నటించాలన్న ఆసక్తి లేదు | not interested in acting : Vijayakanth | Sakshi
Sakshi News home page

నటించాలన్న ఆసక్తి లేదు

Published Tue, Jul 1 2014 11:51 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

నటించాలన్న ఆసక్తి లేదు - Sakshi

నటించాలన్న ఆసక్తి లేదు

 టీ.నగర్: తనకు మళ్లీ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి లేదని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ వెల్లడించారు. సేలంలో సోమవారం ‘మీతో నేను’ అనే కార్యక్రమం ఐదురోడ్ల కూడలిలోని కల్యాణ మండపంలో జరిగింది. ఇందులో సేలం, నగర జిల్లా, తూర్పు, పచ్చిమ జిల్లాలకు చెందిన నిర్వాహకులు, కార్యకర్తలు 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయకాంత్ కార్యకర్తల ప్రశ్నలకు బదులిచ్చారు. కార్యకర్తలు సినిమాల్లో మళ్లీ నటిస్తారా అని ప్రశ్నించగా విజయకాంత్ బదులిస్తూ తనకు ఆరోగ్యం సహకరించనందున ఎక్కువ సేపు మాట్లాడలేనని అయినప్పటికీ ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నలకు బదులిస్తానన్నారు.
 
 తాను సినిమాల్లో నటించి నాలుగేళ్లకు పైగా కావస్తుందని ఇకపై సినిమాల్లో నటించే ఆశ లేదన్నారు. తనకు బదులు తన కుమారుడు సినిమాలో నటిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు విజయకాంత్‌తో ఫొటోలు తీయించుకున్నారు. ఆ తరువాత నిర్వాహకులతో విజయకాంత్ సమావేశం నిర్వహించారు. 2016లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. 2016లో డీఎండీకే మహత్తర శక్తిగా రూపొందనుందన్నారు. ప్రతి యూనియన్‌లోను ప్రతి నెలా 1000 మంది సభ్యులు పార్టీలోకి చేరి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement