‘మధ్యప్రదేశ్‌లో ఆ మూవీ విడుదల కానివ్వం’ | Congress Leader Says Wont Let The Movie Release In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

‘మధ్యప్రదేశ్‌లో ఆ మూవీ విడుదల కానివ్వం’

Published Fri, Dec 28 2018 2:32 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Leader Says Wont Let The Movie Release In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ మూవీపై వివాదం ముదురుతోంది. ఈ సినిమా ట్రైలర్‌పై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా తాజాగా ఈ సినిమా తమకు ముందుగా ప్రదర్శించకుంటే మధ్యప్రదేశ్‌లో మూవీ విడుదల కానివ్వబోమని కాంగ్రెస్‌ నేత సయ్యద్‌ జాఫర్‌ హెచ్చరించారు. సినిమా పేరుతో పాటు ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను చిత్ర దర్శకుడికి లేఖ రాశానని చెప్పారు.

మూవీ ట్రైలర్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీలను తక్కువ చేసి చూపారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. 2004 నుంచి 2008 మధ్య ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు సంజయ్‌ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత రాజకీయాల్లో మన్మోహన్‌ సింగ్‌ను బలిపశువుగా చూపేలా ట్రైలర్‌లో చూపారని కాంగ్రెస్‌ మండిపడుతోంది. కాగా సంజయ్‌ బారు పుస్తకం ఆధారంగానే తాము సినిమా రూపొందించామని మన్మోహన్‌ పాత్రను పోషించిన నటుడు అనుపమ్‌ ఖేర్‌ చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement