కెప్టెన్‌కు కోపమొచ్చింది
సాక్షి, చెన్నై :ప్రజల కోసం ప్రజా పని నినాదంతో సంక్షేమ పథకాల పంపిణీకి డీఎండీకే అధినేత విజయకాంత్ శ్రీకా రం చుట్టారు. విల్లుపురం త్యాగదుర్గంలో జరిగిన ఈ సభలో కార్యకర్తలు వీరంగం సృష్టించడం విజయకాంత్‌కు కోపం తె ప్పించింది. వారిని బుజ్జగించే క్రమంలో తన ఆక్రోశాన్ని వెల్లగక్కడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. కుర్చీల మీద తమ ప్రతాపం చూపించారు.
తన బర్త్‌డేను పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్న విజయకాంత్, ప్రజాకర్షణ లక్ష్యంగా తరచూ కొత్త కొత్త నినాదాలతో సంక్షేమ పథకాలను పంపిణీ చేయడం జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లే కార్యక్రమాలను విస్తృతం చేశారు. నెల రోజులుగా తన బర్త్‌డే సందర్భంగా పేదలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తూ వచ్చిన విజయకాంత్, దానికి కొనసాగింపుగా ప్రజల కోసం...ప్రజా పని నినాదంతో సంక్షేమ పథకాలకు విల్లుపురం వేదికగా శ్రీకారం చుట్టారు.
రగడ: మంగళవారం రాత్రి విల్లుపురం జిల్లా త్యాగ దుర్గంలో జరిగిన తొలి కార్యక్రమం వివాదానికి దారి తీసింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు కుర్చీల కోసం కుమ్మలాడుకుంటూ, చివరకు వాటిపై తమ ప్రతాపం చూపించా రు. తన దైన శైలిలో ఆక్రోశాన్ని విజయకాంత్ ప్రదర్శించడంతో మరింతగా రె చ్చిపోయారు. మీడియా కూర్చున్న కు ర్చీలను సైతం లాగేసుకుని ధ్వంసం చే శారు. దీంతో వారిని బుజ్జగించేందుకు మహిళా నేత, విజయకాంత్ సతీమణి ప్రేమలత శ్రమించాల్సి వచ్చింది. పరిస్థి తి సద్దుమణిగినానంతరం తన దైన హావా భావాలను ప్రదర్శిస్తూ విజయకాంత్ ప్రసంగాన్ని అందుకున్నారు.
గుణపాఠం తథ్యం: రానున్న ఎన్నికల్లో అన్నాడిఎంకేకు ప్రజలు గుణపాఠం చెప్పడం తథ్యమని విజయకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏదేని సమస్యలపై చర్చించాలని కోరితే చాలు, 110 తీర్మానాలు అంటూ దాట వేత ధోరణి, ప్రతి పక్షాల గళం నొక్కేయడం ధ్యేయంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ప్రజలకు కళ్లబొల్లి మాటలు చెప్పడం, ఆచరణకు నోచుకోని ఉచిత హామీలను గుప్పించా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఉచిత హామీలు ఏ మేరకు లబ్ధిదారులకు చేరిందో ఓ మారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు.రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకేకు గుణపాఠం చెప్పడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల ద్వారా అధికారంలోకి డిఎండికే రావడం తథ్యమని జోస్యంచెప్పారు. విజయకాంత్ మన స్సు చాలా మంచిదంటూ, ఆయన్ను ఆదరించాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని పిలుపు నిచ్చారు.