భారత మాజీ ప్రధానమంత్రి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. మనదేశానికి ఆర్థికమంత్రిగా, ప్రధానిగా ఎన్నో ఏళ్లపాటు సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల సీఎంలు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అయితే ఆర్థిక చాణక్యుడిగా పేరున్న మన్మోహన్ తన జీవితంలో ఎన్నో గొప్ప అవార్డులు సాధించారు. పద్మ విభూషణ్ లాంటి పురస్కారానికి ఎంపికయ్యారు. తన హయాంలో సమాచారం హక్కు చట్టంతో పాటు పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యావత్ భారతావని మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకుంటోంది.
మన్మోహన్ సింగ్ బయోపిక్..
అయితే మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర గురించి ఓ సినిమాను కూడా తెరకెక్కించారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ మూవీ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. 2019లో విడుదలైన ఈ సినిమా పలు వివాదాల తర్వాత విడుదలైంది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రం 2019లో జనవరి 11న రిలీజైంది. "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్" పుస్తకంలోని పలు సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి విజయ్ రత్నాకర్ గుట్టే దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్‌గా బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ నటించారు. ఈ సినిమాను రుద్ర ప్రొడక్షన్స్ , పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇందులో 13వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్య గల సంఘటనలను చూపించారు.
ఓటీటీలో స్ట్రీమింగ్..
ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment