
మోడీకి కెప్టెన్ లేఖాస్త్రం!
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్స వం నిమిత్తం ఢిల్లీకి వెళ్లి భంగపాటుకు గురయ్యూరు డీఎండీకే అధినేత విజయకాంత్. తన బావమరిది సుదీష్‌కు పదవి దక్కక పోవడంతో కినుకు వహించిన విజయకాంత్,
సాక్షి, చెన్నై :నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్స వం నిమిత్తం ఢిల్లీకి వెళ్లి భంగపాటుకు గురయ్యూరు డీఎండీకే అధినేత విజయకాంత్. తన బావమరిది సుదీష్‌కు పదవి దక్కక పోవడంతో కినుకు వహించిన విజయకాంత్, మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీకి తీవ్రంగానే యత్నించారు. అపాయింట్‌మెంట్లు లభించక పోవడంతో చెన్నైకు తిరిగి వచ్చేసిన విజయకాంత్ తదుపరి తన కార్యాచరణ మీద దృష్టి పెట్టారు. బీజేపీ కూటమిలోనే కొనసాగాలా? లేదా వారు పెట్టిన మెలిక మేరకు విలీనం చేయాలా? అని తదుపరి అడుగులు ఎటో తేల్చుకునేం దుకు ఈనెల నాలుగో తేదీన పార్టీ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం రావడంతో మేల్కొన్న విజయకాంత్ ముందుగానే రాష్ట్రంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే పనిలో పడ్డా రు.
ఇది వరకు ప్రధాన మంత్రులకు లేఖాస్త్రాలతో సమస్యలను నివేదించడం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు అందెవేసిన చేయి. తాజాగా ఆ బాటలో విజయకాంత్ నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. శనివా రం రాష్ట్రంలోని సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెడు తూ మోడీకి లేఖాస్త్రం సంధించారు. లేఖాస్త్రం: తమిళనాడులో ప్రజలు తాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారని వివరించారు. నగరాలు, గ్రామాల్లో నీటి ఎద్దడి తాండవం చేస్తున్నదని, ఈ సమస్య పరిష్కారానికి నిధులు కేటాయిం చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరువు ప్రభావంతో కొన్నేళ్లుగా అన్నదాతలు కన్నీటి మడగులో మునిగి ఉన్నారని వివరించారు. నదీ జలాలు సక్రమంగా అందక డెల్టా రైతులు, వర్షాభావ పరిస్థితుల్లో దక్షిణాది రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయూరని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునే రీతిలో, నదుల అనుసంధానానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
తమిళనాడులో విద్యుత్ సమస్య తాండవం చేస్తున్నదని వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వ కోటాను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ తమిళనాడు సముద్ర తీరాల్లో ఖనిజ సంపద దోపిడీకి గురవుతోందని, తద్వారా కేంద్రానికి పెను నష్టం ఏర్పడుతున్నదని వివరిస్తూ, ఈ సంపదను పరిరక్షించే చర్య లు చేపట్టాలని విన్నవించారు. జాలర్లపై దాడులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ, మిత్ర దేశం శ్రీలంకపై ఒత్తిడి పెంచి భారత దేశాన్ని గౌరవించే విధంగా దారిలో పెట్టాలని సూచించారు. ఈలం తమిళులను ఆదుకునేందుకు చర్యలను వేగవంతం చేయించాలని కోరారు. తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిని పెంచడం, అత్యధికంగా నిధులను కేటాయించడం, ఉన్నత విద్య గ్రామీణ విద్యార్థుల దరి చేర్చ డం, జాతీయ రహదారులు పటిష్టం తది తర అంశాల గురించి వివరిస్తూ లేఖాస్త్రాన్ని విజయకాంత్ సంధించారు.