డీఎండీకే అధినేత, నటుడు విజయ్‌కాంత్ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది.
కాగా.. మొదట విజయ్‌కాంత్ భౌతికకాయాన్ని డీఎండీకే కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత విజయకాంత్ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడే సినీస్టార్ కమల్ హాసన్, రజనీకాంత్ ఆయనకు నివాళులు అర్పించారు. విజయకాంత్ చివరి చూపు కోసం సామాన్య ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అనంతరం డీఎండీకే ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
కాగా.. కెప్టెన్ విజయకాంత్(71) డిసెంబర్ 28న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
#WATCH | Chennai, Tamil Nadu: A large number of people gathered to pay tribute to DMDK President and Actor Vijayakanth. His mortal remains are being taken from Island ground, Anna Salai to Koyambedu DMDK office for the last rites. pic.twitter.com/cbSweIhY7z
— ANI (@ANI) December 29, 2023
Comments
Please login to add a commentAdd a comment