపైకి రంగంలోకి విజయకాంత్ కరుణ, ఈవీకేఎస్, తమిళిసై, వాసన్‌లతో భేటీ మద్దతు ప్రకటించిన నేతలు నేడు ఢిల్లీకి పయనం రాష్ర్టంలోని ప్రతి పక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చాయి. ఇది ఎన్నికల కూటమి కానప్పటికీ, అన్నదాతల సంక్షేమార్థం, జాలర్ల భద్రత లక్ష్యంగా, శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఒకే పక్షంగా నిలిచాయి. ఈ జట్టుకు ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎండీకే అధినేత విజయకాంత్ నేతృత్వం వహిస్తున్నారు. అన్ని పార్టీల ప్రతినిధులతో ‘మేఘదాతు’లో డ్యాంల నిర్మాణాన్ని అడ్డుకుందామన్న నినాదంతో సోమవారం ఢిల్లీకి బయలు దేరనున్నారు. సాక్షి, చె న్నై : తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి వివాదం కొత్తేమి కాదు. తాజాగా తమిళనాడులోకి చుక్క నీరు కూడా రానివ్వకుండా చేయడం లక్ష్యంగా మేఘదాతులో రెండు డ్యాంల నిర్మాణానికి కర్ణాటక పాలకులు కసరత్తుల్లో మునిగారు. తమిళనాడు ప్రభుత్వం యథాప్రకారం చోద్యం చూస్తూ, చివరిక్షణంలో రంగంలోకి దిగి పనిలో పడింది. ఓ వైపు రాష్ర్టంలో అన్నదాతలు పోరు బాట పట్టినా, అఖిల పక్షంగా ఢిల్లీ వెళ్దామని ప్రతి పక్షాలు పిలుపునిచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం పన్నీరు సెల్వం చడీ చప్పుడు కాకుండా శనివారం ఢిల్లీ చెక్కేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఓ వినతి పత్రం అందజేసి మేఘాదాతులో డ్యాంల నిర్మాణం అడ్డుకోండని విన్నవించి నమ అనిపించేశారు. ఇది రాష్ట్రంలోని ప్రతి పక్షాల్లో ఆగ్రహాన్ని రేపింది. రంగంలోకి విజయకాంత్: అన్ని పార్టీలను వెంట బెట్టుకు వెళ్లి ప్రధానిని కలవకుండా, కేవలం స్వలాభా పేక్షతోసీఎం పన్నీరు సెల్వం ఢిల్లీ వెళ్లడాన్ని ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ తీవ్రంగా పరిగణించారు. ప్రధాన ప్రతి పక్ష నేత హోదాతో తన మార్కు రాజతంత్రాన్ని ప్రయోగించేందుకు రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల్ని ఏకం చేసి తన నేతృత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం అన్ని పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్ల వద ఆదివారం ు బిజీ బిజీగా గడిపి ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. నేతలతో భేటీ : కేవలం మేఘదాతులో డ్యాం నిర్మాణం అడ్డుకట్ట అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, మరో నాలుగు అంశాలను తెరమీదకు విజయకాంత్ తీసుకొచ్చారు. డ్యాంల నిర్మాణం అడ్డుకట్టను ప్రధాన అంశంగా చేసుకుని జాలర్లకు కడలిలో భద్రత, తమిళ కూలీలను పొట్టన పెట్టుకున్న శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసగా, భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా, ముల్లై పెరియార్ డ్యాం హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ప్రధాని మోదీని కలుద్దాం..! అన్న పిలుపుతో నేతలతో విజయకాంత్ భేటీ అయ్యారు. తొలుత గోపాలపురంలోని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఇంటికి వెళ్లారు. పార్టీ యువజన నేత సుదీష్, ఎమ్మెల్యేలతో కలసి ఆ ఇంట్లో అడుగు పెట్టిన విజయకాంత్ నేరుగా కరుణానిధిని కలుసుకుని దుశ్శాలువ కప్పి సత్కరించారు. స్టాలిన్‌తో కలసి కరుణానిధితో అరగంట పాటుగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా సత్యమూర్తి భవన్ చేరుకుని మద్దతు సేకరించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భులతో భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశం అయ్యారు. అక్కడి నుంచి ఆళ్వార్ పేటలోని తమాకా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్‌తో భేటీ అయ్యారు. అలాగే, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్లతోనూ సమావేశమైన విజయకాంత్ వామపక్ష నేతలతో ఫోన్లో మాట్లాడి మద్దతు కూడ గట్టుకున్నారు. అన్ని పార్టీలు ఒకే వేదిక మీదుగా ప్రధాని మోదీని కలుసుకునేందుకు సిద్ధం అయ్యాయి. మొత్తం పది పార్టీలకు చెందిన 25 మంది ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఒకే వేదికగా నేడు ఢిల్లీకి: విజయకాంత్ మీడియాతో మాట్లాడుతూ అన్నదాతలు, జాలర్లు, కూలీలకు అండగా నిలబడే విధంగా అందర్నీ వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం పన్నీరు సెల్వం కేవలం స్వలాభాపేక్షతో కంటి తుడుపు చర్యలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. వాళ్లు స్వలాభం కోసం ప్రాకులాడడం వల్లే ప్రధాన ప్రతిపక్షంగా అన్ని పార్టీలను ఏకం చేసి ఢిల్లీకి సోమవారం పయనం అవుతున్నామన్నారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పేర్కొంటూ, విజయకాంత్ విజ్ఞప్తి మేరకు తమ పార్టీ తరపున ఎంపిలు కనిమొళి, తిరుచ్చి శివ ఢిల్లీకి వెళ్లనున్నారని తెలిపారు. ఈవీకేఎస్ పేర్కొంటూ, విజయకాంత్‌తో కలిసి తమ ప్రతినిధిని ఢిల్లీకి పంపించనున్నామన్నారు. తమిళిసై సౌందరరాజన్ పేర్కొంటూ, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ తాజాగా స్పందించిన తీరు అభినందనీయమన్నారు. ఆయనతో కలసి తమ ప్రతినిధి ఢిల్లీకి వెళ్తారని, ప్రధానికి డిమాండ్లను విన్నవిస్తామన్నారు. విజయకాంత్‌తో కలసి స్వయంగా తానే ఢిల్లీ వెళ్లనున్నట్టు వీసీకే నేత తిరుమావళవన్ పేర్కొన్నారు. అన్ని పార్టీలను ఏకం చేయడంలో తమ నేత విజయకాంత్ సఫలీకృతుడు కావడాన్ని ఆ పార్టీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మున్ముందు రోజుల్లో ఈ భేటీలు ‘కూటమి’కి అనుకూలతను సృష్టిస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే. -
డీఎంకే వైపు కెప్టెన్ చూపు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న డీఎండీకే అధినేత విజయకాంత్ అకస్మాత్తుగా తన దిశను మార్చేశారు. డీఎంకేతో చెలిమికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మిత్రపక్షం గా బరిలోకి దిగిన విజయకాంత్ పెద్ద సం ఖ్యలో స్థానాలను రాబట్టుకున్నారు. అకస్మాత్తుగా అమ్మ పార్టీతో విభేదించి పార్లమెంటు ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరిపోయారు. ఇది కూడా మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. శ్రీరంగం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తరఫున విజయకాంత్ ప్రచారం కాదుకదా, కనీసం మద్దతుగా ప్రకటన కూడా చేయలేదు. పేరుకు ఎన్డీఏ కూటమిలో ఉన్నా బీజేపీతో దూరంగానే మెలుగుతున్నారు. ఇదిలా ఉండగా గడిచిన అసెంబ్లీ సమావేశాల సమయంలో డీఎండీకే ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటుపడింది. రెండు సమావేశాలకు హాజరుకాకుండా స్పీకర్ వేటు వేశారు. స్పీకర్ చర్య ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని డీఎండీకే ఎమ్మెల్యేలకు మద్దతుగా డీఎంకే అధినేత కరుణానిధి బహిరంగ ప్రకటన చేశారు. ఎవరి ప్రకటనలకూ అంతగా స్పందించే అలవాటులేని విజయకాంత్ కరుణానిధికి కృతజ్ఞతలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బహిష్కృత డీఎండీకే ఎమ్మెల్యేలు సచివాలయంలో ధర్నా చేపట్టిన సమయంలో డీఎంకే సభ్యులు స్టాలిన్, దురైమురుగన్ తదితరుల మద్దతును కోరారు. డీఎంకే నేతలు సైతం డీఎండీకే ఎమ్మెల్యేల బహిష్కరణ ప్రజాస్వామ్య విరుద్ధమంటూ సంఘీభావం ప్రకటించారు. డీఎండీకే డీఎంకే కూటమిలో చేరాలని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మరో పార్టీ నేత కోరగా సమయం వచ్చినపుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని విజయకాంత్ ప్రకటించారు. డీఎండీకేలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బీజేపీకి దూరమై డీఎంకేకు దగ్గరయ్యేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఆ నాటికి ఈ రెండు పార్టీల మధ్య చెలిమి బలపడవచ్చని భావిస్తున్నారు. -
మద్దతుపై విజయకాంత్ మెలిక
సాక్షి, చెన్నై : శ్రీరంగం ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతు విషయంలో డీఎండీకే అధినేత విజయకాంత్ కొత్త మెలిక పెట్టారు. పార్టీ శ్రేణులతో ఆదివారం చెన్నైలో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ ఢిల్లీ పెద్దలు అమిత్ షా , ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారు కోరినప్పుడే ప్రచారంలోకి వెళ్లడం, బహిరంగంగా మద్దతు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే మద్దతుతో శ్రీరంగం ఉప ఎన్నిక బరిలో తాము దిగుతున్నామని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. విజయకాంత్ తమకు మద్దతు ఇచ్చారని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారేగానీ, డీఎండీకే వర్గా లు మాత్రం బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. లోపాయి కారి ఒప్పందం మేరకు ఈ మద్దతు ఉందన్న ప్రచారం సాగుతున్న సమయంలో విజయకాంత్ కొత్త మెలిక పెట్టే పనిలో పడ్డారు. మెలికలు పెట్టడంలో ఆరి తీరిన విజయకాంత్ బీజేపీకి మద్దతు విషయంలో ఇప్పుడే అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. సమావేశం : శ్రీరంగంలోని పార్టీ నాయకులు, అన్ని జిల్లాల కార్యదర్శులను ఆగమేఘాలపై ఆదివారం విజయకాంత్ చెన్నై కు రప్పించారు. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు ఈ సమావేశం సాగింది. ఇందులో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొన్ని జిల్లాల్లో పార్టీ నిర్వాహకుల తీరును ఆరా తీసి, వారిని తొలగించేందుకు నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ పరంగా కొన్ని జిల్లాల్లో ప్రక్షాళనకు విజయకాంత్ నిర్ణయించినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీరంగం ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు విషయమై సుదీర్ఘ చర్చ సాగినట్టు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రమే తనను కలిసి వెళ్లడం, జాతీయ నాయకులెవ్వరూ కనీసం మాట వరుసకైనా ఫోన్లో కూడా మాట్లాడక పోవడాన్ని విజయకాంత్ తీవ్రంగా పరిగణించారు. ఈ దృష్ట్యా, ఉప ఎన్నికల్లో మద్దతు తెలియజేయడంతో పాటుగా బీజేపీ అభ్యర్థితో కలసి ఓట్ల వేటకు వెళ్లడం, తానే స్వయంగా ప్రచారానికి వెళ్లే విషయంగా చర్చించి ఓ కొత్త మెలికను బీజేపీ అధిష్టానం ముందు ఉంచేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేదా, ఇతర నాయకులు లేదా ప్రధాని నరేంద్ర మోదీలో ఎవరో ఒకరు తనతో ఫోన్లో సంప్రదించి మద్దతు కోరినప్పుడే స్పందించేందుకు నిర్ణయించి నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ వర్గాలు మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నాయిగా? అని డీఎండీకే వర్గాలను ప్రశ్నించగా, వాళ్లు చెబితే చెప్పుకోనీయండి, తాము ప్రచారం బరిలో దిగాలిగా అని పేర్కొనడం గమనార్హం. తమను బీజేపీ పెద్దలు ఎవ్వరూ సంప్రదించని పక్షంలో ఇతర పార్టీల వలే మౌనంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. -
మద్య నిషేధమే అస్త్రం
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధమే తమ అస్త్రమని డీఎండీకే ప్రకటించింది. న దీజలాల పరిరక్షణకు అఖిల పక్షానికి డిమాండ్ చేసింది. బీజేపీతోనే పయనం సాగిద్దామా? అన్న నిర్ణయంపై ఆ పార్టీ వర్గాలు తీవ్రంగానే కుస్తీలు పట్టాయి. ఈ మేరకు కోయంబత్తూరు వేదికగా బుధవారం జరిగిన డీఎండీకే సర్వ సభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యే రీతిలో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సన్నద్ధమైంది. ఇందు కోసం పార్టీ వర్గాలు అభిప్రాయాలు, మనోగతాలను తెలుసుకోవడంతోపాటుగా కీలక నిర్ణయాలకు వేదికగా సర్వ సభ్య సమావేశాన్ని విజయకాంత్ మలచుకున్నారు. బీజేపీ కూటమిలో డీఎండీకే కొనసాగేనా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే విధంగా కోయంబత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వ సభ్య సమావేశం, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సమావేశమైంది. అభిప్రాయాలు ఉదయాన్నే విజయకాంత్ నేతృత్వంలో జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సర్వ సభ్య సభ్యులు, కార్యవర్గ సభ్యులు మొత్తంగా 285 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా నేతల అభిప్రాయాల్ని విజయకాంత్ సేకరించారు. అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలో, అందుకు ఇప్పటి నుంచే చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లే రీతిలో నిర్వహించాల్సిన పనుల గురించి సమీక్షించారు. పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపే రీతిలో విజయకాంత్ తన ప్రసంగాన్ని సాగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డ ఆయన కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారును, డీఎంకేపై విమర్శల పర్వాన్ని తగ్గించడంతో ఆయన దారెటోనన్న చర్చ ఆరంభమైంది. అదే సమయంలో బీజేపీలో కొనసాగాలా? వద్దా? అన్న అంశంపై మెజారిటీ శాతం మంది నాయకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న దృష్ట్యా, ఇప్పటికిప్పుడే కూటమి విషయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అదే సమయంలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే సర్వాధికారాన్ని విజయకాంత్‌కు అప్పగిస్తూ తమ ప్రసంగాలను నాయకులు సాగించారు. శ్రీరంగం ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంగా తుది నిర్ణయాన్ని విజయకాంత్‌కు అప్పగించారు. తీర్మానాలు సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గోప్యంగా ఉంచినా, తీర్మానాలను మాత్రం ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇరవైకు పైగా తీర్మానాలు చేశారు. ఇందులో పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్ బాటలో తాజాగా, డీఎండీకే సైతం రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు లక్ష్యంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించడం విశేషం. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలికావేరి నదీ జలాల పరిరక్షణకు అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. నదీజలాల విషయమై కేంద్రంతో సంప్రదింపులకు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. నదుల అనుసంధానానికి చర్యలు వేగవంతంగా తీసుకోవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఎలాంటి నిర్ణయాల్ని అయినా తీసుకోవాలి. తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వానికి ఖండన. దాడులకు అడ్డుకట్ట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ స్కాంను విచారిస్తున్న సహాయం కమిటీకి పూర్తి సహకారం అందించడంతో పాటుగా స్వేచ్ఛను కల్పించాలని వినతి.విద్యుత్ చార్జీల పెంపు రద్దు, చెరకు మద్దతు ధరగా రూ.3500 పెంచాలి, కావేరి నది తీరంలో మీథైన్ తవ్వకాలకు వ్యతిరేకత, కూడంకులం అణు విద్యుత్ కేంద్రంలో రెండు, మూడు యూనిట్లపై నెలకొన్న ఆందోళన నివృత్తి, తదితర డిమాండ్లతో కొన్ని తీర్మానాలు చేశారు.తమిళ ప్రజల్ని ఆదుకునే విధంగా, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి నిధుల్ని సమకూర్చే విధంగా ప్రత్యేక కమిటీని రంగంలోకి దించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
యాక్షన్ స్టార్ విశాల్
నటుడు విశాల్‌కు యాక్షన్ స్టార్ పట్టం కట్టారు. మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ, ఒకప్పుడు విజయకాంత్ చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలుండేవన్నారు. ఆయనతో నటించినప్పుడు తాను చాలా దెబ్బలకు గురయ్యానని అన్నారు. అలా ప్రస్తుతం నటుడు విశాల్ యాక్షన్ కథా చిత్రాల్లో బాగా నటిస్తున్నారని అన్నారు. అందుకే ఆయన్ను యాక్షన్ స్టార్‌గా పేర్కొనట్లు అన్నారు. విశాల్ హీరోగా నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న తాజా చిత్రం ఆంబళ. హన్సిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు వైభవ్, రమ్యకృష్ణ, కిరణ్రాథోడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా హిప్హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్ ప్రసంగించారు. అనంతరం నిర్మాత టి.శివ మాట్లాడుతూ ఆంబ ళ (మగాడు) చిత్రం టైటిల్ విశాల్‌కు కరెక్ట్‌గా నప్పుతుందన్నారు. ఆయన పైరసీని అరికట్టడానికి ఒంటరిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. అలాగే ధైర్యంగా చిత్రాలు నిర్మిస్తూ విజయాలు సాధిస్తున్నారని అన్నారు. సుందర్ సి మొదట్లో పలు భారీ హిట్స్ చిత్రాలను అందించారని మధ్యలో కొంత వెనుకబడ్డా మళ్లీ వరుస విజ యాలతో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారన్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ఆంబళ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మ కం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నటి కుష్బు, హన్సిక, జి.కె.రెడ్డి, ఆర్కె సెల్వమణి, ఎస్ఎ చంద్రశేఖర్, తిరు, హిప్ హాప్ తమిళ్, ఆర్య, కె.ఇ.జ్ఞానవేల్ రాజా పాల్గొన్నారు. -
డీఎంకేతోనా.. చూద్దాం
‘‘రానున్న ఎన్నికల్లో పొత్తు డీఎంకేతోనా... వెయిట్... ఇంకా సమయం ఉందిలే చూద్దాం ’’ అంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ వ్యాఖ్యానించారు. దీంతో కెప్టెన్ చూపు ఎటువైపోనన్న చర్చ రాజకీయాల్లో మొదలైంది. సాక్షి, చెన్నై : ‘‘రానున్న ఎన్నికల్లో పొత్తు డీఎంకేతోనా... వెయిట్...చూద్దాం ఇంకా సమయం ఉంది.’’ అంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ వ్యాఖ్యానించారు. డీఎండీకే నేతృత్వం లో కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సోమవారం క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. సాధారణంగా డీఎండీకే నేతృత్వంలో ప్రతి ఏటా అన్ని పండుగలు జరుపుకోవడం, ఆయా సామాజిక వర్గానికి చెందిన పేదలకు సాయం అందించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో పేదలకు విజయకాంత్ తన వంతు సంక్షేమ పథకాలను అందజేశారు. కేక్ కట్ చేశారు. బిర్యానీ విందు ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు యూనిఫాంలను అందజేశారు. ఈ వేడుకలో క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు సద్గుణం, సుందరన్, స్టీఫన్ తదితరులు పాల్గొన్నారు. సద్గుణం డీఎంకే మద్దతు దారుడు. తన ప్రసంగంలో సద్గుణం విజయకాంత్‌కు కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఏటా క్రిస్మస్ వేడుక సందర్భంగా విజయకాంత్ ముందు తాను కొన్ని డిమాండ్లు ఉంచుతున్నానని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ సారైనా ఆయన స్పందించి తన కోరికను తీర్చుతారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సద్గుణం వ్యాఖ్యల అనంతరం విజయకాంత్ ప్రసంగించారు. సద్గుణం వ్యాఖ్యలు డీఎంకే అధినేత కరుణానిధిని ఉద్దేశించినవి అన్న విషయం ఇక్కడ ఎందరికి అర్థం అయిం దో ఏమోగానీ, తనకు మాత్రం బాగానే అర్థమైందని చమత్కరించారు. డీఎంకే కూటమిలో చేరడం విషయంగా అంటూ...వెయిట్....అందుకు సమయం ఉందని, మరో మారు సమ యం వచ్చినప్పుడు స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. దీంతో విజయకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే వైపు నడుస్తారా? అన్న చర్చ మొదలైంది. బీజేపీ విజయకాంత్‌ను పక్కన పెట్టి ఉన్న దృష్ట్యా, తాజాగా సద్గుణం వ్యాఖ్యల మేరకు విజయకాంత్ స్పందించారన్న చర్చ మొదలైంది. డీఎంకే కూటమి విషయాన్ని తర్వాత చూసుకుందామన్న విజయకాంత్, రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రద్దు చేస్తారా?: ప్రజా సీఎం అని చెప్పుకుంటు న్న జయలలిత టాటా చెప్పి పోయేస్ గార్డెన్‌లోకి వెళ్లారని, ఆ తర్వాత ఆమె ప్రజల్లోకి రాక పోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ అధినేత్రి జయలలిత పోయేస్ గార్డెన్‌కు పరిమితం కావడంతో, మంత్రులు తమ చేతికి అందినంత దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ పనుల్లో అవినీతి తాండవం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎంగా ఉన్నప్పుడు జయలలిత చేసిన 110 నిబంధనల ప్రకటనలు ఏ ఒక్కటీ అమలు కాలేదని, అయితే, అవన్నీ అమలైనట్టుగా పేర్కొంటుండడం బట్టి చూస్తే ఏ మేరకు అవి నీతి సాగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ. 60 కోట్లు కేటాయించామన్నారు. అయితే, ఎక్కడా మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవని, రోడ్లన్నీ గతుకులతో దర్శనం ఇస్తున్నాయని మండి పడ్డారు. ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వివరిస్తూ, చేత కాకుంటే అసెంబ్లీని రద్దు చేసి బయటకు వెళ్లండని డిమాండ్ చేశారు. ఓ వైపు అమ్మ...అమ్మ అని జపిస్తూనే, మరో వైపు లంచం..లంచం అని ప్రజల్ని దోచుకునే పనిలో పడ్డా పన్నీరు సెల్వం మంత్రి వర్గం పనితీరును ఎండగట్టేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో విజయకాంత్ సతీమణి ప్రేమలత, యువజన నేత సుదీష్, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
సీఎం అభ్యర్థి నేనే
బీజేపీ కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. తనను ఆ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెచ్చే పనిలో పడ్డారు. విజయకాంత్ నిర్ణయాన్ని కమలనాథుల దృష్టికి తీసుకెళ్లేందుకు డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో విజయకాంత్‌కు కమలనాథులు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. నరేంద్ర మోదీ ప్రచారానికి వచ్చినప్పుడు విజయకాంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. విజయకాంత్ భుజం మీద చేతులు వేస్తూ, ఆయన్ను ఆహ్వానించే రీతిలో వ్యవహరించి డీఎండీకే ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టారు. అయితే, ఎన్నికల అనంతరం విజయకాంత్‌కు అడుగడుగున అవమానాలే ఎదురయ్యూరుు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు పలు మార్లు యత్నించినా అనుమతి కరువైంది. కాశ్మీర్ నివారణ నిధి ఇద్దామన్నా అందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. బీజేపీ మీద గుర్రుగా ఉన్న విజయకాంత్ ఆ కూటమిలో ఇంకా కొనసాగాలా? అన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ కూటమిలో ఎండీఎంకే నేత వైగోకు ఎదురైన పరాభావాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యే తమకు తప్పదన్న విషయాన్ని గ్రహించి బీజేపీ నుంచి జారుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ, పీఎంకేలకు షాక్ బీజేపీ కూటమిలో ఉన్నామా..? లేదా..? అని చెప్పుకునే పరిస్థితుల్లో లేని పీఎంకే నేత రాందాసు కాసేపు కూటమికి అనుకూలంగా, మరి కాసేపు తమ నేతృత్వంలో కూటమి అంటూ వ్యాఖ్యానిస్తుండడాన్ని విజయకాంత్ పరిశీలించారు. తమ నేతృత్వంలో కూటమి అన్నప్పుడు అధినేత రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు సీఎం అభ్యర్థి అన్న నినాదాన్ని పీఎంకే వర్గాలు అందుకున్నాయి. ఈ పరిణామాలన్నీ తన ఆశల్ని ఎక్కడ అడియాశలు చేస్తాయోనన్న విషయాన్ని గ్రహించిన విజయకాంత్ మేల్కొన్నారు. బీజేపీ, పీఎంకేలకు షాక్ ఇచ్చేందుకు నిర్ణయించారు. పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చి అందులో చర్చించే అంశాల్ని పార్టీ వర్గాల ద్వారా బయటకు పంపించే పనిలో పడ్డారు. జనవరి ఏడో తేదీన కోయంబత్తూరు వేదికగా జరిగే కార్యవర్గం భేటీ అసెంబ్లీ ఎన్నికల దశ, దిశ నిర్దేశం లక్ష్యంగా సాగబోతోందని డీఎండీకే నేతలు ప్రకటించారు. అరుుతే అంతలోపే బిజేపి కూటమి సీఎం అభ్యర్థిగా తమ నేత విజయకాం త్ పేరును ప్రకటించాల్సిందేనన్న నినాదాన్ని అందుకుని ప్రచారం చేస్తున్నారు. విజయకాంత్ సూచన మేరకు డీఎండీకే వర్గాలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ కూటమి సంసిద్ధత వ్యక్తం చేస్తే సరే, లేని పక్షంలో ఆ కూటమికి జనవరి 7న టాటా చెప్పేందుకు విజయకాంత్ సిద్ధమవుతున్నారు. కూటమిలో తాను ఉండాల్సిన అవసరం ఉన్నట్టుగా బీజేపీ నాయకులెవ్వరైనా వ్యాఖ్యలు చేసిన పక్షంలో, సర్వ సభ్య సమావేశంలో విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసే రీతిలో తీర్మానం చేయడానికి డీఎండీకే వర్గాలు వ్యూహ రచన చేయడం గమనార్హం. -
ఏం చేద్దాం?
బీజేపీ కూటమి నుంచి వైదొలగేందుకు డీఎండీకే సన్నద్ధమవుతోంది. వైగోకు ఎదురైన అవమానం తమకు ఎదురయ్యేలోపు పక్కకు తప్పుకుంటే మంచిదన్న యోచనలో విజయకాంత్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు పార్టీ వర్గాలతో మంతనాల్లో మునిగారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకేకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నీడన చేరాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడం విజయకాంత్ ను డీలా పడేలా చేసింది. ఎన్నికల సమయంలో కుదర్చుకున్న ఒప్పందాల మేరకు తమకు బీజేపీ న్యాయం చేస్తుందన్న ఆశాభావంతో ఉన్న విజయకాంత్‌కు చివరకు మిగిలింది నిరాశే. తన బావమరిది సుదీష్‌కు ఇస్తామన్న రాజ్యసభ సీటును ఇవ్వక పోగా, చివరకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ సైతం విజయకాంత్‌కు కరువైంది.అప్పటి నుంచి బీజేపీ మీద ఆయన గుర్రుగానే ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లాకేంద్రంపై దూకుడుగా స్పందించిన విజయకాంత్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల వేళ తగ్గారు. బీజేపీ వర్గాలు బుజ్జగించడంతో తన మద్దతును ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కేవలం మద్దతు మాత్రమే ప్రకటించి, ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాల్ని విజయకాంత్ నిశితంగా పరిశీలిస్తున్నారు. పార్టీ జిల్లాల నాయకులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై సలహాలు సూచనలు ఇచ్చే పనిలో పడ్డారు. టాటా : బీజేపీ నేతల తీరును నిశితంగా పరిశీలిస్తున్న విజయకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన నేతృత్వంలోని కూటమికి ఆ పార్టీ కట్టుబడుతుందా? అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. కమలనాథులు సూపర్ స్టార్ రజనీకాంత్ జపం అందుకున్న దృష్ట్యా, ప్రస్తుతం ఆ పార్టీ కూటమి నుంచి నెమ్మదిగా జారుకుని, ప్రత్యామ్నాయ మార్గం మీద దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కూటమిలోని ఎండీఎంకేను పొమ్మనకుండా పొగ పెట్టే రీతిలో బీజేపీ వ్యవహరించిన తీరును విజయకాంత్ తప్పుబడుతున్నారు. ఈ రోజు ఎండీఎంకేకు ఎదురైన పరాభావం రేపు తమకు ఎదురు కాదనడంలో గ్యారంటీ ఏమిటీ..? అన్న ప్రశ్నను డీఎండీకే నాయకులు పలువురు విజయకాంత్ ముందు ఉంచినట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల ముందు నోరు విప్పేందుకు భయపడే బీజేపీ నాయకులు పలువురు, ఇప్పుడు జబ్బలు చరుస్తున్నారు. మున్ముందు తమతో కూడా ఇదే రకంగా వ్యవహరిస్తారన్న భావనలో డీఎండీకే నాయకులు ఉన్నారు. దీంతో మనమూ టాటా చెప్పేద్దాం! అన్న యోచనకు విజయకాంత్ వచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ వర్గాలతో సంప్రదింపుల అనంతరం తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీతో విభేదాలు లేవు. అలాగనీ మిత్ర బంధం కూడా లేదు. ఈ సమయంలో ఉన్నట్టుండి బయటకు వెళ్లడం కన్నా, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఈలం తమిళుల విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయం మేరకు స్వరాన్ని పెంచేందుకు నిర్ణయించారు. ఎలాగూ శ్రీలంకకు అనుకూలంగా ప్రధాని మోదీ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్న దృష్ట్యా, ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని మోదీపై విమర్శలతో బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు విజయకాంత్ సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సీఎం అభ్యర్థి నేనే
టీనగర్: తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీజేపీ అధినేత నరేంద్ర మోడీ మద్దతు తెలుపుతారని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశం కోయంబేడులోగల పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే వైఫల్యం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు. సమావేశంలో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టారు. విజయకాంత్ మాట్లాడుతూ డీఎండీకే కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి తమ జిల్లా పరిధిలో గల ప్రాంతాల్లో పార్టీ నాయకులు సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. నగర గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు అందజేయాలన్నారు. బీజేపీ నాయకులు కొందరు రజనీకాంత్‌ను రాజకీయంలోకి ఆహ్వానిస్తున్నారని అయితే అది విఫలమైందన్నారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను బీజేపీతో తమకు సత్ సంబంధాలు ఉన్నాయన్నారు. అందువల్ల బీజేపీ కూటమిలో పొత్తులు కుదుర్చుకుంటామన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి తాను మాత్రమేనని ఇందులోఎటువంటి మార్పు లేదన్నారు. అవినీతిని అంతమొందించేందుకు, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మోడి తనకు మద్దతు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నిరూపిస్తే సగం మీసం తీసుకుంటా...
-
మీసం తీసేస్తా!
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తప్పు చేయలేదని నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేస్తా అని డీఎండీకే అధినేత విజయకాంత్ గురువారం సవాల్ చేశారు. న్యాయమూర్తి తీర్పును తప్పుబట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ తన నియోజకవర్గం రిషి వందియంలో గురువారం పర్యటించారు. ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన కార్యక్రమాలు, పనులను పరిశీలించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పోలీసు శాఖకు, అన్నాడీఎంకే వర్గాలకు సవాళ్ల మీద సవాళ్లను విసిరారు. తాను బతకడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కష్ట పడి పనిచేసి, ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. బతికేందుకు తనకు అనేక మార్గాలు ఉన్నాయని వివరించారు. అయితే, ఇక్కడ పాలకులు ప్రతిపక్షాల గళం నొక్కేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలను నీచాతి నీచంగా చూసినందుకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో ఓ మారు గుర్తు చేసుకోండంటూ పరోక్షంగా అన్నాడీఎంకే వర్గాలకు చురకలంటించారు. ధర్మం గెలిచిందని, అందుకే బెయిల్ రావడం లేదని వ్యాఖ్యలు చేస్తూ, ఇక జయలలితకు బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి చేయకుండా, దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చే వారికి జైలు శిక్ష తప్పదని, ఇందుకు జయలలిత కేసు ఓ హెచ్చరికగా పేర్కొన్నారు. తమ అమ్మ జైల్లో ఉందని మంత్రులందరూ తెగ ఏడ్చేస్తున్నారని, అలాంటప్పుడు అమ్మ బయటకు వచ్చాకే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఉండొచ్చుగా అని ప్రశ్నించారు. మొసలి కన్నీళ్లు కారుస్తూనే పదవుల్ని కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే నా సవాల్: పాలకుల తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత, విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉన్నాయన్నారు. అయితే,ప్రతి పక్షాల గొంతు నొక్కే విధంగా కేసుల మోతలు మోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి పక్షాలు ద్విముఖాలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఎవరి ముఖాలు ఎలా ఉన్నాయో సరి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం లక్ష్యంగా వ్యవహరిస్తే, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవర్నీ దోచుకోలేదని, ప్రజల ఆస్తులు కబ్జా చేయలేదని పేర్కొంటూ, ఇవన్నీ చేసిన వాళ్లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఇది వరకు ఉన్న పాలకులు టీవీలను ఇచ్చారని, ఇప్పుడున్న వాళ్లు కంప్యూటర్లు ఇచ్చారని గుర్తు చేస్తూ, వాటిలో మైకెల్ డీ గున్హ ఇచ్చిన తీర్పును ప్రజలు చూసుకుంటున్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. పోలీసు యంత్రాంగం మనస్సాక్షితో పనిచేయాలని, వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పాత కాలపు చట్టాలు చేతిలో పెట్టుకుని ప్రతి పక్షాల్ని బెదిరించడం మానుకుని నిబద్ధత, నిజాయితీతో పనిచేయాలని కోరారు. జయలలిత ఏ తప్పూ చేయలేదని, ఆమె నిర్దోషి అంటూ మైకెల్ డీ గున్హ తీర్పును వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక వేళ ఆమె తప్పు చేయకుంటే, బెయిల్ వచ్చి ఉండేదిగా అని ప్రశ్నించారు. ఆమె తప్పూ చేయలేదని పోలీసు యంత్రాంగం కానీ, అన్నాడీఎంకే నాయకులు కానీ నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేసి తిరుగుతాననని సవాల్ చేశారు. -
విజయ్, విజయకాంత్లకు బీజేపీ గాలం
‘ఇన్నాళ్లు సూపర్ స్టార్ రజనీకాంత్ నినాదాన్ని పఠించిన కమలనాథులు ఇక, ఇళయదళపతి విజయ్, డీఎండీకే అధినేత విజయకాంత్ పేర్లను జపించేందుకు సిద్ధమయ్యారు.’ విజయ్‌కు గాలం వేయడంతో పాటుగా విజయకాంత్‌కు అండగా నిలబడేందుకు బీజేపీ అధిష్టాన ం కసరత్తుల్లో మునిగింది. సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాల్లో మునిగింది. పీఎం మోదీచరిష్మాను, రాష్ట్రంలోని ఇన్నాళ్లు సాగిన ద్రవిడ పార్టీల అవినీతిని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న బలమైన శక్తుల మద్దతును కూడగట్టుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యూరు. సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దించడం లక్ష్యంగా తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఇన్నాళ్లు రజనీ నినాద మంత్రాన్ని పఠించిన కమలనాథులు, ఇక విజయకాంత్, విజయ్ పల్లవి అందుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇళయ దళపతిగా పేరున్న విజయ్‌కు రాష్ట్రంలో అశేష అభిమాన లోకం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు విజయ్ తన మద్దతును ప్రకటించారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో అన్నాడీఎంకే సర్కారు రూపంలో విజయ్‌కు చిక్కులు తప్పలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు వేదికగా నరేంద్ర మోదీతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. విజయ్ను మోదీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. విజయ్ ఎలాంటి సంకేతం ఇవ్వకున్నా, ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతుగా ఆయన అభిమానులు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో విజయ్ మద్దతను పూర్తి స్థాయిలో దక్కించుకోవడం లక్ష్యంగా కమలనాథులు ప్రయత్నాల్లో పడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలతో విజయ్‌కు గాలం వేసే పనిలో కొందరు నాయకులు పడ్డారు. సేవా కార్యక్రమాలకు వేదికగా విజయ్ నేతృత్వంలో ఉన్న మక్కల్ ఇయక్కం మద్దతును కూడగట్టుకోవడం లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. తమకు మద్దతుగా నిలిచిన పక్షంలో విజయ్‌కు లేదా, ఆయన సూచించే వ్యక్తికి రాజ్య సభ సీటును ఎరగా వేయడానికి కమలనాథులు రెడీ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకేకు అండ: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్ మనసు మారకుండా, తమతో కలసి ఉండే విధంగా కొత్త వ్యూహాన్ని రచించారు. విజయకాంత్‌కు రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం, ఆ పార్టీకి, ఆ పార్టీ నేతృత్వంలోని కెప్టెన్ టీవీకి అండగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. పదేళ్లుగా పార్టీని ఒంటరిగా విజయకాంత్ ముందుకు తీసుకె ళుతున్నారు. అన్నీ తానై ముందుకు సాగుతున్న విజయకాంత్‌కు కెప్టెన్ టీవీ, న్యూస్ చానెళ్లు ఉన్నాయి. ఈ చానెళ్లు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. పార్టీని ముందుకు తీసుకెళ్లడం విజయకాంత్‌కు భారంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అధిష్టానం, ఆయనకు అండగా నిలబడేందుకు సిద్ధమైనట్టు సమాచారం. తమతో మిత్రత్వం కొనసాగిస్తే, ఈ సారి విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావ మరిది సుదీష్‌లలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటుగా, టీవీ చానెళ్ల అభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని ఇచ్చి, పూర్తి స్థాయిలో కూటమి పార్టీ, మద్దతు నేతల కార్యక్రమాల ప్రచారం లక్ష్యంగా ఉపయోగించుకునేందుకు కమలనాథులు వ్యూహ రచన చేశారు. విజయకాంత్ సీఎం సీటు లక్ష్యంగా రాజకీయ పయనం సాగిస్తున్న దృష్ట్యా, ఎన్నికల నాటి పరిస్థితుల మేరకు ‘సీఎం’ సీటు నిర్ణయం తెరపైకి తెచ్చే విధంగా కమలనాథులు కసరత్తుల్లో దిగారు. రంగంలోకి అమిత్ షా: మహారాష్ట్ర ఎన్నికలు ముగియడంతో ఇక తమిళనాడులో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అమిత్ షా సిద్ధమవుతున్నారు. త్వరలో తన వ్యూహాల అమలు లక్ష్యంగా ఆయన రంగంలోకి దిగనున్నట్టు కమలాలయంలో ప్రచారం ఊపందుకుంటోంది. అమిత్ షా రంగంలోకి దిగబోతున్నందునే ఈనెల 26న పార్టీ సర్వ సభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పిలుపు నిచ్చారని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం ప్రకటనతో అమిత్ షా వ్యూహాల అమలు లక్ష్యంగా నేతలు పరుగులు తీయనున్నారు. దీంతో కొద్ది రోజుల నుంచి కమలనాథుల నోట ‘వీ’ నినాద జపం మార్మోగనుంది. ఇక, రజనీకి సీఎం సీటు ఆఫర్, విజయ్ గాలం, విజయకాంత్‌కు ఆర్థిక అండ ఇచ్చే రీతిలో అమిత్ రచించిన వ్యూహాలు ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయోనన్నది వేచి చూడక తప్పదు. -
నేడే బక్రీద్
సాక్షి, చెన్నై: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను సోమవారం ఘనంగా జరుపుకునేందుకు రాష్ర్టంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు, ఈద్గా మైదానాలు సిద్ధమయ్యాయి. పండుగను పురస్కరించుకుని ముస్లిం లకు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తి భావం మిన్నంటే ‘రంజాన్’ అనంతరం ముస్లింలు జరుపుకునే మరో పండుగ బక్రీద్. త్యాగ నిరతిని చాటే ఈ పండుగను ఈదుల్ జుహా,ఈదుజ్జుహా అని కూడా పిలుస్తారు. ఈ పండుగ వెనుక త్యాగాన్ని చాటే కథ ఉంది. దైవ ప్రవక్తల్లో ఒకరైన హజ్రత్ ఇబ్రాహీం తన కలను అల్లా ఆదేశంగా భావించి, తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి హజ్రత్ ఇబ్రాహీం సిద్ధం అవుతారు. ఇందుకు ఇస్మాయిల్ సైతం అంగీకరించి బలి దానానికి సిద్ధం అవుతాడు. అయితే, బలి ఇచ్చే సమయంలో వీరి భక్తికిమెచ్చిన అల్లా ఇస్మాయిల్ స్థానంలో ఓ గొర్రెను ఉంచుతారు. నాటి నుంచి వీరి త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. హజ్ యాత్ర: ఇస్లాం సూచించే ఐదు సూత్రాల్లో హజ్ యాత్ర కూడా ఒకటి. మహ్మద్ ప్రవక్త సూచనల మేరకు జీవితంలో ఓ సారైనా ప్రతి ముస్లిం హజ్ యాత్ర చేయాల్సి ఉంది. ఈ యాత్ర దుల్హజ్ మాసంగా పిలిచే ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. బక్రీద్ పర్వదినాన మక్కాలో నమాజు చేయడానికి అత్యధికులు ఇష్ట పడతారు. ఈ ప్రార్థన కోసం ఏటా రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఖుర్బానీ: బక్రీద్ పర్వదినాన ప్రార్థనే కాదు...ఖుర్బానీ ఇవ్వడం అత్యంత ముఖ్య ఘట్టం. హజ్రత్ ఇబ్రాహీం త్యాగ నిరతిని స్మరిస్తూ ప్రతి ఇంటా గొర్రె లేదా ఒంటెను ఖుర్బానీ ఇస్తారు. ఆర్థిక స్తోమత కల్గిన వారు ఒకటి లేదా రెండు గొర్రెలను ఖుర్బానీ ఇస్తారు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రం ఉండే వాళ్లు ఐదారుగురు కలసి మసీదుల ద్వారా ఖుర్బానీకి ఏర్పాట్లు చేసుకుంటారు. ఖుర్బానీ ఇచ్చిన గొర్రె లేదా ఒంటె మాంసాన్ని మూడు భాగాలుగా విభజించాల్సి ఉంటుంది. ఇందులో ఓ భాగం తమ కుటుంబానికి, రెండో భాగం బంధు మిత్రులకు, మూడో భాగం పేదలకు పంచి పెడతారు. దీంతో గొర్రెల ధరలకు రెక్కలొచ్చాయి. నగరం, శివారుల్లోని పల్లవరం, తాంబరం సానిటోరియం, ప్యారీస్, వ్యాసార్పాడి తదితర ప్రాంతాల్లోని గొర్రెల సంతల్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. కొందరు అయితే, రాజస్థాన్ నుంచి ముందుగానే ఒంటెలను కొనుగోలు చేసి, ఇక్కడికి తీసుకొచ్చారు. సందడిగా: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రదేశాల్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త దుస్తుల కొనుగోళ్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఖుర్బానీకి గొర్రెల్ని సిద్ధం చేశారు. పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనల కోసం టోపీలు, అత్తరు, బిర్యాని, తీపి పదార్థాల తయారీకి ఉపయోగించే వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలి వచ్చారు. ముస్లింలు అత్యధికంగా ఉండే చెన్నైలోని ట్రిపిక్లేన్, మన్నడి, తండయార్ పేట, పూందమల్లి, అన్నానగర్, పురసైవాక్కం, పడప్పై, తాంబరం, అరుంబాక్కం, అన్నా సాలై, ఎంఎండీఏ, ఆవడి పరిసరాల్లో సందడి నెలకొంది. ఇక, మదురై, తిరునల్వేలి, కోయంబత్తూరు, రామనాథపురం, వేలూరు, తూత్తుకుడి, విరుదునగర్, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం తదితర పట్టణాల్లో పండుగకు సర్వం సిద్ధం చేశారు. బక్రీద్ ప్రార్థనలకు రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉదయం 8 గంటలకు, మరికొన్ని చోట్ల 8.30, 9 గంటలకు ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఈద్గా మైదానాల్లో, మసీదుల్లో ఈ ప్రార్థనలు జరగనున్నాయి. ప్రార్థనల అనంతరం ఖుర్భానికి సర్వం సిద్ధం చేశారు. నేతల శుభాకాంక్షలు: బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు ఆదివారం రాజకీయ పక్షాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య తన ప్రకటనలో ముస్లింలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినాన త్యాగం, నమ్మకం, ఐక్యత, మత సామరస్యం మరింతగా పెంపొందాలని ఆకాంక్షించారు. పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం పేర్కొంటూ, భక్తి భావంతో ముందుకెళ్తున్న రాష్ట్రంలోని ముస్లింలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకోవాలని కోరారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ప్రకటనలో మహ్మద్ ప్రవక్త అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన సూక్తులను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్న ముస్లింలలో స్నేహ భావం మరింత పెంపొందాలని కాంక్షించారు. డీఎండీకే అధినేత విజయకాంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, డీఎండీకే నాయకులు, కార్యకర్తలు పేద ముస్లింలతో కలిసి ఖుర్బానీ ఇచ్చి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పీఎంకే అధినేత రాందాసు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, ఇండియ దేశీయ ముస్లిం లీగ్ నేత జవహర్ అలీ, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, ఐజేకే నేత పారివేందన్, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం తదితరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. -
భద్రత కల్పించండి
రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులకు, కార్యాలయాలకు భద్రత కల్పించండి అని గవర్నర్ రోశయ్యకు ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం రాజ్ భవన్లో గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. సాక్షి, చెన్నై: జయలలితకు శిక్ష ఖరారు కావడంతో అన్నాడీఎంకే వర్గాలు సృష్టించిన వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిపక్షాల్ని టార్గెట్ చేసి దాడులకు యత్నించారుు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించే ప్రమాదం నెలకొందన్న ఆందోళనతో ఉదయాన్నే డీఎండీకే నేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్ రాజ్‌భవన్ బాట పట్టారు. పార్టీ ఎమ్మెల్యేల బృందంతో కలిసి గవర్నర్ రోశయ్యను కలిశారు. 15 నిమిషాల పాటుగా రోశయ్యతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బం దులు, ప్రతిపక్షాల్ని టార్గెట్ చేసి సాగుతున్న దాడుల్ని వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. ప్రజలకు, తమకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలకు భద్రత కరువు : గవర్నర్‌తో భేటీ అనంతరం విలేకరులతో రోశయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి పక్షాలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే వర్గాలు వ్యవహరించిన తీరును చూసిన ప్రజల్లో భయానక వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజల్ని, ప్రతి పక్షాల నాయకులకు భద్రత కల్పించాలని గవర్నర్ రోశయ్యకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యుత్, తాగునీరు తదితర సమస్యల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. జయలలిత అండ్‌కో కు నాలుగేళ్లు జైలు శిక్ష విధించడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేని స్పష్టం చేశారు. చట్టానికి అందరూ సమానం అన్న విషయం ప్రస్తుత తీర్పు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగిన అరాచకాల్ని ప్రభుత్వ కేబుల్ పరిధిలోని ఛానళ్లలో ప్రసారం చేయకుండా అడ్డుకట్ట వేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పిటిషన్ : తమకు భద్రత కల్పించాలంటూ గవర్నర్ రోశయ్యను ప్రధాన ప్రతిపక్ష నేత ఓ వైపు కలిస్తే, మరో వైపు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి స్పందించారు. ప్రజలకు భద్రత కల్పించాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఉదయం ట్రాఫిక్ రామస్వామి, న్యాయవాది రాజారాం న్యాయమూర్తి వైద్యనాథన్ ఇంటికి వెళ్లి పిటిషన్ సమర్పించారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతూ, రాష్ట్రంలో సాగిన విధ్వంసాలను వివరించారు. -
అన్నాడీఎంకేపై ధ్వజమెత్తిన విజయకాంత్
దిందిగల్(తమిళనాడు): అధికార అన్నాడీఎంకే పార్టీపై ప్రతిపక్ష నాయకుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఆగడాలు అధికమయ్యాయని మండిపడ్డారు. మరే పార్టీ పోటీ చేయకుండా అధికార పార్టీ అడుపడుతోందని ఆరోపించారు. మరేయితర పార్టీ పోటీ చేయకూడదనుకుంటే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్నాడీఎంకే ప్రలోభాలు, బెదిరింపులకు దిగుతోందని ఆయన ఆరోపించారు. -
పేదలకు రూ.కోటి
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ వెయ్యి మంది పేదలకు రూ.పది వేలు చొప్పున రూ.కోటి విలువ గల వస్తువులను శనివారం పంపిణీ చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తన జన్మదిన వేడుకను గత కొన్నేళ్లుగా జరుపుకుంటూ వస్తుంటే, ప్రజాకర్షణ లక్ష్యంగా అధికార పక్షం పథకాలను హామీలకే పరిమితం చేస్తున్నదని మండిపడ్డారు. సినీ నటుడిగా ఉన్న సమయంలోనూ, రాజకీయ పార్టీ అధినేతగా అవతరించినప్పుడూ తన పుట్టినరోజును పేదరిక నిర్మూలన దినోత్సవం పేరుతో విజయకాంత్ జరుపుకుంటూ వస్తున్నారు. ఆగస్టు 25న 62వ వసంతంలోకి ఆయన అడుగు పెట్టనున్నారు. ఇందులో భాగంగా శనివారం కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయం ఆవరణలో ఈ వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది పేదలిను ఎంపిక చేసి, తలా పది వేలు చొప్పున కోటి రూపాయలు విలువగల వస్తువులను విజయకాంత్ పంపిణీ చేశారు. ఎంజీయార్ బధిర పాఠశాలకు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. ఈ వేడుకలో విజయకాంత్ సతీమణి ప్రేమలత, యువజన నేత ఎల్కే సుదీష్, పార్టీ నాయకులు పార్థసారథి, సివి చంద్రకుమార్, ఇళంగోవన్, యువరాజ, రాజన్, సెంతామరై కన్నన్, కామరాజ్, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ వేడుక అనంతరం విజయకాంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రజాధనం దుర్వినియోగం తన జన్మదినం రోజున పేదలకు ఇతోధికంగా సాయం అందించే లక్ష్యంతోనే వేడుకలు జరుపుకుంటూ వస్తున్నానని విజయకాంత్ గుర్తు చేశారు. అయితే, అధికార పక్షం కేవలం ప్రజాకర్షణే లక్ష్యంగా పథకాలను ప్రకటించి, అమల్లో విఫలమవుతోందని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారేగానీ, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరలేదని ధ్వజమెత్తారు. ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కాగ్ స్పష్టం చేస్తోందని ఆరోపించారు. ప్రజల్ని ఆకర్షించే విధంగా సరికొత్త నినాదాన్ని అందుకుని పథకాలను ప్రకటిస్తున్నారని, ఇవన్నీ అమలయ్యేది అనుమానమేనన్నారు. ఎన్నికల హామీలనే సక్రమంగా అమలు చేయకుండా, చేసినట్టుగా జిమ్మిక్కులు చేయడం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు. ఈ ప్రభుత్వ విధానాలతో ప్రజలు అష్టకష్టాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. హత్యలు, దోపిడీల పర్వంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
వీల్ చైర్లో కెప్టెన్
సాక్షి, చెన్నై: లోక్ సభ ఎన్నికల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యం బారిన పడ్డట్టున్నారు. ఓ వైపు పార్టీ డిపాజిట్లు గల్లంతు కావడం, మరో వైపు జంప్ జిలానీకి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్న సంకేతాలు వెరసి ఆయనలో కలవరాన్ని సృష్టించాయి. ఎన్నికల ముందుగా సింగపూర్‌కు పరుగులు తీసిన విజయకాంత్, ఎన్నికల అనంతరం కూడా ఉరకలు తీశారు. సింగపూర్ పర్యటనకు ముందుగా ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఒక రోజు చికిత్స పొందడం ఆ పార్టీ వర్గాలను కలవరంలో పడేసింది. అయితే, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారన్న భరోసాను ఇచ్చారు. ఆస్పత్రి నుంచి వచ్చిన విజయకాంత్ ఈనెల 13న తన సతీమణి ప్రేమలతతో కలసి సింగపూర్ వెళ్లారు. అయితే, ఆయన పర్యటన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. రెండు వారాల పాటుగా సింగపూర్‌లో ఉన్న విజయకాంత్ చెన్నైకు తిరుగు పయనం అవుతున్నట్టు శనివారం సమాచారం అందింది. అదే రోజు రాత్రి చెన్నైకు చేరుకోవాల్సి ఉన్నా, ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఆయన చెన్నైకు వస్తున్నారన్న సమాచారంతో మీడియా మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంది .ముందు ప్రేమలత : విజయకాంత్ ఏదేని కొత్త విషయాలు చెబుతారన్న ఆసక్తితో మీడియా మీనంబాక్కంకు పరుగులు తీసింది. సింగపూర్ నుంచి ఉదయం 10.10 గంటలకు సిల్క్ ఎయిర్ వేస్ చెన్నైలో ల్యాండ్ అయింది. ఆ విమానం నుంచి ప్రేమలత మాత్రం దిగి బయటకు వచ్చారు. అయితే, విజయకాంత్ రాలేదన్న సంకేతం ఇవ్వడానికే ఆమె తొలుత బయటకు వచ్చినట్టుంది. విమానం నుంచి ప్రయాణికులందరూ కిందకు దిగిన కాసేపటికి విజయకాంత్‌ను వీల్ చైర్లో సిబ్బంది తీసుకొచ్చారు. శరీరంపై దుప్పటి కప్పి ఉన్నట్టుగా వీల్ చైర్లో బయటకు వచ్చిన విజయకాంత్‌ను మీడియా కంట పడకుండా జాగ్రత్తగా కారులో ఎక్కించారు. అక్కడి నుంచి ఆ కారు విజయకాంత్ ఇంటి వైపుగా దూసుకెళ్లింది. అయితే, విజయకాంత్‌కు ఏమయ్యిందోనన్న వివరాలను ఆ పార్టీవర్గాలే చెప్పలేని పరిస్థితి. అనారోగ్యం బారిన పడ్డ విజయకాంత్‌కు సింగపూర్‌లో ఏదైనా శస్త్ర చికిత్స జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారయి. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఎలాంటి వ్యాధులు లేవంటూ విజయకాంత్ ఇది వరకు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన వీల్ చైర్లో రావడంతో ఏమయ్యిందోనన్న విషయాన్ని ఆరా తీయడానికి తమిళ మీడియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. -
విజయకాంత్ డిశ్చార్జ్
సాక్షి, చెన్నై: ఆస్పత్రి నుంచి డీఎండీకే అధినేత విజయకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు తేల్చారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బిజీ షెడ్యూల్‌తో డీఎండీకే అధినేత విజయకాంత్ ఉరుకులు పరుగులు తీస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. యాంజీయోగ్రాం చేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే, విజయకాంత్‌కు జరిపిన పూర్తి స్థాయి పరీక్షల అనంతరం ఆ ప్రయత్నం విరమించారు. ఈసీజీ, ఎక్స్‌రే, స్కాన్ తదితర పరీక్షల అనంత రం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తేల్చారు. అధిక ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లేని దృష్ట్యా, ఆయన అస్వస్థతకు గురి కావడంతో స్వల్పంగా ఛాతి నొప్పి వచ్చి ఉంటుందని వైద్యులు భావించారు.విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ ఆయన్ను అదే రోజు రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఉదయాన్నే విజయకాంత్‌ను పార్టీ ఎమ్మెల్యేలు కలిసేందుకు యత్నించినా, కుటుంబీకుల అంగీకరించలేదు. అసెంబ్లీ అనంతరం కొం దరు ఎమ్మెల్యేలులు విజయకాంత్‌ను ఆయన నివాసంలో కలిసినట్టు సమాచారం. -
ఆస్పత్రిలో కెప్టెన్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన సమాచారం ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి విశ్రాంతి లేకుండా ఆయన ఉరుకులు పరుగులు తీయడంతోనే అనారోగ్యం పాలు కావాల్సి వచ్చిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నిక ల ముందు నుంచి విజయకాంత్ పార్టీ పరంగా, తనయుడి తెరంగేట్రం పరంగా బిజీ బిజీగా ఉన్నారు. కొన్నాళ్లు సింగపూర్‌లో సైతం ఆ చిత్ర విషయంగా మంతనాల్లో మునిగారు. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు వ్యవహారం తేల్చుకునే పని సైతం సింగపూర్‌లోనే పూర్తి చేశారు. అక్కడి నుంచి వచ్చీరాగానే, బీజేపీతో దోస్తీ కట్టేసి, తమ అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఎన్నికల ప్రచారబాట పట్టి రేయింబవళ్లు శ్రమించారు. చివరకు ఫలితం తమ పార్టీ డిపాజిట్లు గల్లంతు కావడంతోపాటుగా ఓటు బ్యాంక్ తగ్గడమే. దీంతోపాటు పార్టీ నుంచి వలసలు మొదలయ్యూయన్న ఆందోళన ఆయన్ను వెంటాడింది. ఎట్టకేలకు పార్టీని రక్షించుకోవడంతో పాటుగా కార్యకర్తల్లో నూతనోత్సాహం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో తనయుడు షణ్ముగ పాండియన్ శతాబ్దం చిత్రంలో తాను ప్రత్యేక పాత్రలో కన్పిస్తుండడంతో ఆ షూటింగ్ బిబీలో పడ్డారు. సింగపూర్‌లో రెండు, మూడు వారాలు గడిపి షూటింగ్ ముగించుకుని చెన్నైకు రాగానే, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు. మీతో నేను : కార్యకర్తల చెంతకు నేరుగా వెళ్లేందుకు నిర్ణయించిన విజయకాంత్ ఁమీతో నేను* కార్యక్రమానికి గత నెల శ్రీకారం చుట్టారు. తొలుత దక్షిణాది జిల్లాలో పర్యటించిన ఆయన, ప్రస్తుతం చెన్నై , తిరువళ్లూరు పర్యటనలో ఉన్నారు. మంగళవారం తిరువళ్లూరులో మీతో నేను అంటూ కార్యకర్తల్ని, నాయకుల్ని పలకరించారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా అందరికీ ప్రత్యేక సూచనలు ఇచ్చారు. తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో ఉన్న విజయకాంత్‌కు బుధవారం ఉదయాన్నే ఛాతినొప్పి రావడం ఆ పార్టీ వర్గాల్లో కలవరం రేపింది. విశ్రాంతి లేకుండా విజయకాంత్ బిజీ షెడ్యూల్లో పడి ఆరోగ్యం గురించి విస్మరించినట్టున్నారు. ఉదయాన్నే ఇంట్లో ఉన్న విజయకాంత్‌కు స్వల్పంగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన కుటుంబీకులు గ్రీమ్స్ రోడ్డు అపోలోకు తరలించారు. అక్కడి మూడో అంతస్తులో విజయకాంత్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే, తమ అధినేత విజయకాంత్‌కు చాతినొప్పి సమాచారంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ వర్గాలు వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డాయి. అవిశ్రాంతంగా విజయకాంత్ తన షెడ్యూల్‌ను రూపొందించుకుని చివరకు ఆస్పత్రి పాలయ్యారంటూ ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు అక్కడికి వచ్చిన కార్యకర్తలకు నచ్చచెప్పి పంపుతున్నారు. ఎవరూ ఆస్పత్రి వద్దకు రావాల్సిన అవసరం లేదని, విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. అయితే, విజయకాంత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం యాంజియో గ్రాంకు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నటించాలన్న ఆసక్తి లేదు
టీ.నగర్: తనకు మళ్లీ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి లేదని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ వెల్లడించారు. సేలంలో సోమవారం ‘మీతో నేను’ అనే కార్యక్రమం ఐదురోడ్ల కూడలిలోని కల్యాణ మండపంలో జరిగింది. ఇందులో సేలం, నగర జిల్లా, తూర్పు, పచ్చిమ జిల్లాలకు చెందిన నిర్వాహకులు, కార్యకర్తలు 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయకాంత్ కార్యకర్తల ప్రశ్నలకు బదులిచ్చారు. కార్యకర్తలు సినిమాల్లో మళ్లీ నటిస్తారా అని ప్రశ్నించగా విజయకాంత్ బదులిస్తూ తనకు ఆరోగ్యం సహకరించనందున ఎక్కువ సేపు మాట్లాడలేనని అయినప్పటికీ ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నలకు బదులిస్తానన్నారు. తాను సినిమాల్లో నటించి నాలుగేళ్లకు పైగా కావస్తుందని ఇకపై సినిమాల్లో నటించే ఆశ లేదన్నారు. తనకు బదులు తన కుమారుడు సినిమాలో నటిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు విజయకాంత్‌తో ఫొటోలు తీయించుకున్నారు. ఆ తరువాత నిర్వాహకులతో విజయకాంత్ సమావేశం నిర్వహించారు. 2016లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. 2016లో డీఎండీకే మహత్తర శక్తిగా రూపొందనుందన్నారు. ప్రతి యూనియన్‌లోను ప్రతి నెలా 1000 మంది సభ్యులు పార్టీలోకి చేరి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. -
బలోపేతం
లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతు, ఓటు బ్యాంక్ పతనం వెరసి డీఎండీకే అధినేత విజయకాంత్‌ను డైలమాలో పడేశాయి. మళ్లీ బలం పుంజుకోవడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకుల చెంతకు స్వయం గా వెళ్లేందుకు ఆయన నిర్ణయించారు. రోజుకో జిల్లాను ఎంపిక చేసుకుని పార్టీ వర్గాల మొరను ఆలకించడంతో పాటుగా బలోపేతానికి మార్గదర్శకాలను ఉపదేశించనున్నారు. సాక్షి, చెన్నై : బీజేపీ కూటమితో కలసి లోక్‌సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 14 స్థానాల బరిలో అభ్యర్థులను నిల బెట్టిన విజయకాంత్‌ను ఫలితాలు పెద్ద షాక్‌కు గురి చేశాయి. సేలంలో తన బావమరిది సుదీష్ తప్పకుండా గెలుస్తాడని, మరో స్థానం తప్పకుండా తమ గుప్పెట్లోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్న విజయకాంత్ చివరకు భంగ పడ్డారు. డిపాజిట్లు గల్లంతు కావడంతోపాటుగా పూర్వం ఉన్న ఓటు బ్యాంక్ పతనంతో డైలమాలో పడాల్సి వచ్చింది. తమను నమ్ముకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ, తమ కంటే ఎక్కువ ఓటు బ్యాంక్‌ను దక్కించుకోవడం డీఎండీకే నేతలను, ఆ పార్టీ వర్గాల్ని కలవరంలో పడేసింది. కలవరం : తమ ఓటు బ్యాంక్‌ను బీజేపీ కొల్లగొట్టినా, ఆ ప్రభుత్వంలో తమకు చోటు దక్కని దృష్ట్యా, తీవ్ర అసంతృప్తితో విజయకాంత్ ఉన్నారు. పార్టీ అభ్యర్థుల ఓటమి కారణాల్ని అన్వేషించారు. పార్టీ నుంచి వలసలు బయలు దేరకుండా జాగ్రత్తలు పడ్డారు. తనయుడు చిత్ర షూటింగ్ నిమిత్తం సింగపూర్‌కు చెక్కేశారు. సింగపూర్ నుంచి తిరుగు పయనమైన విజయకాంత్ ఇక, పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టేందుకు నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో చతికిలబడ్డ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధం అయ్యారు. కార్యకర్తలు, నాయకులను తన వద్దకు పిలిపించుకోవడం కన్నా, స్వయంగా తానే వారి వద్దకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. కార్యకర్తల చెంతకు : పార్టీ బలోపేతానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోకుండా, పార్టీ శ్రేణుల అభిప్రాయాల సేకరణ, కార్యకర్తల మొరను ఆలకించే విధంగా కార్యాచరణను విజయకాంత్ సిద్ధంచేశారు. రోజుకో జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ వార్డు కమిటీ నుంచి గ్రామ, పట్టణ, యూనియన్, నగర, జిల్లా కార్యవర్గాలతో సమావేశం కానున్నారు. సభ్యత్వ గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ విజయకాంత్ సమావేశానికి హాజరు కావాలని పార్టీ అధిష్టానం పిలుపు నివ్వడం గమనార్హం. 26 నుంచి పర్యటన : విజయకాంత్ పర్యటన వివరాలను డీఎండీకే రాష్ట్ర పార్టీ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. ఈనెల 26న కోయంబత్తూరు నుంచి తన పర్యటనకు విజయకాంత్ శ్రీకారం చుట్టనున్నారు. 27న తిరుప్పూర్, 28న కరూర్, 29న నామక్కల్, 30న సేలం, జూలై ఒకటిన ధర్మపురి, రెండున కృష్ణగిరి, మూడున వేలూరు, నాలుగున తిరువణ్ణామలైలో తొలి విడత పర్యటన సాగనుంది. -
అంతా రహస్యమే
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ మంగళవారం మలేషియా వెళ్లారు. ఆయన పర్యటన అత్యంత రహస్యంగా సాగడం చర్చనీయూంశమైంది. దీని వెనుక ఆంతర్యమేమిటోనని పలువురు చెవులు కొరుక్కున్నారు. అయితే తనయుడు షణ్ముగ పాండియన్ శతాబ్దం చిత్రం షూటింగ్ కోసమే ఆయన వెళ్లినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల మంతనాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో డీఎండీకే అధినేత విజయకాంత్ గతంలో మలేషియాకు చెక్కేశారు. బీజేపీతో కలసి పనిచేయడం లక్ష్యంగా అక్కడున్న తన సన్నిహితులతో మంతనాల నిమిత్తం ఆయన వెళ్లినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. అలాగే మలేషియా వేదికగా రాజకీయ పందేరాలు సాగినట్టు తమిళ మీడియా కోడై కూసింది. మలేషియా నుంచి వచ్చీరాగానే బీజేపీతో పొత్తుకు ఆయన జై.. కొట్టడం మీడియా కథనాలకు బలం చేకూరినట్టయింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో తన మలేషియా పర్యటనపై సాగుతున్న ప్రచారానికి ముగింపు పలుకుతూ విజయకాంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి చిత్ర షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లినట్టు వివరణ ఇచ్చుకున్నారు. తాను ఈ చిత్రంలో కనిపించబోతున్నట్టు ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అదే సమయంలో ఎన్నికల బిజీలో షూటింగ్‌లు ఏమిటో... అన్న అంశంపై చర్చకూడా సాగింది. ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా చివరకు లోక్‌సభ ఎన్నికల్లో విజయకాంత్ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేంద్రంలో తమ పార్టీకి మంత్రి పదవి దక్కుతుందని ఎదురు చూసినా ఫలితం శూన్యం. చివరకు పార్టీ వర్గాలతో ఓటమిపై సమీక్షలు ముగించడంతోపాటు వలసలు బయలు దేరకుండా ముందు జాగ్రత్త చర్యగా నేతలకు ఉపదేశాలు ఇచ్చిన విజయకాంత్ హఠత్తుగా మంగళవారం మలేషియాకు చెక్కేశారు. మలేషియా పయనం : తన మలేషియా పర్యటన వివరాల్ని అత్యంత గోప్యంగా విజయకాంత్ ఉంచడం చర్చనీయాంశంగా మారింది. వీఐపీలు వస్తున్న సమయంలో మీనంబాక్కం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సహజం. అయితే ఈ సారి అలాంటి ఏర్పాట్లు కూడా లేదు. అలాగే విదేశాలకు వెళ్లే ప్రయాణికులు మూడు గంటలు ముందుగానే విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంటుంది. బోర్డింగ్ పాస్ తీసుకున్న అనంతరం అర గంట ముందుగా విమానంలోకి పంపుతారు. ఇందుకు భిన్నంగా విజయకాంత్ అత్యంత రహస్యంగా విమానాశ్రయానికి రావడం గమనార్హం. 11.30 గంటలకు విమానం బయలు దేరాల్సి ఉండగా, సరిగ్గా 11.05కు ఆయన విమానాశ్రయూనికి చేరుకున్నారు. అప్పటికే అక్కడి అధికారులు ఆయనకు బోర్డింగ్ పాస్ సిద్ధం చేయడంతో మీడియా కంట పడకుండా మలేషియాకు చెక్కేశారు. ఆయన వెంట సతీమని ప్రేమలత కూడా వెళ్లారు. షూటింగ్ నిమిత్తమే: విజయకాంత్ రహస్య పయనం మీడియాల్లో హల్చల్ చేయడంతో డీఎండీకే వర్గాలు మేల్కొన్నాయి. తమ అధినేత విజయకాంత్ కేవలం షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లారని వివరణ ఇచ్చే పనిలో పడ్డారు. తమ నేత వారసుడు షణ్ముగ పాండియన్ హీరోగా శతాబ్దం పేరుతో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ చిత్రంలో విజయకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారని, ఆ చిత్ర షూటింగ్ మలేషియా, కౌలాలంపూర్ల్లో జరగనున్నదని, అందు వల్లే ఆయన విదేశీ పయనాన్ని రహస్యంగా ఉంచుకున్నట్టు చెబుతున్నారు. పది, పదిహేను రోజులు ఈ షూటింగ్ ఉంటుందని, ఆ తర్వాత ఆయన ఇక్కడికి రావొచ్చని వెల్లడించారు. -
మోడీకి కెప్టెన్ లేఖాస్త్రం!
సాక్షి, చెన్నై :నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్స వం నిమిత్తం ఢిల్లీకి వెళ్లి భంగపాటుకు గురయ్యూరు డీఎండీకే అధినేత విజయకాంత్. తన బావమరిది సుదీష్‌కు పదవి దక్కక పోవడంతో కినుకు వహించిన విజయకాంత్, మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీకి తీవ్రంగానే యత్నించారు. అపాయింట్మెంట్లు లభించక పోవడంతో చెన్నైకు తిరిగి వచ్చేసిన విజయకాంత్ తదుపరి తన కార్యాచరణ మీద దృష్టి పెట్టారు. బీజేపీ కూటమిలోనే కొనసాగాలా? లేదా వారు పెట్టిన మెలిక మేరకు విలీనం చేయాలా? అని తదుపరి అడుగులు ఎటో తేల్చుకునేం దుకు ఈనెల నాలుగో తేదీన పార్టీ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం రావడంతో మేల్కొన్న విజయకాంత్ ముందుగానే రాష్ట్రంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే పనిలో పడ్డా రు. ఇది వరకు ప్రధాన మంత్రులకు లేఖాస్త్రాలతో సమస్యలను నివేదించడం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు అందెవేసిన చేయి. తాజాగా ఆ బాటలో విజయకాంత్ నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. శనివా రం రాష్ట్రంలోని సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెడు తూ మోడీకి లేఖాస్త్రం సంధించారు. లేఖాస్త్రం: తమిళనాడులో ప్రజలు తాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారని వివరించారు. నగరాలు, గ్రామాల్లో నీటి ఎద్దడి తాండవం చేస్తున్నదని, ఈ సమస్య పరిష్కారానికి నిధులు కేటాయిం చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరువు ప్రభావంతో కొన్నేళ్లుగా అన్నదాతలు కన్నీటి మడగులో మునిగి ఉన్నారని వివరించారు. నదీ జలాలు సక్రమంగా అందక డెల్టా రైతులు, వర్షాభావ పరిస్థితుల్లో దక్షిణాది రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయూరని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునే రీతిలో, నదుల అనుసంధానానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. తమిళనాడులో విద్యుత్ సమస్య తాండవం చేస్తున్నదని వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వ కోటాను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ తమిళనాడు సముద్ర తీరాల్లో ఖనిజ సంపద దోపిడీకి గురవుతోందని, తద్వారా కేంద్రానికి పెను నష్టం ఏర్పడుతున్నదని వివరిస్తూ, ఈ సంపదను పరిరక్షించే చర్య లు చేపట్టాలని విన్నవించారు. జాలర్లపై దాడులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ, మిత్ర దేశం శ్రీలంకపై ఒత్తిడి పెంచి భారత దేశాన్ని గౌరవించే విధంగా దారిలో పెట్టాలని సూచించారు. ఈలం తమిళులను ఆదుకునేందుకు చర్యలను వేగవంతం చేయించాలని కోరారు. తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిని పెంచడం, అత్యధికంగా నిధులను కేటాయించడం, ఉన్నత విద్య గ్రామీణ విద్యార్థుల దరి చేర్చ డం, జాతీయ రహదారులు పటిష్టం తది తర అంశాల గురించి వివరిస్తూ లేఖాస్త్రాన్ని విజయకాంత్ సంధించారు. -
బీజేపీ కూటమిలో బుజ్జగింపులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీపై గంపెడాశలు పెట్టుకున్న కూటమి నేతలు భంగపాటుకు గురవడంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం ఆశించిన విజయకాంత్, అన్బుమణి రాందాస్ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లిందనే చర్చమొదలైంది. బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ లభించడం ఖాయమని, అయినా మిత్రపక్షాలకు కేంద్రమంత్రి వర్గంలో చోటు ఉంటుందని ఎన్నికల ప్రచార సభలో నరేంద్రమోడీ పదేపదే ప్రస్తావించారు. దీంతో మిత్రపక్షాల్లో ఉత్సాహం ఉరకలేసింది. మోడీ చెప్పినట్లుగానే బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించగా, తమకు ఏదోఒక పదవి ఖాయమని డీఎండీకే అధినేత విజయకాంత్ భావించారు. ఢిల్లీ పెద్దలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మోడీ ప్రమాణస్వీకార సభకు ముందురోజే సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్లతో డిల్లీకి చేరుకున్నారు. పొత్తు చర్చల సమయంలోనే సుదీష్‌కు కేంద్రమంత్రి పదవి లేదా రాజ్యసభ సభ్వత్వం ఒప్పందం చేసుకున్నారు. అయితే ఎంతకూ మోడీ నుంచి పిలుపు రాకపోవడంతో ముగ్గురూ హోటల్‌కే పరిమితమయ్యూరు. తరువాత జరిగిన ప్రమాణస్వీకార సభకూ హాజరుకాలేదు.పీఎంకేకు నిరాశే రాష్ట్రంలో బీజేపీ కూటమి నుచి విజేతగా నిలిచిన ఏకైక అభ్యర్థి అన్బుమణి రాందాస్ (పీఎంకే) యూపీఏ 1లో ఆరోగ్యశాఖా మంత్రిగా కేబినెట్ హోదాలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ కారణంగా మిత్రపక్షాలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి తనకు మంత్రి పదవి ఖాయమని అన్బుమణి ఆశించారు. అయితే ఆయనకూ చోటు దక్కలేదు. కేబినెట్ కాదు కనీసం సహాయ మంత్రికీ నోచుకోలేదని విజయకాంత్, అన్బుమణి అసహనం వ్యక్తం చేస్తున్నారు. విస్తరణలో పొన్కు కేబినెట్ కన్యాకుమారి నుంచి గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌కు సహాయ మంత్రి పదవి దక్కడం కూడా విమర్శలకు తావిచ్చింది. 1999లో వాజ్‌పేయి కేబినెట్లో యువజన సంక్షేమం, దారిద్య్ర నిర్మూలన శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఈ సారి కేబినెట్ హాదా దక్కుతుందని ఆశించినా, మళ్లీ సహాయ మంత్రిగా సరిపెట్టుకోవడంపై బీజేపీలోనే చెవులు కొరుక్కుంటున్నారు. తక్కువ మంత్రులు ఎక్కువ సామర్ద్యం అనే నినాదంతో ముందుకెళ్లాలని భావిస్తున్న మోడీ రానున్న రోజుల్లో పొన్కు కేబినెట్ పదవినిస్తారని పార్టీ సీనియర్ నేత చెబుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తమిళనాడుకు చెందిన పార్టీ ప్రముఖులు సోమవారం రాత్రి పొన్ రాధాకృష్ణన్‌కు ఢిల్లీలోని ఒక హోటల్లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ సీనియర్ నేత ఇలగణేశన్తోపాటూ మిత్రపక్షాలైన పీఎంకే, ఐజేకే తదితర మిత్రపక్ష పార్టీ నేతలు హాజరయ్యూరు. సుమారు గంటపాటూ వారితో గడిపిన పొన్‌రాధాకృష్ణన్ వారిలోని అసంతృప్తిని చల్లార్చేందుకు బుజ్జగించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. కేంద్ర కేబినెట్లో తమిళులు తమిళనాడు నుంచి వివిధ పార్టీల తరపున గతంలో కేంద్ర కేబినెట్లో పలువురు మంత్రి పదవులు పొందారు. కాంగ్రెస్ తరపున రాజాజీ, సుబ్బరాయన్, వెంకట్రామన్, సీ సుబ్రమణియన్, మోహన కుమారమంగళం, పీ చిదంబరం, జీకే వాసన్, అరుణాచలం, మణిశంకర్ అయ్యర్ ఉన్నారు. తమిళనాడు రాజీవ్ కాంగ్రెస్ వాళపాడి రామమూర్తి, అన్నాడీఎంకే నుంచి తంబిదురై, సేడపట్టి ముత్తయ్య, డీఎంకే నుంచి మురసొలి మారన్, టీజీ వెంకట్రామన్, టీఆర్ బాలు, దయానిధి మారన్, రాజా, అళగిరి, పీఎంకే తరపున అన్బుమణి, బీజేపీ నుంచి రంగరాజన్ కుమారమంగళం కేంద్రంలో కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. -
విలీనమా?
బీజేపీలోకి డీఎండీకేను విలీనం చేయడానికి కసరత్తులు జరుగుతున్నట్టు రాష్ట్రంలో ప్రచారం సాగుతోంది. బీజేపీ సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును త్వరలో ప్రధాని మోడీ ప్రకటించనున్నారన్న చర్చ జోరందుకుంది. ఢిల్లీ వేదికగా ఇందుకు సంబంధించిన మంతనాలు సాగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ర్టంలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. సాక్షి, చెన్నై: సినీ నటుడిగా అశేష ప్రేక్షాకాభిమానుల హృదయాల్లో ముద్ర వేసుకున్న విజయకాంత్ తొలుత డీఎంకేవాది. ఆ పార్టీలో నెలకొన్న విబేధాలతో బయటకు వచ్చిన విజయకాంత్ 2005లో పార్టీ స్థాపించారు. దేశీయ ముర్పోగు ద్రావిడ కళగం(డీఎండీకే)ను ఏర్పాటు చేసిన అనతి కాలంలో తన సత్తాను ద్రవిడ పార్టీలకు చూపించారు. తానొక్కడినే అసెంబ్లీకి ఎన్నికైనా, ఆయన సాధించిన ఓటు బ్యాంక్ ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2011 ఎన్నికల్లో డీఎంకేను ఓడించడం లక్ష్యంగా అన్నాడీఎంకేతో దోస్తీ కట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించిన విజయకాంత్ జాతీయ స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతూ వచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరి ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ మన్ననలు అందుకున్న విజయకాంత్ రాష్ట్రంలో తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు కావాలన్న కాంక్షతో ముందుకెళుతున్నారు. కల సాకారమయ్యేనా?: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో విజయకాంత్‌లో ఆశలు చిగురించాయి. లోక్ సభ ఎన్నికల్లో తమ డిపాజిట్లు గల్లంతైనా, మోడీ పీఎం కావడంతో తన కల నెరవేరుతుందన్న ధీమాతో ఉన్నారు. కనిపించినప్పుడల్లా మోడీ తనకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ రావడంతో విజయకాంత్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. దక్షిణాదిన కర్ణాటకలో బీజేపీ బలంగా ఉన్నా, సీమాంధ్ర, తెలంగాణల్లో కొంత మేరకు బలం పుంజుకుంటున్నా, తమిళనాడులో మాత్రం కాస్త వెనుకబడి ఉండడాన్ని మోడీ తీవ్రంగా పరిగణించినట్టు డీఎండీకేలో చర్చ సాగుతోన్నది. ఒంటరిగా రాష్ర్టంలో అధికార పగ్గాలు చేపట్టాలంటే, విజయకాంత్‌కు అంత సులభం కాదని, తమతో చేతులు కలపాలంటూ ఆయనకు మోడీ ఆహ్వానం పలికినట్టు చెబుతున్నారు. ఇంకెన్నాళ్లు ఒంటరిగా పార్టీని నెట్టుకొస్తారని, తమ పార్టీలో విలీనం చేయాలంటూ మోడీ ఆఫర్ ఇచ్చినట్టు, దీన్ని విజయకాంత్ పరిశీలిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్థి : బీజేపీలో పార్టీని విలీనం చేసిన పక్షంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును ముందుగానే ప్రకటించేందుకు మోడీ సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు పెద్దగా ప్రజల్లో ఆదరణ లేని దృష్ట్యా, విజయకాంత్ ద్వారా తమిళనాడులో పాగా వేయడానికి మోడీ వ్యూహ రచనలు చేసినట్టు సమాచారం. ఇక, జూన్ మొదటి లేదా, రెండో వారంలో తమిళనాడులో కృతజ్ఞత మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నాట్లు తెలుస్తోంది. ఈ మహానాడు వేదికగా విలీన నిర్ణయాన్ని విజయకాంత్ ప్రకటించ వచ్చన్న ప్రచారం వేగం పుంజుకుంటున్నది. బీజేపీలోకి విలీనం చేయడం మంచిదన్న నిర్ణయాన్ని డీఎండీకే నేతలు పలువురు విజయకాంత్‌కు సూచించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ తరహాలో మోడీ నాయకత్వంలో తమిళనాడును అభివృద్ధి పరుస్తామన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లొచ్చన్న సూచనను ఇచ్చినట్టు పేర్కొంటున్నాయి. మోడీ తనకు అండగా ఉన్న దృష్ట్యా, రాజపక్సే ఆహ్వానంపై విజయకాంత్ ఎలాంటి వ్యాఖ్యలు సంధించలేదని చెబుతున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం నిమిత్తం ఉదయాన్నే తన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్‌తో కలసి ఢిల్లీ వెళ్లిన విజయకాంత్ బీజేపీ అగ్రనేతలతో సమాలోచన జరిపినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దేశ రాజధాని వేదికగా విలీన మంతనాలు సాగడంతో కెప్టెన్ తన పార్టీ బోర్డును తిప్పేసేనా లేదా, తాను ఒంటరేనా అని చాటుకుంటారా అన్నది మరి కొద్ది రోజుల్లో తేలబోతున్నది.