
ధర్మేంద్ర
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరూ బయోపిక్స్ బాట పట్టారు. ఆడియన్స్ కూడా పాత తరం యాక్టర్స్ మీద బయోపిక్ చూడాలనుకుంటున్నారు. మరి మీ బయోపిక్‌ను మీరు చూడాలనుకుంటున్నారా? అని ధర్మేంద్రని అడగ్గా– ‘‘లేదు లేదు. నాకు బయోపిక్ వద్దు. గట్టిగా మాట్లాడితే నేను ఇప్పటి వరకు నా బయోగ్రఫీనే రాయలేదు.
నా తోటి యాక్టర్స్ కొందరు నాలుగైదు పుస్తకాలు రాసేశారు కూడా. ప్రస్తుతం నాకైతే బయోపిక్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పటివరకూ చేసిన జర్నీల తాలూకు ఎక్స్‌పీరియన్స్ నుంచి ఓ బుక్ రాస్తానేమో. ఎప్పుడైనా పాత ఫొటోలు (స్ట్రగ్లింగ్ యాక్టర్‌గా ఉన్నప్పటివి) చూసుకుంటే ఫొటోలో ఉన్న నన్ను చూసుకుంటూ నేను ‘నువ్వు హీరో అయ్యావు’ అనుకుంటాను’’ అని పేర్కొన్నారు.