అచ్చం మన్మోహన్‌ సింగ్‌లా.. | Anupam Kher Share The Video Of The Accidental Prime Minister | Sakshi
Sakshi News home page

అచ్చం మన్మోహన్‌ సింగ్‌లా..

Published Thu, Apr 12 2018 4:44 PM | Last Updated on Thu, Apr 12 2018 4:53 PM

Anupam Kher Share The Video Of The Accidental Prime Minister - Sakshi

మన్మోహన్‌ సింగ్‌ గెటప్‌లో ఉన్న అనుప‌మ్ ఖేర్

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘ ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’  అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అనుప‌మ్ ఖేర్ మన్మోహన్‌ సింగ్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల‌ మ‌న్మోహ‌న్ లుక్‌లో అనుప‌మ్ ఖేర్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా విడుద‌ల చేశారు. తాజాగా అనుపమ్‌ ఖేర్‌ ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అనుప‌మ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా రిహార్స‌ల్ వీడియో విడుద‌ల చేశారు. నేవి బ్లూ కోట్ ధ‌రించి మెట్ల‌పై దిగుతున్న అనుప‌మ్ అచ్చం మ‌న్మోహ‌న్ లా న‌డుస్తుండ‌టంతో ఈ వీడియో వైర‌ల్ అయింది. ఈ చిత్రం ప్రస్తుతం లండన్‌లో షూటింగ్‌​ జరుపుకుంటుంది.

మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ రత్నాకర్‌ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్‌ నిర్మిస్తున్నారు. సినిమాలో సంజయ్‌బారుగా అక్షయ్‌ ఖన్నా, సోనియా గాంధీగా జ‌ర్మ‌న్ యాక్ట‌ర్ సుజానే బెర్నెర్ట్ నటించనున్నారు. సలీమ్‌-సలైమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్‌ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement