Sanjay Baru
-
కాల పరీక్షలో మన విదేశీ సంబంధాలు
దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వెళ్తున్నవారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. అంతేకాదు, భారత్ అణు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అటువంటి దేశంతో భారత్ సంబంధాలు ఎందుకు క్షీణిస్తున్నట్లు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ సిక్కు పౌరులను భారత్ హత్య చేయిస్తుందని ఆరోపించడం, దాదాపు అటువంటి ఆరోపణనే అమెరికా కూడా చేయడం వాతావరణాన్ని వేడెక్కించింది. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండవది... భారతదేశంపై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడదాకా వెళ్ళి ఆగుతుంది?గత దశాబ్దంలో ప్రపంచ వలస ప్రస్థానాలకు చెందిన ఒక ముఖ్యమైన కథ ఏమిటంటే... భారతీయ వలసలు గణనీయంగా పెరగడం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, సింగపూర్ నుంచి దుబాయ్ వరకు, పోర్చుగల్ నుంచి ఇజ్రాయెల్ వరకు భారతీయుల వలసలు నానాటికీ పెరుగుతున్నాయి. 2014లో కెనడాలో కేవలం 38,364 మంది భారతీయులు శాశ్వత పౌరులుగా మారారు. 2022 నాటికి ఈ సంఖ్య ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో 1,18,095కి చేరుకుంది. దీనికి విరుద్ధంగా, 2022లో కేవలం 30 వేల మంది చైనీయులు మాత్రమే కెనడాకు తరలి వెళ్లారు. దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వచ్చిన వారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. పైగా, భారతదేశ అణు సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అలాంటప్పుడు, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి?భారతదేశం, ఆంగ్లోస్పియర్ (ఇంగ్లిష్ భాష, సంస్కృతి ప్రధానంగా ఉండే) దేశాల మధ్య సమస్య ఉందని స్పష్టమవుతోంది. విదే శాంగ విధానం, జాతీయ భద్రతతో స్వప్రయోజనాలు నెరవేర్చేందుకు దేశీయ రాజకీయ వ్యూహాలను ట్రూడో మిళితం చేశారని భారత అధి కారులు అభియోగాలు మోపారు. ట్రూడోకి కెనడియన్ సిక్కుల ఓటు అవసరం కాబట్టి వారి ఖలిస్తానీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారు; ఆయన ప్రభుత్వం డ్రగ్ పంపిణీదారులు, భారత వ్యతిరేక ఉగ్రవాదు లకు ఆశ్రయం ఇస్తోందనీ వీరు ఆరోపించారు. దీనికి ప్రతిగా కెనడా పౌరులను హత్య చేయడానికి భారత ఇంటెలిజెన్స్ అధికారులు, దౌత్య వేత్తలు కుట్ర పన్నారని ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది.మరోవైపు అమెరికా ఈ వివాదంలోకి అడుగుపెట్టి, కెనడియన్ సిక్కు హత్యను, అమెరికన్ సిక్కుపై ఇదే విధమైన ప్రయత్నానికి ముడి పెట్టింది. దీంతో దౌత్యపరమైన గందరగోళం ప్రారంభమైంది. త్వర లోనే ఇది పెద్ద గొడవగా మారి పరాకాష్ఠకు చేరింది. కెనడా, అమెరికా, బ్రిటన్లలో ఖలిస్తానీ అనుకూల క్రియాశీలత గురించి భారత్ ఫిర్యాదు... దేశీయ భద్రతా సమస్యలపై ఆధారపడింది. పాశ్చాత్య ప్రభుత్వాలు భారతదేశ ఆందోళనల పట్ల సున్నితంగా వ్యవహరించడం లేదన్న మోదీ ప్రభుత్వ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, దౌత్యవేత్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సహా భారతీ యులకు వ్యతిరేకంగా కెనడా, అమెరికా చేసిన నేరారోపణలు తీవ్రమై నవి. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండోది... భారత్‌పై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది? రెండవ ప్రశ్న విషయానికి వస్తే, అమె రికా, కెనడా రెండూ పేర్లను కూడా పేర్కొన్నాయి. పైగా భారతీయు లపైనే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ఉంచాయి.మొదటి ప్రశ్న ముఖ్యమైనది. ఎందుకంటే కెనడా, అమెరికాలు భారతదేశంతో సహేతుకంగానే మంచి దౌత్య సంబంధాలను కలిగి ఉన్నాయి. పైగా చాలావరకు విచక్షణతో ఇవి విషయాలను నిర్వహించ గలవని ఆశించవచ్చు. మొదటి ప్రశ్నకు సంబంధించి కెనడియన్ సిక్కు ఓటర్లతో ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ట్రూడో పక్షపాత రాజకీయాలు ఆడుతున్నారనేది భారత ప్రభుత్వ అధికారిక అభియోగం. ‘సరిహద్దు’ ఉగ్రవాద దాడులకు సంబంధించిన ఆరో పణలతో భారత రాజకీయ నాయకులు రాజకీయ పెట్టుబడి పెట్టారని పాకిస్తాన్ ఆరోపిస్తున్న రీతిని ఇది బాగా ధ్వనిస్తోంది. దేశీయ రాజకీ యాలతో జాతీయ భద్రతా సమస్యలను కలపడం రెండు మార్గాలనూ తొలగించివేస్తుంది. పైగా అటువంటి ఆరోపణలను మూడవ పక్షం వారు ఎలా చూస్తున్నారనే అంశంపై జాగ్రత్తగా ఉండాలి. బహుశా, ట్రూడో ప్రభుత్వాన్ని భారతదేశం విస్మరించే స్థాయిలో ఉందనే అభిప్రాయాన్ని కొందరు అర్థం చేసుకోవచ్చు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ప్రాథమిక ఆరోపణలు వచ్చినప్పుడు న్యూఢిల్లీలో ఇదే ప్రధానమైన అభిప్రాయంగా ఉండేది. తర్వాత, అమెరికా గడ్డపై కూడా, గురుపథ్వ సింగ్ పన్నూన్‌ను చంపడానికి భారత అధికారులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ప్రారంభించడం ద్వారా ముందడుగు వేసింది. ఇదంతా కేవలం స్నేహితుల మధ్య ఉన్న అపార్థం, అపమ్మకాల వ్యవహారమా? లేక దీంట్లో పెద్ద సమస్యలు ఇమిడి ఉన్నాయా? ఇంగ్లిష్ భాషాధిక్య దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, అమెరికా తమ ’ఫైవ్ ఐస్’ కూటమి ద్వారా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే, ట్రూడో ఎక్కువ ఓట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం ఏమంత విశ్వసనీయమైన ప్రతిస్పందనగా అనిపించదు. మరీ ముఖ్యంగా, పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని భారత ప్రభుత్వం ఎందుకు విశ్వసిస్తోందనే ప్రశ్నను అడిగి తీరాలి.ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ గత వారం తన విజయదశమి ప్రసంగంలో, పాశ్చాత్య ‘ఉదారవాద, ప్రజాస్వా మ్యాలు’ బంగ్లాదేశ్‌లో చేసినట్లుగా భారతదేశంలో ‘అరబ్ స్ప్రింగ్’ తరహా ‘వర్ణ విప్లవాలను’ ప్రదర్శించాలని యోచిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలను వీక్షిస్తున్న ఈ విధానం భారతీయ విదేశీ, జాతీయ భద్రతా విధానాలకు సంబంధించి పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో చేసిన అనేక ప్రసంగాలలో ‘భారతదేశం బాగుండాలని ప్రపంచం కోరుకుంటోంది, కానీ మన సవాళ్లు స్వదేశంలో ఉన్నాయి’ అని తరచుగా చెప్పే వారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఉదారవాద ప్రజాస్వామ్యాలు కలిసి జిహాదీ తీవ్రవాదం, నిరంకుశ చైనా పెరుగుదలపై భారతదేశంలాగే ఆందోళన చెందుతున్నాయనీ, అందువల్లే పాశ్చాత్య ఉదారవాద, ప్రజాస్వామ్య పాలనపై గురిపెట్టిన ఈ రెండు ప్రమాదాలకు వ్యతిరేకంగా భారతదేశం ఎదుగుదలకు అవి మద్దతునిచ్చాయన్న దృక్పథంపై ఈ అంచనా ఆధారపడి ఉంది.ఈ దృక్కోణం మారిందా? భారతదేశం ఇకపై ఆంగ్లోస్పియర్ను ‘మిత్రుడు’గా లేదా కనీసం దాని పురోగతిలో భాగస్వామిగా చూడ లేదా? చైనా, పాకిస్తాన్‌లు రెండింటినీ తన జాతీయ భద్రతకు ప్రమా దకారులుగా ప్రకటించిన భారత్ అదే సమయంలో పశ్చిమ ఉదార వాద ప్రజాస్వామ్యాలను దూరం చేసుకోగలదా? విదేశాంగ విధాన నిర్వాహకులు, జాతీయ భద్రతను నిర్వహించే వారి ఆలోచనల మధ్య తప్పు అమరిక ఏదైనా ఉందా? కెనడా ప్రధాని ట్రూడో ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తారు.కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణలో పెరుగుతున్న అమెరికా ప్రమేయం పెనుమంటగా మారడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థపై తక్షణ పర్యవసానాలను కలిగిస్తుంది. మొత్తంమీద ప్రపంచ పర్యావరణం నేడు భారత ఆర్థికవృద్ధికి, పెరుగుదలకి చాలా తక్కువ అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మోదీ ప్రభుత్వం, సంఘ్ పరివార్లు పశ్చిమ దేశాలపై, వాటి సంస్థలపై క్రమం తప్పకుండా విమర్శలు గుప్పించడం చూస్తే... పశ్చిమ దేశాలతో భారత్ సంబంధాలు పరీక్షకు గురవుతున్నట్లు, విశ్వాస సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. ట్రూడో వ్యవహారం కేవలం ఒక తీవ్రమైన అనారోగ్యపు లక్షణం కావచ్చు!సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మీడియా సలహాదారు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో...) -
పీవీ మధ్యే మార్గమే దేశానికి రక్ష!
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా భిన్న పార్టీలకు చెందిన వారైనప్పటికీ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయిలు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలని ప్రఖ్యాత జర్నలిస్టు, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సలహాదారు సంజయ్ బారు అభిప్రాయడ్డారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది... అన్ని రంగాల్లోనూ ముందంజ వేసింది కూడా పీవీ, వాజ్‌పేయి, మన్మోహన్సింగ్ల ఏలుబడిలోనే అని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పీవీ గ్లోబల్ ఫౌండేషన్ శనివారం ఏర్పాటు చేసిన పీవీ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1950ల నుంచి 2015 వరకూ దేశ ఆర్థికాభివృద్ధిని పరిశీలిస్తే.. 2000 – 2015 మధ్యకాలంలోనే సగటు ఆర్థికాభివృద్ధి అత్యధికంగా 7.5 శా తంగా నమోదైందని, ఈ కాలంలోనే దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2015 తరువాత వృద్ధి తిరోగమనంలో ఉందని, కోవిడ్–19 విజృంభించిన ఏడాది రుణాత్మక వృద్ధిని మినహాయిస్తే 2014– 2023 మధ్యకాలంలో సగటున 6 శాతం మాత్రమే వృద్ధి నమోదైందని చెప్పారు. 1990లో ప్రధానిగా పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభా వం 2000 సంవత్సరం నుంచి కనిపించడం మొదలైందని అన్నారు. మధ్యే మార్గంతో వృద్ధి పథంలోకి... 1990 వరకూ దేశంలో పేరెన్నిక కంపెనీలంటే ఓ వందకు మించి ఉండేవి కాదని, టాటా, బిర్లాలు, మోడీ, గోయాంకా, సింఘానియా, థాపర్లు వంటి పేర్లే ప్రతి రంగంలోనూ వినిపించేవని సంజయ్ బారు గుర్తు చేశారు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సరళీకరణ విధానాలను అవలంబించడం మొదలుపెట్టి.. పరిశ్రమల శాఖ మంత్రిగా వాటి అమల్లోనూ ముందున్న ఫలితంగా అంబానీలు మొదలుకొని మహింద్రా, ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్, టీవీఎస్ గ్రూపు వంటి దిగ్గజాలు ఎదిగాయని చెప్పారు. పీవీ ప్రధానిగా రోజుకో సవాలును ఎదుర్కొన్నా మధ్యే మార్గమన్న తారకమంత్రంతో వాటి ని అధిగమించారని రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ ఇదే రీతిన పాలన సాగిందని చెప్పారు. ఆధిపత్య రాజకీయాలతో చేటు...: పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్‌లు భారత జాతీయత పునాదులను పటిష్టం చేయడం ద్వారా ఆర్థికంగాఎదిగేందుకు సాధికారికంగా మెలిగేందుకు కారణమయ్యారని స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక ఆధిపత్యభావజాలం ఈ దేశానికి గతంలోనూ నష్టం కలుగజేసిందని, ఇప్పుడు జరిగేది కూడా అదేనని, దేశ కీర్తిని గతంలో తగ్గించినట్టే ఇప్పుడూ తగ్గిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ తరహాలోనే అందరినీ కలుపుకుని పోయే రాజకీయాలు, మధ్యేమార్గాలు మాత్రమే మనల్ని రక్షించగలవని సంజయ్‌బారు అభిప్రాయపడ్డారు. భారత రత్నకు అన్ని విధాలుగా అర్హుడు పీవీ అని.. మన్మోహన్ ఏలుబడిలో ఆయనకు ఈ అవార్డు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కార్యక్రమంలో పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, మా శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మోసపోయిన మన్మోహన్ మాజీ సలహాదారు
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు ఆన్లైన్ మోసానికి గురయ్యారు. మద్యం పేరుతో ఓ వ్యక్తి తన నుంచి 24 వేల రూపాయలు తీసుకుని మోసం చేశారన్న ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు. లాక్డౌన్ కాలంలో సంజయ్ బారు మద్యం కోసం ఆన్లైన్లో వెతికారు. ఆయనకు లా కేవ్ వైన్స్ అండ్ స్పిరిట్స్ అనే షాపు మద్యం సరఫరా చేస్తున్నట్లు కనిపించింది. అందుబాటులో ఉన్న మొబైల్ నంబర్ కు ఫోన్ చేయగా, సదరు వ్యక్తి 24 వేల రూపాయలు ఆన్లైన్లో పంపాలని డిమాండ్ చేశారు. డబ్బులు పంపిన సంజయ్ బారు, మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వస్తుండటంతో పోలీసులను ఆశ్రయించారు.(‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’) మొబైల్ నెంబరు ట్రేస్ చేసిన పోలీసులకు నిందితుడు ఓ క్యాబ్ డ్రైవర్ అని తెలిసింది. అతన్ని అరెస్టు చేసి విచారించగా వాళ్లు ఓ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు. పలు రకాల సిమ్ కార్డులు, నకిలీ పేర్లు, అడ్రెస్సులు వాడుతూ టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తామని తెలిపాడు. (బైక్‌పై చీఫ్ జస్టిస్ చక్కర్లు; ఫోటోలు వైరల్) తమకు వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంకు అకౌంట్లు కూడా ఉన్నాయని నిందితుడు వెల్లడించాడు. బాధితులు ట్రాన్స్ఫర్ చేసిన ఐదు నుంచి పది నిమిషాల్లో డబ్బు వేరే రాష్ట్రాల్లోని అకౌంట్లకు అక్కడి నుంచి అసలు ఖాతాలకు బదిలీ అవుతుందని వివరించాడు. పోలీసులకు అంతుచిక్కకుండా ఉండేందుకు రకరకాల ప్లాన్స్ గీస్తామని చెప్పాడు. -
మన్మోహన్ సినిమాపై దుమారం
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ రాజకీయంగా దుమారం రేపుతోంది. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను బీజేపీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి ‘ ఒక కుటుంబం పదేళ్ల పాటు దేశాన్ని తన గుప్పిట్లో ఎలా ఉంచుకుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించడంతో వివాదం రాజు కుంది. 2004–08 మధ్య మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. మన్మోహన్ రాజప్రతినిధా?: బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నుంచి మన్మోహన్ ఒత్తిడి ఎదుర్కొంటున్న దృశ్యాలను ప్రచార చిత్రంలో చూపడం కాంగ్రెస్‌కు ఆగ్రహం తెప్పించింది. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై విమర్శలు, వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు విస్తృతంగా వ్యాపించాయి. ‘ఒక కుటుంబం ఏకంగా పదేళ్ల పాటు దేశాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే సినిమా ఇది. వారసుడు సిద్ధమయ్యే వరకు ఆ కుటుంబం డా.సింగ్‌ను రాజ ప్రతినిధిగా పీఎం కుర్చీపై కూర్చోపెట్టిందా? యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ చూడండి’ అని బీజేపీ తన అధికార ట్విట్టర్లో పేర్కొంది. కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ‘ ఇప్పటి మొద్దు ప్రధాని(మోదీ)పై వాళ్లు(కాంగ్రెస్) సినిమా తీసేదాకా వేచి ఉండలేకపోతున్నా. యాక్సిడెంటల్ ప్రధాని కన్నా ఇన్సెసిటివ్ ప్రధాని ప్రమాదకరం’ అని ట్వీట్ చేశారు. ‘బీజేపీని చూస్తే జాలేస్తోంది. నాలుగన్నరేళ్లుగా మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సమున్నతుడైన మన్మోహన్ సింగ్‌పై సినిమాను స్పాన్సర్ చేశారు. మీరు ఆ మేధావికి సరితూగలేరు. కనీసం ఆయన విలువల్ని పాటించడానికైనా ప్రయత్నించండి‘ అని రాహుల్ సోదరి ప్రియాంక ట్వీట్ చేశారు. సృజన ప్రయత్నాన్నే చూడండి: ఖేర్ ఈ సినిమాను సృజనాత్మక కోణంలో చేసిన ప్రయత్నంగా చూడాలి తప్ప, ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా భావించొద్దని అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ చిత్రం తన కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనగా నిలిచిపోతుందని తెలిపారు. మన్మోహన్ పాత్ర పోషణ తనకు పెద్ద సవాలుగా మారిందని, దీనికోసం ఆరు నెలలు శ్రమించానని అన్నారు. మన్మోహన్ హావభావాలు, ముఖ్యంగా ఆయన గొంతు అనుకరించడానికి చాలా కష్టపడ్డానని, అందుకోసం ఆయనకు సంబంధించిన వీడియోల్ని గంటల కొద్దీ చూశానని తెలిపారు. -
‘పదవి కన్నా.. దేశ శ్రేయస్సే నాకు ముఖ్యం’
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తుండగా.... సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. మన్మోహన్‌ను ప్రధానిగా ఎంపిక చేసిన నాటి నుంచి రెండు పర్యాయాల పాటు ఆయన పదవిలో కొనసాగేందుకు దోహదం చేసిన అంశాలు, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎదుర్కొన్న మానసిక సంఘర్షణకు సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పదవి కంటే కూడా దేశ శ్రేయస్సే ముఖ్యమంటూ అనుపమ్ చెప్పే డైలాగ్స్ మన్మోహన్ సింగ్ మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉన్నాయి. అంతేకాకుండా మన్మోహన్‌ను మహాభారతంలోని భీష్మునిగా అభివర్ణించిన డైరెక్టర్.... కశ్మీర్ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలను కూడా స్పృశించారు. కాగా యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయనున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల సన్నాహకాలు మొదలవుతున్న వేళ ఈ చిత్రం విడుదల కానుండటం రాజకీయ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెంచుతోంది. -
చరిత్ర తప్పుగా అంచనావేయదు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ను చరిత్ర తప్పుగా అంచనావేయదని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. మన్మోహన్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన ట్విట్టర్లో పలు విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో మన్మోహన్ పాత్రను అనుపమ్ ఖేరే పోషించారు. తొలుత మన్మోహన్‌ను తానూ తప్పుగా అంచనావేశానని, కానీ ఏడాదిపాటు ఆయన రీలు లైఫ్‌లో జీవించాక తన దృక్పథం పూర్తిగా మారిందన్నారు. మన్మోహన్ ఈ చిత్రాన్ని తిలకించిన తరువాత ఆయనతో కలసి టీ తాగేందుకు ఎదురుచూస్తూ ఉంటానని చెప్పారు. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రీకరణ ముగిసింది. ఆయన్ని చరిత్ర తప్పుగా అంచనావేయదు’ అని ఖేర్ అన్నారు. యూపీఏ–1లో మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తీశారు. సోనియా పాత్రను జర్మనీ నటి సుజానె బెర్నర్ట్ పోషించారు. ఈ సినిమాకు విజయ్ రత్నాకర్ గుట్టె దర్శకుడు. -
అచ్చం మన్మోహన్ సింగ్లా..వీడియో వైరల్
-
అచ్చం మన్మోహన్ సింగ్లా..
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల మన్మోహన్ లుక్‌లో అనుపమ్ ఖేర్కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. తాజాగా అనుపమ్ ఖేర్ ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనుపమ్ తన ట్విట్టర్ ద్వారా రిహార్సల్ వీడియో విడుదల చేశారు. నేవి బ్లూ కోట్ ధరించి మెట్లపై దిగుతున్న అనుపమ్ అచ్చం మన్మోహన్ లా నడుస్తుండటంతో ఈ వీడియో వైరల్ అయింది. ఈ చిత్రం ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సినిమాలో సంజయ్బారుగా అక్షయ్ ఖన్నా, సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ నటించనున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
మన్మోహన్ వస్తున్నారు
దేశ ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు బాధ్యతలు నిర్వర్తించారు డా. మన్మోహన్సింగ్. ఈ పదేళ్లలో ఆయనను కొందరు ప్రశంసించారు. మరికొందరు విమర్శించారు. పదవీకాలం ముగిసిపోయే సమయంలో ఆయన జీవితంపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకం విడుదల అయ్యింది. 2004 మే నుంచి 2008 ఆగస్టు వరకు మన్మోహన్‌సింగ్‌కు మీడియా అడ్వైజర్‌గా వర్క్ చేసిన సంజయ్‌బారు ఈ పుస్తకం రాయడం విశేషం. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో రూపొందుతున్న సినిమా‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. విజయ్ గుట్టే దర్శకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. బోహ్రా బోస్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ‘‘సినిమాలో డా. మన్మోహన్ సింగ్ లుక్‌ని షేర్ చేయడం హ్యాపీగా ఉంది’’ అని అనుపమ్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 21న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. మరోవైపు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కాశర్మ ముఖ్య తారలుగా నటిస్తున్న ‘జీరో’ చిత్రాన్ని ఇదే రోజున రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో.. బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదన్న మాట. -
బారు పుస్తకంలో కీలక విషయాలు: అద్వానీ
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకంలో కీలక విషయాలు వెలుగులోకి తెచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ తెలిపారు. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు తనకు ఇంతకుముందే తెలుసునని వెల్లడించారు. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్- ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్’ పేరుతో బారు రాసిన పుస్తకం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ పుస్తకాన్ని చదువుతున్నానని బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాని అధికారాలను ఏవిధంగా కుంచించారో ఈ పుస్తకంలో వెల్లడించారని అన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో తాను అల్లాటప్పా రాజకీయాలు చేయడం లేదని, అభివృద్ధిపై దృష్టి పెట్టానని జైట్లీ అన్నారు.