తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
డీఎండికే నేత విజయకాంత్ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు , పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు దగ్గు గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని , వైద్యులు పూర్తి ఆక్సిజన్‌తో ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని సమాచారం అలాగే ఆయన ఆర్యోగం విషమంగా ఉందనే పుకార్లు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు పేర్కోని చికిత్స అనంతరం ఈనెల 11న డిశ్చార్జి చేశారు. డీఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv
— ANI (@ANI) December 28, 2023
Comments
Please login to add a commentAdd a comment