షూటింగ్‌లో సోనియా పాత్రధారితో మన్మోహన్ పాత్రధారి అనుపమ్ ఖేర్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ను చరిత్ర తప్పుగా అంచనావేయదని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. మన్మోహన్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన ట్విట్టర్‌లో పలు విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో మన్మోహన్ పాత్రను అనుపమ్ ఖేరే పోషించారు. తొలుత మన్మోహన్‌ను తానూ తప్పుగా అంచనావేశానని, కానీ ఏడాదిపాటు ఆయన రీలు లైఫ్‌లో జీవించాక తన దృక్పథం పూర్తిగా మారిందన్నారు. మన్మోహన్ ఈ చిత్రాన్ని తిలకించిన తరువాత ఆయనతో కలసి టీ తాగేందుకు ఎదురుచూస్తూ ఉంటానని చెప్పారు. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రీకరణ ముగిసింది. ఆయన్ని చరిత్ర తప్పుగా అంచనావేయదు’ అని ఖేర్ అన్నారు. యూపీఏ–1లో మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తీశారు. సోనియా పాత్రను జర్మనీ నటి సుజానె బెర్నర్ట్ పోషించారు. ఈ సినిమాకు విజయ్ రత్నాకర్ గుట్టె దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment