
సాక్షి, చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ వైద్య చికిత్స కోసం సోమవారం చెన్నై నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లారు.దీంతో విజయకాంత్ ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం, సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చారు. అయినా ఆశించినంతగా ఆరోగ్యం మెరుగుపడలేదు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలతకు అప్పగించి ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అడపాదడపా చెన్నైలోని ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
సెకెండ్ వేవ్‌లో ఆయన కరోనా బారినపడి కోలుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రసంగాలు చేయలేక ప్రజలకు చేతితో సైగలు చేస్తూ నామమాత్రంగా ప్రచారం నిర్వహించారు. ఈనెల 25వ తేదీన జన్మదినం కూడా జరుపుకున్నారు. మాట్లాడే సామర్థ్యం, తానుగా లేచి నిలబడే శక్తిని కోల్పోయి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం విజయకాంత్ తన కుమారుడు షణ్ముగపాండియన్, సహాయకులు కుమార్, సోములతో మళ్లీ అమెరికాకు పయనమయ్యారు.
చదవండి : '40 ఏళ్ల క్రితం ఈ అమ్మాయి కనిపిస్తే నాకు విడాకులు అయ్యేవి కావు'
Karthikeya 2: హీరోయిన్‌ను రివీల్ చేశారు..