not interested
-
Jayanti Chauhan: ఆసక్తి లేని పని ఆమెకు వద్దట
వారసులు వారసత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహపడతారు. యువరాజులు కిరీటం కోసం వెంపర్లాడతారు. ఆసక్తి లేని పని చేయనక్కర్లేదని సామ్రాజ్యాలను వదలుకుంటారా ఎవరైనా? 32 ఏళ్ల జయంతి చౌహాన్. 7000 కోట్ల బిస్లరీ వాటర్ సామ్రాజ్యానికి ఏకైక యువరాణి. ‘నాకు ఆసక్తి లేదు’ అని చైర్ పర్సన్ పదవిని నిరాకరించింది. దీని వల్ల సంస్థను టాటా పరం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తృప్తినిచ్చే పని చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు. కాని తృప్తినిచ్చే పనిలోనే ఆనందం ఉందని ఆమె సందేశం ఇస్తోంది. ఈ కాలపు యువత ఈ మాట ఆలకించాల్సిందే. ఇదంతా ఒక జానపద కథలాగే ఉంది. పూర్వం ఎవరో ఒక రాజు తన రాజ్యం మొత్తాన్ని ఏకైక కుమార్తె చేతిలో పెడదామనుకుంటే ‘నాకు వద్దు నాన్నా. నాకు హాయిగా సెలయేళ్ల మధ్య గడుపుతూ, చిత్రలేఖనం చేసుకుంటూ, పూ లతల మధ్య ఆడుకోవాలని ఉంది’ అని ఆ కూతురు అంటే రాజు ఏమంటాడు? రాజ్యం ఏమవుతుంది? ‘జల సామ్రాజ్యం’ లేదా ‘ఆక్వా కింగ్డమ్’గా అందరూ పిల్చుకునే ‘బిస్లరీ’ సంస్థకు ఇప్పుడు ఆ పరిస్థితే ఎదురైంది. దాని అధినేత రమేష్ చౌహాన్ తన సంస్థను అనివార్యంగా టాటాకు అప్పజెప్పనున్నాడు. రేపో మాపో ఇది జరగనుంది. 7000 కోట్లకు సంస్థ చేతులు మారుతుంది. పూర్తి మార్పుకు మరో రెండేళ్లు పడుతుంది. అంతవరకూ సంస్థ భారాన్ని 82 ఏళ్ల రమేష్ చౌహాన్ మోయక తప్పదు. కారణం ఏమిటి? ‘నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నా కుమార్తె జయంతికి సంస్థ పగ్గాలు స్వీకరించడంలో ఆసక్తి లేదు. సంస్థ అమ్మేయదల్చుకోవడం బాధాకరమే. కాని టాటా సంస్థకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. అదైతే నా సంస్థను బాగా చూసుకుంటుందని భావిస్తున్నాను. వారి వైపే నా మనసు మొగ్గుతున్నది’ అని రమేష్ చౌహాన్ అన్నాడు. పార్లే బ్రదర్స్‌లో ఒకరైన రమేష్ చౌహాన్ 1993లో తన సొంత సాఫ్ట్డ్రింక్లైన థమ్సప్, సిట్రా, మాజా, గోల్డ్స్పాట్లను కోకాకోలాకు విక్రయించాడు. ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ అయిన బిస్లరీని అమ్మేయబోతున్నాడు. కారణం కూతురు జయంతికి ఉన్న కళాత్మక ఆసక్తులే. మనకు ఏది ఇష్టం? జయంతి నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏది మనసుకు బాగా నచ్చుతుందో ఆ పని చేయాలి. అందరికీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. కాని కుదిరే అవకాశం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది జీవితం గడిచిపోయాక ‘నేను ఇది కాదు చేయాలనుకున్నది. నాకు అవకాశం కూడా వచ్చింది. కాని వేరే దారిలో వెళ్లిపోయాను. చాలా అసంతృప్తిగా ఉంది’ అనడం వింటూ ఉంటాము. ఆ రియలైజేషన్ వచ్చేలోపు జీవితం గడిచిపోయి ఉంటుంది. అదే సమయంలో మన అభిరుచులు, ఆసక్తులు అన్ని వేళలా ఆర్థిక సమీకరణాలకు లొంగేలా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నప్పుడు సొంత మార్గం ఎంచుకోవడంలో తప్పు ఏముంది? ఐ.టి. ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేసేవారు, ఐ.పి.ఎస్. ఉద్యోగాన్ని వదిలి సంఘసేవ చేసేవారు ఉన్నారు. ఒక స్పష్టతతోనే జయంతి బిస్లరీని వద్దనుకుని ఉంటుంది. ఆ స్పష్టత ఉంటే ఎవరైనా తమకు ఇష్టమైన రంగంలో పని చేస్తూ ఆనందకరమైన జీవితం గడపవచ్చు. డబ్బు వల్ల మాత్రమే ఆనందం లభించదని జయంతి చెబుతోంది కదా. ఎవరు జయంతి? జయంతి చౌహాన్ (37) రమేష్ చౌహాన్‌కు ఒక్కగానొక్క కూతురు. ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత మొదట న్యూయార్క్‌లో, ఆ తర్వాత లండన్‌లో, ఆ పైన ఇటలీలో చదువుకుంది. ప్రాడక్ట్ డెవలప్మెంట్తో పాటు ఫ్యాషన్ స్టైలింగ్ కూడా చదువుకుంది. దాంతోపాటు లండన్‌లో ‘స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ (లండన్ యూనివర్సిటీ) నుంచి అరబిక్ భాష నేర్చుకుంది. అరబిక్ భాష నేర్చుకోవడం ఒక భిన్న అభిరుచి అని చెప్పవచ్చు. ఆమెకు ఇదొక్కటే కాదు... ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ప్రయాణాలు ఇష్టపడుతుంది. జంతు ప్రేమ ఉంది. అంత పెద్ద వ్యాపార సంస్థకు వారసురాలైనా చక్కగా ఒక ఆటో ఎక్కి రోడ్డు పక్కన బంతిపూలు కొనుక్కుంటూ కనిపిస్తుంది. ఆమెకు రంగులు అంటే ఇష్టం. మంచి బట్టలు ఇష్టం. భావు కత్వంతో జీవించడం ఇష్టం. అలా అని ఆమెకు వ్యాపార దక్షత లేదనుకుంటే పొరపాటు. చదువు పూర్తయిన వెంటనే 24 ఏళ్ల వయసులో సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పని చేయడం మొదలుపెట్టింది. మొదట ఢిల్లీ కార్యాలయంలో చేసి ఆ తర్వాత ముంబై ఆఫీస్‌కు హెడ్ అయ్యింది. జయంతి చేరాక హెచ్.ఆర్, మార్కెటింగ్, సేల్స్‌లో సమూలమైన మార్పులు తెచ్చింది. పోటీదారుల చొరబాటును ఎదుర్కొనడానికి ‘బ్లూ’ కలర్ నుంచి బిస్లరీ రంగును ‘ఆకుపచ్చ’కు మార్చింది. సంస్థలో ఆధునిక యాంత్రికీకరణలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇంత సాధించిన కుమార్తె సంస్థ పగ్గాలు చేపడుతుందని తండ్రి ఆశించడం సహజం. కాని జయంతి తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. బహుశా ఆమె మనసు ఇందులో లేదు. ఆమెకు తృప్తినిచ్చే పని ఇది కాకపోవచ్చు. అందుకే ఆమె ఇంత సామ్రాజ్య కిరీటాన్ని వద్దనుకుంది. -
నాకంత ఓర్పు లేదు
ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్లే పొగడ్తలు, విమర్శలు ఉంటాయి. నటిగా మీ కెరీర్లో ఎదురయ్యే విమర్శలను మీరు ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే– ‘‘నేనేం దేవుణ్ణి కాదు. మామూలు మనిషిని. అందరిలాగే నేనూ తప్పులు చేస్తాను. నా తప్పుల గురించి వచ్చిన నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను. నన్ను నేను విశ్లేషించుకుని నాలోని లోపాలను సరిదిద్దుకుంటాను. అంతేకానీ తప్పుడు విమర్శలను పట్టించుకుని అనవసరంగా బాధపడను’’ అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దర్శకత్వం ఆలోచన ఏమైనా ఉందా? అన్నప్పుడు... ‘‘దర్శకత్వం అంటే చిన్న విషయం కాదు. సినిమా గురించిన ప్రతి విషయంపై అవగాహన ఉండాలి. పాత అంశాలను కొత్త దృష్టి కోణంలో చూడగలగాలి. అన్నింటికన్నా ముందు చాలా ఓర్పు ఉండాలి. అంత ఓర్పు నాలో లేదు. ప్రసుతం దర్శకత్వం ఆలోచన లేదు. కానీ శ్రీదేవి బయోపిక్‌ను ఎవరైనా తీస్తే అందులో నటించాలని ఉంది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
బయోపిక్ వద్దు
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరూ బయోపిక్స్ బాట పట్టారు. ఆడియన్స్ కూడా పాత తరం యాక్టర్స్ మీద బయోపిక్ చూడాలనుకుంటున్నారు. మరి మీ బయోపిక్‌ను మీరు చూడాలనుకుంటున్నారా? అని ధర్మేంద్రని అడగ్గా– ‘‘లేదు లేదు. నాకు బయోపిక్ వద్దు. గట్టిగా మాట్లాడితే నేను ఇప్పటి వరకు నా బయోగ్రఫీనే రాయలేదు. నా తోటి యాక్టర్స్ కొందరు నాలుగైదు పుస్తకాలు రాసేశారు కూడా. ప్రస్తుతం నాకైతే బయోపిక్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పటివరకూ చేసిన జర్నీల తాలూకు ఎక్స్పీరియన్స్ నుంచి ఓ బుక్ రాస్తానేమో. ఎప్పుడైనా పాత ఫొటోలు (స్ట్రగ్లింగ్ యాక్టర్‌గా ఉన్నప్పటివి) చూసుకుంటే ఫొటోలో ఉన్న నన్ను చూసుకుంటూ నేను ‘నువ్వు హీరో అయ్యావు’ అనుకుంటాను’’ అని పేర్కొన్నారు. -
విధుల్లో చేరేందుకు వైద్యుల విముఖత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైద్య స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేస్తే, చాలామంది విధుల్లో చేరేందుకు విముఖత చూపిస్తున్నారు. మొత్తం 911 స్పెషలిస్టు వైద్యులను నియమించగా, ఇప్పటివరకు దాదాపు 600 మందే చేరినట్లు వైద్య విధాన పరిషత్ వర్గాలు చెబుతున్నాయి. తమకు ఇచ్చిన పోస్టింగ్ మార్చాలని కొందరు కోరుతుంటే, భార్యాభర్తలను వేర్వేరుగా వేశారని మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరైతే పోస్టింగుల్లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీంతో అనేకమంది హైదరాబాద్ వైద్య విధాన పరిషత్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరైతే మంత్రులు, ఎమ్మెల్యేలతో పైరవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో చేరే గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు. నేరుగా పోస్టుల భర్తీ.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు. ఈ నెల 6న ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 14 హైదరాబాద్‌లోని ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో వైద్యులకు పోస్టింగ్‌లు లభించాయి. సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆసుపత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. పైరవీలు చేయించుకున్న వారికి మంచి పోస్టింగులు ఇచ్చారని, మిగిలిన వారికి అన్యాయం చేశారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. దీన్ని వైద్య విధాన పరిషత్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు విధుల్లో చేరని వైద్యుల జాబితాను అధికారులు తయారు చేశారు. ఆ జాబితాలోని వైద్యుల పేర్ల పక్కన ప్రత్యేక కాలమ్‌లో పైరవీ చేస్తున్న మంత్రి లేదా ప్రజాప్రతినిధి పేర్లను అధికారులు తయారు చేయడం గమనార్హం. -
పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య
సాక్షి, విశాఖ క్రైం : పెళ్లి ఇష్టం లేని యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గురుద్వార కూడలి శాంతిపురం అరుణ అపార్టుమెంట్లో సత్తరు అప్పన్న, నారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సత్తరు రేవతి (20), కుమారుడు చైతన్య ఉన్నారు. అప్పన్న నెల్లూరులో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె రేవతి డిగ్రీ పరీక్షలు రాసింది. రేవతికి బావతో పెళ్లి కుదిర్చారు. ఈనెల 22న వివాహం నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో భాగంగా సోమవారం పెళ్లి కార్డుల పంపిణీకి రేవతి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ నేపథ్యంలో రేవతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ హుక్కు చున్నితో ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రేవతి తల్లి, కుటుంబ సభ్యులు తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో గట్టిగా తోసి లోపలకు ప్రవేశించారు. ఇంటిలో సిలింగ్ హుక్కుకు వేలాడుతున్న రేవతిని చూశారు. వెంటనే ఆమెను కిందకు దించి కేర్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రేవతి తల్లి నారాయణమ్మ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన హెడ్ కానిస్టేబుల్ తులసీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం రేవతి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. చదువుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న రేవతి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇష్టంలేని పెళ్లితో కాపురం చేయలేను
హాసన్ : ఇష్టం లేని పెళ్లితో కాపురం చేయలేనని ఓ నవ వధువు పెళ్లయిన ఆరు రోజులకే కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు ఇచ్చి ఇంటిలో నుంచి పారిపోయిన సంఘటన ఇక్కడి సకలేశ్పుర తాలూకాలో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా తనను చదివించి, పెళ్లి చేసిన మేనమామపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు... సకలేశపుర తాలూకాలోని హానుబాలు సమీపంలో హదిగే గ్రామానికి చెందిన కుసుమను కొంతనమనె గ్రామానికి చెందిన మోహన్‌కు ఇచ్చి ఈనెల 6న వివాహం జరిపించారు. వధువుకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమెను పెంచి పోషించిన మేనమామ నీలరాజు కుసుమ బాగోగులు చూసుకునేవాడు. పీయూసీ వరకు కుసుమను చదివించి వరుడు మోహన్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. ఆరు రోజుల వరకు ఇంటిలోని వారితో కలిసి ఉన్న కుసుమ పారిపోవడానికి ముందు ఇంటిలోని వారికి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పారిపోయింది. ఇదే సమయంలో వరుడు మోహన్ సైతం వధువు పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడారు. అనంతరం కుసుమను మహిళా సహాయ కేంద్రానికి తరలించారు. ఇదే సమయంలో కుసుమ తాను చదువుకుంటున్న సమయంలో ఓ యువకుడిని ప్రేమించానని, తన మేనమామ బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి జరిపించాడని వాపోయింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
విదేశీ విద్యకు వెనుకడుగు
రాష్ట్రంలో పేద విద్యార్థులకు అమలు చేస్తున్న విదేశీ విద్య పథకానికి విద్యార్థుల నుంచి ఆశించిన స్పందన లభించడం లేదు. విదేశీ విద్య కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు చెల్లిస్తుంది. ఇంతపెద్ద మొత్తంలో చెల్లించే సౌలభ్యం ఉన్నా విద్యార్థులు ఈ పథకాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు మాత్రం లేకుండా నిబంధనలు విధించారు. విద్యార్థుల కుటుంబ వార్షికా దాయం నిబంధన ఈ పథకం అమలులో మొదటి అడ్డంకిగా చెప్పుకోవచ్చు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విదేశాల్లో ఎంఎస్, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేట్, పీహెచ్డీ చదివే దళిత, గిరిజన విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013వ సంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఇతర వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో బీసీ విద్యార్థుల కోసం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని, మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పేరిట పథకాలను 2016వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, కెనడా, సింగపూర్, డెన్మార్క్, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించింది. ఆర్థిక ప్రయోజనం ఇలా.. ఈ పథకం ప్రకారం లబ్ధిదారులకు రూ.10 లక్షలతో పాటు విమాన ఛార్జీలు, వీసా ఫీజులు చెల్లిస్తారు. దీనిలో విద్యార్థి విదేశానికి వెళ్లిన తరువాత ముందుగా రూ. 5 లక్షలు చెల్లిస్తుంది. మొదటి సెమిస్టర్ పూర్తి అయిన తరువాత మిగిలిన రూ. 5 లక్షలు చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి రాష్ట్రంలో సుమారు 300 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, 500 మంది బీసీ విద్యార్థులకు, 350 మంది ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. రెట్టింపు ఖర్చు ఈ పథకం కింద విద్యార్థికి ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లిస్తున్నా విదేశీ చదువులకు వెళ్లే విద్యార్థులు దానికి రెండింతలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో వారికి రూ. 20 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. ఫీజులు, విమాన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం చెల్లిస్తున్నా, కొన్ని దేశాల్లో విద్యా సంస్థల ఫీజులే అధికంగా ఉండడం, హాస్టల్ ఛార్జీల భారం, ఇతర చిల్లరమల్లర ఖర్చులు వెరసి తడిసి మోపెడవుతున్నాయి. జర్మనీ వంటి దేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లినా ఆయా విద్యా సంస్థలకు కోర్సుకు చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంక్ బ్యాలెన్స్‌గా చూపాల్సి ఉంటుంది. అంత మొత్తం సామాన్య, మధ్యతరగతి వారు నిల్వ చేయడం మాటల్లో చెప్పినంత తేలిక కాదంటున్నారు. అడ్డంకులు ఇలా.. ఈ పథకాన్ని అందిపుచ్చుకోవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నో అడ్డంకులు ఎదురౌతున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కోవడం వారికి పెను సవాలుగా మారుతోంది. ఆదాయ సర్టిఫికెట్‌కు వెళితే విదేశీ విద్యకు పంపే వారికి దారిద్య్రరేఖకు దిగువ ఉన్నారని సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పేస్తున్నారు. అక్కడ వారిని బతిమాలి ఎలాగోలా సర్టిఫికెట్ తెచ్చుకుంటే సంక్షేమ శాఖ కార్యాలయాల్లో అధికారులు వేసే యక్ష ప్రశ్నలతో చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకాన్ని అందిపుచ్చుకోవడం తమ వల్ల అయ్యే పనికాదని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న తరువాత విద్యార్థి, వారి తల్లిదండ్రులు అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోవలసి వస్తోంది. చివరికి పథకానికి ఎంపికైనా నిధులు మంజూరుకు మాత్రం నెలలకు నెలలు ఎదురుచూడాల్సి వస్తోంది. వేళ్లతో లెక్కించే సంఖ్యలోనే విద్యార్థుల ఎంపిక.. విద్యానిధి పథకం కింద 2014 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కేవలం 23 మంది విద్యార్థులు మాత్రమే విదేశీ చదువులకు ఎంపికయ్యారు. వీరిలో కేవలం 13 మంది విద్యార్థులకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. ఈ ఏడాది 30 మంది విద్యార్థులకు అవకాశం ఉన్నా ఇప్పటి వరకూ కేవలం ఏడుగురు విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది ఒక గిరిజన విద్యార్థి, ముగ్గురు మైనార్టీ విద్యార్థులు విదేశాలకు వెళ్లగా మరో ఏడుగురి దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. 2016–17 విద్యాసంవత్సరంలో 29 మంది బీసీ విద్యార్థులు ఈ పథకానికి ఎంపికై విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ఏడాది 70 మంది విద్యార్థులు విదేశీ చదువులకు వెళ్లడానికి అవకాశమున్నా ఇప్పటికీ కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు తలప్రాణం తోకకొచ్చింది.. మా అమ్మాయిని విదేశీ విద్య చదివించడానికి ఈ పథకాన్ని వినియోగించుకుందామని ఆన్లైన్లో దరఖాస్తుకు ప్రయత్నించగా ఎక్కడా వీలుకాలేదు. తరువాత మైనార్టీ సంక్షేమ శాఖలో సంప్రదించగా వారి కార్యాలయం నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుకలిగింది. దరఖాస్తు చేసుకుని ఇప్పటికి ఆరు నెలలు గడుస్తోంది. మంజూరు కావడానికి సమయం పడుతుంది అంటున్నారు. అధికారులు తమ సొంత డబ్బు ఉచితంగా ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దరఖాస్తు చేయడమే ప్రహసనంగా మారింది. – ఎం.శోభారాణి, విద్యార్థి తల్లి ఇబ్బందులున్నమాట వాస్తవమే.. ఈ పథకాన్ని అందిపుచ్చుకోవడంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎదురవుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడానికి రెవెన్యూ అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి 3 – 4 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి నిధులు మంజూరు చేయడం త్వరగానే జరిగిపోతుంది. – జి.లక్ష్మీ ప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి. -
ఫిఫా పదవిపై ఆసక్తి లేదు
కోల్‌కతా: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష పదవిపై తనకెలాంటి ఆసక్తి లేదని సాకర్ రారాజు పీలే స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన సోమవారం మీడియాతో ముచ్చటించారు. ఆయనతో పాటు అట్లెటికో డి కోల్‌కతా సహ యజమాని సౌరవ్ గంగూలీ కూడా పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ‘ఫిఫా ఎన్నికల్లో పోటీకి దిగి అధ్యక్షుడిగా కావాలనే ఉద్దేశం నాకు లేదు’ అని పీలే తేల్చారు. అలాగే ప్రస్తుత తరంలో అర్జెంటీనాకు చెందిన స్టార్ స్ట్రయికర్ మెస్సీ సూపర్ అని కొనియాడారు. గత పదేళ్లలో అతడిని మించిన ఆట గాడు లేడని చెప్పారు. అయితే బ్రెజిల్‌కే చెందిన నెయ్మార్, రొనాల్డోలను తక్కువ చేసి చూడలేమని కూడా అన్నారు. ‘వివిధ తరాలకు చెందిన ఆటగాళ్లను పోల్చడం అంత తేలిక కాదు. అయితే దశాబ్దకాలంగా గమనిస్తే మెస్సీ అద్భుతం అని చెప్పవచ్చు. రొనాల్డో దూకుడుగా ఆడుతూ గోల్స్ చేస్తున్నా.. మెస్సీ శైలి విభిన్నం. ఇక మా ఆటగాడు నెయ్‌మార్‌కు మంచి భవిష్యత్తు ఉంది’ అని మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించిన 74 ఏళ్ల పీలే తెలిపారు. చిన్నప్పటి నుంచే మక్కువ పెంచాలి భారత్‌లో ఫుట్‌బాల్ ఇప్పుడున్న పరిస్థితి నుంచి మెరుగుపడాలంటే చిన్నారులకు క్షేత్రస్థాయి నుంచే ఆటపై మక్కువ పెంచాల్సి ఉంటుందని పీలే అభిప్రాయపడ్డారు. అలాగే వర్ధమాన ఆటగాళ్లతో వీలైనంత విదేశీ పర్యటనలు చేయించాలని అన్నారు. ‘అన్నింటికన్నా ముఖ్యం ఆటగాళ్లను శిక్షణ కోసం విదేశాలకు పంపాలి. ఒక్కోసారి మీ దగ్గర మంచి నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లు ఎలాంటి అంతర్జాతీయ అనుభవం లేకుండా ఉండొచ్చు. కానీ ఫలితం ఉండదు. స్కూల్ లేక క్లబ్ స్థాయిలో వారికి సరైన వసతులు కల్పించకపోతే ఎలా ఎదుగుతారు?’ అని పీలే ప్రశ్నించారు. ఫుట్‌బాల్‌లో తాను కింగ్నైతే.. మరో ఆటలో గంగూలీ ప్రిన్స్ అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అట్లెటికో డి కోల్‌కతా జట్టుకు చెందిన జెర్సీని సహ యజమానులు గంగూలీ, సంజీవ్ గోయెంకా, ఉత్సవ్ పరేఖ్, నియోషియా కలిసి పీలేకు బహూకరించారు. కోల్‌కతాలో లభించిన స్వాగతానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీలే ఆటగాడిగా ఉన్నప్పుడు చూడలేకపోయినా ఇప్పుడు ప్రత్యక్షంగా కలుసుకోవడం సంతోషాన్నిస్తోందని గంగూలీ చెప్పారు. -
'పీసీసీ చీఫ్ పదవి ఆశించడం లేదు'
-
'పీసీసీ చీఫ్ పదవి ఆశించడం లేదు'
న్యూఢిల్లీ: తాను పీసీసీ అధ్యక్ష పదవి ఆశించడం లేదని తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... పీసీసీ అధ్యక్షుణ్ని అధిష్టానం మార్చాలనుకుంటే సలహాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల సందర్భాను సారంగా మాట్లాడలేకపోతున్నారని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మేధోమథనం సదస్సు ఎప్పుడనేది పొన్నాల తనతో చెప్పలేదని అన్నారు. అలాగే నిన్న ప్రకటించిన సీఎల్పీ కమిటీ ఏర్పాటుపై కూడా తాను పొన్నాలతో చర్చించలేదని తెలిపారు. పీఏసీ ఛైర్మన్ ఎవరనేది తానే నిర్ణయిస్తానని జానారెడ్డి వెల్లడించారు. -
నటించాలన్న ఆసక్తి లేదు
టీ.నగర్: తనకు మళ్లీ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి లేదని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ వెల్లడించారు. సేలంలో సోమవారం ‘మీతో నేను’ అనే కార్యక్రమం ఐదురోడ్ల కూడలిలోని కల్యాణ మండపంలో జరిగింది. ఇందులో సేలం, నగర జిల్లా, తూర్పు, పచ్చిమ జిల్లాలకు చెందిన నిర్వాహకులు, కార్యకర్తలు 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయకాంత్ కార్యకర్తల ప్రశ్నలకు బదులిచ్చారు. కార్యకర్తలు సినిమాల్లో మళ్లీ నటిస్తారా అని ప్రశ్నించగా విజయకాంత్ బదులిస్తూ తనకు ఆరోగ్యం సహకరించనందున ఎక్కువ సేపు మాట్లాడలేనని అయినప్పటికీ ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నలకు బదులిస్తానన్నారు. తాను సినిమాల్లో నటించి నాలుగేళ్లకు పైగా కావస్తుందని ఇకపై సినిమాల్లో నటించే ఆశ లేదన్నారు. తనకు బదులు తన కుమారుడు సినిమాలో నటిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు విజయకాంత్‌తో ఫొటోలు తీయించుకున్నారు. ఆ తరువాత నిర్వాహకులతో విజయకాంత్ సమావేశం నిర్వహించారు. 2016లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. 2016లో డీఎండీకే మహత్తర శక్తిగా రూపొందనుందన్నారు. ప్రతి యూనియన్‌లోను ప్రతి నెలా 1000 మంది సభ్యులు పార్టీలోకి చేరి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. -
పేరు ‘పెద్ద’..!
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: మునుపెన్నడూ లేని దుర్భర పరిస్థితిని జాతీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీల తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర విభజన సెగ కాంగ్రెస్, బీజేపీలకు తాకింది. దీంతో రెండింటికీ..అభ్యర్థులు కరువవుతున్నారు. బీజేపీ పరిస్థితి గతానికి భిన్నంగా ఏమీ లేకపోగా..మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అతి దారుణంగా తయారైంది. మున్సిపల్ ఎన్నికల్లో వల వేసినా.. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు. పరువు నిలుపుకునేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నా.. వారి ఆశలు అడియాసలవుతున్నాయి. ఇక ఎంపీటీసీ స్థానాలకూ అభ్యర్థుల కొరత ఏర్పడింది. దీంతో చాలా చోట్ల బల మైన అభ్యర్థులు పోటీలో ఉండకపోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నరసన్నపేట మండలంలో ఒక్క చెన్నాపురం మినహ మరెక్కడా ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు లేరు. జలుమూరు, సారవకోట మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు.. వారి గుర్తులను మున్సిపల్ ఎన్నికలకు కేటాయించింది. స్వతంత్రులకు కోసం 82 గుర్తులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌కు హస్తం, బీజేపీకి కమలం, సీపీఐకి కంకి, సీపీఎంకు సుత్తి,కత్తి నక్షత్రం, బీఎస్పీకి ఏనుగు గుర్తులను కేటాయించగా..వైఎస్సార్ సీపీకి ఫ్యాన్ గుర్తును కేటాయించింది. అలాగే..టీడీపీతో ఇతర పార్టీలకు ఆయా గుర్తులను నిర్ధారించింది. గడ్డు పరిస్థితి.. విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను ఆపార్టీ సీనియర్ నాయకులు వీడటంతో..గతంలో ఎప్పుడూ లేని దుస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఏళ్లు గడుస్తున్నా.. బీజేపీ మాత్రం బలం పుంజుకోవడం లేదు. దీంతో రెండు జాతీయ పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఐదు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని జాతీయ పార్టీలకు అంత సీన్ లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో అధిక శాతం ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై ప్రాంతీయ పార్టీల గుర్తులే ఉండనున్నాయి.