మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ . ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) విడుదలైన పొలిటికల్ డ్రామా ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తుందని మేకర్స్ సంబరపడుతుంటే... తమ పార్టీ అధ్యక్షుడి కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ మూవీని విడుదల కానివ్వమని కొంతమంది కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో విమర్శలు- ప్రతి విమర్శలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కాగా ఈ విషయంపై స్పందించిన అనుపమ్ ఖేర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.... ‘ మన దేశంలో నటన కంటే కూడా నిరసనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా కన్పిస్తోంది. నేను దాదాపు 500 సినిమాలు చేశాను. కానీ మన్మోహన్ జీ క్యారెక్టర్ చేయడం నిజంగా ఓ సవాలుగా అన్పించింది. అయినప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. కానీ ఇలాంటి నిరసనలు, బెదిరింపులు నన్ను నిరాశకు గురిచేస్తున్నాయి. అయితే అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలుస్తుందని చెప్పగలను. అంతేకాదు మన్మోహన్‌గా జీవించాను. మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేనంతగా పాత్రలో ఒదిగిపోయాను. కాబట్టి నేను కచ్చితంగా ఆస్కార్‌కు నామినేట్ అవ్వాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. ఇక యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment