
గుజరాత్‌లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. వల్సాద్ జిల్లా ఉమర్‌గావ్‌లో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెంటనే నిందితుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విధ్వంసం సృష్టించారు.
రంగంలోకి దిగిన పోలీసులు మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన నిందితుడు గులాం ముస్తఫాను అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్లారు. మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
వల్సాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పీ) డాక్టర్ కరణ్‌రాజ్ వాఘేలా ఉమర్‌గావ్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళకు దిగినవారిని శాంతింపజేశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలని హోంమంత్రి ఆదేశించారని ఎస్పీ తెలిపారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో రాత్రిపూట పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment