DMDK Chief Vijayakanth
-
కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
డీఎండీకే అధినేత, నటుడు విజయ్‌కాంత్ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది. కాగా.. మొదట విజయ్‌కాంత్ భౌతికకాయాన్ని డీఎండీకే కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత విజయకాంత్ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడే సినీస్టార్ కమల్ హాసన్, రజనీకాంత్ ఆయనకు నివాళులు అర్పించారు. విజయకాంత్ చివరి చూపు కోసం సామాన్య ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అనంతరం డీఎండీకే ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా.. కెప్టెన్ విజయకాంత్(71) డిసెంబర్ 28న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. #WATCH | Chennai, Tamil Nadu: A large number of people gathered to pay tribute to DMDK President and Actor Vijayakanth. His mortal remains are being taken from Island ground, Anna Salai to Koyambedu DMDK office for the last rites. pic.twitter.com/cbSweIhY7z — ANI (@ANI) December 29, 2023 -
నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా.. పరిస్థితి విషమం!
తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డీఎండికే నేత విజయకాంత్ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు , పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు దగ్గు గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని , వైద్యులు పూర్తి ఆక్సిజన్‌తో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం అలాగే ఆయన ఆర్యోగం విషమంగా ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు పేర్కోని చికిత్స అనంతరం ఈనెల 11న డిశ్చార్జి చేశారు. డీఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv — ANI (@ANI) December 28, 2023 -
నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా
చెన్నై : తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు తేలింది. దీంతో చెన్నైలోని మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మియోట్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ పృథ్వీ మోహన్‌దాస్ గురువారం విజయ్‌కాంత్ హెల్త్‌బులెటిన్ గురించి వివరించారు. 'విజయకాంత్‌కు తేలికపాటి కరోనా లక్షణాలు వచ్చాయని .. ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు .ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నాం ' అని తెలిపారు. కాగా అంతకుముందు విజయకాంత్‌కు కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని డీఎండీకే పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. విజయ్‌కాంత్ సాధారణ చెకప్ కోసమని ఎప్పటిలాగే మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి వెళ్లగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు.ఇందులో కరోనా సాధారణ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో వివరించింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పళనిసామి సహా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. (చదవండి : భారత్‌లో 57 లక్షలు దాటిన కరోనా కేసులు) -
అన్నా నీవే దిక్కు!
అప్పుల ఊబిలో డీఎండీకే అభ్యర్థులు కెప్టెన్ ఎదుట కన్నీళ్లు త్వరలో తలా రూ. పది లక్షలు? సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టుగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీని గట్టేక్కించేందుకు తీవ్ర కుస్తీలు పడుతున్న ఈ కెప్టెన్‌కు రోజు రోజుకు షాక్‌లు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. ఎన్నికల బరిలో నిలబడి అప్పుల ఊబిలో మునిగిన అభ్యర్థులు ‘అన్నా’ ఇక నీవే దిక్కు అంటూ కోయంబేడు వైపుగా భార్య పిల్లలతో కలిసి పడగలెత్తే పనిలో పడ్డారు. రాష్ర్టంలో కింగ్ మేకర్‌గా అవతరించిన ఉన్న విజయకాంత్ ‘కింగ్’ కావాలన్న ఆశతో కుదేల్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం పగ్గాలు చేపట్టినట్టే అన్న ధీమాతో ముందుకు సాగిన కెప్టెన్ ప్రస్తుతం బయటకు అడుగు తీసి పెట్టడం లేదు. ఇళ్లు, పార్టీ కార్యాలయంకు పరిమితం అవుతూ, మీడియా కంట పడకుండా సమీక్షలు, సమావేశాలు అంటూ కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు చెమటోడ్చుతున్నారు. పార్టీ నుంచి ముఖ్య నేతలు, జిల్లాల కార్యదర్శులు దా దాపుగా బయటకు వెళ్లారు. ఉన్న వాళ్లను రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న విజయకాంత్‌కు, వారి రూపంలో కొత్త సమస్యలు బయలు దేరుతున్నాయి. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బయటకు వెళ్లడంతో ఆయా నియోజకవర్గాల్లో తన వెన్నంటి ఉన్న నాయకుడ్ని అభ్యర్థిగా ప్రకటించి, ఎన్నికల్ని లాగించేశారు. ఎన్నికల్లో తమ డిపాజిట్లు గల్లంతు కావడమే కాకుండా, ఆయా నాయకులు అప్పల ఊబిలో మునగాల్సిన పరిస్థితి. అసెంబ్లీలో అడుగు పెట్టినట్టే అన్న ధీమాతో అప్పో, సొప్పో చేసి ఖర్చు పెట్టారు. ఆర్థికంగా దెబ్బతిన్నాం: రాష్ర్టంలో ప్రజా సంక్షేమ కూటమి తరఫున డీఎండీకే అభ్యర్థులు 104 చోట్ల పోటీకి దిగారు. ఇందులో పది.. పదిహేనుమంది మినహా తక్కిన వాళ్లం తా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి ఎంపిక చేసిన అభ్యర్థులే. వీరికి ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరపున నిధులు అందించేందుకు కార్యాచరణ జరిగినట్టు సమాచారం. అయితే, మెజారిటీ శాతం మందికి పార్టీ నిధి చేరక పోవడం, చివరకు అప్పో సొప్పో చేసి ఎన్నికల ఖర్చు పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఆ అప్పులు వడ్డీలతో నెత్తిమీదకు ఎక్కడంతో అన్న నీవేదిక్కు అంటూ కుటుంబాలతో కలసి కోయంబేడుకు కార్యాలయానికి ఉరకలు తీస్తున్నారు. తలా రూ. పది లక్షలు: అన్న పిలిస్తే తప్ప పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానం ఉండదన్న విషయాన్ని పసిగట్టిన ఆయా అభ్యర్థులు చడీచప్పుడు కాకుండా చెన్నైకు చేరుకుంటున్నారు. ఆదివారం తిరుచ్చి,సేలం, ధర్మపురి, కాంచీపురం, విల్లుపురం తదితర పది జిల్లాల్లో ఓడిపోయి న అభ్యర్థులు తమ కుటుంబాలతో పార్టీ కార్యాలయానికి వచ్చి ఉన్నారు. కుటుంబంతో కలిసి అన్నతో ఫోటో దిగాలన్న ఆశతో వచ్చినట్టు లోనికి అడుగులు పెట్టినట్టు సమాచారం. అన్నతో అభ్యర్థులు సమాలోచనలో ఉంటే, వారి కుటుంబాలు కన్నీళ్ల పర్వంతో ఇక దిక్కు నీవే అంటూ విలపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ కోసం, ఎన్నికల కోసం శ్రమించి అప్పుల ఊబిలో కొట్టు మిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసి ఉన్నారు. ఇప్పడు పార్టీలో తాము కొనసాగాలంటే, అప్పల ఊబి నుంచి గట్టెక్కించాల్సిందేనంటూ విజయకాంత్ కాళ్ల మీద పలువురు అభ్యర్థులు పడి మరీ కన్నీళ్లు పెట్టినట్టు సమాచారం. ఎన్నికల నిధిగా రూ. పది లక్షలు చొప్పున ఇస్తామన్నారని, అయితే, అది తమకు అందని దృష్ట్యా, ఇప్పుడైనా ఇస్తే, కొంత మేరకు గట్టెక్క గలమని తమ అధినేతకు విన్నవించుకుంటున్నట్లు సమాచారం. -
చిక్కుల్లో కెప్టెన్
సాక్షి, చెన్నై : కింగ్...కింగ్ అంటు పరుగులు తీసి చివరకు చతికిలబడ్డ డీఎండీకే అధినేత విజయకాంత్ మరో చిక్కుల్లో పడ్డారు. ఆయన పార్టీ కొత్తకష్టాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఎన్నికల యంత్రాంగం గుర్తింపు ఆ పార్టీకి దూరం కానున్నది. అలాగే, వీసీకే, ఎండీఎంకేలకు కూడా అదే కష్టాలు బయలు దేరాయి.తమిళనాట ప్రత్యామ్నాయం తామేనంటూ మూడో కూటమిగా మెగా పార్టీలతో తెర మీదకు వచ్చిన డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఓటర్లు చావు దెబ్బ తగిలేలా చేశారు. ఇదే ఇప్పుడు ఆపార్టీకి కష్టాల్ని సృష్టించనున్నాయి. డిపాజిట్లు గల్లంతు కావడంతో ఓ వైపు ఉంటే, మరో వైపు పార్టీకి ఎన్నికల యంత్రాంగం గుర్తింపు దూరం కానున్నది. పార్టీ ఆవిర్భావంతో పది, గత ఎన్నికల్లో ఎనిమిది శాతం మేరకు ఓటు బ్యాంక్ దక్కించు కున్న విషయం తెలిసిందే. అలాగే, ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించడంతోపాటు 29 మంది ఎమ్మెల్యేల్ని తన ఖాతాలో వేసుకుని ఎన్నికల యంత్రాంగం గుర్తింపు సైతం విజయకాంత్ పొందారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నంగా ఢంకా ముద్ర కూడా వేసుకున్నది. అయితే, ఇప్పుడు ఆ ముద్ర కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధినేత ఓటమి చవిచూడడమే కాకుండా, అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో పీకల్లోతు కష్టాలను విజయకాంత్ కొని తెచ్చుకున్నారు. ఆ పార్టీ పోటీ చేసిన 104 నియోజకవర్గాల్లో వందలోపు నియోజకవర్గాల్లో కేవలం మూడు నుంచి ఐదు వేలలోపు ఓట్లు మాత్రమే రావడంతో చావు దెబ్బ తప్పలేదు. ఇంకా చెప్పాలంటే, ఎనిమిది శాతం మేరకు ఉన్న ఓటు బ్యాంక్ ఇప్పడు రెండున్నర శాతంలోపు పడి పోయింది. ఐదున్నర శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను కోల్పోయారు. ఎన్నికల యంత్రాంగం గుర్తింపు కావాలంటే, ఆరు శాతం ఓట్లు తప్పని సరి, అయితే, కెప్టెన్ పార్టీకి వచ్చిన ఓట్లు మరీ దారుణంగా ఉండడంతో ఇక గుర్తింపు దూరం అయినట్టే. అదే విధంగా ఎండీఎంకే నేత వైగోకు కష్టాలు తప్పడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించడం, ఈ ఎన్నికల్లో 26 చోట్ల పోటీ చేసి కేవలం 0.9 శాతం ఓట్లను దక్కించుకోవడంతో ఆ పార్టీకి గుర్తింపుతో పాటుగా చిహ్నం దూరం అయ్యే అవకాశాలు ఎక్కువే. అలాగే, వీసీకే డిపాజిట్లు సైతం ఈ ఎన్నికల్లో గల్లంతు కావడం, 0.8 శాతం ఓట్లు మాత్రం దక్కడంతో పార్టీకి ఎన్నికల యంత్రాంగం వద్ద గుర్తింపు లేనట్టే. సీపీఎం 0.7 శాతం, సీపీఐ 0.8 శాతం ఓట్లను దక్కించుకుని రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఓ మూలన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయం...ప్రత్యామ్నాయం అంటూ వైగో ఇచ్చిన పిలుపుతో ఉరకలు తీసిన వీరికి ఈ సారి చావు దెబ్బ తగలడం గమనార్హం. అదే సమయంలో ఆలస్యంగా ఈ కూటమిలోకి చేరి ఎన్నికల గుర్తింపు పొందాలని తహ తహలాడిన తమిళ మానిల కాంగ్రెస్ నేత వాసన్‌కు చెంప పెట్టే. తమిళ మానిల కాంగ్రెస్‌కు 0.5 శాతం మాత్రమే ఓట్లు దక్కాయి. ఇంకా, చెప్పాలంటే, ఈ ఆరు పార్టీలు తలా సాధించిన ఓట్ల కంటే, నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువే. అలాగే, వీరి కన్నా, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ పార్టీ 1.1 శాతం ఓట్లను కైవశం చేసుకోవడం గమనార్హం. కాగా, తమకు కష్టాలు ఎదురైనా, ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఆరు పార్టీల నాయకులు శుక్రవారం తెర ముందుకు వచ్చారు. డీఎండీకే నేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత వాసన్లు ప్రకటనల రూపంలో, ప్రెస్మీట్ల రూపంలో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఈ సమరంలో....చివరకు ప్రజా స్వామ్యాన్ని నోట్ల కట్టలు రాజ్యమేళాయన్న కొత్త పల్లవితో డిఎంకే, అన్నాడీఎంకేల మీద దుమ్మెత్తి పోశారు. అలాగే, ఇప్పుడు ఓడినా, భవిష్యత్తు తమదే అంటూ , కలిసి కట్టుగానే ప్రజల కోసం తమ పోరాటం ఆగదంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ కలిసి కట్టు అన్నది స్థానిక సంస్థల ఎన్నికల వరకు అయినా, నిలుస్తుందో లేదో అన్నది వేచి చూడాల్సిందే. -
కెప్టెన్ సీఎం
సాక్షి, చెన్నై : బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలతో బుధవారం తమిళ మీడియాల్లో వెలువడ్డ సమాచారం డీఎంకే, డీఎండీకే కేడర్‌నే కాదు, కమలం వర్గాల్ని విస్మయంలో పడేశాయి. అనూహ్యంగా రాజకీయ మలుపు తిరగడంతో చర్చ బయలు దేరింది.పది శాతం ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ రాజకీయం సాగుతున్న విషయం తెలిసిందే. నాన్చుడు ధోరణి అనుసరించే విజయకాంత్ ఇంత వరకు తన మదిలో మాటను బయటకు పెట్ట లేదు. భవిష్యత్తు దృష్ట్యా,ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవడమే శ్రేయస్కరం అన్న నిర్ణయంతో ఆయన ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే, తమ వైపుకు విజయకాంత్‌ను తిప్పుకునేందుకు జాతీయ పార్టీ కమలం తీవ్రంగానే కుస్తీలు పడుతున్నది. అదే సమయంలో ఊహా జనిత కథనాలపై ఇన్నాళ్లు నోరు మెదపని డీఎంకే అధినేత ఎం కరుణానిధి మంగళవారం విజయకాంత్ తమ వెంటే అని ప్రకటించేశారు. దీంతో కమలం ఆశలు అడియాశలైనట్టు అయ్యాయి. ఒక ఒంటరిగా మిగాల్సిన పరిస్థితి వారికి రాష్ట్రంలో ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఢిల్లీలో తమిళ మీడియాతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ , కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడినట్టుగా తమిళ మీడియాల్లో వచ్చిన సమాచారం రాజకీయంగా కొత్త మలుపును తిప్పినట్టు అయింది. కెప్టెన్ సీఎం : జవదేకర్ మాట్లాడినట్టుగా కొన్ని చానళ్లు ఫ్లాష్ ..న్యూస్‌లతో సమాచారాల్ని ప్రసారం చేశాయి. డీఎండీకే నేతృత్వంలో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు జవదేకర్ వ్యాఖ్యానించారని అందులో పేర్కొన్నారు. అలాగే, డీఎండీకేకు 50 శాతం సీట్లు, ప్రజా కూటమిలో ఉన్న వీసీకే కలిసి వస్తే కొన్నిసీట్లు, ఇతర చిన్న పార్టీలకు సర్దుబాటు పోగా, మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక, డీఎండీకే నేతృత్వంలోని కూటమికి సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటి ంచేందుకు తాము సిద్ధం అని జవదేకర్ వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ ఫ్లాష్..న్యూస్..డీఎంకేకు షాక్ ఇచ్చినట్టు చేసింది. అలాగే, విజయకాంత్ సతీమణి ప్రేమలత పొత్తు మంతనాల్లో ఉన్నారని వ్యాఖ్యానించడంతో ఇక, పండు పక్వానికి వచ్చి పాలల్లో పడుతుందనుకుంటే, పక్కదారి పట్టిందేంటబ్బా...? అన్న డైలమాలో డిఎంకే వర్గాలు పడ్డాయి. అదే సమయంలో డీఎండీకే వర్గాలు సైతం విస్మయంలో పడ్డాయి. ప్రేమలత విజయకాంత్ జవదేకర్‌తో ఎప్పుడు సంప్రదింపులు జరిపినట్టు, ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్‌ఎప్పుడు తీసుకున్నట్టు అన్న సందిగ్ధంలో పడ్డారు. ఇక, బీజేపీ వర్గాలకు సైతం ఈ ఫ్లాష్ ..న్యూస్‌లు ఆశ్చర్యాన్ని కల్గించాయి. తమతో కనీసం సంప్రదింపులు జరపకుండా జవదేకర్ ఎలా ప్రకటిస్తారన్న సందిగ్దంలో పడ్డారు. చివరకు ఢిల్లీకి వ్యవహారం చేరడంతో అవన్నీ తమిళ మీడియా సృష్టిగా తేలాయి. రాజ్య సభలో జవదేకర్ ఉన్నారని, అలాంటప్పుడు ఆయన మీడియాతో ఎలా మాట్లాడటం జరిగిందంటూ ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడింది. అలాగే, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పందిస్తూ, తమతో సంప్రదింపులు జరపకుండా జవదేకర్ ఎలా ప్రకటిస్తారని, పొత్తు ,సీట్ల పందేరాల వ్యవహారాల్లో తమ ప్రమేయం కూడా ఉంటుందన్న విషయాన్ని మీడియా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన చురకలు అంటించారు. ఇక, డీఎంకే వర్గాలు మాత్రం, తమతో డీఎండీకే పొత్తును చెడగొట్టడం లక్ష్యంగానే కొన్ని మీడియాలు ఈ ఫ్లాష్.... సృష్టించి ఉన్నాయని ఆయన మండి పడుతున్నారు. కేడర్‌లో గందరగోళం సృష్టించే విధంగా వ్యవహారాలు సాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు. -
కెప్టెన్‌తో ట్రాఫిక్ భేటీ
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌తో మక్కల్ పాదుగాప్పు కళగం అధ్యక్షుడు ట్రాఫిక్ రామస్వామి గురువారం సమావేశమయ్యారు. చెన్నై కోయంబేడులోగల డీఎండీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరిగింది. వారిరువురూ సుమారు 50 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఇందులో కోశాధికారి ఏఆర్ ఇలంగోవన్, యువజన సంఘం కార్యదర్శి ఎల్కే సుధీష్, ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు. అనంతరం విలేకరులతో ట్రాఫిక్ రామస్వామి మాట్లాడుతూ డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆహ్వానం మేరకు ఆయన్ను కలుసుకున్నానని, తాను రూపొందించిన 14 అంశాల గురించి ఇందులో ప్రస్తావించానన్నారు. ఇందులో ప్రాథమిక జీవనాధార వసతులు, హద్దు మీరి ప్రవర్తించేవారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం, ఉచిత విద్య తదితర అంశాలను ఆయనకు సమర్పించానన్నారు. తన ప్రయత్నాలకు డీఎండీకే అధ్యక్షుడు వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎవరితో పొత్తులు కుదుర్చుకోవాలనే విషయంపై కూడా చర్చించామని, వచ్చే ఎన్నికల్లో అతిపెద్ద మార్పు ఏర్పడుతుందన్నారు. కాంచీపురం జిల్లాలో వచ్చే 20వ తేదీ జరిగే డీఎండీకే మహానాడు, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పును తీసుకురానుందన్నారు. -
నేను క్షేమమే..
► ఆందోళన వద్దు ► విజయ్‌కాంత్ ఆరోగ్యంపై వివరణ ► పుకార్లపై డీఎండీకే ఆగ్రహం ► వరద సహాయక చర్యల్లో బిజీ బిజీ సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యంపై పుకార్లు బయలు దేరాయి. ఆయన ఆస్పత్రిలో చేరినట్టు, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా వచ్చిన సమాచారం పుకార్లేనని డీఎండీకే కార్యాలయం స్పష్టం చేసింది. విజయకాంత్ క్షేమంగా ఉన్నారని, వరద సహాయకాల్ని బాధితులకు దరి చేర్చడంలో బిజీగా ఉన్నారని వివరించింది. డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల కాలంగా ఆరోపణలు బయలుదేరుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డట్టుగా ప్రచారం బయలు దేరింది. అయితే, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేసినా, చివరకు సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరిగి ఉండటం వెలుగులోకి వచ్చింది. చివరకు ఆయనకు కిడ్నీల మార్పిడి శస్త్ర చికిత్స జరిగినట్టు తేలింది. ఆ శస్త్ర చికిత్స తదుపరి విజయకాంత్ సన్నబడ్డారు. కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నా, చివరకు మళ్లీ తన రాజకీయ వ్యూహాల మీద దృష్టి పెట్టారు. ఈశాన్య రుతు పవనాలు కడలూరు మీద ప్రభావం చూపించినప్పటి నుంచి అవిశ్రాంతంగా ఆయన ప్రజల్లోనే ఉన్నారని చెప్పవచ్చు. కడలూరులో గ్రామ గ్రామంలో తిరిగారు. ప్రజలకు భరోసా ఇస్తూ, సహాయకాల పంపిణీ సాగించారు. చెన్నైలో ఒకటి రెండు చోట్లకు వెళ్లినా, చివరకు పార్టీ కార్యాలయం నుంచి సహాయకాల పంపిణీ మీద దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో విజయకాంత్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డట్టుగా, ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్సలు అందిస్తున్నట్టుగా గురువారం వచ్చిన సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన పెరిగింది. తమ నేతకు ఏమైందో తెలుసుకునేందుకు మీడియా కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఇదే విషయంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాల్ని మీడియా వర్గాలు సంప్రదించడంతో ఆరోగ్య పుకార్లు దావానంలా వ్యాపించాయి. విజయకాాంత్కు ఏమైందోనన్న ఉత్కంఠ బయలు దేరింది. అయితే, అవన్నీ పుకార్లుగా తేల్చుతూ శుక్రవారం ఆ పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, వరద సాయంపై విజయకాంత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మరో ప్రకటనను వెలువరించింది. క్షేమమే : పార్టీ అధినేత విజయకాంత్ క్షేమంగా ఉన్నారని, పుకార్లు, ప్రచారాల్ని నమ్మవద్దంటూ ఆ పార్టీ కార్యాలయం స్పష్టం చేసింది. విజయకాంత్ అవిశ్రాంతంగా ప్రజల కోసం శ్రమిస్తున్నారని, ప్రతిరోజూ ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు కార్యాలయంలోనే ఉంటూ, వరద బాధిత ప్రాంతాలకు సహాయకాలను తరలించే పనుల్ని పర్యవేక్షిస్తున్నట్టుగా వివ రించారు. పేదల ముఖాల్లో చిరునవ్వే తన జీవితానికి ఆనందం అని పదే పదే చెప్పుకునే విజయకాంత్‌కు ఎలాంటి హాని జరగదని, ఆయన క్షేమంగానే ఉన్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. పేదల సేవే పరమాత్ముడి సేవగా భావించి వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా సాగుతున్న విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయకాంత్ విడుదల చేసినట్టుగా మరో ప్రకటనలో, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలు వరదల్లో కోల్పోయిన గృహోపకరణాలను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. -
నన్ను కాదు..జయలలితను అడుగు
వర్ష బాధిత మహిళపై విజయకాంత్ ఆగ్రహం నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించిన కెప్టెన్ తిరువళ్లూరు : ఇళ్లలో చొరబడిన నీటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరిం చిన మహిళపై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ చిందులు వేయడం చర్చనీయాంశమైంది. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్, తన్నీర్‌కుళం, ఎన్జీవో కాల నీలోనీ వరద బాధితులను పరామర్శించి, పార్టీ తరపున సహాయకాలు అందజేశారు. తిరునిండ్రవూర్‌కు వచ్చిన విజయకాంత్ నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరునిండ్రవూర్‌లో కార్యక్రమాన్ని ముగించుకుని తన్నీర్‌కుళంలో పర్యటించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన్నీర్‌కుళంలో కన్నమ్మ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఐదు రోజుల నుంచి వర్షపు నీరు తగ్గకపోవడంతో జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం స్పందించడం లేదని తెలి పింది. మీరైనా తమ ప్రాంతంలో నీటిని తొలగించండి అంటూ విన్నవించుకున్నారు. ఇందుకు స్పందించిన విజయకాంత్ తన జిల్లా కార్యదర్శి ద్వారా నీటిని తొలగిస్తానని హామీ ఇచ్చారు. ఇంతలో అక్కడే ఉన్న మరో మహిళ తమ ప్రాంతాన్ని కెప్టెన్ పరిశీలించలేదని గట్టిగా కేకలు వేశారు. తమ ప్రాంతంలో పర్యటించడం సాధ్యం కానప్పులు ఎందుకు వచ్చారని నిలదీశారు. మహిళ మాటలు విన్న ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ‘ఇదిగో నన్ను కాదు అడగాల్సింది.. చెన్నై వెళ్లి జయలలితను అడుగు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. అనంతరం తనను కలిసిన చిన్నారికి విజయరాజ్ అనే నామకరణం చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి నాయుడు ఉన్నారు. -
కెప్టెన్‌కు కోపమొచ్చింది
సాక్షి, చెన్నై :ప్రజల కోసం ప్రజా పని నినాదంతో సంక్షేమ పథకాల పంపిణీకి డీఎండీకే అధినేత విజయకాంత్ శ్రీకా రం చుట్టారు. విల్లుపురం త్యాగదుర్గంలో జరిగిన ఈ సభలో కార్యకర్తలు వీరంగం సృష్టించడం విజయకాంత్‌కు కోపం తె ప్పించింది. వారిని బుజ్జగించే క్రమంలో తన ఆక్రోశాన్ని వెల్లగక్కడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. కుర్చీల మీద తమ ప్రతాపం చూపించారు. తన బర్త్‌డేను పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్న విజయకాంత్, ప్రజాకర్షణ లక్ష్యంగా తరచూ కొత్త కొత్త నినాదాలతో సంక్షేమ పథకాలను పంపిణీ చేయడం జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లే కార్యక్రమాలను విస్తృతం చేశారు. నెల రోజులుగా తన బర్త్‌డే సందర్భంగా పేదలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తూ వచ్చిన విజయకాంత్, దానికి కొనసాగింపుగా ప్రజల కోసం...ప్రజా పని నినాదంతో సంక్షేమ పథకాలకు విల్లుపురం వేదికగా శ్రీకారం చుట్టారు. రగడ: మంగళవారం రాత్రి విల్లుపురం జిల్లా త్యాగ దుర్గంలో జరిగిన తొలి కార్యక్రమం వివాదానికి దారి తీసింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు కుర్చీల కోసం కుమ్మలాడుకుంటూ, చివరకు వాటిపై తమ ప్రతాపం చూపించా రు. తన దైన శైలిలో ఆక్రోశాన్ని విజయకాంత్ ప్రదర్శించడంతో మరింతగా రె చ్చిపోయారు. మీడియా కూర్చున్న కు ర్చీలను సైతం లాగేసుకుని ధ్వంసం చే శారు. దీంతో వారిని బుజ్జగించేందుకు మహిళా నేత, విజయకాంత్ సతీమణి ప్రేమలత శ్రమించాల్సి వచ్చింది. పరిస్థి తి సద్దుమణిగినానంతరం తన దైన హావా భావాలను ప్రదర్శిస్తూ విజయకాంత్ ప్రసంగాన్ని అందుకున్నారు. గుణపాఠం తథ్యం: రానున్న ఎన్నికల్లో అన్నాడిఎంకేకు ప్రజలు గుణపాఠం చెప్పడం తథ్యమని విజయకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏదేని సమస్యలపై చర్చించాలని కోరితే చాలు, 110 తీర్మానాలు అంటూ దాట వేత ధోరణి, ప్రతి పక్షాల గళం నొక్కేయడం ధ్యేయంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ప్రజలకు కళ్లబొల్లి మాటలు చెప్పడం, ఆచరణకు నోచుకోని ఉచిత హామీలను గుప్పించా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఉచిత హామీలు ఏ మేరకు లబ్ధిదారులకు చేరిందో ఓ మారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు.రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకేకు గుణపాఠం చెప్పడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల ద్వారా అధికారంలోకి డిఎండికే రావడం తథ్యమని జోస్యంచెప్పారు. విజయకాంత్ మన స్సు చాలా మంచిదంటూ, ఆయన్ను ఆదరించాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని పిలుపు నిచ్చారు. -
మళ్లీ పేదరిక నిర్మూలన పథకం
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో డీఎండీకే నేతృత్వంలో పేదరిక నిర్మూలన పథకం మళ్లీ అమల్లోకి రానున్నది. రెండేళ్ల విరామ అనంతరం ఈ పథకానికి ఆగస్టులో శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు తగ్గ ఆదేశాలు పార్టీ జిల్లాల కమిటీలకు డీఎండీకే అధినేత విజయకాంత్ పంపి ఉన్నారు. సినీ నటుడిగా ఉన్న కాలం నుంచి తన బర్త్‌డేను పేదల సంక్షేమ దినంగా విజయకాంత్ జరుపుకుంటూ వస్తున్నారు. డీఎండీకే ఆవిర్భావం, ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించడంతో ప్రభుత్వాలు అమలు చేయకున్నా, తన పార్టీ నేతృత్వంలో ప్రత్యేక పథకం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. పేదల సంక్షేమ దినంను పేదరిక నిర్మూలన పథకంగా మార్చేశారు. 2012లో రాష్ట్ర వ్యాప్తంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని విజయకాంత్ పర్యటించారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాల పార్టీల నేతృత్వంలో అమలు చేయించి, పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగారు. అదే సమయంలో వేదికలెక్కి సీఎం జయలలితను టార్గెట్ చేసి విజయకాంత్, ఆయన ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు సాగించిన ప్రసంగాలు కోర్టుల చుట్టు తిరిగేలా చేశాయి. కోర్టు మెట్లు ఎక్కేందుకే సమయం ఎక్కువగా కేటాయించాల్సి రావడంతో రెండేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేయడంలో డీఎండీకే వర్గాలు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. పేదరిక నిర్మూలన పథకం : ప్రతి జిల్లాలో తమ మీద పరువు నష్టం దావాలు దాఖలైనా, రోజుకో కోర్టుమెట్లు ఎక్కాల్సి వచ్చినా పార్టీని , కేడర్‌ను రక్షించుకుంటూ ముందుకు సాగే పనిలో విజయకాంత్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల అనంతరం మళ్లీ పేదరిక నిర్మూలన పథకాన్ని పార్టీ నేతృత్వంలో అమలు చేయడానికి నిర్ణయించారు. ఈ పథకం మేరకు పార్టీ వర్గాలు ఏ మేరకు పేద ప్రజలకు పోటీలు పడి మరీ సంక్షేమ పథకాలు, అభివృది ్ధకార్యక్రమాలు చేపడుతాయో వాళ్లకే రానున్న ఎన్నికల్లో విజయకాంత్ సీట్లు కేటాయిస్తారన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఆగస్టులో విజయకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని మళ్లీ ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టారు. అన్ని జిల్లాల పార్టీ కార్యదర్శులకు ఇందుకు తగ్గ ఆదేశాలను విజయకాంత్ జారీ చేసి ఉన్నారు. ఆగస్టులో జిల్లాల వారీగా విజయకాంత్ పర్యటన సాగనున్నడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను వేగవంతం చేయాలని, పేద ప్రజల్ని ఆదుకునే రీతిలో సంక్షేమ కార్యక్రమాలకు కార్యచరణ సిద్ధం చేయాలని డీఎండీకే కార్యాలయం నుంచి కార్యదర్శులకు లేఖలు వెళ్లి ఉన్నాయి. దీంతో ఎన్నికలకు సిద్ధం అయ్యే రీతిలో ఆగస్టు నుంచి ఈ పథకం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు విజయకాంత్ సిద్ధమైనా, ఆ పార్టీ వర్గాలు పలు చోట్ల పెదవి విప్పే పనిలో పడ్డారు. ఇందుకు కారణం, ఇప్పటికే పార్టీ కోసం ఇళ్లు గుల్ల చేసుకున్న జిల్లాల కార్యదర్శులు ఆ పార్టీలో అధికం. ఇక రానున్న రోజుల్లో ఈ పథకం కోసం మరెంత వెచ్చించాల్సి వస్తుందోనన్న బెంగ వారిలో బయలుదేరి ఉన్నదట. -
సింగపూర్‌కు కెప్టెన్
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ ఆదివారం సింగపూర్‌కు వెళ్లారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఆయన సింగపూర్‌కు వెళ్లడంతో పార్టీ వర్గాలు ఆందోళనలో పడ్డాయి. గత ఏడాది డీఎండీకే అధినేత విజయకాంత్ హఠాత్తుగా సింగపూర్‌కు వెళ్లారు. అయితే, ఆయన కుమారుడు షణ్ముగ పాండియన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సహాబ్దం చిత్రం షూటింగ్ నిమిత్తం వెళ్లినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. రెండు నెలల పాటు గా ఆయన సింగపూర్‌లో షూటింగ్ బిజీలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, రెండు నెలల అనంతరం తిరుగు పయనంలో విజయకాంత్ వీల్ చైర్లో ప్రత్యక్షం కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన ముఖానికి ముసుగు వేసి మరీ రహస్యంగా కారులో ఎక్కించడంతో అనారోగ్యం బారీన పడ్డట్టు, ఏదో శస్త్ర చికిత్స జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న విజయకాంత్ చివరకు సరికొత్త గెటప్‌తో కన్పించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా, గత నెల అన్ని రాజకీయ పక్షాలను తన వెంట ఢిల్లీకి సైతం తీసుకు వెళ్లారు. కావేరిలో కర్ణాటక నిర్మించ తలబెట్టిన డ్యాంల నిర్మాణాల్ని అడ్డుకునే విధంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రతి పక్ష పార్టీల ప్రతినిధులు తిరుగు పయనం అయినా, విజయకాంత్ మాత్రం ఢిల్లీలో తిష్ట వేశారు. బీజేపీ నేతల్ని, కేంద్ర మంత్రులతో సమావేశాలు కావడంతో తమిళనాట మీడియా చర్చ ఆరంభం అయింది. అలాగే, ఢిల్లీలో మీడియా సమావేశంలో విజయకాంత్ వ్యవహరించిన తీరుపై సెటైర్ల వర్షం కురుస్తూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత మీనంబాక్కం విమానాశ్రయంలో ప్రత్యక్షం అయ్యారు. మీడియా వర్గా లు ఆరా తీశాయి. చివరకు ఉదయం పదకొండు గంటల సమయంలో ఆయన సింగపూర్ ఫ్లైట్ ఎక్కినట్టు తేలింది. మరో మారు హఠాత్తుగా సింగపూర్ పయనానికి ఆయన వెళ్లడంతో కారణాల అన్వేషనలో పడ్డాయి. పార్టీ వర్గాలకు సమాచారం కూడా లేని దృష్ట్యా, ఆరోగ్య సంబంధిత పరీక్షల కోసం ఆయన వెళ్లి ఉంటారా..? అన్న ప్రశ్న బయలుదేరింది. కనీసం తమకు ముందస్తు సమాచారం కూడా విజయకాంత్ ఇవ్వని దృష్ట్యా, ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకునే పనిలో పార్టీ వర్గాలు నిమగ్నం అయ్యాయి. -
విజయకాంత్ బావమరిదికి రాజ్యసభ పదవి ?
కెప్టెన్ రాజధాని రాయబారం బీజేపీ అగ్రనేతలతో మంతనాలు డీఎండీకే అధినేత విజయకాంత్ బావమరిది, పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఎల్కే సుధీష్ త్వరలో రాజ్యసభ పదవి వరించిబోతున్నట్లు ఆ పార్టీ డిల్లీ వర్గాల భోగట్టా. చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేల తరువాత మూడో బలీయమైన శక్తి డీఎండీకే అవతరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీచేయడం ద్వారా పార్లమెంటులో పాగావేసేందుకు ప్రయత్నించింది. అయితే అమ్మగాలి ముందు మోదీ హవా కూడా నిలబడలేకపోవడంతో పార్లమెంటు సీటు పొందాలన్న డీఎండీకే ఆశలు అడియాసలు అయ్యాయి. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మిత్రపక్షంగా డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఎంతో ఊరటనిచ్చింది. ప్రధానితో ఉన్న సంబంధాలను సద్వినియోగం చేసుకోవాలన్న నిర్ణయంతో రెండురోజుల క్రితం డిల్లీ విమానం ఎక్కిన విజయకాంత్ బృందం మంగళ, బుధవారాల్లో బడా నేతలను కలుసుకుంది. కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కారీతో విజయకాంత్ సమావేశమయ్యారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీని సైతం కలుసుకున్న విజయకాంత్ కర్నాటక ప్రభుత్వం కావేరీపై నిర్మిస్తున్న మేఘదాతు ప్రాజెక్టు, తమిళ మత్య్సకారుల అంశం తదితర ఐదు సమస్యలను ప్రస్తావించారు. ప్రధానిని మధ్యాహ్నం, సాయంత్రం మంత్రులను కలుసుకున్నారు. పార్లమెంటు సమావేశం హాలు ప్రాంగణంలోని హోంశాఖ కార్యాలయంలో రాజ్‌నాధ్, విజయకాంత్‌ల మధ్య సంభాషణ కేవలం ఐదునిమిషాలకే ముగిసింది. ఇతర మంత్రులతో 45 నిమిషాలపాటు కెప్టెన్ గడిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులను విజయకాంత్ కలుసుకున్న సందర్భంలో ఆయన భార్య ప్రేమలత, బావమరిది సుధీష్ వెంట ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ కూటమిలో కొనసాగడంపై డిల్లీ నేతల వద్ద విజయకాంత్ చర్చలు జరిపినట్లు సమాచారం. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే తరువాత బలీయమైన శక్తిగా డీఎండీకే ఎదిగిన ందున రాష్ట్రం నుంచి లేదా మరేదైనా రాష్ట్రం నుండి తమ పార్టీకి రాజ్యసభ సభ్యత్వం కేటాయించాల్సిందిగా బీజేపీ పెద్దలను విజయకాంత్ కోరినట్లు సమాచారం. తమిళనాడు నుండి రాజ్యసభకు బీజేపీ వ్యక్తిగా ఒకరు ఉండటం రాజకీయంగా మేలుచేకూరుతుందని విజయకాంత్ నచ్చజెప్పారని తెలుస్తోంది. ఈ అంశంపై పరిశీలించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే తమ కోర్కెను బీజేపీ మన్నించడం ఖాయమని డీఎండీకే గట్టి విశ్వాసంతో ఉంది. విజయకాంత్ ఆశించిందే జరిగితే డిల్లీ యాత్ర సఫలమైనట్లే. -
నేనే సీఎం అభ్యర్థి
రాష్ట్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు టీఎంసీ, వామపక్షాలు కసరత్తుల్లో పడ్డాయి. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ ఫ్రంట్‌లోకి ఆహ్వానించగా, ఆయన తానే సీఎం అభ్యర్థి అన్న నిబంధనను పెట్టడం గమనార్హం. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల తర్వాత డీఎండీకేకు ఓటు బ్యాంక్ కాస్త ఎక్కువ. లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా ఓటు బ్యాంక్‌ను మాత్రం ఆ పార్టీ పదిలం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి మంచి డిమాండే ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేత విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే తీవ్రంగానే ప్రయత్నిస్తున్నది. అయితే, సీఎం కావాలని కలలు కంటున్న కెప్టెన్ ఏ మేరకు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారోనన్నది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో గత వారం టీఎంసీ నేత వాసన్ ఇంట్లో సాగిన సీపీఎం నేత ఏచూరీ భేటీ విజయకాంత్‌కు కొత్త అవకాశం చేతికి చిక్కినట్టు అయింది. థర్డ్ ఫ్రంట్ : డీఎంకే, అన్నాడీఎంకేలు అవినీతి ఊబిలో కూరుకున్న దృష్ట్యా, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓ కూటమి ఏర్పాటుకు తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) నేత వాసన్ కొన్ని నెలలుగా పావులు కదుపుతూ వస్తున్నారు. వామపక్షాలను, మైనారిటీ సామాజిక వర్గ పార్టీలను, తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే నాయకుల్ని ఆహ్వానించి తరచూ ఏదో ఒక సదస్సును ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ సదస్సుల వేదికగా మతతత్వానికి, అవినీతికి ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఆవిర్భవించాల్సిందేనని నాయకులు వ్యాఖ్యానించి ఉన్నారు. ఈ వ్యాఖ్యల్ని కార్యరూపంలో పెట్టేందుకు వామపక్షాల నేతలు, టీఎంసీ నేత వాసన్ సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే గత వారం వాసన్ ఇంట్లో సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి భేటీ సాగినట్టుగా టీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ లక్ష్యంగా కసరత్తులు ఆరంభమైనా, నేతృత్వం ఎవరు వహించాలన్న అంశం చర్చకు వచ్చి ఉన్నది. వాసన్ నేతృత్వంలో కూటమి ఏర్పాటు దిశగా వామపక్షాలు ముందుకు వచ్చాయి. మైనారిటీ సామాజిక వర్గాల పార్టీలు, వీసీకే థర్ట్ ఫ్రంట్‌లోకి వచ్చే అవకాశం ఉన్నా, డీఎండీకేను తీసుకురావడం మీద నాయకులు తీవ్రంగా కుస్తీలు పడుతున్నట్టు సమాచారం. వాసన్‌కు విజయకాంత్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న దృష్ట్యా, డీఎండీకేను కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతలు ఆయన భుజానే వేశారు. తన నేతృత్వంలో కాకుండా విజయకాంత్‌తో కలసి ఉమ్మడి నేతృత్వంలో థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వాసన్ కసరత్తులు చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఎంసీ వర్గాల ఏకాభిప్రాయంతో విజయకాంత్ వద్దకు రాయభారం పంపినట్టు చెబుతున్నారు. థర్డ్ ఫ్రంట్‌ను ఆహ్వానించిన విజయకాంత్, నాయకత్వం మాత్రం తమ చేతిలోనే ఉండాలన్న నిబంధనను పెట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే, థ ర్డ్ ఫ్రంట్ సీఎం అభ్యర్థిగా తన పేరును ముందుగానే ప్రకటించాలని స్పష్టం చేయడంతో వాసన్ దూతలు నోరు మెదపకుండా వెను దిరిగినట్టు సమాచారం. తనకు సీఎం అభ్యర్థిత్వం ఇస్తే థర్డ్ ఫ్రంట్‌లోకి వచ్చేందుకు సిద్ధం అని, లేని పక్షంలో ఒంటరిగా కూడా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రెడీ అన్నట్టు వాసన్‌కు విజయకాంత్ సంకేతం పంపడం ఆలోచించ దగ్గ విషయమే. దీంతో వామపక్షాలతో చర్చించినానంతరం తదుపరి నిర్ణయాన్ని వెల్లడించే విధంగా విజయకాంత్‌కు వాసన్ సందేశం పంపినట్టుగా టీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల అనంతరం సీఎం ఎవ్వరన్నది తేల్చుకుందామని, ముందు మతత్వానికి , అవినీతికి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటు చేద్దామన్న లక్ష్యంతో ఉన్నట్టు విజయకాంత్‌కు నచ్చ చెప్పి దారిలోకి తెచ్చుకునేందుకు వాసన్ అస్త్రాలను ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు.