The Accidental Prime Minister
-
అబ్బాయిలు పెళ్లి చేసుకోమంటున్నారు : హీరో
తెర మీద తాము చేసే పాత్రలు నటీనటులకు రియల్ లైఫ్‌లోనూ ఇబ్బందులను తెచ్చిపెడుతుంటాయి. సినిమాలో విలన్ పాత్రల్లో కనిపించేవారిని బయట కూడా ప్రేక్షకులు ద్వేషించటం అనేది కామన్. అయితే తాజాగా ఓ బాలీవుడ్ హీరోకు విచిత్రమైన సమస్య ఎదురైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్‌గా తెరకెక్కిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాతో రాహుల్ పాత్రలో నటించిన నటుడు అర్జున్ మాథుర్. ఈ సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించిన అర్జున్‌కు ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ కారణంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ‘మేడ్ ఇన్ హెవెన్’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లో అర్జున్ గే పాత్రలో నటించాడు. దీంతో ఇప్పుడు అర్జున్‌కు అబ్బాయిల నుంచి పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయట. అంతేకాదు కొంత మంది అబ్బాయిలు అభ్యంతరకర సందేశాలు కూడా పంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అర్జున్ మథుర్. -
బాలీవుడ్ ‘నమో’ స్మరణ!
సినీ రంగంలో రాజకీయ నాయకుల జీవిత చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇదే పరంపరలో ప్రధాని మోదీ బయోపిక్‌లు నిర్మితమయ్యాయి. ఎన్నికల వేళ మోదీ పట్ల బాలీవుడ్ ఇలా తన విధేయత చాటుతూ అనధికార ప్రచారం చేస్తోందని వినిపిస్తోంది. ఈ ఏడాది తొలినాళ్లలో మోదీతో బాలీవుడ్ ప్రముఖులు సమావేశమై జాతి నిర్మాణంలో సినిమాల పాత్రపై చర్చలు జరిపిన తరువాత బాలీవుడ్–మోదీ బంధం మరింత బలపడిందని భావిస్తున్నారు. ఆ మరసటి రోజే ‘ఉడీ: సర్జికల్ స్ట్రైక్స్’ అనే చిత్రం విడుదలైంది. ఇందులో రంజిత్ కపూర్ మోదీ పాత్రలో కనిపించారు. అదే రోజున మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆత్మకథతో వచ్చిన ‘యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కాంగ్రెస్‌కు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికల క్రతువు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రధాని క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలుస్తాయని భావిస్తున్న కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు.. పీఎం నరేంద్ర మోదీ వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ సినిమాలో సోలో హీరోగా నటించి 5 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి దక్షిణాది పరిశ్రమపై దృష్టిపెట్టి సహాయ లేదా విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రంతో మళ్లీ బాలీవుడ్లో కథానాయకుడిగా తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి బీజేపీ ఎంపీ అయిన ఆయన తండ్రే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి మోదీకి అభిమాని అయిన ఒబెరాయ్ 2014 ఎన్నికల సందర్భంగా ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నాయి. మోదీ– ఏ జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ ‘నియంతలకు మతాలు లేవు. కనీసం మృతులనైనా హిందూ, ముస్లింలని వేరుచేయకండి’..మంటల్లో రైలు బోగి దగ్ధమవుతున్న(2002 నాటి గోద్రా అల్లర్లు ప్రస్తావిస్తూ) సమయంలో మోదీ పాత్రధారి ఆశిష్ శర్మ ట్రైలర్లో అన్న మాటలివి. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో ఈరోస్ నౌలో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. బాల్యంలో టీ విక్రేతగా పనిచేయడం, ఇందిరా గాంధీని వ్యతిరేకించడం, పాకిస్తాన్‌తో కయ్యానికి కాలు దువ్వడం లాంటి మోదీ గుణాలన్నింటిని చూపాలంటే ఈ సిరీస్‌ను కనీసం పది భాగాల పాటు కొనసాగించాలని నిర్మాతలు భావిస్తున్నారు. మోదీ కాకా కా గావ్ మోదీ మానసపుత్రికలైన స్వచ్ఛ్ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, సర్జికల్ దాడులు, పెద్దనోట్ల రద్దు లాంటి వాటిని ఈ చిత్రంలో ప్రధానంగా ప్రస్తావించారు. 2017, డిసెంబర్ 8న గుజరాత్ ఎన్నికలకు ఒకరోజు ముందు విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేయడంతో అదే ఏడాది డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. – సాక్షి నేషనల్ డెస్క్ నమో సౌనె గామో గుజరాతీలో తీసిన ఈ చిత్రం 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలైంది. గుజరాత్, ముంబైలలో ఒకరోజు ఆడిన తరువాత ఎన్నికల సంఘం చిత్ర ప్రదర్శనను నిలిపేసింది. నరేంద్ర మోదీకి సంబంధించి ఈ చిత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదని నిర్మాతలు వాదించినా సినిమా పేరు, హీరో పాత్ర తదితరాలు అసలు విషయమేంటో స్పష్టం చేశాయి. ఈ మార్చిలో సినిమాను తిరిగి విడుదల చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. – సాక్షి నేషనల్ డెస్క్ – సాక్షి నేషనల్ డెస్క్ -
ఎన్నికల తర్వాత ‘ది డిజాస్టరస్ పీఎం’
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘వాళ్లు(కాంగ్రెస్ పార్టీ) యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్(మన్మోహన్ సింగ్)ని అడ్డుపెట్టుకుని ఎలాంటి పనులు చేశారో ఈ సినిమా చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వైఖరి నాకు నచ్చకపోవడం వల్లనే నేను పార్టీ నుంచి బయటకు వచ్చి తృణముల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాను. మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాను’ అని తెలిపారు. ఈ సందర్భంగా మమతా మోదీ గురించి కూడా పరోక్ష విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే డ్రామా విడుదలయ్యింది. ఇక ఎన్నికలయ్యాక ‘ది డిజాస్టరస్ ప్రైమ్ మినిస్టర్’ అనే డ్రామా చూస్తారంటూ మోదీ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఊరుకోక వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ‘ఒకసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొండి.. జనాలతో సరిగా మాట్లాడగలనా... కనీసం వారిని చూసి నవ్వగలనా అంటూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొండి. జనాలు మిమ్మల్ని చూసి అరే బాబ.. గబ్బర్ సింగ్ వస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నార’ని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు మమతా. -
బాలీవుడ్ వివాదాస్పద చిత్రం తెలుగులో కూడా..!
ఇటీవల బాలీవుడ్లో అత్యంత వివాదాస్పదంగా మారిన చిత్రం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిషేదించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. బాలీవుడ్లో ట్రైలర్‌ను నిషేదించాలంటూ వేసిన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అంతేకాదు తెలుగు వర్షన్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. హిందీ వర్షన్‌తో పాటు తెలుగు వర్షన్‌ను కూడా జవనరి 18న రిలీజ్ చేయనున్నారు. గతంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన ది యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకాన్ని అదే పేరుతో సినిమాగా తెరకెక్కించారు. మన్మోహన్ పాత్రలో బాలీవుడ్ అగ్రనటుడు అనుపమ్ ఖేర్ నటించగా, మరో కీలక పాత్రో అక్షయ్ ఖన్నా నటించారు. అయితే ఈ సినిమా నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచిగాని. మన్మోహస్ సింగ్ నుంచి గాని ఎలాంటి అనుమతి తీసుకోకపోవటం వివాదాస్పదమైంది. ఇటీవల సెన్సార్ విషయంలోనూ ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. -
‘మోదీ మీ పాత్రలో సల్మాన్ ఐతే బాగుండేది’
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్‌తోనే ఈ సినిమా వివాదాలను రేపుతోంది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రలో నటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ పట్ల ఇప్పటికే పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రను దారుణంగా ఖూనీ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు వీరి వరుసలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చేరారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ పినిస్టర్ సినిమాను, మోదీ బయోపిక్‌ను కంపేర్ చేస్తూ అబ్దుల్లా కామెంట్ చేశారు. ‘మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ బాగానే సూట్ అయ్యారు.. కానీ మోదీ మీ పాత్ర కోసం వివేక్ అంతగా సెట్ అవ్వలేదు. వివేక్ బదులు మీరు సల్మాన్ ఖాన్ తీసుకుంటే మజా వచ్చేది’ అంటూ ట్వీట్ చేశారు. Life is unfair Dr Manmohan Singh got someone of the calibre of Anupam Kher. Poor Modi ji has to settle for Vivek Oberoi. Salman Khan hota toh kya maza aata. — Omar Abdullah (@OmarAbdullah) January 8, 2019 -
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’కు ఊరట
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీకి చెందిన పూజా మహాజన్ అనే ఫ్యాషన్ డిజైనర్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ట్రైలర్‌ను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సెక్షన్ 416ను ఉల్లంఘించిందని పూజ పిటిషన్లో పేర్కొంది. సెక్షన్ 416 ప్రకారం ఒక వ్యక్తి జీవితాధారంగా సినిమా తీస్తున్నప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలని పిటిషన్లో తెలిపింది. ఢిల్లీ హై కోర్టు సోమవారం ఈ పిటిషన్‌ని విచారించింది. ఈ సందర్భంగా పూజ తరఫు న్యాయవాది మైత్రి మాట్లాడుతూ.. ‘నిర్మాతలు.. మన్మోహన్ సింగ్ నుంచి కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ట్రైలర్‌ను, సినిమాను నిషేధించండి’ అన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి విభు భాక్రు పిటిషనర్ పూజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు, ఫ్యాషన్ డిజైనర్‌కు ఎలాంటి సంబంధంలేదని తేల్చారు. అసలు పిటిషన్ వేయడానికి సినిమాతో ఆమెకున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ట్రైలర్‌ను నిషేధించడానికి వీల్లేందంటూ తీర్పునిచ్చారు. యూపీఏ - 1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
పీవీ తర్వాత మన్మోహనే గొప్ప ప్రధాని : శివసేన
ముంబై : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా ట్రైలర్‌తోనే వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాను విడుదల కానివ్వమంటూ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన నాయకులు మన్మోహన్ సింగ్‌ని పొగడ్తలతో ఆకాశనికెత్తుతున్నారు. పీవీ తర్వాత మన దేశానికి సేవ చేసిన ప్రధానుల్లో మన్మోహనే గొప్పవాడంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌతులా మాట్లాడతూ.. ‘పదేళ్లు దేశానికి సేవ చేసిన వ్యక్తిని గౌరవించడం మన బాధ్యత. మన్మోహన్ యాక్సిడెంటల్ ప్రధాని కారు. పీవీ నరసింహ రావు తర్వాత దేశానికి సేవ చేసిన ప్రధానుల్లో మన్మోహన్ చాలా గొప్పవారు. ఆయన తన విధులను చాలా విజయవంతంగా నిర్వర్తించారు’ అంటూ ప్రశంసలు కురిపించారు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా పట్ల ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కోపంగా ఉన్నారు. ఈ సినిమాలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తప్పుగా చూపించారని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులైతే ఏకంగా తమకు స్పెషల్ షో వేసి.. ముందుగా ప్రదర్శించకుంటే మధ్యప్రదేశ్‌లో మూవీ విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. ఇక యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
నేనూ ‘యాక్సిడెంటల్ ప్రధాని’నే: దేవెగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని మన్మోహన్ బయోపిక్‌పై దుమారం రేగుతున్న వేళ.. తానూ అనుకోకుండా ప్రధాని(యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్) అయ్యాయని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. తాజా వివాదంపై ఆయన స్పందిస్తూ ‘ ఈ సినిమాపై వివాదం గురించి నాకు పెద్దగా తెలీదు. ఆ మాటకు వస్తే నేను కూడా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌నే’ అని సరదాగా వ్యాఖ్యానించారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. బయటి నుంచి కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో దేవెగౌడను ప్రధానిగా ఎన్నుకున్నారు. కుమారస్వామి.. యాక్సిడెంటల్ సీఎం దేవెగౌడ కొడుకు, కర్ణాటక సీఎం కుమారస్వామిని బీజేపీ ‘యాక్సిడెంటల్ సీఎం’గా అభివర్ణించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కరువుతో అల్లాడుతుంటే ఆయన కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సింగపూర్‌లో పర్యటించడంపై మండిపడింది. ‘కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 377 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 156 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఇంకా రుణమాఫీ ప్రకటనను అమలుచేయలేదు. సీఎం కుమారస్వామి కొత్త సంవత్సర వేడుకల కోసం సింగపూర్ వెళ్తున్నారు. యాక్సిడెంటల్ సీఎం పేరిట సినిమా తీస్తే కుమారస్వామి పాత్రను ఎవరు పోషిస్తారు?’ అని బీజేపీ ట్వీట్ చేసింది. -
మన్మోహన్ సినిమాపై దుమారం
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ రాజకీయంగా దుమారం రేపుతోంది. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను బీజేపీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి ‘ ఒక కుటుంబం పదేళ్ల పాటు దేశాన్ని తన గుప్పిట్లో ఎలా ఉంచుకుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించడంతో వివాదం రాజు కుంది. 2004–08 మధ్య మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. మన్మోహన్ రాజప్రతినిధా?: బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నుంచి మన్మోహన్ ఒత్తిడి ఎదుర్కొంటున్న దృశ్యాలను ప్రచార చిత్రంలో చూపడం కాంగ్రెస్‌కు ఆగ్రహం తెప్పించింది. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై విమర్శలు, వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు విస్తృతంగా వ్యాపించాయి. ‘ఒక కుటుంబం ఏకంగా పదేళ్ల పాటు దేశాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే సినిమా ఇది. వారసుడు సిద్ధమయ్యే వరకు ఆ కుటుంబం డా.సింగ్‌ను రాజ ప్రతినిధిగా పీఎం కుర్చీపై కూర్చోపెట్టిందా? యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ చూడండి’ అని బీజేపీ తన అధికార ట్విట్టర్లో పేర్కొంది. కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ‘ ఇప్పటి మొద్దు ప్రధాని(మోదీ)పై వాళ్లు(కాంగ్రెస్) సినిమా తీసేదాకా వేచి ఉండలేకపోతున్నా. యాక్సిడెంటల్ ప్రధాని కన్నా ఇన్సెసిటివ్ ప్రధాని ప్రమాదకరం’ అని ట్వీట్ చేశారు. ‘బీజేపీని చూస్తే జాలేస్తోంది. నాలుగన్నరేళ్లుగా మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సమున్నతుడైన మన్మోహన్ సింగ్‌పై సినిమాను స్పాన్సర్ చేశారు. మీరు ఆ మేధావికి సరితూగలేరు. కనీసం ఆయన విలువల్ని పాటించడానికైనా ప్రయత్నించండి‘ అని రాహుల్ సోదరి ప్రియాంక ట్వీట్ చేశారు. సృజన ప్రయత్నాన్నే చూడండి: ఖేర్ ఈ సినిమాను సృజనాత్మక కోణంలో చేసిన ప్రయత్నంగా చూడాలి తప్ప, ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా భావించొద్దని అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ చిత్రం తన కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనగా నిలిచిపోతుందని తెలిపారు. మన్మోహన్ పాత్ర పోషణ తనకు పెద్ద సవాలుగా మారిందని, దీనికోసం ఆరు నెలలు శ్రమించానని అన్నారు. మన్మోహన్ హావభావాలు, ముఖ్యంగా ఆయన గొంతు అనుకరించడానికి చాలా కష్టపడ్డానని, అందుకోసం ఆయనకు సంబంధించిన వీడియోల్ని గంటల కొద్దీ చూశానని తెలిపారు. -
అమ్మే గుర్తుపట్టలేదు.. ఆస్కార్ బరిలో ఉంటా!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ . ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) విడుదలైన పొలిటికల్ డ్రామా ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తుందని మేకర్స్ సంబరపడుతుంటే... తమ పార్టీ అధ్యక్షుడి కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ మూవీని విడుదల కానివ్వమని కొంతమంది కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో విమర్శలు- ప్రతి విమర్శలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఈ విషయంపై స్పందించిన అనుపమ్ ఖేర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.... ‘ మన దేశంలో నటన కంటే కూడా నిరసనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా కన్పిస్తోంది. నేను దాదాపు 500 సినిమాలు చేశాను. కానీ మన్మోహన్ జీ క్యారెక్టర్ చేయడం నిజంగా ఓ సవాలుగా అన్పించింది. అయినప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. కానీ ఇలాంటి నిరసనలు, బెదిరింపులు నన్ను నిరాశకు గురిచేస్తున్నాయి. అయితే అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలుస్తుందని చెప్పగలను. అంతేకాదు మన్మోహన్‌గా జీవించాను. మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేనంతగా పాత్రలో ఒదిగిపోయాను. కాబట్టి నేను కచ్చితంగా ఆస్కార్‌కు నామినేట్ అవ్వాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. ఇక యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
ఆ మూవీ విడుదల కానివ్వం
-
‘మధ్యప్రదేశ్‌లో ఆ మూవీ విడుదల కానివ్వం’
భోపాల్ : ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీపై వివాదం ముదురుతోంది. ఈ సినిమా ట్రైలర్‌పై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా తాజాగా ఈ సినిమా తమకు ముందుగా ప్రదర్శించకుంటే మధ్యప్రదేశ్‌లో మూవీ విడుదల కానివ్వబోమని కాంగ్రెస్ నేత సయ్యద్ జాఫర్ హెచ్చరించారు. సినిమా పేరుతో పాటు ట్రైలర్లో చూపించిన సన్నివేశాల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను చిత్ర దర్శకుడికి లేఖ రాశానని చెప్పారు. మూవీ ట్రైలర్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీలను తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. 2004 నుంచి 2008 మధ్య ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో మన్మోహన్ సింగ్‌ను బలిపశువుగా చూపేలా ట్రైలర్లో చూపారని కాంగ్రెస్ మండిపడుతోంది. కాగా సంజయ్ బారు పుస్తకం ఆధారంగానే తాము సినిమా రూపొందించామని మన్మోహన్ పాత్రను పోషించిన నటుడు అనుపమ్ ఖేర్ చెబుతున్నారు. -
బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ‘యాక్సిడెంటల్’ మంటలు
సాక్షి, న్యూఢిల్లీ : యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్ ట్రైలర్‌పై దుమారం రేగుతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధానికి తెరలేపాయి. మన్మోహన్ సింగ్‌ను ముందుపెట్టి కాంగ్రెస్ పది సంవత్సరాల పాటు దేశాన్ని దోచుకున్న తీరుకు ఇది అద్దం పడుతోందని బీజేపీ వ్యాఖ్యనించగా, నాలుగున్నరేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంపై మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అభ్యంతరాలను లేవనెత్తడంపై బీజేపీ స్పందించింది. 2004 నుంచి 2008 వరకూ మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు గతంలో రాసిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు యూపీఏ అంతర్గత రాజకీయాలకు బలైన బాధితుడిగా మన్మోహన్ సింగ్‌ను చిత్ర ట్రైలర్లో చూపించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమా వివాదాస్పదం కావడంతో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను మన్మోహన్ సింగ్ దాటవేశారు. యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్ అధికారిక ట్రైలర్నువీ క్షించాలని బీజేపీ ఈ సినిమా ట్రైలర్‌ను ట్వీట్ చేసింది. 2014 ఏప్రిల్‌లో ఇదే అంశంపై పుస్తకం వెలువడగా, ఆ బుక్ ఆధారంగా రూపొందిన సినిమాపై అభ్యంతరం ఎందుకని కాంగ్రెస్‌ను కమలనాధులు ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ దీటుగా స్పందించింది. ఐదేళ్ల పాలనలో ఎలాంటి విజయాలు సాధించని బీజేపీ ప్రజల దృష్టిని మరల్చేందుకు సరికొత్త డ్రామాకు తెరతీసిందని కాంగ్రెస్ ఎంపీ పీఎల్ పూనియా వ్యాఖ్యానించారు. ఈ సినిమాను బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకుంటుందా అన్న ప్రశ్నలకు టైటిల్ రోల్ పోషించిన అనుపమ్ ఖేర్ బదులిస్తూ తాను రాజకీయాల్లో ఉంటే కచ్చితంగా ఆ పని చేస్తానని స్పష్టం చేశారు. తాను నటుడినని, దీనిపై బీజేపీయే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. తాము పుస్తకం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పుకొచ్చారు. విజయ్ రత్నాకర్ గుటె నిర్ధేశకత్వంలో రూపొందిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ట్రైలర్ రిలీజ్
-
ట్రైలర్‌తోనే రేగిన దుమారం
సాక్షి, ముంబై : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై రూపొందుతున్న ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ వివాదాస్పదమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్ గురువారం విడుదల కావడంతో సినిమా విడుదలకు ముందు తమకు ప్రదర్శించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్రను పోషించిన ఈ సినిమాపై మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు ముందు తమకు ప్రీ రిలీజ్ షో వేయాలని, లేకుంటే చిత్ర ప్రదర్శనను అడ్డుకునేందుకు ఇతర ప్రత్యామ్నాయాలవైపు మళ్లుతామని హెచ్చరించింది. ఈ సినిమాలో వాస్తవాలు వక్రీకరించి రూపొందించిన సన్నివేశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర యూత్ విభాగం చిత్ర రూపకర్తలకు రాసిన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్రంలో ఎలాంటి అవాస్తవ సన్నివేశాలు చొప్పించలేదని వెల్లడించేందుకు తమకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ట్రైలర్‌ను పరిశీలిస్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి దుష్ప్రచారం చేసేలా సినిమా ఉంటుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయని, ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. తమ కార్యవర్గ సభ్యులకు ముందస్తుగా సినిమాను ప్రదర్శించి, తాము సూచించే మార్పులను చేపట్టకుంటే దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు తాము ఇతర మార్గాలను అనుసరిస్తామని ఆ ప్రకటనలో యూత్ కాంగ్రెస్ చిత్రబృందాన్ని హెచ్చరించింది. -
‘పదవి కన్నా.. దేశ శ్రేయస్సే నాకు ముఖ్యం’
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తుండగా.... సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. మన్మోహన్‌ను ప్రధానిగా ఎంపిక చేసిన నాటి నుంచి రెండు పర్యాయాల పాటు ఆయన పదవిలో కొనసాగేందుకు దోహదం చేసిన అంశాలు, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎదుర్కొన్న మానసిక సంఘర్షణకు సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పదవి కంటే కూడా దేశ శ్రేయస్సే ముఖ్యమంటూ అనుపమ్ చెప్పే డైలాగ్స్ మన్మోహన్ సింగ్ మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉన్నాయి. అంతేకాకుండా మన్మోహన్‌ను మహాభారతంలోని భీష్మునిగా అభివర్ణించిన డైరెక్టర్.... కశ్మీర్ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలను కూడా స్పృశించారు. కాగా యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయనున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల సన్నాహకాలు మొదలవుతున్న వేళ ఈ చిత్రం విడుదల కానుండటం రాజకీయ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెంచుతోంది. -
చరిత్ర తప్పుగా అంచనావేయదు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ను చరిత్ర తప్పుగా అంచనావేయదని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. మన్మోహన్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన ట్విట్టర్లో పలు విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో మన్మోహన్ పాత్రను అనుపమ్ ఖేరే పోషించారు. తొలుత మన్మోహన్‌ను తానూ తప్పుగా అంచనావేశానని, కానీ ఏడాదిపాటు ఆయన రీలు లైఫ్‌లో జీవించాక తన దృక్పథం పూర్తిగా మారిందన్నారు. మన్మోహన్ ఈ చిత్రాన్ని తిలకించిన తరువాత ఆయనతో కలసి టీ తాగేందుకు ఎదురుచూస్తూ ఉంటానని చెప్పారు. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రీకరణ ముగిసింది. ఆయన్ని చరిత్ర తప్పుగా అంచనావేయదు’ అని ఖేర్ అన్నారు. యూపీఏ–1లో మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తీశారు. సోనియా పాత్రను జర్మనీ నటి సుజానె బెర్నర్ట్ పోషించారు. ఈ సినిమాకు విజయ్ రత్నాకర్ గుట్టె దర్శకుడు. -
‘మన్మోహన్ జీ చరిత్ర మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోదు’
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. వీటిలో రాయకీయ నాయకుల జీవితాల ఆధారంగా వస్తోన్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగులో బాలకృష్ణ ‘ఎన్టీఆర్’, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ ఇంకా సెట్స్ మీద ఉండగా.. మన్మోహన్ బయోపిక్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. సోనియా గాంధీగా సజ్జన్ బెర్నర్ట్ కనిపించనున్నారు. సంజయ్ బారు రచించిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ఈ మేరకు సెట్లో తీసిన ఓ వీడియోను అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. It is a WRAP for one of my most cherished films #TheAccidentalPrimeMinister. Thank you d cast and d crew for the most enriching times. Thank you #DrManmohanSinghJi for your journey. It has been a great learning experience. One thing is sure “History will not Misjudge you.” 🙏 pic.twitter.com/xnJM9XC78j — Anupam Kher (@AnupamPKher) October 26, 2018 ‘‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ షూటింగ్ పూర్తయింది. మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ ప్రయాణం నాకు ఎన్నో నేర్పింది. ఈ సినిమా చేయడానికి ముందు మన్మోహన్ జీ గురించి నాలో కొన్ని అభిప్రాయాలండేవి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నా. కానీ ఈ రోజు షూటింగ్ పూర్తయిన తర్వాత, దాదాపు ఏడాది పాటు ఈ పాత్రలో జీవించిన తర్వాత నిజాయతీగా చెబుతున్నా.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోదు. మీరు మా సినిమా చూసిన తర్వాత మీతో కలిసి కప్పు టీ తాగాలని ఉంది’ అని అనుపమ్ పేర్కొన్నారు. On the last day shoot of #TheAccidentalPrimeMinister someone shoots a off camera moment between @suzannebernert playing #MrsSoniaGandhi & I having tea & biscuits. Shares it on social media. It is already on tv now. Best option is to share it myself. So here it is. Enjoy.😊🤓👇 pic.twitter.com/HVs0YR0yxQ — Anupam Kher (@AnupamPKher) October 26, 2018 ఈ సందర్భంగా సెట్లో నటి సజ్జన్ బెర్నర్ట్తో మాట్లాడుతున్న వీడియోను అనుపమ్ షేర్ చేశారు. దీన్ని వీక్షించిన నెటిజన్స్ మీరిద్దరూ అచ్చం మన్మోహన్సింగ్, సోనియాగాంధీ లాగానే ఉన్నారని కామెంట్లు పెట్టారు. -
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ డైరెక్టర్ అరెస్ట్
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’.. సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వంలో.. బోహ్ర బ్రదర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు విజయ్ గట్టీని జీఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ అరెస్ట్ చేసింది. 34 కోట్ల రూపాయల జీఎస్టీ మోసానికి పాల్పడినందుకు గాను, ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు జీఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ చెప్పింది. నకిలీ ఇన్వాయిస్ ద్వారా రూ.34 కోట్ల జీఎస్టీ క్రెడిట్‌ను విజయ్ గట్టీ కంపెనీ వీఆర్జీ డిజిటల్ క్లయిమ్ చేసుకుందని పేర్కొంది. రూ.266 కోట్ల విలువైన యానిమేషన్, మాన్వపర్ సర్వీసులను హారిజోన్ కంపెనీకి వాడినట్టు వీఆర్జీ డిజిటల్ నకిలీ ఇన్వాయిస్ల్లో చూపించింది. ఇలా రూ.34 కోట్ల జీఎస్టీ క్రెడిట్‌ను మోసపూరితంగా వీఆర్జీ డిజిటల్ పొందింది. హారిజోన్ కూడా రూ.170 కోట్ల జీఎస్టీ మోసానికి పాల్పడింది. దీంతో ఈ రెండు కంపెనీలు ప్రభుత్వ కనుసన్నల్లోకి వచ్చేశాయి. విజయ్ను జీఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ అదుపులోకి తీసుకుంది. విజయ్, ప్రముఖ మహారాష్ట్ర వ్యాపారవేత్త రత్నాకర్ గట్టీ కొడుకు. విజయ్ తండ్రి రత్నాకర్ కూడా రూ.5500 కోట్ల ఇంజనీరింగ్ స్కాం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కాగ, విజయ్ తెరకెక్కిస్తున్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ లో క్యారెక్టర్లు అన్నీ ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయి. డిసెంబర్ 21న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర, మన్మోహన్ సింగ్‌గా అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. దివ్యా సేథ్, మన్మోహన్ భార్య గుర్షరణ్ కౌర్ పాత్రను పోషిస్తున్నారు. -
అదిగో రాహుల్.. ఇదిగో ప్రియాంక..
న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, సోనియా గాంధీగా జర్మన్ నటి సుజేన్ బెర్నెర్ట్, మన్మోహన్ భార్య గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాత్రల్లో ఎవరో కూడా తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటిస్తున్నారు. మన్మోహన్ సింగ్‌తో రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నా ఫోటోను అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలో అర్జున్, ఆహానా కుమ్రా అచ్చం రాహుల్, ప్రియాంకలానే ఉన్నారు. ఆహానా కుమ్రా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో ప్రియాంక గాంధీగా నటించడం సంతోషంగా ఉంది. అది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ఈ సినిమాలో అన్ని పాత్రలో నిజజీవితంలో ఉన్నవారే కాబట్టి వారిలా మారడం, నటించడం చాలా అవసరం’ అని అన్నారు. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
మన్మోహన్ భార్య పాత్ర పోషించేది ఆమెనే..
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’.. సంజయబారు రాసిన పుస్తక ఆధారంగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, సోనియా గాంధీగా జర్మన్ నటి సుజేన్ బెర్నెర్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజేన్, అనుపమ్ ఖేర్‌లు తమ పాత్రలను ధృవీకరిస్తూ, ఈ చిత్రానికి సంబంధించి కొన్ని స్టిల్స్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా మన్మోహన్ సింగ్ భార్య పాత్రలో నటించేది ఎవరో కూడా తెలిసిపోయింది. మన్మోహన్ భార్య గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నట్టు తెలిసింది. గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నట్టు ధృవీకరిస్తూ.. ఒక ఫోటోను అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఇద్దరు తమ తమ పాత్రకు తగ్గట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. అచ్చం మన్మోహన్, గుర్షరన్లా మాదిరిగానే కనిపిస్తున్నారు. ‘చాలా ప్రతిభావంతురాలైన దివ్యా సేథ్ షాను పరిచయం చేస్తున్నాం. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గుర్షరన్లా దివ్య నటించనుంది’’ అని అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మన్మోహన్ పాత్రకు సంబంధించిన పలు స్టిల్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విజయ్ రత్నాకర్ గట్టే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బోహ్ర బ్రదర్స్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒక దేశానికి నేతృత్వం వహించాలన్న కల సాకారం కావాలంటే అందుకు ఏళ్ల తరబడి రాజకీయ కృషి.. ప్రజాజీవితం.. ఇలా చాలానే కావాలి. కానీ.. అవేవీ లేకుండానే ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న కథే ఇది. -
అచ్చం మన్మోహన్ సింగ్లా..వీడియో వైరల్
-
అచ్చం మన్మోహన్ సింగ్లా..
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల మన్మోహన్ లుక్‌లో అనుపమ్ ఖేర్కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. తాజాగా అనుపమ్ ఖేర్ ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనుపమ్ తన ట్విట్టర్ ద్వారా రిహార్సల్ వీడియో విడుదల చేశారు. నేవి బ్లూ కోట్ ధరించి మెట్లపై దిగుతున్న అనుపమ్ అచ్చం మన్మోహన్ లా నడుస్తుండటంతో ఈ వీడియో వైరల్ అయింది. ఈ చిత్రం ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సినిమాలో సంజయ్బారుగా అక్షయ్ ఖన్నా, సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ నటించనున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
దాచేస్తే దాగని సత్యం
సంపాదకీయం అందరికీ తెలిసిన విషయాలే మళ్లీ చెప్తే పెద్దగా ఆసక్తి అనిపించక పోవచ్చు. కానీ చెప్పే తీరునిబట్టి, చెప్పేవారినిబట్టి ఒక్కోసారి మళ్లీ కొత్తగా విన్న అనుభూతి కలుగుతుంది. ఆ అంశాలకు సాధికారత వస్తుంది. ప్రముఖ పాత్రికేయుడు సంజయ బారు వెలువరించిన గ్రంథం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఇప్పుడలాంటి ఆసక్తినే కలిగిస్తున్నది. ఇది ఎన్నికల రుతువు గనుక ఆ పుస్తకం కావలసినంత వివాదాన్నీ, సంచలనాన్నీ కూడా సృష్టిస్తున్నది. దేశాధినేతలుగా ఉన్నవారూ, ఉన్నతాధికారులుగా పనిచేసినవారూ పదవులనుంచి వైదొలగాక తమ జ్ఞాపకాలను గ్రంథస్తం చేసే సంప్రదాయం అన్ని దేశాల్లోనూ ఉంది. మన దేశమూ అందుకు భిన్నం కాదు. కానీ, ఎవరినీ ఏమీ అనలేని అశక్తత కావొచ్చు...స్వోత్కర్షలతో నింపడంవల్ల కావొచ్చు ఆ పుస్తకాలు ఆసక్తి కలిగించిన సందర్భాలు తక్కువ. అందువల్లే వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియకుండానే పుస్తక దుకాణాల అల్మారాల్లో అవి మౌనంగా మిగిలిపోతాయి. సంజయ పుస్తకం ఇందుకు భిన్నం. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని, వ్యక్తిగతంగా మన్మోహన్‌ను ఇరకాటంలో పెట్టే అంశాలనేకం ఉండటమే దీనికి కారణం. ఆయన చెప్పిన విషయాలు ఎవరికీ తెలియనివి కాదు. పదేళ్లుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నవే. గతంలో ఎందరో విశ్లేషకులు చెప్పినవే. మన్మోహన్సింగ్, సోనియాగాంధీ... ఇద్దరికిద్దరూ రెండు అధికార కేంద్రాలుగా మారారని, అందువల్లే పాలన సర్వం కుంటుబడిందని చాలామంది అన్నారు. వివిధ దేశాలకు రేటింగ్లిచ్చే అంతర్జాతీయ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్... రాజకీయాధికారం సర్వస్వం సోనియాగాంధీ అధీనంలో ఉండగా మన్మోహన్ అలంకారప్రాయంగా మిగిలిపోయారని ఒకానొక సమయంలో ఎద్దేవా చేసింది. ఇప్పుడు సంజయ బారు కూడా దాన్నే ధ్రువపరుస్తున్నారు. రెండు రకాల అధికార కేంద్రాలవల్ల అయోమయం వస్తుంది గనుక సోనియానే అధికార కేంద్రమని మన్మోహన్ గుర్తించారని చెబుతున్నారు. సోనియా, ఆమె చుట్టూ చేరినవారి వ్యవహారశైలి... సహించలేని తత్వమూ ఈ పుస్తకం పట్టిచూపుతుంది. యూపీఏ-1 పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అందువల్లే 2009 ఎన్నికల్లో అది గణనీయమైన విజయం సాధించింది. సర్వేల జోస్యాలన్నిటినీ తలకిందులు చేసి లోక్‌సభలో 206 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఈ విజయాన్ని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి ఆపాదించాలా, మన్మోహన్ పాలనాదక్షతకు ఆపాదించాలా అన్న మీమాంసకు మీడియా పోలేదు. అప్పట్లో విడుదలై, జనాదరణ పొందిన హిందీ చిత్రం ‘సింగ్ ఈజ్ కింగ్’ అందరికీ స్ఫురణకొచ్చి మీడియా అంతటా అదే పతాక శీర్షిక అయింది. మన్మోహన్ సైతం రెండో దఫా విజయం తన ప్రజ్ఞే అనుకొని ఉండొచ్చని సంజయ అంటున్నారు. మన్మోహన్‌లో నెలకొన్న ఈ అభిప్రాయం తర్వాతి దశలో ఆయనకు మేలు కంటే కీడే చేసింది. వాస్తవానికి దేశ చరిత్రలో మన్మోహన్‌ది ప్రత్యేక స్థానం. దశాబ్దాలపాటు సోషలిస్టు ఆర్ధిక విధానాల పేరిట సాగిన దశను తారుమారు చేసి పీవీ నరసింహారావు పాలనాకాలంలో ఆర్ధిక సంస్కరణలను తీసుకురావడంలో మన్మోహన్‌దే కీలకపాత్ర. మన్మోహన్ ప్రధాని అయ్యాక జరిగిన మంచేమైనా ఉంటే సోనియాకు...చెడంతా ఆయనకూ పంపకం చేయడానికి సోనియా సన్నిహితులు ఆదినుంచీ చాలా పట్టుదలగా ఉన్నారు. ఆ పట్టుదల రెండో దఫా పాలనలో మన్మోహన్‌ను ప్రశాంతంగా పనిచేసుకోనీయనంత స్థాయికి చేర్చింది. పర్యవసానంగా అంతా అస్తవ్యస్థమైంది. వరస కుంభకోణాలు వెలుగుచూశాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుబడింది. స్టాక్ మార్కెట్లు కొడిగట్టాయి. వృద్ధిరేటు దిగజారింది. నిత్యావసరాల ధరలు పెరిగి, ఉపాధి కరువై సామాన్యుడి బతుకు దుర్భరమైంది. రూపాయి పతనం, ద్రవ్యోల్బణంవంటివి మరింతగా కుంగదీశాయి. అయితే, ఈ పరిస్థితికి సోనియా అండ్ కో బాధ్యత ఎంతో, మన్మోహన్ బాధ్యతా అంతే ఉంది. స్వయంగా ఆర్ధిక నిపుణుడైన ఆయన ఈ పరిణామాలను చక్కదిద్దేందుకూ...అది సాధ్యంకాకపోతే వైదొల గేందుకూ సిద్ధపడలేదు. ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా నిమిత్తమాత్రంగా, మౌన సాక్షిగా మిగిలిపోయారు. సోనియా మొదట చెప్పిన వ్యక్తికి పీఎంఓలో స్థానం కల్పించకపోయినా, మరొకరి విషయంలో ఆమె మాట కాదనలేకపోయారు. ఫలితంగా ఫైళ్లన్నీ సోనియాకు వెళ్లేవని, చివరకు కీలక విధాన నిర్ణయాలకు సంబంధించి ఆమె ఆదేశాలు అమలయ్యేవన్నది సంజయ బారు అభియోగం. అసలు తన కేబినెట్లోకి ఎవరొస్తున్నారో, ఎవరికి ఏ శాఖ వెళ్తుందో తెలియనంత అయోమయంలో ప్రధాని ఉన్నాక పీఎంఓనుంచి ఫైళ్లు చట్టవిరుద్ధంగా వెలుపలకు వెళ్లడంలో వింతేమీ లేదు. ఈ గ్రంథం మన్మోహన్ నిస్సహాయతను స్పష్టంగా చూపినా, ఒకరకంగా ఆయనకు దీనివల్ల మంచే జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ముగిసే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ఎటూ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నది. అందుకు పూర్తి బాధ్యతను ‘మాట్లాడని’ మన్మోహన్‌కు అంటగట్టి సోనియా, రాహుల్‌గాంధీలను మణిపూసలుగా చిత్రించే పనిలో దిగ్విజయ్, జైరాంరమేష్, సల్మాన్ ఖుర్షీద్లాంటి వందిమాగధులు ఇప్పటికే తలము నకలై ఉన్నారు. సంజయ గ్రంథం ఆ ప్రయత్నాన్ని సమర్ధవంతంగానే అడ్డుకుంటుంది. తన అశక్తతతో, పదవినిచ్చినవారిపట్ల అలివిమాలిన కృతజ్ఞతో... మొత్తానికి మన్మోహన్ మెతకగా మిగిలిపోవడం నిజం. పర్యవసానంగా జరగకూడనివెన్నో జరిగాయని పుస్తకం వెల్లడిస్తోంది. పీఎంఓ కొట్టిపారేసినంత మాత్రాన ఇదంతా సమసిపోదు. తనకు తెలి సిన విషయాల్లో సగమే రాశానని సంజయ బారు చెబుతున్నారు. ఇందులో నిజం లేదని చెప్పగలిగే ధైర్యముంటే సోనియా, మన్మోహన్ గొంతు విప్పాలి. దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి.