
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు.. ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. అయితే గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి ఖననానికి తన సొంత స్థలం ఇస్తానని ప్రకటించారు. ఈ విషయంపై ఆయన గతంలో ట్వీట్ చేశారు.
ఎందుకలా చేశారంటే...
గతంలో చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. దీంతో వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై స్పందిస్తూ విజయ్‌కాంత్ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో మృతిచెందిన వారిని ఖననం చేయడానికి తన సొంత స్థలం ఇస్తానన్నారు.
తన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగాన్ని ఖననానికి ఇస్తున్నట్లు వెల్లడించారు. కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేయటంతో వైరస్ వ్యాపించెందదని.. ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని అప్పటి విజయ్‌కాంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఇవాళ విజయ్‌కాంత్ మృతి చెందడం అభిమానులకు షాక్‌కు గురిచేసింది.
கொரோனாவால் உயிரிழந்தவர்களின் உடல்களை அடக்கம் செய்ய பொதுமக்கள் எதிர்ப்பு தெரிவித்தால், ஆண்டாள் அழகர் பொறியியல் கல்லூரியின் ஒரு பகுதியை உடல் அடக்கம் செய்ய எடுத்துகொள்ளலாம்.#SpreadHumanity | #COVID19 pic.twitter.com/CG2VLBzj4F
— Vijayakant (@iVijayakant) April 20, 2020